మహాశివరాత్రికి 10 ప్రత్యేక బస్సులు: ఆర్ఎం విజయ్ భాస్కర్…

మహాశివరాత్రికి 10 ప్రత్యేక బస్సులు: ఆర్ఎం విజయ్ భాస్కర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఝరాసంగం క్షేత్రానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం జహీరాబాద్ డిపో నుంచి 10 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్ఎం విజయ్ భాస్కర్ తెలిపారు. ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయని, భక్తుల రద్దీని బట్టి అదనపు బస్సులు కూడా నడుపుతామని ఆయన పేర్కొన్నారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రతి ఒక్క భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలతో రద్దీనిబట్టి బస్సులు నడుపుతామన్నారు,

బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించాలి…

బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం: అష్టతీర్థాల నిలయంగా, దక్షిణ కాశీగా పేరుగాంచిన ఝరాసంగం మండలంలోని కేతకి సంగమేశ్వర స్వామి మహాశివరాత్రి నవాహ్నిక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశాల మేరకు సంగారెడ్డి జడ్పీ సీఈవో జానకిరామ్, జహీరాబాద్ ఆర్డీఓ దేవుజా అధికారులను ఫిబ్రవరి 12 నుంచి 20 వరకు జరగనున్న ఉత్సవాల ఏర్పాట్లపై శనివారం ఎంపీడీవో సమావేశం మందిరంలో దేవస్థానం కార్యనిర్వహణ అధికారి శివరుద్రప్ప, జహీరాబాద్ డీఎస్పీ సైదా పలు శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ.. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్ సరఫరా, రవాణా సౌకర్యాలు, ఆర్టీసీ, సంస్కృతిక, వైద్యం, ఐసిడిఎస్, సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. జాతర ముగిసే వరకు అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. మహిళా భక్తులకు ప్రత్యేకంగా అధిక సంఖ్యలో తాత్కాలిక టాయిలెట్లు, స్నానాలకు అవసరమైనన్ని షవర్లు, మంచినీటి సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులతో కలిపి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలన్నారు. అధికారులందరూ భక్తి భావంతో సేవనందించాలన్నారు. దేవస్థానం వరకు వెళ్లే కనెక్టివ్ రోడ్లను మరమ్మతులు చేయించి గుంతలు పూడ్చాలని, అవసరమైన చోట సైన్‌బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, 108 అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచాలని తెలిపారు. అగ్నిప్రమాదాల నివారణకు దేవస్థానం పరిసరాల్లో అగ్నిమాపక పరికరాలు, సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని సూచించారు. భద్రతా పరంగా గుడి లోపల, బయట, ఆవరణలో, పార్కింగ్ ప్రాంతాల్లో పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని, సమావేశం అనంతరం అధికారులతో కలిసి ఆలయ పరిసరాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ డిఎల్పిఓ అమృత, తహసిల్దార్ భాస్కర్, ఎంపీడీవో మంజుల, సీఐ హనుమంతు మండల వైద్యాధికారి రమ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు,

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల కోసం భజన మండలి అనుమతికి వినతిపత్రం…

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల కోసం భజన మండలి అనుమతికి వినతిపత్రం

జహీరాబాద్, నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి వారి దేవస్థానంలో జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భజన మండలి ప్రత్యేక కార్యక్రమాల కోసం అనుమతి కోరుతూ ఒక వినతిపత్రాన్ని దేవస్థాన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌కు అందజేశారు.తుమ్మన్ పల్లి గ్రామానికి చెందిన మల్లిపటిల్ సిద్ధారెడ్డి ఈ వినతిపత్రం ద్వారా తమ గ్రామంలోని “శివ శరన్నే – హేమరెడ్డి మల్లమ్మ” భజన బృందం ద్వారా శైవతత్వాన్ని ప్రతిబింబించే ఆధ్యాత్మిక–సాంప్రదాయ కళాప్రదర్శన నిర్వహించేందుకు ఆలయ ప్రాంగణంలో సమయాన్ని కేటాయించాలని కోరారు.భక్తులకు శైవభక్తి, సాంప్రదాయ కళలను చేరవేయాలనే ఉద్దేశంతో ఈ ప్రదర్శనను మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా నిర్వహించాలనుకుంటున్నట్లు తెలిపింది భజన మండలి. వినతిపత్రాన్ని స్వీకరించిన ఆలయ అధికారులు త్వరలో నిర్ణయం తెలియజేస్తామని వెల్లడించారు.

