*ఆంజనేయస్వామి దేవాలయంలో మాజీ ఎంపీడీఓ ప్రత్యేక పూజలు*
*పరకాల,నేటిధాత్రి*
హనుమత్ జయంతి సందర్భంగా పరకాల మాజీ ఎంపీడీఓ పెద్ది ఆంజనేయులు కుటుంబ సమేతంగా మండలంలోని మల్లక్కపేట శ్రీ ఆంజనేయస్వామి దేవాలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు.దేవాలయంలో హనుమత్ జయంతి వేడుకలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న నేపథ్యంలో మాజీ ఎంపీడీఓ ప్రత్యేకంగా పాల్గొని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.అనంతరం ఆలయ ఈఓ వెంకటయ్య మరియు ప్రధాన అర్చకులు కాటూరి జగన్నాధ చార్యులు వేదమంత్రాల నడుమ మహదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో మల్లక్కపేట సర్పంచ్ దొమ్మటి కవిత మధు,పంచాయతీ కార్యదర్శి సుమలత,కారోబార్ అనందరావు తదితరులు పాల్గొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం కరకగూడెం గ్రామపంచాయతీ బొడ్రాయి సమీపంలో ఇటీవల వీచిన ఈదురుగాలులు మరియు భారీ వర్షాల కారణంగా షేక్ హైమద్ ఇంటి పైకప్పు పూర్తిగా ధ్వంసమై తీవ్ర నష్టం జరిగింది ఈ విషయం తెలుసుకున్న కరకగూడెం మండలం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ప్రదేశానికి చేరుకొని బాధిత కుటుంబాన్ని పరామర్శించే అనంతరం వారికి 25 కేజీల బియ్యం మరియు నిత్యవసర సరుకులు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా బాధ్యత కుటుంబానికి ధైర్యం చెబుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తరఫున అవసరమైన సహాయం అందించేందుకు ఎల్లప్పుడూ ముందుంటానని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ నాగబండ వెంకటేశ్వర్లు, గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
*ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే*
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండల కేంద్రం లోని రైతు వేదికలో నిర్వ హించిన కార్యక్రమంలో పలు గ్రామాలకు చెందిన 38 మంది లబ్ధిదారులకు 11,26,000/- రూపాయల విలువ గల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్య నారాయణరావు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ పేద,మధ్యత రగతి కుటుంబాలకు ఆప ద్బాంధవంగా నిలుస్తోంద న్నారు.అనారోగ్య సమస్య లతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుం బాలకు ప్రభుత్వం అండగా నిలిచి సహాయం అందించడం జరుగుతుంది.
పార్టీలకతీతం గా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు లను అందజేశారు.గత బిఆర్.ఎస్ ప్రభుత్వం కేవలం బిఆర్.ఎస్ పార్టీ కార్యకర్తలకే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు.ప్రజల కష్టసు ఖాల్లో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ తోడుగా ఉంటుం దని పేర్కొన్నారు.అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నా మని,ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్ర తినిధులు, మండల అధికా రులు కాంగ్రెస్ పార్టీ నాయ కులు,కార్యకర్తలు లబ్ధిదా రులు పాల్గొన్నారు.
ఘనంగా ఎస్టిపిపి డిస్పెన్సిరిలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవం
జైపూర్,నేటి ధాత్రి:
ఎస్టిపిపి లోని డిస్పెన్సరీలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ఘనంగా మంగళవారం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్టిపిపి ఈడి సిహెచ్.చిరంజీవి పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆధునిక నర్సింగ్ వ్యవస్థకు ఆద్యురాలైన ఫ్లోరెన్స్ నైటింగలే (లేడీ విత్ ది లాంప్ ) జన్మదినం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా మే 12న అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని జరుపుకుంటారని తెలిపారు.ఇది వైద్య రంగంలో ప్రాణాలను రక్షించే “దేవదూతలను” గౌరవించుకునే ప్రత్యేక రోజు అని కొనియాడారు.రోగులకు కేవలం మందులు ఇవ్వడమే కాకుండా ప్రేమతో,ఓర్పుతో,నిస్వార్థ సేవను అందిస్తూ వారికి ధైర్యాన్ని నూరిపోసేది నర్సులు మాత్రమే అని తెలిపారు.ముఖ్యంగా కరోనా వంటి కష్టకాలంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి, కుటుంబాలను వదిలి,రోగుల కోలుకోవడం కోసం నిరంతరం శ్రమించిన నర్సుల సేవలు అపారమైనవని పేర్కొన్నారు.వారు వైద్యులకు కుడిభుజంగా ఉంటూ ఆరోగ్య వ్యవస్థను సమర్థంగా నడిపిస్తున్నారని తెలిపారు.అనంతరం అధికారులు ఫ్లోరెన్స్ నైటింగలే చిత్రపటానికి పూలమాలలు వేసి,కాండిల్స్ వెలిగించి,కేక్ కట్ చేశారు.అలాగే నర్సింగ్ రంగంలో ఉత్తమ సేవలు అందించినందుకు రాజమణి, సీనియర్ స్టాఫ్ నర్సును ఉత్తమ స్టాఫ్ నర్సుగా ఎంపిక చేసి,ఈడి చిరంజీవి ప్రశంసా పత్రాన్ని అందించి శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఎస్టిపిపి జీఎం ఎం. నరసింహరావు,జీఎం (పీసీఎస్ & ఓ అండ్ ఎం)ఎం.మదన్మోహన్, ఏజీఎం (పీసీఎస్)కే. సూర్యనారాయణ రాజు, ఏఐటీయూసీ ఫిట్ సెక్రటరీ సత్యనారాయణ,సీఎంఓఏఐ బ్రాంచ్ ప్రెసిడెంట్ డి.పంతుల, మెడికల్ సూపరింటెండెంట్ బి. జానకి,ఎస్వో టు ఈడి వెంకటయ్య,సీనియర్ పర్సనల్ ఆఫీసర్ ఠాకూర్ మోహన్ సింగ్, రిటైర్డ్ డా.ప్రభాకర్ తదితర అధికారులు,మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని నేటి నుంచి 12 జూన్ 2026 వరకు జరిగే ఉమ్మడి కరీంనగర్ జిల్లా అండర్-14,16,19,23 బాలురు, బాలికల ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని క్రికెట్ అసోసియేషన్ ఇంచార్జ్ వంకాయల కార్తీక్ పేర్కొన్నారు. సిరిసిల్లలో మంగళవారం విలేకరులు సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామీణ పట్టణ ప్రాంతాలలోనే బాల బాలికల ప్రతిభను గుర్తించి క్రికెట్ నైపుణ్యం సాధించే విధంగా ప్రత్యేక ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల సిరిసిల్ల గోదావరిఖని కరీంనగర్ లో శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. పాల్గొనే క్రీడాకారులు తప్పనిసరిగా ఒరిజినల్ సర్టిఫికెట్లు ఆధార్ కార్డు వైట్ డ్రెస్ తో తమ పేర్లను నమోదు చేసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఆయన వివరించారు.
