పట్టణ అభివృద్ధికి సహకరించాలి-తొర్రూరు మున్సిపల్ చైర్మన్ తూనం శ్రావణ్ కుమార్

పట్టణ అభివృద్ధికి సహకరించాలి-తొర్రూరు మున్సిపల్ చైర్మన్ తూనం శ్రావణ్ కుమార్

తొర్రూరు డివిజన్ నేటి ధాత్రి

తొర్రూరు పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని తోరూర్ మున్సిపల్ చైర్మన్ తూనం శ్రావణ్ కుమార్ కోరారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మునిసిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్ ఆధ్వర్యంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక షెడ్యూల్ ప్రకారం మున్సిపాలిటీలోని కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బందులచే ప్రతిజ్ఞ చేయించి, 10వ వార్డులో పారిశుద్ధ్య కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 99 రోజుల ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక అనే ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టడానికి శ్రీకారం చుట్టిందని, దీనిలో భాగంగా మున్సిపాలిటీలో ప్రతి ఒక్కరు సమన్వయంతో పట్టణ అభివృద్ధికి పాటుపడాలన్నారు.
అన్ని వార్డులలో పనులు జరిగే విధంగా ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాలు, యువకులను భాగస్వామ్యం చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ సోమ రజని రాజశేఖర్, కౌన్సిలర్లు తూర్పాటి రవి, మాడుగుల భవానిలత, అల్లం శ్యామల, కిన్నెర కవిత, ముద్దసాని సురేష్, ధరావత్ పద్మ,చకిలేల అలివేణి, జాటోత్ భద్రు నాయక్, మున్సిపల్ సిబ్బంది,మెప్మా, ఆర్పీలు, తదితరులు పాల్గొన్నారు.

ఉచిత కంటి వైద్య శిబిరం సద్వినియోగం చేసుకోండి…

ఉచిత కంటి వైద్య శిబిరం సద్వినియోగం చేసుకోండి

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండలం గట్లకానీపర్తి గ్రామంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తు న్నారు తేదీ 08 03 2026 ఆదివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వైద్య శిబిరం నిర్వహిం చబడును. మెడికల్ హెల్త్ క్యాంప్ ద్వారా అందిస్తున్న ఉచిత వైద్య సేవలకు గట్ల కనపర్తి గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాలైన నర్సింహులపల్లి ప్రోచా రo,మాందారిపేట సూరంపేట మరియు పులుకుర్తి తదితల గ్రామాలకు చెందిన మహిళలు ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు

ఉచిత నేత్ర పరీక్ష క్యాంప్..

ఉచిత నేత్ర పరీక్ష క్యాంప్

సర్పంచ్ భానోత్ రమ భగవాన్ ఆధ్వర్యంలో

సూర్య స్వచ్ఛంద సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా నేత్ర వైద్య శిబిరం

నిరుపేదలకు కంటి చూపును ఇవ్వడమే మా స్వచ్ఛంద సేవ సంస్థ ఉద్దేశం… డాక్టర్ మాధవరావు.

మహబూబాబాద్, నేటిధాత్రి:

మండలంలోని గోవిందపురం గ్రామంలో సూర్య స్వచ్ఛంద సేవా ట్రస్ట్ డాక్టర్ మాధవరావు నిరుపేదలకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి కంటి అద్దాలు మరియు కంటి ఆపరేషన్లు గోవిందాపురం గ్రామ సర్పంచ్ భానోత్ రమ భగవాన్ల ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత కంటి పరీక్షల శిబిరం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్పంచ్ భానోత్ రమ పాల్గొన్నారు. గ్రామంలోని నిరుపేదలకు కంటి పరీక్ష చేయించుకోలేనటువంటి వారికి సూర్య స్వచ్ఛంద సేవా ట్రస్టు వారిచే ఉచితంగా కంటి ఆపరేషన్లు అవసరం ఉన్నవారికి కంటి అద్దాలు ఆపరేషన్ చేయాలన్న వారికి ఉచితంగా ఆపరేషన్లు నిర్వహిస్తున్న డాక్టర్ మాధవరావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో గోవిందపురం గ్రామ ప్రజలు 111 మంది ఉచిత వైద్య శిబిరంలో పరీక్షల నిర్వహించుకున్నారని వారిలో 40 మందికి ఉచితంగా కంటి అద్దాలు అందించడం జరిగిందని, అలాగే కంటి ఆపరేషన్ అవసరం ఉన్నటువంటి 9 మందికి ఆపరేషన్ నిర్వహించుటకు జిల్లా మహబూబాబాద్ కేంద్రంలో ఉన్నటువంటి సూర్య స్వచ్ఛత సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ మాధవరావు కంటి దావకానలో ఉచితంగా కంటి ఆపరేషన్ చేయడం జరుగుతుందని అన్నారు. మనిషి మనుగడ సజావుగా సాగాలంటే నయనాలు ప్రధానం అలాంటి నాయాలు నేత్రాలు నేడు మనం తింటున్నటువంటి కలుషిత ఆహారం వల్ల రెండవ అనారోగ్య సమస్యలు ఏర్పడడంతో నిరుపేదలైన వారు వైద్యం చేయించుకోలేక స్తోమత లేక నిర్లక్ష్యం వహిస్తున్నారని అంతత్వంతో కాలం గడుపుతున్నారని ఇలాంటి వారి పట్ల దాతృత్వం చాటుకొని ముందుకు పోతున్న సంస్థ సూర్య స్వచ్ఛంద సేవ ట్రస్ట్ మహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టుతుందని నిరుపేదలైన వారికి ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించి కంటి ఆపరేషన్లు చేసి మరి కంటి అద్దాలను ఇస్తుందని ఎవరికీ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా చేర్చుకునే మా గొప్ప అవకాశం కల్పిస్తున్నారని గ్రామ ప్రజల తరఫున సంస్థ సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని గ్రామ సర్పంచ్ భానోత్ రమా భగవాన్ అన్నారు. ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్నటువంటి వారు గ్రామ వార్డు సభ్యులు కాంపాటి వెంకన్న, యాకయ్య, ప్రభాకర్, దేవేందర్ లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

