పరుగు ఆపని బంగారం.. రూ.4 లక్షలకు చేరకున్న వెండి..
బంగారం, వెండి ధరలు మరింత పెరిగాయి. పరుగు ఆపకుండా ముందుకు సాగుతున్నాయి. బంగారం ధర పది గ్రాములకు రూ.3,220 మేర పెరిగింది. వెండి కిలోకు రూ.10 వేల మేర పెరిగింది.
బంగారం, వెండి ధరలు మరింత పెరిగాయి. పరుగు ఆపకుండా ముందుకు సాగుతున్నాయి. బంగారం ధర పది గ్రాములకు రూ.3,220 మేర పెరిగింది. వెండి కిలోకు రూ.10 వేల మేర పెరిగింది. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో బంగారం, వెండికి డిమాండ్ కొనసాగుతోంది (Gold prices).
ఈ రోజు (జనవరి 28న) ఉదయం 11:00 గంటల సమయంలో హైదరాబాద్లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,65,170కి చేరింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,950 మేర పెరిగి రూ. 1,51,400కి చేరింది (live gold rates). ఇక, దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ. 1,65,300కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 1,51,550కి చేరుకుంది.మరోవైపు వెండి కూడా జోరు చూపిస్తోంది. నిన్నటితో పోల్చుకుంటే కిలోకు పది వేల రూపాయల మేర పెరిగింది. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.4,00,00కు చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.3.8 లక్షలుగా ఉంది.
