సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యేల సన్మానం.

‘సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యేల సన్మానం’

మహబూబ్ నగర్ నేటి ధాత్రి:

మహబూబ్ నగర్, జడ్చర్ల సమీపంలోని చిట్టిబోయిన్ పల్లి దగ్గర 41.02 ఎకరాలలో ట్రిపుల్ ఐటీ కళాశాల మంజూరు చేసిన నేపథ్యంలో గురువారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహరి,G మధుసూదన్ రెడ్డి, మెఘారెడ్డి, పర్ణిక రెడ్డిలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. దేశంలోనే వెనుకబడిన జిల్లాగా పేరుపొందిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు ఐఐఐటీ మంజూరు కావడం హర్షనీయమన్నారు. వలస జిల్లా పేరునుండి.. విద్యాభివృద్ధి చెందిన జిల్లాగా పేరు రానున్నదని ఎమ్మెల్యేలు సంతోషం వ్యక్తం చేశారు.

వర్ధన్నపేట నియోజకవర్గనికి ఇంటి గ్రేటెడ్ స్కూల్ మంజూరు.

వర్ధన్నపేట నియోజకవర్గనికి ఇంటి గ్రేటెడ్ స్కూల్ మంజూరు చేసిన సందర్భంగా

సీఎం రేవంత్ రెడ్డి మరియు ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు చిత్రాపటాలకి క్షీరాభిషేకం చేసిన వర్ధన్నపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు

వర్ధన్నపేట( నేటిదాత్రి ):

పట్టణ కేంద్రం లోని అంబేద్కర్ చౌరస్తాలోపట్టణ, మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు చిత్ర పటాలకు క్షీరాభిషేకం చేశారు,
వర్ధన్నపేట నియోజకవర్గానికి 200 కోట్లతో అత్యధిక నిధులతో సదుపాయాలతో కూడిన స్కూలును మన కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేయడం గర్వకారణం అన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ సాధించడంల ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు కృషి ఫలితమే నిదర్శనం అన్నారు. అత్యధిక వసతులతో కూడిన ఈ ప్రాజెక్టు మన నియోజకవర్గానికి రావడం గర్వకారణం అన్నారు. ఈ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మంచి బంగారు భవిష్యత్తు ప్రణాళికను రూపొందించడంతోపాటు విద్యాభివృద్ధికి, తోడ్పాటును అందించడం జరుగుతుందన్నారు. చదువుకుంటేనే భవిష్యత్తులో ప్రతిది మనం సాధించుకోగలుగుతాం అన్నారు.
ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రతి నిరుపేద కుటుంబానికి అందించడంలో ఎమ్మెల్యే కృషి చేస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నరకుడు వెంకటయ్య,
కాంగ్రెస్ పట్టణ మండల అధ్యక్షులు, మైస సురేష్, ఎద్దు సత్యనారాయణ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోశాల వెంకన్న, మహమ్మద్ అప్సర్ కర్ర మాలతి రెడ్డి,
వివిధ గ్రామ పార్టీ అధ్యక్షులు,పార్టీ యూత్, మరియు ,
కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు….

భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ని దర్శించుకున్న.!

భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ని దర్శించుకున్న అంబటి వీరభద్రo గౌడ్

కురవి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంబటి వీరభద్రం గౌడ్

మరిపెడ కురవి నేటిధాత్రి:

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గo లో ని ప్రముఖ పుణ్యక్షేత్రం అయినటువంటి కొరవి భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ని తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు, ఆలయ ఆవరణలో పూజారుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించి భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దర్శనం చేసుకున్నారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని నియోజకవర్గంలో ఏనలేని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని,రైతులు అందరూ పాడి పంటలు సమృద్ధిగా పండి అభివృద్ధి పథంలో నడవాలని ముఖ్యంగా డోర్నకల్ నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రనాయక్ కు మంత్రి పదవి రావాలని కొరవి భద్రకాళి సమేత వీరభద్ర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నామన్నారు “ప్రతి ఒక్కరూ సంప్రదాయాలను పాటిస్తూ ఆలయాలను దర్శించడం ద్వారా ఆధ్యాత్మిక శాంతిని పొందాలి,” అని అన్నారు. ప్రజల సంక్షేమం మరియు మండల అభివృద్ధి కోసం తాను ఎల్లప్పుడూ కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

పోచమ్మ ఆలయంలో నీ పోతలింగేశ్వర స్వామి.

పోచమ్మ ఆలయంలో నీ పోతలింగేశ్వర స్వామి విగ్రహం ధ్వంసం

ఓదెల(పెద్దపల్లి జిల్లా):

ఓదెల మండలం పోత్కపల్లి గ్రామంలో 28వ రైల్వే గేట్ దగ్గర పోచమ్మ తల్లి దేవాలయంలో పోతలింగేశ్వర స్వామి విగ్రహాన్ని బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంతో హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఆ స్థలాన్ని పరిశీలించి ఆ సంఘటన హిందువులకు చాలా బాధాకరమైన సంఘటన కావున హిందూ సంఘాల ఆధ్వర్యంలో రోడ్డుపై రాస్తారోక నిర్వహించిడం జరిగింది. విషయం తెలుసుకున్న పోత్కపల్లి ఎస్సై ధీకొండ రమేష్ సిబ్బందితో పాటు సంఘటన స్థలానికి చేరుకుని ధర్నా చేస్తున్న వారితో మాట్లాడుతూ విగ్రహాన్ని పరిశీలించి త్వరలోనే ఈ సంఘటన కు సంబంధించి పూర్తి వివరాలు సేకరిస్తామని తెలియజేసి ట్రాఫిక్ ను క్లియర్ చేయడం జరిగింది.

వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే.

వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఉత్తం గార్డెన్స్ లో జరిగిన విట్టునాయక్ తాండా కి చెందిన కేశు సింగ్ గారి కుమారుడి .వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూ వరులను ఆశీర్వదించిన శాసనసభ్యులు కోనింటి మాణిక్ రావు,మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి,సీనియర్ నాయకులు నామ రవికిరణ్, మండల పార్టీ జనరల్ సెక్రటరీ గోపాల్, మాజి ఎంపీటీసీ చందు ,చందర్ పవార్,నరేష్, సంజు తదితరులు .

వర్గ పోరాటాలను ఉధృతం చేయాలి.

వర్గ పోరాటాలను
ఉధృతం చేయాలి

శిక్షణ తరగతులు
ముగింపు సమావేశంలో

సిపిఐ (ఎం) కేంద్ర కమిటీ సభ్యు లు వీరయ్య

మరిపెడ నేటిధాత్రి:

కమ్యూనిస్టు కార్యకర్తలు నిరంతరం ప్రజల మధ్య ఉండాలని వారి కోసమే జీవించాలని ,పాలకవర్గాలు ప్రజా వ్యతిరేక విధానాలను వారు చేస్తున్న తప్పిదాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ నిలదీస్తూ వర్గ పోరాటాలను ఉదృతం చేయాలని సిపిఐ (ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య అన్నారు. మహబూబాద్ జిల్లా మరిపెడ పట్టణ కేంద్రంలోని స్థానిక కనకదుర్గ ఫంక్షన్ హాల్ లో జరుగుతున్న గురువారం 5 వ రోజు జిల్లా స్థాయి శిక్షణ తరగతుల ముగింపు సమావేశంలో వీరయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ కమ్యూనిస్టు పోరాటం ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. వారికి మేము ఉన్నామని ప్రజలకు భరోసా కల్పించాలన్నారు.

-ఇచ్చిన హామీలు
అమలు చేయాలి

జిల్లా కార్యదర్శి
సాదుల శ్రీనివాస్

గత ఎన్నికల ముందు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సిపిఐ (ఎం) జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని ఆశ చూపెడుతూ లబ్ధిదారులను గందరగోళానికి గురి చేస్తున్నాయన్నారు. అర్హులైన పేదలకు ఇల్లు రాకుండా చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అర్హులైన వారికి ఇండ్లు ఇవ్వకపోతే ప్రభుత్వ భూములు పేదల గుడిసెలు వేసి సిపిఐ (ఎం) పార్టీ ఇండ్లు నిర్మిస్తుందని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ సమావేశానికి జిల్లా కార్యదర్శి కార్యవర్గ సభ్యులు సూర్నపు సోమయ్య గునుగంటి రాజన్న, ఆకుల రాజు, కుంట ఉపేందర్, కందనూరి శ్రీనివాస్, మండల కార్యదర్శి మధుసూదన్, రాజన్న, , లచ్చయ్య, రాజశేఖర్, ఉప్పలయ్య, తదితరులు ఉన్నారు.

అవినీతి అడ్డాగా మారిన ఝరాసంగం తహసీల్దార్.

అవినీతి అడ్డాగా మారిన ఝరాసంగం తహసీల్దార్ కార్యాలయం

◆ లంచం ఇస్తేనే కబ్జ ఇస్తాం వృద్ధ రైతులకు రెవిన్యూ సిబ్బంది బెదిరింపులు…తహసీల్దార్, ఆర్ఐ నిర్వాకం….!

