జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో డ్రై డే కార్యక్రమం.

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో డ్రై డే కార్యక్రమం

సిరిసిల్ల టౌన్: (నేటి ధాత్రి)

 

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రజిత ఆకస్మిక తనిఖీల్లో భాగంగా డెంగ్యూ,మలేరియా జ్వరాల నివారణలో భాగంగా డ్రై డే కార్యక్రమంలో పాల్గొని (డ్రము )తొట్టి లలో లార్వా లు గల నీటి ని తొలగించడం, టైర్లు, కూలర్లు, రోళ్ళు గల లార్వాలను తొలగించడం, నీటి నిల్వలు గల ప్రాంతాలను గుర్తించి పూడ్చి వేయడం, డ్రైనేజ్ లలో నీరు నిల్వ ఉండకుండా, రోడ్లపై చెత్త చెదారము నిల్వ ఉండకుండా, ఇంటి చుట్టూ పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ వ్యక్తిగత పరిశుభ్రత లో భాగంగా తరచుగా చేతులు శుభ్రపరచుకోవడం, గుంపులలో, ప్రయాణ సమయంలో మాస్కులు ధరించడం ద్వారా వర్షాకాలంలో వచ్చే వైరల్ జ్వరాలు నివారించవచ్చునని

Program Officer Dr. Anitha,

ఈ సందర్భంగా సిబ్బందికి, ప్రజలకు అవగాహన కల్పించినారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అనిత, మలేరియా సూపర్వైజర్ లింగం, వాణి మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

కిష్టాపూర్ గ్రామంలో బడిబాట చేపట్టిన మండల అధికారులు.

కిష్టాపూర్ గ్రామంలో బడిబాట చేపట్టిన మండల అధికారులు

జైపూర్,నేటి ధాత్రి:

 

 

 

 

కిష్టాపూర్ గ్రామపంచాయతీలో శుక్రవారం బడిబాట చేపట్టిన అధికారులు.స్కూలు వెళ్లే పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే విధంగా తల్లిదండ్రులకు ప్రభుత్వం కల్పి పిస్తున్న సౌకర్యాలను అవకాశాలను తెలియజేస్తూ నాణ్యమైన విద్య పిల్లలకి అందించాలని తల్లిదండ్రులు ఆర్థిక భారానికి లోను కాకూడదని ప్రభుత్వ పాఠశాలలో చేరే విధంగా విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించారు.అలాగే గ్రామపంచాయతీలోని తాగునీటి సమస్యల పరిష్కారానికి గ్రామంలో తిరిగి సమస్యలను గుర్తించి పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని గ్రామపంచాయతీ కార్యదర్శికి ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్,ఎంపీఓ,శ్రీపతి బాపురావు, ఇరిగేషన్ డిఈ విద్యాసాగర్ రావు,పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్,కిష్టాపూర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమణారెడ్డి,ఉపాధ్యాయులు కవిత,రజిత,అంగన్వాడీ మరియు గ్రామపంచాయతీ సిబ్బంది,గ్రామస్తులు పాల్గొనడం జరిగింది.

చివరి శ్వాస వరకు ప్రజలకు సేవ చేస్తాను.

చివరి శ్వాస వరకు చొప్పదండి నియోజకవర్గం ప్రజలకు సేవ చేస్తాను

అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు అందజేస్తాం

పేదవారి సొంత ఇంటి కలలు నెరవేర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించింది

రాష్ట్రంలో 99 శాతం మందికి రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుంది

రూ. 43 కోట్లతో నారాయణపూర్ రిజర్వాయర్ పెండింగ్ పనులు పూర్తి చేస్తాము

గంగాధర మండలంలోని 33 గ్రామాలకు చెందిన 721 మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ ప్రమేలా సత్పతితో కలిసి మంజూరి పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

గంగాధర నేటిధాత్రి:

 

 

 

 

 

పేదవారి సొంతింటి కలను నిజం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించింది.

ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా, ఒక్క గంగాధర మండలంలోనే 721 మంది అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశాము.

721 మందికే కాదు, చొప్పదండి నియోజకవర్గం లోని అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరి చేయడానికి కృషి చేస్తాము.

గత బిఆర్ఎస్ ప్రభుత్వం హాయంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలకే సంక్షేమ పథకాలు అందజేశారు.

రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చూస్తాము.

సంక్షేమ పథకాల పేరుతో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎవరైనా మామూలు అడిగితే మా దృష్టికి తీసుకురండి, లేదా పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేయండి.

సంక్షేమ పథకాలు అందించడంలో అవినీతికి తావు లేదు.

మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం.

జ్యోతి పథకంతో 200 మీట్ల వరకు ఉచిత విద్యుత్ను అందజేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం.

గత బిఆర్ఎస్ ప్రభుత్వం రైతులను అరిగోస పెట్టింది.

కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యం 44 కిలోల వరకు తూకం వేసి రైతులను నిండా ముంచింది.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ గ్రామ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కటింగ్ లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తోంది.

తెలంగాణ రాష్ట్రంలో 21 వేల కోట్ల రుణమాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం.

