తమ్ముళ్లు ఇలా చేయండి.. సీఎం చంద్రబాబు దిశానిర్దేశం…

 తమ్ముళ్లు ఇలా చేయండి.. సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

తెలుగుదేశం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గ్రామస్థాయి కార్యకర్తలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలకు పలు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.తెలుగుదేశం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గ్రామస్థాయి కార్యకర్తలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఇవాళ(ఆదివారం) టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలకు అధినేత పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన నూతన జీఎస్టీ సంస్కరణలతో పేద, మధ్య తరగతి ప్రజలకు పెద్దఎత్తున లబ్ధి జరుగుతోందని ఉద్ఘాటించారు. దేశంలో ఇదొక నూతన అధ్యాయమని చెప్పుకొచ్చారు. జీఎస్టీ సంస్కరణలతో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ మార్పులను ప్రజలకు వివరించి చెప్పాలని సూచించారు. జీఎస్టీ ఉత్సవ్‌లో భాగంగా జీఎస్టీ సంస్కరణలను వివరిద్దామని మార్గనిర్దేశం చేశారు. కనీసం ఏపీ వ్యాప్తంగా 60 వేల సమావేశాలు పెట్టి ప్రజలకు వివరించాలని సూచించారు సీఎం చంద్రబాబు.

కూటమి పార్టీలు ఉమ్మడిగా జీఎస్టీ సంస్కరణల ఉత్సవ్ ప్రచారాన్ని నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. పారిశ్రామిక, ఆటో మొబైల్, ఫార్మా, వంటి కంపెనీలకు జీఎస్టీ సంస్కరణలో మేలు జరుగుతోందని చెప్పుకొచ్చారు. టూ వీలర్, ఏసీలు, కార్లు, వంటింటి వస్తువుల ధరలు తగ్గుతాయని వివరించారు. ప్రజలు నిత్యం ఉపయోగించే వస్తువులకు కూడా జీఎస్టీ తగ్గిందని… రోగులు వాడే మందులపై జీఎస్టీ లేదని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ.. ఏపీ అసెంబ్లీలో తీర్మానం కూడా చేశామని గుర్తుచేశారు. జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు రూ. 8 వేల కోట్ల మేర లబ్ధి జరగుతోందని వెల్లడించారు సీఎం చంద్రబాబు.

మోడీ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోంది…

మోడీ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోంది

వర్ధన్నపేట.(నేటిధాత్రి):

ప్రజలను మోసం చేస్తున్న మోడీ ప్రభుత్వం:బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆబిడి రాజ్ రెడ్డి &మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎద్దు సత్యం & వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య.
మోడీ ప్రభుత్వం జిఎస్టీ పన్నుల విధానంలో సంస్కరణల పేరుతో తీసుకు వచ్చిన మార్పులు పేద మధ్యతరగతి వర్గానికి ఉపయోగ పడదని ఇది మోడీ ప్రభుత్వ మోసకారితనము బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆబిడి రాజ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎద్దు సత్యం, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య నేడు గురువారం వర్ధన్నపేట నియోజక వర్గం, వర్ధన్నపేట మండల కేంద్రంలో ఉన్న క్యాంప్ కార్యాలయంలో విలేఖర్లతో మాట్లాడుతూ జీఎస్టీ పన్నుల విధానంలో తీసుకొచ్చిన మార్పు గురించి మోడీ ప్రభుత్వం సంకలు కొట్టుకుంటున్న ధి. గత 7 సంవత్సరాల క్రితం తీసుకొచ్చిన ఈ విధానం వల్ల దేశంలోని పెట్టుబడి దారులు , సామ్రాజవాదులే లాభ పడ్డారు ,వారికి దేశా ప్రజల లక్షల కోట్ల రూపాయలు సొమ్మును,పన్నుల రూపేణా దారా దత్తం చేసింది. ఇప్పటి వరకు సామాన్య ప్రజలు కొనుగోలు చేసే నిత్యావసర సరుకుల ధరలు తగ్గలేదు .మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న జీఎస్టీ పన్నుల విధానం తన ఆధీనంలో ఉంచుకొని రాష్ట్రాలను బిచ్చగాళ్లుగా మార్చింది.
రాష్ట్రా ప్రభుత్వాలు పన్నుల వసూళ్లలో తమకు ఉండే అధికారాలు కోల్పోయాయి .మోడీ ప్రభుత్వం ఏక కేంద్ర విధానాలను అమలు చేస్తూ రాజ్యాంగం కల్పించిన సమాఖ్య స్పూర్తి నీ దెబ్బ తీస్తుంది.ఈ కార్యక్రమములో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి పోషాల వెంకన్నగౌడ్, కొత్తపెల్లి గ్రామ పార్టీ అధ్యక్షుడు తాళ్ళపెల్లి యాదగిరి గౌడ్, మండల సీనియర్ నాయకులు మరుపట్ల సాయికుమార్,ల్యాబర్తి గ్రామ పార్టీ అధ్యక్షుడు,ఎస్సీ సెల్ వరంగల్ జిల్లా కార్యదర్శి చిధుముళ్ళ భాస్కర్ లు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version