ఘనంగా మంత్రి శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు.

ఘనంగా మంత్రి శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు

భూపాలపల్లి నేటిధాత్రి:

టేకుమట్ల మండల కేంద్రంలో
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్.ఆధ్వర్యంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి,దుద్దిళ్ళ శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సతీష్ గౌడ్,కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సతీష్ గౌడ్ మాట్లాడుతూ,మృదుస్వభావి, తన తండ్రి ఆశయ సాధన కోసం పరితపించే నాయకుడు,కక్ష సాధింపు రాజకీయాలు చేయకుండా,ప్రజాసేవ లక్ష్యoగా కొన్ని దశాబ్దాలుగా ప్రజా సేవ చేస్తున్న దుదిల్ల కుటుంబం.మంత్రి శ్రీధర్ బాబు భవిష్యత్తులో తన సేవలను మరింత విస్తరింప చేస్తూ రాజకీయంగా ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షిస్తూ మనస్పూర్తిగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో.జిల్లా మండల నాయకులు యువజన కాంగ్రెస్ జిల్లా మండల నాయకులు.గ్రామ శాఖ అధ్యక్షులు.సోషల్ మీడియా కోఆర్డినేటర్.కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఆర్మీ జవాన్ ను సన్మానించి ఫర్టిలైజర్ యాజమాన్యం.

ఆర్మీ జవాన్ ను సన్మానించి ఫర్టిలైజర్ యాజమాన్యం

కేసముద్రం/ నేటి దాత్రి

 

 

 

 

సబ్ స్టేషన్ తండా వాస్తవ్యులు మలోత్ రాజు ఇటీవల జరిగిన
పాకిస్తాన్ మరియు ఇండియ సిందూరు ఆపరేషన్ యుద్ధంలో
కేసముద్రం మున్సిపాలిటీ పరిది లోని సబ్ స్టేషన్ తండా కూ చెందిన మలోత్ రాజు పాల్గొనడం గర్వకారణమని, అగ్రోస్ రైతు సేవ కేంద్రం దన్నసరి క్రాస్ రోఢ్ యజమానులు ధారావత్ రాజు వారిని శాలువాతో సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఈజీఎస్ కేసముద్రం మండల అధ్యక్షులు ననబల రమేష్ ఏఎంసి కేసముద్రం మాజీ డైరెక్టర్ ధారావత్ రమారవిందర్ నాయక్,
బనోత్ నాగ ,మాలోత్ బాలాజీ, బానోత్ రాజు, బనోత్ సురేష్, బానోత్ వీరన్న తదితరులు పాల్గోన్నారు

పంచాయితీ కార్యదర్శులకు పలు సూచనలు.

పంచాయితీ కార్యదర్శులకు పలు సూచనలు

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా)నేటిధాత్రి:

 

భద్రాద్రి కొత్తగూడెం ముఖ్య కార్య నిర్వహణాధి కారి నాగలక్ష్మి మండల ప్రజా పరిషత్ గుండాల ను శుక్రవారం సందర్శిం చారు.అనంతరం గుండాల గ్రామములోని వేపలగడ్డ గ్రామం నందు మెయిన్ రోడ్డు ప్రక్కన ఇంకుడు గుంతను పరిశీలించారు. గుండాల గ్రామ పంచాయతి లోని నర్సరి ని సందర్శించి పంచాయతీ కార్య దర్శులకు పలు సూచనలు జారీ చేశారు. అందరూ పంచాయతి కార్య దర్శుల తో ఈజిఎస్. సిబ్బంది తో సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశములో ఈజిఎస్,ఎఫ్టీఓ ల జనరేషన్ లో 100 శాతము సాదించాలని సూచించారు. వర్షాకాలంలో నీరు వృధాగా పోకుండా ఇంకుడు గుంతలు ప్రతి గ్రామ పంచాయతి లో ని గ్రామాలకు విరివిగా నిర్మించి అందరూ భూగర్భ జలాలను పెంచాలని సూచించారు.

ప్రభుత్వ పథకాలపై మంత్రుల సమీక్ష.

ప్రభుత్వ పథకాలపై మంత్రుల సమీక్ష

మహబూబ్ నగర్/నేటి ధాత్రి

 

 

 

 

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం, జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఐడిఓసి సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అధ్యక్షతన మహబూబ్ నగర్ మరియు నారాయణపేట జిల్లాల అధికారులతో వ్యవసాయ కార్యాచరణ వడ్ల కొనుగోలు, సీజనల్ అంటు వ్యాధులు, భూభారతి రెవెన్యూ సదస్సులు, ఇందిరమ్మ ఇండ్లు మరియు రాజీవ్ యువ వికాసం పథకాల అమలుపై గౌరవనీయులు జిల్లా ఇన్చార్జి మంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, శ్రీ దామోదర్ రాజనర్సింహ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ, సాంస్కృతిక మరియు పురావస్తు శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు సమీక్ష నిర్వహించారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మంత్రులతో కలిసి సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. అంతకుముందు జిల్లాకు వచ్చిన ఇంచార్జీ మంత్రివర్యులు శ్రీ దామోదర రాజనర్సింహ గారికి శాలువా కప్పి పుష్పగుచ్చం అందించి ఘనంగా స్వాగతం పలికారు.

