కేంద్ర బృందం పరిశీలించింది..

కేంద్ర బృందం పరిశీలించింది.
మరమత్తులు ఎప్పుడు?

నిజాంపేట: నేటి ధాత్రి

 

గత వర్షాలకు దెబ్బతిన్న నందిగామ 765 డీజీ రోడ్డు పై వంతెన, నిజాంపేట మల్కచెరువు మత్తడి రహదారి నేటికి పునర్నిర్మాణానికి నోచుకోలేదు. అధికారులు తాత్కాలిక మరమ్మత్తులు చేసినా, శాశ్వత పరిష్కారం లభించలేదు. కేంద్ర బృందం వచ్చి నష్టాన్ని పరిశీలించిన పనులు ప్రారంభం కాకపోవడం పై స్థానికులు మండిపడుతున్నారు. నిజాంపేట – నస్కల్ గ్రామాల మధ్య ప్రయాణం నరకప్రాయంగా మారిందని, వెంటనే నూతన బ్రిడ్జి ఏర్పాటు ఏర్పాటు చెయ్యాలంటున్నారు.

గత ప్రభుత్వాలు మేడారం జాతర ను విజయవంతం…

*గత ప్రభుత్వాలు మేడారం జాతర ను విజయవంతం చెయ్యలేదా లేక అడ్వా్టేజింగ్ చేసుకోలేదా కాంగ్రెస్ మంత్రి చెప్పాలే ***

డా జాడి రామరాజు నేత

ఏటూరునాగారం, నేటిధాత్రి

 

