ఇటిక్యాలలోఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాలు పత్రాలు పంపిణీ.

ఇటిక్యాలలోఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాలు పత్రాలు పంపిణీ. . .

రాయికల్ జూలై 18, నేటి ధాత్రి:

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-32.wav?_=1

రాయికల్.మండలం ఇటిక్యాల గ్రామంలో మాజీ మంత్రివర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి ఆదేశానుసారం శుక్రవారం రోజున గ్రామపంచాయతీ .ఆవరణలో ఇందిరమ్మ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాలు లబ్ధిదారులకు పంపిణీ చేశారు.. ఈ కార్యక్రమంలో కార్యదర్శి రాజేష్, నాయకులు, ఆదిరెడ్డి, జలంధర్ రెడ్డి, గంగారెడ్డి, సాయ గౌడ్, స్వామి రెడ్డి, గంగాధర్, లక్ష్మణ్, మహేష్, ముత్తన్న, శేఖర్,హనుమాన్లు, రాజారాం, జాకీర్, ఇందిరమ్మ కమిటీ సభ్యురాలు ఏలేటి సౌమ్య, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

రవితేజకు పితృవియోగం..

రవితేజకు పితృవియోగం

రవితేజ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తండ్రి రాజగోపాల్‌ రాజు(90) కన్నుమూశారు. ఆయనకు ముగ్గురు సంతానం. వారిలో రవితేజ పెద్ద కుమారుడు…

రవితేజ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తండ్రి రాజగోపాల్‌ రాజు(90) కన్నుమూశారు. ఆయనకు ముగ్గురు సంతానం. వారిలో రవితేజ పెద్ద కుమారుడు. రెండో కుమారుడు భరత్‌ కారు ప్రమాదంలో మరణించారు. మూడో కుమారుడు రఘు ఇండస్ట్రీలోనే ఉన్నారు. ఆయన ఫార్మసి్‌స్టగా ఉద్యోగం చేశారు. ఆయన మృతి పట్ల చిరంజీవి, పవన్‌కల్యాణ్‌తో సహా పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

సొంతింటి కల నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.

సొంతింటి కల నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

జైపూర్,నేటి ధాత్రి:

జైపూర్ మండలం ఇందారం గ్రామం లోని దొరగారి పల్లె ప్రాంతంలో గడ్డం వివేక్ వెంకటస్వామి సహకారంతో ఇందిరమ్మ ఇంటికి శనివారం ముగ్గు పోసే కార్యక్రమం చేపట్టడం జరిగింది.అలాగే గ్రామం లో ప్రతి పేదవారికి ఇండ్లు మంజూరు అయ్యేలా మంత్రి కృషి చేస్తున్నట్లు తెలిపారు.గతా పది సంవత్సరాల పాలనలో అందరిని కెసిఆర్ మోసం చేశారని,కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట కు కట్టుబడి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టారు.రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రి వివేక్ వెంకటస్వామికి,యువ నాయకుడు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.చెన్నూరు నియోజకవర్గంలో అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని కోరినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో జైపూర్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మొహమ్మద్ ఫయాజుద్దీన్,సిహెచ్.సతీష్ కుర్మిల్లా సరస్వతి,రవి, భాగ్యరాజ్,గ్రామం పెద్దలు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి భూమి పూజ.

ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి భూమి పూజ

38వ వార్డు ఇంచార్జ్ బైరి ప్రవీణ్ కుమార్.

నేటి ధాత్రి సిద్దిపేట:

 

 

 

 

స్థానిక సిద్దిపేట 38వ వార్డులో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుగా ఎంపికైన గాదగోని జయ ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా మంజూరు పత్రాలు అందించారు.

ఈ సందర్భంగా మంగళవారం ఇల్లు నిర్మాణం పనులు మొదలు పెడుతూ భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. మరియు నిర్మాణానికి తొలిమెట్టు అయిన ముగ్గు పోయడం జరిగింది.

ఇట్టి కార్యక్రమానికి లబ్ధిధారైన గాధగోని జయ సిద్దిపేట స్థానిక కాంగ్రెస్ నాయకులు బైరి ప్రవీణ్ కుమార్, సిద్దిపేట నియోజకవర్గ ఇన్చార్జ్ పూజల హరికృష్ణ , 17 వార్డు ఇంచార్జీ, వెంకటేశ్వర గుడి డైరెక్టర్ బైరి నాగమణి మరియు మార్క సతీష్ లను ఆహ్వానించగా వారి ఆధ్వర్యంలో లబ్ధిదారుకు శుభాకాంక్షలు తెలిపి కొబ్బరికాయ కొట్టిన స్థానిక 38వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బైరి ప్రవీణ్ కుమార్ భూమి పూజ చేయడం జరిగిందనీ తెలిపారు.

