సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి.

సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి
• మొబైల్ ఓటీపీలు ఎవరికీ చెప్పొద్దు
• లోన్ అప్ లను నమ్మొద్దు

• ఇంచార్జ్ ఎస్ఐ సృజన

నిజాంపేట నేటి ధాత్రి:

ఆధునిక పరిజ్ఞానం పెరిగిన కొలది సైబర్ నేరగాళ్ళు నూతన పద్దతిలో ప్రజలను మోసం చేస్తున్నారని నిజాంపేట ఇంచార్జ్ ఎస్ఐ సృజన అన్నారు. ఈ మేరకు నిజాంపేట లో మాట్లాడుతూ.. ఎవరైనా కొత్త వ్యక్తులు ఫోన్ చేసి బ్యాంక్ నుండి ఫోన్ చేస్తున్నాం.. మీ ఫోన్ కీ ఓటీపీ వచ్చింది. చెప్పండి అంటూ ఫోన్ చేస్తే నమ్మవద్దన్నారు. అలాగే లోన్ అప్ ల వేధింపులకు చాలా మంది బలివుతున్నారని ఎవరు కూడా లోన్ అప్ లను నమ్మవద్దన్నారు. ఒకవేళ ఎవరైనా సైబర్ క్రైమ్ బారిన పడినట్లయితే 1930కు కాల్ చేయాలన్నారు.

పిల్లలను ప్రభుత్వ బడులలో చేర్పిద్దాం బంగారు భవిష్యత్తును.!

పిల్లలను ప్రభుత్వ బడులలో చేర్పిద్దాం బంగారు భవిష్యత్తును కల్పిద్దాం

టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.రాజు పిలుపు

నమోదు కొరకు ప్రచార జాతా ప్రారంభం

చర్ల నేటిధాత్రి:

 

తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్యను పొందాలని ప్రభుత్వ బడులను కాపాడుకోవాలని టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి రాజు పిలుపునిచ్చారు.

గురువారం తేది 29మే 2025 నాడు ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల నమోదు పెంపుదల కొరకు టీఎస్ యుటిఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.

కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ప్రచార జాతాను స్థానిక అంబెడ్కర్ సెంటర్ భద్రాచలం నందు జెండా ఊపి సీనియర్ నాయకులు పి లక్ష్మి నారాయణ ప్రారంభించారు.
జాతాను ఉద్దేశించి రాష్ట్ర కార్యదర్శి బి రాజు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో సుశిక్షితులైన ఉపాధ్యాయులు ఉన్నారని విశాలమైన తరగతి గదులు ఆటస్థలం ఉన్నాయని తల్లిదండ్రులందరూ తమ పిల్లలను.

ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్యను ఉచితంగా పొందాలని విజ్ఞప్తి చేశారు ప్రభుత్వ బడులను కాపాడాల్సిన బాధ్యత తల్లిదండ్రుల పైన ఉన్నదని తెలియజేశారు.

విద్యా హక్కు చట్టం ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించే బాధ్యత ప్రభుత్వానిదే
కొఠారి కమిషన్ చెప్పినట్లు దేశ జీడీపీలో ఆరు శాతం రాష్ట్ర బడ్జెట్లో 30 శాతం విద్య కు కేటాయించాలి కానీ దేశ బడ్జెట్లో 2.9 శాతం రాష్ట్ర బడ్జెట్లో 7.5 శాతం మాత్రమే కేటాయింపులు జరుగుతున్నది.

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు నోటు పుస్తకాలు వర్క్ బుక్కులు ఏకరూప దుస్తులు ఉచితంగా అందించబడుతున్నాయని నాణ్యమైన మధ్యాహ్న భోజనం వారానికి మూడు సార్లు కోడిగుడ్లు రాగిజావ అందిస్తున్నారని తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలను.

ఆదరించి పిల్లలను చేర్పించి ఫీజుల భారం లేని ఉచిత విద్య పొందాలని విద్యార్థుల సమగ్ర వికాసానికి ప్రభుత్వ పాఠశాలలు దోహదపడుతాయని తెలియజేశారు గుడి మసీదు చర్చిల నిర్మాణం కోసం ఐకమత్యంగా కదిలే ప్రజలు ఊరి బడి కోసం కూడా ఏకమై బడిని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉందని తెలియజేశారు.
గ్రామాలలో ప్రతి ఇంటికి వెళ్ళి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలని టీఎస్ యుటిఎఫ్ శ్రేణులు ఈరోజు నుండి జూన్ 5 వరకు ప్రచారం నిర్వహిస్తాయని తెలియజేశారు.
ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారని అత్యున్నత విద్యార్హతలు కలిగిన టీచర్లు ఉంటారని తల్లిదండ్రులకు వివరిస్తామని తెలియజేశారు తల్లిదండ్రుల ఆశను ప్రైవేటు విద్యా వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారని
చదువుల నాణ్యతలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల మధ్య పెద్దగా వ్యత్యాసం లేదని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయని సంపాదనలో సగానికి పైగా పిల్లల చదువుల కోసమే ఖర్చు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని ప్రభుత్వ బడి మూతపడితే సమాజానికి నష్టం అని మన ఊరు మనబడి అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా మౌళిక వసతుల కల్పన మెరుగైందని తెలియజేశారు.
ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులను ప్రారంభించటానికి ప్రభుత్వం.