 

MLA Yennam Srinivas Reddy

 

ఈ కార్యక్రమంలో నారాయణ పేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి జడ్చర్ల ఎమ్మెల్యే శ్రీ జనంపల్లి అనిరుద్ రెడ్డి, డాక్టర్ పర్ణికా రెడ్డి, మక్తల్ శాసనసభ్యులు శ్రీ వాకిటి శ్రీహరి, నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ గారు అధికారులు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, అదనపు కలెక్టర్ మోహన్ రావు , మూడ చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, గ్రంథాలయ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి జిల్లాలోని అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేయాలి.

రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేయాలి

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు.

రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహణకు చేయాల్సిన ఏర్పాట్లుకు సంబంధించి శుక్రవారం ఐడిఓసి కార్యాలయ సమావేశపు హాలులో అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ సమాచార, డిఆర్డీఏ, సంక్షేమ, అటవీ, ఉద్యాన, వ్యవసాయ తదితర శాఖలు స్టాల్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
అమరవీరుల స్తూపం, డా బిఆర్ అంబేద్కర్, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలను పూలతో అందంగా ముస్తాబు చేయాలని సూచించారు. వేడుకలకు సంబంధించి ప్రోటోకాల్ పాటిస్తూ అతిధులు కూర్చోడానికి షామియానాలు, కుర్చీలు, సురక్షిత మంచినీరు ఏర్పాటు చేయాలని సూచించారు. ఉద్యాన, ఆర్ అండ్ బి శాఖల అధికారులు స్టేజ్ ఏర్పాట్లు చేయాలన్నారు, జిల్లా ప్రగతి సందేశాన్ని తయారు చేయాలని డిపిఆర్వోను ఆదేశించారు. అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా విద్యార్థినీ, విద్యార్థులతో పాటు తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల చే సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని డిపిఆర్వో ను, డీఈఓను కలెక్టర్ ఆదేశించారు. వేడుకల సందర్భంగా అంబులెన్సులు, అత్యవసర వైద్య కేంద్రం, అగ్నిమాపక వాహనం అందుబాటులో ఉంచాలని అన్నారు. మైదానంలో పారిశుద్ధ్య.కార్యక్రమాలు నిర్వహించి పరిశుభ్రం చేయాలని మున్సిపల్ కమీషనర్ ను ఆదేశించారు. వేడుకలకు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఆర్డిఓ కార్యక్రమాలు ఆసాంతం పర్యవేక్షణ చేయాలని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో అటవీశాఖ అధికారి నవీన్ రెడ్డి, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఆర్డిఓ రవి, అన్ని శాఖల అధికారులు
తదితరులు పాల్గొన్నారు.

సిపిఐ పట్టణ మూడో మహాసభలను జయప్రదం చేయండి.

సిపిఐ పట్టణ మూడో మహాసభలను జయప్రదం చేయండి..

పట్టణ కార్యదర్శి మిట్టపెల్లి శ్రీనివాస్

రామకృష్ణాపూర్ నేటిధాత్రి:

రామకృష్ణాపూర్ సిపిఐ పార్టీ కార్యాలయం లో శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి పట్టణ కార్యదర్శి మిట్టపెల్లి శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఇప్పకాయాల లింగయ్య, జిల్లా సమితి సభ్యులు వనం సత్యనారాయణ లు హాజరై మాట్లాడారు. సిపిఐ పట్టణ మూడో మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. మున్సిపాలిటీలోని 22 బస్తి శాఖల సమావేశాలు నిర్వహించి అన్నీ బస్తి శాఖల నూతన కమిటీ లను ఎంపిక చేయడం జరిగిందని అన్నారు.ఈ కమిటీ మూడు సంవత్సరాలు కొనసాగుతుందన్నారు. జూన్ 1 న జరిగే పట్టణ మహాసభలో పట్టణ కమిటీ నీ ఎన్నుకోవడం జరుగుతుందన్నారు.1925 డిసెంబర్ 26న కాన్పూర్ లో ఆవిర్భవించినటువంటి కమ్యూనిస్టు పార్టీ నాటి నుండి నేటి వరకు బడుగు బలహీన వర్గాల పేద ప్రజల కార్మిక కర్షకుల కోసం ఎన్నో ఉద్యమాలు చేసి అనేక హక్కులు సాధించింది అని గుర్తు చేశారు.ఈ మహాసభలకు ముఖ్య అతిథిలుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవెన శంకర్, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వాసిరెడ్డి సీతారామయ్య సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ లు పాల్గొంటారని తెలిపారు.ఈ కార్యక్రమంలో మిట్టపల్లి పౌలు, పెర్క సంపత్, పెండ్యాల కమలమ్మ, గాజుల మణెమ్మ, మరపెల్లి రవి, కుక్క దేవానంద్, గోడిసెల గురవయ్య, ఎగుడ మొండి, మాదాస్ శంకర్, షేకీర్, కౌడగని సాంబయ్య తదితరులు పాల్గోన్నారు.

