ఓంకార్ బాటలో పయనిద్దాం: ఎంసీపీఐ(యు) జిల్లా కార్యదర్శి రమేష్

ఓంకార్ బాటలో పయనిద్దాం: ఎంసీపీఐ(యు) జిల్లా కార్యదర్శి రమేష్

నర్సంపేట, నేటిధాత్రి:

https://www.youtube.com/live/NVKn6LK99Oc?si=nYqwNtvDwcnRbt1Q

ప్రజా ఉద్యమ నేత కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ త్యాగాలను స్మరిస్తూ ఆయన బాటలో పయనించాలని ఎంసీపీఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ పిలుపునిచ్చారు. శుక్రవారం మాదన్నపేటలో గ్రామ కార్యదర్శి అనుమల రమేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కులవర్గ పునాదులను కూకటివేళ్లతో పెకిలించి సామాజిక వర్గ పోరాటాలను ఉద్ధృతం చేసి బలహీన వర్గాలకు రాజ్యాధికారమే ధ్యేయంగా ఓంకార్ త్యాగం చేశారని తెలిపారు. చట్టసభల్లో ప్రజా సమస్యలపై ఓంకార్ గళమెత్తిన తీరు నేటి ప్రజాప్రతినిధులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఓంకార్ శతజయంతి ముగింపు బహిరంగ సభను ఈ నెల 12న నర్సంపేట సిటిజన్ క్లబ్ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్నామని చెప్పారు. సభకు వామపక్ష పార్టీలనం, ప్రజాసంఘాల నాయకులు హాజరవుతున్నారని, ప్రజలు వేలాదిగా తరలిరావాలని కోరారు. ఈసమావేశంలో డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి, జిల్లా కమిటీ సభ్యులు కేశెట్టి సదానందం, గుర్రం రవి, ఆకుల రాజేందర్, కేశెట్టి శ్రీను, దా రాజయ్య, ప్రసాద్, చంద్రమౌళి, వక్కల రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.

బి ఆర్ ఎస్ యూత్ నాయకుల ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ…

బి ఆర్ ఎస్ యూత్ నాయకుల ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

బి ఆర్ ఎస్ పార్టీ యూత్ నాయకులు బాలసాని పవన్ కుమార్ జన్మదిన సందర్భంగా. గ్రామంలోని ఉపాధి పనులు చేస్తున్న ఉపాధి హామీ కూలీలకు మరియు హమాలీలకు. పవన్ కుమార్ జన్మదిన సందర్భంగా సర్పంచ్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలకు తమ వంతు గా. వేసవికాలం సందర్భంగా. ఉపాధి హామీ కూలీలకు అలసటకు గురికాకుండా ఎండ తీవ్రత ఎక్కువ ఉన్న సందర్భంగా ఎండ వేడిమికి గురికాకుండా. తట్టుకునే విధంగా తమ వంతుగా మజ్జిక ప్యాకెట్స్. తంసప్లు. అందజేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు సోమ పరిసరాములు. నాయకులు యూత్ నాయకులు ఉపాధి హామీ కూలీలు హమాలీలు తదితరులు పాల్గొన్నారు.

ఎపి సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ ఫొటోను పచ్చ బొట్టును

ఎపి సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ ఫొటోను పచ్చ బొట్టును

ఎదపై వ్రాసుకున్నా తెలుగుదేశం పార్టీ అభిమాని

వనపర్తి నేటీదాత్రి .

వనపర్తి నియోజకవర్గం ఖిల్లా గణపురం మండలం బండారి యాదయ్య మాజీ ఉపసర్పంచ్ ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంత్రి నారా లోకేష్ ఫోటోను చిహ్నాన్ని ఎదలపై పచ్చబొట్టు రాసుకున్నారు వారిపై ఉన్న అభిమానాన్ని నిరూపించు కున్నారు వనపర్తి నియోజకవర్గం సామాన్య తెలుగుదేశం పార్టీ కార్యకర్త పచ్చ బొట్టు తో యదపై వ్రాసుకున్న.దుకు యాదయ్య ను టి టి డి మాజీ బోర్డు మెంబర్ షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహుములు వనపర్తి జిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత
కొత్తగొల్ల శంకర్ అభినందించారు

కారు, స్కూల్ బస్సు డికొని ప్రభుత్వ వైద్యుడు విజయ్ కుమార్ మృతి.

కారు, స్కూల్ బస్సు డికొని ప్రభుత్వ వైద్యుడు విజయ్ కుమార్ మృతి.

కల్వకుర్తి / నేటి ధాత్రి :

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి సమీపంలో జడ్చర్ల కోదాడ జాతీయ రహదారిపై సీబీయం కాలేజీ దగ్గర శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు ప్రైవేట్ స్కూల్ బస్సు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ విజయ్ కుమార్ మృతిచెందాడు. తలకు,గుండె పక్క భాగంలో తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు డాక్టర్లు తీవ్ర ప్రయత్నం చేసినప్పటికి బ్రతికించలేక పోయారు. డాక్టర్ విజయ్ కుమార్ స్వస్థలం కొల్లాపూర్ వృత్తిరీత్యా కల్వకుర్తిలో స్థిరపడ్డారు ఆయన భార్య కల్వకుర్తి మండలం రఘుపతి పేట పీహెచ్సీలో వైద్య ర్యాలీగా పని చేస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మహిళల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ అనవసర ఆపరేషన్లకు బదులుగా నార్మల్ డెలివరీ లను ప్రాధాన్యం ఇచ్చేవారని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. కల్వకుర్తి మాత్రమే కాకుండా కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా వందలాది ప్రసవాలు నిర్వహించి మంచి పేరు సంపాదించుకున్నారు. ఆయన పార్థివ దేహాన్ని కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ప్రజలు భారీగా తరలివచ్చి కన్నీటి నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రాణాలను కాపాడే చేతులు ఈరోజు నిశ్శబ్దంగా మారిపోయాయి ఎంతోమందికి జీవం పోసిన వైద్యుడు తానే ఇలా అకస్మాత్తుగా దూరమవ్వడం విధి ఎంత క్రూరమో చూపించిందన్నారు . ప్రభుత్వ ప్రైవేటు వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది, ప్రజా ప్రతినిధులు , రోగులు పెద్ద సంఖ్యలో చేరుకొని నివాళులర్పించారు. ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణం అంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. జాతీయ రహదారులపై అతివేగం కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ, సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

