మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించిన రీజినల్ డైరెక్టర్
భూపాలపల్లి నేటిధాత్రి
మునిసిపల్ 2వ సాధారణ
ఎన్నికలలో భాగంగా షాహిద్ మసూద్, రీజినల్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, వరంగల్ పురపాలక సంఘ వారు భూపాలపల్లి మున్సిపల్ కార్యాలయానికి రావడం జరిగినది ఈ కార్యక్రమంలో ఎన్నికలకు సంబంధించిన పనుల యొక్క పురోగతిని పనుల వివరాలను మున్సిపల్ కమిషనర్ కే. ఉదయ్ కుమార్ ని అడిగి తెలుసుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ పి సునీల్ కుమార్ మున్సిపల్ ఆఫీస్ మేనేజర్ సుభాష్ కుమార్ కార్యాలయపు అధికారులు సిబ్బంది పాల్గొనడం జరిగింది.