అక్రమ ఇసుక డంపులు విక్రయాలు.

అక్రమ ఇసుక డంపులు విక్రయాలు

పగలు రాత్రి జోరుగా నడుస్తున్న ఇసుక దందాలు

అధికారుల పట్టింపు లేకనే జోరందుకున్న జీరో ఇసుక దందాలు

గోదావరి ఇసుక చాటున ఏటి ఇసుక దందాలు

కేసముద్రం నేటి ధాత్రి:

 

రోజురోజుకు పెరిగిపోతున్న ఇస్కాసురుల ఆగడాలు అంతా కాదు ప్రతిరోజు రాత్రి పగలు అనే తేడా లేకుండా ఏటి ఇసుక అక్రమంగా రవాణా చేస్తూ లక్షల్లో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. కేసముద్రం మండల పరిసర ప్రాంతాలలో ఉన్న వాగుల లో లభ్యమయ్యే ఇసుకను రాత్రి పగలు అని తేడా లేకుండా అక్రమంగా ఇసుక తరలించడమే కాకుండా చుట్టుపక్కల మండలాలలోని ఏటి ఇసుకను అక్రమంగా తరలిస్తూ లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారని ప్రజలు మండిపడుతున్నారు. ఒక సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే ఒక ఇసుక ట్రాక్టర్ 5000 వేలు మరియు ప్రభుత్వ చాలా నుకు డబ్బులు కడితేనే ఇసుక ఇంటి ముందరికి వస్తుంది మరి ఇసుకసురులు ఏ ప్రభుత్వ కార్యాలయానికి పన్ను చెల్లించకుండా ఇంత భారీగా అక్రమం ఇసుక రవాణా జరుగుతున్న సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇసుక లభ్యం అయ్యే ఏరు కానీ వాగు కానీ ప్రాంతాలలో సంబంధిత కార్యాలయ సిబ్బందికి ముడుపులు చెల్లిస్తూ అక్రమ ఇసుక రావణా చేస్తున్నారని పలువురు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. కొంతమంది ప్రత్యేకంగా ఇసుక దందాల కోసం ట్రాక్టర్లను కొనుగోలు చేస్తున్నారని ప్రభుత్వ ఆర్టిఏ నిబంధనలు పాటించకుండా నెంబర్ ప్లేట్లు లేకుండా ప్రభుత్వ ఆర్టిఏ నిబంధనలు తుంగలో తొక్కుతూ లైసెన్స్ లేని డ్రైవర్లను నియమిస్తూ దందాలు చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి, ఇసుక దందాలు మూడు పూలు ఆరు కాయలు కన్నా ఎక్కువ లాభసాటిగా ఉండడంతో రాత్రి పగలు అని తేడా లేకుండా పట్ట పగలు కూడా రవాణా చేస్తున్నారంటే వీరికి ఎవరి అండదండలు లేనిదే చేయరు అని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ మైనింగ్ అధికారులు ఇసుక మాఫియాకు అడ్డుకట్టు వేయాలని ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నందున ఇకనైనా అధికారులు స్పందించి ఇలాంటి ఇసుక సురుల ఆగడాలకు అడ్డుకట్టు వేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.

రోడ్ల విస్తరణ జరుగుతుంది యజమానులు సహకరించాలి ఎమ్మెల్యే కలెక్టర్.

వనపర్తి లో రోడ్ల విస్తరణ జరుగుతుంది యజమానులు సహకరించాలి ఎమ్మెల్యే కలెక్టర్

వనపర్తి నేటిధాత్రి :

 

 

 

వనపర్తి పట్టణము అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రోడ్డు విస్తరణకు సహకరించాలని ఎమ్మెల్యే తూడి మెఘా రెడ్డి కోరారు
రోడ్డు విస్తరణలో స్థలాలు కోల్పోతున్న వ్యాపార సంస్థల యజమానులతో శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి నిర్వహించిన సమావేశానికి ఎమ్మెల్యే పాల్గొన్నారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేగారెడ్డి మాట్లాడుతూ వనపర్తి పట్టణం నుంచి పెబ్బేరు రహదారి పానగల్ రహదారి విస్తరణకు సంబంధించి వ్యాపారస్తులను ఇళ్ల యజమానులను ఇబ్బంది పెట్టి రోడ్డు విస్తరణ చేపట్టదలుచుకోలేదని.

