ఖోర్ ముహమ్మద్ అహ్మద్ ఖాన్ అంత్యక్రియలో భారీ సంఖ్యలో పాల్గొన్న ప్రజలు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్,ముహమ్మద్ అయూబ్ అహ్మద్ ఖాన్, సీనియర్ జర్నలిస్ట్ మరియు V6 న్యూస్ ఛానల్ రిపోర్టర్, ఖోర్ ముహమ్మద్ అహ్మద్ ఖాన్ సోదరుడు (30 సంవత్సరాలు) నిన్న రాత్రి హైదరాబాద్‌లోని నమాస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచి ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు. ఆయన అంత్యక్రియల ప్రార్థనాయకు జహీరాబాద్ లోని ఈద్గాలోని బాగ్దాదీ మసీదులో జుహర్ ప్రార్థనల తర్వాత, మసీదు జహ్రా ఖతీబ్ మరియు ఇమామ్ మౌలానా మసూమ్ ఆలం ఖాస్మీ చేత చేయబడ్డాయి మరియు అంజుమాన్ స్మశానవాటికలో ఖననం జరిగింది. సమాచారం అందుకున్న రాజకీయ, సామాజిక, మతపరమైన నాయకులు మరియు జర్నలిస్టు సంఘం జహీరాబాద్‌లోని శాంతి ఒమర్‌లోని ఐడిఎస్ఎంటి కాలనీలో ఉన్న ఆయన ఇంటికి వెళ్లి, ఓపికగా ఉండాలని సలహా ఇవ్వడం ద్వారా మృతుల కుటుంబానికి తమ సంతాపాన్ని తెలిపారు. అంత్యక్రియల ఊరేగింపులో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
ఉర్సు ఉత్సవాల్లో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి
◆:- కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ మండల పరిదధిలోని శేఖాపూర్ గ్రామంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న హజ్రత్ షేక్ షాబుద్దీన్ షయీద్ ఉర్స్ ఉత్సవాల్లో తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి పాల్గొని అత్యంత భక్తి శ్రద్దలతో దర్గాను దర్శించుకుని ప్రత్యేక ప్రార్ధనలు చేసి చాదర్ సమర్పించారు.అనంతరం వారు మాట్లాడుతూ శేఖాపూర్ గ్రామంలో షాబుద్దీన్ షయీద్ ఉర్స్ ఉత్సవాలు ప్రతి ఏటా వైభవంగా నిర్వహించడం సంతోషకరమన్నారు ఈకార్యక్రమంలో వారితో పాటు సిడిసి చైర్మన్ ముబీన్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహారెడ్డి శేఖాపూర్ గ్రామ మాజీ యం.పి.టి.సి నర్సింహులు,మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఇమామ్ పటేల్ యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు నాగిరెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీకాంత్ రెడ్డి అక్బర్ హర్షవర్ధన్ రెడ్డి అశ్విన్ పాటిల్ జగదీశ్వర్ రెడ్డి నథానెయల్ అరుణ్
బి.మల్లికార్జున్ హర్షద్ పటేల్ రాజు నాయక్ రవీందర్ చౌహన్ హఫీజ్ అక్షయ్ జాడే జుబెర్ పటేల్ బి.గోపాల్ గౌసోద్దీన్ పటేల్ నిజాం జగన్ రబ్బానీ మరియు దర్గా కమిటీ నిర్వాహకులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆయా మండలాల నాయకులు మాజీసర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు యూత్ కాంగ్రెస్ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు,
దరఖాస్తు ఇచ్చి నాలుగు నెలలు గడుస్తున్నా వీడని నిర్లక్ష్య వైఖరి
◆:- ఎంఐఎం పార్టీ ఝరాసంగం మండల అధ్యక్షులు షేక్ రబ్బాని
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ సమాచార హక్కు చట్టం 2005 నిబంధనలను పాటించకుండా తన నిర్లక్ష్య వైఖరిని వ్యక్తపరుస్తున్నాడు కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు తమ పనులకు జవాబుదారీగా ఉండాలని నిర్దేశించడం, పనుల పారదర్శకత కోసం ప్రజాస్వామ్య ప్రక్రియను మెరుగుపరచడం పౌరుడికి కావాల్సినటువంటి సమాచారం పొందుటకు సమాచారకు చట్టాన్ని అమలులోకి తెచ్చి సంబంధిత అధికారి ప్రజల కోరిన సమాచారాన్ని ఇవ్వాలన్న ఆదేశాలు సంబంధిత అధికారులు కలిగి ఉన్నప్పటికీ సంబంధిత సమాచారం కలిగి ఉండి సమాచారం ఇవ్వకుండా నాలుగు నెలలుగా నిర్లక్ష్య వైఖరిని కొనసాగిస్తున్నాడు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల తాసిల్దార్ తిరుమలరావు మండల పరిధిలోని వ్యవసాయ, వ్యవసాయతర భూముల వివరాల సమాచారం కోరగా ఇప్పటివరకు దాదాపు నాలుగు నెలలు గడుస్తున్న సమాచారం ఇవ్వలేదని ఝరాసంగం మండల ఎంఐఎం పార్టీ అధ్యక్షులు షేక్ రబ్బాని అన్నారు.సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం జూలై 11.2025 రోజున ఎంఆర్ఓ ను సమాచారం కోరగా ఎలాంటి సమాధానం ఇవ్వడం లేదని పలుమార్లు కార్యాలయం చుట్టూ తిరిగిన ప్రతిఫలం లేకుండా పోయిందని వాపోయారు.అధికారుల నిర్లక్ష్యంతో భూముల వివరాల అడిగిన బ్యాంకులో నువ్వు ఉన్నవారికి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని అనుమానంతో రైతుల వద్ద డబ్బులు వసూలు చేసి దోచుకుంటున్నారని ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్నారని,అధికారుల అండ చూసుకోనీ భూములు రిజిస్ట్రేషన్లు చేస్తున్నా వ్యాపారం చేస్తున్నారని అన్నారు.ఇప్పటివరకు దాదాపు నాలుగు నెలలు కావస్తున్న సమాచారం ఇవ్వలేదని కార్యాలయానికి ఎప్పుడు వెళ్లిన అందుబాటులో ఉంటూ ఏ సమాధానం ఇవ్వలేదన్నారు ఆర్డిఓ అధికారి కార్యాలయం,పౌర సమాచార అధికారి అప్పిలేటుకు వెళ్లి ఫిర్యాదు చేస్తానని అన్నారు.
-ఈ విషయాన్ని సుమోటోగా తీసుకొని స్కూల్ ను మూసేయాలని విద్యార్థి సంఘాల డిమాండ్.
-విద్యాశాఖ సీరియస్‌గా తీసుకోవాలని కోరుతున్నారు.
-చైల్డ్ వెల్పేర్ వెంటనే స్పందించాలని కోరుతున్నారు.
హైదరాబాద్, నేటిధాత్రి:
అతను యూకేజీ చదువుతున్న పసివాడు. రోజూ స్కూలుకు వెళ్లినట్లే వెళ్లి ఇంటికి వచ్చాడు. తల్లి స్కూల్ యూనిఫామ్ మార్చేందుకు అబ్బాయి షర్టు విప్పింది. అంతే ఆ అబ్బాయిని చూసి ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్నది. గుండెలు పిండేలా ఆ తల్లికి ఏడుపు వచ్చింది. ఆ అబ్బాయి వీపంతా తడిమి చూసింది. ఆ తల్లి చేయి వీపు మీద పడగానే ఆ పసివాడు విలవిలలాడిపోయాడు. ముట్టుకుంటేనే జంకుతున్నాడు. వీపంతా ఎర్రగా మారిపోయింది. రక్తం కనిపించేలా వీపు మీద వాతలు తేలాయి. ఏం జరిగిందో చెప్పడానికి ఆ పసివాడికి మాటలు రావు. సహజంగా చిన్న పిల్లలకు మాటలు రాకపోవడం వేరు. కాని ఆ అబ్బాయికి పుట్టుకతోనే మాటలు రావు. కాని ఆ తల్లిదండ్రులు తమ పిల్లాడు చదువుకోవాలని ఆశించారు. అది కూడా ఎంత ఖర్చయినా సరే మంచి ప్రైవేటు స్కూలుకు పంపాలని అనుకున్నారు. ఫీజులు చెల్లిస్తున్నారు. మాటలు రాకపోయినా, మన మాటలు వింటాడు. మనం ఏం చెబుతాడో అర్ధం చేసుకోగలడు. అందువల్ల స్కూలుకు పంపిస్తున్నారు. ఏం జరిగిందో ఏమో కాని స్కూలు నుంచి ఇంటికి విచ్చన ఆ పసివాడి వీపు నిండా వాతలే వున్నాయి. అది కూడా వీపంతా కమిలిపోయేలా దెబ్బలు కనిపిస్తున్నాయి. ఆ తల్లి తట్టుకోలేక ఏమైంది నాన్నా, అని అడిగినా ఏదీ చెప్పలేని మూగ జీవితం ఆ పసివాడిది. కనీసం టీచర్ కొట్టాడని చెప్పలేడు. టీచర్ కొడుతుంటే ఏడ్వలేడు. తన భాధను కన్నీటి రూపంలో తప్ప మరో రకంగా చెప్పలేడు. అందులోనూ టీచర్ కర్కషంగా కొట్టినా ఆ పసివాడు వద్దని వారించే వయసు కాదు. కొట్టకండి సార్ అనేందుకు నోరు లేదు. ఎదురుతిరిగే వయసు అసలే కాదు. ఎందుకు కొడుతున్నారని ప్రశ్చించలేడు. కొడుతుంటే చూస్తూ ఊరుకోవడం, బాధను ఓర్చుకోవడం తప్ప ఆ పసివాడు ఏమీ చేయలేని నిస్సహాయుడు. అలాంటి పసివాడిని కసి తీరా కొట్టిన ఆ టీచర్ ఎవరో గాని అతను కర్కోటకుడా? లేక రాక్షసుడా? ఒక పసివాన్ని ఇంతలా కొట్టడానికి వాడికి చేతులు ఎలా వచ్చాయి? అసలే మూడు నాలుగేళ్ల పిల్లవాడు. మాటలు రాని మూగ వాడు. అలాంటి పిల్లాన్ని ఒళ్లో కూర్చొబెట్టుకొని మరింత పాఠాలు చెప్పాల్సిన మానవత్వం ఆ టీచర్‌కు వుండాలి. అంతే కాని ఆ పిల్లాడిని కసి తీరా కొట్టేంత దుర్మార్గుడు టీచర్ గా పనిచేయడానికి అనర్హుడు. శిక్షార్హుడు. అలా పిసి పిల్లవాడిని కొట్టిన టీచర్‌ను నిజంగానే చెట్టుకు కట్టేసి కొట్టితా తప్పులేదు. ఆ టీచర్ మిడిమిగి జ్ఞానం వున్నవాడైనా కావాలి. లేకుంటే ఆ స్కూల్ యాజమాన్యానిది వింత పోకడైనా కావాలి. ప్రైవేటు స్కూళ్లకి పంపిస్తే పిల్లలకు దగ్గరుండి చదువు చెబుతారని అనుకుంటారు. కాని ఇలా ఒళ్లు కమిలిపోయేలా కొట్టడాన్ని ఎవరూ సహించరు. అసలు కొట్టిన వాడికి పిల్లలున్నారా? లేరా? ఇంట్లో వాడి పిల్లలను అలాగే కొడుతున్నాడా? ఆరా తీయాలి. ఎందుకంటే బిఈడీ, టిటిసి ట్రైనింగ్ చీసుకునే చాత్రోపాద్యాయులకు పిల్లల గురించి ప్రత్యేకంగా బోధన జరుగుతుంది. చైల్డ్ సైకాలజీ చదువుకోవాలి. పిల్లల మనస్తత్వాలను గురించి పూర్తిగా అవగాహన చేసుకోవాలి. ఎందుకంటే పిల్లల అందిరి మనస్తత్వం ఒక్కలా వుండదు. పిల్లలందిరకీ ఒకే రకమైన ఆలోచనలు వుండవు. కొంత మంది పిల్లలు స్వతహానే చదువుకుంటారు. మరి కొంత మంది పిల్లలు ఆడుకుంటూ చదువుకుంటారు. కొంత మంది ఎప్పుడూ ఆటల మీదనే దృష్టిపెడుతుంటారు. మరి కొంత మంది విద్యార్ధులకు ప్రత్యేక నైపుణ్యాలుంటాయి. ఇలా ఒక్కొ విద్యార్ధికి ఒక్కొ రకమైన జ్ఞానం సొంతంగా వుంటుంది. వాటిని గమనించి వారి వారి ఆలోచనలకు అనుగుణంగా పాఠాలు చెప్పడమే చైల్డ్ సైకాలజీ. ఇలా పిల్లాడిని వీపుంతా కమిలిపోయేలా కొట్టిన వాడి చదువు సంధ్యలేమిటో తెలుసుకోవాలి. పిల్లల్లో అల్లరి చేసేవాళ్లు కొంత మంది వుంటారు. అయితే యూకేజీ చదువుకునే పిల్లల అల్లరి ఆనందంగానే వుంటుంది. అలాంటి విద్యార్ధుల అల్లరిని చూసి కోపం తెచ్చుకునేవాడు