చిన్నారి బాలునిపై గుర్తు తెలియని అగంతకుడు కత్తితో దాడి..

చిన్నారి బాలునిపై గుర్తు తెలియని అగంతకుడు కత్తితో దాడి

కేసముద్రం/ నేటి ధాత్రి

కేసముద్రం మండలంలోని నారాయణపురం గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తులు రాత్రి నిద్ర పోతున్న చిన్నారి బాలుడు పై కత్తితో దాడి చేసిన సంఘటన జరిగింది,
స్థానికులు గాయపడిన బాలుడి నానమ్మ మంగమ్మ తెలిపిన కథనం ప్రకారం.. పందుల మునీష్ కుమార్ (6) నారాయణపురం యుపిఎస్ పాఠశాలలో ఒకటవ తరగతి చదువుతున్నాడు. తండ్రి పేరు ఉపేందర్, తల్లి శిరీష ముగ్గురు సంతానం, రోజువారి వృత్తిరీత్యా డ్రైవర్ పని నిమిత్తం వెళ్లి రావడం జరిగిందని, గాయపడిన బాలుడు పెద్ద కుమారుడు పందుల మనీష్ కుమార్ తల్లిదండ్రులు ఉపేందర్ శిరీష మరో బాలుడు ఒకే దగ్గర పడుకోవడం జరిగిందని, ఇంటికి రెండు డోర్లు ఉంటాయి ఒకదానికి లోపల బేడమ్ (గొళ్లెం) ఉందని, గొల్లం లేని మెయిన్ డోర్ నుంచి గుర్తుతెలియని వ్యక్తులు గురువారం తెల్లవారుజామున సుమారు మూడు గంటల ప్రాంతంలో బాలుడు మునిష్ కుమార్ రోదిస్తుండగా గుర్తించిన నానమ్మ మంగమ్మ తండ్రి ఉపేందర్ చూడడంతో బాలుడు స్కూల్ యూనిఫామ్ పై రక్తస్రావంతో ఉండడంతో వెంటనే గ్రామంలోని ఓ వైద్యుని దగ్గరికి తీసుకెళ్లామని, ఆ వైద్యుడు మహబూబాబాద్ ఆసుపత్రికి తీసుకెళ్లమనడంతో వెనుతిరిగామని, ఈ క్రమంలో వైద్యుని ఇల్లు బొడ్రాయి దగ్గర ఉండడంతో కారులో బొడ్రాయి వద్దకు వచ్చి వెనుతిరిగి వెళ్ళారని ఓ వ్యక్తి తెలిపాడు. అనంతరం మహబూబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకెళ్లడం జరిగిందనీ, గతంలో చిన్న కుమారుడు ఎనిమిది నెలల క్రితం వాటర్ సబ్బులో పడి మృతి చెందాడని , నాకు గ్రామంలో ఎలాంటి వారితో శత్రుత్వం లేదని గుర్తుతెలియని అగంతకుడు నా బాలుడిని గాయపరిచినట్లు తెలిపారు. అని తెలుసుకున్న కేసముద్రం పోలీసులు ట్రైనింగ్ ఎస్సై నరేష్ పోలీస్ సిబ్బంది విచారణ చేపడుతున్నారు.

జహీరాబాద్ లో యువకుడి హత్య..

జహీరాబాద్ లో యువకుడి హత్య..

◆:- మొదట మిస్సింగ్.. అనంతరం హత్య.

◆:- శోకసంద్రంలో కుటుంబ సభ్యులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ పట్టణ పరిధిలోని ఫైజ్ నగర్కు చెందిన ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. హ త్యకు గురైన వ్యక్తి మొహమ్మద్ తాజో ద్దీన్ (22)గా గురించారు. పట్టణ పరిధి అల్లానా రోడ్డులో గల రహమత్ నగర్ ప్రాంతంలో ఆయన మృతదేహం లభిం చింది. నిన్న నమాజ్ కోసం వెళ్తున్నట్లు
ఇంట్లో చెప్పి బయలుదేరిన యువకుడు రాత్రి వరకు రాలేదు. జామ మసీదు వద్ద ఆయన బైక్ ను రికవరీ చేశారు. ఇవాళ ఓ పాడు బావిలో మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. అక్కడకు చేరుకొని పరిశీలించగా మృత దేహం మీద గాయాలున్నందున కసితీరా పొడిచి హత్య చేసి అక్కడి నుంచి పరారై నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉండగా హత్య ఎవరు, ఎందుకు చేశారనేది తెలియాల్సి ఉంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన యువ నాయకుడు షేక్ సోహెల్.

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన యువ నాయకుడు షేక్ సోహెల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సీఎంఆర్ఎఫ్ చెక్ అందజేసిన తుమ్మన్ పల్లి బిఆర్ఎస్ నాయకులు
శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు గారి, ఆదేశాల మేరకు తుమ్మన పల్లి గ్రామానికి చెందిన పక్కిరి బాబు షా గారికి 43500. చెక్కు అందజేయడం జరిగింది.ఈ సంధర్బంగా లబ్ధిదారులు వారి కుటుంబసభ్యులు ఎమ్మెల్యే మాణిక్ రావు గారికి,మండల పార్టీ అధ్యక్షునికి,నాయకులకు ధన్యవాదలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు వెంకటరెడ్డి యువ నాయకులు షేక్ సోహైల్ రమేష్ మోసిన్ ఆశప్ప తదిపరులు పాల్గొన్నారు.