25వ వార్డులో మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఆకస్మిక తనిఖీ

25వ వార్డులో మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఆకస్మిక తనిఖీ

నర్సంపేట, నేటిధాత్రి:

మున్సిపల్ ఛైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్ శుక్రవారం 25వ వార్డు పరిధిలోని ద్వారకపేట రోడ్, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఏరియాల్లో పర్యటించారు.ఈ సందర్భంగా ప్రైవేట్ హాస్టల్స్, హాస్పిటల్స్, వాణిజ్య దుకాణాల పరిసరాలను పరిశీలించారు. హాస్టల్ యజమానులు, హాస్పిటల్ సిబ్బంది చెత్తాచెదారాన్ని రోడ్లపై, డ్రైనేజీ కాలువల్లో వేయవద్దని సూచించారు. చెత్తను పోగుచేసి మున్సిపల్ వాహనాలకు అందించాలని కోరారు. హాస్పిటల్స్ నుంచి వచ్చే బయో మెడికల్ వేస్ట్, హాస్టల్స్ నుంచి వచ్చే ఘన వ్యర్థాలు రోడ్లపై వేయడం వల్ల ప్రజారోగ్యం దెబ్బతింటుందన్నారు. పారిశుద్ధ్యం పట్ల నిర్లక్ష్యం వహించవద్దని మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు. అనంతరం వాటర్ పైప్‌లైన్ లీకేజీ పనులను పరిశీలించి, వెంటనే మరమ్మతులు పూర్తిచేసి నీటి సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.ఈకార్యక్రమంలో వార్డు జవాన్ గోపగాని ప్రభాకర్, వాటర్‌లైన్ ఇన్‌ఛార్జ్ నాతి రాజు, వార్డు యూత్ నాయకులు నల్గొండ వంశీ, స్వామిశెట్టి ప్రభాకర్, స్వామిశెట్టి శేఖర్, ముద్రబోయిన రాజు, మాదాసి వెంకన్న, చీకటి విజయ్, రాజీర్, చీకటి శివమణి తదితరులు పాల్గొన్నారు.

కొనుగోలు కేంద్రాలా..? దళారుల అడ్డాలా..

కొనుగోలు కేంద్రాలా..? దళారుల అడ్డాలా..?

రైతు చెమటకు ధర లేక… దళారుల దందాకు అడ్డుకట్ట లేక..!
రైతులకు నియమాలు… దళారికి ప్రత్యేక సౌకర్యాలా..?
రైతులకే లేని .. గోనె సంచులు ? మరి దళారికి ఎక్కడి నుంచి వస్తున్నాయి..?

అయినవోలు మండలంలో మొక్కజొన్న – వరి కొనుగోళ్లలో బయటపడుతున్న అక్రమాల కథ

నేటి ధాత్రి అయినవోలు :-

 

హనుమకొండ జిల్లా అయినవోలు మండలంలో రైతుల కోసం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు ఇప్పుడు రైతులకే శాపంగా మారుతున్నాయనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వానికి పంట అమ్మితే మద్దతు ధర వస్తుందనే ఆశతో కేంద్రాలకు వస్తున్న రైతులు… గోనె సంచుల కొరత, తూకాల ఆలస్యం, “ఆన్లైన్ సైట్ పని చేయడం లేదు” అనే సాకులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా నెలల తరబడి పడిగాపులు కాస్తున్నారు. ఇదే పరిస్థితిని అవకాశంగా మార్చుకున్న దళారులు మాత్రం అధికారులతో కుమ్మక్కై కోట్ల రూపాయల వ్యాపారం సాగిస్తున్నారనే ఆరోపణలు ఇప్పుడు బహిరంగ చర్చకు దారితీశాయి.

రైతుకు నియమాలు… దళారికి ప్రత్యేక సౌకర్యాలా..?

సాధారణ రైతు తన పంటను కొనుగోలు కేంద్రానికి తీసుకువస్తే “సర్వర్ లేదు”, “గోనె సంచులు లేవు”, “మ్యాచర్ రాలేదు”, “తూకం రేపు వేస్తాం” అంటూ రోజుల తరబడి వేచి పెట్టిస్తున్న అధికారులు… అదే సమయంలో కొందరు దళారుల ధాన్యాన్ని మాత్రం గంటల వ్యవధిలోనే తూకం వేసి లారీల్లో గోదాములకు తరలిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అయినవోలు మండలంలోని పలు కొనుగోలు కేంద్రాల్లో దళారుల హవా బహిరంగంగానే కొనసాగుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మండల కేంద్రంలోని ఒంటి మామిడిపల్లి సమీపంలో ఉన్న కొనుగోలు కేంద్రంలో పది నుంచి పదిహేను మంది దళారులు గుంపుగా ఏర్పడి, కొందరు అబ్జర్వర్లు మరియు అధికారులను తమ ప్రభావంలో పెట్టుకొని భారీ స్థాయిలో ధాన్యం కొనుగోలు చేస్తున్నారనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి.

గోనె సంచులు రైతులకే లేవా..? మరి దళారికి ఎక్కడి నుంచి వస్తున్నాయి..?

రైతు ధాన్యం కొనుగోలు చేయడానికి గోనె సంచులు లేవని చెప్పే అధికారులు… దళారులకు మాత్రం రహస్యంగా పెద్ద ఎత్తున సంచులు ఎలా అందుతున్నాయన్న ప్రశ్న ఇప్పుడు మండలవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఆరువేళలా పొలంలో కష్టపడి పంట పండించిన రైతు ఒక తూకం కోసం రోజుల తరబడి తిరగాల్సి వస్తుంటే… దళారుల ధాన్యం మాత్రం వరుసగా లారీల్లో లోడ్ అవుతూ గోదాములకు చేరుతోంది. ఇది సాధారణ వ్యవహారమా..? లేక అధికారుల సహకారంతో జరుగుతున్న అక్రమమా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కొంతమంది ఉద్యోగులు కావాలనే కొనుగోళ్లను ఆలస్యం చేసి, రైతులను విసిగించి, చివరకు దళారుల చేతుల్లోకి నెట్టేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రైతులు ప్రభుత్వ ధర కోసం ఎదురు చూస్తుండగానే, దళారులు తక్కువ ధరకే ధాన్యం కొనుగోలు చేసి భారీ లాభాలు ఆర్జిస్తున్నారని చెబుతున్నారు.
“పంట పండించేది రైతే… కానీ కొనుగోలు విషయంలో మాత్రం రైతునే ఇబ్బందులు పెట్టడం ఎందుకు..?” అని ప్రశ్నిస్తున్నారు.

