అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన మృతులకు ఆత్మశాంతి కలగాలి.

అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన మృతులకు ఆత్మశాంతి కలగాలి

అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన అత్యంత బాధాకరం

మృతుల కుటుంబాలకు ఆ భగవంతుడు ధైర్యం ప్రసాదించాలి

మొగుళ్ళపల్లి మాజీ సర్పంచ్ మోటే ధర్మన్న
మొగులపల్లి నేటి ధాత్రి:

 

అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన అత్యంత బాధాకరమని మొగుళ్ళపల్లి మాజీ సర్పంచ్ మోటే ధర్మన్న అన్నారు. శుక్రవారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశంలోనే ఇదొక దురదృష్టకరమైన సంఘటనని, మృతుల కుటుంబాలకు ఆ భగవంతుడు ధైర్యం ప్రసాదించాలని, మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని, ఏకంగా విమాన ప్రమాదంలో 230 మంది ప్రయాణికులతో పాటు, ఇద్దరు పైలెట్లు,10 మంది విమాన సిబ్బంది, విమానం ఒక మెడికల్ కాలేజీ పై కూలడంతో ఎంతోమంది విద్యార్థులు క్షేత్రగాత్రులు అయ్యారని, మరికొంతమంది విద్యార్థులు మరణించారని, ఇలా ఇంతమంది ఒకే ప్రమాద దుర్ఘటనలో మరణించడం మనదేశంలో ఇదే ప్రథమమని, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడే భారతీయులంతా ఒక్కటై బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని, క్షతగాత్రులకు సరైన వైద్యం అందే విధంగా ప్రభుత్వం సహాయం చేయాలని, ఇందుకు కారణమైన అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకొని మరొకసారి ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చూడాలని, ఎన్నో ఆశలతో విమానంలో బయలుదేరిన వారు తమకు తెలియకుండానే మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని మోటే ధర్మన్న వేడుకుంటున్నట్లు తెలిపారు.

చంద్రమౌళి ఆత్మకు శాంతి చేకూరాలి.

చంద్రమౌళి ఆత్మకు శాంతి చేకూరాలి

జైపూర్ నేటి ధాత్రి:

జన్నారం ఇంధనపల్లి మండలం వన్ గ్రామపంచాయతీ కార్యదర్శి ఎర్రజుల చంద్ర మౌళి బుధవారం రోజున ఆకస్మికముగా గుండె పోటుతో మరణించడం చంద్రమౌళి మృతికి సంతాపాన్ని ప్రకటిస్తూ గురువారం రోజున జైపూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 2 నిముషాలు మౌనం పాటించి నివాళులర్పించారు.ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ తోటి అధికారి అకస్మాత్తుగా స్వర్గస్తులవడం బాధాకరమైన విషయమని, ఎర్రాజుల చంద్రమౌళి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమం లో ఎంపీడీఓ సత్యనారాయణ గౌడ్,ఎంపీవో శ్రీపతి బాబురావు,ఆర్డబ్ల్యూఎస్ డిఈ,మండల ప్రజా పరిషత్ కార్యాలయ సిబ్బంది,జైపూర్ మండలం పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version