అవినీతి కట్టడితో ప్రజాధనాన్ని సద్వినియోగం చేస్తున్నాం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
గత 11 ఏళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందిందని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు. అవినీతి కట్టడితో ప్రభుత్వం.. ప్రజాధనాన్ని సద్వినియోగం చేస్తోందన్నారు. ఇవాళ ఉభయసభల్ని ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగంలో పలు కీలక విషయాలు ఉన్నాయి.
దేశంలో స్పేస్ టూరిజం అభివృద్ధికి ఎన్నో అవకాశాలున్నాయని రాష్ట్రపతి అన్నారు. భవిష్యత్‌లో అంతరిక్షంలో భారత స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని, జమ్మూకశ్మీర్‌లో అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి నిర్మించామని గుర్తు చేశారు. గత 11 ఏళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందిందని రాష్ట్రపతి చెప్పారు.
ఇంకా రాష్ట్రపతి తన ప్రసంగంలో ఏమన్నారంటే.. ‘అవినీతి కట్టడితో ప్రభుత్వ ప్రజాధనాన్ని సద్వినియోగం చేస్తోంది. GST స్లాబ్‌ల తగ్గింపుతో దేశ ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది. యూరోపియన్ యూనియన్‌తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నాం. రూ.12లక్షల వార్షిక ఆదాయం వరకు ఆదాయపు పన్ను లేకుండా చేశాం. స్మార్ట్‌ఫోన్ల ఎగుమతుల్లోనూ భారత్ దూసుకెళ్తోంది. భారత్ పవర్ టెక్నాలజీ హబ్‌గా రూపొందుతోంది. గ్రీన్ ఎనర్జీ రంగంలో భారత్‌ను పవర్ హౌస్‌గా తయారు చేస్తున్నాం. భవిష్యత్‌లో 100 గిగావాట్ల న్యూక్లియర్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యం. 500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి చర్యలు. వికసిత్