మహిళా సంఘాల ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం
జైపూర్,నేటి ధాత్రి:
మహిళా సంఘాల ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం.మంత్రి వివేక్ వెంకటస్వామి చొరవతో చెన్నూరు నియోజకవర్గంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో రైతుల వడ్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో, జైపూర్ మండలం మిట్టపల్లి గ్రామపంచాయతీలో ఐకెపి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ కామేర మనోహర్,ఉప సర్పంచ్ కుమ్మరి రాజశేఖర్,వార్డు సభ్యులు,మహిళా సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ కామేర మనోహర్ మాట్లాడుతూ రైతులందరూ తమ పంటను ఐకెపి కేంద్రంలోనే అమ్ముకోవాలని సూచించారు.దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని,ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు తమ ధాన్యాన్ని విక్రయించుకోవాలని తెలిపారు.ఉప సర్పంచ్ కుమ్మరి రాజశేఖర్ మాట్లాడుతూ రైతులు తమ పంటను వడ్ల కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చే ముందు తాలు,తేమ శాతం లేకుండా శుభ్రంగా సిద్ధం చేసుకోవాలని సూచించారు. అలాగే మంత్రి వివేక్ వెంకటస్వామి చొరవతో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఐకెపి వడ్ల కొనుగోలు కేంద్రాలు,ఇతర సంక్షేమ కార్యక్రమాలలో పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు.మహిళా సంఘాల సీసీ రాజన్న మాట్లాడుతూ ఐకెపి కేంద్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్వరితగతిన ధాన్యం కొనుగోలు చేసి,కేటాయించిన రైస్ మిల్లర్లకు సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల సీసీ రాజన్న,అశ్విని వివో సభ్యురాలు స్వరూప,సర్పంచ్, ఉప సర్పంచ్,వార్డు సభ్యులు,రైతులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర
ఆస్పత్రికి వచ్చే పేషెంట్స్ కు కనీసం తాగునీరు లేక ఇబ్బంది పడుతున్నారు
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి వచ్చే పేషెంట్స్ తాగునీరు లేక ఇబ్బందులకు గురవుతున్నారు కావున వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి ఆసుపత్రిలో మంచినీటి సౌకర్యాలు కల్పించాలని బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు మంగళవారం ఉదయం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని సందర్శించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో టాయిలెట్స్ కు తాళాలు వేసి ఉన్నాయి.
కొన్ని టాయిలెట్స్ లో వాటర్ సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్న పేషెంట్స్ వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి ప్రభుత్వ ఆసుపత్రిలో తాగునీరు సమస్యను పరిష్కరించాలి ఆసుపత్రి పేషెంట్స్ అన్నం పెట్టే వంట గదిని పరిశీలించారు నాణ్యత లోపంతో ఉన్న వస్తువులను వాడుతున్నారు క్వాలిటీ వస్తువులు వాడి పేషెంట్స్ కు మంచి భోజనాన్ని అందివ్వాలి అని వారు అన్నారు మిషన్ భగీరథ పైప్ లైన్ ద్వారా ఆసుపత్రికి సపరేట్ లైన్ వేయాలని వారు అన్నారు ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ప్రిన్సిపాల్టీ ఫ్లోర్ లీడర్ గండ్ర హరీష్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకులు హరీష్ రెడ్డి సిద్దు తిరుపతి తదితరులు పాల్గొన్నారు
ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌కు రాష్ట్ర ఉత్తమ అవార్డు
సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రూ.1.10 లక్షల ప్రోత్సాహకం అందుకున్న ప్రొఫెసర్ మల్లం నవీన్
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల(అటానమస్), ప్రిన్సిపల్ ప్రొఫెసర్ మల్లం నవీన్‌కు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక-విద్యా వారోత్సవాలలో భాగంగా రాష్ట్ర స్థాయి ఉత్తమ ప్రిన్సిపల్ పురస్కారం లభించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పురస్కారంతో పాటు కళాశాల అభివృద్ధికి రూ.లక్ష, రూ.10 వేల నగదు ప్రోత్సాహక చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ నవీన్ మాట్లాడుతూ ఈ పురస్కారం తన వ్యక్తిగత విజయం కాకుండా అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థుల సమిష్టి కృషికి లభించిన గుర్తింపు అని పేర్కొన్నారు. సంకల్పం, క్రమశిక్షణ, సమిష్టి కృషి ఉంటే ప్రభుత్వ కళాశాల కూడా రాష్ట్రంలోనే ఆదర్శ విద్యాసంస్థగా నిలుస్తుందని నిరూపించామన్నారు. గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమని, కళాశాలను విద్యా ప్రమాణాలు, క్రమశిక్షణ, సాంకేతిక వనరులు, పరిశోధనలో ఉత్తమంగా తీర్చిదిద్దుతానని ప్రిన్సిపల్ తెలిపారు.డిజిటల్ లెర్నింగ్, పోటీ పరీక్షల శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, క్రీడలు, వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలకు మరింత ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. ప్రతి తరగతి గది స్ఫూర్తి కేంద్రంగా, ప్రతి విద్యార్థి నాయకుడిగా ఎదగాలన్నదే తన కల అని పేర్కొన్నారు. కళాశాల అభివృద్ధికి సహకరిస్తున్న ప్రభుత్వానికి, ఉన్నత విద్యాశాఖ అధికారులకు, అధ్యాపకులకు, సిబ్బందికి, తల్లిదండ్రులు, విద్యార్థులకు ప్రొఫెసర్ మల్లం నవీన్ కృతజ్ఞతలు తెలిపారు.
11వ వార్డులో జరిగినటువంటి ముస్లిం మైనారిటీ సోదరుడు సాదియా తబుసుమ్ డాటర్ ఆఫ్ సయ్యద్ & షహీద్ పెళ్లికి హాజరై వారికి కల్యాణ కానుక కింద 5000 రూపాయలు కౌన్సిలర్ ముక్కెర్ల మల్లేష్ యాదవ్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో 11వ వార్డు కౌన్సిలర్ కుక్కర్ల మల్లేష్ అభిమానులు నాయకులు పాల్గొన్నారు.
ఎరువుల కంపెనీలు అమలు చేస్తున్న లింకు విధానాలు రిటైల్ డీలర్లతో పాటు రైతులను కూడా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని పరకాల మండల ఫర్టిలైజర్స్,పెస్టిసైడ్స్ మరియు డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు గందె వెంకటేశ్వర్లు ఆరోపించారు.సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ రైతులకు అత్యవసరమైన యూరియా ఎరువులు ఇవ్వాలంటే డిమాండ్ లేని ఇతర ఉత్పత్తులను బలవంతంగా కొనుగోలు చేయాల్సిన పరిస్థితిని కంపెనీలు సృష్టిస్తున్నాయని విమర్శించారు.గత రెండేళ్లుగా రిటైల్ డీలర్ల మార్జిన్లు భారీగా తగ్గిపోవడంతో రవాణా,గోడౌన్,విద్యుత్ వంటి నిర్వహణ ఖర్చులు కూడా రావడం లేదన్నారు.హోల్‌సేల్ వ్యాపారులు నేరుగా ఎంఆర్పీ ధరలకే విక్రయాలు చేయడంతో చిన్న డీలర్లు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు.దీంతో అనేక ఎరువుల దుకాణాలు మూతపడే పరిస్థితి ఏర్పడిందన్నారు.అదేవిధంగా సాగు సీజన్ ప్రారంభ సమయంలో కంపెనీలు ఉద్దేశపూర్వకంగా యూరియా,డీఏపీ ఎరువుల కొరత సృష్టిస్తున్నాయని ఆరోపించారు.పాత స్టాక్‌ను వదిలించుకునేందుకు డీలర్లపై ఒత్తిడి తెస్తూ రైతులకు సకాలంలో ఎరువులు అందకుండా చేస్తున్నారని పేర్కొన్నారు.దీని ప్రభావంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని తెలిపారు.‘లింకు’ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని,రిటైల్ డీలర్లకు కనీసం 8 నుంచి 10 శాతం వరకు న్యాయమైన మార్జిన్ కల్పించాలని,జిల్లాలు మరియు మండలాల వారీగా ఎరువుల సరఫరా వివరాలను ఆన్‌లైన్‌లో ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు.ఇది కేవలం డీలర్ల సమస్య మాత్రమే కాకుండా రైతు బతుకు,గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశమని గందె వెంకటేశ్వర్లు హెచ్చరించారు.