సన్నాహాలు చేస్తోందని ఏఐ ఆధారిత బోధన డిజిటల్ తరగతి గదులు లైబ్రరీ లేబరేటరీలతో పాటు ఆటపాటలతో అహ్లాదకరమైన వాతావరణంలో ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధతో నిపుణులైన ఉపాధ్యాయులతో ఒత్తిడి లేని చదువు అందించబడుతుందని పిల్లల మానసిక ఆరోగ్యానికి వ్యక్తిత్వ వికాసానికి అనువుగా ప్రభుత్వ పాఠశాలలు రూపుదిద్దుకుంటున్నాయని మన పిల్లలను మన ఊరి బడిలోనే చేర్పించి బడికి అవసరమైన వసతుల కల్పనకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తే తప్పనిసరిగా బడి నిలబడుతుందని తెలియజేశారు పిల్లలకు నాణ్యమైన విద్య.

ఉచితంగా అందుతుంది తల్లిదండ్రులకు ఫీజుల భారం తగ్గుతుంది కనుక తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి వారి భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలని బి రాజు పిలుపునిచ్చారు చర్ల మండలంలో దేవరపల్లి.
కుదునూరు ఆర్ కొత్తగూడెం సత్యనారాయణపురం తేగడ చర్ల పట్టణం ప్రచారం చేయడం జరిగింది ఈ ప్రచార జాతాలో సంఘం జిల్లా అధ్యక్షులు బి మురళీమోహన్ ఎఫ్ డబ్ల్యూ ఎఫ్ రాష్ట్ర.

జాయింట్ సెక్రటరీ ఎన్ కృష్ణ జిల్లా కార్యదర్శులు డి తావుర్య ఎస్ విజయ కుమార్ వెంకటేశ్వర్లు చర్ల మండల అధ్యక్షులు కాక రాంబాబు సకినం బాలకృష్ణ రాధ జలంధర్ సీనియర్ నాయకులు పి నరసింహరావు గోపాలరాజు హిమగిరి రవికిషోర్ శ్రీలక్ష్మి వర్షిణి  పాల్గొన్నారు.

ఘనంగా సి.ఐ.టి.యు ఆవిర్భావ దినోత్సవం.

ఘనంగా సి.ఐ.టి.యు ఆవిర్భావ దినోత్సవం

సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు మే – 30 సి.ఐ.టి.యు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బి.వై. నగర్ లోని సి.ఐ.టి.యు ఆఫీసు వద్ద CITU జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టడం జరిగినది.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ మాట్లాడుతూ కార్మిక వర్గం , కష్టజీవుల సమస్యల పరిష్కారం కోసం , హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడుతున్న సంఘం CITU అని 1970 మే 30 వ తేదీన ఐక్యత – పోరాటం అనే నినాదంతో కార్మిక వర్గ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సిఐటియు ఆవిర్భవించడం జరిగిందని గత 55 సంవత్సరాలుగా దేశంలో , తెలంగాణ రాష్ట్రంలో , రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా కార్మిక హక్కుల సమస్యలపై అలుపెరుగని పోరాటాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు.
రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి పోరాటాలు నిర్వహిస్తామని పోరాటంలో జిల్లాలోని అన్ని రంగాల కార్మికులు సి.ఐ.టి.యు కు అండగా ఉంటూ ముందుకు కదలాలని పిలుపునిచ్చారు.
ఈరోజు సిఐటియు 55 వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదులో రాష్ట్ర నూతన కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని కార్మిక వర్గ ఉద్యమ పోరాట కేంద్రంగా ఈ కార్యాలయం పనిచేస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మూషం రమేష్ , గుర్రం అశోక్ జిల్లా సహాయ కార్యదర్శి గురజాల శ్రీధర్ , సూరం పద్మ , నక్క దేవదాస్ , గుండు రమేష్ , దొబ్బల లచ్చయ్య , వావిలాల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ముదిరాజ్ లను ఓటు బ్యాంక్ గా చూస్తున్న ప్రభుత్వాలు.

ముదిరాజ్ లను ఓటు బ్యాంక్ గా చూస్తున్న ప్రభుత్వాలు..

ముదిరాజ్ ల రిజర్వేషన్ హామీని మరిచిన ప్రభుత్వం.

మెపా తెలంగాణ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు పులి దేవేందర్ ముదిరాజ్

నర్సంపేట నేటిధాత్రి:

