బతుకమ్మ నిధులలో అవకతవకలకు పాల్పడ్డ మున్సిపాలిటీ అధికారులు
గ్రీన్ బడ్జెట్ నిధులను పక్కదారి పట్టిస్తున్న మున్సిపాలిటీ
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి లోని కాకతీయ ప్రెస్ క్లబ్ ఎదురుగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు వరంగల్ పార్లమెంట్ కాంటెస్ట్ ఎంపీ అభ్యర్థి ఎస్పీకే సాగర్ పత్రిక మీడియా సమావేశం నిర్వహించారు అందులో భూపాలపల్లి మున్సిపాలిటీ కార్యాలయం సద్దుల బతుకమ్మ గ్రీన్ బడ్జెట్ నిధుల విషయాలలో అవకతవకలకు మున్సిపాలిటీ కార్యాలయం పాల్పడిందని ఆరోపించారు సద్దుల బతుకమ్మ 2025 సంవత్సరం 30 లక్షల రూపాయలు మరియు గ్రీన్ బడ్జెట్ వనమహోత్సవం కొరకు 18 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వము కేటాయించడం జరిగింది. మొత్తం 48 లక్షల రూపాయలను కేటాయించడం జరిగింది ఈ నిధులను సకాలంలో మున్సిపాలిటీ కార్యాలయం వినియోగించకుండా తప్పుదారి పట్టిస్తూ ప్రజలకు అధికారుల కల్లు కప్పి పనులు చేయని పనులు చేసినట్టుగా ఫోటోలను చిత్రీకరిస్తూ ఫోటోలను క్రియేట్ చేస్తూ బడ్జెట్ రిలీజింగ్ కొరకు కలెక్టర్ కి భూపాలపల్లి మున్సిపాలిటీ కార్యాలయం లెటర్ పెట్టింది చేయని పనులు చేసినట్టుగా చిత్రీకరించి 48 లక్షల రూపాయలను ప్రజాసమము ప్రజల సొమ్మును దుర్వినియోగ పరుస్తున్న అధికారుల పట్ల తక్షణమే జిల్లాస్థాయి అధికారుల చేత సమగ్ర విచారణ జరిపించి భూపాలపల్లి మున్సిపాలిటీ ప్రజలకు వాస్తవాలను తెలపాలని ఈ నిధులు ఏమయ్యాయో భూపాలపల్లి ప్రజలకు తెలుపాలని జిల్లా కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే లోకల్ బాడీ కలెక్టర్ని తక్షణమే సమగ్ర విచారణ కొరకు సమర్థిత అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని ఎస్ పీ కే సాగర్ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు గంధం రాకేష్ జష్వంత్ మామిడి శ్రీకాంత్ కళ్యాణ్ శ్రీకాంత్ రాజ్ కుమార్ ఇతరులు పాల్గొన్నారు
