ములుగు మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా…

ములుగు మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా.

#అభివృద్ధి పనులకు ప్రజలు సహకరించాలి.

#ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొన్న….

#రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క.

ములుగు జిల్లా, నేటిధాత్రి :

 

నూతనంగా ఏర్పడిన ములుగు మున్సిపాలిటీనీ అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని, అభివృద్ధి పనులకు ప్రజలు సహకరించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం 99 రోజులు నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో శనివారం ములుగు మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో మంత్రి ధనసరి అనసూయ సీతక్క పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో ఇప్పటికే పలు అభివృద్ధి పనులు చేశామని, పలు అభివృద్ధి పనులకు ఇప్పటికే 15 కోట్ల రూపాయలతో టెండర్లు జరిగాయని తెలిపారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని, ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు వెంటనే ఇండ్ల నిర్మాణం చేపట్టాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ములుగు మున్సిపాలిటీ చైర్మన్ చింతనిప్పుల చంద్రకళ బిక్షపతి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగకల్యాణి, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఆసియా షాహిన్ రియాజ్ మీర్జా, 5వ వార్డు కౌన్సిలర్ గుగ్గిళ్ళ దివ్య సుజన్, వార్డుల కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అవినీతి కట్టడితో ప్రజాధనాన్ని సద్వినియోగం చేస్తున్నాం..

అవినీతి కట్టడితో ప్రజాధనాన్ని సద్వినియోగం చేస్తున్నాం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

 

గత 11 ఏళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందిందని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు. అవినీతి కట్టడితో ప్రభుత్వం.. ప్రజాధనాన్ని సద్వినియోగం చేస్తోందన్నారు. ఇవాళ ఉభయసభల్ని ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగంలో పలు కీలక విషయాలు ఉన్నాయి.

న్యూ ఢిల్లీ, జనవరి 28: 2026 పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలి రోజైన ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయసభల్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి.. దేశం వికసిత్ భారత్‌ వైపు పయనిస్తోందని చెప్పారు. పేదల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, గత పదేళ్లలో పేదల కోసం 4కోట్ల ఇళ్లు కట్టించామని, జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామాలకు తాగునీరు అందిస్తున్నామని రాష్ట్రపతి తెలిపారు.
‘పదేళ్లలో 25కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చాం. సామాజిక న్యాయం ప్రాతిపదికన కేంద్రం పనిచేస్తోంది. వందేభారత్, అమృత్ భారత్ రైళ్ల ద్వారా సేవలు విస్తరించాం. ప్రతి పౌరుడికి జీవిత బీమా కల్పించడం ప్రభుత్వ లక్ష్యం. ఆయుష్మాన్ భారత్‌తో కోట్లమందికి వైద్యసేవలందిస్తున్నాం. వరి ఉత్పత్తిలో ప్రపంచంలోనే భారత్ నెం1 స్థానంలో నిలిచింది. అక్వా, పాల ఉత్పత్తుల్లో భారత్ ముందంజలో ఉంది’ అని రాష్ట్రపతి వెల్లడించారు.

దేశంలో స్పేస్ టూరిజం అభివృద్ధికి ఎన్నో అవకాశాలున్నాయని రాష్ట్రపతి అన్నారు. భవిష్యత్‌లో అంతరిక్షంలో భారత స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని, జమ్మూకశ్మీర్‌లో అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి నిర్మించామని గుర్తు చేశారు. గత 11 ఏళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందిందని రాష్ట్రపతి చెప్పారు.

ఇంకా రాష్ట్రపతి తన ప్రసంగంలో ఏమన్నారంటే.. ‘అవినీతి కట్టడితో ప్రభుత్వ ప్రజాధనాన్ని సద్వినియోగం చేస్తోంది. GST స్లాబ్‌ల తగ్గింపుతో దేశ ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది. యూరోపియన్ యూనియన్‌తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నాం. రూ.12లక్షల వార్షిక ఆదాయం వరకు ఆదాయపు పన్ను లేకుండా చేశాం. స్మార్ట్‌ఫోన్ల ఎగుమతుల్లోనూ భారత్ దూసుకెళ్తోంది. భారత్ పవర్ టెక్నాలజీ హబ్‌గా రూపొందుతోంది. గ్రీన్ ఎనర్జీ రంగంలో భారత్‌ను పవర్ హౌస్‌గా తయారు చేస్తున్నాం. భవిష్యత్‌లో 100 గిగావాట్ల న్యూక్లియర్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యం. 500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి చర్యలు. వికసిత్

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్…

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్

రాజ్యాంగ విలువలతో సమగ్ర అభివృద్ధే లక్ష్యమని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ.