రోగుల ప్రాణాలను కాపడుతూ సేవభావంతో ముందుకు సాగుతున్న నర్సులు
పరకాల,నేటిధాత్రి
అనారోగ్యంతో ఆసుపత్రికి చేరిన ప్రతి రోగికి ముందుగా కనిపించే ఆత్మీయ ముఖం నర్సులదే.బాధలో ఉన్నవారికి ధైర్యం చెప్పడం,రాత్రింబవళ్లు సేవలందించడం,అత్యవసర సమయాల్లో అప్రమత్తంగా వ్యవహరించడం వంటి బాధ్యతలను నర్సులు నిబద్ధతతో నిర్వహిస్తున్నారు.వైద్య రంగంలో డాక్టర్లతో సమానంగా నర్సుల పాత్ర కూడా అత్యంత కీలకమని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.ప్రతి సంవత్సరం మే 12న ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని నిర్వహిస్తూ నర్సింగ్ సేవలను స్మరించుకుంటారు.ఆధునిక నర్సింగ్ వ్యవస్థకు పునాది వేసిన ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతిని పురస్కరించుకుని ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.ప్రభుత్వ,ప్రైవేట్ ఆసుపత్రుల్లో పని చేస్తున్న నర్సులు రోగుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వైద్యుల సూచనల మేరకు చికిత్స అందిస్తున్నారు.మందులు ఇవ్వడం,ఇంజెక్షన్లు చేయడం, పరీక్షల కోసం రోగులను సిద్ధం చేయడం,అత్యవసర సమయాల్లో వెంటనే స్పందించడం వంటి అనేక బాధ్యతలను నిర్వహిస్తున్నారు.చిన్నారుల వార్డుల నుంచి ఐసీయూ వరకు ప్రతి విభాగంలోనూ నర్సుల సేవలు కీలకంగా మారాయి.
కరోనా మహమ్మారి సమయంలో నర్సులు చేసిన సేవలను సమాజం ఇప్పటికీ గుర్తుచేసుకుంటోంది.కుటుంబాలకు దూరంగా ఉంటూ కరోనా బాధితులకు సేవలందించిన నర్సులు నిజమైన యోధులుగా నిలిచారు.ప్రాణాలకు ముప్పు ఉన్నప్పటికీ విధులను వదలకుండా పని చేసి ఎన్నో కుటుంబాలకు ధైర్యం ఇచ్చారు.ఆ సమయంలో అనేక మంది నర్సులు తమ ఆరోగ్యాన్ని సైతం పణంగా పెట్టి సేవలందించారని వైద్యాధికారులు గుర్తు చేస్తున్నారు.గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆరోగ్య సేవలను ప్రజలకు చేరవేయడంలో నర్సులు కీలక పాత్ర పోషిస్తున్నారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో గర్భిణీల సంరక్షణ,చిన్నారుల టీకాలు,ఆరోగ్య అవగాహన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు.మహిళలు, వృద్ధులు,చిన్నారులకు అవసరమైన వైద్య సేవలు అందించడంలో నర్సింగ్ సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారు.నర్సింగ్ అనేది కేవలం ఉద్యోగం కాదని,అది మానవతా సేవకు ప్రతీక అని పలువురు వైద్య నిపుణులు అభిప్రాయపడ్డారు.రోగి బాధను అర్థం చేసుకుని సేవ చేయగలిగే మనసు ఉన్నవారే మంచి నర్సులుగా నిలుస్తారని పేర్కొన్నారు.ఒత్తిడి,సమయాభావం,సిబ్బంది కొరత వంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ నర్సులు తమ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తున్నారని కొనియాడారు.రోగి కోలుకుని చిరునవ్వుతో ఇంటికి వెళ్లడమే మాకు నిజమైన సంతోషం అని పలువురు నర్సులు పేర్కొన్నారు.సేవా భావం,సహనం,మానవత్వానికి ప్రతీకలుగా నిలుస్తున్న నర్సులకు సమాజం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
నర్సుల సేవలు వైద్య రంగానికి వెన్నెముక
అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి నర్సుల సేవలు ఎంతో కీలకమని డాక్టర్ రోహిత్ సాదు అన్నారు.అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా మంగళవారం ఆయన నర్సింగ్ సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోగుల సంరక్షణలో నర్సులు చూపుతున్న సేవాభావం అభినందనీయమన్నారు.పగలు,రాత్రి తేడా లేకుండా విధులు నిర్వహిస్తూ రోగులకు ధైర్యం చెప్పడం,చికిత్సలో భాగస్వామ్యం కావడం నర్సుల గొప్పతనమని పేర్కొన్నారు.ఆసుపత్రుల్లో వైద్యుల తర్వాత అత్యంత బాధ్యతాయుతమైన పాత్రను నర్సులే నిర్వహిస్తున్నారని తెలిపారు.కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నర్సులు సేవలందించారని గుర్తు చేశారు.గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను ప్రజలకు చేరవేయడంలోనూ నర్సుల పాత్ర కీలకమని అన్నారు.రోగి కోలుకుని ఆరోగ్యంగా ఇంటికి వెళ్లడమే నర్సులకు నిజమైన సంతోషమని తెలిపారు.సేవాభావం,సహనం,మానవత్వంతో పనిచేస్తున్న ప్రతి నర్సుకు సమాజం రుణపడి ఉంటుందని డాక్టర్ రోహిత్ సాదు కొనియాడారు.
జనం బలహీనతలు ఓట్లు చేసుకుందాం!
`అలవి కానీ హామీలిచ్చి గెలుద్దాం!
`ఇప్పడైతే నమ్మిద్దాం… గెలిచి డబ్బులేదందాం!?
`రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న ఎన్నికల బాట.
`నిజం చెబితే జనం నమ్మడం లేదు.
`అబద్దాలు చెప్పకపోతే గెలిచే పరిస్థితి లేదు.
`రాజకీయ వ్యూహకర్తలు కూడా ఇదే చెబుతున్నారు.
`రాజకీయ పార్టీలు అదే నమ్మి ప్రచారం చేసుకుంటున్నారు.
`ఎవరు ఎన్ని ఎక్కువ హామీలు ఇస్తున్నారనేదే జనం ఆలోచిస్తున్నారు.
`ఉచిత పతకాలు అందుతాయనే ప్రజలు ఆశ పడుతున్నారు.
`అన్ని అమలు కాకపోయినా ఏ ఒక్కటైనా అందక పోతుందా అనుకుంటున్నారు.
`తమిళనాడు కొత్త సిఎం విజయ్ మొదటి రోజే మోసం మొదలు పెట్టారు.
`ఖజానా ఖాళీ అని చెప్పకనే చెప్పేశారు.
