ఉచిత నేత్ర పరీక్ష క్యాంప్..

ఉచిత నేత్ర పరీక్ష క్యాంప్

సర్పంచ్ భానోత్ రమ భగవాన్ ఆధ్వర్యంలో

సూర్య స్వచ్ఛంద సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా నేత్ర వైద్య శిబిరం

నిరుపేదలకు కంటి చూపును ఇవ్వడమే మా స్వచ్ఛంద సేవ సంస్థ ఉద్దేశం… డాక్టర్ మాధవరావు.

మహబూబాబాద్, నేటిధాత్రి:

మండలంలోని గోవిందపురం గ్రామంలో సూర్య స్వచ్ఛంద సేవా ట్రస్ట్ డాక్టర్ మాధవరావు నిరుపేదలకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి కంటి అద్దాలు మరియు కంటి ఆపరేషన్లు గోవిందాపురం గ్రామ సర్పంచ్ భానోత్ రమ భగవాన్ల ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత కంటి పరీక్షల శిబిరం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్పంచ్ భానోత్ రమ పాల్గొన్నారు. గ్రామంలోని నిరుపేదలకు కంటి పరీక్ష చేయించుకోలేనటువంటి వారికి సూర్య స్వచ్ఛంద సేవా ట్రస్టు వారిచే ఉచితంగా కంటి ఆపరేషన్లు అవసరం ఉన్నవారికి కంటి అద్దాలు ఆపరేషన్ చేయాలన్న వారికి ఉచితంగా ఆపరేషన్లు నిర్వహిస్తున్న డాక్టర్ మాధవరావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో గోవిందపురం గ్రామ ప్రజలు 111 మంది ఉచిత వైద్య శిబిరంలో పరీక్షల నిర్వహించుకున్నారని వారిలో 40 మందికి ఉచితంగా కంటి అద్దాలు అందించడం జరిగిందని, అలాగే కంటి ఆపరేషన్ అవసరం ఉన్నటువంటి 9 మందికి ఆపరేషన్ నిర్వహించుటకు జిల్లా మహబూబాబాద్ కేంద్రంలో ఉన్నటువంటి సూర్య స్వచ్ఛత సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ మాధవరావు కంటి దావకానలో ఉచితంగా కంటి ఆపరేషన్ చేయడం జరుగుతుందని అన్నారు. మనిషి మనుగడ సజావుగా సాగాలంటే నయనాలు ప్రధానం అలాంటి నాయాలు నేత్రాలు నేడు మనం తింటున్నటువంటి కలుషిత ఆహారం వల్ల రెండవ అనారోగ్య సమస్యలు ఏర్పడడంతో నిరుపేదలైన వారు వైద్యం చేయించుకోలేక స్తోమత లేక నిర్లక్ష్యం వహిస్తున్నారని అంతత్వంతో కాలం గడుపుతున్నారని ఇలాంటి వారి పట్ల దాతృత్వం చాటుకొని ముందుకు పోతున్న సంస్థ సూర్య స్వచ్ఛంద సేవ ట్రస్ట్ మహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టుతుందని నిరుపేదలైన వారికి ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించి కంటి ఆపరేషన్లు చేసి మరి కంటి అద్దాలను ఇస్తుందని ఎవరికీ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా చేర్చుకునే మా గొప్ప అవకాశం కల్పిస్తున్నారని గ్రామ ప్రజల తరఫున సంస్థ సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని గ్రామ సర్పంచ్ భానోత్ రమా భగవాన్ అన్నారు. ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్నటువంటి వారు గ్రామ వార్డు సభ్యులు కాంపాటి వెంకన్న, యాకయ్య, ప్రభాకర్, దేవేందర్ లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

చర్లలో మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్

మండల లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్

భద్రాచలం జడ్జి శివ నాయక్

నేటిదాత్రి చర్ల

 

చర్ల మండలం లింగాపురం పంచాయతీ మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో న్యాయ అవగాహన సదస్సు
మెగా హెల్త్ క్యాంప్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్యఅతిథిగా మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ భద్రాచలం జడ్జి శివనాయక్
పాల్గొని మాట్లాడుతూ చర్ల మండలంలో ఉన్న ఏజెన్సీ ఆదివాసి బడుగు బలహీన వర్గాల ప్రజలు ఆర్థికంగా ఇబ్బంది పడుతూ వైద్యం చేపించుకోలేని స్థితిలో ఉన్నారని అందుకే

ఈ మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించటం జరుగుతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చర్ల మండల పరిషత్ డెవలప్మెంట్ అధికారి ఎంపీడీవో ఈదయ్య తాసిల్దార్ శ్రీనివాసరావు ఈ మెగా క్యాంపు ఉద్దేశించి మాట్లాడారు పాల్వంచ ఎల్ వి ప్రసాద్ కంటి వైద్యశాల మేనేజర్ దేవి శంకర్రావు ఆధ్వర్యంలో సిబ్బందితో లింగాపురం పాడు గ్రామంలో ఐ క్యాంపు ఏర్పాటు చేపించి చర్ల మండలం లో ఉన్న ప్రజలకు కంటి పరీక్షలు జరిపించి మెరుగైన మందులు కళ్ళజోడులు అందించారు అట్లాగే కొయ్యూరు హస్పటల్ నుండి హోమియోపతి డాక్టర్ గుండెపూడి పూజ రోగులకు మెరుగైన వైద్యం అందించి సైడ్ ఎఫెక్ట్స్ లేని హోమియోపతి మందులను ప్రజలకు అందించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డిప్యూటీ డి ఎం హెచ్ ఓ మల్లారపు శ్రీధర్ మాట్లాడుతూ ప్రజలు ప్రైవేట్ కార్పొరేట్ హాస్పటల్ కి పోకుండా ప్రభుత్వ ఆసుపత్రికి రావాలని ఇక్కడ మెరుగైన వైద్యం మందులు అందిస్తున్నామని ఆయన తెలియజేయడం జరిగింది

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చర్ల సబ్ ఇన్స్పెక్టర్ కేశవ్ మాట్లాడుతూ చర్ల మండల ప్రజలు ఈ మెగా హెల్త్ క్యాంప్ ని ఉపయోగించుకొని మెరుగైన వైద్యం పొందాలని ఆయన సూచించారు ఈ మెగా క్యాంప్ ఏర్పాటుచేసిన యువతకి అట్లాగే భద్రాచలం జడ్జి శివ నాయక్ కు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమం విజయవంతం చేసిన లింగాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ గూగులోత్ మంగ కొత్తపల్లి సర్పంచ్ గంప నాగలక్ష్మి గొంపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ చార్నీల్ అశోక్ లింగాపురం ఉపసర్పంచ్ తడికల్ నరేష్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమానికి గత నాలుగు రోజులుగా నిద్రహారాలు మానేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన లింగాపురం గ్రామపంచాయతీ కార్యదర్శి బానోతు నరసింహారావు కొత్తపల్లి గ్రామపంచాయతీ కార్యదర్శి భూక్య శరత్ కొంపల్లి కార్యదర్శి బైరెడ్డి నవీన్ కుమార్ ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించిన లాయర్ పరిటాల సంతోష్ ఈ కార్యక్రమంలో
సీనియర్ న్యాయవాదులు
అంబేద్కర్ తిరుమలరాజు ఆవులూరి సత్యనారాయణ పేరాల బండారు రమేష్ సాధనపల్లి సతీష్ సంధ్య శారద బండ రామలక్ష్మణ్ మరియు కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version