భూపాలపల్లి నేటిధాత్రి

 

సోమవారం జిల్లా కేంద్రంలోని డా బిఆర్ అంబేద్కర్ క్రీడా మైదానంలో నిర్వహించిన
77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ ముందుగా పోలీసులు, సాయుధ దళాలు, ఎన్ సీసీ గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికీ జిల్లా కలెక్టర్ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1950 జనవరి 26న భారతదేశం స్వతంత్ర, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించిన సందర్భంగా ఈ రోజును పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నామని పేర్కొన్నారు.
మన రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, రాజ్యాంగ సభ సభ్యుల కృషి అభినందనీయమని, ప్రతి భారతీయుడికి సమాన హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం కల్పించే గొప్ప రాజ్యాంగం మనదని కలెక్టర్ అన్నారు. స్వాతంత్ర్య సాధనలో ప్రాణత్యాగాలు చేసిన మహనీయులను స్మరించుకుంటూ, జిల్లా అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం మహిళల జీవితాల్లో కీలక మార్పుకు దారితీసిందని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు కోటి 85 లక్షల 97 వేల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేయగా, రూ.97 కోట్ల 43 లక్షలు మహిళలకు ఆదా అయిందన్నారు.

వైద్య ఆరోగ్య సేవలు

పేదలకు భరోసా

రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్య బీమా పరిమితిని ప్రభుత్వం 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచినట్లు తెలిపారు. జిల్లాలో 39,605 మంది ఈ పథకం ద్వారా వైద్య సేవలు పొందగా, రూ.88 కోట్ల 13 లక్షలు ఖర్చు చేసినట్లు వెల్లడించారు.
ఔషధి ద్వారా 1,03,402 మందికి వైద్య సేవలు, 5,690 మంది మహిళలకు ఆరోగ్య మహిళా క్యాంపులు, 65 పల్లె దవాఖానాలు ఏర్పాటు చేశామని తెలిపారు. మహాదేవపూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో డయాలసిస్ సేవలు అందిస్తున్నట్లు చెప్పారు.

రైతు బరోసా పథకం ద్వారా ప్రతి సీజన్‌కు ఎకరాకు రూ.6 వేలు పెట్టుబడి సాయం అందిస్తున్నామని తెలిపారు. జిల్లాలోని 1,24,496 మంది రైతులకు రూ.96 కోట్లు చెల్లించామని చెప్పారు.రైతుల ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు రూ.2 లక్షల రుణమాఫీ, రైతు బీమా పథకంలో 72,058 మంది నమోదు చేసినట్లు తెలిపారు.

జిల్లాలో వ్యవసాయంతో పాటు అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్తు సరఫరా చేస్తున్నామని తెలిపారు. 46,840 ఉచిత వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు, గృహాజ్యోతి పథకం ద్వారా 56,525 కుటుంబాలకు రూ.37 కోట్ల 42 లక్షలు ప్రభుత్వమే సబ్సిడీ చెల్లించినట్లు పేర్కొన్నారు.

నిరుపేదలకు గౌరవ నివాసం ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద జిల్లాలో 3,943 ఇండ్లు మంజూరు, 3,180 ఇండ్లకు మార్క్ అవుట్ ఇచ్చామని, ఇప్పటి వరకు రూ.51 కోట్ల 40 లక్షలు విడుదల చేశామని తెలిపారు.

పేదలకు వరం
మహాలక్ష్మి గ్యాస్ పథకం, ఈ పథకం ద్వారా 68,311 మందికి రూ.500కే గ్యాస్ ఇస్తున్నామని ఇప్పటి వరకు 2,36,243 సిలిండర్లు సరఫరా చేసి రూ.6 కోట్ల 55 లక్షల సబ్సిడీ చెల్లించినట్లు తెలిపారు.