`ఎన్నికల ముందు రూ. 10 లక్షల కోట్ల అప్పు గురించి విజయ్ కి తెలియదా?
`విజయ్ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే రూ. 10 లక్షల కోట్లు కావాలి.
`ఎన్నికల ప్రచారంలో అలవికాని హామీలు ఎందుకిచ్చినట్లు?
`ఎన్నికల ముందు ప్రజలు అతిగా ఆశలు పెట్టుకోవద్దని ఎందుకు చెప్పానట్లు!
`2014 కు ముందు ఏపీ లో జగన్ నిజం చెప్పారు.. ఓడిపోయారు!
`చంద్రబాబు ఆ ఎన్నికల్లో గెలిచినా అమలు చేయలేదు?
`2019 అలవికాని హామీలిచ్చారు.. గెలిచారు.
`అధికారంలోకి వచ్చి జగన్ చేతులెత్తేశారు.
`మళ్ళీ చంద్రబాబు మళ్ళీ అదే దారి ఎంచుకున్నారు.. గెలిచి పాలిస్తున్నారు.
`తెలంగాణలోనూ అదే జరిగింది.. 2014 కెసిఆర్ అలాగే చెప్పి గెలిచారు.
`2023 లో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ఇచ్చారు!
`వంద రోజుల్లో అమలు చేస్తామని మాట ఇచ్చి గెలిచారు.
`లంకే బిందెలు ఉన్నాయనుకున్నాం.. కానీ కుండలు కూడా లేవని తెల్చేశారు.
`ఇలా హామీలివ్వడం.. ఎన్నికల్లో గెలిచి మాట మార్చడం అందరూ నేర్చుకుంటున్నారు.
`అలాంటి హామీలు అమలు సాధ్యమా కాదా అని ప్రజలు కూడా ఆలోచించడం లేదు.
`అలవికాని హామీలు ఆచరణ సాధ్యం కాదని ఏ ఒక్క మేధావి చెప్పడు.
`ఏ మీడియా ఎన్నికల నాడు ప్రజలను చైతన్యం చేయదు.
`ఎన్నికల ప్రచార ప్రకటనలు వస్తే చాలు.. మీడియాకు అదే పదివేలు?
`గతంలో ఎన్నికలకు ఏడాది ముందు నుంచి మేధావులు ప్రజలను చైతన్యం చేసేవారు.
`విస్తృతంగా సభలు సమావేశాలు ఏర్పాటు చేసేవారు.
`ఇప్పుడు మేధావులు కూడా పార్టీల పరంగా చీలిపోయారు.
`మేధావులు కూడా మేతకు అలవాటు పడ్డారు.
`పదవుల కోసం ఆరాట పడుతున్నారు.
`మేధావి తనాన్ని అమ్ముకుంటుంటున్నారు.
`ప్రజలను పార్టీల పరంగా తప్పు తోవ పట్టిస్తున్నారు.
`సోషల్ మీడియా నిజాలు చెప్పాలని చూసినా సాధ్యం కావడం లేదు.
`ప్రజలు కూడా అసత్యాలనే సత్యాలనుకుంటున్నారు.
`నిజాలు చెప్పే వారిని అబద్దాల కోరులనుకుంటున్నారు!
`ఎన్నికల హామీలకు చట్ట బద్దత కల్పించాలి?
`ఎన్నికల హామీలు రాజ్యాంగ బద్దం చేయాలి!
`ఎన్నికల హామీలు తప్పితే పాలకులకు శిక్షలు పడేలా చట్టం రావాలి!
`అది సాధ్యమయ్యే పని కాదు.. ఏ పార్టీ ఒప్పుకోదు.
`ప్రజలు మారనంత కాలం రాజకీయాలు మార్చడం కష్టం.
హైదరాబాద్, నేటిధాత్రి:
ఓడ ఎక్కెముందు ఓడ మల్లన్న, ఓడ దిగిన తర్వాత బోడ మల్లన్న అనే సామెతను దేశంలో రాజకీయ పార్టీలు నిజం చేస్తున్నాయి. ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసినుట్లు చేస్తున్నాయి. జనం బలహీనతలను ఆసరా చేసుకుంటున్నాయి. అదికారంలోకి వచ్చి మాట మార్చుతున్నాయి. అలవి కాని హమీలిస్తున్నారు. ఖచ్చితంగా అమలు చేస్తామని ఊదరగొడుతున్నారు. జనం నమ్మేలా ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల్లో గెలిచి తర్వాత అమలుపై నీలినీడలు కమ్మేస్తున్నారు. పేదల జీవితాలను త్రిశంకు స్వర్గంలోకి నెట్టేస్తున్నారు. ఇప్ప్పుడైతే గెలుద్దాం. తర్వాత అమలు సంగతి చూద్దామన్నట్లు తయారౌతున్నారు. ఇది ఇప్ప్పుడు అలా మాయ మాటలు చెప్పి అదికారంలోకి రావడమే నయా ట్రెండ్ అనుకుంటున్నారు. పాపం అమాయక ప్రజలు నమ్మి ఓట్లేసి గెలిపిస్తున్నారు. ప్రజల బలహీనతలతో ఆటలాడుకుంటున్నామన్న భావన అసలే లేకుండా పోతున్నారు. పైగా జనం నిజం చెబితే వినడం లేదు. హమీల వర్షం కురిపించని పార్టీలను జనమే నమ్మడం లేదు. అలవి కాని హమీలను ఇచ్చే పార్టీలనే నమ్ముతున్నారు. గతంలో ప్రజలు పార్టీలు ఇచ్చే హమీలను బేరీజు వేసుకునేవారు. సాద్యమౌతుందా? లేదా? అని బాగా ఆలోచించుకునేవారు. అప్ప్పుటి బలహీనతలను అప్ప్పుడు అలా వాడుకున్నారు. ఇప్పటి రోజులను బట్టి ఇప్ప్పుడు అలాగే రాజకీయ ఆట ఆడుతున్నారు. 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రైతులకు ఉచిత కరంటు ఇస్తామని ప్రచారం విసృతంగా చేసింది. అయినా జనం నమ్మలేదు. ఎందుకంటే అప్ప్పుడున్న కరంటు కష్టాలతో బిల్లులు చెల్లిస్తుంటేనే కరంటు సరిగ్గా రావడం లేదు. ఎంత బిల్లులు చెల్లించినా, ఎప్ప్పుడు వస్తుందో, ఎప్ప్పుడో పోతుందో తెలియడం లేదు. అలాంటప్ప్పుడు ఉచిత కరంటు అనేది సాధ్యం కాదని జనం నిర్ణయించుకున్నారు. అలా ప్రజలు ఆలోచించుకోవడానికి కూడా అప్పటి రాజకీయ పార్టీ తెలుగుదేశం కారణం. ఉచిత కరంటు ఇవ్వడం అంటే కరంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవడమే అని తెలుగుదేశం చెప్పింది. కాని అదే కాంగ్రెస్ పార్టీ 2004 ఎన్నికల్లో మళ్లీ ఉచిత కరంటు ఇస్తామంటే నమ్మారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత రైతులకు ఉచిత కరంటు ఇచ్చారు. దాంతో రాజకీయ పార్టీలు ఇచ్చే హమీల మీద జనం నమ్మకం పెట్టుకున్నారు. అప్పటి నుంచి ఎన్నికల హమీలను నమ్ముతూ వస్తున్నారు. అలా జనం నమ్మకాన్ని ఎన్నికల్లో ఓట్లుగా మల్చుకుంటున్నారు. ఎన్నికల హమీలను తుంగలో తొక్కుతున్నారు. 