రోడ్డు భద్రత అందరి బాధ్యత..!- ప్రతిజ్ఞ..

రోడ్డు భద్రత అందరి బాధ్యత..!– ప్రతిజ్ఞ..
సిఐ డి మల్లేశం ఎస్సై ముప్పు సురేష్
(నేటి ధాత్రి): మొగులపల్లి

రోడ్డుపై ప్రయాణించే ప్రతి వాహనదారుడు సామాజిక బాధ్యతగా భద్రత చర్యలు తీసుకోవాలని చిట్యాల సిఐ డి మల్లేశం ఎస్సై ముప్పు సురేష్ అన్నారు. భూపాలపల్లిజిల్లా మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక, 99 రోజుల రహదారి భద్రత… వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వాహనదారులందరూ భద్రత ప్రమాణాలను పాటించాలన్నారు. హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ పెట్టుకోవడం, నిదానంగా ప్రయాణించడం, రోడ్డు భద్రత సూచనలు పాటించాలన్నారు. సురక్షిత ప్రయాణమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు.. ప్రమాద రహిత సమాజం కోసం కృషి చేయాలని కోరారు. ప్రాణాలు అమూల్యమైనవని, ప్రమాదాల నివారణను సామాజిక బాధ్యతగా స్వీకరించాలన్నారు. ఎవరికివారు జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలు జరగవని, మద్యం తాగి వాహనాలను నడపవద్దని ఆయన సూచించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ జయంతి సందర్భంగా వచ్చిన వారితోవాహనదారులతో ప్రతిజ్ఞ చేయించారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. వారితో కలిసి అంబేద్కర్ స్టార్చ్ నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ చాట్ల విజయ రవీందర్ మాజీ సొసైటీ చైర్మన్ సంపెల్లి నరసింగరావు చిట్యాల మార్కెట్ వైస్ చైర్మన్ మహమ్మద్ రఫీ మాజీ సర్పంచ్ మోటే ధర్మారావు జిల్లా నాయకులు తక్కల్లపల్లి రాజు వివిధ పార్టీల నాయకులుపోలీస్ సిబ్బందిపాల్గొన్నారు.

ఎమ్మార్వో కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్…

ఎమ్మార్వో కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

నర్సంపేట,నేటిధాత్రి:

https://youtu.be/NoviIp1TUK4?si=EohsYI-9HsxUTNf_

 

 

 

ప్రజా పాలన–పట్టణ ప్రగతి 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మంగళవారం నర్సంపేట ఎమ్మార్వో కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తనిఖీ చేశారు. కార్యాలయం,పరిసరాలు,రికార్డులకు సమగ్రంగా పరిశీలించారు.ఈ సందర్భంగా తహసీల్ కార్యాలయంలో నిర్వహణలో ఉన్న రికార్డులు, కార్యాలయ పరిసరాలు, ప్రజలకు అందిస్తున్న సేవలపై కలెక్టర్ సమీక్షించారు. రికార్డులను సక్రమంగా నిర్వహిస్తూ, ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాలన్నారు.

అదేవిధంగా 99 రోజుల కార్యక్రమం అమలు తీరును పరిశీలించిన కలెక్టర్, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా సేవలను వేగవంతంగా అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.కార్యాలయ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని తెలిపారు. ప్రజల వినతులను ఆలస్యం చేయకుండా పరిష్కరించడంలో అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
ఈ సందర్భంగా తహసీల్దార్ రవిచంద్రారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

గ్రామాల అభివృద్ధికి బాధ్యతాయుత పాలన అవసరం

గ్రామాల సమగ్రాభివృద్ధికి బాధ్యతాయుతంగా పనిచేయాలి:

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక విజయవంతానికి అందరూ భాగస్వాములు కావాలి

రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ

నర్సంపేట/గీసుగొండ::

గ్రామాల అభివృద్ధే రాష్ట్ర ప్రగతికి పునాదని, గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా పనిచేయాలని
రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు.గురువారం వరంగల్ జిల్లాలోని గీసుగొండ మండలం మరియాపురం గ్రామంలోని ఎస్‌.ఎస్‌. ఫంక్షన్ హాల్‌లో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికపై జిల్లాలోని ప్రజాప్రతినిధులకు నిర్వహించిన ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని,నగర మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద లతో కలసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మార్చి 6 నుండి జూన్ 12 వరకు అమలు చేస్తున్న 99 రోజుల కార్యక్రమంలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. సర్పంచ్ నుంచి మంత్రి వరకు ప్రతి ఒక్కరూ స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు.సీఎం రేవంత్ రెడ్డి దార్శనికతకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని, సంక్షేమ పథకాలు, ప్రజా సేవలను ప్రజల్లోకి వేగంగా తీసుకెళ్లాలని ఆదేశించారు. 

ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడం, పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను క్లియర్ చేయడం, గ్రామాలు మరియు పట్టణాల్లో పరిశుభ్రత కార్యక్రమాలను ప్రత్యేకంగా చేపట్టడం, ప్రభుత్వ సేవలను ప్రజలకు సులభతరం చేయడం
ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారమే మన పనితీరుకు ప్రధాన ధ్యేయంగా ఉండాలని అన్నారు.ఈ 99 రోజుల ప్రణాళిక ద్వారా పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచడం ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యమని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు.గత రెండు సంవత్సరాల్లో రైతు రుణమాఫీ, రైతు భరోసా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, నూతన రేషన్ కార్డులు, సన్న బియ్యం సరఫరా వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.ప్రభుత్వం అందించిన అవకాశాన్ని వినియోగించుకుని ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని మంత్రి సూచించారు. గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని,

ప్రజల భాగస్వామ్యంతో గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని అన్నారు.గ్రామాలు, పట్టణాల అభివృద్ధిలో పారిశుధ్యం అత్యంత కీలకమని తెలిపారు. పారిశుధ్య కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తూ పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. పరిశుభ్రతను పాటించడం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చని, ప్రజల ఆరోగ్యం కాపాడటంలో శానిటేషన్ ముఖ్య పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు గ్రామాలు, పట్టణాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను నియంత్రిస్తూ పర్యావరణానికి హాని కలిగించని ప్రత్యామ్నాయాలను ఉపయోగించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ విధంగా పారిశుధ్యం, పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేస్తే గ్రామాలు, పట్టణాలు మరింత శుభ్రంగా, ఆరోగ్యకరంగా మారుతాయని మంత్రి తెలిపారు.గ్రామాల్లో పర్యావరణ పరిరక్షణ కోసం విస్తృతంగా మొక్కలను నాటి వాటిని సంరక్షించడం అత్యంత అవసరమని తెలిపారు. మొక్కలు పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయని, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మరియు ప్రకృతి విపత్తులను తగ్గించడంలో చెట్లు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. గ్రామపంచాయతీలు అవసరమైన మొక్కల కోసం ఇండెంట్ పంపితే సంబంధిత శాఖ ద్వారా సరఫరా చేస్తామని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో పచ్చదనం పెంపొందించేందుకు ప్రజాప్రతినిధులు ముందడుగు వేయాలని మంత్రి పిలుపునిచ్చారు.గ్రామాల అభివృద్ధికి కృషి చేసిన మహానుభావుల సేవలు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు.అభివృద్ధికి ఆదర్శంగా నిలిచిన గ్రామాలను సందర్శించి అక్కడ అమలు చేసిన విధానాలను తెలుసుకుంటే ప్రజాప్రతినిధులకు పరిపాలనలో ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. శిక్షణ కార్యక్రమాల్లో నేర్చుకున్న విషయాలను ఆచరణలో పెట్టి ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ వారి విశ్వాసాన్ని పొందాలని సూచించారు.పదవులు శాశ్వతం కావని, కానీ ప్రజలకు చేసిన సేవలు మాత్రం చిరస్థాయిగా నిలుస్తాయని పేర్కొంటూ ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా పనిచేసి ప్రజల మనసులను గెలుచుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు.నగర మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమం, సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా వినూత్న సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నాయని పేర్కొన్నారు. ప్రగతి బాటలో సకల జన హితం లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 10 థీమ్లపై 99 రోజులపాటు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నట్లు చెప్పారు.ప్రజాప్రతినిధులుగా ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా చూడటం, ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడం మన బాధ్యత అని మేయర్ తెలిపారు. ఈ శిక్షణ ద్వారా పొందిన అవగాహనను తమ ప్రాంతాల్లో అమలు చేసి అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని ప్రజాప్రతినిధులకు సూచించారు.

ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యాలు సాధించేందుకు అందరూ సమన్వయంతో పనిచేయాలని మేయర్ తెలిపారు.జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద* ప్రభుత్వం చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక”లో భాగంగా జిల్లాలో అమలు చేస్తున్న 99 రోజుల కార్యాచరణపై పవర్ పాయింట్ ప్రెసెంటిషన్ ద్వారా ప్రజాప్రతినిధులకు సమగ్రంగా వివరించారు. గ్రామాలు, పట్టణాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం గుర్తించిన 10 కీలక అంశాలపై ప్రత్యేక కార్యాచరణను అమలు చేయనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమాన్ని ఐదు దశల్లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఏప్రిల్ 2న గ్రామ స్థాయిలో గ్రామ సభలు, ఏప్రిల్ 16న మండల స్థాయి కార్యక్రమాలు, మే 2న నియోజకవర్గ స్థాయి కార్యక్రమాలు, మే 22న జిల్లా స్థాయి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యక్రమాలు ముగుస్తాయని తెలిపారు.99 రోజుల కార్యాచరణలో భాగంగా పరిసరాల పరిశుభ్రత, ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్, ప్రజల ఆరోగ్యం, రోడ్డు భద్రత (అరైవ్-అలైవ్), సంక్షేమ పథకాల అమలు, పిల్లల భద్రత మరియు డ్రగ్స్‌కు అడ్డుకట్ట, రైతు సంక్షేమం మరియు వ్యవసాయం అభివృద్ధి, విద్యా రంగం, యువత మరియు క్రీడలు, మహిళల సాధికారత, పర్యావరణ పరిరక్షణ వంటి 10 ముఖ్య అంశాలపై దృష్టి సారిసస్తున్నట్లు తెలిపారు.ప్రజల సమస్యలను గుర్తించి త్వరితగతిన పరిష్కరించడం, పెండింగ్ సమస్యలను పరిష్కరించడం, పారిశుధ్యం మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం ప్రతి నియోజకవర్గం, మండలం, గ్రామ స్థాయిలో ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి పనిచేసి ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికను విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమానికి ముందు ఇటీవల మరణించిన గంగదేవిపల్లి మాజీ సర్పంచ్ కూసం రాజమౌళికి సంతాపం తెలిపారు.కార్యక్రమంలో భాగంగా మంత్రి చేతుల మీదుగా నూతనంగా ఎన్నికైన సర్పంచులు, కౌన్సిలర్లకు, ప్రజాప్రతినిధులకు ఐడెంటిటీ కార్డులు అందజేశారు.అనంతరం డీఆర్‌డీఏ, ఉద్యానవన శాఖ, స్వయం సహాయక సంఘాలు, పునరుత్పాదక ఇంధన
తదితర శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను మంత్రి ప్రారంభించి, ప్రదర్శించిన ఉత్పత్తులను పరిశీలించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలోని
అంశాలపై వివిధ శాఖల ద్వారా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను మంత్రి , మేయర్, కలెక్టర్ లు తిలకించారు.ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట, నర్సంపేట చైర్పర్సన్ లు సారంగపాణి, పెండెం లక్ష్మీ రామానంద్, డిసిపి అంకిత్ కుమార్ , డిఎఫ్ ఓ అనుజ్ అగర్వాల్, ఆదనవు కలెక్టర్లు సంధ్యారాణి, వై వి గణేష్, జెడ్పి సీఈఓ రామ్ రెడ్డి, డిపిఓ కల్పన, జిల్లాలోని సర్పంచులు, కౌన్సిలర్లు మరియు జి.డబ్ల్యూ.ఎం.సి పరిధిలోని కార్పొరేటర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలి…

ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలి

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సి.ఆర్ నగర్ బాంబుల గడ్డ కమ్యూనిటీ హాల్లో జరిగిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు.ఈరోజు నుండి మార్చి 15 వరకు పరిసరాల పరిశుభ్రత, కార్యాలయాల పరిశుభ్రత, పెండింగ్ ఫైళ్ళ వేగవంతమైన పరిష్కారం, రికార్డుల సక్రమ నిర్వహణ, ప్రజలకు సమయానుకుల సేవలందించడం లక్ష్యంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య గౌడ్, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్స్,జిల్లా అడిషనల్ కలెక్టర్ విజయ లక్ష్మీ మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్ టౌన్ అధ్యక్షులు ఇస్లావత్ దేవన్ మూడో వార్డు కౌన్సిలర్ అరుణ్ రావు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version