రోడ్డు విస్తరణను యజమానులను ఒప్పించి తగిన నష్ట పరిహారం ఇచ్చి విస్తరణ మాత్రం తప్పకుండా జరుగుతుందన్నారు.

పానగల్ రోడ్డు విస్తరణలో ఇల్లు కోల్పోతున్న వారికి డబుల్ బెడ్ రూమ్ కేటాయించడం లేదా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం వంటి సహాయక చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారుపట్టణంలోని ప్రధాన రహదారి వనపర్తి -పెబ్బేరు రోడ్డు విస్తరణ అనేది భావి తరాలకు, వనపర్తి గౌరవాన్ని కాపాడటానికి చాలా ముఖ్యమని అందువల్ల వ్యాపారస్తులు రోడ్డు విస్తరణకు సహకరించాలని కోరారు
వనపర్తికి ఎంతో ఘనమైన చరిత్ర ఉందని, ఎక్కడ లేనివిధంగా సైఫాన్ డ్యామ్, చారిత్రాత్మక పాలిటెక్నిక్ కళాశాల ఇక్కడే ఉన్నాయన్నారు రోడ్డు ఎన్ని ఫీట్లలో ఉండాలి అనేది ఇప్పటికే టౌన్ ప్లానింగ్ ద్వారా రూపొందించిన ప్రణాళికకు అనుగుణంగా ఒకటి రెండు రోజుల్లో జిల్లా కలెక్టర్ తో చర్చించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు.

రోడ్డు ఒకే ప్లాట్ ఫాం పద్ధతిలో వంకరలు లేకుండా అలన్మెంట్ ఉంటుందన్నారు.జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ గత పదేళ్లలో వనపర్తి పట్టణ జనాభా రెండింతలు అయ్యాయని, రాబోయే రోజుల్లో నాలుగింతలు కావచ్చన్నారు.

జనాభాకు భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా రోడ్లు ఉండాలని అన్నారు పట్టణాల్లో కనీసం వంద ఫీట్ల రోడ్డు ఉండాలని,అప్పుడే పట్టణం అభివృద్ధి చెంది వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయన్నారు.

ప్రతి పట్టణానికి ఒక మాస్టర్ ప్లాన్ ఉంటుందని, వనపర్తి పట్టణానికి 2000 సంవత్సరంలోనే ప్లాన్ తయారు చేసి 100 ఫీట్ల రోడ్డు ప్రతిపాదించడం జరిగిందన్నారు.

రోడ్డు విస్తరణ ప్రజలకు చాలా అవసరమని, విస్తరణ వల్ల ఎక్కువ లాభం రోడ్డు పక్కన ఉన్న వ్యాపారస్తులకు కలుగుతుందన్నారు.

కొంత స్థలం కోల్పోతున్న వారికి టి.డి.ఆర్ ఇవ్వడం, పూర్తిగా స్థలం కోల్పోయే వారికి నష్ట పరిహారం ఇవ్వడం జరుగుతుందన్నారు
రోడ్డు విస్తరణలో స్థలాలు కోల్పోతున్న వారికి ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం టి.డి.ఆర్ తీసుకోవడం చాలా లాభదాయకమని వ్యాపారస్తులకు అవగాహన కల్పించారు.

భవిష్యత్తులో డెవలపర్స్ కు అమ్ముకొని నాలుగింతల లాభం పొందవచ్చు అన్నారు.

రోడ్డు విస్తరణలో స్థలాలు కోల్పోతున్న యజమానులు వారి వాదనలు, అభ్యర్థనలు తెలిపారు.

ముందుగా రోడ్డు మధ్యభాగం ఎక్కడి నుంచి కొలతలు చేస్తారో నిర్ణయించాలని అదేవిధంగా రోడ్డు విస్తరణ వంద ఫీట్లు కాకుండా 70 నుంచి 80 ఫీట్ల కు కుదించాలని కోరారు. వ్యాపారస్తుల తరపున అడ్వకేట్ నిరంజన్ పాషా తమ వాదనలు వినిపించారు.
అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఇన్చార్జి యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లుమార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, తహసిల్దార్ రమేష్ రెడ్డి, వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు .

మంచిర్యాల జిల్లాలో పర్యటించిన ఎమ్మెల్సీ కవిత.

మంచిర్యాల జిల్లాలో పర్యటించిన ఎమ్మెల్సీ కవిత

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

 

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత శుక్రవారం మంచిర్యాల జిల్లాలో పర్యటించారు. శ్రీరాంపూర్ బస్టాండ్ లోని సింగరేణి కార్మికుని విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.అనంతరం తీగల్ పహాడ్ లోని జాగృతి కార్యకర్తలు కందుల ప్రశాంత్, నస్పూర్ తోళ్లవాగు సమీపంలోని శశి ఇళ్లకు వెళ్లారు.గౌతమి నగర్ లో ఇటీవల అనారోగ్యంతో మరణించిన జర్నలిస్టు మునీర్ కుటుం బాన్ని పరామర్శించారు.అదేవిధంగా లక్షేట్ పెట్,పట్టణములో జాగృతి సోషల్ మీడియా కార్యకర్త నిశా,ఇంటికి వెళ్లడం జరిగింది.ఈ పర్యటనలో ఎమ్మెల్సీ కవితతో పాటు తన అనుచరులు కూడా ఉన్నారు.