2014 ఎన్నికల్లో బిఆరఎస్ పార్టీ అనేక హమీలు ఇచ్చింది. తెలంగాణలో తొలిసారి అదికారంలోకి వచ్చింది. ఏపిలో తెలుగుదేశం కూడా అలాంటి హమీలు ఇచ్చే అధికారంలోకి వచ్చింది. ఏపిలో అలవి కాని హమీలను ఇవ్వలేను అని చెప్పిన జగన్‌ను ఆ ఎన్నికల్లో ఓడించారు. తర్వాత ఎన్నికల్లో అదే జగన్ ఓట్ల కోసం అబద్దాలు చెప్పారు. గెలిచారు. ఇలా జనం నమ్మడం అýవాటు చేసుకున్నారు. రాజకీయ పార్టీలు మోసం చేయడం నేర్చుకున్నారు. దాంతో ప్రజలకు కూడా ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా అర్దం కాకుండాపోతోంది. తాజాగా తమిళనాడు ఎన్నికల్లోనూ అదే జరిగింది. ఇంకా పరిపాలన మొదలు కాకముందే ఆ రాష్ట్ర సిఎం. విజయ్ మొదటి రోజే తన నుంచి ఎక్కువగా ఆశించొద్దు! అని ప్రకటించారు. ఖజానా ఖాళీగా వుందన్నారు. గత పాలకులు ఇప్పటికే రాష్ట్రంలో 10లక్షల కోట్ల రూపాయల అప్ప్పులు చేశారు. వాటి భారమే గుదిబండగా వుందన్న అర్దం వచ్చేలా విజయ్ మాట్లాడారు. మరి ఎన్నికల ముందు వ్పుియ్‌కు ఈ విషయం తెలియదా? గత రెండు సంవత్సరాల క్రితం విజయ్‌పార్టీ ప్రకటించారు. సినిమాలు మానేశారు. పూర్తిగా రాజకీయాలు చేస్తూ వచ్చారు. కాని ఏనాడు రాష్ట్ర ఆర్ధిక స్ధితి గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. స్టాలిన్ ప్రభుత్వాన్ని నిందిస్తూ పోయారు. అవినీతి పాలన అంతం చేస్తానన్నారు. నీతి వంతమైన పాలన చెబుతూ వచ్చారు. కాని అలవి కాని హమీలు తాను ఇవ్వనని, మేలైన సంక్షేమం అందిస్తానని ఏనాడు చెప్పలేదు. కాని సరిగ్గా ఎన్నికల ముందు విజయ్ తన మ్యానిఫెస్టోను ప్రకటించారు. వాటి అమలుకు కనీసం 10లక్షల కోట్ల రూపాయలు అవసరమౌతాయి. అయినా ప్రకటించారు. అమలు చేస్తామని చెప్పారు. ప్రమాణ స్వీకారం రోజున ఆయన ఇచ్చిన హమీలలో ఆర్ధికపరమైన అంశాలలో ఏ ఒక్కదాని మీద సంతకం చేయలేదు. పైగా తననుంచి ఎక్కువగా ఆశించొద్దని ఒక్కమాటతో తేల్చేశారు. గత ఎన్నికల్లో తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ సరిగ్గా ఇదే చేసింది. ఆరు గ్యారెంటీలు అంటూ ఎన్నికలకు ఆరు నెలల నుంచి చెప్పడం మొదలు పెట్టారు. ముందు ఐదు గ్యారెంటీలన్నారు. తర్వాత మరో గ్యారెంటీని చేర్చారు. ఆరు గ్యారెంటీలలో మొత్తం 13 గ్యారెంటీలు చేర్చి జనం ముందుకు వచ్చారు. ప్రతి ఇంటికి గ్యారెంటీ కార్డులు పంచారు. కాంగ్రెస్ ప్రభుత్వం అదికారంలోకి వచ్చిన వెంటనే వాటిని అమలు చేస్తామన్నారు. ఒకే ఒక్క గ్యారెంటీ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అమలు చేస్తున్నారు. గత బిఆరఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలలో కొన్ని అమలు చేస్తున్నారు. రైతు బంధు లాంటి విషయంలో ఎన్నికల ముందు మÖడు పంటలకు ఎందుకు ఇవ్వవు అని కేసిఆర్‌ను ప్రశ్నించారు. కాని ఇప్ప్పుడు రెండున్నరేళ్లలో మÖడు సార్లు ఇచ్చారు. సిఎం. రేవంత్ రెడ్డి అదికారంలోకి 100 రొజుల్లోనే అన్ని హమీలు అమలు చేస్తామన్నారు. కాని నెల రోజుల్లోనే తాము లంకెబిందెలు వున్నాయని అనుకున్నాం. కాని ఇక్కడ కుండలు కూడా లేకుండా కేసిఆర్ దోచుకొని పోయాడని ప్రచారం మొదలపెట్టారు. ప్రజలను ఎన్నికల ముందు నమ్మించినట్లే, తర్వాత కూడా నమ్మిస్తూ కాలం గడిపేస్తున్నారు. మాకు ఐదేళ్ల కాలానికి ప్రజలు గెలిపించారు. ఇంకా సమయం వుందని దాటేస్తున్నారు. 2018 ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటిస్తే, ఎలా సాధ్యమౌతుందని చెప్పిన కేసిఆర్, ఆ వెంటనే తాము ఇస్తామన్నారు. తర్వాత నిండు అసెంబ్లీలో అలాంటి హమీ ఇవ్వలేదని మాట మార్చారు. సరిగ్గా అదే సమాధానం రేవంత్ సర్కారు కూడా అసెంబ్లీ సాక్షిగా అబద్దమాడేసింది. ఆర్ధిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క నిరుద్యోగ భృతి ఇస్తామనలేదన్నారు. ఆ హమీ ఊసు లేకుండా చేశారు. ఇలా మాయ చేయడం అýవాటు చేస్తున్నారు. జనం కూడా అలవాటు పడుతున్నారు. గతంలో ప్రశ్నించేవారు. కాని ఇప్ప్పుడు ప్రశ్నించినా ప్రయోజనం లేదని వదిలేస్తున్నారు. మళ్లీ ఎన్నికలొచ్చినప్ప్పుడు చూద్దామనుకుంటున్నారు. ఆనాడు మళ్లీ ఇదే హమీలను నమ్మి మోసపోవడానికి సిద్దంగా వున్నారు. ఇలా జనాన్ని నమ్మించడానికి ఏకంగా రాజకీయ వ్యూహకర్తలను ఏర్పాటు చేసుకుంటున్నారు. వారికి వందల కోట్లు చెల్లించి, ఉద్దండులైన నాయకులు కూడా వారి మీద ఆదారపడుతున్నారు. ఎన్నికల సాక్షిగా ప్రజలను మోసం చేస్తున్నారు. గెలిచి మాట తప్ప్పుతున్నారు. ఇలాంటి పరిస్ధితుýను గతంలో మేధావులు నిత్యం ప్రశ్నించేవారు. కాని ఇప్ప్పుడు గత పాలకులను నిందించిన మేధావులు సైతం ఇప్ప్పుడు మౌనంగా వుంటున్నారు. మేదావులు కూడా మేత కోసం ఆశపడుతున్నారు. పదవులు మీద మోజు పెంచుకుంటున్నారు. ఎంత సైలెంటుగా వుంటే అంత మేలని భావిస్తున్నారు. ఏదైన పదవి ఆఖరు వరకు రాకపోదా? అని ఎదురుచూస్తున్నారు. గతంలో మాత్రం ప్రజలు ఏ నాయకుడిని ఎన్నుకోవాలో? ఎలాంటి అర్హతలు వున్న నాయకులను ఎన్నుకోవాలన్నదానిపై ప్రజల్లో చైతన్యం కల్పించేవారు. కాని ఇప్ప్పుడు ఆ మేధావులే తమ స్వార్ధం కోసం ప్రజలను తప్ప్పుదారి పట్టిస్తున్నారు. మేధావులు కూడా పార్టీ పరంగా చీలిపోతున్నారు. మేదావులకు ఏ పార్టీతో సంబందం వుండకపోయేది. ఇప్ప్పుడు ఏ మేధావి ఏ పార్టీకి కొమ్ము కాస్తున్నాడో అనేది కూడా తెలిసిపోతోంది. వాళ్లు కూడా ముసుగు తీసేసుకుంటున్నారు. పార్టీలకు వంత పాడుతున్నారు. ఇక మీడియా సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎవరు ఎంత తూకం చెల్లిస్తారని చూస్తున్నారు. ప్రకటనలు ఎవరు దండిగా ఇస్తే వారి వార్తలు వండి వారుస్తున్నారు. జనాన్ని నమ్మిస్తున్నారు. ఇలా అన్ని వ్యవస్ధలు దిగజారి పోతున్నాయి. అబద్దాలు రాజ్యమేలేలా చేస్తున్నాయి. అందుకే అలవి కాని హమీలు ఇచ్చిన పార్టీలు గెలుస్తున్నాయి. హమీలు ఇవ్వని పార్టీలు అసమర్ధ పార్టీలుగా మారిపోతున్నాయి. హమీలకు చట్టబద్దతలేదు. రాజ్యాంగ బద్దత అసలే లేదు. కాదు కూడా!! అదంతే జనమింతే!!!