◆- మా సొంత భూమికే,లక్షలు డిమాండ్ చేస్తున్న తహసీల్దార్, ఆర్ఐ

◆- అన్ని రికార్డులున్న మాకు అన్యాయం చేస్తున్న అధికారులు

◆- బోరున విలపిస్తున్న వృద్ధ మహిళ రైతులు

కోర్టు ఉత్తర్వులు ఉన్నపటికీ,జిల్లా కలెక్టర్ చెప్పినప్పటికి ని పట్టించుకోని అధికారులు

-ఎంతటి అధికారులైన భయపడేది లేదు అంటు బెదిరింపులు

◆- ఏమి తోచక మంచాన పడ్డ వృద్ధ మహిళ రైతులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్/ఝరాసంగం రాష్ట్రంలో ప్రభుత్వం ప్రజాపాలన కొనసాగించి ప్రజలకు సమస్యలు లేని పాలన అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి పరితపిస్తే అవేమి పట్టకుండా రెవిన్యూ సిబ్బంది వారి ఇష్టనుసారంగా వ్యవహారిస్తుందని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ధరణితో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని గ్రహించి భూభారతి వెబ్సైట్ ప్రవేశపెట్టిన రెవిన్యూ సిబ్బంది ఆగాడాలు కొనసాగుతూనే ఉన్నాయని పేద రైతు కుటుంబాలు తమ బాధను వెళ్ళగక్కుతూనే ఉన్నారు. పూర్తి వివరల్లోకి వెలితే జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఝరాసంగం మండలం మాచునూర్ గ్రామనికి చెందిన కోస్గి మాణమ్మ భర్త రాములు కోస్గి సరోజ భర్త రాములు, గ్రామ శివారులో గల సర్వేనెంబర్ 100/12లో రాములుకు 1978 లో 4 ఎకరాలు భూమి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది.అనంతరం మాన్యమ్మ,సరోజ, భర్త చనిపోగా వారి ఇద్దరికీ 100/12 2 ఎకరాలు 100/12/1 2 ఎకరాలు పంపకం చేసి ఇవ్వడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటివరకు మేము ఆ భూమిని సాగుచేస్తూ ఉన్నాము కాని మాకు డిజిటల్ భూమి పాస్ పుస్తకాలు ఇవ్వలేదని దరఖాస్తు చేసుకోవడం జరిగింది. కాని ఆ పాస్ పుస్తకాలు ఇవ్వడానికి మండల తహసీల్దార్, ఆర్ఐ ఇద్దరు లక్షలు లంచం డిమాండ్ చేస్తున్నారు. కాని మాకు డబ్బులు ఇచ్చే స్తోమత లేదని అధికారులకు చెప్పడంతో వారు మా పైన అగ్రహించి డబ్బులు ఇవ్వకుంటే మీకు పొజిషన్ లేదని రికార్డులు చేసి మీకు భూమి లేకుండ చేస్తామని మాకు బెదిరిస్తున్నారని వృద్ధ మహిళ లబ్ధిదారులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. మాకు ఎటువంటి సపోర్ట్ లేకపోవడంతో స్థానిక తహసీల్దార్, ఆర్ఐ మాకు అన్యాయం చేస్తున్నారని తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. 1978సంవత్సరం నుండి అన్ని రికార్డులు ఉన్న మాకు కబ్జా కాస్తు ఉన్న లంచం గురించి తహసీల్దార్ కార్యాలయం చుట్టు తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తహసీల్దార్, ఆర్ఐ లంచం డిమాండ్ చేయడంతో జిల్లా కలెక్టర్ ను ఆశ్రయించి తమ గోడు చెప్పుకుంటామని ఇటీవలే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నామని నిరుపేదలైన మాకు జిల్లా కలెక్టర్ చోరువ చూపి మాకు న్యాయం చేయాలని ఆశిస్తున్నట్లు వారు తెలిపారు.

అవినీతికి అడ్డాగా మారిన ఝరాసంగం మండల తహసీల్దార్ కార్యాలయం

అవినీతికి అడ్డాగా మారిందని సమస్యలతో వచ్చి అ సమస్యల్ని పరిష్కారం చేయాలని స్థానిక తహసిల్దార్ కార్యాలయానికి వస్తే అధికారులు మాత్రం రైతులను నాన ఇబ్బందులకు గురిచేసి ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసి తమ జేబులు తాసిల్దార్ గా ఉన్న తిరుమల రావు అన్ని తానై డబ్బులు ఇస్తే అవినీతి పనైనా చేసి పెడతారని బాధితులు అంటున్నారు. మండలంలో భూ తగాదాలతో వ్యవసాయ భూములను పరిష్కరిస్తానని చెప్పి కలెక్టర్ తో నాకు మంచి సంబంధాలు ఉన్నాయని సమస్యను పరిష్కరించాలంటే అధికారులకు డబ్బులు ఇస్తేనే పని జరుగుతుందని చెప్పి బాధితుల దగ్గర లక్షల్లో వసూలు చేస్తున్నారు పసుపు తాసిల్దార్ కు తోడుగా ఆర్ఐ రామారావు మండల పరిధిలో ఉన్నటువంటి అక్రమ మైనింగ్ పనులను డబ్బులు వసూలు చేసి జిల్లా నుంచి పర్యవేక్షణకు అధికారులు వచ్చినప్పుడు అక్రమంగా మైనింగ్ చేపడుతున్నటువంటి కాంట్రాక్టర్కు సమాచారం ఇచ్చి తాత్కాలికంగా నిలిపివేసి అక్కడ ఏం జరగనట్టుగా చేపిస్తున్నాడు డబ్బులు తీసుకుని ఒక కుటుంబానికి ప్రభుత్వము పంపిణీ చేస్తున్నటువంటి అసైన్మెంట్ ల్యాండ్ ఒక కుటుంబానికి ఐదు ఎకరాల కంటే ఎక్కువ ఉండొద్దని నిబంధనను ఉల్లంగించి వ్యవసాయ పోలానికి సర్వే చేసే క్రమంలో చల్లన్ కట్టకుండాప్పటికిని అనుమతి పోయినప్పటికీని సర్వే చేయించి అమాయకులైనటువంటి వ్యవసాయ రైతులతో పంచానామాలో సంతకాలు చేసుకొని అడ్డగోలుగా భూమికి అద్దులు చూయించి లక్షల్లో అవినీతి డబ్బు తీసుకొని రైతులకు మాత్రం ఝరాసంగం తాసిల్దార్ మాత్రం ముందు ముందు వరుసలో ఉంటారు. కుప్పానగర్ గ్రామంలో 10 ఎకరాల అసైన్మెంట్ ల్యాండ్ కేటాయించడం జరిగింది.

ఇదే కాకుండా ఇంకా చాలా అవినీతి పనులు బాధితులు అంటున్నారు. తాము నిర్వర్తించాల్సిన బాధ్యతలు మరచి ఇలా అవినీతి పనులు చేయడానికి తహసీల్దార్ అండగా ఉండటం గమర్హం. వ్యవసాయ భూమి ఒకరి పేరు ఉండంగా డబ్బులు తీసుకుని వేరే వారి పేరు మీద సర్వసాధారణమని బాధితులు అంటున్నారు లేనిపోని భూతాలల్లో కలుగజేసుకొని సమస్యలను సృష్టించి బాధితులు పరిష్కారం చేయాలని కోరగా అ ఫైల్ ను పై అధికారులకు సమస్యను పరిష్కరించినట్లుగా కనిపించడానికి ఫైల్ డిస్పోజని ఆన్లైన్లో పరుస్తున్నారు పై అధికారులు చూస్తే బాధితుల సమస్యలు పరిష్కారం అయ్యాయని పై అధికారులు అనుకోవడానికి ఇలా చేస్తున్నారు ఆర్డీవో చెప్పిన వినిపించుకొని ఝరాసంగం రెవెన్యూ అధికారులు పై అధికారులను సంబంధం లేనట్టు వ్యవహరిస్తున్న రెవెన్యూ అధికారి ఆర్ఐ ఉప తాసిల్దార్ అవినీతిగా అడ్డంగా మారిన రెవెన్యూ వ్యవస్థ కంప్యూటర్ ఆపరేటర్ రికార్డ్ అసిస్టెంట్ తన ఇష్ట ప్రకారం గా ఎవరికి నచ్చిన వారితో డబ్బులు వసూలు చేసి పట్టాలు మారుస్తున్నారు కళ్యాణ లక్ష్మి రెండో పెళ్లి అయినవారికి పంచనామా చెయ్యక డబ్బులు వసూలు చేసి వర్తించేటట్టు చేస్తున్నారు మరికొందరు డిప్యూటీ తాసిల్దార్ ముందు అక్కడే కూర్చుని కొన్ని ఆధారాలు తమ దగ్గర పెట్టుకుని భయం పెడుతూ కానీ పనులు చేయించుకుంటున్నారు దళారుల అడ్డగా మారిన ఝరాసంగం మండల రెవెన్యూ సంస్థ.
ఫైలు కదలాలంటే ఆమ్యామ్యా తప్పదు

తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతోంది. సమస్యలతో రెవెన్యూ కార్యాలయానికి వచ్చే ప్రతి రైతు వద్ద సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారు లేదంటే ఫైళ్లు పెండింగ్లో ఉంటున్నాయి కుల ధ్రువీకరణ పత్రాలు మొదలుకుని భూ రికార్డుల మార్పిడి,ఆన్లైన్లో నమోదు వర కు ప్రతి పనికీ వెలకట్టి మరీ డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.సిబ్బంది ఎవరైనా డబ్బులు అడితే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయలని సూచనలు చేస్తూ లోపల మాత్రం ఇలాంటి అవినీతి కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు.