టీచర్‌గానే పనికిరాడు. అందులో నోటి నుంచి మాట రాని ఓ మూగ పిల్లవాడు చెసే అల్లరి ఏముంటుంది? అలాంటి పిల్లలు అల్లరి చేయడానికి కూడా ఇష్టపడరు. ఎంత సేపు తోటి పిల్లలను గమనిస్తూ వుంటారు. అంతే తప్ప వాళ్లు ఇతర పిల్లలతో పోట్లాడేందుకు కూడా పెద్దగా ఆసక్తి చూపరు. అందరి వైపు ఒక రకమైన చూపులతో చూస్తూ మిగతా వారు గలగల మాట్లాడుతుంటే, నేనేందుకు మాట్లాడడం లేదన్న భావన తన మనసు ఆ పసి హృదయాన్ని ప్రశ్నిస్తూనే వుంటుంది. అలాంటి పిల్లాడిని కొట్టిన స్కూల్ యాజమాన్యంలో కనీసం పశ్చాత్తాపం లేదు. ఇకపై ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని చెప్పేందుకు కూడా యాజమాన్యానికి ఇష్టం లేదు. ఏ మీడియా నన్ను ఏమీ చేయలేదంటూ ఏం జరిగిందని ప్రశ్నించిన మీడియాతో యజమాని పరంజ్యోతి చిర్రుబుర్రులాడడం వింతగా వుంది. విచిత్రంగా వుంది. తాజాగా ఆ పిసివాడిని కొట్టిన దెబ్బలకు సంబంధించిన ఫోటోలు పెద్దఎత్తున భారతీయత అనే వాట్సాప్ ద్వారా పెద్దఎత్తున వైరల్ అవుతున్నాయి. వరంగల్ జిల్లా మొత్తం పాకిపోయింది. అది గమనించిన ఒయాసిస్ స్కూల్ యజమాని ఆ పసివాడి తల్లిదండ్రులను పిలిపించుకొని బేర సారాలకు దిగినట్లు కూడ సమాచారం అందుతోంది. ఈ విషయాన్ని పెద్దది చేయకండి అని తల్లిదండ్రులను కూడా బెదిరించినట్లు తెలుస్తోంది. తమ పిల్లాడి ఫీజులో రాయితీ కల్పిస్తామంటూ స్కూల్ మేనేజ్ మెంటు ఆ తల్లిదండ్రులకు ఆశలు కల్పించినట్లు విశ్వసనీయ సమాచారం. పెద్దఎత్తున సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ అవుతుండడంతో మీడియా ప్రశ్నించేందుకు ప్రయత్నిస్తే వారిని పరంజ్యోతి బెదిరిస్తున్నారు. నా వెనుక పెద్ద పెద్ద నాయకులున్నారంటూ చెబుతున్నట్లు మీడియా సర్కిళ్లలో చర్చ జరుగుతోంది. ఈ విషయం కొంత మంది పోలీసు అదికారుల దృష్టికి వచ్చింది. ఏ జరిగింది? మీ స్కూలు బస్సులు ఇలా రోడ్డు మీద వుంటే ఎలా? అని ఆ పోలీసులు అదికారులు ప్రశ్నిస్తే మీపై ఆఫీసర్‌కు ఏం కంప్లయింట్ చేస్తావో చేసుకో అని వారిని కూడా పరంజ్యోతి బెదిరించినట్లు తెలుస్తోంది. ఇలా స్కూల్‌లో దుర్మార్గాలు జరుగుతుంటే ప్రశ్నించిన వారిని బెదిరించే స్దాయికి విద్యా సంస్ధలు ఎదగడం అనేది వ్యవస్దకే నష్టం. అందువల్ల విద్యా శాఖ జరిగిన సంఘటనపై వెంటనే స్పందించాల్సిన అవసరం వుంది. విద్యార్ధిని అంతలా చితకబాదినా డిఈవో, ఎంఈవోలు ఇంత వరకు స్పందించలేదు. ఆ స్కూల్‌లో ఏం జరిగిందన్నదానిపై వివరణ తీసుకునే ప్రయత్నం చేసినట్లు లేదు. ఇప్పుడు జరిగింది చిన్న సంఘటన కాదు. పసివాడిని వీపులో పిడికిలితో టీచర్ గుద్దితే ఆ పిల్లోడి ప్రాణానికి ఏదైనా హాని జరిగితే ఎవరు బాధ్యులు? అదృష్టం బాగుండి పిల్లవాడుచేయని తప్పుకు శిక్షను అనుభవించాడు. అదే ప్రాణాల మీదకు వస్తే అప్పుడు పరిస్దితి ఏమిటి? ఇక్కడ తల్లిదండ్రుల తప్పు కూడా వుంది. అంత జరిగితే ఆ విషయాన్ని బైట పెట్టకపోవడం కూడా తప్పే. ఇవాళ ఈ అబ్బాయికి జరిగింది. మరోసారి మరో అబ్బాయికి జరగదన్న గ్యారెంటీ ఏముంది? ఈ తల్లిదండ్రులను బెదిరించినట్లే ఇతర తల్లిదండ్రులను కూడా స్కూల్ యాజమాన్యం బెదిరిస్తుంది. భయపెడుతుంది. కనీసం మాటలు రాని పిల్లాడిని ఎలా కొట్టారని ప్రశ్నించే ధైర్యం తల్లిదండ్రులకు లేదా? ఫీజుల్లో రాయితీ ఇస్తామని చెబితే అంగీకరిస్తారా? మీ పిల్లాడి ప్రాణాలకన్నా, చదువు ఎక్కువకాదు. ఆ స్కూల్ ఫీజు రాయితీ అంతకన్నా పెద్దది కాదు. ఇప్పటికైనా ప్రైవేటుస్కూళ్లలో చదువుకునే తల్లిదండ్రులు ఆలోచించుకోవాలి. వారి పిల్లలకు ఎలాంటి విద్యను అందిస్తున్నారు? తమ పిల్లలను టీచర్లు ఎలా ట్రీట్ చేస్తున్నారన్నది కూడా తెలుసుకుంటుండాలి. లేకుంటే స్కూళ్ల యజమాన్యాల వేషాలు మితిమీరిపోతుంటాయి. విద్యా శాఖతోపాటు, చైల్డ్ వెల్ఫేర్ శాఖ వెంటనే స్పందించాలని విద్యార్ధి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. విద్యార్ధిని కొట్టిన టీచర్‌ను, ఆ స్కూల్ యజమాని పరంజ్యోతిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి వాటిని మొదట్లోనే కట్టడి చేయకపోతే మిగతా స్కూళ్లు కూడా ఇలాగే తయారౌతాయి.
