పశువులకు గాలికుంటువ్యాధి నివారణ టీకాలు తప్పనిసరి…

పశువులకు గాలికుంటువ్యాధి నివారణ టీకాలు తప్పనిసరి

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద

*అవగాహన ప్రచార రథాన్ని ప్రారభించిన కలెక్టర్

నర్సంపేట/గీసుగొండ,నేటిధాత్రి:

రైతులు తమ పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు తప్పనిసరిగా వేయించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు.
గీసుకొండ మండలం దసరుతండా గ్రామపంచాయతీ పరిధిలోని దసరుతండా, మంగళతండా గ్రామాలలో ప్రజా పాలన–ప్రగతి 99 రోజుల ప్రణాళికలో భాగంగా గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం బుధవారం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ అమృత అధ్యక్షత వహించగా జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పాడి రైతులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ గాలికుంటు వ్యాధి వలన కలిగే నష్టాలు, పాడి పశువుల ప్రాధాన్యత మరియు వాటి ద్వారా మానవాళికి కలిగే లాభాలను వివరించారు.
జిల్లా పశువైద్య మరియు పశుసంవర్ధక శాఖాధికారి డాక్టర్ ఎం. బాలకృష్ణ మాట్లాడుతూ గాలికుంటు వ్యాధి లక్షణాలు మరియు నివారణపై సంక్షిప్తంగా వివరించి, ముందస్తు టీకాలే ఉత్తమ రక్షణ అని రైతులకు సూచించారు.ఈ సందర్భంగా గాలికుంటు వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.

ఈ రథం జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల్లో పర్యటిస్తూ రైతులకు అవగాహన కల్పించనుంది.ఈ శిబిరంలో పాడి పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వడంతో పాటు, లేగదూడలు మరియు పెద్ద పశువులకు పురుగుమందులు అందించారు. అదేవిధంగా రైతులకు 75 శాతం సబ్సిడీపై పశుగ్రాస విత్తనాలు పంపిణీ చేశారు.గాలికుంటు వ్యాధి పశువుల పాల ఉత్పత్తిని గణనీయంగా తగ్గించి, రైతులకు ఆర్థిక నష్టం కలిగించే ముఖ్యమైన వ్యాధి. ఈ వ్యాధి వైరస్ ద్వారా వ్యాపించి, ముఖ్యంగా సంకరజాతి పశువుల్లో ఎక్కువగా కనిపిస్తుందని. మార్చి, ఏప్రిల్, ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలల్లో ఈ వ్యాధి అధికంగా ప్రబలుతుంది.

వ్యాధి నివారణ కోసం పశువులకు ముందుగానే టీకాలు వేయించడం అత్యంత అవసరం. ఈ నేపథ్యంలో గాలికుంటు వ్యాధి నిరోధక ఉచిత టీకాల కార్యక్రమాన్ని మార్చి 10 నుండి ఏప్రిల్ 9, 2026 వరకు నిర్వహిస్తున్నారు. 2030 నాటికి తెలంగాణ రాష్ట్రాన్ని గాలికుంటు వ్యాధి రహిత ప్రాంతంగా ప్రకటించే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.ఈ కార్యక్రమంలో మొత్తం 115 పశువులకు టీకాలు అందించామని స్థానిక పశువైద్య అధికారి డాక్టర్ గైని శ్రీనివాస్ తెలిపారు.ఈ కార్యక్రమంలో గీసుకొండ పశువైద్య అధికారి డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, కొమ్మాల పశువైద్య అధికారి డాక్టర్ గైని శ్రీనివాస్, డాక్టర్ రాధిక, సిబ్బంది చిరంజీవి, సుమన్, చందు, జితేందర్, గోపాల మిత్రులు ఇస్మాయిల్, రమేష్, రైతులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

పశువులకు గాలికుంటు వ్యాధి నివారణకు చర్యలు…

పశువులకు గాలికుంటు వ్యాధి నివారణకు చర్యలు

సర్పంచ్ సుందిళ్ల రాజేశ్వరి

జైపూర్,నేటి ధాత్రి:

 