ప్రభుత్వాలు ఎన్ని మారిన ముదిరాజ్ లను ఒక ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని మెపా తెలంగాణ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు పులి దేవేందర్ ముదిరాజ్ ఆరోపించారు.
ముదిరాజ్ లకు ఇచ్చిన రిజర్వేషన్ హామీని ప్రభుత్వం మరిచిపోయిందా? అని ఆయన ప్రశ్నించారు.గురువారం నాడు దుగ్గొండి మండల కేంద్రంలో మండల మెపా స్వామి ముదిరాజ్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి పులి దేవేందర్ ముదిరాజ్ ముఖ్య హాజరైనారు.రాష్ట్ర ఉపాధ్యక్షులు పొన్నం రాజు ముదిరాజ్ మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్ లో ముదిరాజుల రిజర్వేషన్ హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మెపా తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు పొన్నం ప్రభాకర్ మండల ఉపాధ్యక్షులు సంకెళ్ళ స్వామి,దండు తిరుపతి, జెట్టబోయిన రాజేందర్, గ్రామ పెద్దలు ముత్యం భూమయ్య ముదిరాజ్, పోన్నం కుమార్ ముదిరాజ్, పొన్నం సదానందం, ముదిరాజ్ అడ్వకేట్ ముత్యం కిషోర్ ముదిరాజ్,డా.చింతకాయల శంకర్ ముదిరాజ్, పొన్నం వేణు ముదిరాజ్, పొన్నం అశోక్ ముదిరాజ్, గేళ్ళ రాజు ముదిరాజ్ సానబోయిన శివ ముదిరాజ్ పొన్నం నాగరాజు ముదిరాజ్, బుస మల్లయ్య ముదిరాజ్ లు పాల్గొన్నారు.

విద్యుత్ షాక్ తో యువకుడు మృతి.

విద్యుత్ షాక్ తో యువకుడు మృతి.

#విద్యుత్ మోటర్ ను సరి చేస్తుండగా ప్రమాదం.

#ఎదిగిన కొడుకు మృతి చెందడంతో తల్లి రోదనకు అవధులు లేకుండా పోయింది.

#యువకుని మృతితో గ్రామములో విషాదఛాయలు.

నల్లబెల్లి నేటి ధాత్రి:

వ్యవసాయ బావి వద్ద ఉన్న మోటర్కు వైర్లను తగిలిస్తుండగా విద్యుత్ షాక్ కు గురై యువకుడు మృతి చెందిన సంఘటన గురువారం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం దస్తగిరి పల్లె గ్రామంలో చోటుచేసుకుంది వివరాలకు వెళితే కుటుంబ సభ్యులు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మాందాటి శ్రీనివాస్ రెడ్డి-మంజుల దంపతుల రెండవ కుమారుడు లక్ష్మణ్ రెడ్డి (19) తమ వ్యవసాయ భావి వద్దకు వెళ్లి నీళ్లు రావడంలేదని మోటారు వైర్లను సరి చేస్తున్న క్రమంలో కరెంటు రాకపోవడంతో 11 కెవి విద్యుత్తు లైనుకు వైర్లను తగిలించే క్రమంలో ప్రమాదవశాత్తు ఒక వైరు కాలికి తగలడంతో పడిపోగా గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు తెలవడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించే క్రమంలో యువకుడు మృతి చెందినట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్ మార్ట్ నిమిత్తం నర్సంపేటకు తరలించినట్లు పోలీసులు తెలిపారు మృతుని తండ్రి శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గోవర్ధన్ తెలిపారు.

#యువకుని మృతితో గ్రామంలో అలుముకున్న విషాద ఛాయలు.
పట్టుమని 19 సంవత్సరాలు నిండకముందే నూరేళ్ల జీవితం గడిచిపోయిందని మృతుని తల్లిదండ్రులు రోదన చేస్తుంటే గ్రామస్తులందరూ శోకసముద్రంలో మునిగిపోయారు. ఎంతో చలాకీగా చదువులో సైతం ప్రతిభను కనబరిచి ఎంతో అత్యున్నత స్థానంలో ఉండాలని కోరికతో ఉండేవాడని అదేవిధంగా తల్లిదండ్రులకు తన వంతుగా వ్యవసాయ పనులలో చేదోడు వాదోడుగా ఉండి కుటుంబానికి పెద్దన్న పాత్ర పోషించేవాడని గ్రామ ప్రజలు చెప్పుకుంటూ బోరుణ ఏడ్చారు. ఏది ఏమైనాప్పటికీ చేతికి అందిన కొడుకు చేజారిపోవడంతో కన్న తల్లిదండ్రుల రోదన అంతా ఇంత కాదు.

కరోనా వర్షాకాల వ్యాధులు సోకకుండా జాగ్రత్తలు.

కరోనా వర్షాకాల వ్యాధులు సోకకుండా
జిల్లా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రజిత

సిరిసిల్ల టౌన్ ( నేటిధాత్రి ):