బుధవారం రోజున ఏటూరునాగారం మండల కేంద్రం లో బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు డా జాడి రామరాజు నేత మాట్లాడుతూ 1948 సెప్టెంబర్ 16వరకు తెలంగాణ తెలంగాణ నిజాం పరిపాలన ఉన్నాది అప్పుడు జాతర చేస్తే నిజాం పాలకులు ప్రజలను భయబ్రాంతులకు గురి చేసినప్పటికి కూడా ప్రజలు మేడారం జాతర అప్పటి పరిస్థులకు అనుకూలంగా జాతర జరిగేది కానీ తెలంగాణ కు స్వాతంత్రం స్వతంత్రం వచ్చిన తరువాత ప్రభుత్వం లు 1996 వరకు ఏజెన్సీ ప్రాంతం నుండి ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులు లేకపోవడం వలన ప్రభుత్వం దృష్టికి మైదాన ప్రాంత నాయకులు 1952 నుండి ములుగు ప్రాంత వాసులు ప్రజాప్రతినిధులు ఉండడం వలన గుర్తించపడలేదు కానీ 1996 లో ఉప ఎన్నికల్లో చర్ప భోజరావు ఎమ్మెల్యే అయిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో మేడారం జాతర ఆదివాసీ కుల దైవం అని చెప్పి ఒప్పించిన తర్వాత ప్రభుత్వం గుర్తింపు ఇచ్చింది తర్వాత పోదేం వీరయ్య ఈ ప్రాంతవాసుల వలన మేడారం జాతర అభివృద్ధి అయ్యింది ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నాది కానీ మేడారం జాతర కు వచ్చిన నిధులను 75% ములుగు లో ఖర్చు పెడుతున్నారు 25%నిధులు మాత్రమే మేడారం జాతర లో అభివృద్ధి కోసం ఖర్చు పెడుతున్నాని అన్నారు అదేవిదంగా మంత్రి మాటలు కాంగ్రెస్ నాయకులు మేడారం జాతర ను అభివృద్ధి చెయ్యనట్టు మాట్లాడుతూ అడ్వా్టేజింగ్ కోసం తపన పడుతున్నారు తప్ప అభివృద్ధి కోసం కాదని అన్నారు అదేవిదంగా గత ప్రభుత్వలు అభివృద్ధి చెయ్యలేదా లేక గతం లో ఎన్నికైన మంత్రులు ఎమ్మెల్యే లు అడ్వా్టేజింగ్ చేసుకోలేదా పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళ శిశు సంక్షమా శాఖ మంత్రి చెప్పాలని అన్నారు ఆదివాసీ దళిత బహుజన మైనార్టీ వర్గాల అభివృద్ధి కోసం నేటి పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి 3 సంత్సరాల వయస్సు లోనే ఆదివాసీ దళిత బహుజన మైనార్టీ వార్గాల వారికీ రాజ్యాధికారం కోసం పోరాటం చేసింది ఎంత నిజమో మేడారం జాతర అభివృద్ధి చేసినట్టు చెప్పుకోవడం కూడ అంతే నిజం అన్నారు అదేవిదంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడే మాటలు గత ప్రభుత్వం ఎప్పుడు మేడారం జాతర నిర్వహించలేదు కానీ ఆదివాసీ దళిత బహుజన మైనార్టీ వర్గాలకు రాజ్యాధికారం లక్ష్యంగా పోరాటం చేసింది కాబట్టి నేడు నాటి ఎమ్మెల్యే నేటి పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి అయ్యింది కాబట్టి మేడారం జాతర విజయవంతం చేసిందా అన్నారు అదేవిదంగా ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే మేడారం జాతర తెలంగాణ ప్రభుత్వం నిధులు కేటాయించిందా లేక కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేశారో చెప్పాలని అన్నారు ఇప్పటికైనా తడ్వాయి మంగపేట ఏటూరునాగారం కన్నాయిగూడెం మండలం లో ఉన్నా కాంగ్రెస్ బి ఆర్ ఎస్ నాయకులు మైదాన ప్రాంత నాయకుల జెండాలు మోస్తూ ఏజెన్సీ ప్రాంతం ను ఎడారి గా మార్చడానికి ప్రయత్నం చెయ్యకండి అన్నారు అలాగే ఈ ప్రాంత నాయకులకు జెండాలు మొయ్యడం మీద ఉన్నా అభిమానం ఏటూరునాగారం బస్సు డిపో రెవిన్యూ డివిజన్ పైన లేక పోవడం బాధాకరం అన్నారు అదేవిదంగా ఏటూరునాగారం మండలం లోని ప్రజలు మేధావులు పత్రిక మిత్రులు అలోచించి అర్ధం చేసుకోండి కాంగ్రెస్ బి ఆర్ ఎస్ ఏజెన్సీ ప్రాంతం అభివృద్ధి పైన ప్రేమ అభిమానం ఉంటే ఏటూరునాగారం రెవిన్యూ డివిజన్ ఎందుకు ఆమోదం ఎందుకు పొందడం లేదో కాంగ్రెస్ బి ఆర్ ఎస్ నాయకులను నిలతీయ్యాలని బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు డా జాడి రామరాజు నేత అన్నారు

విద్యార్థుల భద్రత దృష్ట్యా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలి…

విద్యార్థుల భద్రత దృష్ట్యా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలి

​- బీజేవైఎం కళాశాలల రాష్ట్ర కన్వీనర్‌ మంద మహేష్ డిమాండ్

​గణపురం, నేటిధాత్రి:

 

గణపురం మండలం ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరను పురస్కరించుకుని, గణపురం మండలంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా పాఠశాలలకు తక్షణమే సెలవులు ప్రకటించాలని బీజేవైఎం కళాశాలల రాష్ట్ర కన్వీనర్‌ మంద మహేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. ​​ఈ నెల 28 నుండి 31 వరకు జరిగే జాతరకు కోట్లాది మంది భక్తులు తరలివస్తున్నారని, దీనివల్ల గణపురం మండలంలోని ప్రధాన రహదారులన్నీ బస్సులు, భారీ వాహనాలతో నిండిపోయాయని ఆయన పేర్కొన్నారు. పాఠశాలలకు వెళ్లే చిన్నారి విద్యార్థులు సైకిళ్లపై వెళ్తూ ఈ రద్దీలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రహదారులు దాటే సమయంలో ప్రాణాపాయం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో జాతర సందర్భంగా మూడు, నాలుగు రోజులు సెలవులు ఇచ్చే ఆనవాయితీ ఉందని, కానీ ఈసారి ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదని విమర్శించారు. విద్యార్థుల భద్రత కంటే ముఖ్యం ఏదీ కాదు. ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే దానికి బాధ్యులు ఎవరని మంద మహేష్ ప్రశ్నించారు. తక్షణమే జిల్లా యంత్రాంగం స్పందించి విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఈ నాలుగు రోజులు మండలంలోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేవైఎం నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

