పశువులకు గర్భకోశ వ్యాధి టీకాలు..
నిజాంపేట, నేటి ధాత్రి:
పశువులకు గర్భకోశ వ్యాధి టీకాలు పశుసంవర్ధక శాఖ సహకారంతో అందివ్వడం జరుగుతుందని మండల పశువైద్యాధికారి మణికుమార్ అన్నారు. నిజాంపేట మండలం నందిగామ గ్రామంలో గ్రామ సర్పంచ్ ఆకుల స్వప్న, రమేష్ ఆధ్వర్యంలో రైతుల పశువులకు టీకాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. లేగ దూడలు పుట్టిన 15 రోజుల నుండి ఆరు నెలల వరకు నట్టల నివారణ మందులు తాగించడం వల్ల లేగ దూడలు ఎదుగుతాయన్నారు. రైతులు ఉచిత పశు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