సిరిసిల్ల జిల్లాలోని వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రజిత వర్షాకాలం ప్రారంభమవుతున్న సమయంలో కాలానుగుణంగా వ్యాపించే వ్యాధులలో భాగంగా మాట్లాడుతూ సాధారణ జలుబు, దగ్గు(commoncold) గొంతు నొప్పి లక్షణాలు కనిపిస్తే ఇంట్లో విడిగా ఉండవలసిందిగా తెలియజేస్తూ కరోనా వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వ వైద్యుల సలహాలు సూచనలు అనుసరించి మందులు వాడాలని, ప్రయాణాలలో జన సమూహాల్లో ఉన్నప్పుడు తప్పనిసరిగా మాస్క్రు లు వాడాలని, అదే విధంగా తరచూ చేతులు శుభ్రం చేసుకోవాల్సిందిగా సూచించినారు. కోవిడ్ కేసుల ప్రభావిత ప్రాంతాల్లో నుంచి వచ్చిన వారు అనుమానిత లక్షణాలు కనిపించిన వెంటనే నిర్ధారణ కొరకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి పరీక్షల కొరకు వైద్యులను సంప్రదించవలసిందిగా తెలియజేసినారు. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, వృద్ధులు, పిల్లలు, గర్భిణీ స్త్రీ ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తూ, ప్రస్తుత పరిస్థితులలో ప్రజలు కరోనా విషయంలో భయాందోళన చెందవలసిన అవసరం లేదని, చికిత్స తోనే పూర్తిగా నయమవుతుందని, ఒకవేళ లక్షణాలు కనిపిస్తే ఐసోలేషన్ అవసరం ఉందని, కరోనా నిర్ధారణ కాగానే డాక్టర్ల సూచనలు పాటించాల్సిందిగా, మాస్కులు ధరించాల్సిందిగా, ఇప్పటికే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నవారికి తక్కువ స్థాయి లక్షణాలే నమోదవుతున్నాయని, రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల ప్రభుత్వ ఆసుపత్రులు ఎలాంటి కోవిడ్ కేసులు నిర్ధారణ కాలేదని ఈ సందర్భంగా  తెలియజేసినారు.

జూన్ 3 నుంచి 16 వరకు భూభారతి రెవెన్యూ సదస్సులు.

జూన్ 3 నుంచి 16 వరకు భూభారతి రెవెన్యూ సదస్సులు.

బాలానగర్ నేటి ధాత్రి:

 

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని వివిధ గ్రామపంచాయతీలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూ భారతి చట్టంపై రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి గురువారం తెలిపారు. ఈనెల 3న పెద్దాయపల్లి మరియు కేతిరెడ్డిపల్లి, 4న బాలానగర్ మరియు బోడ జానంపేట, 5న చిన్న రేవల్లి మరియు పెద్ద రేవల్లి, 6న నేరళ్ల పల్లి మరియు మోతి ఘనపూర్, 9న గుండేడ్ మరియు ఉడిత్యాల, 10న హేమాజీ పూర్ మరియు తిరుమలగిరి, 11న మొదంపల్లి మరియు సూరారం, 12న నందారం, నామ్యతాండ, లింగారం, సేరిగూడ, 13న గౌతాపూర్ మరియు అప్పాజీపల్లి, 16న మాచారం గ్రామాలలో.. ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో రైతు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని తహసిల్దార్ అన్నారు.

చంద్రమౌళి ఆత్మకు శాంతి చేకూరాలి.

చంద్రమౌళి ఆత్మకు శాంతి చేకూరాలి

జైపూర్ నేటి ధాత్రి:

జన్నారం ఇంధనపల్లి మండలం వన్ గ్రామపంచాయతీ కార్యదర్శి ఎర్రజుల చంద్ర మౌళి బుధవారం రోజున ఆకస్మికముగా గుండె పోటుతో మరణించడం చంద్రమౌళి మృతికి సంతాపాన్ని ప్రకటిస్తూ గురువారం రోజున జైపూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 2 నిముషాలు మౌనం పాటించి నివాళులర్పించారు.ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ తోటి అధికారి అకస్మాత్తుగా స్వర్గస్తులవడం బాధాకరమైన విషయమని, ఎర్రాజుల చంద్రమౌళి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమం లో ఎంపీడీఓ సత్యనారాయణ గౌడ్,ఎంపీవో శ్రీపతి బాబురావు,ఆర్డబ్ల్యూఎస్ డిఈ,మండల ప్రజా పరిషత్ కార్యాలయ సిబ్బంది,జైపూర్ మండలం పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీలో జిల్లా ఫస్ట్.

ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీలో జిల్లా ఫస్ట్

జిల్లా కలెక్టర్ కు మంత్రుల అభినందనలు

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)

 

 

సిరిసిల్ల జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీలో రాజన్న సిరిసిల్ల జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, జిల్లా అధికారులను మంత్రులు అభినందించారు.
జిల్లాకు మంజూరు అయిన 7862 ఇండ్లకు గాను 7808 అలాట్మెంట్ ఆర్డర్లు లబ్దిదారులకు అందజేశారు. వేములవాడ నియోజకవర్గంలో ఫేజ్-1,2 లో కలిపి 2575 ఇండ్లు, సిరిసిల్ల నియోజకవర్గంలో ఫేజ్-1,2 లో కలిపి 3608 ఇండ్లు, చొప్పదండి నియోజకవర్గంలోని బోయినపల్లి మండలంలో ఫేజ్-1,2 లో కలిపి 820 ఇండ్లు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మేడిపల్లి సత్యంతో కలిసి, మానకొండూర్ నియోజకవర్గంలోని ఇల్లంతకుంట మండలంలో ఫేజ్-1లో 42 ఇండ్ల మంజూరు పత్రాలు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి కలెక్టర్ పంపిణీ చేశారు. ఫేజ్- 2లో 763 మంజూరు పత్రాలు ఇవ్వనున్నారు. ఫేజ్ 1 కింద జిల్లాలో మొత్తం 439 ఇండ్లు మంజూరు చేయగా, 135 ఇండ్లు వివిధ దశల్లో ఉన్నాయి. జిల్లాలోని 11 మండలాల్లో మొదలు పెట్టిన మోడల్ హౌస్ లలో బేస్మెంట్ లెవెల్ లో మూడు, రూఫ్ లెవెల్లో రెండు, స్లాబ్ లెవెల్ లో ఆరు ఇండ్లు ఉన్నాయి.ఈ సందర్బంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశాన్ని కరీంనగర్ లో గురువారం నిర్వహించగా, జిల్లా ఇంచార్జ్ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు హాజరై ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల జారీలో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిపేలా విశిష్ట సేవలు అందించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ను, జిల్లా అధికారులను ప్రత్యేకంగా అభినందించారు.