మేడారం బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే రేవూరి…

మేడారం బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే రేవూరి

పరకాల,నేటిధాత్రి

 

 

సోమవారం పట్టణంలోని అంగడి మైదానంలో పరకాల నుండి మేడారం వెళ్ళు బస్సులను శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు.ఆర్టీసీ ప్రయాణం సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉండేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణ సౌకర్యంను సద్వినియోగం చేసుకోవాలన్నారు.మేడారం జాతర ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పండుగగా అని,కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఈ పవిత్ర క్షేత్ర అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించింది అన్నారు.

మేడారం మహాజాతరకు వరంగల్ నుంచి 290 ప్రత్యేక బస్సులు

మేడారం మహాజాతరకు వరంగల్ నుంచి 290 ప్రత్యేక బస్సులు

వరంగల్ బస్ స్టేషన్ తాత్కాలిక బస్ పాయింట్ నుంచి ఈ నెల 25 నుంచి ఫిబ్రవరి 1 వరకు ప్రత్యేక బస్సులు.

వరంగల్ నుంచి మేడారంకు పెద్దలకు రూ.250, పిల్లలకు రూ.150గా టికెట్ ధరలు.

తెలంగాణ ప్రాంతానికి చెందిన మహిళలు, ట్రాన్స్‌జెండర్లు సరైన ధ్రువీకరణ పత్రాలు చూపించి మహాలక్ష్మి పథకం ద్వారా ఎక్స్‌ప్రెస్ బస్సుల వరకు ఉచితంగా ప్రయాణించవచ్చు.

ప్రయాణికుల రద్దీని బట్టి బస్సుల సంఖ్యను పెంచుతాం.

… డిపో మేనేజర్ భూక్యా ధరంసింగ్.

వరంగల్, నేటిధాత్రి.

 

మేడారం మహాజాతరకు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వరంగల్ బస్ స్టేషన్ తాత్కాలిక బస్ పాయింట్ నుంచి ఈ నెల 25 నుంచి ఫిబ్రవరి 1 వరకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా వరంగల్ నుంచి మేడారం జాతరకు సుమారు లక్షకు పైగా ప్రయాణికులు వెళ్లే అవకాశం ఉందని అంచనా వేస్తుండగా, అందుకు అనుగుణంగా 290 బస్సులను అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. పరిస్థితిని బట్టి మరిన్ని బస్సులను కూడా వినియోగంలోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