అధికార పార్టీ పేరు చెప్పి ఒత్తిళ్లు..?

కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న అవకతవకలను ప్రశ్నించిన రైతులకు కొందరు “అధికార పార్టీ నాయకులు చెప్పిందే జరుగుతుంది” అంటూ సమాధానం ఇస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో అధికారులు నిజంగా ప్రభుత్వ నిబంధనలు అమలు చేస్తున్నారా..? లేక కొందరి ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రైతు కష్టానికి న్యాయం ఎప్పుడు..?

ఒకవైపు ప్రకృతి అనిశ్చితి… మరోవైపు పెట్టుబడి భారాలు… ఇవన్నీ తట్టుకుని రైతు పంట పండిస్తే, చివరకు కొనుగోలు కేంద్రాల వద్ద అవమానాలు, నిర్లక్ష్యం, ఆలస్యం ఎదురవుతుండటం బాధాకరం.

రైతు కళ్లలో ఆనందం కనిపించాల్సిన కొనుగోలు కేంద్రాలు… ఇప్పుడు కన్నీటి కేంద్రాలుగా మారుతున్నాయి. ప్రభుత్వ కొనుగోలు వ్యవస్థపై రైతుల్లో నమ్మకం కోల్పోతే, దాని లాభం పూర్తిగా దళారులకే దక్కుతుంది.

వెంటనే విచారణ అవసరం

అయినవోలు మండలంలోని మొక్కజొన్న, వరి కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న వ్యవహారాలపై జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే ప్రత్యేక విచారణ చేపట్టాలి.

గోనె సంచుల సరఫరాపై ఆడిట్ నిర్వహించాలి

కొనుగోలు ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా చేయాలి

దళారుల జోక్యాన్ని అరికట్టాలి

రైతుల ధాన్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి

నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి
లేకపోతే “రైతు ప్రభుత్వం” అనే మాటలు కేవలం ప్రకటనలకే పరిమితమవుతాయి. రైతు చెమటను గౌరవించని వ్యవస్థ… చివరకు రైతు కోపాన్ని ఎదుర్కోక తప్పదు.

దుగ్గొండిలో పలు వివాహాలకు హాజరైన మాజీ ఎమ్మెల్యే పెద్ది…

దుగ్గొండిలో పలు వివాహాలకు హాజరైన మాజీ ఎమ్మెల్యే పెద్ది

దుగ్గొండి, నేటిధాత్రి:

 

నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలంలో శుక్రవారం జరిగిన పలు వివాహ మహోత్సవాలకు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.చలపర్తి గ్రామ బీఆర్ఎస్ నాయకులు నల్ల కమలాకర్ రెడ్డి – పద్మ దంపతుల కుమార్తె ప్రమోదిక రెడ్డి – అజయ్ రెడ్డి వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. మండల బీఆర్ఎస్ నాయకులు బాలే మల్లేశ్ కుమార్తె బ్రశాంతి – కుషాల్ వివాహం కనిష్క ఫంక్షన్ హాల్‌లో జరగగా, తోగర్రాయి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు తుమ్మలపల్లి శ్రీనివాస్ కుమార్తె సౌమ్య – రాకేశ్ వివాహానికి, తోటకూరి శ్రీనివాస్ కుమార్తె రేష్మ – రాజకుమార్ వివాహం గిర్నిబావిలోని వందన గార్డెన్‌లో జరగగా ఆయా వివాహ మహోత్సవాల్లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.అలాగే రేఖంపల్లి గ్రామ మాజీ సర్పంచ్ మంద శ్రీనివాస్ – సునీత దంపతుల కుమారుడు తేజ – పూజా వివాహ వేడుకకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమాల్లో మాజీ జడ్పీ వైస్ ఛైర్మన్ ఆకుల శ్రీనివాస్,మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పొన్నం మొగిలి,నియోజకవర్గ కోఆర్డినేటర్ తక్కల్లపల్లి రవీందర్ రావు, మండల పార్టీ అధ్యక్షుడు సుకినే రాజేశ్వర్ రావు, నియోజకవర్గ యూత్ కన్వీనర్ శానబోయిన రాజ్ కుమార్, మాజీ ఎంపీపీ కాట్ల కోమల భద్రయ్య,మండల పార్టీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, క్లస్టర్ బాధ్యులు, సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు పిండి కుమారస్వామి, మాజీ సర్పంచ్‌లు, గ్రామ పార్టీ అధ్యక్షులు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

నేడే అంతర్జాతీయ మాతృదినోత్సవం..

నేడే అంతర్జాతీయ మాతృదినోత్సవం

కనుపాపకు వెలుగు… మనసుకి ప్రాణం అమ్మ

పోగు అశోక్ సైకాలజిస్ట్ & మోటివేషనల్ స్పీకర్

శాయంపేట నేటిధాత్రి:

 

మే రెండవ ఆదివారం రోజున అంతర్జాతీయ మాతృ దినో త్సవాన్ని ఘనంగా నిర్వ హిస్తారు మాతృ దినోత్సవ సందర్భంగాఅమ్మ అనే రెండక్షరాల పదం వెనుక అనంతమైన సృష్టి రహస్యం దాగి ఉంది. ‘అమ్మ’ గురించి రాయడం అంటే సాగరాన్ని అరచేతిలో బంధించాలను కోవడం లాంటిదే.సృష్టికి మూలం అమ్మ.ఈ ప్రపం చంలో ఏ బంధానికైనా ప్రతిఫలం ఉంటుంది, కానీ ఒక్క *మాతృత్వానికి మాత్రం స్వార్థం తెలియదు. తొమ్మిది నెలలు తన రక్తమే పాలుగా మార్చి, తన ప్రాణాన్ని పణం గా పెట్టి మరో ప్రాణానికి ఊపి రి పోసే అద్భుతం పేరు అ మ్మ.అందుకే అంటారు దేవు డు అన్ని చోట్లా తాను ఉండ లేక, అమ్మను సృష్టించాడ ని”మాతృదినోత్సవం అనేది కేవలం ఏడాదికి ఒకసారి జరుపుకునే వేడుక కాదు. అది మన ఉనికికి కారణమైన ఆ మాతృమూర్తికి మనం సమర్పించుకునే వినమ్ర నివాళి.కాలం మారుతున్నా కరగని మమకారం అమ్మది.

