పి.డి.ఎస్.యు రాష్ట్ర 23వ మహాసభలను జయప్రదం చేయండి.

పి.డి.ఎస్.యు రాష్ట్ర 23వ మహాసభలను జయప్రదం చేయండి.

వరంగల్‌లో పోస్టర్ ఆవిష్కరణ.

నేటిధాత్రి, వరంగల్

 

 

 

ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.ఎస్.యు) తెలంగాణ రాష్ట్ర 23వ మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం నాయకులు పిలుపునిచ్చారు. జనవరి 5, 6, 7 తేదీలలో జరగనున్న మహాసభల సందర్భంగా శనివారం వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ సెంటర్‌లో పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జనవరి 5వ తేదీ ఉదయం 11 గంటలకు హన్మకొండ ఏకశిలా పార్కు నుంచి ఆర్ట్స్ కాలేజ్ ఆడిటోరియం వరకు విద్యార్థి ప్రదర్శన నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం ఆడిటోరియం ఆవరణలో బహిరంగ సభ జరుగుతుందని పేర్కొన్నారు.

ఈ బహిరంగ సభకు పి.డి.ఎస్.యు రాష్ట్ర అధ్యక్షులు ఎస్.వి.శ్రీకాంత్ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. అలాగే సినీ నటుడు, దర్శక నిర్మాత ఆర్.నారాయణమూర్తి, పి.డి.ఎస్.యు ఉమ్మడి ఏపీ పూర్వ అధ్యక్షులు పి.ప్రసాద్, సాధినేని వెంకటేశ్వరరావు, పూర్వ ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్, ప్రగతిశీల మహిళా సంఘం జాతీయ నాయకురాలు వి.సంధ్య, పి.డి.ఎస్.యు జాతీయ నాయకులు పి.మహేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొడపంగి నాగరాజు తదితరులు ప్రసంగిస్తారని చెప్పారు. అనంతరం అరుణోదయ బృందం ద్వారా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

జనవరి 6, 7 తేదీలలో వరంగల్‌లోని అబ్నూస్ ఫంక్షన్ హాల్‌లో ప్రతినిధుల సభలు జరుగుతాయని తెలిపారు. 6వ తేదీ ఉదయం 11 గంటలకు జరిగే కార్యక్రమంలో మానవ హక్కుల వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షులు జీవన్ కుమార్ గౌరవ అతిథిగా పాల్గొంటారని, ఆహ్వాన సంఘం అధ్యక్షులు ప్రొఫెసర్ కాత్యాయని విద్మహే తొలి పలుకులు వినిపిస్తారని పేర్కొన్నారు. ప్రారంభ ఉపన్యాసాన్ని ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రొఫెసర్ వికాస్ బాజ్‌పాయ్ ఇస్తారని తెలిపారు. అలాగే వివిధ అంశాలపై ప్రొఫెసర్లు లక్ష్మీనారాయణ, బి.ప్రదీప్, చంద్రశేఖర్, కే.గోవర్ధన్, మైసా శ్రీనివాసులు ప్రసంగిస్తారని వెల్లడించారు.

7వ తేదీన జరిగే మహాసభలో భవిష్యత్తు కార్యాచరణపై చర్చ జరిపి పలు తీర్మానాలను ఆమోదించి, నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంటారని తెలిపారు. ఈ మహాసభలకు ఢిల్లీ, పంజాబ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం తదితర రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. విద్యార్థులు, వివిధ వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని మహాసభలను విజయవంతం చేయాలని వారు కోరారు.

ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మహాసభల ఆహ్వాన సంఘం నాయకులు రాచర్ల బాలరాజు, గంగుల దయాకర్, ఎలకంటి రాజేందర్, బండి కోటేశ్వరరావు, బన్న నర్సింగం, అలాగే పి.డి.ఎస్.యు వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గుర్రం అజయ్, కార్యదర్శి మర్రి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

సి.ఐ రఘుపతి రెడ్డిని సన్మానించిన స్వచ్చంధ సంస్థల ప్రతినిధులు.

సి.ఐ రఘుపతి రెడ్డిని సన్మానించిన స్వచ్చంధ సంస్థల ప్రతినిధులు.