జాతీయ లోకాదళద్ తెలంగాణలో సెప్టెంబర్ 13న నిర్వహించబడును. ఇందులో ఎలాంటి కోర్టు వివాదాల్లో ఉన్న చెక్ బౌన్స్ కేసులు,ఆస్తి తగాదాలు, వైవాహిక కేసులు, రాజీ పడే క్రిమినల్ కేసులు, కార్మిక కేసులు, సివిల్ కేసులు, మోటార్ తరహా కేసులు వదులు అనే పరిష్కరించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అని దాని వినియోగించుకోగలరని తెలంగాణ న్యాయ సేవాధికార సంస్థ హైదరాబాద్ జారీ చేశారు. కావున రాజీ పడాలనుకునేవారు ఈ కార్యక్రమం పాల్గొనగలరని కల్వకుర్తి పోలీస్ శాఖ తెలియజేశారు.
వారం రోజుల క్రితం ప్రమాదవశాత్తు మరణించిన బానోత్ మోహన్ కుటుంబానికి టీటీడబ్ల్యూఆర్ఎస్ పూర్వ విద్యార్థులు 27 వేల రూపాయల ఆర్థిక భరోసాను కల్పించారు. మోహన్ దశదినకర్మ మండల కేంద్రంలో మంగళవారం జరుగుతున్న నేపథ్యంలో పూర్వ విద్యార్థులు మోహన్ సతీమణికి అందజేశారు. ఈ ఆర్థిక సహాయం చేసిన వారిలో గుండాల మండల కేంద్రానికి చెందిన ఎస్సై గడ్డం సతీష్, సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ నరేష్, రవీందర్, మంగీలాల్, అశోక్, సురేష్, మంగీలాల్, బిక్షపతి, రాము మిగతా మిత్రులు తదితరులు పాల్గొన్నారు.
గంగాధర మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న ప్రెస్ క్లబ్ భవన నిర్మాణ పనులను ఎంపీడీవో దమ్మని రాము, ఎంపీఓ గౌరీ రమేష్ మంగళవారం పరిశీలించారు. మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ నిర్మాణ పనులు పూర్తయితే ప్రెస్ మీట్ లు పెట్టడానికి అనువుగా ఉంటుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సహకారంతో భవన నిర్మాణ పనులు చేస్తున్నట్లు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు జారతి రాజిరెడ్డి తెలిపారు. ప్రెస్ క్లబ్ నిర్మాణానికి ప్రత్యేక చొరవ చూపుతున్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రాజిరెడ్డి, సభ్యులను ఎంపీడీవో, ఎంపీ ఓ అభినందించారు. ఇక్కడ పంచాయతీ కార్యదర్శి జిల్లెల్ల లచ్చయ్య తదితరులు ఉన్నారు.
గణపురం మండలం గణపురం, కొత్తపల్లి గోరి, రేగొండ,పరిధిలోని ప్రజలకు తెలియ జేయునది ఏమనగా గొడవలు వద్దు-రాజీలు ముద్దు వివాదాలు అనేవి పెంచుకోవాలనుకుంటే జీవిత కాలం కొనసాగుతాయి.ఒక వేల ఇంతటితో కలిసుంటాము అని ఒక నిర్ణయానికి వస్తే ఇప్పుడే సమసిపోతాయి మీరే తేల్చు కోండి వివాదాలు కావాలా.? రాజీలు కావాలా.? తేదీ. 13-09-2025 వ తారీఖు కోర్టులో “జాతీయ మెగా లోక్ అదాలత్” ఉంది కాబట్టి.మీ పై కానీ, మీకు తెలిసిన వాళ్ల పై గాని ఏమైనా కేసులు ఉంటే వాటిని కాంప్రమైజ్ చేసుకొని కోర్టుకు హాజరైనట్లయితే ఆ కేసులు పూర్తిగా క్లోజ్ చేయ బడును.1. యాక్సిడెంట్ కేసులు, 2. కొట్టుకున్న కేసులు,3. చీటింగ్ కేసుల కు సంబంధించిన కేసులు, 4. వివాహ బంధానికి సంబంధించిన కేసులు, 5.చిన్నచిన్న దొంగ తనం కేసులు,6,డ్రంక్ అండ్ డ్రైవ్,ఓపెన్ డ్రింకింగ్ కేసులు మరియు ఇతర రాజీ పడ దగు కేసులు, మొదలైనవి.ఈ నేషనల్ లోకదాలత్ లో కాంప్రమైజ్ చేసుకుని క్లోజ్ చేసుకోవచ్చు, కాబట్టి ఈ అవకాశాన్ని కేసు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోగలరు.
