మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల కోసం భజన మండలి అనుమతికి వినతిపత్రం
జహీరాబాద్, నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి వారి దేవస్థానంలో జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భజన మండలి ప్రత్యేక కార్యక్రమాల కోసం అనుమతి కోరుతూ ఒక వినతిపత్రాన్ని దేవస్థాన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌కు అందజేశారు.తుమ్మన్ పల్లి గ్రామానికి చెందిన మల్లిపటిల్ సిద్ధారెడ్డి ఈ వినతిపత్రం ద్వారా తమ గ్రామంలోని “శివ శరన్నే – హేమరెడ్డి మల్లమ్మ” భజన బృందం ద్వారా శైవతత్వాన్ని ప్రతిబింబించే ఆధ్యాత్మిక–సాంప్రదాయ కళాప్రదర్శన నిర్వహించేందుకు ఆలయ ప్రాంగణంలో సమయాన్ని కేటాయించాలని కోరారు.భక్తులకు శైవభక్తి, సాంప్రదాయ కళలను చేరవేయాలనే ఉద్దేశంతో ఈ ప్రదర్శనను మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా నిర్వహించాలనుకుంటున్నట్లు తెలిపింది భజన మండలి. వినతిపత్రాన్ని స్వీకరించిన ఆలయ అధికారులు త్వరలో నిర్ణయం తెలియజేస్తామని వెల్లడించారు.
