గ్రేటర్ వరంగల్ మేయర్ సొంత డివిజన్‌లోనే అధ్వాన్న రోడ్డు..!
ఆరు నెలలుగా పట్టించుకోని మేయర్–అధికారులు?
మేడారం జాతర సందర్భంగా స్పందించాలంటున్న వాహనదారులు
వరంగల్, నేటిధాత్రి:
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న రోడ్డు పరిస్థితి నగర పాలన తీరుకు అద్దం పడుతోంది.నగర మేయర్ స్వయంగా ఎన్నికైన 29వ డివిజన్ పరిధిలోకి వచ్చే వరంగల్ పోతన నగర్ నుంచి హంటర్ రోడ్డుకు వెళ్లే మార్గం పూర్తిగా అధ్వాన్నంగా మారి, నిత్యం రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారింది.గత ఆరు నెలలుగా కొన్ని పత్రికల్లో ఈ రోడ్డు సమస్యపై వార్తలు వచ్చినప్పటికీ, నగర మేయర్ గానీ, మున్సిపల్ అధికారులు గానీ స్పందించకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.ముఖ్యంగా మేడారం మహాజాతర నేపథ్యంలో ఈ రోడ్డుమీదుగా భక్తులు, వాహనాలు భారీగా ప్రయాణించనున్న నేపథ్యంలో, ప్రమాదాలకు ఆస్కారం ఉందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కనీసం తాత్కాలికంగైనా మొరం పోసి రోడ్డు సరిచేసి, భక్తులకు మరియు వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రవాణా సజావుగా సాగేటట్లు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.“గ్రేటర్ వరంగల్ మేయర్ సొంత డివిజన్‌లోనే ఇలాంటి దయనీయ స్థితిలో రోడ్డు ఉంటే, మిగతా డివిజన్ల పరిస్థితి ఏమిటి?” అంటూ వాహనదారులు ప్రశ్నిస్తున్నారు.లక్షల రూపాయలు ఖర్చు చేసి విహారయాత్రలు, పర్యటనలకు వెళ్లే ప్రజాప్రతినిధులు, తమ సొంత డివిజన్‌లో కనీస రోడ్డు సౌకర్యాన్ని కూడా ఎందుకు పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నగర మేయర్ హోదాలో ఉండి తన డివిజన్ సమస్యలకే పరిష్కారం చూపలేని పరిస్థితి ఎందుకు ఏర్పడిందనివాహనదారులు నిలదీస్తున్నారు.నగర మేయర్ గానీ, మున్సిపల్ అధికారులు గానీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా స్పందించి తక్షణమేరోడ్డుమరమ్మతులులేదానిర్మాణపనులుచేపట్టాలని,లేకపోతేప్రజాగ్రహానికిగురికావాల్సివస్తుందనివాహనదారులుహెచ్చరిస్తున్నారు.ఇదిలా ఉండగా,ఈ రోడ్డు సమస్యపై పెద్ద పత్రికలు, ఛానెళ్లు అని చెప్పుకునే”కొందరు”మీడియాప్రతినిధులుఒక్కవార్తకూడారాయకపోవడంపలుఅనుమానాలకుతావిస్తోంది.మేయర్‌కుఅనుకూలంగా వ్యవహరిస్తూ వార్తలను పక్కన పెట్టారాఅనేసందేహాలువ్యక్తమవుతున్నాయి.అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ స్థానిక యువత రీల్స్ రూపొందించి సోషల్ మీడియాలో వైరల్చేస్తున్నా,ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందిస్తారో లేదో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.