సాహిత్యం ద్వారా సమాజ మార్పుకు కృషి చేసిన ప్రజాకవి కాళోజీ నారాయణరావును స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పిలుపునిచ్చారు. మంగళవారం ఐడిఓసి కార్యాలయంలో నిర్వహించిన కాళోజీ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ కాళోజీ రచనలు ప్రజల్లో చైతన్యం నింపాయని, ఆయన జీవితం అందరికీ మార్గదర్శకమని పేర్కొన్నారు. తన కవిత్వం ద్వారా స్వరాష్ట్ర ఆకాంక్షను రగిలించి, తెలంగాణ ప్రజలను జాగృతం చేసిన మహాకవి కాళోజి నారాయణరావు జయంతిని రాష్ట్ర ప్రభుత్వం తెలుగు భాషా దినోత్సవంగా ప్రకటించినట్లు తెలిపారు. తెలంగాణా భాషా దినోత్సవంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 9న నిర్వహించడం ద్వారా కాళోజి సాహిత్య సేవలను స్మరించుకోవడం గర్వకారణమని, కాళోజి కవిత్వంలో మన భాష, మన భూమి, మన సంస్కృతి ప్రతిబింబించాయని పేర్కొన్నారు. కాళోజి కవి మాత్రమే కాదని, సామాజిక చైతన్యానికి మార్గదర్శకులని కొనియాడారు. కాళోజి చూపిన మార్గంలో సాగితే మన భాష, మన సంస్కృతి మరింత వెలుగొందుతాయని సూచించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, బీసీ సంక్షేమ శాఖ అధికారి ఇందిరా జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీఐ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్.దిలీప్ రావ్
పరకాల నేటిధాత్రి
సమాచార హక్కు చట్టం సాధన కమిటీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్.దిలీప్ రావ్ నియమితులయ్యారు.ఈ మేరకు మంగళవారం ఆ కమిటీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు డాక్టర్.చంటి ముదిరాజ్,రాష్ట్ర అధ్యక్షురాలు సూర స్రవంతి, జాతీయ ప్రధాన కార్యదర్శి మల్లం వెంకటేశం,ఎన్.దిలీప్ రావ్ కు నియామకపత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా దిలీప్ రావ్ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి బయటకు తీస్తూ సమాచార హక్కు చట్టం గురించిపౌరులకు,విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడానికి కృషి చేస్తానన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు గోపీనాథ్ కట్టెకోల,వేముల పుష్పాలత, రాష్ట్ర కార్యదర్శి గండు వెంకటేశ్వర్లు,రాష్ట్ర సంయుక్త నీలం వెంకట మధు,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రశేఖర్,అరుణ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు
హనుమకొండ జిల్లా పట్టణ పరిధిలోని ఆరోగ్య కేంద్రాలను పరిశీలించిన డిఎంహెచ్వో డాక్టర్ అప్పయ్య
హన్మకొండ జిల్లా, నేటిధాత్రి (మెడికల్):
హనుమకొండ డిఎంహెచ్ఓ డాక్టర్ ఏ.అప్పయ్య ఈరోజు పట్టణ పరిధిలో ఆరోగ్య కార్యక్రమాలను పర్యవేక్షించారు. లష్కర్ సింగారం పట్టణ ఆరోగ్య కేంద్ర పరిధిలో టీబీ చికిత్స పొందుతున్నవారికీ దాతల సహకారంతో పోషకాహార కిట్ల ను అందించడం జరిగింది. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఏ అప్పయ్యనీ స్ఫూర్తిగా తీసుకొని ఇద్దరికీ చికిత్స కాలంలో ఆరు నెలల వరకు పోషకార కిట్ లను అందించడానికి ముందుకు వచ్చిన నర్సింగ్ ఆఫీసర్ శ్రీమతి మేరీ కరుణను ఆయన అభినందించారు. ఇప్పటివరకు ప్రైవేట్ ఆస్పత్రుల యజమాన్యాలు , రెడ్ క్రాస్,మనూస్ స్వచ్ఛంద సంస్థలు పోషకాహారకిట్లు అందిస్తున్నాయని, అలాగే తనతో పాటు వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న డాక్టర్లు సిబ్బంది కూడా ముందుకు రావడం అభినందించ తగ్గదని ఆయన అన్నారు. డాక్టర్ హిమబిందు (1)వంగర వైద్యాధికారి డాక్టర్ ముతిర్ రెహమాన్ ( 2 ), నేరేడుపల్లి పల్లె దవఖాన వైద్యాధికారి డాక్టర్ వినోద్ కుమార్ (4 ) , హెల్త్ సూపర్వైజర్ పి విప్లవ కుమార్ ( 5) వెంకటేశ్వర్లు(1) పోషకాహార కిట్లను అందిస్తున్నారని అన్నారు. లష్కర్ సింగారం పట్టణ ఆరోగ్య కేంద్ర పరిధిలో నిర్వహిస్తున్న వైద్య శిబిరాన్ని సందర్శించి చికిత్స నిమిత్తం వచ్చిన వారితో మాట్లాడి వారి ఆరోగ్య సమస్యలను తెలుసుకున్నారు అలాగే వాజ్పేయి కాలనీలో డ్రై డే కార్యక్రమాన్ని పరిశీలించారు..కాలనీ లో పాత సామాను దుకానం లో నీరు నిలువ ఉన్న వస్తువు లను తొలగించాలని కోరారు. కొన్ని గృహాలను సందర్శించి వివరాలు ఇతర ఆరోగ్య సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. శాయంపేట పట్టణ ఆరోగ్యకేంద్రంలో నిర్వహిస్తున్న ఆరోగ్య మహిళా క్లినిక్ ను సందర్శించారు. ఇప్పటివరకు 27 మందిని పరీక్షించినట్లు అందులో ఐదుగురికి రక్తపరీక్షలు సేకరించినామని అలాగే ఒకరిని మరిన్ని పరీక్షల నిమిత్తం రెపర్ చేసినట్లు గుర్తించడం జరిగింది. ఇందులో అడిషనల్ డి ఎం హెచ్ ఓ డాక్టర్ డి మదన్ మోహన్ రావు జిల్లా టీవీ నియంత్రణ అధికారి డాక్టర్ హిమబిందు, వైద్యాధికారులు డాక్టర్ హైదర్ డాక్టర్ మౌనిక జిల్లా మాస్ మీడియా అధికారి వి అశోక్ రెడ్డి, సూపర్వైజర్ బాబు, హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాస్ ఏఎన్ఎంలు ,ఆశాలు పాల్గొన్నారు.