 

Praveen Kumar.

 

 

ఇట్టి కార్యక్రమంలో 38వ వార్డ్ మున్సిపల్ అధికారి, 2వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు 38వ వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజు మరియు ఇందిరమ్మ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఇంటి నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలి.

ఇంటి నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలి

జైపూర్,నేటి ధాత్రి:

 

 

 

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని గంగిపల్లి గ్రామ పంచాయతీ లో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను మండల పరిషత్ అభివృద్ధి అధికారి జి.సత్యనారాయణ గౌడ్,మండల తహసిల్దార్ వనజా రెడ్డి,మండల పంచాయతీ అధికారి శ్రీపతి బాపురావు సోమవారం క్షుణ్ణంగా పరిశీలించడం జరిగినది.పరిశీలన అనంతరం అధికారులు మాట్లాడుతూ వీలయినంత త్వరగా ఇంటి నిర్మాణాలను పూర్తి చేయాలనీ లబ్దిదారులకు సూచించారు.నిర్మాణం స్టేజిల వారిగా ఫోటో కాప్చర్ పెండింగ్ లేకుండా పూర్తి చేయాలని హౌసింగ్ ఏఈ కాంక్షని,పంచాయతీ కార్యదర్శి అరెల్లి సత్యనారాయణని ఆదేశించారు.

గత ప్రభుత్వంలో ఏ ఒక్కరి కూడా ఇల్లు మంజూరు చేయలేదు…

గత ప్రభుత్వంలో ఏ ఒక్కరి కూడా ఇల్లు మంజూరు చేయలేదు…

పిఎసిఎస్ వైస్ చైర్మన్ అల్లం నాగేశ్వర్ రావు

కల్యాణ లక్ష్మి,.. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ… ఇందిరమ్మ ఇళ్ల పత్రాలను లబ్ధిదారులకు అందజేత

కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తుంది…

కేసముద్రం/ నేటిదాత్రి

 

 

 

 

కేసముద్రం మండలం పరిధిలో ఎంపీడీవో కార్యాలయం ప్రాంగణంలో రైతు వేదిక నందు మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్యా మురళి నాయక్, ఆదేశాల మేరకు స్థానిక తహసిల్దార్ వివేక్ అధ్యక్షతన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది, మండలానికి చెందిన కళ్యాణ లక్ష్మి 50 మంది లబ్ధిదారులకు మరియు13 మంది సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు,కేసముద్రం మున్సిపాలిటీ చెందిన 100 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పత్రాలను అందజేసిన ధన్నసరి పిఎసిఎస్ వైస్ చైర్మన్ అల్లం నాగేశ్వర్ రావు
మహబూబాబాద్ జిల్లా ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ రావుల మురళి,కేసముద్రం పిఎసిఎస్ వైస్ చైర్మన్ అంబటి మహేందర్ రెడ్డి,

ఈ సందర్భంగా నాగేశ్వర్ రావు మాట్లాడుతూ..నిరుపేద కుటుంబాలకు సొంతింటి కల నెరవేరాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 5 లక్షల నిధులతో ఇందిరమ్మ మంజూరు చేస్తున్నారని,
అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామన్నారు.

గత ప్రభుత్వం ఏ ఒక్కరికి కూడా ఇండ్లు మంజూరు చేయలేదని కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసిందన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రతి ఒక్కరికి సన్నబియ్యం అందిస్తుందన్నారు. మూడు నెలల సన్న బియ్యం ఒకేసారి అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె ప్రసన్న రాణి, ఎమ్మార్వో జి వివేక్ , రెవెన్యూ అధికారులు ఎండీ మాజిద్,సౌజన్య,పిసిసి మెంబర్ దశ్రు నాయక్ ,,మాజీ ఎంపీపీ మల్సూర్ నాయక్,మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ ఎండీ ఆయాబ్ ఖాన్, చింతకుంట్ల యాదగిరి,మాజీ సర్పంచ్ మధుగిరి సాంబయ్య, మాజీ ఉప్పసర్పంచ్ బానోత్ వెంకన్న, అధికారులు,గ్రామ పార్టీ అధ్యక్షులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

పక్క ఇల్లు ఉన్న… ఐనా.. ఇందిరమ్మ ఇల్లు మంజూరు..

పక్క ఇల్లు ఉన్న… ఐనా.. ఇందిరమ్మ ఇల్లు మంజూరు..

#అసలైన లబ్ధిదారులకు అందని ద్రాక్షల ఇందిరమ్మ ఇల్లు.

