వనపర్తి మున్సిపల్ చైర్మన్ గా మీడిదొడ్డి మాధవి రమేష్…

వనపర్తి మున్సిపల్ చైర్మన్ గా మీడిదొడ్డి మాధవి రమేష్

,వైస్ చైర్మన్ గా మధుసూదన్ గౌడ్

వనపర్తి నేటిధాత్రి .

వనపర్తి మున్సిపాలిటీ నుండి కొత్తగా ఎన్నికైన 33 మంది కౌన్సిలర్ల చే ప్రత్యేక అధికారి ఆర్ డి ఓ ప్రమాణ స్వీకారం ఆర్డీఓ సుబ్రమణ్యం చేయిoచారు
మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎన్నికైన 33 మంది సభ్యులను జిల్లా ఎన్నికల అథారిటీ, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశాల మేరకు వనపర్తి మున్సిపాలిటీలో పరోక్ష విధానం ద్వారా చైర్ పర్సన్,వైస్ ఛైర్ పర్సన్ ఎన్నిక కొరకు సోమవారం మున్సిపల్ కార్యాలయ ములో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో సభ్యుల ప్రమాణ స్వీకారం చేశారు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు
33 మంది సభ్యులున్న వనపర్తి మున్సిపాలిటీ లో ​చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు చట్ట ప్రకారం 17 మంది సభ్యుల కోరం అవసరం ఉండగా సమావేశానికి 22 మంది20 మంది కాంగ్రెస్ ఇద్దరు స్వతంత్రులుసభ్యులు హాజరయ్యారు కోరం సభ్యుల ప్రతిపాదన మేరకు అధికారులు చైర్మన్ , వైస్ చైర్మన్ ఎన్నికను నిర్వహించా రు మున్సిపల్ చైర్మన్ గా కాంగ్రెస్ అభ్యర్థి మీడిదొడ్డి మాధవి పేరును వనపర్తి మున్సిపల్ 13వ వార్డు కౌన్సిలర్ బొడ్డుపల్లి పరుశురాం ప్రతిపాదించగా 4వ వార్డు కౌన్సిలర్ గంధం శరవంద బలపరిచారు మరో అభ్యర్థి పేరు ప్రతిపాదనకు రాకపోవడంతో మీడిదొడ్డి మాధవి ని చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రత్యేక అధికారి ఆర్ డి ఓ సుబ్రహ్మణ్యం ప్రకటించారు అనంతరం వైస్ చైర్ పర్సన్ గా గురకొండ మధుసూదన్ గౌడ్ పేరును 5వ వార్డు కౌన్సిలర్ బాపన్ పల్లి వెంకటేశ్వర్లు ప్రతిపాదించగా, 31వ వార్డు కౌన్సిలర్ బి. విజయలక్ష్మి బలపరిచారు. మరో పేరు ప్రతిపాదనకు రాకపోవడంతో వైస్ చైర్ పర్సన్ గా గురుకొండ మధుసూదన్ గౌడ్ ను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రత్యేక అధికారి ప్రకటించారు. అనంతరం ప్రత్యేక అధికారి చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ లను ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమీషనర్ వెంకటేశ్వర్లు డి పి ఆర్ ఓ వనపర్తి తహసీల్దార్ రమేష్ రెడ్డి,ఎన్నికల అధికారులు,మున్సిపల్ అధికారులు ఎన్నికైన కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.S

కాంగ్రెస్ ఖాతాలో చైర్మన్,వైస్ చైర్మన్ పీఠాలు.

కాంగ్రెస్ ఖాతాలో చైర్మన్,వైస్ చైర్మన్ పీఠాలు.

బెల్లంపల్లి నేటిధాత్రి:

 

బెల్లంపల్లి లో చైర్మన్,వైస్ చైర్మన్ పిఠము దక్కించుకున్న కాంగ్రెసు పార్టీ.
బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ పీఠం కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడింది. మున్సిపాలిటీ 34 వర్డ్స్ ఉండగా 7వ వార్డు కౌన్సిలర్ దావ స్వాతి చైర్ పర్సన్ గా పీఠం దక్కించుకున్నారు.అలాగే 17వ వార్డు కౌన్సిలర్ రాగంశెట్టి సత్యనారాయణ వైస్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేపట్టారు.
బెల్లంపల్లి లో 14 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుపొందగా ఇండిపెండెంట్ 4 బిజెపి 1 కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించగా ఫోరం 19 స్థానాలతో చైర్మన్ పదవి, వైస్ చైర్మన్ పదవులతో గెలుపొందింది.
ఓట్ల లెక్కింపు రోజే గెలుపొందిన అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ క్యాంపు తరలించింది. క్యాంపును మహారాష్ట్రకు తరలించగా మూడు రోజులు అనంతరం ఈరోజు బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయానికి ఉదయం 11 గంటలకు కౌన్సిలర్లు చేరుకున్నారు. టిఆర్ఎస్ పార్టీ 14 సీట్లు తో క్యాంపుకు వెళ్లిన ఇండిపెండెంట్ కౌన్సిలర్లను బుజ్జగింపుల్లో విప్లమై ప్రస్తుతం బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయానికి చేరుకోలేకపోయారు.
మొత్తం మీద బెల్లంపల్లి మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పదవి దక్కించుకుంది. చైర్మన్గా దావా స్వాతి వైస్ చైర్మన్గా రగం శెట్టి సత్యనారాయణ ప్రమాణస్వీకారం నిర్వహించారు.
ఈ ప్రమాణస్వీకారాలను సబ్ కలెక్టర్ మనోజ్ , ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకట స్వామి చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం నిర్వహించారు.