12న తహసిల్దార్ ఆఫీస్ ముట్టడి * వికలాంగులకు వృద్ధులకు పింఛన్ వెంటనే పెంచాలి ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు బెల్లంపల్లి సురేష్ మాదిగ మహాదేవపూర్ సెప్టెంబర్ 9 నేటి ధాత్రి *
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ ఆవరణంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు బెల్లంపల్లి సురేష్ మాదిగ మాట్లాడుతూ 12 నతహసిల్దార్ కార్యాలయాల ముట్టడికి వికలాంగులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా తాసిల్దార్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వికలాంగులకు వృద్ధులకు వితంతువులకు పింఛన్ పెంచాలని లేకపోతే స్థానిక ఎలక్షన్లో చిత్తుచిత్తుగా ఓడిస్తామని హెచ్చరించారు వికలాంగుల మండల అధ్యక్షులు వీరగంటి సమ్మయ్య మాట్లాడుతూ. వికలాంగులకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని మా బాధను ప్రభుత్వం పట్టించుకోవాలని జాప్యం చేయకుండా తక్షణమే పింఛన్లు పెంచాలని అదేవిధంగా కొత్త ఫించనులను కూడా మంజూరు చేయాలని వికలాంగులకు న్యాయం చేసే వరకు నిరంతరం పోరాడుతామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు బెల్లంపల్లి సురేష్ విహెచ్పిఎస్ మండల అధ్యక్షుడు వీరగంటి సమ్మయ్య .అంబటిపల్లి విహెచ్పిఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు తిరుమల చారి. మహాదేవపూర్ ఎమ్మార్పీఎస్ గ్రామ కార్యదర్శి లింగాల. సుశాంత్ తోపాటు తదితరులు పాల్గొన్నారు
పార్టీవ దేహానికి నివాళులర్పించిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం..
జహీరాబాద్ నేటి ధాత్రి:
V6 రిపోర్టర్ అయ్యుబ్ ఖాన్ సోదరుడు అహ్మద్ ఖాన్ అనారోగ్యంతో మంగళవారం మరణించిన విషయం తెలిసి ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం పట్టణంలోని ఈద్గా వద్దకు వెళ్లి వారి మృతదేహాన్నీ సందరర్శించి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేసారు,మాజీ కౌన్సిలర్ అబ్దుల్లా,ఆతార్ అహ్మద్ ఏఐఎంఐఎం నాయకులు, జర్నలిస్ట్ లు మహబూబ్, కరీం,తదితరులు ఉన్నారు,
20 కి పైగా కేసులు అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు తరలింపు
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి జైలుకు పంపించునారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే, ఐపీఎస్ సంపత్ రావు, డీఎస్పీ భూపాల పల్లి గార్ల ఆదేశాల మేరకు, గణపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ సిహెచ్ కరుణాకర్ రావు పలు దొంగతనం కేసులలో నిందితుడయిన దురిశెట్టి నిరంజన్ తండ్రి. శంకర్ వయస్సు 28 సంవత్సరాలు కులం పెరుక వృత్తి హోటల్ వ్యాపారం నివాసం జంగేడు గ్రామం భూపాలపల్లి మండలం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అను అతనిపై తేది 08.09.2025 నాడు ప్రివెంటివ్ డిటెన్షన్ ( డిపి) చట్టం అమలు చేశారు. ఆయన పై పలు పోలీస్ స్టేషన్ లలో దొంగతనం కేసుల నమోదు అయినాయి. ఒక్క భూపాలపల్లి జిల్లా లోనే దాదాపు 20 కి పైగా కేసులు నమోదు అయినాయి, పై వ్యక్తి చట్ట విరుద్ధ కార్యకలాపాలలో నిమగ్నమై, ప్రజా శాంతి భద్రతలకు భంగం కలిగిస్తూ వస్తున్నాడు. పోలీసుల హెచ్చరికలు చేసినప్పటికీ తన దుర్వినయాన్ని కొనసాగించాడు. జిల్లా పోలీసులు ఆయనపై ఉన్న రికార్డులు నేరప్రవర్తనను సమగ్రంగా పరిశీలించి ప్రజా శాంతి పరిరక్షణ కోసం ప్రివెంటివ్ డిటెన్షన్ (డిపి) చట్టం కింద అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన్ని చర్లపల్లి జైలు లో నిర్బంధించారు.జిల్లా ప్రజలకు శాంతి భద్రత కల్పించడం మా బాధ్యత. ఇటువంటి అలవాటు పడిన నేరస్థులపై కఠిన చర్యలు కొనసాగిస్తామని జయశంకర్ భూపాలపల్లి ఎస్పి కిరణ్ ఖరే ఐపీఎస్ సంపత్ రావు డి.ఎస్.పి గణపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ అయిన సిహెచ్ కరుణాకర్ రావు తెలిపారు.