సామాజిక ఉద్యమంలా వన మహోత్సవాన్ని నిర్వహిద్దాం.

సామాజిక ఉద్యమంలా వన మహోత్సవాన్ని నిర్వహిద్దాం

-పచ్చని తోరణంలా తెలంగాణ వికసించాలి

-వేముల మహేందర్ గౌడ్ పిలుపు
మొగులపల్లి నేటి దాత్రి:

 

జూన్ మొదటి వారం నుంచి పెద్ద ఎత్తున మొక్కలు నాటి అటవీ విస్తీర్ణాన్ని పెంచేందుకు అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పకడ్బందీ కార్యాచరణ రూపొందించారని, అందులో భాగంగానే గ్రామ గ్రామాన మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై..సామాజిక ఉద్యమంలా వన మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేసి..పచ్చని తోరణంలా తెలంగాణ వికసించేలా కృషి చేద్దామని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ పిలుపునిచ్చారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మొక్కలే మనిషికి జీవనాధారమని, అలాంటి మొక్కలను నాటి..రేపటి తరానికి భవిష్యత్తును అందించే క్రమంలో మంత్రి కొండా సురేఖ ప్రణాళికలు రూపొందిస్తున్నారన్నారు. నేడు కాలుష్యం అధికమై ఓజోన్ పొర రంద్రం పడడంతో తెలంగాణలో విపత్తులు సంభవిస్తున్నాయన్నారు. కాబట్టి ప్రతి పౌరుడు ఒక యజ్ఞంలా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించి..కాలుష్య నివారణకు కృషి చేసేందుకు ముందుకు రావాలన్నారు.

తాటి చెట్లను జేసీబీతో తొలగించిన దుండగులపై.!

తాటి చెట్లను జేసీబీతో తొలగించిన దుండగులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి

-తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోనగాని యాదగిరి గౌడ్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి:

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని కొర్కిశాల గ్రామానికి చెందిన బోయిని అనిల్ కుమార్, బోయిని శ్రీకాంత్ అనే వ్యక్తులు జేసీబీ సహాయంతో తాటివనం చెట్లను తొలగించారని, ఈ దుండగులపై సంబంధిత శాఖ అధికారులు క్రిమినల్ కేసులో నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోనగాని యాదగిరి గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన తన చరవాణితో విలేకరులతో మాట్లాడారు. గురువారం రోజున కొర్కిశాల గ్రామానికి చెందిన పై వ్యక్తులు తమ భూమి ఒడ్డుకు..అసైన్మెంట్ భూమిలో ఉన్న తాటివనం చెట్లను జేసీబీతో తొలగించి గౌడ కులస్తుల ఉపాధిని దెబ్బ తీశారని, గీతా వృత్తినే నమ్ముకుని జీవనాధారం కొనసాగిస్తున్న గౌడ కులస్తుల ఉపాధిపై దెబ్బతీసిన వ్యక్తులపై కఠినంగా వ్యవహరించాలని ఆయన అధికారులను కోరారు.

దరఖాస్తు ఇవ్వండి
-ఇంక్వైర్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం
-ఎక్సైజ్ సూపరీండెంట్ వేముల శ్రీనివాస్

కాగా తాటి వనం చెట్లను నరికిన విషయాన్ని జై గౌడ ఉద్యమం రాష్ట్ర కార్యదర్శి వేముల మహేందర్ గౌడ్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎక్సైజ్ సూపరీండెంట్ వేముల శ్రీనివాస్ తో ఫోన్ ద్వారా విషయం తెలుపగా..దరఖాస్తు ఇవ్వండి..ఎంక్వైరీ చేసి తాటి వనం చెట్లను నరికిన బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

-తహసిల్దార్ జాలీ సునీత రెడ్డి వివరణ

అసైన్డ్ భూమిలో ఉన్న తాటి వనం చెట్లను జేసీబీతో తొలగించిన విషయాన్ని మొగుళ్ళపల్లి తహసిల్దార్ జాలీ సునీత రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా..విచారణ చేపడతామని తెలిపారు.

తెలంగాణ గుండె బలం తన్నీరు హరీష్ అన్న పాట ఆవిష్కరణ.

” తెలంగాణ గుండె బలం తన్నీరు హరీష్ అన్న పాట ఆవిష్కరణ …

జహీరాబాద్ నేటి ధాత్రి:

మాజి మంత్రివర్యులు ,సిద్దిపేట శాసనసభ్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారి పుట్టినరోజు శుభసందర్భంగా పాక్స్ చైర్మన్ స్రవంతి రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రూపొందించినటువంటి తెలంగాణ గుండె తన్నీరు హరీష్ అన్న అనే పాటను సంగారెడ్డి ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు , సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్ జహీరాబాద్ శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు, జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, మాజీ టి ఎన్ జి ఓ ఎస్ అధ్యక్షులు రాజేందర్ రెడ్డి, మాజీ సిడిసి చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, డిసిసిబి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, & జిల్లా నాయకులతో కలిసి ఆవిష్కరించారు.ఈ సంధర్బంగా ఎమ్మెల్యేలు మాణిక్ రావు గారు, చింతా ప్రభాకర్ మాట్లాడుతూ మాజి మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు జన హృదయ నేత నిరంతరం ప్రజల సంక్షేమం కోసమే పని చేసే నాయకుడు అని, సంపూర్ణ ఆరోగ్యం తో ప్రజలకు తన సేవలను అందించాలని కోరుకుంటున్నాం అన్నారు.అనంతరం ఇట్టి కార్యక్రమానికి ముఖ్యలు పాక్స్ చైర్మన్ స్రవంతి అరవింద్ రెడ్డి గారిని మరియు వారి తనయుడు సాయి ప్రణీత్ రెడ్డి గార్లను అభినందించారు.ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు నారాయణ ,ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, కోహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు , సీనియర్ నాయకులు నామ రవికిరణ్, కలిమ్ , మ్యతరి ఆనంద్ , యువ నాయకులు మిథున్ రాజ్,దీపక్,సందీప్ , దినకర్, తదితరులు.

తెలంగాణ చేనేత కార్మిక సంఘం.

తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా జమ్మికుంట వాసి పెండం సర్వేశం ఎన్నిక
హర్షం వ్యక్తం చేసిన జమ్మికుంట చేనేత సంఘాలు

జమ్మికుంట నేటిధాత్రి:

హైదరాబాద్ (ముగ్దం మోహినుద్దీన్ భవన్) లో జరిగిన తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర సమితి సమావేశంలో కరీంనగర్ జిల్లా జమ్మికుంట మునిసిపాలిటీ పరిధిలోని ధర్మారం గ్రామానికి చెందిన పెండెం సర్వేశం ను రాష్ట్ర అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. ఈ సందర్భంగా సర్వేశం గురువారం జమ్మికుంట లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో చేనేత పరిశ్రమ తీవ్రమైన సంక్షోభంలో ఉండి కార్మికులు పనులు లేక ఆర్థిక ఇబ్బందులతో అనేక సమస్యలతో సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేతన్నలను చిన్నచూపుచూస్తున్నా
యని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పెట్టి చేనేత పరిశ్రమను దెబ్బతీసిందని ఇప్పటికైనా జిఎస్టి తొలగించాలని, రద్దు చేసిన చేనేత పథకాలను తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు జరపాలని సహకార సంఘాల రుణాలతో సహా నేతన్నల కు అన్ని రకాల రుణాలను మాఫీ చేయాలని, సహకార సంఘాలకు,టెస్కోకు ఎన్నికలు నిర్వహించలని కోరారు. పెద్దమొత్తంలో నిధులు కేటాయించి చేనేత కార్మికులకు చేతినిండా పనులు కలిగించి పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు లభించేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. చేనేత కార్మికులకు ఇల్లు నిర్మించుకోవడానికి రూ.6 లక్షలు ఇవ్వాలని, కార్మికులకు నెలకు రూ. 5000 పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. చేనేత సమస్యల పరిష్కారానికి రానున్న కాలంలో కార్మికులను చైతన్య పరిచి ఉద్యమాలు
చేస్తామని చెప్పుకొచ్చారు. తను ఎన్నికకు సహకరించిన సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు తాటిపాముల వెంకట్రాములు, ప్రధాన కార్యదర్శి పాశికంటి లక్ష్మీనరసయ్య లతో పాటు ఇతర నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో చేనేత కార్మిక సంఘం నాయకులు జమ్మికుంట మండల చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు మాటేటి సమ్మయ్య, నాయకులు బొమ్మకంటి మహేంద్ర చారి, ఈవీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు

రైతులకు నూతన ట్రాన్స్ ఫార్మర్ల పంపిణీ.

