నూతన సర్పంచ్ వినోద్ భోగి సంబరాలు – ఝరాసంగం

భోగి మంటలు… సాంప్రదాయాల హరివిల్లు:

◆-: నూతన సర్పంచ్ వినోద బాలరాజ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గ ఝరాసంగం మండల కేంద్రంలో సంస్కృతి,సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పండుగ పుడమి తల్లి పసిడి పంటలు అందించంగా.. ప్రకృతమ్మ సింగారించుకుని పండుగ పర్వదినానికి స్వాగతం పలుకుతూ నూతన సర్పంచ్ వినోద బాలరాజ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ బొమ్మల కొలువులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు మన సంస్కృతి,సాంప్రదాయాలకు ప్రతీక, సకల సౌఖ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఝరాసంగం గ్రామ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.

నాగర్‌ కర్నూలులో వాసవి, వనిత క్లబ్బుల భోగి మంటలు

నేటి ధాత్రి నాగర్ కర్నూలు జిల్లా

 

మకర సంక్రాంతి సందర్భంగా వాసవి క్లబ్ వనిత క్లబ్ ఆధ్వర్యంలో భోగి మంటలు
ఈ సందర్భంగా వాసవి క్లబ్ ప్రెసిడెంట్ సంబు శీను మాట్లాడుతూ మూడు రోజులు జరుపు కొని ఈ సంక్రాంతి పండుగ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిభభించేలా అందరం జరుపుకోవాలని కోరారు ఈ కార్యక్రమానికి వాసవి ప్రెసిడెంట్ సంబుశీను వనిత అధ్యక్షురాలు అపర్ణ కార్యదర్శులు సభ పాండు అనిలా కోశాధికారి ఆకుతోట నాగరాజు స్వాతి పూర్వ అధ్యక్షులు వాస రమేష్ బాబు కొట్ర బాలాజీ వాస రాఘవేందర్ గంధం ప్రసాద్ కందుకూరి లక్ష్మణస్వామి కంచర శ్యామ్ బాలరాజు పాల్గొన్నారు

వనపర్తిలో ఘనంగా సంక్రాంతి వేడుకలు

సంక్రాంతి వేడుకలలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్
వనపర్తి నేటిదాత్రి

 

వనపర్తి 30 వ వార్డు జంగిడి పురం కాలనీ అసోసియేషన్ విజ్ఞేశ్వర కాలనీ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయని మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ వాకిటి శ్రీదర్ ఒక ప్రకటన లో తెలిపారు .బుధవారం నాడు ప్రజలు భోగి మంటలు వెలిగించి జరుపుకున్నామని తెలిపారు ఈసందర్భంగా వాకిటి శ్రీధర్ మాట్లాడుతూ ప్రజలు సుఖశాంతులతో భోగ భాగ్యాలతో విలసిల్లాలని సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో కురుమయ్య మద్దిలేటి సుధాకర్ పాపిరెడ్డి వెంకటేశ్వర్లు జగపతిరావు తిరుపతయ్య వెంకట్రామ్ రెడ్డి మధుసూదనరావు సూర్యశేఖర్ రెడ్డి బాలస్వామి కృష్ణయ్య కొండన్న శివాజీ రమణ దర్గయ్య తదితరులు పాల్గొన్నారు

బాలాజీ సెలబ్రేషన్ గ్రూప్ ఆధ్వర్యంలో భోగి మంటలు

బాలాజీ సెలబ్రేషన్ గ్రూప్ ఆధ్వర్యంలో భోగి మంటలు

వనపర్తి నేటిదాత్రి .

 

 

వనపర్తి పాత మార్కెట్ యార్డులో సంక్రాంతి పండుగ సందర్భంగా శ్రీబాలాజి సెలబ్రేషన్ గృపు అద్యర్యము లో మంగళవారం రాత్రి 45 కుటుంబ సబ్యులు పాల్గొని భోగి మంటల కార్యక్రమంఘనంగా నిర్వహించామని అధ్యక్షులు కలకొండ శ్రీనివాసులు చెప్పారు ఈసందర్భంగా ఆయన
మాట్లాడుతూ ఈ యొక్క సెలబ్రేషన్ గ్రూపు మూడు సంవత్సరాల క్రింద 45 కుటుంబాలతో ఏర్పాటు చేసుకొని పండుగ సాంప్రదాయాలను కొనసాగించాలని ముఖ్య ఉద్దేశంతో భోగి మండల కార్యక్రమం ఉగాది హోలీ వినాయక చవితి కార్యక్రమాల ను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సభ్యులు గోకారం కృష్ణమూర్తి పోలిశెట్టి మురళి కటకం శ్రీధర్ కటకం పరమేష్ కలకొండ కిషోర్ సాయి నారాయణ గంధం రాజు నూకల వెంకటేశ్వర్లు సుధీర్ వెంకటేశ్వర్లు సంబు వెంకటేశ్వర్లు లగిశెట్టి శ్రీనివాసులు మహిళలు తదితరులు పాల్గొన్నారని కలకొండ శ్రీనివాసులు తెలిపారు

భూపాలపల్లిలో ఘనంగా భోగి సంబరాలు

భూపాలపల్లిలో భోగి మంటలు

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని 24వ వార్డు కారల్ మార్క్స్ కాలనీలో సంక్రాంతి భోగి పర్వదినం సందర్భంగా భోగిమంటలు వేసి భోగి సంబరాలు ఘనంగా జరిగాయి. బుధవారం తెల్లవారుజామునే ప్రజలు వాడవాడలా భోగి మంటలు వేసి పండగను ఆనందోత్సవంలో నిర్వహించుకున్నారు తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ముంగిళ్లలో రంగువల్లులు తీర్చిదిద్ది, గొబ్బెమ్మలతో అలంకరించారు. రేగుపళ్లు, నవధాన్యాలు కలిపిన నీటితో చిన్నారులకు భోగి పళ్లు పోసి ఆశీర్వదించారు. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రజలంతా ఆనందోత్సాహాల మధ్య పండుగ వేడుకల్లో మునిగితేలారు. ఈ పండుగ కార్యక్రమంలో కాలనీవాసులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version