జహీరాబాద్ మున్సిపల్ ప్రమాణ స్వీకారం: భారీ బందోబస్తు…

జహీరాబాద్ మున్సిపల్ ప్రమాణ స్వీకారం: భారీ బందోబస్తు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభా ప్రాంగణంలో కూర్చొనే సదుపాయాలు, తాగునీరు, విద్యుత్ వంటి వసతులు కల్పించారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు పాల్గొననున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ నియంత్రణతో పాటు భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసి, కార్యక్రమం ప్రశాంతంగా జరిగేలా అధికారులు చర్యలు చేపట్టారు. టిఆర్ఎస్ బిజెపి కౌన్సిలర్లు హాజరు కాగా కాంగ్రెస్ ఎంఐఎం ఇండిపెండెంట్ హాజరు కాలేనందువల్ల
కాని కోరం లేనందున -చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికను రేపటికి అనగా 17-02-2026. నాటికి వాయిదా వేయనైనది .

ఆ పార్టీ మద్దతుతో గెలుపు.. కాంగ్రెస్ ఖాతాలో కోహీర్ మున్సిపాలిటీ…

ఆ పార్టీ మద్దతుతో గెలుపు.. కాంగ్రెస్ ఖాతాలో కోహీర్ మున్సిపాలిటీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

కోహీర్: సంగారెడ్డి జిల్లాలో నూతనంగా ఏర్పడిన కోహీర్ మున్సిపాలిటీ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మున్సిపాలిటీ పరిధిలోని 16 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ 8 వార్డులను గెలుచుకున్నప్పటికీ పూర్తిస్థాయి మెజార్టీ దక్కలేదు. ఎంఐఎం పార్టీకి చెందిన 8వ వార్డ్ కౌన్సిలర్ మహమ్మద్ రఫీ మద్దతు పలకడంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన 4వ వార్డ్ కౌన్సిలర్ మ్యాథరి అశోక్ మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. దీంతో నూతనంగా ఏర్పడిన కోహీర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళింది.డిప్యూటీ చైర్మన్ గా అదే పార్టీకి చెందిన 7 వార్డ్ కౌన్సిలర్ అబ్దుల్ హన్నాన్ జావిద్ ఎన్నికయ్యారు. నూతనంగా ఎంపికైన చైర్మన్, డిప్యూటీ చైర్మన్, కౌన్సిలర్లతో మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ, మున్సిపల్ అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ అశోక్ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కోహీర్ పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని, పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారులు, మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తానని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కట్టుబడి పని చేస్తానని తెలిపారు.

మున్సిపల్ చైర్మన్ గా బుర్ర కొమురయ్య ఎన్నిక…

మున్సిపల్ చైర్మన్ గా బుర్ర కొమురయ్య ఎన్నిక

వైస్ చైర్మన్ గా అంబాల శ్రీనివాస్

భూపాలపల్లి నేటిధాత్రి

 

రెండవ సాధారణ మున్సిపాలిటీ ఎన్నికల్లో
కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు17 సిపిఐ1 మొత్తం 18 మంది కౌన్సిలర్ల గెలుపొందడం జరిగింది ఆర్డిఓ హరికృష్ణ మున్సిపల్ కమిషనర్ జోన ఆధ్వర్యంలో గెలిచిన కౌన్సిలర్ సభ్యులు అందరూ ప్రమాణస్వీకారం చేయడం జరిగింది అనంతరం 2వార్డ్ కౌన్సిలర్ సభ్యుడు బుర్ర కొమురయ్యను ఏకగ్రీవంగా భూపాలపల్లి పురపాలక సంఘం చైర్మన్ గా ఎన్నుకున్నారు అలాగే వైస్ చైర్మన్గా 15వ వార్డు కౌన్సిలర్ అంబాల శ్రీనివాసులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో ఎక్సెప్షన్ నెంబర్ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కర్ణాకర్ పట్టణ అధ్యక్షుల దేవన్ కౌన్సిలర్లు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version