రైతులకు నూతన ట్రాన్స్ ఫార్మర్ల పంపిణీ.

కల్వకుర్తి నేటి ధాత్రి:

 

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చారకొండ, వెల్దండ, కల్వకుర్తి మండలాలకు చెందిన రైతులకు నూతన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలో.. లో వోల్టేజ్ సమస్యతో బాధపడుతున్న రైతులు నూతన విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్లకు దరఖాస్తు చేసుకున్నారని.. లో వోల్టేజీ సమస్యను దృష్టిలో పెట్టుకొని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో మాట్లాడి మంజూరు చేయించానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్నామన్నారు. రైతుల సంక్షేమమే తమ ధ్యేయమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బృంగి ఆనందకుమార్, బాలాజీ సింగ్, సంజీవ్ యాదవ్,జిల్లెల్ల రాములు, దున్న సురేష్, పడకండి వెంకటేష్, చంద్రకాంత్, శివ తదితరులు పాల్గొన్నారు.

మైసమ్మ తల్లి జాతర ఉత్సవాలు.

మైసమ్మ తల్లి జాతర ఉత్సవాలకు రూ.50 వేలు తన వంతు కర్తవ్యంగా ఇచ్చిన పారిశ్రామిక వేత్త కె.ప్రసాద్ రెడ్డి

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని కోహీర్ మండలంలో దిగ్వాల్ గ్రామంలో పారిశ్రామిక వేత్త జహీరాబాద్ అసెంబ్లీ కాంగ్రెస్ నాయకులు కె.ప్రసాద్ రెడ్డి ఈరోజు మైసమ్మ తల్లి ఆలయ కమిటీ పిలుపు మేరకు ఆలయం వద్దకు వచ్చి ప్రత్యేక పూజలు చేశారు.ఈ నేల 31,జూన్ 1,2,తేదీలో జరిగే మైసమ్మ తల్లి జాతర మహోత్సవం సందర్బంగా రూ. 50 వేల రూపాయలు కమిటీ సభ్యులకు అందజేశారు. అలాగే కోహీర్ మండలంలో కాంగ్రెస్ పార్టీ లో వున్న బిసి, ఎస్సి, ఎస్టీ, మైనారిటీ నాయకులు ఏకమయ్యి ఏలాలని అన్నారు.కావున రాబోయే ఎన్నికల్లో యువ కాంగ్రెస్ అభ్యర్థులను గెలుపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అగ్ర కులాల పార్టీ కాదని అనగారని కులాల పార్టీ అని గట్టిగా నమ్ముతున్నాను అని చెప్పారు. ఈ సందర్బంగా ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు పూలమాల శాలువాతో ఘనంగా సత్కరించి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

కొనసాగుతున్న బడిబాట కార్యక్రమం.

కొనసాగుతున్న బడిబాట కార్యక్రమం.

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లాలో యుటీఎస్ ఆధ్వర్యంలో బడిబాట చేపట్టారు. మునిపల్లి, కోహీర్, జహీరాబాద్, మొగుడంపల్లి తదితర మండలాలలోని వివిధ గ్రామాల్లో బడిబాట జీపీ యాత్ర కొనసాగించారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులను చేర్పించాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం.

నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం నిర్వహించడం జరిగింది

జహీరాబాద్ నేటి ధాత్రి:

శ్రీ సిద్దేశ్వర స్వామి దేవస్థానం అల్గోల్ రోడ్ జహీరాబాద్ సంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రం నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం నిర్వహించడం జరిగింది . దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రంగారావు ఈవో శివ రుద్రప్ప ఆధ్వర్యంలో సభ్యులు వి ప్రభాకర్ గౌడ్ కే సురేందర్ రెడ్డి రమేష్ బాబు బరోరు లక్ష్మి బి. శ్రీనివాస్ అఫీషియల్ మెంబర్ ఎం సంగమేశ్వర స్వామి స్వీకారం చేయడం జరిగింది.

వలిమా డిన్నర్ వేడుక లో పాల్గొన్న టీజీఐడిసి మాజీ చైర్మన్.

వలిమా డిన్నర్ వేడుక లో పాల్గొన్న టీజీఐడిసి మాజీ చైర్మన్ తన్వీర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ పట్టణంలోని ఏషియన్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో పట్టణానికి చెందిన రిపోర్టర్ మిస్బా గారి అన్న వలిమా డిన్నర్ వేడుకలో పాల్గొన్న టీజీఐడిసి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్ గారిని శాలువా పూలమాలతో స్వాగతించరు మొహమ్మద్ తన్వీర్ పెళ్లి కుమారును శుభాకాంక్షలు తెలియజేశారు టీజీఐడిసి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్ తో పాటు అతని బృందం కాంగ్రెస్ సీనియర్ నాయకులు మొహమ్మద్ తాజుద్దీన్ షబ్బీర్ భాయ్ బిజీ సందీప్ మొహమ్మద్ అయూబ్ తదితరులు ఉన్నారు.

జహీరాబాద్ ముస్లింలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

చిలుక ప్రవీణ్ పై యూట్యూబర్ చల్లా చేసిన దైవదూషణ వ్యాఖ్యలపై జహీరాబాద్ ముస్లింలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్, ఇస్లాం చివరి ప్రవక్త హజ్రత్ ముహమ్మద్ (స) గౌరవార్థం దైవదూషణ మరియు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ చిలుక ప్రవీణ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, సయ్యద్ షా ఫర్హాన్ ఖాద్రీ బాగ్దాది నేతృత్వంలోని జహీరాబాద్ ముస్లింల ప్రతినిధి బృందం సబ్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కాశీనాథ్ ను కలిసి ఈ విషయంలో అధికారిక ఫిర్యాదు చేసింది. చిలుక ప్రవీణ్ “యు న్యూస్” అనే యూట్యూబ్ ఛానల్ నడుపుతోందని చెప్పబడింది. దీనిలో అతను ఉద్దేశపూర్వకంగా ఇస్లాం, ముస్లింలు మరియు ఇస్లాం ప్రవక్త హజ్రత్ ముహమ్మద్ (స) గురించి రెచ్చగొట్టే మరియు అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తున్నాడు. యూట్యూబ్ లో తప్పుడు ఖ్యాతిని పొందడానికి మరియు తన ఛానల్ యొక్క అభిప్రాయాలను పెంచడానికి మాత్రమే అతను ఇదంతా చేస్తున్నాడు. పర్వీన్ యొక్క ఈ చర్యలు ముస్లింల మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా దేశ సామరస్యాన్ని కూడా బెదిరించాయని జహీరాబాద్ ముస్లింల ప్రతినిధి బృందం చెబుతోంది చిలుక ప్రవీణ్ మాటలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, భవిష్యత్తులో ఆమె ద్వేషపూరిత ప్రసంగాలు చేయకుండా ఉండటానికి ఆమెను వెంటనే అరెస్టు చేయాలని ప్రతినిధి బృందం డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా, సయ్యద్ షా ఫర్హాన్ ఖాద్రీ బాగ్దాదీ చిలుక ప్రవీణ్ ప్రకటనలను తీవ్రంగా ఖండించారు మరియు అలాంటి ద్వేషపూరిత ప్రసంగం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదని మరియు భవిష్యత్తులో ఎవరూ అలాంటి ద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి ధైర్యం చేయకుండా దానిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని మరియు ఏ మతానికి వ్యతిరేకంగానైనా ఇటువంటి చర్యలు చేసే వారిపై భారత ప్రభుత్వం కఠినమైన చట్టాన్ని రూపొందించాలని డిమాండ్ చేశారు, తద్వారా ఎవరూ అలా చేయడానికి ధైర్యం చేయరు. ప్రతినిధి బృందంలో సయ్యద్ షా రిజ్వాన్ ఖాద్రీ, సజ్జాదా నషీన్ ముహమ్మద్ మహమూద్ సూఫీ, హఫీజ్ ముహమ్మద్ ఇర్ఫాన్, ముహమ్మద్ అజీముద్దీన్ ఖాద్రీ ముహమ్మద్ ముస్తెయిన్ నవాజ్ ముహమ్మద్ ఇంతియాజ్ సాకి, హఫీజ్ ముహమ్మద్ హమీద్ ముహమ్మద్ ఇబ్రహీం ఖలీల్ ముహమ్మద్ రఫీ, స్టేషనరీ ముహమ్మద్ ఫయాజ్ అహ్మద్, క్రైమ్ రిపోర్టర్ మరియు ఇతరులు ఉన్నారు.