ప్రయాణికుల రద్దీని సమర్థవంతంగా నియంత్రించేందుకు వరంగల్ ఓసిటి గ్రౌండ్ సమీపంలో బస్సులను పార్కింగ్ చేసి, అవసరాన్ని బట్టి అక్కడి నుంచి బస్సులను బస్ పాయింట్‌కు తరలించనున్నట్లు పేర్కొన్నారు. వరంగల్ నుంచి మేడారంకు పెద్దలకు రూ.250, పిల్లలకు రూ.150గా టికెట్ ధరలను నిర్ణయించారు. అలాగే తెలంగాణ ప్రాంతానికి చెందిన మహిళలు, ట్రాన్స్‌జెండర్లు సరైన ధ్రువీకరణ పత్రాలు చూపించి మహాలక్ష్మి పథకం ద్వారా ఎక్స్‌ప్రెస్ బస్సుల వరకు ఉచితంగా ప్రయాణించవచ్చని స్పష్టం చేశారు. భక్తులకు మరింత సౌకర్యంగా ఉండేలా నాలుగు ప్రత్యేక టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేయగా, వీటి ద్వారా 24 గంటల పాటు సేవలు అందించనున్నారు. టికెట్ తీసుకున్న అనంతరం క్యూలైన్ల ద్వారా నేరుగా బస్సుల్లో ఎక్కేలా ఏర్పాట్లు చేశారు. జాతర నిర్వహణలో భాగంగా సుమారు 800 మందికి పైగా ఉద్యోగులు విధులు నిర్వహించనున్నట్లు తెలిపారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికుల కోసం చలువ పందిళ్లు, త్రాగునీరు, పబ్లిక్ టాయిలెట్లు ఏర్పాటు చేయడంతో పాటు, అవసరమైన సమాచారం, సూచనలు అందించేందుకు హెల్ప్‌డెస్క్, ప్రత్యేక మెడికల్ క్యాంపును కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హన్మకొండ డిపో మేనేజర్ భూక్యా ధరంసింగ్ మాట్లాడుతూ, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రయాణికుల రద్దీని బట్టి బస్సుల సంఖ్యను పెంచుతామని, మేడారం మహాజాతరతో పాటు అగ్రహంపాడు జాతరకు కూడా వరంగల్ కూరగాయల మార్కెట్ సమీపం నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు వెల్లడించారు.

మేడారం జాతరలో ప్లాస్టిక్ వాడకండి: ఎమ్మెల్యే దొంతి

మేడారం జాతరలో ప్లాస్టిక్ ను వాడద్దు

ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

నర్సంపేట,నేటిధాత్రి:

ప్రకృతి సిద్ధమైన మేడారం జాతరలో ప్లాస్టిక్ వాడద్దని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు.ఏ.ఎస్.ఆర్ సేవా స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు ఎర్రబోయిన రాజశేఖర్ ఆధ్వర్యంలో
తన క్యాంప్ ఆఫీస్ లో ప్లాస్టిక్ వాడకండి…మేడారాన్ని రక్షించండి అనే వాల్ పోస్టర్ ఎమ్మెల్యే మాధవరెడ్డి ప్రారంభించారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే మేడారం జాతర లో ప్లాస్టిక్ వస్తువులను వాడకుండా ఆరోగ్యాన్ని రక్షించుకుంటూ గాలి,నీరు,భూమిని కలుషితం చేయకుండా పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత మేడారం జాతరకు వెళ్ళే ప్రతి భక్తుడి పై ఉందన్నారు.సంస్థ నిర్వాహకుడు రాజశేఖర్ మాట్లాడుతూ మేడారం జాతరకు వెళ్ళే భక్తులు ఇంటి దగ్గర నుండి ప్లాస్టిక్ రహిత వస్తువులను
తీసుకెళ్లి వాడుతూ,మేడారం అడవితల్లిని రక్షించాలని కోరారు.ఈకార్యక్రమంలో స్వయంకృషి స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు బెజ్జంకి ప్రభాకర్,గండిగిరి,సంస్థ సభ్యులు తంగెళ్ల రవికాంత్,రాముసేవక్, నాగుర్లపల్లె మాజీ సర్పంచ్ రాజహంస,లక్ష్మణ్,తదితరులు పాల్గొన్నారు.

మేడారం జాతరకు ప్రభుత్వ సెలవులు ప్రకటించండి……

మేడారం జాతరకు ప్రభుత్వ సెలవులు ప్రకటించండి…

మేడారం జాతర జరిగే మూడు రోజులు ప్రభుత్వ కార్యాలయాలకు, విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించాలి.

తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ డిమాండ్

కుటుంబ సమేతంగా వెళ్లాల్సిన జాతర కాబట్టి పిల్లల సెలవులకై నిరీక్షణ

ఇది కేవలం ఆధ్యాత్మిక ఉత్సవం మాత్రమే కాదు, గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక కూడా

విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు తెలంగాణ సంస్కృతిని అర్థం చేసుకునే గొప్ప అవకాశం

కేసముద్రం/ నేటి ధాత్రి

 

మేడారం జాతరకు సెలవులు మూడు రోజులు ప్రకటించాలని కోరుతూ టిపిటిఎఫ్ మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ నేతృత్వంలో కేసముద్రం గ్రామ ప్రాథమిక పాఠశాలలో , ప్రధాన కార్యదర్శి నరసింహ రాజు నేతృత్వంలో అర్పణపల్లి పాఠశాలలో మధ్యాహ్నం భోజన సమయంలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు సురేందర్ మాట్లాడుతూ ములుగు జిల్లాలో జరిగే మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరను ప్రపంచంలో రెండవ అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తించారనీ, ఈ జాతరలో గత సంవత్సరాల గణాంకాల ప్రకారం లక్షలాది మంది భక్తులు తెలంగాణ వ్యాప్తంగా మాత్రమే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా వచ్చి దర్శించుకున్నారని గుర్తు చేశారు. ఇది కేవలం ఆధ్యాత్మిక ఉత్సవం మాత్రమే కాకుండా, గిరిజన సంప్రదాయాలకు ప్రధాన ప్రతీక అని, తెలంగాణ సంస్కృతికి మూల స్తంభం అని వివరించారు.
ఈ జాతర సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు, పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామీణ ప్రాంత ప్రజలు పెద్ద సంఖ్యలో దైవ దర్శనం చేసుకుంటారని అన్నారు. ఇప్పటివరకు అన్ని ప్రభుత్వాలు సమ్మక్క, సారక్క తల్లులు ఇద్దరు కొలువుదీరిన మరుసటి రోజును సెలవు దినంగా ప్రకటిస్తూ వస్తున్నాయని, దీనివల్ల ఆరోజే అందరూ
మేడారం జాతరకు వస్తూ ఉండడం వలన లక్షలాది మంది ప్రజలు పాల్గొనే కారణంగా ట్రాఫిక్ సమస్యలు, కష్టతర ప్రయాణం , వసతి సౌకర్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని, దర్శన సమయంలో కిక్కిరిసిన జనాభా వల్ల పిల్లలకు దర్శన భాగ్యం కూడా కలగట్లేదు అని అన్నారు. ఇది కుటుంబ సమేతంగా వెళ్లాల్సిన జాతర అనీ, పిల్లలకు సెలవులు ఇవ్వందే వాళ్ళు జాతరకు వెళ్ళరని, వారి సెలవులకై వేచి చూసి, సెలవులు ఇచ్చాక మాత్రమే జాతరకు తరలి వెళ్తారని అన్నారు. మూడు రోజులు సెలవులు ఉంటే పబ్లిక్ ఇంత పోటెత్తరని, జాతరను కూడా ఎంజాయ్ చేస్తారని, ఇది విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు తెలంగాణ సంస్కృతిని అర్థం చేసుకునే గొప్ప అవకాశం అని అన్నారు.
ఈ నెల 28న సారక్క తల్లి,29న సమ్మక్క తల్లి గద్దెల పైకి కొలువుదీరుతారని ,30న భక్తుల మొక్కులందుకొని తిరిగి 31న వన ప్రవేశం చేస్తారనే విషయం అందరికీ తెలిసిందేనన్నారు
కావున ప్రభుత్వం ప్రజా ఆకాంక్షను గౌరవించి మేడారం జాతర సందర్భంలో తల్లులు కొలువుదీరే ఈ మూడు రోజులు ప్రభుత్వ కార్యాలయాలకు మరియు విద్యాసంస్థలకు అధికారికంగా సెలవులు ప్రకటించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టి పి టి ఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి నరసింహ రాజు, కార్యదర్శులు వీసం నర్సయ్య, ఊటుకూరి ప్రణయ్ కుమార్, ఉపాధ్యాయులు అప్పాల నాగరాజు, నరసింహస్వామి, భూక్య శ్రీను, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

ఒకే రోజు మేడారం జాతర – బార్ కౌన్సిల్ ఎన్నికలు

మేడారం జాతర – బార్ కౌన్సిల్ ఎన్నికలు ఒకే రోజు!