జనగణన 2027 మొదటి దశలో భాగంగా నేటి నుండి జూన్ 9 వరకు ఇంటింటికీ వచ్చి ఎన్యూమరేషన్ చేసే సిబ్బందికి ప్రజలు సహకరించాలని జిల్లా కలెక్టర్, ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ గరిమ అగ్రవాల్ కోరారు. జనగణన మొదటి దశలో భాగంగా సిరిసిల్ల పట్టణం లోని సుభాష్ నగర్ లో ఎన్యూమరేటర్లు ఇండ్ల గణన కోసం చేస్తున్న మ్యాపింగ్ ప్రక్రియను సోమవారం కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. జనగణన ప్రక్రియ చాలా ముఖ్యమైనదని, గణాంకాల రూపకల్పనకు సమగ్ర, ఖచ్చితమైన వివరాలను ప్రజలు అందించి జనగణన సిబ్బందికి సహకరించాలని కలెక్టర్ అన్నారు.
ఈరోజు నుండి 3 రోజుల పాటు ఇండ్ల గణన కోసం బ్లాక్ వారీగా మ్యాపింగ్ చేయడం జరుగుతుందని, తదనంతరం ప్రతీ ఇంటి నుండి వివరాలు సేకరించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో 173 మంది సూపర్ వైజర్లు, 1025 మంది ఎన్యూమరేటర్లకు శిక్షణ అందించామని, ఎన్యూమరేటర్లకు ఫోటో, క్యూ ఆర్ కోడ్ తో కలిగిన గుర్తింపు కార్డులు అందించడం జరిగిందని, దానిని స్కాన్ చేస్తే అధికారిక వెబ్ సైట్ లో పొంది ఉంచిన వారి పూర్తి వివరాలు వస్తాయని, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు. వారు అడిగే 33 రకాల ప్రశ్నలకు సమాధానాలు చెప్పి సహకరించాలని కోరారు. వేసవి కాలం దృష్ట్యా క్షేత్ర స్థాయిలో ఎన్యూమరేటర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. జనగణన పేరుతో ఎవరైనా అనుమానిత వ్యక్తులు మీ ఇంటికి వచ్చి వివరాలు అడిగే అవకాశం ఉంటుందని, అలాంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని అన్నారు. పరిశీలనలో జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాస చారి, మున్సిపల్ కమీషనర్ ఖదీర్ పాషా, సిరిసిల్ల తహసీల్దార్ మహేష్, తదితరులు ఉన్నారు.
మొక్కల కొనుగోలు కేంద్రాలను పెంచాలని సీపీఎం పార్టీ ధర్నా
నర్సంపేట, నేటిధాత్రి:
మొక్కల కొనుగోలు కేంద్రాలు పెంచాలని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నర్సంపేట ఆర్డిఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. పార్టీ వరంగల్ జిల్లా కార్యదర్శి చింతమల్ల రంగయ్య మాట్లాడుతూ గత నెల రోజులుగా మొక్కజొన్న రైతులు మండలానికి ఒకటి రెండు కేంద్రాలు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం వల్ల కొనుగోలు కేంద్రాలకు మొక్కలు తీసుకొచ్చిన రైతాంగం కాంటాలు కాక రైతాంగం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు.ఈ సంవత్సరం మొక్కజొన్న పంట సాగు విస్తీర్ణం పెరిగి అధిక దిగుబడులు వచ్చిందని ప్రభుత్వం ముందుచూపు అంచనా లేకుండా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతాంగం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని అన్నారు.రబీ సీజన్ వరి పంట కోతరకొచ్చిందని ఈ పరిస్థితులలో మొక్కజొన్నను అమ్మడం కోసం ఇబ్బందులు పడుతున్నారని మరోవైపు ధాన్యం కేంద్రాలు ప్రకటించినప్పటికీ కొనుగోలు కేంద్రాల్లో దాన్యం నింపడానికి గన్ని సంచులు అందుబాటులో లేవని ఆరోపించారు.పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆర్డిఓ కార్యాలయ సిబ్బందికి అందజేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లాకమిటీ సభ్యులు ఈసంపల్లి బాబు కోరబోయిన కుమార్ స్వామి అనుమకొండ శ్రీధర్ సంఘం జిల్లా అధ్యక్షుడు పుచ్చకాయల కృష్ణ రెడ్డి సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు గడ్డమీద బాలకృష్ణ, ఉదయగిరి నాగమణి , బిట్ర స్వప్న, జినుకల చంద్రమౌళి, బెంబేలి మలహలరావు, రుద్రారపు లక్ష్మి, జగన్నాథం కార్తీక్, ఉదయగిరి,సరిత,యాకలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ. నిరుపేద ప్రజలకు అత్యవసర సమయంలో చికిత్స చేయించుకోలేని పరిస్థితుల్లో ఉన్నవారికి వైద్యం అందించే దిశగా ప్రభుత్వం పేద ప్రజలందరికీ ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించేందుకు రాష్ట్రంలోని ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేస్తూ గ్రామంలోని ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేయడం జరిగిందన మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నాయకులు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో తంగళ్ళపల్లి గ్రామ .సర్పంచ్.మోర లక్ష్మీరాజo.మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జలగం ప్రవీణ్. లింగాల భూపతి. సుద్దాల శ్రీనివాస్. బండి పరశురాములు. సామల గణేష్. పద్మశాలి సంఘం అధ్యక్షులు రాపేల్లిఆనందం. నాయకులు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు
తంగళ్ళపల్లి మండలంలో పలు గ్రామాలలో నూతన ఇందిరమ్మ గృహప్రవేశాలు…..