నాగరికత మారింది, టెక్నా లజీ పెరిగింది, మనుషుల జీవనశైలి మారింది. కానీ, బిడ్డ ఆకలిని కళ్లతోనే చదివే తల్లి మనసు మాత్రం తరత రాలుగా మారలేదు. ఆకలి వేస్తే అన్నం పెట్టేది తల్లి మాత్రమే కాదు, జీవితం నేర్పే మొదటి గురువు, బాధ కలిగితే ఓదార్చే మొదటి స్నేహితురాలు, మనం తడబడినప్పుడు చేయిపట్టి నడిపించే ధైర్యం.. ఇవన్నీ కలిస్తేనే అమ్మ.”అమ్మ అని ఒక్కసారి పిలిస్తే వచ్చే ఆత్మీ యతలో, వెయ్యి అడుగుల గంటల మోత వినిపిస్తుంది.”

నేపథ్యం-చరిత్ర

ఈ రోజును జరుపుకోవడం వెనుక ఒక గొప్ప ఉద్దేశ్యం ఉంది. అమెరికాకు చెందిన అన్నా జార్విస్* అనే మహిళ, తన తల్లి ఆశయాల ను గౌరవిస్తూ, తల్లులందరికీ గుర్తింపు దక్కాలనే పోరాటం తో 1914లో దీనిని అధికారి కంగా ప్రారంభించారు. అప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా మే రెండో ఆదివారాన్ని మాతృది నోత్సవంగా జరుపుకుంటారు
ఎందుకు ఈ మాతృ దినోత్సవం?

ప్రతిరోజూ అమ్మ రోజు అయినప్పటికీ యాంత్రికమైన ఈ జీవనంలో మనం ఆమె సేవలను, త్యాగాలను గుర్తిం చడం మరచిపోతున్నాం. తెల్ల వారుజామున అందరి కంటే ముందు నిద్రలేచి, అందరూ పడుకున్నాక విశ్రమించే ఆ ఇల్లాలు, తనకంటూ ఒక ఆశ ఉంటుందని, తనకూ అలసట ఉంటుందని ఎప్పుడూ చాటి చెప్పుకోదు. మాతృదినోత్స వం మనకు ఒక సందర్భాన్ని ఇస్తుంది ఆమె కళ్లలో ఆనం దాన్ని చూడటానికి, ఆమె చేసిన త్యాగాలకు ఒక చిన్న ‘ధన్యవాదాలు’ చెప్పడానికి.

నిస్వార్థానికి నిలువుట ద్దం

తల్లి ప్రేమకు కొలమానం లేదు. బిడ్డ విజయం సాధిస్తే లోకమంతా గర్వపడేకంటే ముందే, ఆనందభాష్పాలు రాల్చే ఏకైక వ్యక్తి తల్లి. మనం ఎన్ని తప్పులు చేసినా, ప్రపం చమంతా మనల్ని వేలెత్తి చూపినా, “వాడు నా బిడ్డ” అని అక్కున చేర్చుకునే విశా ల హృదయం కేవలం మాతృ త్వానికే సొంతం.ఈ సందర్భం గా మనం చేయాల్సింది కేవలం శుభాకాంక్షలు చెప్ప డం మాత్రమే కాదు ఆమె మనసు నొప్పించకుండా చూసుకో వడం, వయసు మళ్లిన వేళ ఆమెకు నీడగా నిలవడం. ఎందుకంటే, అమ్మకు మనం ఇచ్చే అతిపెద్ద బహుమతి సమయo,గౌరవం

ముగింపు పలకలేని కావ్యం

మనం ఎంత ఎదిగినా, ఏ స్థాయికి చేరుకున్నా అమ్మ ముందు ఎప్పుడూ చిన్న పిల్లలమే. ఆ చల్లని దీవెనలు మన వెంటే ఉంటే, ఏ కష్టమైనా తలవంచాల్సిందే. తల్లి మొదటి విద్య నేర్పుతుం ది. జ్ఞానం, ఆలోచించేతత్వం, నవ్వులతో ముద్దు లాడుతుం ది.

ఆలోచింపజేసే సత్యం

నేటి యాంత్రిక జీవనంలో మనం అమ్మను ఒక క్యాలెం డర్ తేదీకి పరిమితం చేస్తు న్నామా? అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కంటే, పక్కనే ఉన్న అమ్మతో ఒక ఐదు నిమిషాలు మనసు విప్పి మాట్లాడటం మిన్న. మాతృ దినోత్సవం యొక్క అసలు ఉద్దేశ్యం ఆమె త్యాగా లను స్మరించుకోవడమే కాదు, ఆమె అస్తిత్వాన్ని, ఆమె కలలను కూడా గుర్తిం చడం.

అమ్మకు కూడా కలలు ఉంటాయి

మనం ఎదుగుతున్న క్రమంలో ఆమె తన ఇష్టాలను వదులుకుంది. ఆమె కలలను సాకారం చేయకపోయినా, కనీసం వాటి గురించి అడిగి తెలుసుకోవడం కూడా ఒక గొప్ప కృతజ్ఞత.

ప్రేమను పంచడం:

వృద్ధాశ్రమాల్లో పెరుగుతున్న అమ్మల సంఖ్య మన సమా జం ఎటు వెళ్తుందో ఆలోచింప జేస్తోంది. మాతృ దినోత్సవం రోజున ప్రతి బిడ్డ తీసుకోవా ల్సిన శపథం ఏ స్థితిలోనూ అమ్మను ఒంటరిని చేయ ను.అమ్మ అంటే కేవలం ఒక వ్యక్తి కాదు, అది ఒక అను భూతి. కాలం మారుతున్నా, లోకం ఆధునికత వైపు పరు గులు తీస్తున్నా, మారనిది ఏదైనా ఉంది అంటే అది అమ్మ చూపే నిస్వార్థమైన ప్రేమ మాత్రమే.మనం మాతృ దినోత్సవాన్ని ఏడాదికి ఒక సారి జరుపుకుంటాము, కానీ అమ్మ మన కోసం ప్రతి సెకను తపిస్తూనే ఉంటుంది. చివ రగా అమ్మ అనే పదం పుట్టు కతోనే మనకు పరిచయమైన మొదటి అక్షరం. ఆమె మన మొదటి గురువు, మొదటి స్నేహితురాలు,ఆపదలో మనకు దొరికే మొదటి రక్షణ కవచం. ఈ మాతృ దినోత్స వం కేవలం వేడుకగా మిగిలి పోకుండా, ప్రతి రోజూ మన ప్రవర్తనలో అమ్మ పట్ల ప్రేమ ప్రతిబింబించేలా చూసుకుం దాం.లోకంలో దేనికైనా వెల కట్టవచ్చు కానీ, అమ్మ కంటి నుండి వచ్చే ఆనంద బాష్పా నికి, ఆమె గుండె నిండా ఉండే అనురాగానికి ఏదీ సాటిలేదు
మనం ఎంత ఎత్తుకు ఎది గినా, ఆ ఎదుగుదలకు కార ణం అమ్మ వేసిన పునాది అని గుర్తుంచుకుందాం. ఆమెకు మనం ఇచ్చే నిజమైన నివాళి ఆమెను కంటికి రెప్పలా కాపా డుకోవడమే. అమ్మకు వంద నం కాదు పాదాభివందనం చేద్దాం.ప్రపంచంలోని తల్లులం దరికీ మాతృదినోత్సవ శుభా కాంక్షలు.