న్యాయవాదుల్లో అయోమయం… వాయిదా వేయాలంటూ విజ్ఞప్తి

హైదరాబాద్, నేటిధాత్రి:

 

 

ఐదేండ్లకు ఒకసారి జరిగే తెలంగాణ హైకోర్టు బార్ కౌన్సిల్ ఎన్నికలు ఈ నెల జనవరి 30న జరగనున్నాయి. మొత్తం 209 నామినేషన్లు దాఖలు అయినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి నాగలక్ష్మి తెలిపారు. 25 మంది సభ్యులను ఎన్నుకోడానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 56,000 మంది న్యాయవాదులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మహిళలకు 30 శాతం రిజర్వేషన్ అమలు చేస్తూ ఐదుగురు మహిళా సభ్యులను ఎన్నుకోనున్నారు.

మేడారం జాతర వివరాలు.

రెండేళ్లకు ఒకసారి జాతీయ స్థాయిలో నిర్వహించే ఆదివాసీ జాతర అయిన మేడారం మహాజాతర రోజే తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలు (30జనవరి) జరగనుండటం న్యాయవాదుల్లో తీవ్ర అయోమయానికి దారి తీస్తోంది.

మేడారం జాతరలో 30 జనవరి శుక్రవారం రోజు గద్దెలపై అమ్మవార్లు దర్శనం, మొక్కు సమర్పణ ప్రధాన ఘట్టాలు జరుగుతాయి. లక్షలాది భక్తులు హాజరయ్యే ఈ ఆదివాసీ ఉత్సవం తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచింది.

మేడారం జాతరలో భాగంగా ఈ నెల 30వ తేదీన గద్దెలపై ఇద్దరు అమ్మవార్లు దర్శనమివ్వనుండగా, అదే రోజు భక్తులు మొక్కులు సమర్పించుకునే ప్రధాన ఘట్టం కూడా జరగనుంది. అయితే అదే తేదీన రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలు నిర్వహించనుండటంతో, జాతరకు వెళ్లాలనుకునే న్యాయవాదులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది.

జాతరకు వెళ్లలేకపోతున్న న్యాయవాదులు

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయవాదులు కుటుంబ సమేతంగా మేడారం జాతరకు వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు, జాతర ఒకే రోజు పడటంతో భక్తి – వృత్తి మధ్య ఎంపిక చేయాల్సిన పరిస్థితి వచ్చిందని న్యాయవాదులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నికలు వాయిదా వేయాలన్న డిమాండ్?

మేడారం జాతర ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని, బార్ కౌన్సిల్ ఎన్నికలను జాతర ముగిసిన అనంతరం నిర్వహించాలని పలువురు న్యాయవాదులు కోరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో న్యాయవాదులు జాతరకు హాజరయ్యే అవకాశం ఉన్నందున, ఎన్నికలు వాయిదా వేయడం సమంజసమని వారు అభిప్రాయపడుతున్నారు.

200 మందికి పైగా పోటీ?

ఈ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో సుమారు 200 మందికి పైగా అభ్యర్థులు పోటీ చేస్తున్నట్లు సమాచారం. కీలకమైన ఎన్నికల సందర్భంగా ఓ వైపు పవిత్ర ఆదివాసి జాతర, మరో వైపు ఎన్నికలు ఉండటంతో న్యాయవాదులు తీవ్ర సందిగ్ధంలో ఉన్నారు.