తంగళ్ళపల్లి నేటి ధాత్రి….
తంగళ్ళపల్లి మండలంలో పలు గ్రామాలలో ఇందిరమ్మ గృహ ప్రవేశాలు జరిగాయని సందర్భంగా తెలియజేస్తూ. మండలంలో తంగళ్ళపల్లి. లక్ష్మీపూర్ గ్రామాలలో నూతన గృహప్రవేశాలు జరిగాయని అలాగే. రాష్ట్రంలో ప్రజలకు ఇండ్లు లేని నిరుపేదలు ఉండరాదు అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చిందని అందులో భాగంగా ఇందిరమ్మ గృహ పథకం తీసుకువచ్చిందని రాష్ట్రంలోని నిరుపేద ప్రజలకు సొంత ఇంటి కల నెరవేర్చే విధంగా. మండలంలో ప్రతి గ్రామంలో అర్హులైన నిరుపేదల అందరికీ ఇందిరమ్మ గృహ పథకం ద్వారా ప్రభుత్వం పరంగా లబ్ధిదారులకు ఇండ్లు నిర్మించుకోవడానికి విడుత లవారీగానిధులు మంజూరు చేస్తూ. వారి సొంతింటి కల నెరవేర్చుతుందని ప్రభుత్వపరంగా అధికారుల అందరూ సహకరిస్తున్నారని సకాలంలో గ్రామంలో ప్రతి లబ్ధిదారులు ఇట్టి మహత్తర అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని. ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునే లబ్ధిదారులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా ప్రభుత్వమే దగ్గరుండి అన్ని సహాయ సహకారాలు అందిస్తూ ఇసుక కొరత లేకుండా ఏర్పాట్లు చేస్తుందని ఎటువంటి నిధులకొరత లేకుండా. లబ్ధిదారులందరూ ఒక టో విడత రెండో విడుత లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణం పూర్తిచేసుకుని ఇండ్లు నిర్మించుకోవాలని సందర్భంగా తెలియజేశారు. ఇట్టి నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో. తంగళ్ళపల్లి గ్రామ సర్పంచ్ మోర లక్ష్మీరాజం. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జలగం ప్రవీణ్. సుద్దాల కర్ణాకర్. లింగాల భూపతి. మచ్చ శ్రీనివాస్. పొన్నాల పరుశరాములు. రా పెళ్లి ఆనందం. రెడ్డి పరశురాములు. బండి పరిసరాములు. కాంగ్రెస్ పార్టీ నాయకులు నూతన గృహ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు
రవాణా పై.కట్టుదిట్టమైనదిగా నిఘాచెక్పోస్టు ఏర్పాటు….
తంగళ్ళపల్లి నేటి ధాత్రి….
తంగళ్ళపల్లి మండలం. జిల్లెల్ల గ్రామంలో పోలీస్ చెక్ పోస్ట్ ను ఏర్పాటు చేశారని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా. బక్రీద్ పండుగ సందర్భంగా పశువుల అక్రమ రవాణా తిరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ జిల్లాలోని పశువుల అక్రమ రవాణాలను పూర్తిగా అరికట్టేందుకు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీత. ఆదేశాల మేరకు సోమవారం రోజున పశువుల అక్రమ రవాణా నిరోధించేందుకు జిల్లా వ్యాప్తంగా చెక్ పోస్ట్ లు ఏర్పాట్లు చేశారని అందులో భాగంగా తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో ప్రత్యేకంగా చెక్ పోస్ట్ఏర్పాటు చేశామని. అలాగే. స్టేషన్ పరిధిలోని ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తూ అనుమానస్పద వాహనాల పట్ల నిఘ తీవ్రతం చేస్తామని. పశువులు అక్రమంగా రవాణా చేయడం చట్టరీత్య నేరమని ఇది .మూగజీవాల పట్ల క్రూరత్వాన్ని దారితీస్తుందని. ప్రభుత్వం సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం సంబంధించిన నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉందని నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టరీత్య చర్యలు తీసుకోవడం జరుగుతుందని. అలాగే .గోరక్షణ పేరుతో చట్టాన్ని తమ చేతులకు తీసుకొని దాడులు చేయడం వాహనాల ధ్వంసం చేయడం వంటి చర్యలకు పాల్పడడం చట్టరీత్యా నేరమని అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని. ఎవరైనా పశువుల.అక్రమ రవాణకు పాల్పడుతున్నట్లు సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని. అక్రమంగా పశువులను .తరలించే వ్యక్తులపై చట్టపరమైన కఠినచర్యలు తీసుకోవడం లో ఎలాంటి రాజీ ఉండదని జిల్లా ఎస్పి స్పష్టం చేశారనీ. సోషల్ మీడియా వేదికగా మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టి శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోని సహించబోమని. సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న తప్పుడు ప్రచారం నమ్మవద్దని నిజా నిజాలు నిర్ధారించకుండా అసత్య ప్రచారాలు గ్రూపులలో ఫార్వర్డ్ చేసిన పోస్ట్ చేసిన వారితో పాటు గ్రూప్ అడ్మిన్ లపై. కేసులో నమోదు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తెలియజేశారు. ఇట్టి చెక్. పోస్టు.నిఘా ఏర్పాటు కార్యక్రమంలో. తంగళ్ళపల్లి ఎస్సై ఉపేంద్ర చారి ఎ.ఎస్సై. పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
శాయంపేట మండల కేంద్రం లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలనా-ప్రగతి ప్రణాళిక కార్య క్రమoలో విద్యావారోత్సవా లను ఘనంగా నిర్వహించారు మొదటిరోజు ప్రభుత్వ జూని యర్ కళాశాలలో ఐఎఫ్ పిఎస్-2, ఐడిపిఎస్2 లను డిజిటల్ విద్యాబోధన కోసం గ్రామ సర్పంచ్ ఉమరవిపాల్ ప్రారంభించారు.2026-27 విద్యా సంవత్సరానికి అడ్మి షన్లకు సంబంధించిన కరప త్రాలను కూడా విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కందగట్ల కోటేష్ వార్డు మెంబర్ కురాకుల మంజుల,అమ్మ ఆదర్శ పాఠశాల చైర్ పర్సన్ దాసరి కల్పనా వేణు దంపతులు, శైలేందర్ ,సునీల్ ,వేణు, తిరుపతి ,సౌజన్య, రవీంద్ర నాయక్, శ్రీనివాస్ విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ప్రైవేటు రంగాల తులనాత్మక అధ్యయనంపై పరిశోధనలు గర్వకారణం
• డాక్టర్ సీహెచ్. వి. పురుషోత్తం రెడ్డి
నేటిధాత్రి, మొయినాబాద్ :
