అటవీ రక్షణ గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
భూపాలపల్లి నేటిధాత్రి
సోమవారం భూపాలపల్లి మున్సిపాలిటీలోని 5, 6, 7 మరియు 26వ వార్డులలో 3 కోట్ల రూపాయలతో నిర్మించనున్న అటవీ రక్షణ గోడ నిర్మాణ పనులకు, మహిళా సంఘాలకు కోటి రూపాయలు బ్యాంకు లింకేజీ, 20 లక్షలు వడ్డీ లేని రుణాలు అలాగే పురపాలక పరిధిలోని మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడవి జంతువులు నివాసాల్లోకి వచ్చి ప్రజలను ఇబ్బందులకు వచ్చేస్తున్నాయని ప్రజల రక్షణకు 3 కోట్ల రూపాయల వ్యయంతో పటిష్టమైన రక్షణ గోడ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రభుత్వానికి మహిళలు పట్ల అపారమైన గౌరవం ఉందని తాము అధికారం చేపట్టిన 24 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని ఆయన తెలిపారు. సంక్రాంతి సారెగా ఇందిరమ్మ చీరలు పంపిణీ చేపట్టినట్లు తెలిపారు. పురపాలక సంఘ పరిధిలోని 18 సంవత్సరాలు పైబడిన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీరెలు ఇస్తామన్నారు. మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం వడ్డీలేని రుణాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. మహిళల ఆర్థికంగా ఎదిగేందుకు రుణాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. అర్హత కలిగిన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఉచిత విద్యుత్తు అర్హత ఆధారంగానే ఇస్తున్నామని తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పంతో మహిళలకు సోలార్ విద్యుత్ ప్లాంట్లు, ఆర్టిసి బస్సులు, పెంట్రోల్ బంకులు ఇస్తున్నామని తెలిపారు. నిధులు, నీళ్లు, నియమాలు కోసం ఏర్పడిన తెలంగాణలో గత 10 సంవత్సరాలు వెనుకబాటుకు గురైందని, ఉద్యోగాలు రాలేదని ఆయన తెలిపారు. తమ ప్రభుత్వం అధికారం చేయకట్టగానే గ్రూప్ 1,2 3 వన్ ఉద్యోగాలతో శాఖల్లో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులు భర్తీకి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మంచి చేస్తున్న ప్రభుత్వానికి ఎప్పుడు ప్రజల ఆశీస్సులు ఉండాలని తెలిపారు. ప్రభుత్వం మీకు అన్నివేళల్లో అండగా ఉంటుందన్నారు. అన్ని కులాల వారికి మున్సిపల్ పరిధిలో కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేస్తామన్నారు. జిల్లా అభివృద్ధికి సమ్మక్క సారక్క దీవెనలు మెండుగా ఉండాలని కోరారు. సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు, పేరు మార్పిడి సొంతింటికలను సాకారం చేస్తామని తెలిపారు.
ఈ సమావేశంలో ఎస్పీ సంకీర్త్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్, మెప్మా పిడి రాజేశ్వరి, ఎంపీడిఓ తరుణ్ ప్రసాద్, మహిళా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
