ముగ్గుల పోటీల కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గండ్ర
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు వేశాలపల్లి లో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల కార్యక్రమంలో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
అదేవిదంగా వేశాలపల్లిలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో వేషాల రవీందర్ అడ్వకెట్ తన సొంత ఖర్చులతో భక్తుల సౌకర్యార్ధం నీటి ట్యాంక్ ఏర్పాటు చేయగా నల్లా తిప్పి ప్రారంభించారు.
ఈ సందర్భంగా పోటీలో గెలుపొందిన ఇప్పకాయల మనస్విని మొదటి బహుమతి రూ. 5016,పొట్ల రజని ద్వితీయ బహుమతి రూ. 3016/-,నల్ల మౌనిక తృతీయ బహుమతి రూ. 2016/- లను అందచేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.
ప్రజలందరికి ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తూ, ఈ సంక్రాంతి మీ జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని కోరారు.
ఈ ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ,
ఇదే స్పూర్తితో వచ్చే సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని మరింత ఘనంగా నిర్వహించాలని కోరారు.
మన ప్రతిభను,మన గొప్ప సంప్రదాయాలను గౌరవించుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైన ఉంది.
ఈ రోజు ముగ్గుల పోటీల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న అమ్మాయిలు, ఐదో తరగతి చిన్నారులు, డిగ్రీ చదువుతున్న యువతులతో పాటు పెద్దలు కూడా ఉత్సాహంగా పాల్గొనడం ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు.
ఈ తరం ఆ తరం మధ్య ఏర్పడిన ఈ కలయిక మన భారతీయ సంస్కృతి యొక్క గొప్పతనాన్ని ప్రతిబింబిస్తుందని, ఇలాంటి కార్యక్రమాలు మన సంప్రదాయాలను సజీవంగా నిలుపుతాయన్నారు.
ఈ కార్యక్రమంలో భూపాలపల్లి పట్టణ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