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో డ్రై డే కార్యక్రమం.

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో డ్రై డే కార్యక్రమం

సిరిసిల్ల టౌన్: (నేటి ధాత్రి)

 

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రజిత ఆకస్మిక తనిఖీల్లో భాగంగా డెంగ్యూ,మలేరియా జ్వరాల నివారణలో భాగంగా డ్రై డే కార్యక్రమంలో పాల్గొని (డ్రము )తొట్టి లలో లార్వా లు గల నీటి ని తొలగించడం, టైర్లు, కూలర్లు, రోళ్ళు గల లార్వాలను తొలగించడం, నీటి నిల్వలు గల ప్రాంతాలను గుర్తించి పూడ్చి వేయడం, డ్రైనేజ్ లలో నీరు నిల్వ ఉండకుండా, రోడ్లపై చెత్త చెదారము నిల్వ ఉండకుండా, ఇంటి చుట్టూ పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ వ్యక్తిగత పరిశుభ్రత లో భాగంగా తరచుగా చేతులు శుభ్రపరచుకోవడం, గుంపులలో, ప్రయాణ సమయంలో మాస్కులు ధరించడం ద్వారా వర్షాకాలంలో వచ్చే వైరల్ జ్వరాలు నివారించవచ్చునని

Program Officer Dr. Anitha,

ఈ సందర్భంగా సిబ్బందికి, ప్రజలకు అవగాహన కల్పించినారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అనిత, మలేరియా సూపర్వైజర్ లింగం, వాణి మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

కిష్టాపూర్ గ్రామంలో బడిబాట చేపట్టిన మండల అధికారులు.

కిష్టాపూర్ గ్రామంలో బడిబాట చేపట్టిన మండల అధికారులు

జైపూర్,నేటి ధాత్రి:

 

 

 

 

కిష్టాపూర్ గ్రామపంచాయతీలో శుక్రవారం బడిబాట చేపట్టిన అధికారులు.స్కూలు వెళ్లే పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే విధంగా తల్లిదండ్రులకు ప్రభుత్వం కల్పి పిస్తున్న సౌకర్యాలను అవకాశాలను తెలియజేస్తూ నాణ్యమైన విద్య పిల్లలకి అందించాలని తల్లిదండ్రులు ఆర్థిక భారానికి లోను కాకూడదని ప్రభుత్వ పాఠశాలలో చేరే విధంగా విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించారు.అలాగే గ్రామపంచాయతీలోని తాగునీటి సమస్యల పరిష్కారానికి గ్రామంలో తిరిగి సమస్యలను గుర్తించి పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని గ్రామపంచాయతీ కార్యదర్శికి ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్,ఎంపీఓ,శ్రీపతి బాపురావు, ఇరిగేషన్ డిఈ విద్యాసాగర్ రావు,పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్,కిష్టాపూర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమణారెడ్డి,ఉపాధ్యాయులు కవిత,రజిత,అంగన్వాడీ మరియు గ్రామపంచాయతీ సిబ్బంది,గ్రామస్తులు పాల్గొనడం జరిగింది.

చివరి శ్వాస వరకు ప్రజలకు సేవ చేస్తాను.

చివరి శ్వాస వరకు చొప్పదండి నియోజకవర్గం ప్రజలకు సేవ చేస్తాను

అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు అందజేస్తాం

పేదవారి సొంత ఇంటి కలలు నెరవేర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించింది

రాష్ట్రంలో 99 శాతం మందికి రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుంది

రూ. 43 కోట్లతో నారాయణపూర్ రిజర్వాయర్ పెండింగ్ పనులు పూర్తి చేస్తాము

గంగాధర మండలంలోని 33 గ్రామాలకు చెందిన 721 మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ ప్రమేలా సత్పతితో కలిసి మంజూరి పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

గంగాధర నేటిధాత్రి:

 

 

 

 

 

పేదవారి సొంతింటి కలను నిజం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించింది.

ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా, ఒక్క గంగాధర మండలంలోనే 721 మంది అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశాము.

721 మందికే కాదు, చొప్పదండి నియోజకవర్గం లోని అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరి చేయడానికి కృషి చేస్తాము.

గత బిఆర్ఎస్ ప్రభుత్వం హాయంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలకే సంక్షేమ పథకాలు అందజేశారు.

రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చూస్తాము.

సంక్షేమ పథకాల పేరుతో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎవరైనా మామూలు అడిగితే మా దృష్టికి తీసుకురండి, లేదా పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేయండి.