#ప్రభుత్వ పథకానికి తూట్లు పొడుస్తున్న నాయకులు.
నల్లబెల్లి, నేటి ధాత్రి;

 

 

 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమంలో భాగంగా నాయకుల వ్యవహార శైలితో గ్రామాలలో అర్హులైన లబ్ధిదారులకు ఇండ్ల మంజూరు చేయకుండా. తమకు నచ్చిన వ్యక్తులకు ఇండ్లు మంజూరు చేయించి ఆర్థికంగా బలోపేతం కావడానికి నాయకులు ప్రయత్నిస్తున్నారని అర్హులైన లబ్ధిదారులు వాపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీలో భాగంగా ప్రతి ఇల్లు లేని నిరుపేదకు ఇల్లు నిర్మించేందుకు ఐదు లక్షల రూపాయలను వెచ్చించి ఇల్లు నిర్మాణం చేపట్టే దిశగా ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టుగా పథకాన్ని దిగ్విజయం చేసేందుకు అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తుంటే గ్రామాలలో ఉన్న చోటామోటా నాయకులు వారి స్వార్ధ ప్రయోజనాల కోసం అర్హులైన లబ్ధిదారులను పక్కనపెట్టి. కమిషన్లు ఇచ్చే వారికే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు పత్రాలు అందజేసి పబ్బం గడుపుతున్నారని పలువురు ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు అవకతలపై సమగ్ర విచారణ చేపట్టి అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసే విధంగా అధికారులు కృషి చేయాలని నిరుపేద కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.

గుడుంబా రవాణా చేస్తున్నా ఇద్దరి అరెస్ట్.

గుడుంబా రవాణా చేస్తున్నా ఇద్దరి అరెస్ట్

 

పరకాల నేటిధాత్రి

 

 

 

గురువారం రోజున పరకాల ఎక్సయిస్ స్టేషన్ పరిధిలోని ఆత్మకూరు మండలం కటాక్షపూర్ వద్ద రూట్ వాచ్ నిర్వహించి నందిగామ రేలకుంట నుండి ఆత్మకూరు మండలంలోనికి ఆటోలో గుడుంబా రవాణా చేస్తున్న భూక్యా సుజాత, భూక్యా జగన్ అనే ఇద్దరిని ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు.వారిని అరెస్ట్ చేసి వారివద్దనుండి ఆటో (15)లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకున్నారు.ఈ రూట్ వాచ్ లో పాల్గొన్న వారు
ఎస్ఐ సులోచన
కానిస్టేబుల్ లు శ్రీనివాస్, విజయ్ కుమార్,దిలీప్ పాల్గొన్నారు.

కాంగ్రెస్ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇళ్లు.

కాంగ్రెస్ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇళ్లు

⏩ అర్హులకు అందని సంక్షేమ పథకాలు.
⏩ పైసా వసూలే లక్ష్యంగా ఇందిరమ్మ ఇండ్ల కమిటీ మెంబర్లు.

సుంకరి మనిషా శివకుమార్. 16వ డివిజన్ కార్పొరేటర్

కాశిబుగ్గ నేటిధాత్రి:

shine junior college

గ్రేటర్ వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలోని 16వ డివిజన్ గరీబ్ నగర్ లో ఇందిరమ్మ ఇండ్లలో అక్రమాలు జరిగాయి అని స్థానిక కార్పొరేటర్ సుంకరి మనీషా శివకుమార్ ఆరోపించారు.
ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు లో స్థానిక పరకాల ఎమ్మెల్యే కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు,తన అనుచరులకు మాత్రమే కేటాయించి అసలైన అర్హులను విస్మరించారు అని,గతంలో గృహలక్ష్మి పథకం కింద మంజూరు అయి ప్రొసీడింగ్స్ అందుకునే లోపు ప్రభుత్వం మారడంతో ఇంటి నిర్మాణ పిల్లర్లు సైతం నిర్మించుకున్న వికలాంగురాలు నిరాశ్రయురాలు అయింది అని ఆవేతరం వ్యక్తం చేశారు. పైసా వసూలే లక్ష్యంగా ఇందిరమ్మ ఇండ్ల కమిటీ మెంబర్లు అందిస్తున్నారని నిరుపేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గతంలో ఎన్నికల సందర్భంగా వికలాంగులకు డబుల్ బెడ్ రూమ్ ఇస్తామని చెప్పి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట తప్పాడని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని,లేని పక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తీరును ఎండగడతామని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీల అమలు కోసం ప్రజలతో కలసి పోరాడుతామన్నారు.

