రోస్టర్ రిజిస్టర్స్ వెరిఫికేషన్ తనిఖీ చేసిన.

రోస్టర్ రిజిస్టర్స్ వెరిఫికేషన్ తనిఖీ చేసిన సింగరేణి సంక్షేమ సంఘం నాయకులు

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

 

 

కాకతీయ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించిన సింగరేణి గిరిజన ఉద్యోగుల సంఘం నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామగుండం రీజన్ బెల్లంపల్లి రీజన్లో రోస్టర్ రిజిస్టర్స్ వెరిఫికేషన్ తనిఖీ ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో సింగరేణి చీఫ్ లైజన్ ఆఫీసర్, ఏరియా లైజన్ ఆఫీసర్, అదేవిధంగా ఈ ఏరియాలో ఉన్న పర్సనల్ మేనేజర్, జనరల్ మేనేజర్ వారి బృందంతో పాటు సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం సెంట్రల్ కమిటీ సభ్యులు అధ్యక్షులు భాస్కర రావు జనరల్ సెక్రెటరీ భూక్య నాగేశ్వరరావు కార్యనిర్వాహక అధ్యక్షులు పంతుల ఏరియా అధ్యక్షులు సెక్రెటరీ పాల్గొని, ఆర్జి-1 ఏరియా, ఆర్జి-2 ఏరియా, బెల్లంపల్లి ఏరియా, మందమర్రి ఏరియా, శ్రీరాంపూర్ ఏరియా, ఎస్ టీ పీపీ ఈ 5 ఏరియాల్లో ఉన్నటువంటి రోస్టర్ రిజిస్టర్ పుస్తకాలను తనిఖీ చేయడం జరిగిందని వారు తెలిపారు
ఇప్పటివరకు క్యారీ ఫార్వర్డ్ అవుతున్న అన్ని పోస్టుల వివరాలను ఏరియా పర్సనల్ మేనేజర్ ద్వారా కాపీలను తీసుకోవడం జరిగింది ఏరియాలో ఉన్నటువంటి ఖాళీల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి,
ఆర్జి -1 ఏరియా, – 66 ఆర్జి-2 ఏరియా, – 31
ఆర్జి- 3 ఏరియా. -48
బెల్లంపల్లి ఏరియా – 11
మందమర్రి ఏరియా – 31
శ్రీరాంపూర్ ఏరియా. -92
ఎస్ టి పిపి- 03
భూపాలపల్లి ఏరియా – 33
ఎన్ సి డబ్ల్యూ ఏ
క్యాడర్లలో వివిధ కేటగిరీలో ఉన్నటువంటి ఖాళీలను పైన తెలిపిన విధంగా ఏరియాలో గిరిజనుల పోస్ట్లు భర్తీ కాకుండా ఉన్నాయని తెలియజేస్తున్నాము వాటిని భర్తీ చేయాలని ఏరియా జనరల్ మేనేజర్ పర్సనల్ మేనేజర్ కి తెలియజేయడం జరిగింది వాటిని భర్తీ చేయడానికి మేనేజ్మెంట్ వారు అన్ని విధమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది కావున ఏరియాలో ఉన్న జరిగిన ఉద్యోగస్తులు గమనించగలరు కోరుతున్నాము
ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఏరియా అధ్యక్షులు మోహన్ సెక్రటరీ హేమ నాయక్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బి రాములు, జాయింట్ సెక్రెటరీ రాజు నాయక్ సిహెచ్ వెంకన్న జి అనిల్ లక్ష్మణ్ మోతిలాల్ పాల్గొన్నారు

విత్తనాల దుకాణాల్లో పోలీసుల తనిఖీ.