గంగాధర మండలంలో 2018 లో బిఆర్ఎస్ ప్రభుత్వం 2483 మంది రైతులకు రూ.17 కోట్ల 82 లక్షల రుణమాఫీ చేస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 5744 మంది రైతులకు రూ. 48 కోట్ల రుణమాఫీ చేసింది.

బిఆర్ఎస్, బిజెపి పార్టీల నాయకులు రుణమాఫీ కాలేదని ప్రజలను మభ్యపెడుతున్నారు. 20 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న నారాయణపూర్ రిజర్వాయర్ పెండింగ్ పనులను పూర్తి చేయడానికి రూ.43 కోట్లతో పూర్తి చేయబోతున్నాము.

గత బిఆర్ఎస్ ప్రభుత్వం లోని ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రారంభించి వదిలేసిన ఓటీల నిర్మాణాల పనులను పూర్తి చేయిస్తున్నాం.

నియోజకవర్గంలోని సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ పనులను పూర్తి చేసి కోనసీమగా మార్చుతాము. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 56 వేల ఉద్యోగాలను భర్తీ చేసింది.

కుల మతాలతో సంబంధం లేకుండా విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో ప్రతి నియోజకవర్గంలో రూ. 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది.

అతి త్వరలోనే గంగాధర మండలంలో డిగ్రీ కళాశాలను  ప్రారంభిస్తాము.

ప్రభుత్వ అనుమతి పొందిన విత్తనాలనే విక్రయించాలి.

ప్రభుత్వ అనుమతి పొందిన విత్తనాలనే విక్రయించాలి

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

 

 

కేసముద్రం మండలంలోని పలు విత్తన దుకాణాలను కేసముద్రం మండల టాస్క్ఫోర్స్ టీం మండల వ్యవసాయ అధికారి కేసముద్రం మరియు స్టేషన్ హౌస్ ఆఫీసర్ కేసముద్రం వారు తనిఖీ చేయడం జరిగింది, పలు దుకాణంలో ఉన్నటువంటి వివిధ రకాల కంపెనీ విత్తనాలు, స్టాక్ రిజిస్టర్లు,బిల్ బుక్కులు,ఇన్వైసులు లైసెన్సులు, స్టార్ బోర్డు, గోదామును తనిఖీ చేయడం జరిగింది, వారు మాట్లాడుతూ

 

House Officer Muralidhar Raj

 

డీలర్లు విత్తన చట్టం 1966 ప్రకారం వారి యొక్క క్రయవిక్రయాలు జరుపుకోవాలని, ప్రతి రైతుకు విధిగా బిల్లులు ఇవ్వాలని, ప్రభుత్వం అనుమతి పొందిన విత్తనాలను మాత్రమే రైతులకు అమ్మాలని వారు సూచించారు, రైతులకు కనిపించే విధంగా, లైసెన్సులు,స్టాక్ బోర్డు, మైంటైన్ చేయాలని వారు, సూచించారు, ఎవరైనా డీలర్లు నకిలీ విత్తనాలు అమ్మినట్లు తెలిస్తే, విత్తన చట్టం 1966 ప్రకారం చర్యలు తీసుకుంటామని వారు సూచించారు.
ఈ కార్యక్రమంలో కేసముద్రం మండల స్టేషన్ హౌస్ ఆఫీసర్ మురళీధర్ రాజ్ మండల వ్యవసాధికారి బి వెంకన్న, పోలీస్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

పోత్కపల్లి పోలీస్‌ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసినా డిసిపి.

పోత్కపల్లి పోలీస్‌ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసినా డిసిపి

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

ఓదెల మండలం పోత్కపల్లి పోలీస్ స్టేషన్ ను పెద్దపల్లి డిసిపి కరుణాకర్ ఆకస్మికంగా తనిఖీ చేసారు.పోలీస్ స్టేషన్ ఆకస్మికంగా తనిఖీ సందర్భంగా డిసిపి గారు ముందుగా పోలీస్‌ స్టేషన్‌ పరిసరాలు, వివిధ కేసులలో సిజ్ చేసిన వాహనాలను పరిశీలించి అనంతరం రిసెప్షన్ సిబ్బందిని అడిగి పిర్యాదుల వివరాలు అడిగి తెలుసుకొన్నారు.పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులతో మర్యాదగా ప్రవర్తించి వారి సమస్యను తెలుసుకొని వారికీ భరోసా నమ్మకం కల్పించాలని చట్టపరిధిలో సమస్య పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు.స్టేషన్‌ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీస్‌ అధికారులు,సిబ్బంది వివరాలను డిసిపి ఎస్ఐ దీకొండ రమేష్ ను అడిగి తెలుసుకొవడంతో పాటు, స్టేషన్‌ పరిధిలో అత్యధికంగా ఎలాంటి నేరాలు నమోదవుతాయి,సమస్యత్మక గ్రామాల, సరిహద్దు ప్రాంత వివరాలు, రౌడీ షీటర్లు, ట్రబుల్ మాంగర్స్, అనుమానితులు వారి ప్రస్తుత స్థితి గతులను సంబంధిత ఎస్‌ఐని అడిగి తెలిసుకోవడంతో పాటు స్టేషన్‌వారిగా బ్లూకోల్ట్స్‌ సిబ్బంది పనితీరుతో పాటు, వారు విధులు నిర్వహించే సమయాలను అడిగి తెలుసుకున్నారు.గంజాయితో పాటు ఇతర మత్తు పదార్థాలకు సంబంధించి అక్రమ రవాణా, సరఫరా, నిల్వ, సేవించే వారిపై స్టేషన్‌ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి మత్తు పదార్థాల నియంత్రణకై నిరంతరం పనిచేయాలని నేరాల నియంత్రణకై విజుబుల్‌ పోలీసింగ్‌ అవసరమని, నిరంతం పోలీసులు పెట్రొలింగ్‌ నిర్వహించాలని డిసిపి అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్దపెల్లి ఏసిపి జి కృష్ణ,ఎస్ఐ దీకొండ రమేష్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసిన విద్యాధికారి.

పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసిన విద్యాధికారి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

ఝరాసంగం మండల కేంద్రంలోని ఎంఈఓ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, కిట్లు పంపిణీ చేశారు. ఎంఈఓ శ్రీనివాస్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్‌ బుక్స్‌ మండలంలోని 57 పాఠశాలల విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ ప్రైవేట్‌ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడం జరుగుతోందని, విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల ను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలన్నారు. విద్యా కోసం ఎంత ఖర్చు అయినా ప్రభుత్వం భరిస్తుందన్నారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచి, ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు.
మండలంలోని 2663 విద్యార్థుల నిమిత్తం మొదటి విడత పాఠ్య పుస్తకాల పంపిణీ ఝరాసంగం మండలంలోని అన్ని పాఠశాలలకు మొదటి విడత 12,517 పుస్తకాలు మండల వనరుల కేంద్రానికి రావడం జరిగింది ఈకార్యక్రమంలో ఎం ఆర్ సి సిబ్బంది శివ సి.ర్.పి.రాజు షైక్ షఫీవుద్దీన్ లక్ష్మీ ఉపాధ్యాయులు మెదపల్లి ఎల్గోయి నగేష్ శివ చందర్ పాల్గొన్నారు.

యాదవులందరూ సుభిక్షంగా ఉండాలి.

యాదవులందరూ సుభిక్షంగా ఉండాలి.

#గొర్ల మందపై గాబు పట్టిన గావోచ్చోళ్ళు.

#కుల పెద్దమనిషి బత్తిని మహేష్.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

 

 

యాదవ కుల ఆచారంలో భాగంగా గొర్ల మందపై గాబు పట్టే కార్యక్రమాన్ని మండల కేంద్రంలో కుల పెద్దమనిషి బత్తిని మహేష్ ఆధ్వర్యంలో పెద్ద బోయిన కొమురయ్య వ్యవసాయ క్షేత్రంలో యాదవ కులదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం గొర్రెను గాపు పట్టి ఆచారంలో భాగంగా బలి కార్యక్రమాన్ని చేశారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ ప్రతి యాదవ కుటుంబం సుభిక్షంగా సుఖశాంతులతో అందరూ క్షేమంగా ఉండాలని అదేవిధంగా గ్రామ ప్రజలు కూడా పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని.

Bathini Mahesh.

 

గొల్ల కులమ గావోచ్చోళ్ళు యాదవ కులదైవలను కొలుస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించడం చాలా సంతోషకరం. ఆ దేవతల ఆశీర్వాదంతో అందరూ సుభిక్షంగా ఉండాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గొర్ల కాపర్లు భాష బోయిన సమ్మయ్య, మూటికే కట్టయ్య, వేల్పుల కృష్ణ, కుంట మల్లయ్య, నాన బోయిన పుల్లయ్య, గావచ్చోళ్ళు కిన్నెర వీరమల్లు, యాకమల్లు, భాస్కర్, నరేష్, నవీన్, ఐలయ్య, యాకమ్మ, హైమ, ప్రశాంత్, కుల పెద్దలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

పర్యావరణపై విద్యార్థులకు ఆన్లైన్ పోటీలు.

పర్యావరణపై విద్యార్థులకు ఆన్లైన్ పోటీలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పర్యావరణంపై ఆన్లైన్ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. 6, 7 తరగతులు జూనియర్, 8, 9, 10 విద్యార్థులు సీనియర్ విభాగంలో పెయింటింగ్, వ్యాసరచన రాసి 63090 07828 నెంబర్ కు వాట్సప్ ద్వారా జూన్ 3 లోపు పంపాలని పేర్కొన్నారు. విద్యార్థి పేరు, తరగతి, పాఠశాల, ఫోన్ నెంబర్, గ్రామం తప్పనిసరిగా రాయాలన్నారు.

పట్టించిన వారికి పారితోషికం..

పట్టించిన వారికి పారితోషికం..

మంగపేట నేటిధాత్రి

 

 

 

 

కమలాపురం గ్రామానికి చెందిన
రాంపూరీ రాజేష్ @ ఎంపురం రాజేష్ తండ్రి కొట్టేన్న @ పొట్టెన్న కమలాపురం ఒక కేసు లో నిందితుడిగా ఉండి కోర్టు కు హాజరుకాకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. ఇతని ఆచూకీ తెలిసినచో 8712670092,8712670093కి తెలపగలరు అని వారికి తగిన పారితోషకం తో పాటు వారి వివరాలు గోప్యంగా ఉంటాయని ఎస్సై సూరి ఒక ప్రకటనలో తెలిపారు.