నిరంతరాయంగా హోప్ ఫౌండేషన్ అన్నదానం: 183వ వారానికి చేరిన వైనం

నిరంతరాయంగా హోప్ ఫౌండేషన్ అన్నదానం: 183వ వారానికి చేరిన వైనం

శేరిలింగంపల్లి, నేటి ధాత్రి :-

మానవ సేవయే మాధవ సేవ అనే నినాదంతో హోప్ ఫౌండేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. శనివారం చందానగర్ పరిధిలో హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో 183వ వారం అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
​ఈ సందర్భంగా చైర్మన్ కొండ విజయ్ కుమార్ స్వయంగా ప్రజలకు అన్న ప్రసాదాన్ని వడ్డించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..

సమాజం పట్ల బాధ్యతతో, ఆకలితో ఉన్నవారికి అండగా నిలవాలనే లక్ష్యంతో గత 183 వారాలుగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. భోజనానికి విచ్చేసిన వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఫౌండేషన్ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారని, ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి అన్నప్రసాదాన్ని స్వీకరించడం సంతోషకరమని ఆయన పేర్కొన్నారు.
​మృదు స్వభావి, సేవా తత్పరుడైన విజయ్ కుమార్ చేస్తున్న ఇలాంటి మరెన్నో సామాజిక కార్యక్రమాలు విజయవంతం కావాలని అభిమానులు, స్థానికులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు మరియు స్వచ్ఛంద కార్యకర్తలు పాల్గొన్నారు.

మల్లక్కపేటలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం

మల్లక్కపేటలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం

పరకాల,నేటిధాత్రి

పరకాల మండలంలోని మల్లక్కపేట గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చెరువు వద్ద ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.ఇరిగేషన్ శాఖ అధికారులు మరియు గ్రామ సర్పంచ్ దొమ్మటి కవిత మధు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చెరువుల పరిరక్షణ,నీటి వినియోగం,సాగునీటి సదుపాయాలపై అవగాహన కల్పించారు.గ్రామాభివృద్ధిలో చెరువుల పాత్ర కీలకమని,రైతులకు సాగునీటి సౌకర్యాలు మెరుగుపడేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బొజ్జం రమేష్,మాజీ సర్పంచ్ అల్లం రఘునారాయణ,మాజీ ఎంపీటీసీ దుమాల కిషోర్,వార్డ్ మెంబర్ అల్లం కార్తీక్,గ్రామ నాయకులు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

తూకం వేసిన ధాన్యం మిల్లులకు తరలించాలి

తూకం వేసిన ధాన్యం మిల్లులకు తరలించాలి

టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉంచుకోవాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

రగుడు ధాన్యం కొనుగోలు కేంద్రం తనిఖీ

సిరిసిల్ల(నేటి ధాత్రి):

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుండి సేకరించి తూకం వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించేలా చూడాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.

శనివారం సిరిసిల్ల మున్సిపల్ పరిధి రగుడులో మెప్మా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రంలో రైతుల సౌకర్యార్థం కల్పించిన సౌకర్యాలు, దిగుబడి వివరాలు, హమాలీల గురించి ఆరా తీశారు.

కొనుగోలు కేంద్రాల్లో రైతుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు కల్పించడం జరిగిందని తెలిపారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకువచ్చిన వెంటనే జాప్యం చేయకుండా తూకం వేయాలని, అందుకు సరిపడా హమాలీలు అందుబాటులో ఉండేలా

చూసుకోవాలన్నారు. స్థానిక రైతులతో మాట్లాడి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం తడవకుండా సరిపడా టార్పాలిన్లు అందుబాటులో పెట్టుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు ఎంత ధాన్యం సేకరించారు? ఎంత వరకు ఆన్ లైన్ ట్యాబ్ ఎంట్రీ పూర్తయింది అనే వివరాలను కొనుగోలు కేంద్రం నిర్వాహకులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

కొనుగోలు కేంద్రాల నుండి రైస్ మిల్లులకు ధాన్యం తరలించేందుకు వాహనాల కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ట్రాక్టర్ల ద్వారా ధాన్యం తరలించే అవకాశం ఉందని, జాప్యం చేయకుండా తరలించాలని, మిల్లుల్లో ధాన్యం బస్తాలు త్వరగా అన్ లోడ్ అయ్యేలా పర్యవేక్షణ చేయాలని అధికారులకు సూచించారు.

తనిఖీలో జిల్లా పౌర సరఫరాల అధికారి బుచ్చిబాబు, మేనేజర్ నరసింహ, వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, సహకార శాఖ అధికారి రామకృష్ణ, మెప్మా ఏవో మీర్జా ఫసహత్ అలీ బేగ్, తహసీల్దార్ జయంత్, తదితరులు ఉన్నారు.

సమగ్ర, ఖచ్చితమైన గణాంకాల రూపకల్పనలో జనగణన కీలకం

సమగ్ర, ఖచ్చితమైన గణాంకాల రూపకల్పనలో జనగణన కీలకం

– జిల్లా కలెక్టర్, ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ గరిమ అగ్రవాల్

– స్వీయ గణనకు ఆదివారం తుది గడువు

– ఈ నెల 11 నుండి జూన్ 9 వరకు ఇండ్ల గణన

– మొదటి దశ జనగణనపై జిల్లా కేంద్రంలో అవగాహన వాక్

– జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్

సిరిసిల్ల(నేటి ధాత్రి):

 

సమగ్ర, ఖచ్చితమైన గణాంకాల రూపకల్పనలో జనగణన కీలకమని, దేశవ్యాప్తంగా నిర్వహించనున్న జనగణన ప్రక్రియలో అందరూ భాగస్వామ్యులు కావాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్, ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు.