సంక్షేమ పథకాలు అందించడంలో అవినీతికి తావు లేదు.

మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం.

జ్యోతి పథకంతో 200 మీట్ల వరకు ఉచిత విద్యుత్ను అందజేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం.

గత బిఆర్ఎస్ ప్రభుత్వం రైతులను అరిగోస పెట్టింది.

కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యం 44 కిలోల వరకు తూకం వేసి రైతులను నిండా ముంచింది.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ గ్రామ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కటింగ్ లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తోంది.

తెలంగాణ రాష్ట్రంలో 21 వేల కోట్ల రుణమాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం.

గంగాధర మండలంలో 2018 లో బిఆర్ఎస్ ప్రభుత్వం 2483 మంది రైతులకు రూ.17 కోట్ల 82 లక్షల రుణమాఫీ చేస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 5744 మంది రైతులకు రూ. 48 కోట్ల రుణమాఫీ చేసింది.

బిఆర్ఎస్, బిజెపి పార్టీల నాయకులు రుణమాఫీ కాలేదని ప్రజలను మభ్యపెడుతున్నారు. 20 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న నారాయణపూర్ రిజర్వాయర్ పెండింగ్ పనులను పూర్తి చేయడానికి రూ.43 కోట్లతో పూర్తి చేయబోతున్నాము.

గత బిఆర్ఎస్ ప్రభుత్వం లోని ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రారంభించి వదిలేసిన ఓటీల నిర్మాణాల పనులను పూర్తి చేయిస్తున్నాం.

నియోజకవర్గంలోని సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ పనులను పూర్తి చేసి కోనసీమగా మార్చుతాము. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 56 వేల ఉద్యోగాలను భర్తీ చేసింది.

కుల మతాలతో సంబంధం లేకుండా విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో ప్రతి నియోజకవర్గంలో రూ. 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది.

అతి త్వరలోనే గంగాధర మండలంలో డిగ్రీ కళాశాలను  ప్రారంభిస్తాము.

ప్రభుత్వ అనుమతి పొందిన విత్తనాలనే విక్రయించాలి.

ప్రభుత్వ అనుమతి పొందిన విత్తనాలనే విక్రయించాలి

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

 

 

కేసముద్రం మండలంలోని పలు విత్తన దుకాణాలను కేసముద్రం మండల టాస్క్ఫోర్స్ టీం మండల వ్యవసాయ అధికారి కేసముద్రం మరియు స్టేషన్ హౌస్ ఆఫీసర్ కేసముద్రం వారు తనిఖీ చేయడం జరిగింది, పలు దుకాణంలో ఉన్నటువంటి వివిధ రకాల కంపెనీ విత్తనాలు, స్టాక్ రిజిస్టర్లు,బిల్ బుక్కులు,ఇన్వైసులు లైసెన్సులు, స్టార్ బోర్డు, గోదామును తనిఖీ చేయడం జరిగింది, వారు మాట్లాడుతూ

 

House Officer Muralidhar Raj

 

డీలర్లు విత్తన చట్టం 1966 ప్రకారం వారి యొక్క క్రయవిక్రయాలు జరుపుకోవాలని, ప్రతి రైతుకు విధిగా బిల్లులు ఇవ్వాలని, ప్రభుత్వం అనుమతి పొందిన విత్తనాలను మాత్రమే రైతులకు అమ్మాలని వారు సూచించారు, రైతులకు కనిపించే విధంగా, లైసెన్సులు,స్టాక్ బోర్డు, మైంటైన్ చేయాలని వారు, సూచించారు, ఎవరైనా డీలర్లు నకిలీ విత్తనాలు అమ్మినట్లు తెలిస్తే, విత్తన చట్టం 1966 ప్రకారం చర్యలు తీసుకుంటామని వారు సూచించారు.
ఈ కార్యక్రమంలో కేసముద్రం మండల స్టేషన్ హౌస్ ఆఫీసర్ మురళీధర్ రాజ్ మండల వ్యవసాధికారి బి వెంకన్న, పోలీస్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

పోత్కపల్లి పోలీస్‌ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసినా డిసిపి.

పోత్కపల్లి పోలీస్‌ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసినా డిసిపి