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

నర్సంపేట పట్టణ నూతన సీఐగా ఇటీవల విధుల్లో చేరిన పట్టణ సి.ఐ రఘుపతిరెడ్డి ని స్థానిక స్వచ్చంధ సేవా సంస్థల ప్రతినిధులు పోలీస్ స్టేషన్ లో మర్యాద పూర్వకంగా కలిసి శాలువా తో సత్కరించారు.ఈ సందర్బంగా సి.ఐ మాట్లాడుతూ స్వచ్చంధంగా పేద ప్రజలకు సేవలు అందిస్తూ ప్రజా చైతన్య కార్యక్రమాలు నిర్వహించే స్వచ్చంధ సంస్థలకు తమ వంతు పోలీస్ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలియజేసినారు.ఈ కార్యక్రమం లో ప్రతిభా సంస్థ నిర్వాహకులు, వినియోగదారుల సమాచార కేంద్రం జిల్లా అధ్యక్షులు గిరగాని సుదర్శన్ గౌడ్, స్వయంకృషి సంస్థ నిర్వాహకులు బెజ్జంకి ప్రభాకర్, ఏ.ఎస్.ఆర్. సంస్థ నిర్వాహకులు ఎర్రబోయిన రాజశేఖర్, స్వచ్చంధ వాలంటీర్ కాసుల వెంకటాచారి, గన్ మెన్ మహేష్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ప్రజా సమస్యలు ప్రజా ప్రతినిధులు పరిష్కరించాలి.

ప్రజా సమస్యలు ప్రజా ప్రతినిధులు పరిష్కరించాలి

లేనిచో స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసి అభ్యర్థులను పోటీ చేయిస్తాం

వనపర్తి బి సి ల జన బేరి బహిరంగ సభలో రాచాల యుగేందర్ గౌడ్
వనపర్తి నేటిధాత్రి:

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నామినేటెడ్ పదవుల్లో బీసీలకు అన్యాయం జరిగిందని జిల్ల లో అవినీతిపై బీసీల ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని బీసీ పొలిటికల్ జే ఏ సీ రాష్ట్ర చైర్మన్ రాచాల యుగేందర్ గౌడ్ వనపర్తి లో రాజావారి పాలిటెక్నిక్ కళాశాల మైదానం బి సి జన బేరి బహిరంగ సభలో బీ సీ లను ఉద్దేశించి ప్రసంగించారు ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు ప్రజా ప్రతినిధులు స్థానిక ప్రజల సమస్యలు పట్టించుకోకుంటే అధికారపార్టీపై బీసీల మద్దతుతో తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల లో మున్సిపాలిటీ జెడ్పిటిసి సర్పంచ్ ఎన్నికలలో బీ సీ ల అభ్యర్థులను పోటీ చేయిస్తామని రాచాల పేర్కొన్నారు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా బీసీలు భారీ ఎత్తున పాల్గొని బహిరంగ సభను విజయవంతం చేసినందుకు రాచాల కృతజ్ఞతలు తెలిపారు

TUWJ IJU ప్రతినిధులకు ఘన సన్మానం.

టీయూడబ్ల్యూజే ఐజేయు ప్రతినిధులకు ఘన సన్మానం.

మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్.

నర్సంపేట నేటిధాత్రి:

 

తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ( ఐ.జే.యు ) వరంగల్ జిల్లా కమిటిలో ఎన్నికైన నర్సంపేట డివిజన్ కు చెందిన జర్నలిస్టు ప్రతినిధులకు నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్ సన్మానించారు. బుధవారం వరంగల్ జిల్లా కేంద్రంలో టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా మహాసభ జరిగింది. ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లా నూతన కమిటీ కోసం ఎన్నికలు నిర్వహించారు. నర్సంపేట డివిజన్ నుండి జిల్లా కోశాధికారి కోదాటి గోపాలకృష్ణ, ఉపాధ్యక్షులు మహాదేవుని జగదీష్, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు కందుల శ్రీనివాస్ గౌడ్, శీలం రమేష్,కంచర్ల కుమార్, మహమ్మద్ చాంద్ పాషా, పల్లెల్ల సోమేశ్వర్ రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా గురువారం నర్సంపేట మార్కెట్ కమిటి చైర్మన్ పాలాయి శ్రీనివాస్, వైస్ చైర్మన్ శాఖమూరి హరిబాబులు నూతనంగా ఎన్నికైన టీయూడబ్ల్యూజే ఐజేయు నర్సంపేట డివిజన్ ప్రతినిధులను మార్కెట్ కమిటి కార్యాలయంలో శాలవాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం మార్కెట్ చైర్మన్ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ కొనసాగాలన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version