శనివారం ఉదయం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కూడలి వద్ద మొదటి దశ జనగణనపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. జనగణనపై క్షేత్ర స్థాయి ప్రచారం, అవగాహన కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం అంబేద్కర్ కూడలి నుండి బతుకమ్మ ఘాట్ వరకు నిర్వహించిన 2కె వాక్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చాలా సంవత్సరాల తర్వాత భారతదేశంలో జనగణన చేయడం జరుగుతుందని, మన తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఇది మొదటి జనగణన అని, మొదటి సారి డిజిటల్ విధానంలో ఈ జనగణన నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.

స్వీయగణన అనే విధానం తొలిసారి ప్రవేశపెట్టి జనగణన ప్రక్రియలో నూతన అధ్యాయానికి నాంది పలకడం జరిగిందని పేర్కొన్నారు. మీ కుటుంబ వివరాలను స్వయంగా మీరే నమోదు చేసుకునే చేసుకునే అవకాశం స్వీయ గణన ద్వారా కల్పించారని, ఇందులో 34 ప్రశ్నలు ఉన్నాయని, కేవలం ఐదు నిమిషాల్లో స్వీయ గణన ప్రక్రియను పూర్తి చేయవచ్చని పేర్కొన్నారు. స్వీయ గణన కోసం https://se.census.gov.in సైట్ లో మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయ్యి ప్రక్రియ పూర్తి చేయాలని కోరారు.

స్వీయగణన చేయడానికి రేపే (ఆదివారం) తుది గడువు అని, స్వీయ గణనలో పాల్గొని వివరాలను స్వయంగా నమోదు చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

సోమవారం నుండి జనగణన ఎన్యూమరేటర్లు ఇంటింటికీ తిరిగి వివరాలను సేకరించడం జరుగుతుందని అన్నారు. అనుభవజ్ఞులైన సిబ్బందిని జనగణన సూపర్ వైజర్లు, ఎన్యూమరేటర్లుగా నియమించి వారికి అవసరమైన శిక్షణ అందించడం జరిగిందని వెల్లడించారు. వారికి ప్రత్యేక ఐడీ కార్డులు కూడా జారీ చేశామని, ఇంటికి వచ్చినప్పుడు వారికి సహకరించాలని కోరారు.

జనగణన పేరుతో ఎవరైనా అనుమానిత వ్యక్తులు మీ ఇంటికి వచ్చి వివరాలు అడిగే అవకాశం ఉంటుందని, అలాంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని అన్నారు. జనగణనలో పాల్గొనే సిబ్బందికి జారీ చేసిన గుర్తింపు కార్డుల మీద క్యూ ఆర్ కోడ్ ఉంటుందని, దానిని స్కాన్ చేస్తే అధికారిక వెబ్ సైట్ లో పొంది ఉంచిన వారి పూర్తి వివరాలు వస్తాయని, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు.

జనగణన ప్రక్రియ చాలా ముఖ్యమైనదని, జనగణనలో భాగస్వామ్యులు అయ్యే బాధ్యత ప్రతీ ఒక్కరికీ ఉంటుందని గుర్తుచేశారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాసా చారి, మున్సిపల్ కమీషనర్ ఖదీర్ పాషా, జిల్లా అధికారులు అఫ్జల్ బేగం, సౌజన్య, లక్ష్మీరాజం, స్వప్న, తహసీల్దార్ జయంత్, మెప్మా ఏవో మీర్జా ఫసహత్ అలీ బేగ్, ఎస్ ఓ సంపత్, జనగణన సూపర్ వైజర్లు, తదితరులు పాల్గొన్నారు.

ప్రతి రైతుకు సాగునీటి అందిస్తాం డిఈ తిరుపతి

ప్రతి రైతుకు సాగునీటి అందిస్తాం డిఈ తిరుపతి
పెదముడిసిలేరు సర్పంచ్ సుహాసిని

నేటిదాత్రి చర్ల

 

 

 

తాలిపేరు డ్యామ్ వద్ద ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక రైతు వారంలో భాగంగా సమర్థ నీటి పారుదల కొరకు గేట్ల నిర్వహణ అంశంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో డీఈ తిరుపతి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మంజూరైన పనుల వివరాలు ప్రస్తుతం కొనసాగుతున్న పనుల పురోగతిపై రైతులకు అవగాహన కల్పించారు అలాగే డ్యామ్ గేట్ల మరమ్మతులు పెయింటింగ్ పనుల ప్రాముఖ్యతను వివరించారు పెద్దమిడిసిలేరు సర్పంచ్ సుహాసిని మాట్లాడుతూ తాలిపేరు డ్యామ్ వద్ద పర్యాటక రంగ అభివృద్ధికి మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు అదేవిధంగా ఇటువంటి సమావేశాల ద్వారా రైతులు మరియు అధికారుల మధ్య పరస్పర చర్చలు జరగడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు
గ్రామ పెద్ద శ్యామల రామారావు మాట్లాడుతూ రైతులు కాలువలను ఆక్రమించకుండా బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు చిన్న చిన్న రైతు సమస్యలను ఇరిగేషన్ శాఖ సహకారంతో పరిష్కరించుకొని సాగునీటికి ఎటువంటి ఆటంకం లేకుండా చూసుకోవాలని రైతులకు సందేశం ఇచ్చారు
ఈ కార్యక్రమంలో సహాయక కార్యనిర్వాహక ఇంజినీర్ సంపత్ సహాయక ఇంజినీర్ సుమన పెద్దమిడిసిలేరు కార్యదర్శి ప్రశాంతి పాల్గొన్నారు

ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి

ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి
జిల్లా అదనపు వైద్యాధికారి డాక్టర్ సైదులు

డిప్యూటీ డి ఎం హెచ్ వో
డాక్టర్ శ్రీధర్

నేటిదాత్రి చర్ల

 

