మద్యం అమ్మితే 50వేలు..

మద్యం అమ్మితే 50వేలు
పట్టించిన వారికి 10 వేలు నజరానా
గ్రామ సభలో తీర్మానం.

నిజాంపేట, నేటి ధాత్రి:

గ్రామాల్లో బెల్ట్ షాపులపై ప్రజలు కదం తొక్కుతున్నారు. నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామసభ నిర్వహించి మద్యపాన నిషేధాన్ని తీర్మానం చేశారు. గ్రామంలో మద్యం అమ్మితే 50 వేలు జరిమానా, పట్టించిన వారికి 10 వేలు నజరానా అందజేస్తామని గ్రామంలో గ్రామ సర్పంచ్ నాతి అంజమ్మ లక్ష్మ గౌడ్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు, ఎవరైనా గ్రామంలో మద్యం అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి మమత, ఉపసర్పంచ్ దేవరాజ్, వార్డ్ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు

సర్పంచ్ ఓట్ల లెక్కింపు వరకు బీరు షాపులు బందు చేయాలి…

సర్పంచ్ ఓట్ల లెక్కింపు వరకు బీరు షాపులు బందు చేయాలి

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురబి

వనపర్తి నేటిదాత్రి .

 

 

వనపర్తి జిల్లాలో ఈనెల 14వ తేదీన రెండో విడత గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా బీరు మద్యం దుకాణాలు బందు చేయిoచాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురబి అధికారులను ఆదేశించారు శుక్రవారం సాయంత్రం 5 గంటల తర్వాత ఎన్నికల ప్రచారం నిర్వహించడానికి అనుమతి లేదని జిల్లా కలెక్టర్ తెలిపారు.
2 విడత ఎన్నికలు జరిగే వనపర్తి, కొత్తకోట, మదనాపూర్, ఆత్మకూరు, అమరచింత ఐదు మండలాల పరిధిలో సాయంత్రం 5:00 గంటల గంటల వరకు మాత్రమే అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముగించాలని కోరారు ఆ తర్వాత ఎటువంటి బహిరంగ ప్రచారానికి అనుమతి ఉండదని తెలిపారు. ఇతర ప్రాంతల వారు ఉంటే వెళ్లిపోవాలని సూచించారు.
శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి డిసెంబర్ 14వ తేదీన పోలింగ్, ఓట్ల లెక్కింపు ముగిసే వరకు ఈ ప్రాంతాలలో అన్ని మద్యం దుకాణాలను మూసివేయాలని కోరారు పోలింగ్ కేంద్రాల పరిధిలో పోలీస్ 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. పోలింగ్ ముగిసిన అనంతరం, అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు మరియు ఫలితాల వెల్లడి జరుగుతుందని పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ హెచ్చరించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు అధికారులకు సహకరించాలని కోరారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version