ఎమ్మెల్సీ ఎన్నికలు,మహాశివరాత్రి జాతర నిర్వహణ

పటిష్టమైన ప్రణాళికతో, ప్రశాంత వాతావరణంలో ఎమ్మెల్సీ (MLC) ఎన్నికలు,మహాశివరాత్రి జాతర నిర్వహణ.

ఎన్నికల కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం అధికారులు,సిబ్బంది ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.

జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్

వేములవాడ నేటిధాత్రి

ఈనెల 27న జరగనున్న ఉపాధ్యాయ,పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ,25,26,27 తేదీల్లో జరుగు మహాశివరాత్రి జాతరకు సంబంధించి ఈరోజు వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో డిఎస్పి లు, సి.ఐ,ఆర్.ఐ,ఎస్.ఐలతో భద్రతాపరంగా చేయవలసిన ఏర్పాట్ల గురించి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్పి గారు మాట్లాడుతూ….ఈ నెల 27 తేదీన జరుగు ఎమ్మెల్సీ (MLC) ఎన్నికల సమయంలో పోలీసు అధికారులు ఎలక్షన్ ముందు,ఎలక్షన్ రోజు,ఎలక్షన్ తర్వాత, తీసుకోవలసిన చర్యల గురించి క్షుణ్ణంగా అవగాహన కలిగి ఉండాలని,పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలింగ్ కేంద్రాలపై పూర్తిగా అవగాహన కలిగి ఉండలని,ఎన్నికల సమయంలో పోలీసుల పాత్ర అత్యంత కీలకమని,పోలింగ్‌ ప్రక్రియ సజావుగా,నిష్పక్షపాతంగా సాగేందుకు వారు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అదికారులను ఎస్పి గారు ఆదేశించారు.

జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయ,పట్టభద్రుల పోలింగ్ కి సంబందించి 41 పోలింగ్ కేంద్రలో 23,347 మంది ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకుంటారని పోలింగ్ ప్రక్రియ మొదలైనప్పటి నుండి పూర్తి అయేంత వరకు పోలీస్ అధికారులు,సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలింగ్ ప్రక్రియ ముగిసిన తరువాత బ్యాలెట్ బాక్స్ లను పటిష్టమైన ఎస్కార్ట్ తో స్ట్రాంగ్ రూమ్ లకు తరలించవలసి ఉంటుందన్నారు.శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు ఎవరైనా పాల్పడిన ఎన్నికల నియమావళి ప్రకారం ప్రకారం చట్ట రీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

మహాశివరాత్రి జాతర సందర్భంగా పటిష్ట భద్రత..

ఈ నెల 25,26,27 తేదీల్లో జరుగు మహాశివరాత్రి జాతర సందర్భంగా పోలీస్ శాఖ తరుపున సుమారు 1500 పోలీస్ అధికారులు, సిబ్బంది తో పటిష్ట భద్రత ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.వివిధ ప్రాంతాల్లో బందోబస్తు లో ఉంటే అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ వివిధ శాఖల సమన్వయంతో సుదూర ప్రాంతాల నుండి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రశాంత వాతావరణంలో రాజన్న దర్శన అయ్యేలా చూడాలన్నారు. పట్టణంలో ప్రధాన కూడళ్ల వద్ద,పార్కింగ్ ప్రదేశాల్లో విధుల్లో ఉండే అధికారులు ,సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ట్రాఫిక్ నియంత్రణ చేయాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి,సి.ఐ లు, ఆర్.ఐ లు,ఎస్.ఐ లు, సిబ్బంది పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version