చర్ల మండలంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రం కొయ్యురులో గురువారం జిల్లా అదనపు వైద్యాధికారి డాక్టర్ సైదులు మరియు డిప్యూటీ జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీధర్ ఆకస్మికంగా సందర్శించారు
ఆసుపత్రిలోని అన్ని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు రోగుల రిజిస్టర్లు ఔషధాల నిల్వలు సిబ్బంది హాజరు పట్టికలను వెరిఫికేషన్ చేశారు
ఎండాకాలం దృష్ట్యా వడదెబ్బ కేసులు పెరిగే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు ఫీల్డ్ స్టాఫ్ హెల్త్ స్టాఫ్ మరియు ఆశా కార్యకర్తల వద్ద సరిపడా ఓర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు ముఖ్యంగా కరువు పనులు సిమెంట్ పనులు ఇటుకల బట్టీల వద్ద పనిచేసే కూలీలకు ఓఓర్ఎస్ సులభంగా అందే విధంగా చర్యలు తీసుకోవాలని డాక్టర్ సైదులు తెలిపారు వడదెబ్బ లక్షణాలు ప్రథమ చికిత్సపై గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు
ఈ కార్యక్రమంలో చర్ల మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హారిక కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ కే రామలక్ష్మి హెల్త్ సూపర్‌వైజర్ రాంప్రసాద్‌ మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు

దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహం దగ్గర కమాన్ చౌరస్తాలో ఫుట్ ఫాతును తరలించాలి

దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహం దగ్గర కమాన్ చౌరస్తాలో ఫుట్ ఫాతును తరలించాలి

వనపర్తి ఎమ్మెల్యే మేగారెడ్డి ని కోరిక ప్రజలు

వనపర్తి నేటీదాత్రి .

వనపర్తి జిల్లా కేంద్రం మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ విగ్రహం నుండి హనుమాన్ టికిడి పాత గోపన్ గౌడ్ బట్టల షాప్ దాసరి బుచ్చయ్య షాప్ లైన్ దివంగత మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాల కృష్ణయ్య విగ్రహం దగ్గర ఫుతుఫాతుల లో వ్యాపారాలు చేసుకోవడము వల్ల ట్రాఫిక్ సమస్య ఏర్పడిందని ప్రజలు తెలిపారు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేగారెడ్డి స్పందించి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్ పాత మార్కెట్ యార్డ్ లేదా పాత కోట లో వీధి వ్యాపారస్తులకు చిన్న రైతులు కురాగాయలు అమ్ముకోవాడాని స్థలాలు చూపించాలని ప్రజలు కోరారు ఆదివారం సంత ఉండముతో దివంగత ముఖ్యమంత్రి ఎన్ టి రామారావు విగ్రహం దగ్గర చిన్న రైతులు కూరగాయలు వ్యాపారం చేసుకోవటానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎమ్మెల్యే మేగారెడ్డి వనపర్తి ప్రజల ఇబ్బందులను గుర్తించాలని కోరారుa

రైతులకు ధైర్యం ఇవ్వని దౌర్భాగ్యపు ఎమ్మెల్యే

రైతులకు ధైర్యం ఇవ్వని దౌర్భాగ్యపు ఎమ్మెల్యే

దారుణ స్థితిలో మక్కొజోన్న రైతులు.

వరంగల్ జెడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్

కొనుగోలు కేంద్రాలు పెంచాలని బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రోడ్డుపై ధర్నా

నర్సంపేట, నేటిధాత్రి:

కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో మక్కల కొనుగోళ్ల నిలుపుదల చెయ్యడం వలన గురువారం రాత్రి కురిసిన అకాల వర్షానికి మక్కలు తడిసి ముద్దయ్యాయని వరంగల్ జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు.
గుండెలు పగిలే బాధలో రైతులు ఈ నేపథ్యంలో వారికి ధైర్యం ఇవ్వని దౌర్భాగ్యపు స్థితిలో స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఉన్నారని ఎద్దేవా చేశారు.దుగ్గొండి మండలంలో మక్కల రైతుల పట్ల మరో ఐదు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వేగవంతం చేయాలని కోరుతూ బిఆర్ఎస్ మండల ఆధ్వర్యంలో పార్టీ మండలాధ్యక్షుడు

సుకినే రాజేశ్వర్ రావు అధ్యక్షతన రైతులతో కలిసి ధర్నా చేపట్టారు.గిర్నిబావిలోని వరంగల్ నర్సంపేట ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.కొనుగోలు కేంద్రాలను పెంచాలని నినాదాలు చేశారు.ఈ సందర్భంగా జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ మాట్లాడుతూ ప్రభుత్వ వైైఖరి,నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అశ్రద్ధవల్లనే రైతులకు కష్టాలు ఎదురవుతున్నాయని ఆరోపించారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు నుంచి రైతులకు ఎరువులు,విత్తనాల కొరత,కొనుగోళ్ళు కొరత,పెట్టుబడి సహాయం అందక దారుణ స్థితిలో ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు.నర్సంపేట నియోజకవర్గంలో అన్ని విధాలుగా అవస్థలు పడుతున్న తరుణంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తమ సొంత
కాంట్రాక్ట్ పనుల సోయిపైనే ఉన్నారని ఎద్దేవా చేశారు.గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో నిత్యం రైతుల పక్షాన ఉంటూ సరిపడా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని గుర్తుకు చేశారు.దుగ్గొండి మండలంలోని అమ్మకాల కోసం రైతుల వద్ద 60 శాతం పైబడి మక్కల నిల్వలు ఉన్నాయని అన్నారు.ఒకవైపు కొనుగోలు కేంద్రాల కొరత మరోవైపు ట్రాన్స్ పోర్ట్ సమస్య అధికంగా ఉందని తెలిపారు.
మక్కల కొనుగోళ్ల పట్ల ప్రభుత్వ బలహీనతతో దళారీలు ముందుకు వస్తున్నారని హెచ్చరించారు.కొనుగోలు కేంద్రాలను పెంచి
ట్రాన్స్ పోర్ట్ మెరుగుపరచాలని ఆయన డిమాండ్ చేశారు.ప్రభుత్వ పాలన పట్ల ఎన్నికల్లో ఓడిపోతామని భయంతో వ్యవసాయ సొసైటీలను నిర్వీర్యం వేస్తున్నదని ఆకుల శ్రీనివాస్ ఆరోపించారు.మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పొన్నం మొగిలి మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అశ్రద్ధ వల్లనే నేడు కొనుగోలు కేంద్రాల వద్ద మక్కల రైతులు పడిగాపులు కాస్తున్నారని