మక్తల్ ఎమ్మెల్యే వాహనానికి ప్రమాదం.

మక్తల్ ఎమ్మెల్యే వాహనానికి ప్రమాదం

ఎమ్మెల్యే శ్రీహరి కారును ఢీకొన్న మరో కారు

తృటిలో తప్పిన ప్రమాదం

మహబూబ్ నగర్ /నేటి ధాత్రి

 

 

 

 

మహబూబ్ నగర్ జిల్లా మక్తల్
ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి కు ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుండి మహబూబ్ నగర్ వైపుతో వెళ్తున్న TG 38. 6669 నెంబర్ గల ఇన్నోవా కారును పక్కన నుండి వస్తున్న ఐ 20 కారు వేగంగా ఢీకొట్టింది. షాద్ నగర్ రాయికల్ టోల్ ప్లాజా వద్ద ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో ఎమ్మెల్యే కారుకు స్వల్పంగా ధ్వంసం కాగా ఎవ్వరికి ఎలాంటి గాయాలు కాలేదనీ ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

లబ్ధిదారులకు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రనాయక్.

మరిపెడ నేటిధాత్రి.

 

 

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని ఆడిటోరియంలో హాల్లో ఈ రోజు వివిధ సంక్షేమ కార్యక్రమం లో భాగంగా నిర్వహించిన సభలో ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్,డోర్నకల్ శాసనసభ్యులు డా. రామచంద్రు నాయక్ హాజరై, పలు పథకాలు లబ్ధిదారులకు నేరుగా పంపిణీ చేశారు,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వలన సామాన్య ప్రజలకు గణనీయమైన మేలు జరుగుతుందన్నారు,ప్రతి ఒక్కరి జీవన ప్రమాణం మెరుగుపడేందుకు ఈ కార్యక్రమాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి,” అన్నారు, కళ్యాణలక్ష్మి & షాదీ ముబారక్ పథకాల చెక్కులు 74 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు,సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు, ఇందిరమ్మ హౌసింగ్ పథకం కింద స్థలల పట్టాలు 258 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు,ఇల్లు కట్టుకునే వారికి బేస్మెంట్ లెవెల్ లక్ష రూపాయలు, గోడలు కట్టినాక లక్ష రూపాయలు,స్లాప్ లెవెల్ లక్ష రూపాయలు ఈ విధంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం కొనసాగుతుందన్నారు,కల్లు గీత కార్మికులకు 82 కాటమయ్య రక్షణ కవచం, సేఫ్టీమెకుల కిట్టు పంపిణీ చేశారు,రాజీవ్ యువ వికాసo ద్వారా యువతకు వ్యాపార రంగంలో, ఇతర చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు లబ్ధి చేకూరుతుందని ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పేద ప్రజల సంక్షేమానికి కృషి చేస్తుంది అన్నారు,ఈ కార్యక్రమంలో ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు బీసీ కార్పొరేషన్ ఈడీ నరసింహమూర్తి,స్థానిక ఎమ్మార్వో కృష్ణవేణి,ఎంపీడీవో విజయ,ఎంపీఓ సొమ్లాల్,ఆర్ఐ శరత్ గౌడ్, మరిపెడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెండ్లి రఘువీరారెడ్డి, కేసముద్రం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఐలమల్లు జిల్లా నాయకులు,నియోజకవర్గ స్థాయి నాయకులు,యూత్ కాంగ్రెస్ సభ్యులు,గ్రామస్థాయి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ అకాడమీ & స్పోర్ట్స్ హాస్టల్ లో ప్రవేశమునకు ఎంపికల నిర్వహణ.

రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ అకాడమీ & స్పోర్ట్స్ హాస్టల్ లో ప్రవేశమునకు ఎంపికల నిర్వహణ

సిరిసిల్ల జిల్లా యువజన మరియు క్రీడల శాఖ

సిరిసిల్ల టౌన్: ( నేటి ధాత్రి )

 

 

 

 

 

రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ అకాడమీ & స్పోర్ట్స్ హాస్టల్ లో ప్రవేశమునకు ఎంపికల నిర్వహణ
తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ 2025 -2026 విద్యా సంవత్సరానికి గాను 1 జూన్,2025 నుండి వాలీబాల్ అకాడెమి రాజన్న సిరిసిల్ల, సరూర్నగర్ ఇన్డోర్ స్టేడియం, సిద్ధిపేట,మరియు మహబూబ్ నగర్ అకాడమి, ప్రాంతీయ క్రీడా హాస్టల్ – హన్మకొండ, అథ్లెటిక్స్ అకాడెమి – ఖమ్మం, సైక్లింగ్ మరియు రెజ్లింగ్ అకాడెమి – సైక్లింగ్ వేలోడ్రోమ్,O.U., హాకీ అకాడెమి – వనపర్తిలో మంజూరు చేయబడిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా, ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయడం కొరకు ఎంపికలు/ సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించనుంది.

 

ఈ క్రింద తెలుపబడిన తేదీలలో, ఆయా సెంటర్లలో రాష్ట్రం లోని ప్రతి అకాడెమీకి/హాస్టల్ కు సంబంధించిన ఎంపికలు / సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించబడును.

ఎంపిక స్థలం / వేదిక క్రొత్తగా ప్రతిపాదించ బడిన తేదీలు నిర్ధారించబడిన వయసు

1 వాలీబాల్ అకాడెమి – రాజన్న సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల, వాలీబాల్ అకాడెమి , రాజీవ్ నగర్ మినీ స్టేడియం, సిరిసిల్ల 10 జూన్ 2025 Under 14 to 16 Years
at Saroornagar & Rajanna Sircilla
(30th June 2009 to 1st July -2011)
(Under 16 to 18 years-
only at Saroor nagar)
( 1st July-2009 to 30th June 2007)

వాలీబాల్ అకాడెమి, సరూర్ నగర్
3 వాలీబాల్ అకాడెమి, (సిద్దిపేట) సిద్దిపేట, వాలీబాల్ అకాడెమి 1 జూన్ 2025 (Under 14 to 16 years) Between (30th June 2009 to 1st July -2011)
4 వాలీబాల్ అకాడెమి –మహబూబ్ నగర్ మెయిన్ స్టేడియం గ్రౌండ్ మహబూబ్ నగర్ 12, 13 జూన్ 2025 (Under 14 to 16 years) (30th June 2009 to 1st July -2011)
5 సైక్లింగ్ మరియు రెజ్లింగ్ అకాడెమి, సైక్లింగ్ వేలోడ్రోమ్,O.U., సైక్లింగ్ వేలోడ్రోమ్, O.U.,క్యాంపస్ 10 & 11 జూన్ 2025 (Under 14 to 16 years) (30th June 2009 to 1st July -2011)
6 Regional క్రీడా వసతి గృహం, హనుమకొండ
DSA, జవహర్లాల్ నెహ్రు స్టేడియం, హనుమకొండ
10 & 11 జూన్ 2025 Under10-12 Years ( for Gymnastics & Swimming ) ( 30th June 2013 to 1st July 2015) Under 14 to 16 Years ( Athletics, Handball, Wrestling) ( 30th June 2009 to 1st July 2011)
7 హాకీ అకాడెమి, వనపర్తి DSA, హాకీ అకాడెమి, వనపర్తి 12 జూన్ 2025 (Under 14 to 16years)(30th June 2009 to 1st July -2011)
8 అథ్లెటిక్స్ అకాడెమి, ఖమ్మం DSA,సర్దార్ పటేల్ స్టేడియం, ఖమ్మం 12 జూన్ 2025 (Under 14 to 16 years) (30th June 2009 to 1st July -2011)కావున,రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆసక్తిగల బాల బాలికలు పైన తెలిపిన స్పోర్ట్స్ అకాడెమీలలో మరియు స్పోర్ట్స్ హాస్టల్ లో అడ్మిషన్ పొందాలనుకొనే వారు పైన తెలిపిన తేదీలలో ఆయా సెంటర్లలో నిర్వహించే ఎంపికలకు/ సెలక్షన్ ట్రయల్స్ కు హాజరు కాగలరని జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి ఎ.రాందాస్ ఒక ప్రకటనలో తెలిపారు.

మానవ అక్రమ రవాణ నిర్ములించడం మన అందరి బాధ్యత.

మానవ అక్రమ రవాణ నిర్ములించడం మన అందరి బాధ్యత

సిరిసిల్ల టౌన్ (నేటి ధాత్రి):

రాజన్న సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని జెండర్ అండ్ ఈక్విటీ కోఆర్డినేటర్ పద్మజా మరియు క్వాలిటీ ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ శైలజ,ప్రజ్వల సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ బలరామ కృష్ణ,మనుషుల అక్రమ రవాణా నిర్ములన లో ప్రజలు అందరు భాగస్వామ్యం అయినప్పుడే దీనిని సమూలంగా నివారించవచ్చు అని ప్రజ్వల స్వచ్చంద సంస్థ మరియు రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా మండలి సంస్థ ఆధ్వర్యంలో గీతానగర్ ఉన్నత పాఠశాల నందు నిర్వహిస్తున్న రెండు రోజుల శిక్షణ కార్యక్రమంలో కోఆర్డినేటర్ లు శైలజా, పద్మజ మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా అనేది ప్రపంచం వ్యాప్తంగా అత్యంత వేగంగా విస్తరిస్తూ ఎంతో మంది అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తున్న నేరపూరితమైన చర్య. దీనికి పేద మధ్య తరగతి అమ్మాయిలు, మహిళలు ఎక్కువ గా గురి అవుతున్నారు. సమాజంలో ప్రజలతో మరియు విద్యార్థులతో సన్నిహితంగా ఉండి గమనించి వారికి అవగాహనా కల్పించాలి, ముక్యంగా పాఠశాలలో పేరెంట్స్ మీటింగ్స్ లో వారికి అవగాహనా కల్పించాలి. సైబర్ ట్రాఫికింగ్ అనేది చాలా వేగంగా విస్తరిస్తున్న జటిలమైన సమస్య కాబట్టి పిల్లలకు ఫోన్ ఉపయోగించడం ద్వారా వచ్చే నష్టాలను తెలియజేయాలి అని అన్నారు. సమాజంలో ఉన్న చాలా సమస్యలకు ఆర్థిక కారణలా తో పాటు, సామజిక కారణాలు దోహదం చేస్తాయి, మన చుట్టుపక్కల ఉండే ఇలాంటి వాళ్ళను ట్రాఫికెర్స్ టార్గెట్ చేసి, మాయమాటలు, ఉద్యోగం సినిమా అవకాశం అంటూ పట్టణాలకు తీసుకెళ్లి వ్యభిచార గృహలలో అమ్ముతున్నారు, కాబట్టి మన డిపార్ట్మెంట్ జిల్లా నుండి గ్రామ స్థాయి వరకు అందరు అవగాహనా కలిగి ఉండి, అప్రమతం చేయడం ద్వారా దీన్ని నిర్ములించవచ్చు.

బలరామ కృష్ణ మాట్లాడుతూ మానవ అక్రమ రవాణాను ఆదిలోనే అడ్డుకుంటే మన ఆడపిల్లలను రక్షించు కోవచ్చు, ప్రతి రోజు ఎంతో మంది అమ్మాయిలు మహిళలు దీని బారిన పడుతున్నారు. ముక్యంగా యువత, పిల్లలు ఆకర్షణకు గురి అయి, పట్టణాలకు వచ్చి వ్యభిచార గృహలలో అమ్మబడుతున్నారు. ప్రజ్వల సంస్థ ద్వారా ఇప్పటి వరకు 30 వేల మంది అమ్మాయిలను మహిళలను కాపాడడం జరిగింది. ఇందులో చిన్న పిల్లలు, యువతులు ఎక్కువ సంఖ్యలో ఉంటున్నారు. సైబర్ ట్రాఫికింగ్ ద్వారా ఈ అక్రమ రవాణా చాలా పెరిగి పోయింది, ముక్యంగా విద్యార్థులు అనవసరం అయినా అప్స్ ద్వారా పర్సనల్ ఫొటోస్ వీడియోస్ పంపడం ద్వారా సెక్స్ ట్రాఫికింగ్ కి గురి అవుతున్నారు. మీరు జిల్లా స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు ఉన్న మన సిబ్బంది ఈ విషయాలపై అవగాహనా పొంది ఇతరులకు అవగాహనా కల్పించాలని సూచించారు.

ఈ శిక్షణలో మానవ అక్రమ రవాణా, లైంగిక వ్యాపారం ఎలా జరుగుతుంది, బాధితురాలి పైన ఉండే ప్రభావాలు, సైబర్ అదారిత అక్రమ రవాణా, చట్టాలు BNS, ITPA, POCSO, PCMA, సఖి, భరోసా, చైల్డ్ లైన్, పోలీస్ టోల్ ఫ్రీ నంబర్స్ 1098, 100, 181, 1930, 181 ల గురించి చెప్పడం జరిగినది.ఈ శిక్షణ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్లు శైలజా , పద్మజ, ప్రజ్వల ప్రాజెక్ట్ మేనేజర్ బలరామ కృష్ణ ప్రజ్వల సిబ్బంది అసిస్టెంట్ కోఆర్డినేటర్ అంబర్ సింగ్,మరియు రాజన్న సిరిసిల్ల నుండి kGBV,Model school, ఊరు,TREIS స్కూల్ నుండి school assistant teacher పాల్గొన్నారు.

ప్రభుత్వ యునాని వైద్యశాలను సందర్శించిన.!

ప్రభుత్వ యునాని వైద్యశాలను సందర్శించిన రీజనల్ డిప్యూటీ డైరెక్టర్

నేటిధాత్రి ఐనవోలు :-

 

 

 

ఐనవోలులోని ప్రభుత్వ యునాని వైద్యశాల నీ సందర్శించిన రిజినల్ డిప్యూటీ డైరెక్టర్ వరంగల్ (RDD) డాక్టర్. ప్రమీల దేవి సందర్శించారు. జూన్ 21 న జరిగే
అంతర్జాతీయ యోగ దినోత్సవ
దశబ్ది వేడుకలు – 2025 దినోత్సవాన్ని పురస్కరించుకొని 25 రోజుల పాటు నిర్వహించేలా యోగ దశబ్ది వేడుకల ప్రణాళికను రూపొందినట్లు ఐనవోలు యునాని ఆసుపత్రి డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు.ఈ మేరకు ఆరోగ్య మందిరాలు, వైద్య సబ్బంది, అంగన్వాడీ టీచర్లు,పిల్లలు,పెద్దలు,
గురువారం సన్నాహక సమావేశం నిర్వహించారు,ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఈ ఏడాది ‘ యోగ ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్ ‘అనే నినాదంతో యోగ తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ భాను ప్రకాష్, ఫార్మాసిస్ట్ శంకర్, యోగ శిక్షకులు అర్చన, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

నిరంజన్ ఆధ్వర్యంలో గోడిశాల అరవింద్ గౌడ్.

నిరంజన్ ఆధ్వర్యంలో గోడిశాల అరవింద్ గౌడ్ చిత్రపటానికి నివాళులు

 

పరకాల నేటిధాత్రి:

 

భారతీయ జనతా పార్టీ పరకాల పట్టణ శాఖ
అధ్యక్షులు గాజుల నిరంజన్ ఆధ్వర్యంలో షహీద్ గొడిశాల అరవింద్ గౌడ్ 26వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పోశాల ఆదిత్య అరవింద్ గౌడ్ పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేశారు.ఈ కార్యక్రమంలో
అమరవీరుల సంస్కరణ పరకాల అధ్యక్షులు దేవునూరి మేఘనాథ్,మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ఆర్పీ జయంతి లాల్,చందుపట్ల రాజేందర్ రెడ్డి,మార్త రాజభద్రయ్య,దార్నా నారాయణదాసు,కుక్కల విజయ్,సంఘపురుషోత్తం,మిడిదొడ్డి నరేష్
నాగేల్లి రంజిత్,పావుశెట్టి శ్రీనివాస్,గండ్ర శ్రీనివాస్ రెడ్డి, కానుగుల గోపీనాథ్,వనం రాజు,ఆర్పీ.సంగీత,సయ్యద్ గలిఫ్,వెనిశెట్టి రాజేష్,పాలకుర్తి ప్రతాప్,రామకృష్ణ నివాళులర్పించారు.

అధికారులు మారుతున్న ఆగని కబ్జా.

శిఖం భూమి కబ్జా

సాగుచేసిన పట్టించుకోని అధికారులు

అధికారులు మారుతున్న ఆగని కబ్జా

ఎల్లారెడ్డిపేట (రాజన్న సిరిసిల్ల) నేటి ధాత్రి:

పచ్చని పంట పొలాలకు సాగునీరు అందించే ఆ చెరువు నేడు కబ్జాకు గురవుతుంది. దీంతో చెరువు పరిధిలోని పంట భూములు పచ్చని పైరులతో కళకళలాడే పరిస్థితులు క్రమంగా కనమరుగయ్యే దుస్థితి నెలకొంటుంది. రియల్ ఎస్టేట్ ప్రభావంతో భూముల ధరలు రోజు రోజుకు పెరగుతుండడంతో సులభంగా సంపాదించడానికి అలవాటు పడిన కొంతమంది దళారులు ప్రభుత్వ భూములను కూడా యధేచ్చగా కబ్జా చేస్తున్నారు. కాగా ప్రభుత్వ భూములను కాపాడడానికి చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చేష్టలుడిగి చోద్యం చూస్తున్నారనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. ఈ క్రమంలో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని గిద్ద చెరువు శిఖం భూమిని ఒక రైతు తన ఇష్టారీతిగా కబ్జా చేస్తున్నట్లు పరిసర ప్రాంతాల రైతులు ఆరోపిస్తున్నారు. చెరువులో మునిగిన పట్టా భూములు కూడా తేలిన తర్వాతనే సాగు చేసుకునే హక్కుకలిగినవి. అయితే గిద్ద చెరువు సమీపంలోని ఒక సర్వే నంబర్ లో దాదాపు 2 ఎకరాలకు పైగా చెరువు శిఖం భూమిని కబ్జా చేసి సాగు చేస్తున్నట్లు పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. శిఖం భూమి కబ్జాకు గురైందని గతంలో పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం శూన్యం.చెరువు శిఖం భూములు కబ్జాలకు గురవుతుంటే భవిష్యత్తులో చెరువులు మాయమయ్యే పరిస్థితులు సంభవిస్తాయని పలువురు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా గత కొన్ని రోజుల నుంచి మండల కేంద్రంలో చెరువు శిఖం భూమి కబ్జాకు గురవుతుండగా అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో అధికారులు ఇప్పటికైనా స్పందించి గిద్ద చెరువు కబ్జాదారుల కబందహస్తాల నుంచి కాపాడాలని రైతులు కోరుతున్నారు.

సిరిసిల్లలోని పేర్టీ నైన్ ఉచిత క్యాంపు.

సిరిసిల్లలోని పేర్టీ నైన్ ఉచిత క్యాంపు

సిరిసిల్ల టౌన్ (నేటి ధాత్రి ):

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని తారకరామ హాస్పిటల్ లో పేర్టీ నైన్ ఉచిత క్యాంపు ఏర్పాటు చేయడం జరిగినది. ఇందులో భాగంగా జిల్లాలో ఉన్న ఇతర గ్రామాల ప్రజలు అందుబాటులో ఉండే విధంగా సిరిసిల్లలో ఏర్పాటు చేయడం జరిగిందని తారకరామ హాస్పిటల్ మేనేజ్మెంట్ దొంతుల రమేష్ తెలియజేశారు. అంతేకాకుండా పేర్టీ నైన్ హాస్పిటల్ సంస్థ హైదరాబాద్ వారు పాల్గొని ఉచిత క్యాంపును విజయవంతం చేయడం జరిగినది.

డీఎస్పీని కలిసిన ఎన్హెచ్ఎరిసి బృందం.