మొయినాబాద్ మండలం హిమాయత్ నగర్ చైతన్య డీమ్డ్ టూ బి యూనివర్సిటీ లో కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగంలో వి.స్వప్నకు పరిశోధనలో ఉత్తమ ప్రతిభకు పీహెచ్‌డి డిగ్రీ అందించడం జరిగింది. వారు లిక్విడిటీ అండ్ ప్రాఫిటబిలిటీ అనాలిసిస్ అఫ్ కమర్షియల్ బ్యాంక్స్ ఏ కంపరేటివ్ స్టడీ అఫ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టార్ ఇన్ ఇండియా అనే అంశంపై పరిశోధనను ఆచార్య జి. ఉషశ్రీ పర్యవేక్షణలో పూర్తి చేశారు. ఈ ప్రతిష్టాత్మక పీహెచ్‌డి డిగ్రీని విశ్వవిద్యాలయ వ్యవస్థాపకులు అండ్ చాన్సలర్ డాక్టర్ సిహెచ్. వి. పురుషోత్తం రెడ్డి ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ రంగంలో పరిశోధనలు రాష్ట్రం, దేశ అభివృద్ధికి కీలకమని, వాణిజ్య బ్యాంకుల ద్రవ్యత్వం లాభదాయకత విశ్లేషణ, భారతదేశంలో ప్రభుత్వ ప్రైవేటు రంగాల తులనాత్మక అధ్యయనంపై పరిశోధన చేయడం గర్వకారణమన్నారు. భవిష్యత్ పరిశోధనల అభివృద్ధికి బలమైన పునాది ఏర్పరుస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ సెక్రటరీ కమ్ కరెస్పాండంట్ సిహెచ్ . సువర్ణ దేవి , డైరెక్టర్ అండ్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ సిహెచ్. సాత్విక రెడ్డి, వైస్ ఛాన్సలర్ ఆచార్య జి. శంకర్ లింగం, రిజిస్ట్రార్ ఆచార్య యం. రవీందర్, డీన్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆచార్య క్రిస్టోఫర్, డీన్ అడ్మినిస్ట్రేషన్ ఆచార్య ఏ. రాజు, డీన్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ డాక్టర్ పి. సుగంధ దేవి, పరీక్షల కంట్రోలర్ ఆచార్య బి. రాజేందర్ రెడ్డి, డిప్యూటీ కంట్రోలర్ (పరీక్షల ) డాక్టర్ ఈ . జగదీశ్ కుమార్ , కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ (విభాగాధిపతి) డాక్టర్ టి.వి.జి. శాస్త్రి, ఆచార్య జి. ఉషశ్రీ , అసిస్టెంట్ రిజిస్ట్రార్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ గాదె రాంబాబు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
*గ్రామ పంచాయతీ వర్కర్ల పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలి*
• చేవెళ్ల మండలంలోని 25 జీపీలలో 3నెలల బకాయిలు 28.56 లక్షల వేతనాలు పెండింగ్ • వేతనాలు చెల్లించాలంటూ ప్రజవాణిలో వినతిపత్రం అందజేసిన జీపి కార్మికులు
నేటిధాత్రి, చేవెళ్ల :
కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెలలుగా వేతనాలు అందించడం లేదని ఫలితంగా తమ కుటుంబాలు గడవక పస్తులుండాల్సి వస్తుందని గ్రామ పంచాయతీ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని అంతారం గ్రామపంచాయతీ కార్మికులు సోమవారం చేవెళ్ల ఆర్డివో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఏవోకు వినతిపత్రం అందజేశారు. అతి తక్కువ వేతనంతో పనిచేస్తున్న తమకు ప్రతి నెలా వేతనాలు ఇవ్వకపోవడంతో ఇబ్బందుల పాలవుతున్నామని వెంటనే 3 నెలల పెండింగ్ వేతనాలను చెల్లించాలని చేశారు. అంతారం పంచాయతీ కార్మికులు మేడిపల్లి నర్సిములు, బస్తీ రాములు మాట్లాడుతూ అంతారం జీపిలో ఆరుగురు ఎమ్.పి.డబ్ల్యూ కార్మికులు పనిచేస్తున్నారని, ప్రతినెలా ఒక్కో కార్మికుడికి 9,500 వేతనం చెల్లించాల్సి ఉండగా ఆరుగురు సిబ్బందితో కలిపి 3నెలల వేతనాలు 1.71 లక్ష డెబ్భైవేలు చెల్లించాల్సి ఉందని వారు తెలిపారు . గ్రామంలో పారిశుధ్యం మంచినీటి సరఫరా, వీధిలైట్లు, డంపింగ్ యార్డ్స్, హరితహారం ,పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు తదితర పనులు గ్రామపంచాయతీ కార్మికులతో చేయించుకుంటారు, కానీ వారికి నెల నెల వేతనాలు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు. వెంటనే పెండింగ్లో ఉన్న వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేశారు.
• మండలంలో పెండింగ్లో ఉన్న జీపి వేతనాలు 28.56లక్షలు
చేవెళ్ల మండలంలో 25 గ్రామ పంచాయతీల్లో 92 మంది మల్టీ పర్పస్ కార్మికులు, 3 కంప్యూటర్ ఆపరేటర్లు పనిచేస్తున్నారు. అందులో పారిశుధ్యం, మంచినీటి సరఫరా, వీధి లైట్ల నిర్వహణ, పన్నుల వసూళ్లు తదితర పనులు చేస్తున్నారు. ఒక్కో కార్మికుడికి 9,500 వేతనం ఉంది. అదే 3నెలల పెండింగ్ వేతనం 28,500 చెల్లించాల్సి ఉంది. అంటే మండలంలో 25 పంచాయతీలలో పనిచేస్తున్న92 మంది శానిటేషన్, ఎలక్ట్రిషన్, బిల్ కలెక్టర్, వాటర్ మ్యాన్ కార్మికులు, ముగ్గురు కంప్యూటర్ ఆపరేటర్లు పనిచేస్తుండగా, ఆపరేటర్ నెల వేతనం 19500 కాగా 4 నెలల వెల్డింగ్ వేతనం 78000 వేలు కాగా, పంచాయతీ కార్మికులు,కంప్యూటర్ ఆపరేటర్ల పెండింగ్ వేతనాలు కలిపి 28,56,000 చెల్లించాల్సి ఉంది. కాని ఇప్పటివరకు మూడునెలలుగా ఒక్క రూపాయి చెల్లించలేదు. కార్మికులకు వచ్చే చిన్న వేతనాలతో కుటుంబాలు వెల్లదీస్తున్నారు. డిసెంబర్ వరకు రాష్ట్ర ప్రభుత్వం నేరుగా టీఎస్ బి పాస్ అకౌంట్ ద్వారా వేతనాలు చెల్లించేది. కానీ గత మూడు నెలల నుండి జిపి నిధుల నుండి తీసుకోవా లని ప్రభుత్వం చెపుతుంది. చిన్న వేతనం కూడా 3 నెలలుగా వేతనాలు రాకుండా పెండింగ్‌లో ఉండటంతో , వారి పరిస్థితి అధ్వానంగా మారింది. వేతనాలు ఇవ్వాలని అధికారులను అడిగితే డబ్బులు లేవని సమాధానం చెబుతున్నా సందర్భాలు, సమాదానాలు కార్మికుల మనోధైర్యాన్ని కుంగదీస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్ వేతనాలను విడుదల చేసి ఉద్యో గ భద్రత కల్పించాలని , అదే విధంగా మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. ఈ కార్యాక్రమంలో పంచాయతీ కార్మికులు మన్నెగూడెం పద్మమ్మ, తెలుగు సాయమ్మ, ఘనపురం రామస్వామీ, ఖానాపురం నరేష్ తదితరులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.