జైపూర్ మండలం గంగిపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ సుందిళ్ల రాజేశ్వరి నేతృత్యంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు ప్రారంభించినట్లు తెలిపారు.మంగళవారం గ్రామంలోని 270 పశువులకు పశు వైద్యులు టీకాలు వేశారు.ఈ సందర్భంగా పశు వైద్యులు వెంకటేష్ మాట్లాడుతూ.. పశువులలో నోటి,కాళ్లలో పుండ్లు,జ్వరం,మేత తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయని ఇది అంటూ వ్యాధి పాల ఉత్పత్తి కూడా 50% వరకు తగ్గుతుందని అన్నారు.పశువుల వ్యాధి నివారణ కొరకు ప్రభుత్వం సంవత్సరానికి రెండుసార్లు అంటే 6 నెలలకు ఒకసారి టీకాలు వేస్తుందని తెలిపారు.నాలుగు నెలల పైబడిన పశువులకు టీకాలు వేపించాలని,టీకాలు వేపించడం వల్ల పశువుల ఆరోగ్యం మెరుగుపడి పాల ఉత్పత్తి పెరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుందిళ్ల రాజేశ్వరి, పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ,పశు వైద్యులు వెంకటేష్,సిబ్బంది శృతి, మహబూబ్ అలీ,ప్రభాకర్, రైతులు సుందిళ్ల లచ్చయ్య, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

పశువులకు గర్భకోశ వ్యాధి టీకాలు..

పశువులకు గర్భకోశ వ్యాధి టీకాలు..

నిజాంపేట, నేటి ధాత్రి:

పశువులకు గర్భకోశ వ్యాధి టీకాలు పశుసంవర్ధక శాఖ సహకారంతో అందివ్వడం జరుగుతుందని మండల పశువైద్యాధికారి మణికుమార్ అన్నారు. నిజాంపేట మండలం నందిగామ గ్రామంలో గ్రామ సర్పంచ్ ఆకుల స్వప్న, రమేష్ ఆధ్వర్యంలో రైతుల పశువులకు టీకాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. లేగ దూడలు పుట్టిన 15 రోజుల నుండి ఆరు నెలల వరకు నట్టల నివారణ మందులు తాగించడం వల్ల లేగ దూడలు ఎదుగుతాయన్నారు. రైతులు ఉచిత పశు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు…

పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు

జిల్లా పశుసంవర్ధక శాఖఖ అధికారి డాక్టర్ కుమారస్వామి

భూపాలపల్లి నేటిధాత్రి

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 12 మండలాలకు చెందిన 69,427 ఆవు జాతి పశువులకు 62,758 గేద జాతి పశువులకు మొత్తం 1,32,185 పశువులకు ఈనెల 15 నుంచి నవంబర్ 14 వరకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను వేయనున్నట్లు జిల్లా పశుసంవర్ధక శాఖఖ అధికారి డాక్టర్ కుమారస్వామి ఆసోడా తెలిపారు. జిల్లాలో పనిచేస్తున్న పశు వైద్య వైద్య అధికారులు పశు వైద్య సిబ్బందితో మంగళవారం రోజున అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి టీకాల కార్యక్రమం గురించి రివ్యూ చేయడం జరిగినది. టీకాలు వేసేందుకు గాను 22 బృందాలను ఏర్పాటు చేశామని తెలియజేయడం జరిగింది. సెప్టెంబర్ 15వ తారీకు నుండి నవంబర్ 4వ తారీఖు వరకు మొత్తం 29258 తెల్లజాతి పశువులకు 34,902 నల్లజాతి పశువులకు మొత్తంగా 64,160 పశువులకు విజయవంతంగా గాలికుంటు టీకాలు వేయడం జరిగినది. దీనిలో భాగంగా 14387 రైతులు లబ్ధి పొందడం జరిగింది. రైతులకు పశుపోషకులకు మరొకసారి విన్నవించేది ఏమనగా మిగిలిన 10 రోజులలో అనగా నవంబర్ 15వ తారీకు వరకు జరిగే ఈ టీకాల ప్రోగ్రాంలో పశుసంవర్ధక శాఖ సిబ్బంది గ్రామాలకు వచ్చినప్పుడు వారికి సహకరించి మీకు సంబంధించిన అన్ని పశువులకు టీకాలు వేయించుకోవాలని అలాగే పశుపోషకులు ఈ కార్యక్రమంలో పూర్తిగా భాగస్వాగస్వామ్యం కావాలి. అలాగే ఈ గాలికుంటు వ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేయడం అయినది. జిల్లాలో పశుసంవర్ధక శాఖ మంత్రి ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ హాజరై ఈ కార్యక్రమంలో విజయవంతం చేయుచున్నందుకు పశుసంవర్ధక శాఖ తరఫున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. కావున ఈ గాలికుంటు వ్యాధి టీకాల కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి కుమారస్వామి సూచించడం జరిగింది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version