చిన్ననాటి నుండి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలి
మండల విద్యాశాఖ అధికారి కాలేరు యాదగిరి
కేసముద్రం/ నేటి దాత్రి
ప్రజాకవి కాళోజి నారాయణ రావు జయంతి ని పురస్కరించుకొని తెలంగాణ భాషా దినోత్సవం ను జరుపుకోవడం జరిగింది. ఇందులో భాగంగా విద్యార్థుల కు డ్రాయింగ్, వ్యాస రచన, 50 మంది తెలంగాణ కవుల చిత్ర పటాలను ప్రదర్శించి వారి రచనలు విద్యార్థుల చే పరిచయం,చేయడం జరిగింది. ఇంకా క్విజ్, ఉపన్యాసం, పద్యాల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ గతంలో తెలంగాణ యాసను ఈసాడించుకోవడం జరిగింది, ఇలాంటి సందర్భంలో కాళోజి లాంటి మహనీయులు మన తెలంగాణ యాస భాష లను, మన మాండలికాలను కాపాడుకోవాలి అని చెప్పి తెలంగాణ వ్యాప్తంగా నాగొడవ లాంటి రచన లతో ఉత్తేజ పరచడం జరిగింది. అలాగే మనం కూడా ప్రస్తుత సమాజం లో మన భాషా యాస లను గొప్పగా చెప్పుకోవాలి అని చెప్పారు. మండల విద్యాధికారి యాదగిరి మాట్లాడుతూ భావి పౌరులు అయినా మీరు చిన్నపటి నుండే బంగారు భవిష్యత్ కు బాటలు వేసుకోవాలని చెప్పడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమం లో తెలుగు ఉపాధ్యాయులు అగుర్తి సురేష్, సంపంగి లక్ష్మికుమారి, చారాల సత్యనారాయణ, ఉపాధ్యాయులు గంగుల శ్రీనివాస్, ముదిగిరి సదయ్య, నర్సింహ రెడ్డి, కుమారస్వామి, కృష్ణవేణి, మధు, యాదగిరి, మదన్మోహన్, శ్రీనివాసులు, చందర్, భద్రాసింగ్, శ్రీవిద్య, శ్రీనివాస్, రాజేందర్, జ్యోతి, శ్రీనివాస్ లు పాల్గొన్నారు
పరకాల మరియు నడికూడా పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలకు 13 సెప్టెంబర్ న పరకాల కోర్టులో జాతీయలోక్ అదాలత్ ఉంటుందని మీ పై కానీ,మీకు తెలిసిన వాళ్లపై గాని ఏమైనా కేసులు ఉంటే వాటిని కాంప్రమైజ్ చేసుకొని కోర్టుకు హాజరైనట్లయితే ఆ కేసులు పూర్తిగా క్లోజ్ చేయ బడుతయాని యాక్సిడెంట్ కేసులు,కొట్టుకున్న కేసులు, చీటింగ్ కేసులు,వివాహ బంధానికి సంబంధించిన కేసులు,చిన్నచిన్న దొంగ తనం కేసులు,డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్ కేసులు మరియు ఇతర రాజీపడదగు కేసులు ఉంటే ఈనేషనల్ లోకదాలతో కాంప్రమైజ్ చేసుకుని క్లోజ్ చేసుకోవచ్చునని ఈ అవకాశాన్ని కేసు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని దీనికోసం ఫిర్యాదు దారుడు మరియు నేరస్తులు అందరూ తమ యొక్క ఆధార్ కార్డు తీసుకుని పరకాల కోర్ట్ పరకాల పోలీస్ స్టేషన్ కు రావాలని పరకాల సీఐ క్రాంతికుమార్ తెలిపారు.
కైలాస గుట్ట మీది సమస్యల గురించి మున్సిపల్ అధికారికి వినతి పత్రం.
కల్వకుర్తి/ నేటి దాత్రి:
కల్వకుర్తి పట్టణంలోని కైలాసం గుట్టపైన ఈ మధ్యకాలంలో భారీ వర్షాలు సంభవించడం వలన ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సమస్యలను మునిసిపల్ అధికారి దృష్టికి తీసుకెళ్లారు. అందులో భాగంగా కరెంటు వైర్లు, కరెంట్ స్తంభాలు దెబ్బతినడం కరెంటు సప్లై రావడం లేదు.రానున్న పది రోజులలో బతుకమ్మ పండుగ, దసరా ఉత్సవాలు, దీపావళి కార్తీక మాసం పండుగలు ప్రారంభమవుతున్నాయి కావున భక్తుల ప్రయోజనాల సౌకర్యాల కొరకు కరెంటు వైర్లు, బల్బులను ఏర్పాటు చేయాలని కోరుచున్నాము.ప్రతి పండుగకు మున్సిపల్ వారికి చెప్పడం వారు వచ్చి తాత్కాలిక వైరింగ్ చేయడం మళ్లీ కొద్ది రోజుల తర్వాత యధావిధిగా పాడైపోతున్నాయి. అలా కాకుండా పర్మినెంట్ ఐమాక్స్ లైట్ ఏర్పాటు చేయగలరు స్తంభాలకు లైట్లు, వైరింగ్ చేయించగలరని కోరుతూ కల్వకుర్తి మున్సిపల్ గారికి వినతి పత్రం అందజేశారు . ఈ కార్యక్రమంలో దయాకర్,పురం మహేశ్వర్ రెడ్డి, కుడుముల శేఖర్ రెడ్డి,గార్లపాటి, ప్రదీప్ కుమార్,బృంగి వివేకానంద, ఉప్పరిపల్లి ప్రవీణ్ రెడ్డి,వాగులదాస్ నరేశ్ గౌడ్,కాగుల శ్రీశైలం యాదవ్, దేవర్ల ఆంజనేయులు,చెందు ముదిరాజ్, రఘు యాదవ్,దేవర్ల వెంకటనారాయణ,రానదీర్ తదితరులు పాల్గొన్నారు.
కాలోజీ నారాయణరావు జయంతి వేడుకలను మంగళవారం కేసముద్రం మున్సిపాలిటీలోని విలేజ్ లో శ్రీ వివేకవర్ధిని హైస్కూల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చిర్రా యాకాంతం గౌడ్ కాలోజీ చిత్రపటానికి పూలమాల వేశారు. అనంతరం ప్రసంగిస్తూ కాలోజీ కవిత్వం, ఆయన సాహిత్య స్ఫూర్తి, సమాజంపై చూపిన ప్రభావం గురించి వివరించారు. నా గొడవ పేరుతో సమకాలీన సామాజిక సమస్యలపై నిర్మొహమాటంగా స్పందించిన వ్యక్తి కాళోజీ అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.
#ఆత్మ హత్య యత్నానికి ప్రేరేపించిన ఎమ్మార్వో ను తక్షణమే సస్పెండ్ చేయాలి.
#కల్పన కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలి.
#మాజీ జెడ్పి ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న.
నల్లబెల్లి, నేటి ధాత్రి:
నల్లబెల్లి మండల తహసిల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న వాంకుడోత్ కల్పన సోమవారం ఆత్మహత్య యత్నానికి పాల్గొన్న సంఘటన పై బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బానోతు సారంగపాణి ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో మాజీ జెడ్పి ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న పాల్గొని కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒక గిరిజన మహిళ ఉద్యోగి పట్ల కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ప్రవర్తించిన తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వ కార్యాలయాలను తమ పార్టీ కార్యాలయాలుగా మార్చుకొని అక్రమ పనుల కోసం అధికారులను వేధిస్తూ తమ ఉనికిని చాటుకునేందుకు నీచమైన రాజకీయాలను కాంగ్రెస్ పార్టీ నాయకులు చేయడం సిగ్గుచేటు. గిరిజన మహిళ ఉద్యోగి ఆత్మహత్య చేసుకుంటే ఇప్పటివరకు స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, ప్రభుత్వ ఉన్నత అధికారులు స్పందించకపోవడం దాని వెనకాల ఉన్న ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. వాంకుడోత్ కల్పన తనకు కాంగ్రెస్ పార్టీ నాయకులతో ప్రమాదం ఉందని వారు నన్ను లైంగికంగా వేధిస్తున్నారని ఎమ్మార్వో కు పలుమార్లు చెప్పినా కూడా ఎమ్మార్వో నిర్లక్ష్యం వహించడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులతో రాజీ పడాలని చెప్పడం ఆమెను మానసికంగా ఎంతగానో కృంగాదీసింది. తోటి ఉద్యోగరాలకు ప్రమాదం ఉందని తెలిసి ఆమె ఆత్మహత్య ప్రయత్నానికి కారకుడైన ఎమ్మార్వో ముప్పు కృష్ణను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కార్యాలయలలో కిందిస్థాయి ఉద్యోగులను వేధిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వ ఉన్నత అధికారులు ఎందుకు భయపడుతున్నారో ప్రజలకు వివరించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను కాపాడుతున్న అధికారులకు ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా మండలంలో మైనింగ్, మట్టి మాఫియా చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు కొమ్ముకాస్తున్న రెవెన్యూ అధికారుల పైన జిల్లా కలెక్టర్ తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. అధికార పార్టీ నాయకుల అరాచకాలను ప్రశ్నించిన వారి పైన అక్రమంగా కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురి చేయడం సిగ్గుచేటు. ఇప్పటివరకు ఆత్మహత్యాయత్నం చేసుకున్న కల్పనను పై ఉన్నతాధికారులు ఎవరు పరామర్శించకపోవడం బాధాకరమని. నిరసన కార్యక్రమాన్ని విరమించాలని నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్సై గోవర్ధన్ చెప్పినప్పటికీ కూడా శాంతించని బి ఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆర్డీవో వచ్చి బాధితురాలకు భరోసా ఇచ్చేంతవరకు నిరసన కార్యక్రమాన్ని విరమింప చేసే ప్రసక్తే లేదని భీష్మించి కూర్చున్నారు. పరిస్థితి చేయి దాటి పోతుందని గమనించిన ఎస్సై గోవర్ధన్ ఆర్డీవోతో చరవాణి ద్వారా పెద్ది స్వప్నతో మాట్లాడుతూ కల్పన ఆత్మహత్యయత్నని కి కారకులైన వారిపై చట్ట రిత్యా చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇవ్వగా నిరసన కార్యక్రమాన్ని విరమింప చేశారు. ఈ మేరకు కేసును సుమోటోగా తీసుకొని వెంటనే నిందితులను అరెస్టు చేయాలని బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ఊడుగుల ప్రవీణ్ గౌడ్, నాయకులు పాలెపు రాజేశ్వరరావు, గందె శ్రీలత శ్రీనివాస్ గుప్తా, నాన బోయిన రాజారామ్ యాదవ్, అమరేందర్, గోనె యువరాజు, మామిండ్ల మోహన్ రెడ్డి, లావుడియా తిరుపతి, జాటోతు తిరుపతి, మాజీ ఎంపిటిసి లక్ష్మి, ఖ్యాతం శ్రీనివాస్, పాండవుల రాంబాబు, మేడిపల్లి రాజు, మాటూరి హరీష్, తదితరులు పాల్గొన్నారు.
42 శాతం బీసీ రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి
ఈనెల 11న కలెక్టరేట్ వద్ద ఆందోళన
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కామ్రేడ్ ఓంకార్ పాత్రపై ఈనెల 12న రాష్ట్ర సదస్సు
ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్
వరంగల్ జిల్లా ప్రతినిధి/ నర్సంపేట,నేటిధాత్రి:
కేంద్రంలో,రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యంతో పేరుకుపోతున్న స్థానిక సమస్యల పరిష్కారానికి పోరాటాలే మార్గమని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ పిలుపునిచ్చారు. మహత్తర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తూ గందరగోళపరుస్తున్న భారతీయ జనతా పార్టీ తీరు పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలని కోరారు.ఎంసిపిఐ(యు) నగర ముఖ్య కార్యకర్తల సమావేశం నగర కార్యదర్శి కామ్రేడ్ మాలోత్ సాగర్ అధ్యక్షతన వరంగల్ పార్టీ ఆఫీసులో జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ మాట్లాడుతూ 42 శాతం బీసీ రిజర్వేషన్లపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలాడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.బీసీలను మభ్యపెడుతూ కపటనాటకం ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ బిజెపి టిఆర్ఎస్ పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే తమిళనాడు రాష్ట్రంలో వలె షెడ్యూల్ తొమ్మిదిలో చేర్చి 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయవచ్చని డిమాండ్ చేశారు.రాజకీయ స్వార్థం కోసం స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకుండా నిర్వీర్యం చేస్తూ నిధులు కేటాయించకుండా స్థానిక సమస్యలు పేరుకుపోయే విధంగా పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వం కారణమవుతున్నారని పేర్కొన్నారు. అందుకని తక్షణమే 42 శాతం బీసీ రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 11న వరంగల్ కలెక్టర్ ఆఫీస్ వద్ద ఆందోళన చేపట్టనున్నట్లు తెలిపారు. వీర తెలంగాణ రైతాంగ పోరాట వారోత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 11 నుంచి 17 వరకు కార్యక్రమాలు చేపట్టాలని అలాగే అమరజీవి కామ్రేడ్ మద్ది కాయల ఓంకార్ శత జయంతి వార్షికోత్సవంలో భాగంగా తెలంగాణ రైతన్న సాయుధ పోరాటంలో ఓంకార్ పాత్రపై ఈనెల 12న తొర్రూరులో రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ నెల 17న వారోత్సవ ముగింపు ప్రదర్శన సదస్సు వరంగల్ పట్టణంలో జరుగుతుందని కాగా కార్యకర్తలు, ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం 12న జరిగే రాష్ట్ర సదస్సు ప్రచార కరపత్రాలను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో పార్టీ నగర సహాయ కార్యదర్శి సుంచు జగదీశ్వర్, నగర నాయకులు ముక్కెర రామస్వామి, గణిపాక ఓదెలు, మహమ్మద్ మహబూబ్ పాషా, మాలి ప్రభాకర్, అప్పనపురి నర్సయ్య, తాటికాయల రత్నం, పోలేపాక రవీందర్, దామెర రమేష్ తదితరులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.