ఈ కార్యక్రమంలో 16వ డివిజన్ బి ఆర్ యస్ పార్టీ అధ్యక్షుడు పోగుల సంజీవ,గ్రామ పార్టీ నాయకులు బొజ్జం తిరుపతి,నరసింహ,SbK అంజాద్,బొంత.రవి,ఏడాకుల మోహన్ రెడ్డి,రాజారాం,కన్నేబోయిన.రాజు,మెండురామకృష్ణ,రాజేందర్,మురళి,యశోద,అశోక్,చిరు,మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇల్లు కొంటున్నారా.. నాలాపై ఉందా చూడండి

ఇల్లు కొంటున్నారా.. నాలాపై ఉందా చూడండి

 

 

shine junior college

ఇల్లు కొనుగోలు చేసే సమయంలో చెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ తరహాలోనే నాలా ఆక్రమించి నిర్మాణం చేపట్టారా అన్నది కూడా చెక్‌ చేసుకోవాలని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ పౌరులకు సూచించారు.

హైదరాబాద్‌ సిటీ: ఇల్లు కొనుగోలు చేసే సమయంలో చెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ తరహాలోనే నాలా ఆక్రమించి నిర్మాణం చేపట్టారా అన్నది కూడా చెక్‌ చేసుకోవాలని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌(Hydra Commissioner AV Ranganath) పౌరులకు సూచించారు. బుద్ధభవన్‌లో సోమవారం జరిగిన ప్రజావాణిలో 47 ఫిర్యాదులు వచ్చాయి. మల్కాజ్‌గిరి, బాచుపల్లి, సికింద్రాబాద్‌(Malkajgiri, Bachupally, Secunderabad)లోని పద్మారావునగర్‌, మాదాపూర్‌ తదితర ప్రాంతాలకు చెందిన వారు నాలాల ఆక్రమణలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.
గ్రామ పంచాయతీ అనుమతితో లే అవుట్లు చేసి గతంలోనే విక్రయించిన స్థలాలకు వ్యవసాయ భూములంటూ తప్పుడు పాస్‌ పుస్తకాలతో కొందరు వ్యక్తులు కబ్జాకు ప్రయత్నిస్తున్నారని ప్లాట్ల యజమానులు రంగనాథ్‌ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన ఆయన పాత లే అవుట్లలోని రహదారులు, పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను కాపాడుతూనే అమాయకులు మోసపోకుండా చర్యలు తీసుకుంటున్నామని ఫిర్యాదుదారులకు భరోసానిచ్చారు.
AV Ranganath

ప్రజావాణికి దృష్టికి వచ్చిన కొన్ని ఫిర్యాదులు

– ఘట్‌కేసర్‌ మండలం పోచారం మునిసిపాలిటీ పరిధి కొర్రెముల గ్రామం సర్వే నంబర్‌ 739 నుంచి 749 వరకు ఉన్న 147 ఎకరాల్లో ఏకశిలానగర్‌ లే అవుట్‌ను 1985లో అభివృద్ధి చేశారు. 2006లో అందులోని 47 ఎకరాలను వ్యవసాయ భూమిగా చూపుతూ ఓ వ్యక్తి లే అవుట్‌ స్వరూపం మార్చారు. ఇదే లే అవుట్‌లో రెండు బడా రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు ప్రహరీలు నిర్మించి కొంత మేర కాజేశాయి.

– కొర్రెములలోని సర్వే నంబర్‌ 796లో 11.20 ఎకరాల భూమి ఉండగా, ఇందులో 7.20 ఎకరాల్లో మెడికల్‌ కళాశాల ఏర్పాటు చేశారు.

 

 

– పంజాగుట్ట ఆఫీసర్స్‌ కాలనీలో 1000 చ.గ పార్కు స్థలంలో సగం జాగాలో దుర్గాభవానీ ఆలయం నిర్మించారు. మిగతా 500 గజాల స్థలం కబ్జాకాకుండా పార్కు అభివృద్ధి చేయాలి.

– అల్వాల్‌ మండలం జొన్నబండ గ్రామంలోని వజ్ర ఎన్‌క్లేవ్‌లో 900 చ.గల పార్కు స్థలం కబ్జా అవుతోంది.

– తూముకుంట మునిసిపాలిటీ దేవరయాంజల్‌ గ్రామంలోని తురకొని కుంట శిఖం భూమిలో వేయింగ్‌ మిషన్‌ ఏర్పాటు చేస్తున్నారని సీతారామచంద్ర స్వామి దేవస్థానం భూముల పరిరక్షణ సమితి ప్రతినిధులు ఫిర్యాదు చేశారు.

ప్రభుత్వ భూమిలో ఇండ్లపట్టాలు ఇవ్వాలి.

ప్రభుత్వ భూమిలో ఇండ్లపట్టాలు ఇవ్వాలి..

ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వినతిపత్రం ఇచ్చిన పేదలు

అర్హులైన పేదలందరికీ పట్టాలిస్తాం… హామీ ఇచ్చిన ఎమ్మెల్యే

నర్సంపేట నేటిధాత్రి:

ప్రభుత్వ భూమిలో పేదలు వేసుకున్న ఇండ్లకు పట్టాలచ్చి, ఇందిరమ్మ ఇండ్లు కట్టించి, కనీస సౌకర్యాలు కల్పించాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొరబోయిన కుమారస్వామి, హన్మకొండ శ్రీధర్ తెలిపారు.ఈ మేరకు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పేదలు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్బంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొరబోయిన కుమారస్వామి, హన్మకొండ శ్రీధర్ మాట్లాడుతూ
నర్సంపేట పట్టణంలోని 601/1 ప్రభుత్వ భూమిలో నిలువ నీడలేని పేదలు గత 5 సంవత్సరాలకు పైగా గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారు. వీరికి నీళ్ల సౌకర్యం లేక ఇబ్బంది పడుతుంటే దొంతి మాధవరెడ్డి ఎమ్మెల్యే సహకారంతో గెలిచిన వెంటనే పేదలు నివాసం ఉండే ప్రాతంలో బోరువేయడం జరిగిందని అన్నారు.కనీస సౌకర్యాలైన మంచినీరు, మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడుతున్నాము. వర్షాకాలం వచ్చిందంటే తీవ్రమైన ఇబ్బందులను ఎదురుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నది. పాములు,కిటకాలుతో పేదలు సావాసం చేస్తున్నారని అన్నారు. రెవెన్యూ అధికారులకు పట్టాల కోసం అనేక సార్లు దరఖాస్తలు చేసుకోవడం జరిగిందని,ఎమ్మెల్యే స్పందించి పేదలు వేసుకున్న ప్రాంతాలలో కనీస సౌకర్యాలు కల్పించి,ఇండ్ల పట్టాలు ఇప్పించి, ఇందిరమ్మ ఇండ్లు కట్టించగలరని కోరినట్లు తెలిపారు.వెంటనే స్పందించిన ఎమ్మెల్యే నర్సంపేట స్థానికులైనా అర్హత గల పేదలందరికి పట్టాలు ఇప్పిస్తానని హామీ ఇవ్వడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ నాయకులు గడ్డమీది బాలకృష్ణ, కందికొండ రాజు, ఇప్ప సతీష్, కలకోట అనిల్,ఎండి ఫరిదా, వజ్జంతి విజయ, బిట్ర స్వప్న, ఉదయగిరి నాగమణి, జగన్నాధం కార్తీక్, దాసరి నరేష్, తదితరులు పాల్గొన్నారు.

నర్సాపూర్ ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన.

నర్సాపూర్ ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం నర్సాపూర్ గ్రామంలో శుక్రవారం పేదలకు ఎంపీడీవో సుధాకర్ మరియు హౌసింగ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఇళ్లకు ముగ్గులు వేసి ప్రొసిడింగ్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సెక్రెటరీ వెంకటేశం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సురేష్ మాజీ ఉప్పు సర్పంచ్ గోపాల్, మల్లన్న నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నర్సాపూర్ ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన.

నర్సాపూర్ ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం నర్సాపూర్ గ్రామంలో శుక్రవారం పేదలకు గ్రామపంచాయతీ సెక్రెటరీ వెంకటేశం ఆధ్వర్యంలో ఇళ్లకు ముగ్గులు వేసి ప్రొసిడింగ్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సురేష్ మాజీ ఉప్పు సర్పంచ్ గోపాల్, మల్లన్న నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇసుక అక్రమ దారుల పంజా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి.

సిరిసిల్ల జిల్లాలో ఇసుక అక్రమ దారుల పంజా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుకకొరత

మూడు వేల రూపాయల. నుండి నాలుగు వేల రూపాయలు

టాక్టర్ ఇసుక అమ్ముతున్న ఇసుక అక్రమ దారులు ఆగిపోతున్న నిర్మాణాలు

వారానికి మూడు రోజులు ప్రభుత్వం ఇసిక సప్లై చేయాలి

ఇసుక అక్రమ దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి

సి.పి.ఎం జిల్లా కార్యదర్శి ముశం రమేష్ డిమాండ్

సిరిసిల్ల టౌన్: ( నేటిధాత్రి )

 

 

 

 