విత్తనాల దుకాణాల్లో పోలీసుల తనిఖీ

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా)నేటిధాత్రి:

 

గుండాల పోలీసు స్టేషన్ సిఐ రవీందర్, ఎస్సై సైదా రహూఫ్ ఆధ్వర్యములో వ్యవసాయ అధికారితో కలసి గుండాల లో ఉన్న సీడ్స్,ఫర్టిలైజర్ షాపులపై పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ రవీందర్ మాట్లాడుతూ సీడ్స్, ఫర్టిలైజర్స్ షాప్ యజమానులు నిబంధనలకు లోబడి వ్యాపారాలు చేసుకోవాలని, నకిలీ, కల్తీ విత్తనాలు,ఎరువులు సరఫరా చేసి రైతులను మోసం చేస్తే కఠినమైన చర్యలు తప్పవు అని అన్నారు. నాణ్యమైన విత్తనాలు రైతులకు అందించాలని వ్యవసాయాన్ని బలోపేతం చేయాలని అన్నారు. కల్తీ విత్తనాలు విక్రయించిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రైతులు అనుమతి లేని విత్తన విక్రయాదారులవద్ద విత్తనాలు కొనుగోలు చేయవద్దని సూచించారు. ప్రభుత్వ గుర్తింపు ఉన్న విత్తన డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేయలని, తప్పనిసరిగా కొనుగులుకు సంభందించి రశీదు అడిగి తీసుకోవాలని తెలిపారు. ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే వెంటనే సంబంధిత వ్యవసాయ అధికారులకు, పోలీస్ స్టేషన్ కు తెలపలన్నారు.

నర్సింగ్ హోమ్ ను తనిఖీ చేసిన వైద్యాధికారులు .

నర్సింగ్ హోమ్ ను తనిఖీ చేసిన వైద్యాధికారులు

నిజాంపేట, నేటి ధాత్రి :

 

 

మెదక్ జిల్లా నిజాంపేట
మండల కేంద్రంలోని శ్రీనివాస నర్సింగ్ హోమ్ ను జిల్లా వైద్యాధికారులు మంగళవారం తనిఖీలు చేశారు. ప్రోగ్రామ్ ఆఫీసర్ సుజన మాట్లాడుతూ నిజాంపేట శ్రీనివాస నర్సింగ్ హోమ్ పై వచ్చిన ఫిర్యాదు మేరకు తనికి చేయడం జరిగిందని అన్నారు. అందులో భాగంగానే అన్ని రిపోర్టులను సేకరించి డిఎంహెచ్వో కు పంపించడం జరుగుతుందని తదుపరి విచారణ చేపట్టిన తర్వాత తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డి ఎం హెచ్ ఓ అనిల్, డాక్టర్ హరిప్రియ, డెమో శ్రీనివాస్, సూపర్వైజర్లు వెంకటేశ్వరరావు, కొండయ్య, రామారావు తదితరులు పాల్గొన్నారు.

వరి పంటను పరిశీలించిన అధికారులు.

వరి పంటను పరిశీలించిన అధికారులు

బాలానగర్/ నేటి ధాత్రి

 

 

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని వివిధ గ్రామాలలో గురువారం రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వడగండ్ల వర్షం కురిసింది. దీంతో పలు గ్రామాలలో వరి పంట నేలపై ఓరిగి నేలపై వరి గింజలు రాలాయి. సుమారు మండలంలో 300 ఎకరాలు నష్టపోయినట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు బి.వెంకటేష్ శనివారం గౌతాపూర్ గ్రామంలోని దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించారు. రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏవో సుజాత, మండల వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

వైన్స్ ను తనిఖీ చేసిన ఎక్స్సైజ్ అధికారులు.

— వైన్స్ ను తనిఖీ చేసిన ఎక్స్సైజ్ అధికారులు

నిజాంపేట: నేటి ధాత్రి

 

మండలంలోని రెండు వైన్స్ లను రామాయంపేట ఎక్స్సైజ్ సీఐ నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం తనిఖీ చేశారు. మద్యం షాపులో రికార్డులను పరిశీలించి మాట్లాడారు .. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే మద్యం అమ్మకాలు జరపాలని నిర్వాహకులకు సూచించడం జరిగిందన్నారు. వైన్స్ లో స్టాక్ నిల్వ ఉండేలా చూసుకోవాలని సూచించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం లో ఎక్స్సైజ్ ఎస్ఐ సిద్దార్థ, సిబ్బంది ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version