నివేశన స్థలాల సర్వేకోసం ‘స్వామిత్వ’ పథకం

`డ్రోన్‌ సర్వేతో ఇళ్లకు సరిహద్దుల నిర్ణయం

`అమలు చేస్తున్న కేంద్ర పంచాయతీరాజ్‌ మంత్రిత్వశాఖ, సర్వేఆఫ్‌ ఇండియా 

`డ్రోన్ల సహాయంతో సర్వే ఫలితాలు కచ్చితం

`కచ్చితమైన మార్కింగ్‌తో యాజమాన్య హక్కు పత్రాలు

`ఎన్నో సమస్యలకు పరిష్కారం

 

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

దేశవ్యాప్తంగా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివాస స్థలాల సరిహద్దు సమస్యలకు అద్భుతమైనపరిష్కారం చూపుతున్న పథకం ‘స్వామిత్వ’ (సర్వే ఆఫ్‌ విలేజ్‌ ఆబాదీ మ్యాపింగ్‌ విత్‌ ఇంప్రూవైజ్డ్‌ టెక్నాలజీ ఇన్‌ విలేజెస్‌). దీన్ని ప్రధాని నరేంద్రమోదీ 2020, ఏప్రిల్‌ 24న ప్రారంభించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజల్లో అధికశాతం మందికి సరైన పత్రాలు లేకపోవడంతో, ఆక్రమణలకు పాల్పడ్డారంటూ వారి ఇళ్లను కూల్చివేసేందుకు కోర్టులు ఆదేశాలిస్తున్నాయి. తాతలు, తండ్రుల కాలంనుంచి నివాసముంటున్న తమకు ఇటువంటి దు స్థితేంటని ఆయా నివాసగృహాలకు యజమానులు లబోదిబోమనడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారానికి వీరి నివేశనస్థలాల సర్వే చేసి అధికారిక పత్రాలను జారీచేయడం ఒక్కడే పరిష్కారమన్న నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలో ప్రవేశపెట్టిన పథకమే ‘స్వామిత్వ’. ఈ పథకాన్ని కేంద్ర పంచాయతీరాజ్‌ మంత్రిత్వశాఖ, సర్వేఆఫ్‌ ఇండియా (ఎస్‌ఓఐ)లు దేశవ్యాప్తంగా ఉమ్మడిగా అమలు చేస్తున్నాయి.

గ్రామీణ ప్రాంతాల్లోని గృహయజమానులకు సరైన పత్రాలు లేకపోవడంతో, ఇళ్ల సరిహద్దులు నిర్ధారించడం ఒక ప్రధాన సమస్య కాగా, వీరినుంచి శాస్త్రీయంగా పన్నువసూలు, గ్రామాల అభి వృద్ధి కార్యక్రమాల అమలుకు ప్రధాన అడ్డంకిగా మారింది. ఉదాహరణకు ఉత్తరాఖండ్‌లోని భీ మ్‌వాలా గ్రామానికి చెందిన వినోద్‌ అనే 21 సంవత్సరాల యువకుడికి రెండేళ్ల క్రితం వరకు తన నివేశన స్థలానికి సంబంధించి ప్రభుత్వంతో వివాదం నడిచింది. అతను నివసిస్తున్న ఇంటికి యాజమాన్య హక్కులను నిర్ధారించే పత్రాలేవీ లేకపోవడంతో ప్రభుత్వం దీన్ని అక్రమంగా ఆక్రమించి చేసిన నిర్మాణంగా పరిగణించి కూల్చివేయడానికి సిద్ధం కావడంతో వివాదం కోర్టుకు చే రింది. ఒకప క్క కోర్టు కేసు నడుస్తుండగానే 2023లో స్వామిత్వ పథకం కింద గ్రామాన్ని డ్రోన్‌ల ద్వారా సర్వే నిర్వహించారు. ఈ విధంగా నిక్కచ్చి సర్వే నిర్వహించి గ్రామస్థులకు యాజమా న్య హక్కుల పత్రాలను అందజేశారు. వినోద్‌ తండ్రి కూడా సరిగ్గా ఇదే సమస్యను ఎదుర్కొన్నారు. ఇప్పుడు డ్రోన్‌ సర్వే నిర్వహించిన తర్వాత అతని ఇంటిని కచ్చితమైన మార్కింగ్‌తో యాజమా న్య హక్కు పత్రాన్ని ప్రభుత్వం జారీచేసింది. దీన్ని ఉత్తరాఖండ్‌ హైకోర్టులో సమర్పించగానే, ఇంటిని కూల్చవద్దని ప్రభుత్వాధికార్లను ఆదేశించింది. స్వామిత్వ పథకం వల్ల కలిగే ప్రయోజనానికి ఇదొక ఉదాహరణ మాత్రమే!

నిజం చెప్పాలంటే ఇటువంటి భూవివాద కేసులో దేశవ్యాప్తంగా కోర్టుల్లో కుప్పలు తెప్పలుగా పేరుకుపోయి వుంటున్నాయి. ప్రపంచబ్యాంకు అధ్యయనం ప్రకారం భారత కోర్టుల్లో కేసులు పెద్ద ఎత్తున పెండిరగ్‌లో వుండటానికి భూవివాదాలే కారణమని స్పష్టం చేసింది. దేశంలో 66% సివిల్‌ కేసులు ఆస్తుల తగాదాలకు సంబంధించినవేనని సంస్థ పేర్కొంది. ఇటువంటి కేసులు పరిష్కారం కావడానికి కనీసం 20 ఏళ్లయినా పడుతోంది! అదీకాకుండా గతంలో సుప్రీకోర్టు ఇచ్చిన 25% తీర్పులు కేవలం భూవివాదాలకు సంబంధించినవే కావడం గమనార్హం. కోర్టులో ప్రస్తు తం పెండిరగ్‌లో వున్న ప్రతి మూడు కేసుల్లో రెండు ఆస్తి వివాదాలకు సంబంధించినవే కావడం గమనార్హం. 

స్వామిత్వ పథకం కింద డ్రోన్‌ సర్వేల ఆధారంగా ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, గుజరాత్‌, కర్ణాటక,పంజాబ్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన 5వేల గ్రామాల్లో ఇళ్లస్థలాల యాజమాన్య హక్కులకు సంబంధించిన సమస్యలకు పరిష్కారం లభించింది. నిజానికి 2020లో సర్వే ఆఫ్‌ ఇండియా మొట్టమొదటిసారి భూమి మ్యాపింగ్‌ కోసం డ్రోన్‌ల కొనుగోలు ప్రారంభించింది. ప్రస్తుతం సర్వే నిర్వహించడానికి మైక్రో డ్రోన్లు (250 గ్రాముల నుంచి 2 కిలోల వరకు బరువు) మరియు చిన్న డ్రోన్లు (2 కిలోల నుంచి 25 కిలోల బరువు) వాడుతున్నారు. 

సర్వే ఏవిధంగా మొదలైంది?

నిజం చెప్పాలంటే మనదేశంలో భూ సర్వే నిర్వహించడం అత్యంత క్లిష్టమైన కార్యం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇది మరీ కష్టం. ఎందుకంటే ఎవరివద్దా ఎటువంటి పత్రాలు లేకపోవడం, సరైన రికార్డులు లేకపోవడం ఇందుకు ప్రధాన కారణం. బ్రిటిష్‌ వలస పాలనలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రజలు తమకు అవసరమైన స్థలాన్ని ఎంపిక చేసుకొని అక్కడ ఇళ్లను ని ర్మించుకోవడం ఆనవాయితీగా వుండేది. వీటికి ఎటువంటి యాజమాన్య ధ్రువీకరణ పత్రాలు లేదా మరే ఇతర ఆధారాలు వుండేవి కావు. ఇటువంటి ఆవాస ప్రాంతాలను ‘ఆబాదీ’గా వ్యవహ రించేవారు. అ పేరునే ఇప్పటికీ వాడుతున్నారు. బ్రిటిష్‌ వారి కాలం లేదా స్వాతంత్య్రానంతర కాలంలో ఇటువంటి ఆవాసాల విషయంలో ఏవిధమైన సర్వే నిర్వహించలేదు. ఫలితంగా తరతరాలుగా ఏవిధమైన పత్రాలు లేకుండానే ఆయా గ్రామాల్లో ప్రజలు నివసిస్తూ వస్తున్నారు. కానీ రాను రాను పరిస్థితులు మారాయి. ఆయా గ్రామ పంచాయతీలకు ఇళ్ల పన్నులు వసూలు చేయ డం, సరిహద్దు నిర్ధారణ, ప్రభుత్వ స్థలాల ఆక్రమణకు సంబంధించిన వివాదాల పరిష్కారం పెద్ద సమస్యగా మారింది. వివాదాలు వచ్చినప్పుడు తరతరాలుగా నివసిస్తున్నప్పటికీ తమవద్ద ఎటు వంటి పత్రాలు లేకపోవడంతో ఆయా గృహ యజమానులు తీవ్ర సమస్యలు ఎదుర్కొనడం మొదలైంది. కొన్ని రాష్ట్రాల్లో భర్త చనిపోయిన మహిళకు తన భర్త వాటాను ఇవ్వకుండానే, వెళ్లగొట్టిన సంఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి. 