ఆర్డర్ తో భాద్యతలు చేపట్టిన సుకినే రాజేశ్వర్ రావు..

హైకోర్టు ఆర్డర్ తో భాద్యతలు చేపట్టిన సుకినే రాజేశ్వర్ రావు..

సొసైటి చైర్మన్ ను సన్మానించిన పలువురు నాయకులు..

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ పదవీకాలం గత మూడు నెలల క్రితం ముగియడంతో సహకార సంఘాల ఎన్నికలు నిర్వహణ చేయలేకపోయిన
ప్రభుత్వం మరల అదే పాలకవర్గాన్ని కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.కాగా దుగ్గొండి మండలంలోని నాచినపల్లి పీఏసీఎస్ చైర్మన్ గా ఉన్న బిఆర్ఎస్ పార్టీకి చెందిన
సుకినే రాజేశ్వర్ రావు మాత్రం భాద్యతలు ఇవ్వలేదు.దీంతో నర్సంపేట డివిజన్ పరిధిలో గల బిఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు సొసైటీల చైర్మన్లు హైకోర్టును ఆశ్రయించారు.దీంతో వీరి వాదనలు విన్న హైకోర్టు మరల బాధ్యతలు అప్పగించాలని రాష్ట్ర,జిల్లా సహకార అధికారులకు ఉత్తర్వుల జారీ చేసింది.
కాగా గురువారం సుకినే రాజేశ్వర్ రావు ఇంచార్జీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా రాజేశ్వరరావు మాట్లాడుతూ నాచినపల్లి వ్యవసాయ సహకార సంఘ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ రైతులకు అందుబాటులో ఎరువులను అందించే విషయంలో ముందుంటామన్నారు. రైతులకు సంబంధించి క్రాఫ్ లోన్స్ ఇవ్వడం జరిగిందన్నారు. గతంలో సి. గ్రేడ్ ఉన్న సహకార సంఘాన్ని ఏ. గ్రేడ్ కు తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు.డైరెక్టర్ల సహకారంతో రైతుల సహకారంతో అన్ని విధాల అభివృద్ధి చేయడం జరిగిందని రాజేశ్వర్ రావు తెలిపారు.
బాధ్యతలు చేపట్టిన రాజేశ్వర్ రావు ను మాజీ జెడ్పిటిసి వడ్డేపల్లి చంద్రమౌళి, మాజీ చైర్మన్ గుడిపల్లి జనార్దన్ రెడ్డి,మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్లు, డైరెక్టర్లు మాజీ డైరెక్టర్లు గొర్రె జనార్దన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, శివాజీ నగర్ గ్రామ పార్టీ అధ్యక్షులు బొరాల లింగయ్య తిమ్మంపేట గ్రామ పార్టీ అధ్యక్షులు గొర్రె జనార్దన్ రెడ్డి,నా చినపల్లి గ్రామ అధ్యక్షులు నర్రా రంగారెడ్డిలు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిశారు.ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు నల్ల శ్యాంసుందర్ రెడ్డి, గొసంగి పురుషోత్తం, మెరుగు రాజు, తుమ్మలపెల్లి సదానందం, హనుమకొండ లలిత బాబు, సాంబయ్య,సురావు సంజీవరావు, మోకిడే ప్రభాకర్, నరహరి భాస్కర్ రెడ్డి పలువురు రైతులు పాల్గొన్నారు.

ప్రజా సమస్యలు ప్రజా ప్రతినిధులు పరిష్కరించాలి.

ప్రజా సమస్యలు ప్రజా ప్రతినిధులు పరిష్కరించాలి

లేనిచో స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసి అభ్యర్థులను పోటీ చేయిస్తాం

వనపర్తి బి సి ల జన బేరి బహిరంగ సభలో రాచాల యుగేందర్ గౌడ్
వనపర్తి నేటిధాత్రి:

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నామినేటెడ్ పదవుల్లో బీసీలకు అన్యాయం జరిగిందని జిల్ల లో అవినీతిపై బీసీల ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని బీసీ పొలిటికల్ జే ఏ సీ రాష్ట్ర చైర్మన్ రాచాల యుగేందర్ గౌడ్ వనపర్తి లో రాజావారి పాలిటెక్నిక్ కళాశాల మైదానం బి సి జన బేరి బహిరంగ సభలో బీ సీ లను ఉద్దేశించి ప్రసంగించారు ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు ప్రజా ప్రతినిధులు స్థానిక ప్రజల సమస్యలు పట్టించుకోకుంటే అధికారపార్టీపై బీసీల మద్దతుతో తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల లో మున్సిపాలిటీ జెడ్పిటిసి సర్పంచ్ ఎన్నికలలో బీ సీ ల అభ్యర్థులను పోటీ చేయిస్తామని రాచాల పేర్కొన్నారు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా బీసీలు భారీ ఎత్తున పాల్గొని బహిరంగ సభను విజయవంతం చేసినందుకు రాచాల కృతజ్ఞతలు తెలిపారు

ట్రాక్టర్ మీది నుండి పడి యువకుడు మృతి.