కొల్లూరులో ఉచిత కంటి పరీక్షల శిబిరం:

కొల్లూరులో ఉచిత కంటి పరీక్షల శిబిరం:

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సుమిత్ర ఐ కేర్ హాస్పిటల్ జహీరాబాద్ వారి అధ్వర్యంలో ఉచిత కంటి శిబిరం కొల్లూరు గ్రామ పంచాయితీ ఆవరణలో ఏర్పటు చెయ్యడం జరిగింది…ఇట్టి కార్యక్రమములో మాజీ ఎంపీటీసీ సీహెచ్ రాజ్ కుమార్, కొల్లూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డప్పూరు సంగమేష్, యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చింతలగట్టు శివరాజ్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, మండల బీసీ జేఏసీ ఉపాధ్యక్షులు దిగంబర్,మలగరి బాలప్ప, మొగుడంపల్లి విష్ణు,డప్పూర్ రాములు,కుమ్మరి దశరథ్, మరియు హాస్పిటల్ సిబ్బంది,గ్రామ పెద్దలు,గ్రామ ప్రజలు,వృద్ధులు పాల్గొన్నారు…ఇట్టి కార్యక్రమములో కంటి సమస్యలు ఉన్నవారికి కంటి పరీక్షలు చేసారు.

ఉచిత కంటి వైద్య శిబిరం

ఉచిత కంటి వైద్య శిబిరం

 

డాక్టర్ జి.సంజీవరావు

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,, నేటిధాత్రి..

 

కరకగూడెం:మండలంలోని కొత్తగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాల నందు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ,మారుతి నర్సింగ్ కాలేజ్,లయన్స్ క్లబ్ భద్రాచలం సహకారంతో సికింద్రాబాద్ వారిచే పుష్పగిరి కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
ఉదయం నుండి సాయంత్రం వరకు కొనసాగిన ఈ వైద్య శిబిరంలో ప్రజలు విస్తృతంగా పాల్గొన్నారు.ఈ వైద్య శిబిరంలో డాక్టర్ జి.సంజీవరావు పాల్గొని 250 మందిని కంటి పరీక్షలు చేయగా అందులో 60 మందికి శాస్త్ర చికిత్సలకు ఎంపిక చేశారు.అనంతరం రోగులకు ఉచితంగా మందులు అందజేశారు.ఈ సందర్భంగా డా,, సంజీవరావు మాట్లాడుతూ… ఏజెన్సీలోని మారుమూల గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం గొప్ప నిర్ణయమని,ప్రజల నుండి మంచి విశేష స్పందన ఉందన్నారు.ఏజెన్సీ ప్రాంతంలోని పేదవారికి ఈ సంస్థ వారు మరెన్నో సేవలందించాలని వారు కోరారు.ఈ వైద్య శిబిరంలో పాల్గొన్న వైద్యులను,సంయుక్త సంస్థ వారిని గ్రామస్తులు ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిర్వాహకులు డా,,ఎస్ఎల్ కాంతారావు,రాజిరెడ్డి,ఆదినారాయణ,సూర్యనారయణ,గ్రామస్తులు:గొగ్గల నారాయణ,ఈసం సమ్మయ్య,ఈసం సత్యం,కొమరం లక్ష్మీనర్సు,జోగ దూలయ్య,రామక్రిష్ణ,మారుతి కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version