ఈరోజు సిరిసిల్ల పట్టణ కేంద్రం అమృత్ లాల్ శుక్ల కార్మిక భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో సి.పి.ఎం జిల్లా కార్యదర్శి ముశం రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ పథకంలో భాగంగా ఇంటి స్థలం ఉన్న వాళ్లకు ఐదు లక్షల రూపాయలు ఇల్లు నిర్మాణానికి అందిస్తుంది. సిరిసిల్ల పట్టణంలో 700 పై చిలుకు ఇల్లు మంజూరు చేయడం జరిగినది. ఒకేసారి అందరూ నిర్మాణం ప్రారంభించడం వలన ఇసుక కొరత తీవ్రంగా తీవ్రంగా నెలకొన్నది ఫలితంగా నిర్మాణాలు ఆగిపోయాయి ఇసుక డిమాండ్ ను ఆసరా చేసుకొని కొంతమంది అక్రమంగా ఇసుక రవాణా చేసి వాళ్ళు ఇసుక ధర పెంచి 1500 ట్రాక్టర్ ఉన్న రేటును మూడు3 వేల నుండి 4 వేలకు టాక్టర్ .ఇసుక అమ్ముతున్నారు. గత 15 రోజులు నుండి ప్రభుత్వం ఇసుక సప్లై కి చేయకపోవడం మూలంగా ఈ పరిస్థితి ఏర్పడింది.ప్రభుత్వం వెంటనే స్పందించి ఇసుక కొరత లేకుండా వారానికి మూడు రోజులు ఇసుక పంపిణీ చేస్తేనే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తి అవుతుంది వర్షాలు బాగా పడి మానేరు వాగు ప్రయాహిస్తే మానేరు నుండి ఇసుక తీయడం నిలిచిపోతుంది.ఫలితంగా ప్రభుత్వం దసరా వరకు పూర్తి చేయాలనుకున్న నిర్మాణాలు పూర్తి కాకుండా ఆగిపోతాయి.ఇల్లు కూలగొట్టుకొని నిర్మాణం చేసుకుంటున్నాం వారికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది.సిరిసిల్ల ప్రజలకు తరుపున. మానేరులో ఇసుక ఉన్నా కూడా వేల రూపాయలు ఖర్చుపెట్టి కొనుక్కోవలసిన దౌర్భాగ్య పరిస్థితి నెలకొన్నది ఇసుక అక్రమ దారులు మానేరు నుంచి కోట్లాది రూపాయల ఇసుకను దొంగతనం చేసి ఇతర ప్రాంతాలకు అమ్ముతుంటే. అధికారులు చూసి చూడనట్టు వివరిస్తారు స్థానికులు నిర్మాణాలు చేసుకోవడానికి కావాలంటే అనేక ఆంక్షలు ప్రభుత్వం విధిస్తుంది,ఇప్పటికైనా ప్రభుత్వం రాజన్న సిరిసిల్ల జిల్లా లో నిర్మించుకుంటున్న వారి నిర్మాణాలకు ఉచితంగా ఇసుక సప్లై చేయాలి. మానేరు నది నుండి ఇతర ప్రాంతాలకు ఇసుకను. అక్రమంగా తరలించకుండా అక్రమ దారులపై పీడీ యాక్ట్ కేసు లు నమోదు చేయాలి టాక్టర్ ఇసుక ధర 1500 మించకుండా ప్రభుత్వం ధరలను నియంత్రించాలనీ. అన్నారు లేనిపక్షంలో సి.పి.ఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు.సమావేశంలో సి.పి.ఎం కార్యదర్శి వర్గ సభ్యులు కోడం రమణ, సి.పి.ఎం జిల్లా కమిటీ సభ్యులు సూరం పద్మ, మల్లారం ప్రశాంత్, మిట్టపల్లి రాజమల్లు  పాల్గొన్నారు.

ఇల్లు మంజూరు అయిన వారు 15 రోజులలోపు నిర్మాణం ప్రారంభం చేసుకోవాలి

ఇల్లు మంజూరు అయిన వారు 15 రోజులలోపు నిర్మాణం ప్రారంభం చేసుకోవాలి

మండల పరిషత్ అభివృద్ధి అధికారి పెద్ది ఆంజనేయులు

పరకాల నేటిధాత్రి

 

 

 

 

మండల పరిధిలోని కామారెడ్డి పల్లి లో పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయిన లబ్దిదారుల కొరకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి యంపీడీఓ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల మంజూరు మరియు నిర్మాణంలో ఏలాంటి అవకతవకలు జరుగకుండా ప్రభుత్వం జారీ చేసిన నియమ నిబంధనల మేరకే నిర్మించాలని,ఇంటిని 400 నుండి 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో మాత్రమే నిర్మించాలని ఎక్కడ జియో కోఆర్డినేట్స్ తో ముగ్గు పోస్తే అక్కడే నిర్మాణం చేయాలని అన్నారు.ఇంటి నిర్మాణం ప్రారంభం కాగానే పంచాయతీ కార్యదర్శులు యంపీడీఓ కు ఇసుక మరియు మట్టి కొరకు లేఖ ఇస్తే తహసీల్దారు నుండి ఉచిత టోకెన్ తెప్పించి ఇవ్వ బడునని ట్రాన్స్పోర్టేషన్ మాత్రం లబ్ధిదారులే భరించాలని,మంజూరు విషయంలో కానీ చెల్లింపు విషయంలో కానీ మధ్యవర్థుల ఎవ్వరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వకూడదని ఎప్పటి కప్పుడు పంచాయతీ కార్యదర్శికి సమాచారం ఇస్తే సంబందిత అధికారుల వచ్చి రికార్డు చేసి వెంటనే బిల్లు చెల్లించడం జరుగుతుందని అన్నారు ఇందిరమ్మ కమిటీ సభ్యులు కూడా లబ్దిదారులకు సహకరించాలని సంవత్సరం లోపు అందరూ గృహ ప్రవేశం చేయాలని సూచించారు

 

Mandal Parishad Development Officer Peddi Anjaneyulu.