ట్రాక్టర్ మీది నుండి పడి యువకుడు మృతి.

కల్వకుర్తి /నేటి ధాత్రి

 

ప్రమాదవశత్తు ట్రాక్టర్ మీద నుండి పడి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలంలోని తుర్కలపల్లి గ్రామంలో గురువారం సాయంత్రం జరిగింది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చెందిన సాయిబాబ (20) ట్రాక్టర్ తో పొలం దున్నుతుండగా.. ప్రమాదవశత్తు కిందపడి మృతి చెందాడు. సాయిబాబకు ఏడాది క్రితం వెల్దండ మండలం, రాచూరు గ్రామానికి చెందిన ఓ యువతీతో పెళ్లయింది. చిన్న వయస్సులోనే మరణించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ ప్రమాదం సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

వనపర్తి జిల్లా లోఇసుక రిచులను గుర్తించాలి.

వనపర్తి జిల్లా లోఇసుక రిచులను గుర్తించాలి

జిల్లాకలెక్టర్ ఆదర్శ్ సురబీ అధికారులకు ఆదేశాలు

వనపర్తి నేటిధాత్రి:

ఇసుక వాహనం ద్వారా గృహ నిర్మాణాలకు ఇసుక అందించేందుకు వనపర్తి జిల్లాలో ఇసుక రీచులను గుర్తించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు గురువారం కలెక్టర్ చాంబర్ లో జిల్లాస్థాయి సాండ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు వనపర్తి జిల్లాలో కొత్తగా ఎక్కడెక్కడ ఇసుక రీచ్ లు గుర్తించారు వాటి భౌగోళిక పరిస్థితులు ఏంటి అనేది అధికారులతో చర్చించారు
తుంపల్లి గ్రామం వీరరాఘవపూర్ ఇసుక రీచ్ లో 3990 క్యూబిక్ మీటర్ల ఇసుక అందుబాటులో ఉందని ఇరిగేషన్ భూగర్భ జలాలుమైన్స్ అండ్ జియాలజి ద్వారా పరిశీలన చేసిన రిపోర్టును కలెక్టర్ ముందు ఉంచారు వీర రాఘవపూర్ రీచ్ నుండి మన ఇసుక వాహనం ద్వారా ఇసుక తీసుకునేందుకు కమిటీ తీర్మానం చేసింది .మదనపూర్ మండలములోని కొత్తపల్లి దుప్పల్లి రీచులను పరిశీలించడం జరిగిందని అక్కడ నిబంధనలకు అనుగుణంగా ఇసుక లభ్యత లేదని మైన్స్ అధికారి తెలుపగా ఆన్లైన్ మ్యాప్ ద్వారా పరిశీలించిన కలెక్టర్ కమిటీ సభ్యులు మరో సారి క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. పెద్దమందడి మండలం చిలకటోనీ పల్లి కర్వేన గ్రామాల్లోనీ రీచులను పరిశీలించడం జరిగిందని అక్కడ నిబంధన ప్రకారం ఉండాల్సిన ఇసుక లభ్యత లేదని అందువల్ల రీచ్ గా పరిగణించి ఇసుక తీసుకోలేమని కమిటీ నిర్ధారించింది అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు ఎ డిమైన్స్ గోవిందరాజులు భూగర్భ జలాల ఎ డి దివ్యజ్యోతి డి ఎల్పీఒ రఘునాథ్ ఇరిగేషన్ శాఖ అధికారి పాల్గొన్నారు

జీవిత భీమా వారి వరల్డ్ రికార్డ్ పురస్కారం.

జీవిత భీమా వారి వరల్డ్ రికార్డ్ పురస్కారం అందుకున్న పరమేశ్వర్ పాటిల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం మెదపల్లి గ్రామానికి చెందిన తాజా మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పాటిల్ .జీవిత భీమా సంస్ధ నుండి అరుదైన గౌరవ పురస్కారం అందుకున్నారు ఆయన ఈసందర్భంగా మాట్లాడుతూ .జీవిత భీమా ద్వారా ప్రతి కుటుంబానికి పొదుపు చేయడం నేర్పడం.మరియు ప్రమాద బీమా ని అందించడం .ఆరోగ్యబీమాను అందించడం తనకు ఎంతగనో సంతృప్తి ఇస్తుంది అని అన్నారు .అనుకోకుండా జరిగే ప్రమాద ల వల్ల ఎన్నో కుటుంబాలు చిన్న భిన్నం అయ్యాయి అందుకే ముందు జాగ్రత్తగా ప్రతి ఒక్కరు జీవిత భీమా ను తీసుకొని కుటుంబ భద్రతను కాపాడుకోవాలి అని అన్నారు.

నూతన తహసిల్దార్ ను కలిసిన రైతు సంఘం నాయకులు.

నూతన తహసిల్దార్ ను కలిసిన రైతు సంఘం నాయకులు.