మొట్టమొదటగా వున్న మహారాష్ట్రలోని కొన్ని గ్రామాల్లో నెలకొన్న ఈ సమస్యను పరిష్కరించడానికి 2019లో సర్వే ఆఫ్‌ ఇండియా ముందుకొచ్చింది. డ్రోన్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించిఈ గ్రామాల్లో ఇళ్లకు కచ్చితమైన సరిహద్దులను నిర్ణయించడంతో ఇంటిపన్ను వసూళ్లు, సరిహ ద్దు వివాదాలు పరిష్కారమయ్యాయి. ప్రధాని నరేంద్రమోదీ ఇటువంటి సమస్యలను పరిష్కరించే క్రమంలో మంత్రి మండలి సమావేశం ఏర్పాటు చేసినప్పుడు అప్పటి పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి మహారాష్ట్ర గ్రామాల్లో డ్రోన్‌ టెక్నాలజీ సహాయంతో సమస్యను పరిష్కరించిన విధాన్ని వివరించడంతో, నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ‘స్వామిత్వ’ పేరుతో పథకాన్ని అమల్లోకి తెచ్చారు. విశేషమేంటంటే 2020 సంవత్సరంలో ఏప్రిల్‌ 24వ తేదీన కోవిడ్‌ తీవ్రంగా వున్నప్పుడే దీన్ని ప్రారంభించడం విశేషం. అంతేకాదు అదే ఏడాది అక్టోబర్‌ నాటికి లక్ష ప్రాపర్టీ కార్డులు కూడా తయారయ్యాయి. 2025 ఏప్రిల్‌ నాటికి స్వామిత్వ పథకం ప్రారంభమై ఐదేళ్లు పూర్తయింది. మే మొదటివారం నాటికి దేశంలో ఈ పథకం కింద నోటిఫై అయిన 3.45లక్షల గ్రామాల్లో, 3.22 లక్షల గ్రామాల్లో సర్వే పూర్తయింది. సర్వే మొదలైన దగ్గరినుంచి ఇప్పటివరకు 10.46 కోట్ల ఇళ్ల స్థలాలను డిజిటల్‌ రూపంలో నమోదు చేసారు. 1.67 గ్రామాలకు సంబంధించి 2.54కోట్ల ప్రాపర్టీ కార్డులు కూడా తయారయ్యాయి.  

మాన్యువల్‌ సర్వేలో పొరపాట్లు

భూమి సర్వేలో ఎంతో నైపుణ్యమున్న సర్వేయర్లను నియమించినా, పొరపాట్లు జరిగే అవకాశం ఎక్కువ. కొన్ని సందర్భాల్లో గ్రామీణ ప్రజలు సర్వేయర్లను అనుమతించని సందర్భాలు కూడా చాలానే వున్నాయి. అదీకాకుండా సర్వేలు నిర్వహించడానికి సుదీర్ఘ సమయం పట్టడం కూడా సం ప్రదాయ సర్వే విధానాలు పెద్దగా విశ్వసనీయతను పొందకపోవడానికి మరో కారణం. పోనీ ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా సర్వే నిర్వహించాలనుకున్న, అవి కిలోమీటర్ల మేర విస్తీర్ణంతో వుండటంతో సర్వే కచ్చితంగా సాధ్యంకాదు. ఈ ఫలితాలు గ్రామీణ భూకమతాలను నమోదు చేయడానికి సహకరించవు. ముఖ్యంగా ఇళ్ల స్థలాల సర్వేకు అసలు పనిచేయవు. వీటి సర్వేకు కొద్ది సెంటీమీటర్ల మీటర్ల తేడాతో కూడిన కచ్చితత్వం కావాలి. ఇవి ఉపగ్రహ చిత్రాల ద్వారా సాధ్యం కాదు. ఈ సమస్యను పరిష్కరించడానికే డ్రోన్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేయడం మొదలు పెట్టారు. 

డ్రోన్లతో ప్రయోజనం

ఉదాహరణకు కొన్ని రకాల డ్రోన్లు 35 నుంచి 45 నిముషాల కాలంలో ఒక చదరపు కిలోమీటరు విస్తీర్ణంలో సర్వే నిర్వహించగలవు. ఇదే సమయంలో 4.35 కిలోల బరువును కూడా మోయ గలవు. మరికొన్ని డ్రోన్లు 40 నిముషాల వ్యవధిలో 4 కిలోమీటర్లు, మరికొన్ని 60 నిముషాల వ్యవధిలో 5 కిలోమీటర్ల దూరం వరకు ఎగరగలుగుతాయి. సగటున 40 నిముషాల కాలంలో 1 చదరపు కిలోమీటరు సర్వే పూర్తి చేస్తాయి. మరి ఇదే ఒక చదరపు కిలోమీటరు విస్తీర్ణాన్ని 3`4 సభ్యులతో కూడిన బృందం సర్వే పూర్తి చేయడానికి 20 రోజులు పడుతుంది. అంతేకాదు పోస్ట్‌ ప్రాసెస్డ్‌ కైనమాటిక్స్‌ (పీపీకే) సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో సర్వేలో ఎటువంటి తేడా రాకుండా మరింత కచ్చితంగా వుండేలా చూస్తున్నారు. ఇదే సమయంలో 567 కంటిన్యూవస్‌ ఆపరేటింగ్‌ రిఫరెన్స్‌ స్టేటస్‌ (సీఓఆర్‌ఎస్‌) స్టేషన్లను కూడా ఈ సర్వేలో భాగంగా నెలకొల్పారు. ఈ సీఓఆర్‌ఎస్‌ నెట్‌వర్క్‌ భూమిపై కచ్చితమైన ప్రదేశాల్లో మార్కింగ్‌ చేయడానికి ఉపయోగపడతా యి. 

సర్వే కొనసాగే విధానం

ముందుగా రాష్ట్ర ప్రభుత్వాలు సర్వే ఆఫ్‌ ఇండియాతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకోవాలి. రాష్ట్ర చట్టాల పరిధిలో సర్వే చేయాల్సిన గ్రామాల జాబితాను సర్వే ఆఫ్‌ ఇండియా కు అందజేయాలి. 

శిక్షణ పొందిన రెవెన్యూ అధికారులు మరియు గ్రామ పంచాయతీకి సర్వేకు సంబంధించిన సమాచారం అందిస్తారు. 

సర్వే ఆఫ్‌ ఇండియా టీమ్‌లు, అవసరమైన సీఓఆర్‌ఎస్‌ మరియు గ్రౌండ్‌ కంట్రోలింగ్‌ పాయింట్లను ఎంపిక చేస్తాయి.

సర్వే చేయాల్సిన ప్రాంతాన్ని గ్రామసభలో నిర్ణయిస్తారు.

సర్వేకు ముందు గ్రామంలోని ఇళ్ల సరిహద్దులను తెల్లని గీతలతో మార్క్‌ చేస్తారు. 

తర్వాత డ్రోన్‌లు సర్వే చేయాల్సిన ప్రదేశంపై ఎగిరి ఫోటోలు తీస్తాయి. 

ఈ చిత్రాలను 5 సెంటీమీటర్ల కచ్చితత్వంతో ప్రాసెస్‌ చేస్తారు.

ఈ మ్యాప్‌లను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తారు. వీటి ఆధారంగా ప్రభుత్వం నిజమైన యజమానులను గుర్తించి, మరోసారి క్షేత్రస్థాయిలో నిర్ధారించుకుంటుంది.

ఆవిధంగా అప్‌డేట్‌ అయిన తర్వాత ఈ మ్యాప్‌లను సర్వే ఆఫ్‌ ఇండియాకు పంపుతారు.

తప్పులు సరిదిద్దిన తర్వాత యజమానులకు సంబంధించిన ప్రాపర్టీ కార్డులను తయారు చేస్తారు.

గ్రామాల్లో చేపట్టే ప్లానింగ్‌ తదితర అభివృద్ధి కార్యక్రమాలకు ఈ మ్యాప్‌లనే ఆధారంగా తీసుకుంటారు. 

ఇప్పుడు దేశవ్యాప్తంగా నివేశన స్థలాల సర్వేలకు డిమాండ్‌ పెరగడంతో సర్వే ఆఫ్‌ ఇండియా డ్రోన్‌ల సేకరణకు టెండర్లను పిలిచింది. గతంలో టెండర్లు పిలిచినప్పుడు కేవలం మూడు డ్రోన్‌ కంపెనీలు మాత్రమే ముందుకు రాగా, తాజాగా పిలిచిన టెంటర్లలో 20 కంపెనీలు పాల్గనడం దేశంలో డ్రోన్‌ సర్వేకు పెరుగుతున్న ప్రాముఖ్యతకు నిదర్శనం. ‘స్వామిత్వ’ పథకాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వాలు, భూ సర్వేలో డ్రోన్‌లను ఉపయోగించడానికి ముందుకు రావ డం విశేషం. ఇదే సమయంటో పట్టణ ప్రాంతాల్లో భూ రికార్డులను అప్‌డేట్‌ చేయడానికి ‘నేషనల్‌ జియోస్పే షియల్‌ నాలెడ్జ్‌`బేస్డ్‌ ల్యాండ్‌ సర్వే ఆఫ్‌ అర్బన్‌ హాబిటేషన్స్‌ (నక్షా)ను అమలు చేస్తున్నారు. ఉదాహరణకు బెంగళూరు నగరానికి సంబంధించి ‘డిజిటల్‌ ట్విన్‌’ను అభివృద్ధి పరు స్తున్నారు. నగరాభివృద్ధి ప్రణాళికను మరింత పకడ్బందీగా అమలు చేయడానికి ఇది ఉపయోగపడుతుంది.

