అభివృద్ధిని అడ్డుకుంటున్న నిషేధిత !

అభివృద్ధిని అడ్డుకుంటున్న నిషేధిత మావోయిస్టులకు సహకరిస్తే కఠిన చర్యలు

గుండాల సిఐ రవీందర్,ఎస్సై సైదా రహూఫ్

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:

 

గుండాల మండలంలోని శెట్టిపల్లి, కోటగడ్డ, సజ్జలబోడు, చింతలపాడు గ్రామాలలో గుండాల సీఐ రవీందర్,గుండాల ఎస్సై సైదా రహుఫ్,కొమరారం ఎస్సై నాగుల్ మీరా లు బుధవారం కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ రవీందర్ మాట్లాడుతూ మండలంలో ఎవరైన అనుమానితులుగా కొత్త వ్యక్తులు కనిపిస్తే తక్షణమే పోలీసులకు సమాచారం
అందించాలని సమాచారం ఇచ్చిన వారి పేర్లును గోప్యంగా ఉంచుతా
మన్నారు. నిషేదిత మావోయిస్టులకు సహాయ సహకారాలు అందించి
కేసుల కు గురికావద్దని హెచ్చరించారు. మావోయిస్ట్ లు కాలం చెల్లిన సిద్ధాంతాలను నమ్ముకుని తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని జన జీవన స్రవంతిలో కలిస్తే పోలీస్ శాఖ నుంచి ఆపరేషన్ చేయూత ద్వారా ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందిస్తామని, తమ కుటుంబాలతో ఆనందంగా జీవించవచ్చని తెలిపారు. మావోయిస్టుల మాయమాటలు నమ్మి నిండు జీవితాలను అర్ధంతరం చేసు
కోవద్దని పిలుపునిచ్చారు. అమాయక ప్రజలను టార్గెట్ చేసుకుని మావోయిస్టులు తమ ఊబిలోకి దించుతూ వారి స్వలాభం కోసం అమయాకులను బలికొంటున్నారన్నారు. నిరుద్యోగులకు పోలీస్ శాఖ నుంచి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా శెట్టిపల్లి గ్రామంలోని యువతకు గుండాల సిఐ రవీందర్, కొమరారం ఎస్సై నాగుల్ మీరా వాలీబాల్ కిట్టును అందించారు.ఈ కార్యక్రమంలో గుండాల, కొమరారం పిఎస్ సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు

రోడ్ల విస్తరణ జరుగుతుంది యజమానులు సహకరించాలి ఎమ్మెల్యే కలెక్టర్.

వనపర్తి లో రోడ్ల విస్తరణ జరుగుతుంది యజమానులు సహకరించాలి ఎమ్మెల్యే కలెక్టర్

వనపర్తి నేటిధాత్రి :

 

 

 

వనపర్తి పట్టణము అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రోడ్డు విస్తరణకు సహకరించాలని ఎమ్మెల్యే తూడి మెఘా రెడ్డి కోరారు
రోడ్డు విస్తరణలో స్థలాలు కోల్పోతున్న వ్యాపార సంస్థల యజమానులతో శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి నిర్వహించిన సమావేశానికి ఎమ్మెల్యే పాల్గొన్నారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేగారెడ్డి మాట్లాడుతూ వనపర్తి పట్టణం నుంచి పెబ్బేరు రహదారి పానగల్ రహదారి విస్తరణకు సంబంధించి వ్యాపారస్తులను ఇళ్ల యజమానులను ఇబ్బంది పెట్టి రోడ్డు విస్తరణ చేపట్టదలుచుకోలేదని.

రోడ్డు విస్తరణను యజమానులను ఒప్పించి తగిన నష్ట పరిహారం ఇచ్చి విస్తరణ మాత్రం తప్పకుండా జరుగుతుందన్నారు.

పానగల్ రోడ్డు విస్తరణలో ఇల్లు కోల్పోతున్న వారికి డబుల్ బెడ్ రూమ్ కేటాయించడం లేదా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం వంటి సహాయక చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారుపట్టణంలోని ప్రధాన రహదారి వనపర్తి -పెబ్బేరు రోడ్డు విస్తరణ అనేది భావి తరాలకు, వనపర్తి గౌరవాన్ని కాపాడటానికి చాలా ముఖ్యమని అందువల్ల వ్యాపారస్తులు రోడ్డు విస్తరణకు సహకరించాలని కోరారు
వనపర్తికి ఎంతో ఘనమైన చరిత్ర ఉందని, ఎక్కడ లేనివిధంగా సైఫాన్ డ్యామ్, చారిత్రాత్మక పాలిటెక్నిక్ కళాశాల ఇక్కడే ఉన్నాయన్నారు రోడ్డు ఎన్ని ఫీట్లలో ఉండాలి అనేది ఇప్పటికే టౌన్ ప్లానింగ్ ద్వారా రూపొందించిన ప్రణాళికకు అనుగుణంగా ఒకటి రెండు రోజుల్లో జిల్లా కలెక్టర్ తో చర్చించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు.

రోడ్డు ఒకే ప్లాట్ ఫాం పద్ధతిలో వంకరలు లేకుండా అలన్మెంట్ ఉంటుందన్నారు.జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ గత పదేళ్లలో వనపర్తి పట్టణ జనాభా రెండింతలు అయ్యాయని, రాబోయే రోజుల్లో నాలుగింతలు కావచ్చన్నారు.

జనాభాకు భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా రోడ్లు ఉండాలని అన్నారు పట్టణాల్లో కనీసం వంద ఫీట్ల రోడ్డు ఉండాలని,అప్పుడే పట్టణం అభివృద్ధి చెంది వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయన్నారు.

ప్రతి పట్టణానికి ఒక మాస్టర్ ప్లాన్ ఉంటుందని, వనపర్తి పట్టణానికి 2000 సంవత్సరంలోనే ప్లాన్ తయారు చేసి 100 ఫీట్ల రోడ్డు ప్రతిపాదించడం జరిగిందన్నారు.

రోడ్డు విస్తరణ ప్రజలకు చాలా అవసరమని, విస్తరణ వల్ల ఎక్కువ లాభం రోడ్డు పక్కన ఉన్న వ్యాపారస్తులకు కలుగుతుందన్నారు.

కొంత స్థలం కోల్పోతున్న వారికి టి.డి.ఆర్ ఇవ్వడం, పూర్తిగా స్థలం కోల్పోయే వారికి నష్ట పరిహారం ఇవ్వడం జరుగుతుందన్నారు
రోడ్డు విస్తరణలో స్థలాలు కోల్పోతున్న వారికి ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం టి.డి.ఆర్ తీసుకోవడం చాలా లాభదాయకమని వ్యాపారస్తులకు అవగాహన కల్పించారు.

భవిష్యత్తులో డెవలపర్స్ కు అమ్ముకొని నాలుగింతల లాభం పొందవచ్చు అన్నారు.

రోడ్డు విస్తరణలో స్థలాలు కోల్పోతున్న యజమానులు వారి వాదనలు, అభ్యర్థనలు తెలిపారు.

ముందుగా రోడ్డు మధ్యభాగం ఎక్కడి నుంచి కొలతలు చేస్తారో నిర్ణయించాలని అదేవిధంగా రోడ్డు విస్తరణ వంద ఫీట్లు కాకుండా 70 నుంచి 80 ఫీట్ల కు కుదించాలని కోరారు. వ్యాపారస్తుల తరపున అడ్వకేట్ నిరంజన్ పాషా తమ వాదనలు వినిపించారు.
అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఇన్చార్జి యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లుమార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, తహసిల్దార్ రమేష్ రెడ్డి, వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు .

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version