నడికూడ నేటిధాత్రి:

మండలంలోని తహసిల్దార్ గా నూతనంగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన గుజ్జుల రవీందర్ రెడ్డి ని తెలంగాణ రైతు రక్షణ సమితి నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.మండల వ్యాప్తంగా ఉన్న రైతు సమస్యలను తహసిల్దార్ దృష్టికి తీసుకురాగా ఆయన సానుకూలంగా స్పందించారు. త్వరలోనే వివిధ విభాగాల అధికారులతో చర్చించి రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.అనంతరం తహసిల్దార్ కు,శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వరికెల కిషన్ రావు.ఈ కార్యక్రమంలో మండలంలోని అధ్యక్షులు వాంకే రాజు,ఆరె సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు లోకేటి నగేష్,యూత్ నాయకులు నారగాని రాకేష్ గౌడ్,లోనే సతీష్ తదితరులు పాల్గొన్నారు.

ఒలిమా డిన్నర్ లో పాల్గొన్న పాల్గొన్న రాజకీయ నాయకులు.

ఒలిమా డిన్నర్ లో పాల్గొన్న పాల్గొన్న రాజకీయ నాయకులు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

మహమ్మద్ ఇమ్రాన్ తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ రిపోర్టర్ సోదరుని రిసెప్షన్ కి జహీరాబాద్ నియోజకవర్గం కోహిర్ మండల్ భారత్ ఫంక్షన్ హాల్లో సజ్జాపూర్ గ్రామానికి చెందిన మొహమ్మద్ మగ్దూం కుమారుని వలిమా డిన్నర్ వైభవంగా జరుగగా పలువురు రాజకీయ నాయకులు హాజరైయ్యారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎస్సీ కార్పొరేటర్ చైర్మన్ వై నరోత్తం,టీజీఐడిసి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్,మాజీ కౌన్సిలర్ నామ రవికిరణ్,బిజీ సందీప్,షికారి గోపాల్,కోహిర్ మండల్ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు శ్రీనివాసులు,కాంగ్రెస్ నాయకులు కోహిర్ మండల్ ఎంపీపీ షాకీర్ ,ప్రసాద్ రెడ్డి,గొల్ల భాస్కర్,, మొహమ్ వాజీర్ అల్లి ,మాజీ బాల్ నగర్ కార్పొరేటర్ నసీర్ మన తెలంగాణరిపోర్టర్ షకీల్ అహ్మద్, జేజే జావిద్ మాజీ సర్పంచ్లు మాజీ జెడ్పిటిసిలు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.

టీ వై జె ఎఫ్ ఆధ్వర్యంలో నూతన డీఎస్పీ కి ఘనంగా సన్మానం.

టీ వై జె ఎఫ్ ఆధ్వర్యంలో నూతన డీఎస్పీ కి ఘనంగా సన్మానం

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతానికి నూతనంగా వచ్చిన డీఎస్పీ సైద్ నాయక్ ఇటీవల బాధ్యతలు చేపట్టిన శుభ సందర్భంగా జహీరాబాద్ తెలంగాణ యూత్ జర్నలిస్టు ఫెడరేషన్ (టి వై జె ఎఫ్) అధ్యక్షుడు చెల్మెడ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు . ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ ఇంత మంచి ఆఫీసర్ జహీరాబాద్ ప్రాంతానికి రావడం శుభ పరిణామం అని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ టీ వై జె ఎఫ్ వైస్ ప్రెసిడెంట్ బి. నగేష్ , జనరల్ సెక్రెటరీ ప్రకాష్ కుమార్, టీ వై జె ఎఫ్ ట్రెజరీ మహేష్ కుమార్, కోఆర్డినేటర్ కె అశోక్ కుమార్, కోఆర్డినేటర్ రాములు, ఝరాసంగం టీవైజెఎఫ్ అధ్యక్షుడు ఎర్రోళ్ల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

విత్తనాల దుకాణాల్లో పోలీసుల తనిఖీ.

విత్తనాల దుకాణాల్లో పోలీసుల తనిఖీ

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా)నేటిధాత్రి:

 

గుండాల పోలీసు స్టేషన్ సిఐ రవీందర్, ఎస్సై సైదా రహూఫ్ ఆధ్వర్యములో వ్యవసాయ అధికారితో కలసి గుండాల లో ఉన్న సీడ్స్,ఫర్టిలైజర్ షాపులపై పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ రవీందర్ మాట్లాడుతూ సీడ్స్, ఫర్టిలైజర్స్ షాప్ యజమానులు నిబంధనలకు లోబడి వ్యాపారాలు చేసుకోవాలని, నకిలీ, కల్తీ విత్తనాలు,ఎరువులు సరఫరా చేసి రైతులను మోసం చేస్తే కఠినమైన చర్యలు తప్పవు అని అన్నారు. నాణ్యమైన విత్తనాలు రైతులకు అందించాలని వ్యవసాయాన్ని బలోపేతం చేయాలని అన్నారు. కల్తీ విత్తనాలు విక్రయించిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రైతులు అనుమతి లేని విత్తన విక్రయాదారులవద్ద విత్తనాలు కొనుగోలు చేయవద్దని సూచించారు. ప్రభుత్వ గుర్తింపు ఉన్న విత్తన డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేయలని, తప్పనిసరిగా కొనుగులుకు సంభందించి రశీదు అడిగి తీసుకోవాలని తెలిపారు. ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే వెంటనే సంబంధిత వ్యవసాయ అధికారులకు, పోలీస్ స్టేషన్ కు తెలపలన్నారు.