అనంతరం నాగారం గ్రామంలో 38 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయగా అందులో 11 ఇండ్లకు ముగ్గు పోసి పనులు ప్రారంభం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ ఏఈ శ్రీలత,మాజీ సర్పంచ్ కట్కూరి స్రవంతి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు,పంచాయతీ కార్యదర్శి కిరణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

పేదోడికి సొంత ఇంటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ లక్ష్యం

పేదోడికి సొంత ఇంటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ లక్ష్యం

తోపనపల్లిలో ఇంటి నిర్మాణ భూమి పూజ చేసిన రంజిత్ రెడ్డి

#నెక్కొండ, నేటి ధాత్రి:

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులలో భాగంగా తోపనపల్లి గ్రామంలో ఇంటి నిర్మాణపు భూమి పూజ కార్యక్రమంలో నర్సంపేట టి పి సి సి సభ్యుడు సొంటి రంజిత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఈ కార్యక్రమంలో రంజిత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి పేదవాడికి సంత ఇంటి నెరవేరుస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని పేదవాడి కళ్ళల్లో ఆనందం చూస్తే ఎంతో ఆనందంగా ఉందని తోపన పల్లి గ్రామంలో లబ్ధిదారులు సంతోషంతో ఇంటి నిర్మాణ పనులు చేపడుతున్నారని నర్సంపేట టిపిసిసి సభ్యుడు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో నెక్కొండ మార్కెట్ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి, నెక్కొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బక్కి అశోక్,నెక్కొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెండ్యాల హరిప్రసాద్, కాంగ్రెస్ నాయకులు కుసుమ చెన్నకేశవులు, సాయి కృష్ణ, మహిపాల్ రెడ్డి, కొత్తపల్లి రత్నం, బర్రె సూరయ్య, చంద్రహాసన్, రమేష్, చాగంటి నారాయణ, కక్కర్ల రాజు, ఇంద్రసేనారెడ్డి, ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.

నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే.

నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

మాజి పాక్స్ చైర్మన్ బస్వరాజు గారి నూతన గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరై శుభాకాంక్షలు తెలియజేసిన శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం,ఝరాసంగం పట్టణ అధ్యక్షులు ఏజాస్ బాబా,యువ నాయకులు మిథున్ రాజ్ ,మాజి సర్పంచ్ లు ప్రభు పటేల్ , బస్వరాజ్ తదితరులు.

ప్రతీ నిరుపేద కుటుంబికుని కల ఇందిరమ్మ ఇల్లు.

ప్రతీ నిరుపేద కుటుంబికుని కల ఇందిరమ్మ ఇల్లు…

కరీంనగర్ నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రామడుగు, కొక్కరకుంట, వన్నారం గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్లకు భూమిపూజ చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మరవేని తిరుమల. ఈసందర్భంగా కాంగ్రెస్ పార్టీ రామడుగు మండల అధ్యక్షులు జవ్వాజి హరీష్ మాట్లాడుతూ మండల అధికారులు గ్రామాల్లో ప్రతీ ఇంటికి తిరిగి ఎలాంటి రాజకీయ ప్రలోభాలు లేకుండా సరైన లబ్ధిదారులకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని, ఎక్కడ కూడా అవకతవకలు జరగకుండా చూసుకోవాలని, లబ్ధిదారులు సైతం ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఇళ్లు నిర్మించుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో గోపాలరావుపేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పిండి సత్యం, వెన్న రాజమల్లయ్య, రామడుగు కార్యదర్శి శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కాడే శంకర్, పంజాల శ్రీనివాస్ గౌడ్, ఇందిరమ్మ కమిటీ మెంబర్స్ కర్ణ శీను, పొన్నం మల్లేశం, బత్తిని అజయ్, రామడుగు మండలం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ జవ్వాజి అజయ్, తదితరులు పాల్గొన్నారు.

సొంత ఇంటి కల నెరవేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం..

సొంత ఇంటి కల నెరవేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం..

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

 

తంగళ్ళపల్లి మండలం.

నరసింహులపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు పోసి ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరుపేదలకు సొంతింటి కలను నెరవేరుస్తున్న ఏకైక ప్రభుత్వంతెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అని .