277 రేషన్ దుకాణాల ద్వారా 1,37,950 కార్డుదారులకు బియ్యం సరఫరా చేస్తున్నామని తెలిపారు. వానాకాలం పంట ద్వారా 1,15,853 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ.274 కోట్లు చెల్లించామని, సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తున్నట్లు తెలిపారు. సమ్మక్క–సారక్క మహిళా జిల్లా సమాఖ్యలో 87,134 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారని తెలిపారు. బ్యాంకు లింకేజి ద్వారా ఇప్పటి వరకు రూ.240 కోట్లకు పైగా రుణాలు, 1,17,220 ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసినట్లు చెప్పారు.

భూపాలపల్లి మున్సిపాల్టీలో రూ.113 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని, పట్టణ మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజి, వ్యక్తిగత రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు.
మారుమూల గ్రామాలు, నిరుపేదల సమగ్రాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి, పార్లమెంట్, శాసన మండలి, శాసన సభ్యులకు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు, జిల్లా ప్రజలకు, ప్రభుత్వ యంత్రాంగానికి, మీడియా మిత్రులకు జిల్లా కలెక్టర్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
అనంతరం పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. తదుపరి ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంషా పత్రాలు అందచేశారు. అనంతరం వివిధ శాఖల అధికారులు ఏర్పాటు చేసిన స్టాళ్లు పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో ఎస్పి సిరిశెట్టి సంకీర్త్, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు,
అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, గ్రంధాలయ సంస్థ చైర్మన్ రాజబాబు, ఆర్డిఓ బాలకృష్ణ, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష

గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు చేయాలి

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు.
బుధవారం ఐడిఓసి కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డా బిఆర్ అంబేద్కర్ క్రీడా మైదానంలో జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలకు మైదానం పూర్తిగా పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆహూతులు సౌకర్యవంతంగా కూర్చునేందుకు షామియానాలు, కుర్చీలు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు.
ప్రజలకు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పించే విధంగా సింగరేణి, విద్యా, డిఆర్‌డీఓ, గృహ నిర్మాణ, సంక్షేమ, వ్యవసాయ, ఉద్యాన, వైద్య శాఖల అధికారులు స్టాళ్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. అలాగే గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాఠశాలల విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని విద్యా శాఖ అధికారిని ఆదేశించారు.
ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతిబింబించే ప్రసంగ పాఠాన్ని సిద్ధం చేయాలని డిపిఆర్‌ఓను కలెక్టర్ ఆదేశించారు. గణతంత్ర దినోత్సవ వేడుకలు విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఈ సందర్భంగా సూచించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఏఎస్పి నరేష్ కుమార్, ఆర్డిఓ హరికృష్ణ, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవం చేసిన నాయకులు

ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవం చేసిన నాయకులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాతకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమంలో భాగంగా,సోమవారం ఝరాసంగం మండలం పరిధిలో కక్కర్ వాడ గ్రామ లో తాటిపల్లి నాగమణి మహిపాల్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్లు గృహ ప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్య అతిథులు గా పాల్గొన్నారు.ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు సకాలంలో ఇల్లు పూర్తి చేసుకొని ఇలాంటి మంచి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం తరపున కోరుకుంటున్నాము అన్నారు.

ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మన ప్రజా ప్రభుత్వం మరిన్ని మంచి కార్యక్రమాలు నిర్వహింస్తోంది. ప్రజలు అందరూ సద్వినియగం చేసుకోవాలని కోరుకుంటున్నాము అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ హన్మంత్ రావు పాటిల్ కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ జిల్లా మాజీ అధ్యక్షులు ఉదయ్ శంకర్ పాటిల్ నాయకులు మారుతి రావు సంగ్రామ్ పాటిల్ డప్పురు సంగన్న రాజ్ కుమార్ స్వామి గ్రామ యువ నాయకులు శ్రీకాంత్ రెడ్డి గోపాల్ రెడ్డి మాజీ ఎం పి టిసి నర్సిములు.అడ్వకేట్ షకీల్ సర్ శ్రీనివాసరెడ్డి రాంరెడ్డి పెన్ గన్ ఎడిటర్ రాయికోటి నర్సింలు.యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చింతలగట్టు శివరాజ్ మండల సోషల్ మీడియా ఇంచార్జి నవీన్ సుభాష్,మాణయ్య ఇస్మాయిల్ తధీతరులు పాల్గోని మహిపాల్రెడ్డికి శుభకాంక్షలు తెలియజేసారు 

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version