విద్యుత్ షాక్ తో యువకుడు మృతి.

విద్యుత్ షాక్ తో యువకుడు మృతి.

#విద్యుత్ మోటర్ ను సరి చేస్తుండగా ప్రమాదం.

#ఎదిగిన కొడుకు మృతి చెందడంతో తల్లి రోదనకు అవధులు లేకుండా పోయింది.

#యువకుని మృతితో గ్రామములో విషాదఛాయలు.

నల్లబెల్లి నేటి ధాత్రి:

వ్యవసాయ బావి వద్ద ఉన్న మోటర్కు వైర్లను తగిలిస్తుండగా విద్యుత్ షాక్ కు గురై యువకుడు మృతి చెందిన సంఘటన గురువారం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం దస్తగిరి పల్లె గ్రామంలో చోటుచేసుకుంది వివరాలకు వెళితే కుటుంబ సభ్యులు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మాందాటి శ్రీనివాస్ రెడ్డి-మంజుల దంపతుల రెండవ కుమారుడు లక్ష్మణ్ రెడ్డి (19) తమ వ్యవసాయ భావి వద్దకు వెళ్లి నీళ్లు రావడంలేదని మోటారు వైర్లను సరి చేస్తున్న క్రమంలో కరెంటు రాకపోవడంతో 11 కెవి విద్యుత్తు లైనుకు వైర్లను తగిలించే క్రమంలో ప్రమాదవశాత్తు ఒక వైరు కాలికి తగలడంతో పడిపోగా గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు తెలవడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించే క్రమంలో యువకుడు మృతి చెందినట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్ మార్ట్ నిమిత్తం నర్సంపేటకు తరలించినట్లు పోలీసులు తెలిపారు మృతుని తండ్రి శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గోవర్ధన్ తెలిపారు.

#యువకుని మృతితో గ్రామంలో అలుముకున్న విషాద ఛాయలు.
పట్టుమని 19 సంవత్సరాలు నిండకముందే నూరేళ్ల జీవితం గడిచిపోయిందని మృతుని తల్లిదండ్రులు రోదన చేస్తుంటే గ్రామస్తులందరూ శోకసముద్రంలో మునిగిపోయారు. ఎంతో చలాకీగా చదువులో సైతం ప్రతిభను కనబరిచి ఎంతో అత్యున్నత స్థానంలో ఉండాలని కోరికతో ఉండేవాడని అదేవిధంగా తల్లిదండ్రులకు తన వంతుగా వ్యవసాయ పనులలో చేదోడు వాదోడుగా ఉండి కుటుంబానికి పెద్దన్న పాత్ర పోషించేవాడని గ్రామ ప్రజలు చెప్పుకుంటూ బోరుణ ఏడ్చారు. ఏది ఏమైనాప్పటికీ చేతికి అందిన కొడుకు చేజారిపోవడంతో కన్న తల్లిదండ్రుల రోదన అంతా ఇంత కాదు.

పిడుగు పాటుతో డప్పుర్ కు చెందిన యువకుడు మృతి

* పిడుగు పాటుతో డప్పుర్ కు చెందిన యువకుడు మృతి.*

జహీరాబాద్ నేటి ధాత్రి

సంగారెడ్డి జిల్లా, న్యాల్ కల్ మండలం, డప్పుర్ గ్రామంలో బుధవారం సాయంత్రం కురిసిన భారీ వర్షం, పిడుగు పాటుతో గ్రామానికి చెందిన మల్గి ఇస్మాయిల్ కుమారుడు సాబేర్ (15) మృతి చెందాడు. వర్షం కురుస్తున్న సమయంలో ఓ చెట్టు కింద ఉండగా పిడుగు పాటుకు గురయ్యాడు. కుటుంబ సభ్యులైన మరో ఐదుగురికి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది.

యువకుడి ప్రాణం తీసిన అప్పు.

యువకుడి ప్రాణం తీసిన అప్పు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

అప్పుల బాధలు తట్టుకోలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన జహీరాబాద్ లో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జహీరాబాద్ పట్టణంలోని . మహేంద్ర కాలనీకి చెందిన మృతుడు రవికాంత్ చారీ 32 స్వర్ణకారుడు వ్యాపారం చేస్తుండేవాడు. అప్పుల బాధ తట్టుకోలేక ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం, మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

పని చేసుకొని బ్రతుకుమంటే యువకుడి ఆత్మహత్య.

— పని చేసుకొని బ్రతుకుమంటే యువకుడి ఆత్మహత్య

 

నిజాంపేట: నేటి ధాత్రి

పనిచేసుకొని బ్రతుకుమంటే ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నిజాంపేట మండలంలో చోటుచేసుకుంది.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కమ్మరి నరసింహ చారి (20) తన తల్లి చిన్నప్పుడే చనిపోవడం తో నానమ్మ కమ్మరి కమలమ్మతో ఉంటున్నాడు. నానమ్మ కూలి నాలి చేసి సాదుతుండేది. రోజురోజు ఆరోగ్యం క్షీణించడంతో పనిచేయడం వీలుకాక ఇకనుండి ఏదైనా పని చేసుకుని బ్రతకమని నరసింహ చారిని మందలించగా మనస్థాపానికి గురై క్షణికావేశంలో రాత్రి ఇంట్లో ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుని నానమ్మ కమలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version