ఇందుకుగాను. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజల అభివృద్ధి కొరకు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి. గత ప్రభుత్వం.

ఎన్నో ప్రాజెక్టు ల. పేరిట. అప్పులు.చేసిన కూడా. వాటిని కట్టుకుంటూ. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు. ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొస్తున్న. మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని

ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసిన. జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డికి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి.

మంత్రి పొన్నం ప్రభాకర్ కి. ఆది శ్రీనివాస్ కి. సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ.నియోజవర్గ ఇన్చార్జి కాంగ్రెస్ పార్టీ నాయకులు కేకే మహేందర్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు.

అలాగే ఇంటి నిర్మాణంలో పూర్తి సహకారం ప్రభుత్వం అందిస్తుందని నిర్మాణాలకు ఇసుక ఉచితంగా సరఫరా ప్రభుత్వమే చేస్తుందని లబ్ధిదారుల ఇందిరమ్మ ఇండ్ల పనులు వేగవంతం చేసుకుంటూ.

ఇల్లు నిర్మాణం చేపట్టి పనులు వేగవంతంచేసి ఇందిరమ్మ ఇంటి సహకారం ఇందిరమ్మ కలను సహకారంచేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్ రూమ్ పేరిట ప్రజల సొమ్ము దోచుకున్నారని ప్రజా ప్రభుత్వంలో ఇప్పటి ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ప్రజా పరిపాలనలో.

అటువంటి వాటికి తావు లేకుండా ఉంటుందని

ఈ సందర్భంగా తెలియజేశారు ఈ సందర్భంగా లబ్ధిదారులు అధికారులకు నాయకులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపిన లబ్ధిదారులు అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇట్టి కార్యక్రమంలో తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్. ఏఎంసి వైస్ చైర్మన్.

నేరెళ్ల నరసింహం గౌడ్. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి.

సత్తు శ్రీనివాస్ రెడ్డి. ఏం సి డైరెక్టర్ పరశురాములు. కాంగ్రెస్ పార్టీ మండల బీసీ సెల్ అధ్యక్షులు మల్లేశం యాదవ్.

కాంగ్రెస్ పార్టీ నాయకులు కటకం రాజశేఖర్. జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ. తిరుపతి. కిషన్. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ.

తొర్రూరు మండలంలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ ఇది నిజమైన ఇందిరమ్మ రాజ్యం అంటూ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు.

తొర్రూరు (డివిజన్) నేటి ధాత్రి:

 

ప్రభుత్వం పేదల సంక్షేమానికి అంకితమై పనిచేస్తున్నదని పాలకుర్తి శాసన సభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి గారు స్పష్టం చేశారు. తొర్రూరు మండల కేంద్రంలోని ఆర్&బి గెస్ట్ హౌస్ లో నిర్వహించిన ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే గారు స్వయంగా ఇండ్ల స్థలాల పట్టాలను అందజేశారు..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీమతి యశస్విని రెడ్డి గారు మాట్లాడుతూ.. ఇది నిజమైన ఇందిరమ్మ రాజ్యం. ఇక్కడ ప్రతి పేదవాడికి న్యాయం జరుగుతోంది. ఇంటి కోసం ఎదురు చూస్తున్న పేదలకు ఈ పట్టాలు వారి కలలను సాకారం చేస్తున్నాయి. తలదాచుకునే చోటు కలిగిన ప్రతి కుటుంబం సమాజంలో గౌరవంతో బతికే అవకాశం పొందుతుంది, అని పేర్కొన్నారు..

అలాగే, రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఆశ్రయమైన ఇంటిని కల్పించడంలో ఎంతగానో కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఇది కేవలం పట్టా కాదు, పేదల భవిష్యత్తుకి బలమైన బునియాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తలదాచుకునే ఇంటి కోసం భూమిని, నిర్మాణానికి ఆర్థికసహాయాన్ని అందిస్తోంది, అని వివరించారు..

కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, పట్టణ నాయకులు, పార్టీ సీనియర్ నాయకులు, లబ్ధిదారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పట్టాలు అందుకున్న లబ్ధిదారులు తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు.

ఇన్నేళ్లుగా అద్దె ఇంట్లో జీవితం గడిపాం. ఇప్పుడు మా కుటుంబానికి ఓ గౌరవం వచ్చినట్టు ఉంది,” అంటూ ఒక లబ్ధిదారుడు ఆనందంతో చెప్పారు..

పట్టాల పంపిణీ అనంతరం, ఎమ్మెల్యే గారు అధికారులతో మాట్లాడి మండలంలో పథకాల అమలు, నిర్మాణ పనుల పురోగతిపై అడిగి తెలుసుకున్నారు..

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version