గురిజాల హైలెవల్ బ్రిడ్జి వంతెనకు శంకుస్థాపన చేసిన.

గురిజాల హైలెవల్ బ్రిడ్జి వంతెనకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే దొంతి

హర్షం ప్రకటించిన గురిజాల ఉద్యోగుల ఐక్యవేదిక

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

 

నర్సంపేట మండలం గురిజాల గ్రామంలో పెద్దం చెరువు వద్ద శిథిలావస్థలోనున్న గురిజాల నుండి నర్సంపేట పట్టణానికి వెళ్లే ప్రధాన రహదారి మార్గంలో లోలెవల్ వంతెన స్థానంలో 3.20 కోట్ల రూపాయలతో హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం కొరకు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు.కాగా గురిజాల ఉద్యోగుల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు గొలనకొండ వేణు,ప్రధాన కార్యదర్శి చుక్క రాజేందర్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు.
గత కొన్ని సంవత్సరాల నుండి పెద్దం చెరువు లోలెవల్ వంతెన ప్రమాదకర పరిస్థితులలో నీటి ఉధృతితో రాక పోకలు నిలిచిపోయి ఆరు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని వారు గుర్తుచేశారు. ఎమ్మెల్యే దొంతి శంకుస్థాపనతో ఆ కష్టాలు తీరానున్నాయని తెలిపారు. గురిజాల నుండి కోనాపురం వెళ్ళుటకు గ్రామ ప్రజలు, రైతులు రోడ్డు లేక అవస్థలు పడేవారని దీంతో మహేశ్వరం క్రాస్ నుండి గురిజాల, ఎంపీటీసీ రోడ్ మీదుగా కోనాపురం వెళ్ళుటకు 3.10 కోట్లతో బీటీ రోడ్డుకు కూడా శంకుస్థాపన చేయడం వారు సంతోషం వెలిబుచ్చారు. గురిజాల గ్రామంలో సీసీ రోడ్లు కాక మిగిలిపోయిన వీధులన్నీ వర్షా కాలంలో బురదమయం అయ్యి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలుపుతూ అందుకు గాను సీసీ రోడ్లు వేయించాలని ఎమ్మెల్యే మాధవరెడ్డికి విజ్ఞప్తి చేసినట్లు వేణు,రాజేందర్ గౌడ్ పేర్కొన్నారు.

ఆదర్శంగా నిలుస్తున్న గురిజాల గ్రామ దంపతులు.

కుమార్తె పుట్టినరోజున జి.పి సిబ్బందికి రేమాండ్స్ దుస్తుల అందజేత

ఆదర్శంగా నిలుస్తున్న గురిజాల గ్రామ దంపతులు

నర్సంపేట నేటిధాత్రి:

ఎన్నో సంవత్సరాల నుండి నిత్యం గ్రామానికి నిస్వార్ధంగా సేవ చేస్తున్న నర్సంపేట మండలం గురిజాల గ్రామానికి చెందిన గ్రామ పంచాయితీ సిబ్బందిలో ఒకరైన కడగండ్ల నర్సయ్య (చిన్ని)కి ఆర్టీసీ ఉద్యోగి, గ్రామ ఉద్యోగుల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు గొలనకొండ వేణు, చైతన్య ప్రథమ కుమార్తె గొలనకొండ సహస్ర పుట్టినరోజును పురస్కరించుకొని మే 29న గురువారం నర్సయ్య(చిన్ని)కి విలువైన రేమాండ్స్ దుస్తులను సహస్ర చేతుల మీదుగా శ్రీ రామలింగేశ్వర హనుమాన్ ఆలయంలో అందించి ఆదర్శంగా నిలిచారు.గత నాలుగు నెలల క్రితం జనవరి 30న వేణు, చైతన్య దంపతుల కుమారుడు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా గురిజాల గ్రామ పంచాయితీ సిబ్బందికీ జీవితాంతం పట్టు చీరలు, రేమాండ్స్ దుస్తులను తమ ముగ్గురు పిల్లల పుట్టిన రోజున అందించడానికి గ్రామంలో తొలి సారిగా ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అందరికీ ఆదర్శంగా నిలిచారు. అక్టోబర్ 10న తమ కనిష్ట కుమార్తె ఆరాధ్య పుట్టినరోజున కూడా మరో మహిళా పంచాయితీ సిబ్బందికి పట్టుచీర అందజేస్తామని వేణు చైతన్య, దంపతులు తెలిపారు. తమ సేవలను గుర్తించినందుకు గాను గ్రామ పంచాయితీ సిబ్బంది వేణును శాలువాతో సత్కరించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version