ఆరోపించారు.దుగ్గొండి మండలానికి మరో ఐదు మక్కల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేస్తున్న తరుణంలో సుమారు రెండు కిలోమీటర్ల మేరకు వాహనాలు నిలిచిపోగా ప్రయాణికులకు అంతరాయం ఏర్పడింది.ఈ కార్యక్రమంలో బిఆర్ ఎస్ నియోజకవర్గ యూత్ కన్వీనర్ శానబోయిన రాజ్ కుమార్,నాయకులు కాట్ల భద్రయ్య,కంచరకుంట్ల శ్రీనివాస్ రెడ్డి,ముదురుకోల కృష్ణ,సర్పంచులు పెండ్యాల రాజు, ఆరేళ్లి లత వీరేశం గౌడ్, బైరీ
రమణారెడ్డి, గుండెకారి రవీందర్ రావు,పిండి కుమారస్వామి,తిరుపతి యాదవ్,కట్కూరి వీరారెడ్డి,యుగంధర్,పలువురు ప్రజాప్రతినిధులు,నాయకులు రైతులు పాల్గొన్నారు.

రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యం ఎమ్మె ల్యే జీఎస్సార్

రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యం ఎమ్మె ల్యే జీఎస్సార్

పలు గ్రామాల్లో వడ్ల కొను గోలు కేంద్రాలుప్రారంభం

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలంలోని నేరేడుపల్లి,ప్రగతి సింగారం, కాట్రపల్లి,వసంతాపూర్ గ్రామా లలో పి.ఎ.సి.ఎస్ మరియు ఐకెపి, రైతు సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రా లను ప్రారంభించారు ఈ సం దర్భంగాఎమ్మెల్యే గండ్ర సత్య నారాయణరావు మాట్లాడు తూ రైతులు పండించిన సన్న ధాన్యానికి మద్దతు ధర 2389/- రూపాయలు ప్రభు త్వం ఇస్తుందని తెలిపారు, వ్యవసాయశాఖ అధికారులు కోత మిషన్ల యొక్క ఆర్పి ఎం 18 నుండి 20 వరకు మరి యు బ్లోయర్ ఆన్ లో ఉంచే విధంగా కోత మిషన్ యజ మానులకు తెలియజేయాల ని ఇలా చేయడం వల్ల ధాన్యం లో తాలు ఉండదని అన్నారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ పంటను నేరు గా కొనుగోలు కేంద్రాలకు తీసు కువచ్చి విక్రయించాలని సూ చించారు. మధ్యవర్తి జోక్యం లేకుండా పారదర్శకంగా ధా న్యం కొనుగోలు జరుగుతుం దని రైతుల కు సమయానికి డబ్బులు చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పా రు అలాగే కొనుగోలు కేంద్రాల్లో తేమ ప్రమాణాలు, కొలతలు సక్రమంగా పాటిం చాలని అధికారులను ఆదేశిం చారు. రైతులు ఎలాంటి సమ స్యలు ఎదుర్కొన్న వెంటనే అధికారుల దృష్టికి తీసుకురా వాలని ప్రభుత్వం రైతు సంక్షే మానికి ఎల్లప్పుడూ అండగా ఉంటుం దని తెలిపారు.ఈ కార్యక్ర మంలో సివిల్ సప్లై అధికారులు, సంబంధిత అధికారులు, మండల పార్టీ అధ్యక్షుడు, మండల వ్యవసా య అధికారి ప్రియదర్శిని, స్థానిక ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

వివాహ వేడుకలలో ఎమ్మెల్యే తూడి

వివాహ వేడుకలలో ఎమ్మెల్యే తూడి
వనపర్తి నేటీదాత్రి .

వనపర్తి జిల్లాలో వివాహ వేడుకలలో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేగారెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్ ఎల్ ఎన్ మీడిదొడ్డి రమేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా నూతన వధూవరులను ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి రమేష్ ఆశీర్వదించారు

ప్రధాని నరేంద్ర మోడి భారీ బహిరంగ సభను జయప్రదం చేయండి

ప్రధాని నరేంద్ర మోడి భారీ బహిరంగ సభను జయప్రదం చేయండి

బిజెపి జిల్లా మీడియా కన్వీనర్ ఊరటి మునెందర్

భూపాలపల్లి నేటిధాత్రి

భారత ప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి గెలిచిన తరువాత తెలంగాణకు మొదటిసారిగా విచ్చేస్తున్న సందర్భంగా రేపు హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించ తలపెట్టిన భారత ప్రధాని నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభకు భూపాలపల్లి జిల్లా ప్రజలు,పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని భారతీయ జనతా పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మీడియా కన్వీనర్ ఊరటి మునేందర్ ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.
​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని దేశాభివృద్ధిలో భాగస్వామ్యం చేయడమే లక్ష్యంగా ప్రధాని మోదీ ఈ సభకు వస్తున్నారని తెలిపారు.కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు,అభివృద్ధి పనులకు ఆకర్షితులై ప్రజలు స్వచ్ఛందంగా బీజేపీ వైపు వస్తున్నారని ఆయన పేర్కొన్నారు.ఈ బహిరంగ సభ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని, జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామల నుంచి బీజేపీ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల నాయకులు,శక్తి కేంద్ర ఇన్చార్జిలు,బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు,అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన కోరారు.

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన రేషన్ డీలర్స్

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన రేషన్ డీలర్స్

భూపాలపల్లి నేటిధాత్రి

గర్మిళ్లపల్లి గ్రామంలో రేషన్ డీలర్ ఇటీవల పెరికారి యుగేందర్ మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించిన టేకుమట్ల మండల రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షురాలు తోట పద్మ ఆధ్వర్యములో వారి కుటుంబాన్ని పరామర్శించి 10000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది ఈ సందర్బంగా అధ్యక్షురాలు తోట పద్మ మాట్లాడుతూ పెరికారి యుగేందర్ రావు మరణం మాకు తీరని లోటు అని ఈ కష్ట సమయం లో వారి యొక్క కుటుంబానికి మా యొక్క సంఘం అన్ని సమయాలలో వెన్నంటి ఉంటామని ఈ సందర్భంగ తేలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తోట సాగర్ నేరెళ్ల రామకృష్ణ ,సుంకర శ్రీనివాస రావు ,మలహల్ రావు ,శనిగరపు సంపత్ , జంగంపెల్లి రాజమల్లు ,ఆకునూరి ఓదెలు వివిధ గ్రామాల డీలర్లు పాల్గొన్నారు

error: Content is protected !!
Exit mobile version