మేడారం మహాజాతరకు ఆటంకం కలగకుండా, న్యాయవాదుల మనోభావాలను గౌరవిస్తూ ఎన్నికల తేదీని పునఃపరిశీలించాలని బార్ కౌన్సిల్ అధికారులను వారు కోరుతున్నారు.

రామప్ప, లక్నవరంను అభివృద్ది చేస్తాం…

రామప్ప, లక్నవరంను అభివృద్ది చేస్తాం

#ములుగు నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి.

#పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ.

రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క.

ములుగు జిల్లా, నేటిధాత్రి:

 

 

 

రామప్ప, లక్నవరంను అభివృద్ది చేస్తూ, రాష్ట్రంలోనే ములుగు ప్రాంతాన్ని ప్రథమ స్థానంలో నిలపడానికి కృషి చేస్తున్నామని రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు.
సోమవారం ములుగు మండలం ఇంచెర్ల గ్రామములో 37 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఎకో ఎత్నిక్ విలేజ్, డెవలప్మెంట్ వర్క్స్ ఫౌండేషన్ స్టోన్ ను రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ తెలంగాణ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి,
అదనపు కలెక్టర్ రెవిన్యూ సి హెచ్ మహేందర్ జి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్ లతో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ములుగు నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి నిరంతరం కృషి చేస్తున్నానని, వివిధ ప్రాంతాల నుండి వచ్చే పర్యాటకులను ఆకర్షించే విధంగా పర్యాటక ప్రాంతాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. యూనిస్తో గుర్తింపు పొందిన రామప్ప, లక్నవరం, మేడారం సమ్మక్క సారలమ్మ, బోగత జలపాతం, బ్లాక్ బెర్రీ, దట్టమైన అటవీ ప్రాంతాలలో పర్యాటకులను ఆకర్షించే విధంగా ఇప్పటికే పలు రకాల పనులను పూర్తి చేయడం జరిగిందని, మిగతా పనులను త్వరతగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. జాతీయ రహదారికి సమీపంలో చేతివృత్తుల వారు వారి వృత్తి పనులను చేసుకొని అమ్మ కానికి వీలుగా 37 కోట్ల రూపాయలతో పర్యాటక స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడంతో పాటు హ్యాపీ థియేటర్ ను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. రామప్పలో 13 కోట్ల రూపాయలతో ఐర్లాండ్ పనులను చేపట్టడం జరుగుతుందని, ములుగు జిల్లాలో పర్యటక హబ్ గా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామని అన్నారు. లక్నవరంలో మరో రెండు ఐలాండ్ పనులను చేపట్టడమే కాకుండా పర్యాటక ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అదనపు నిధులను తీసుకురావడం జరిగిందని అన్నారు. సంవత్సరం జనవరి మాసంలో జరగనున్న మేడారం మహా జాతరను పురస్కరించుకొని మేడారం ప్రాంతంలో భక్తుల సౌకర్యం కోసం శ్వాశత పనులు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం 150 కోట్ల రూపాయలను కేటాయించిందని, వాటికి సంబంధించిన పనులను త్వరలోనే చేపట్టడం జరుగుతుందని అన్నారు.
మేడారం జాతరలోని జంపన్న వాగు పై భక్తులకు అనుకూలంగా ఐదు కోట్ల రూపాయలతో పనులు చేపట్టడం జరుగుతుందని వివరించారు.
రాష్ట్రంలోనే ములుగు ప్రాంతాన్ని అభివృద్ధిలో పర్యాటక ప్రాంతంగా కృషి చేస్తున్నామని అన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ తెలంగాణ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి సీతక్క ములుగు ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి రాష్ట్రం నుండి నిధులు తీసుకురావడమే కాకుండా కేంద్రం నుండి నిధులను తీసుకువచ్చి కృషి చేస్తున్నారని తెలిపారు. రానున్న రోజులలో ములుగు జిల్లాలు పూర్తిస్థాయిలో పర్యటక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో టూరిజం శాఖ అధికారి శివాజీ, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version