మద్యం అమ్మితే 50వేలు
పట్టించిన వారికి 10 వేలు నజరానా
గ్రామ సభలో తీర్మానం.
నిజాంపేట, నేటి ధాత్రి:
గ్రామాల్లో బెల్ట్ షాపులపై ప్రజలు కదం తొక్కుతున్నారు. నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామసభ నిర్వహించి మద్యపాన నిషేధాన్ని తీర్మానం చేశారు. గ్రామంలో మద్యం అమ్మితే 50 వేలు జరిమానా, పట్టించిన వారికి 10 వేలు నజరానా అందజేస్తామని గ్రామంలో గ్రామ సర్పంచ్ నాతి అంజమ్మ లక్ష్మ గౌడ్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు, ఎవరైనా గ్రామంలో మద్యం అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి మమత, ఉపసర్పంచ్ దేవరాజ్, వార్డ్ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు