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

ఓదెల మండలం పోత్కపల్లి పోలీస్ స్టేషన్ ను పెద్దపల్లి డిసిపి కరుణాకర్ ఆకస్మికంగా తనిఖీ చేసారు.పోలీస్ స్టేషన్ ఆకస్మికంగా తనిఖీ సందర్భంగా డిసిపి గారు ముందుగా పోలీస్‌ స్టేషన్‌ పరిసరాలు, వివిధ కేసులలో సిజ్ చేసిన వాహనాలను పరిశీలించి అనంతరం రిసెప్షన్ సిబ్బందిని అడిగి పిర్యాదుల వివరాలు అడిగి తెలుసుకొన్నారు.పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులతో మర్యాదగా ప్రవర్తించి వారి సమస్యను తెలుసుకొని వారికీ భరోసా నమ్మకం కల్పించాలని చట్టపరిధిలో సమస్య పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు.స్టేషన్‌ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీస్‌ అధికారులు,సిబ్బంది వివరాలను డిసిపి ఎస్ఐ దీకొండ రమేష్ ను అడిగి తెలుసుకొవడంతో పాటు, స్టేషన్‌ పరిధిలో అత్యధికంగా ఎలాంటి నేరాలు నమోదవుతాయి,సమస్యత్మక గ్రామాల, సరిహద్దు ప్రాంత వివరాలు, రౌడీ షీటర్లు, ట్రబుల్ మాంగర్స్, అనుమానితులు వారి ప్రస్తుత స్థితి గతులను సంబంధిత ఎస్‌ఐని అడిగి తెలిసుకోవడంతో పాటు స్టేషన్‌వారిగా బ్లూకోల్ట్స్‌ సిబ్బంది పనితీరుతో పాటు, వారు విధులు నిర్వహించే సమయాలను అడిగి తెలుసుకున్నారు.గంజాయితో పాటు ఇతర మత్తు పదార్థాలకు సంబంధించి అక్రమ రవాణా, సరఫరా, నిల్వ, సేవించే వారిపై స్టేషన్‌ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి మత్తు పదార్థాల నియంత్రణకై నిరంతరం పనిచేయాలని నేరాల నియంత్రణకై విజుబుల్‌ పోలీసింగ్‌ అవసరమని, నిరంతం పోలీసులు పెట్రొలింగ్‌ నిర్వహించాలని డిసిపి అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్దపెల్లి ఏసిపి జి కృష్ణ,ఎస్ఐ దీకొండ రమేష్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసిన విద్యాధికారి.

పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసిన విద్యాధికారి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

ఝరాసంగం మండల కేంద్రంలోని ఎంఈఓ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, కిట్లు పంపిణీ చేశారు. ఎంఈఓ శ్రీనివాస్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్‌ బుక్స్‌ మండలంలోని 57 పాఠశాలల విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ ప్రైవేట్‌ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడం జరుగుతోందని, విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల ను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలన్నారు. విద్యా కోసం ఎంత ఖర్చు అయినా ప్రభుత్వం భరిస్తుందన్నారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచి, ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు.
మండలంలోని 2663 విద్యార్థుల నిమిత్తం మొదటి విడత పాఠ్య పుస్తకాల పంపిణీ ఝరాసంగం మండలంలోని అన్ని పాఠశాలలకు మొదటి విడత 12,517 పుస్తకాలు మండల వనరుల కేంద్రానికి రావడం జరిగింది ఈకార్యక్రమంలో ఎం ఆర్ సి సిబ్బంది శివ సి.ర్.పి.రాజు షైక్ షఫీవుద్దీన్ లక్ష్మీ ఉపాధ్యాయులు మెదపల్లి ఎల్గోయి నగేష్ శివ చందర్ పాల్గొన్నారు.

యాదవులందరూ సుభిక్షంగా ఉండాలి.

యాదవులందరూ సుభిక్షంగా ఉండాలి.

#గొర్ల మందపై గాబు పట్టిన గావోచ్చోళ్ళు.

#కుల పెద్దమనిషి బత్తిని మహేష్.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

 

 

యాదవ కుల ఆచారంలో భాగంగా గొర్ల మందపై గాబు పట్టే కార్యక్రమాన్ని మండల కేంద్రంలో కుల పెద్దమనిషి బత్తిని మహేష్ ఆధ్వర్యంలో పెద్ద బోయిన కొమురయ్య వ్యవసాయ క్షేత్రంలో యాదవ కులదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం గొర్రెను గాపు పట్టి ఆచారంలో భాగంగా బలి కార్యక్రమాన్ని చేశారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ ప్రతి యాదవ కుటుంబం సుభిక్షంగా సుఖశాంతులతో అందరూ క్షేమంగా ఉండాలని అదేవిధంగా గ్రామ ప్రజలు కూడా పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని.

Bathini Mahesh.

 

గొల్ల కులమ గావోచ్చోళ్ళు యాదవ కులదైవలను కొలుస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించడం చాలా సంతోషకరం. ఆ దేవతల ఆశీర్వాదంతో అందరూ సుభిక్షంగా ఉండాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గొర్ల కాపర్లు భాష బోయిన సమ్మయ్య, మూటికే కట్టయ్య, వేల్పుల కృష్ణ, కుంట మల్లయ్య, నాన బోయిన పుల్లయ్య, గావచ్చోళ్ళు కిన్నెర వీరమల్లు, యాకమల్లు, భాస్కర్, నరేష్, నవీన్, ఐలయ్య, యాకమ్మ, హైమ, ప్రశాంత్, కుల పెద్దలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

పర్యావరణపై విద్యార్థులకు ఆన్లైన్ పోటీలు.