సామాజిక యుద్ధం ‘‘కవిత’’

`సామాజిక తెలంగాణ ‘‘కవిత’’ తోనే సాధ్యం.

`’’కవిత’’ రాజకీయ పార్టీ పెడితే ‘‘బహుజన ప్రభంజనం’’.

`తెలంగాణ సామాజిక భవిత ‘‘కవిత’’.

`’’కవితే’’ సామాజిక ‘‘సైన్యం’’.

`’’కవిత’’ బహుజన ‘‘సామాజిక స్వరం’’.

`తెలంగాణలో సామాజిక న్యాయం కోసం సవరించిన గళం.

`’’కవిత’’ ఒక సామాజిక బాధ్యత.

`’’కవిత’’ సామాజిక తెలంగాణ విజ్ఞత..

`సామాజిక బాధ్యతను నిర్వర్తించిన వారిలో అగ్రకులాల సామాజిక వేత్తలే ఎక్కువ.

`సతీ సహ గమనం రద్దుకు కారణం రాజా రామ్మోహన్‌ రాయ్‌.

`వితంతు వివాహాలు జరిపించినది వీరేశలింగం పంతులు.

`కన్యాశుల్కం రాసింది గురజాడ.

`సహపంక్తి భోజనాలు పెట్టిన పలనాటి బ్రహ్మనాయుడు.

`అదే బాటలో ఇప్పుడు ‘‘కవిత’’.

`బహుజన రాజకీయం కోసం కదిలిన తెలంగాణ ‘‘కాళిక’’ కవిత.

`భవిష్యత్తులో బడుగుల రాజ్యం కోసం ‘‘కవిత’’ తపన.

`బడుగులను ఏకం చేసే యజ్ఞంలో తొలి అడుగు ‘‘కవిత’’.

`ఇంత కాలం బడుగులను, బడుగులే నమ్మలేదు.

`బడుగులను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం ఎవరూ చేయలేదు.

`సామాజిక తెలంగాణ ఆవిష్కరణ కోసం ‘‘కవిత’’ కదలివస్తోంది.

`బడుగులంతా ఏకమైతే నవ రాజకీయం నిర్మాణమౌతుంది.

`’’కవిత’’ కు పల్లె తెలుసు..పల్లె జీవితం తెలుసు.

`’’కవిత’’ అంటే పువ్వుకు తెలుసు.

`తెలంగాణలో వున్న ప్రకృతి ప్రతి కొమ్మకు తెలుసు.

`’’కవిత’’ పిలుపు తెలంగాణ ఉద్యమానికి తెలుసు.

`తెలంగాణ ఉద్యమ రాజకీయానికి బతుకమ్మగా తెలుసు.

`’’కవిత’’ అంటే డిల్లీ రాజకీయానికి ధీర వనితగా తెలుసు.

`మహిళా రిజర్వేషన్‌ కోసం ‘‘కవిత’’ చేసిన పోరాటం తెలుసు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:                             