డీఎస్పీని కలిసిన ఎన్హెచ్ఎరిసి బృందం

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ డిఎస్పీని ఎన్హెన్ఆర్సి బృందం కలవడం జరిగింది. వారికి జహీరాబాద్ నియోజకవర్గంలో విద్యార్థులు, యువకులు మాదకద్రవ్యాలకు పాల్పడకుండా, మైనర్లు టూవీలర్స్ కానీ పోర్ వీ లర్స్ వాహనాలు నడపటం జరుగుతుంది. తద్వారా రోడ్డు ప్రమాదాలు జరుగుతు న్నాయి. కావున వీటిపై దృష్టి సారించాలని కోరారు. లైసెన్స్ లేని వాహనాలు ఫిట్నెస్ లేని వాహనాలను సీజ్ చేయగలరని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్హెచ్ఐర్సి సంగారెడ్డి జిల్లా చైర్మన్ వినయ్పవర్, వారితోపాటు సంగారెడ్డి జిల్లా వైస్ చైర్మన్ విష్ణువర్దన్రెడ్డి, జిల్లా ప్రదాన కార్యదర్శి సి. వీరేందర్, న్యాల్కల్ మండల చైర్మన్ రాజనర్సింహా, ఏఐటీఎఫ్ మొగుడంపల్లి ఇంచార్జీ రవీందర్ రాథోడ్, మహేష్, ధన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

ఉర్దు రచయిత ఫారూఖీకి అరుదైన గౌవరం.

ఉర్దు రచయిత ఫారూఖీకి అరుదైన గౌవరం

జహీరాబాద్ నేటి ధాత్రి:

ప్రఖ్యాత ఉర్దూ పరిశోధకుడు, విమర్శకుడు, రచయిత, జర్నలిస్ట్, అనువాదకుడు, విద్యావేత్త, జహీరాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ముహమ్మద్ అస్లాం ఫారూఖీకి అరుదైన గౌవరం దక్కిందని ఒక ప్రకటలో ఆయన గురువారం తెలిపారు. ఆయన రాసిన పరిశోధనా వ్యాసాలను ప్రచురించిన అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన “అదాబ్ వో అదీబ్” అనే పుస్తకంను యూఎస్ఏ వాషింగ్టన్ లోని లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ కొనుగోలు చేసి, ఆ లైబ్రరీలో చేర్చారని తెలిపారు. ఈ పుస్తకం కాపీని ఆసియా రీడింగ్ రూమ్లో సిరీస్ నంబర్ 38622021 కింద లైబ్రరీలో ఆసియా రచయితల వర్గం కింద ఉంచారని తెలిపారు. లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ ఈ పుస్తకాన్ని ఎంపిక చేయడం ఏ భారతీయ, ఉర్దూ రచయితకైనా గౌరవమని పేర్కొన్నారు. ఈ పుస్తకంలో మౌల్వీ అబ్దుల్ హక్ అజీజ్ అహ్మద్ ఇబ్రహీం జలీస్, రఫియా మంజూర్-ఉల్-అమీన్ ఫిరాక్, గోరఖ్ పురి, అక్తర్-ఉల్-ఇమాన్, ఎన్. ఎం. రషీద్ అబుల్ కలాం ఆజాద్, బర్తాని యా ఉర్దూ జీవిత చరిత్ర, పరి శోధనా వ్యాసాలు ఉన్నాయని తెలిపారు. ఈ పుస్తకంతో పాటు, ఆయన రాసిన మరో మూడు పుస్తకాలు కూడా అంతర్జాతీయ కేటలాగ్లో చేర్చబడ్డాయని తెలిపారు. ఆయన రాసిన 12 పుస్తకాలు అమెజాన్ లో కూడా అందు బాటులో ఉన్నాయని పేర్కొ న్నారు. ఈ సందర్భంగా ఉర్దూ ప్రేమికులు డాక్టర్ ముహమ్మద్ నజీమ్ అలీ, డాక్టర్ అబిద్ అబ్దుల్ వాసి, డాక్టర్ వసీవుల్లా, భక్తియారీ డాక్టర్ ముహమ్మద్ అహ్సన్ ఫారూఖీ, డాక్టర్ అజీజ్ సొహైల్, సయ్యద్ ముకర్రం నియాజ్, అర్షద్ హుస్సేన్, యాహ్యాఖాన్, సజ్జాదుల్ హస్నైన్, ఇతరులు ఆయనకు అభినందనలు తెలిపారు.

మోటార్లతో పీల్చేస్తున్నారు.

మోటార్లతో పీల్చేస్తున్నారు

ఎల్లారెడ్డిపేట (రాజన్న సిరిసిల్ల) నేటి ధాత్రి:

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని గిద్ద చెరువు ఆయకట్టు వద్ద చెరువులో నుండి మోటార్ల ద్వారా పొలాలకు నీటిని అక్రమంగా వాడుతున్నారు. చెరువులో నుండి నీటిని మోటార్ల ద్వారా వాడడం చట్టరీత్యా నేరం అయినా కూడా కొందరు వ్యక్తులు చట్టాలను పట్టించుకోకుండా ఇష్టానురీతిలో చెరువు నుండి మోటార్ల ద్వారా నీటిని పొలాలకు వాడుతున్నారు. అధికారులకు ఈ విషయం తెలిపిన మౌనంగా ఉంటున్నారని గిద్ద చెరువు నీటి వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు నీటిని వినియోగిస్తున్న వ్యక్తులకు సన్నిహిత సంబంధాల వల్ల పట్టించుకోవట్లేదని ఆరోపిస్తున్నారు. చెరువు నీటిని నమ్ముకొన్న రైతులు చెరువు అడుగంటి పోతే మా పొలాలకు నీరు ఎలా అందుతుందని తమ గోడు వెల్లబోసుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు మోటార్లను సీజ్ చేసి, మోటార్లను వినియోగించిన వారిపైన చర్యలు తీసుకోవాలని నీటి వినియోగదారులు కోరుకుంటున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version