పర్యావరణపై విద్యార్థులకు ఆన్లైన్ పోటీలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పర్యావరణంపై ఆన్లైన్ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. 6, 7 తరగతులు జూనియర్, 8, 9, 10 విద్యార్థులు సీనియర్ విభాగంలో పెయింటింగ్, వ్యాసరచన రాసి 63090 07828 నెంబర్ కు వాట్సప్ ద్వారా జూన్ 3 లోపు పంపాలని పేర్కొన్నారు. విద్యార్థి పేరు, తరగతి, పాఠశాల, ఫోన్ నెంబర్, గ్రామం తప్పనిసరిగా రాయాలన్నారు.

పట్టించిన వారికి పారితోషికం..

పట్టించిన వారికి పారితోషికం..

మంగపేట నేటిధాత్రి

 

 

 

 

కమలాపురం గ్రామానికి చెందిన
రాంపూరీ రాజేష్ @ ఎంపురం రాజేష్ తండ్రి కొట్టేన్న @ పొట్టెన్న కమలాపురం ఒక కేసు లో నిందితుడిగా ఉండి కోర్టు కు హాజరుకాకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. ఇతని ఆచూకీ తెలిసినచో 8712670092,8712670093కి తెలపగలరు అని వారికి తగిన పారితోషకం తో పాటు వారి వివరాలు గోప్యంగా ఉంటాయని ఎస్సై సూరి ఒక ప్రకటనలో తెలిపారు.

మక్తల్ ఎమ్మెల్యే వాహనానికి ప్రమాదం.

మక్తల్ ఎమ్మెల్యే వాహనానికి ప్రమాదం

ఎమ్మెల్యే శ్రీహరి కారును ఢీకొన్న మరో కారు

తృటిలో తప్పిన ప్రమాదం

మహబూబ్ నగర్ /నేటి ధాత్రి

 

 

 

 

మహబూబ్ నగర్ జిల్లా మక్తల్
ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి కు ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుండి మహబూబ్ నగర్ వైపుతో వెళ్తున్న TG 38. 6669 నెంబర్ గల ఇన్నోవా కారును పక్కన నుండి వస్తున్న ఐ 20 కారు వేగంగా ఢీకొట్టింది. షాద్ నగర్ రాయికల్ టోల్ ప్లాజా వద్ద ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో ఎమ్మెల్యే కారుకు స్వల్పంగా ధ్వంసం కాగా ఎవ్వరికి ఎలాంటి గాయాలు కాలేదనీ ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

లబ్ధిదారులకు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రనాయక్.

మరిపెడ నేటిధాత్రి.

 

 

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని ఆడిటోరియంలో హాల్లో ఈ రోజు వివిధ సంక్షేమ కార్యక్రమం లో భాగంగా నిర్వహించిన సభలో ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్,డోర్నకల్ శాసనసభ్యులు డా. రామచంద్రు నాయక్ హాజరై, పలు పథకాలు లబ్ధిదారులకు నేరుగా పంపిణీ చేశారు,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వలన సామాన్య ప్రజలకు గణనీయమైన మేలు జరుగుతుందన్నారు,ప్రతి ఒక్కరి జీవన ప్రమాణం మెరుగుపడేందుకు ఈ కార్యక్రమాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి,” అన్నారు, కళ్యాణలక్ష్మి & షాదీ ముబారక్ పథకాల చెక్కులు 74 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు,సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు, ఇందిరమ్మ హౌసింగ్ పథకం కింద స్థలల పట్టాలు 258 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు,ఇల్లు కట్టుకునే వారికి బేస్మెంట్ లెవెల్ లక్ష రూపాయలు, గోడలు కట్టినాక లక్ష రూపాయలు,స్లాప్ లెవెల్ లక్ష రూపాయలు ఈ విధంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం కొనసాగుతుందన్నారు,కల్లు గీత కార్మికులకు 82 కాటమయ్య రక్షణ కవచం, సేఫ్టీమెకుల కిట్టు పంపిణీ చేశారు,రాజీవ్ యువ వికాసo ద్వారా యువతకు వ్యాపార రంగంలో, ఇతర చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు లబ్ధి చేకూరుతుందని ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పేద ప్రజల సంక్షేమానికి కృషి చేస్తుంది అన్నారు,ఈ కార్యక్రమంలో ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు బీసీ కార్పొరేషన్ ఈడీ నరసింహమూర్తి,స్థానిక ఎమ్మార్వో కృష్ణవేణి,ఎంపీడీవో విజయ,ఎంపీఓ సొమ్లాల్,ఆర్ఐ శరత్ గౌడ్, మరిపెడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెండ్లి రఘువీరారెడ్డి, కేసముద్రం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఐలమల్లు జిల్లా నాయకులు,నియోజకవర్గ స్థాయి నాయకులు,యూత్ కాంగ్రెస్ సభ్యులు,గ్రామస్థాయి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version