ఆదర్శంగా నిలుస్తున్న గురిజాల గ్రామ దంపతులు.

కుమార్తె పుట్టినరోజున జి.పి సిబ్బందికి రేమాండ్స్ దుస్తుల అందజేత

ఆదర్శంగా నిలుస్తున్న గురిజాల గ్రామ దంపతులు

నర్సంపేట నేటిధాత్రి:

ఎన్నో సంవత్సరాల నుండి నిత్యం గ్రామానికి నిస్వార్ధంగా సేవ చేస్తున్న నర్సంపేట మండలం గురిజాల గ్రామానికి చెందిన గ్రామ పంచాయితీ సిబ్బందిలో ఒకరైన కడగండ్ల నర్సయ్య (చిన్ని)కి ఆర్టీసీ ఉద్యోగి, గ్రామ ఉద్యోగుల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు గొలనకొండ వేణు, చైతన్య ప్రథమ కుమార్తె గొలనకొండ సహస్ర పుట్టినరోజును పురస్కరించుకొని మే 29న గురువారం నర్సయ్య(చిన్ని)కి విలువైన రేమాండ్స్ దుస్తులను సహస్ర చేతుల మీదుగా శ్రీ రామలింగేశ్వర హనుమాన్ ఆలయంలో అందించి ఆదర్శంగా నిలిచారు.గత నాలుగు నెలల క్రితం జనవరి 30న వేణు, చైతన్య దంపతుల కుమారుడు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా గురిజాల గ్రామ పంచాయితీ సిబ్బందికీ జీవితాంతం పట్టు చీరలు, రేమాండ్స్ దుస్తులను తమ ముగ్గురు పిల్లల పుట్టిన రోజున అందించడానికి గ్రామంలో తొలి సారిగా ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అందరికీ ఆదర్శంగా నిలిచారు. అక్టోబర్ 10న తమ కనిష్ట కుమార్తె ఆరాధ్య పుట్టినరోజున కూడా మరో మహిళా పంచాయితీ సిబ్బందికి పట్టుచీర అందజేస్తామని వేణు చైతన్య, దంపతులు తెలిపారు. తమ సేవలను గుర్తించినందుకు గాను గ్రామ పంచాయితీ సిబ్బంది వేణును శాలువాతో సత్కరించారు.

జర్నలిస్టుల జాతర ను విజయవంతం చేద్దాం.

జర్నలిస్టుల జాతర ను విజయవంతం చేద్దాం.

జర్నలిస్ట్ ఫోరం రజతోత్సవ సభ కు పెద్ద సంఖ్యలో తరలిరావాలి.

ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో వాల్పోస్టర్ ఆవిష్కరణ.

“నేటిధాత్రి”,వేములవాడ.

 

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో పురుడు పోసుకున్న తెలంగాణ జర్నలిస్టుల ఫోరం రజతోత్సవాలను జయప్రదం చేద్దామని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (H143) రాష్ట్ర ఉపాధ్యక్షులు, రాజన్న సిరిసిల్ల అధ్యక్షులు లాయక్ పాషా పిలుపునిచ్చారు.

వేములవాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఆవిర్భవించి మే 31వ తేదీతో 25 వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా హైదరాబాద్ జలవిహార్ లో నిర్వహిస్తున్న సంబరాల సభ కు రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు తల్లి రావాలని కోరారు.

Journalists’

 

తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం నిర్వహించిన చారిత్రాత్మక పాత్రను తెలియజేయడం కోసం మే 31న టీజేఎఫ్ రజతోత్సవాలను నిర్వహిస్తుందని తెలిపారు.

తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు నినాదం తో 2001 మే 31న ఆవిర్భవించిన తెలంగాణ జర్నలిస్టుల ఫోరం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు 2014 వరకు అన్ని వర్గాల ప్రజలను,ఉద్యమ సంఘాలను సంఘటితం చేసిన ఘనత టీజేఎఫ్ అల్లం నారాయణ లతో పాటు యావత్ తెలంగాణ జర్నలిస్టుల కృషి అని గుర్తు చేశారు.

ఇంతటి చారిత్రక నేపథ్యం కలిగిన జర్నలిస్ట్ ఫోరం రజతోత్సవ సంబరాలకు రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి జిల్లా నుండి జర్నలిస్ట్ లు అధిక సంఖ్యలో తరలివచ్చి జర్నలిస్టుల జాతరను విజవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మహమ్మద్ రఫీ, ప్రధాన కార్యదర్శి ఆయాచితుల జితేందర్, ఉపాధ్యక్షులు సయ్యద్ అలీ, జిల్లా రమేష్, దేవరాజ్, ప్రచార కార్యదర్శి షేక్ రియాజ్, కోడం గంగాధర్, హరీష్, విష్ణు, రాజేందర్, వెంకటేష్, ఇమ్రాన్, ఫహద్ పాషా, సల్మాన్, శ్యామ్, షోయబ్ లతోపాటు కార్యవర్గం సభ్యులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version