కవిత తెలంగాణ సామాజిక యుద్దం. నిరంతర ప్రజాసంగ్రామం. కవిత ఒక సామాజిక న్యాయం. కవిత ఒక సామాజిక ధ్యేయం. కవిత ఒకసామాజిక లక్ష్యం. కవిత తెలంగాణ సామాజిక పోరాట గుమ్మం. సామాజిక తెలంగాణ ఆలోచనలు చేసిన వారు చాలా మంది వున్నారు. అటు వైపు అడుగులు వేసిన వారు లేరు. కాని చెప్పినట్లే ప్రయాణం మొదలు పెట్టిన కవిత. మూగబోయిన బడుగుల గొంతౌతున్న కవిత. బడుగుల కోసం గొంత్తిత్తి నినదిస్తున్నది కవిత. బిసిలలో సామాజిక చైతన్యం రగిలించే యజ్ఞం కవిత. ఈ తరంలో సామాజిక తెలంగాణ ఆలోచన మొదలైన కవిత తోనే సామాజిక నిర్మాణం జరుగుతుందన్న నమ్మకం ఏర్పడుతోంది. సామాజిక తెలంగాణ కవితతోనే సాధ్యమౌతుందన్న భరోసా ఏర్పడుతోంది. కవిత ఒకవేళ రాజకీయ పార్టీ పెడితే బహుజన ప్రభంజనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. రాజకీయంగా ఎవరు ఎలాంటి వ్యాఖ్యలైనా చేయొచ్చు. కాని ఎమ్మెల్సీ కవిత పట్టుదల ఎలాంటిదో అందరికీ తెలుసు. కవిత మొండి ధైర్యం గురించి కూడా తెలుసు. అందుకే కవిత విషయంలో రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా కుదుపుకు గురైంది. రాజకీయపార్టీ అంటే కుటుంబ సమస్య కాదు. ప్రజా సమస్య. ప్రజల కోసం ఆలోచించే సమస్య. ప్రజల వైపు నుంచి దృక్కొణం వుండాల్సిన సమస్య. అందువల్ల ఎలాగైనా కవితను రాజకీయ యవనిక మీద ప్రత్యేక గుర్తింపు రావడం కొన్ని రాజకీయ పక్షాలకు ఇష్టం వుండదు. అంతే కాదు స్వపక్షంలో కూడా అలాంటి అభిప్రాయం ఎవరికైనా వుండొచ్చు. అందుకే కవిత సూటిగా, స్పష్టంగానే కేసిఆర్‌ చుట్టూ దెయ్యాలున్నారని కుండబద్దలు కొట్టిచెప్పారు. కాసేపు ఆ రాజకీయం పక్కన పెడితే, కవిత ఆది నుంచి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు కోసం ఆరాటం వుండేది. అందుకే ఆమె తనదైన శైలిలో ఉద్యమ స్వరూపానికి నాంది పలికింది. ముందు తెలంగాణలో జాగృతి అనే సంస్ధ ద్వారా తెలంగాణ సమజాన్ని చైతన్య పర్చేందుకు అడుగులు వేసింది. ఇప్పుడున్న తెలంగాణ రాజకీయ సమాజంలో ఇలాంటి ప్రయోగాలు చేసిన వారు మరొకరు లేరు. నేరుగా కవిత ఉద్యమంలోకి వెళ్లొచ్చు. ఉద్యమ కారిణిగానే గుర్తింపు పొందొచ్చు. కాని ఆమె తెలంగాణ నవ సమాజం గురించి ఆలోచనలు చేసింది. ఉద్యమం ఓ వైపు కేసిఆర్‌ చేస్తున్నప్పుడు, తాను తెలంగాణయువతకు ఎలా సాయ పడాలన్న ఆలోచన చేయడం అంటే కన్న తల్లి పిల్లల గురించి ఆలోచన చేయడం లాంటిదే అని చెప్పకతప్పదు. అలా అప్పటి యువతకు అవసరమైన ఎడ్యుకేషన్‌ స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కోసం కృషి చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. యువతలో ఉద్యమ చైతన్యం రగిలించడంలో కవిత ప్రదాన పాత్ర పోషించింది. అందుకే జాగృతి అనే సంస్ధకు అంతటి పేరు వచ్చింది. ఒక దశలో బిఆర్‌ఎస్‌కు సమాంతరంగా జాగృతి నిర్మాణం జరిగింది. అలా చిన్న వయసులోనే కవిత తెలంగాణ సమాజ గతి కోసం, ప్రగతి కోసం ఆలోచనే కాదు, ఆచరణ కూడా చూపించింది. అందుకే అందరి మన్ననలు పొందింది. అంతే కాకుండా కవిత తెలంగాణ ఉద్యమ కాలమంతా బీద, బిక్కి, బడుగుల జీవితాలు చాల దగ్గరుండి చూశారు. పల్లె జీవితాన్ని కళ్ల నిండా చూశారు. పల్లె బాధలు చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. బతుకమ్మ పేరుతో ఊరూరు తిరిగినప్పుడు పల్లె వేధనలు తెలుసుకున్నారు. చిద్రమైన ఆనాటి పల్లె బతుకులు చూసి చలించిపోయారు. ఉద్యమ సమయంలోనే ఆమె సామాజిక సృహను కూడా తన దాతృత్వంతో చూపించారు. అప్పుడే తెలంగాణలో సామాజిక న్యాయం రాజకీయ పరంగా అందితే తప్ప అంతరాలు, అవరోధాలున్న సమాజంలో మార్పులు తీసుకురావొచ్చని ఆలోచన చేశారు. అప్పటి నుంచి సమయం కోసం ఎదురుచూస్తున్నారు. అందుకే తెలంగాణ సామాజిక భరోసా కవిత అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. అయితే బిఆర్‌ఎస్‌ అధికారంలో వున్నంత కాలం కవిత ఏం చేసిందన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఏదీ ఏక కాలంలో పూర్తి కాదు. అన్ని సమస్యలు ఒకే సారి నెరవేరవు. ఆ సమయంలో సామాజిక తెలంగాణ కన్నా, సాగు నీటి తెలంగాణ ముఖ్యం. అన్న పూర్ణ తెలంగాణ ముఖ్యం. ఆకలిని తరిమేసే తెలంగాణ ముఖ్యం. తెలంగాణలో ఆకలి కేకలు లేకుండా చూడాల్సిన సమయం. తెలంగాణలో ఎప్పటికైనా సామాజిక తెలంగాణ సాదించొచ్చు. కాని ముందుకు తెలంగాణ నుంచి ఆకలిని తరిమేయాలి. అనారోగ్యాన్ని తరిమేయాలి. నీటి గోసలు లేకుండా చూసుకోవాలి. గుక్కెడు మంచి నీటికోసం తల్లడిల్లిన తెలంగాణ గుండెను చూసిన వారికి మాత్రమే కొన్ని విషయాలు అర్దమౌతాయి. తెలంగాణలో మొదటి ప్రాదాన్యతగా ప్రాజెక్టుల నిర్మాణం. సాగు సంపద పెంచడం. రైతును రాజును చేయడం వంటి బృహత్తరమైన ప్రణాళికలతో కేసిఆర్‌ ముందుకు సాగారు. ఎందుకంటే తెలంగాణలో ఒక సామెత చెబుతారు. కడుపు నిండా తిన్న తర్వాతే కంటికి కునుకైనా, పక్కవారితో కబుర్లైనా చెప్పుకునే అవకాశం వుంటుంది. ఓ వైపు ఆకలి దహిస్తుంటే నిద్ర వస్తుందా? పక్కవారితో సంబాషణ సాగుతుందా? అది అప్పటి తెలంగాణపరిస్దితి. ఇప్పుడు తెలంగాణ పరిపుష్టికరమైన తెలంగాణ. ఆకలి తెలంగాణ పొలిమేర దాటిపోయింది. రైతు సంతోషంగా వున్నారు. విద్య, వైద్యం ఎంతో కొంత బాగానే అందుతోంది. ఇక మిగిలింది..రావాల్సింది సామాజిక చైతన్యం. సామాజిక తెలంగాణ నిర్మాణం. బడుగులకు రాజకీయ ప్రాధాన్యం. ఆ సమయం ఇప్పుడు వచ్చింది. అందుకు కవిత కంకణం కట్టుకొని భయలుదేరింది. కవితే ఒక సమాజిక సైన్యంగా తెలంగాణ సమాజాన్ని ఏకం చేస్తోంది. అందరికన్నా ముందు సామాజిక తెలంగాణకు గళమైంది. తన స్వరం పెంచింది. నిజాన్ని నిర్భయంగా చెప్పింది. సామాజిక తెలంగాణ సాధన జగాల్సిన అవసరాన్ని గుర్తించింది. సామాజిక తెలంగాణ ఆవిష్కారం జరిగితే తెలంగాణ రాష్ట్ర పరిపూర్ణమౌతుందన్నారు. ఇంతకన్నా తెలంగాణ కోసం గొప్పగా ఆలోచించేవారు ఎవరుంటారు. ఇదే సమయంలో కవిత రాజకీయ స్వార్ధం కోసం బహుజన వాదం ఎత్తుకుంటున్నారని విమర్శలు చేస్తున్నారు. అలాంటి వారి పరిస్ధితి ఎలా వుంటుందంటే అమ్మ పెట్టా పెట్టదు..అడుక్కు తిననివ్వదన్న సామెతను నిజం చేస్తుంటారు. బిసిలై వుండి బిసిల ఐక్యత కోసం పాకులాడరు. ప్రయత్నం చేయరు. కాని బిసిలలో చైతన్యం కోసం కవిత ప్రయత్నం చేస్తుంటే ఆమె ఎవరు? అని ప్రశ్నిస్తున్నారు. బిసిలను ఏకం చేయడానికి బిసిలే అవసరం లేదు. సామాజిక సృహ వున్న వారు ఎవరైనా సరే ఆ బాధ్యతను తీసుకోవచ్చు. ఇప్పుడు కవిత కూడా అదే చేస్తున్నారు. చరిత్రలో సామాజిక చైతన్యం కోసం కృషి చేసిన వారిలో ఎక్కువ మంది అగ్ర కులానికి చెందని వాళ్లే వున్నారు. సామాజిక న్యాయం కోసం వాళ్లే కృషిచేశారు. అందుకే చరిత్రలో నిలిచారు. చరిత్ర గతిని మార్చారు. స్వాతంత్య్రానికి ముందు ఆంగ్లేయులు పాలనలో ఎంతో దుర్మార్గమైన ఆచారం వుండేది. భర్త చనిపోతే వెంటనే ఆమెను కూడా భర్తచితిపై వేసేవారు. దానికి సతీ సహగమనం అని పేరు పెట్టి, సజీవంగా వున్న మహిళను ఆ మంటల్లోనే తగలబెట్టేవారు. దాన్ని సంప్రదాయం అనేవారు. కాని అలాంటి అనాగరిక చర్యను వ్యతిరేకించింది రాజారామ్మెహన్‌ రాయ్‌. ఇంగ్లీషువారితో పోరాటం చేసి, వారిని ఒప్పించి, మెప్పించి సతీసహగమనాన్ని రద్దు చేయించారు. సామాజిక రుగ్మతను పారద్రోలాడు. ఇక చిన్న వయసులోనే పెళ్లిల్లుచేసి, భర్త చనిపోతే జీవితాంతం ఒంటరిగా మిగిలిపోతున్న మహిళల జీవితాల్లో మళ్లీ వివాహం చేసి, వారి జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత వీరేశలింగం పంతులుది. అందుకే ఇప్పటికీ ఏపిలో కొట్టుకొని పోయేను కొన్నికోటి లింగాలు వీరేశలింగమొకడు మిగిలెను చాలు…అని ఆ ఆంధ్ర సమాజం వేనోళ్ల పొగుడుతుందంటే కారణం వీరేశలింగం చూపిన దారి. ఆ వీరేశలింగం అగ్ర కులానికి చెందిన సామాజిక వేత్తే. అలాగే వరకట్న సమాజంలో ఆడపిల్ల నలిగిపోతుంటే, కన్నాశుల్కం వస్తే గాని ఆడ పిల్ల జీవితం బాగు పడదని ఎలుగెత్తి చాటి గురజాడ అప్పారావు కూడా ఉన్నత వర్గానికి చెందని మహానుభావుడే. ఇక మనుషుల్లో తేడాలు వుండొద్దని, చిన్నా, పెద్ద అనే తేడా వయసులో, గుణంలో తప్ప కులంలో కాదని చెప్పేందుకు పలనాటి బ్రహ్మనాయుడు చాప కూడుతో సహపంక్తి భోజనాలు పెట్టించేవారు. సమ సమాజ నిర్మాణం కోసం ఆనాడే కృషి చేశాడు. ఆయన నిమ్మ వర్గం కాదు. సమాజంలో అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యత, ప్రాముఖ్యత కలగాలని కోరుకోవడంలో అగ్ర కులాలు ముందుండి ప్రశ్నించడాన్ని నిరసించడం అజ్ఞానానికి,అవివేకానికి నిదర్శనమౌతుంది. ఆంగ్లేయులతో ఆనాటి రాజులెంతో మంది పోరాటం చేశారు. వాళ్లంతా తమ రాజ్యాల రక్షణ కోసం పోరాటం చేశారు. వారి పేర్లకు చరిత్రలో పెద్దగా ప్రాధాన్యత లేదు. కాని ప్రజా స్వామ్యం కోసం, ప్రజా పాలన కోసం గాంధీజీ పోరాటం చేశారు. అందుకే మహాత్ముడయ్యారు. దేశానికిస్వాతంత్య్రం తెచ్చిపెట్టారు. ఆయనను ఆనాడు మీరెందుకు అని ఎవరూ ప్రశ్నించలేదు. ఇప్పుడు కూడా కవితను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు. సామాజిక న్యాయం కోసం కవిత వేసే అడుగులు వెనక్కి పడేది లేదు. అందుకే సామాజిక న్యాయం కోసం కవితది అపర కాళిక అవతారం చూస్తారంటున్నారు.

గ్రామదేవతలకు పూజలు.

కోటగుళ్ళు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో గ్రామదేవతలకు పూజలు

గణపురం నేటి ధాత్రి:

గణపురం మండల కేంద్రంలో కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జేష్ట మాసం గ్రీష్మ రుతువు తదియ బుధవారం పర్వదినాన్ని పురస్కరించుకొని గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
 ప్రతినెల నిర్వహించే పూజా కార్యక్రమాలలో భాగంగా పంచామృతాలు సరస్వతి పుష్కర జలంతో అభిషేకం నిర్వహించి పట్టు వస్త్రాలతో ప్రత్యేకంగా అలంకరించారు. పూజా కార్యక్రమాలను ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు నిర్వహించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version