వైభవంగా నాగుల పంచమి వేడుకలు..

వైభవంగా నాగుల పంచమి వేడుకలు

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-29T151443.431.wav?_=1

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండల కేంద్రం లోని అతి పురాత నమైన ఆరు శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాల యంలో ఉన్న నాగేంద్ర స్వామి గుడిలో మంగళవారం నాగుల పంచమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. శ్రావణమాసం పురస్కరించుకొని దేవాలయ అర్చకులు ఆరుట్ల కృష్ణమా చారి నాగదేవతల విగ్రహాలకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించినారు. దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి రాజ మణి దంపతులు పుట్టలో పాలు పోసి వెండి నాగమయ ప్రతిమను వస్త్రాలను సమ ర్పించి ప్రత్యేక పూజలు చేశారు భక్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని పుట్టలో పాలు పోసి భక్తిశ్రద్ధలతో నాగదేవతలను తమ కోరికలు నెరవేర్చాలని వేడుకున్నారు ఈ కార్యక్రమం లో బాసని రమేష్ ధనలక్ష్మి మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఘనంగా నాగుల చవితి వేడుకలు..

జహీరాబాద్ లో నాగుల చవితి వేడుకలు.

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-29T123835.900.wav?_=2

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ లో నాగుల పంచమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నాగదేవత ఆలయాలు, పుట్టల వద్ద పాలు పోసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. పట్టణంలోని 1008 నాగదేవత ఆలయం, నాగుల కట్టలోని నాగదేవత ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లోని పుట్టల వద్ద భక్షాలు, పాలు నైవేద్యంగా సమర్పించి మొక్కలు చెల్లించుకుంటున్నారు.

ఘనంగా కేటీర్ జన్మదిన వేడుకలు..

ఘనంగా కేటీర్ జన్మదిన వేడుకలు..

ఏనుమాముల, నేటిధాత్రి

మాజీ మంత్రి, బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) 49వ జన్మదిన వేడుకలను గురువారం బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు కేతిరి రాజశేఖర్ ఆధ్వర్యంలో ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ వద్ద ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఏల్లవుల కుమార్ యాదవ్ కేక్ కట్ చేసి, పండ్లు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయం అన్నారు. కేతిరి రాజశేఖర్ మాట్లాడుతూ 18నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని ,ఎప్పుడు ఎన్నికలు జరిగినా టిఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలవడం ఖాయం అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గండ్రాతి భాస్కర్ పత్రి సుభాష్ ఉద్యమకారుడు హస్తం యాదగిరి పసులాది మల్లయ్య కేతిరి సమ్మక్క రంగరాజు విజయ ఆటో యూనియన్ నాయకుడు ఎండి సలీం భామల పెళ్లి కిరణ్ పున్నం ప్రభాకర్ వీరాచారి గండ్రాతి నవీన్ సతీష్ కొత్తపెళ్లి సునీల్ ఆడేపు అశోక్ బొల్లె సాంబయ్య గుమలాపురం హైమావతి ఎండి గౌస్య కుడికాల పద్మ ఈరెల్లి రజిత, రంగు లక్ష్మి, ఎండి జావిద్, ఎండి ఫిరోజ్, గంధం కిషోర్, పస్తం రవి ప్రసాద్ శ్రీనివాస్ దామెర లెనిన్ తదితరులు పాల్గొనడం జరిగింది

కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహణ..

కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహణ

నేటిదాత్రి చర్ల

బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదినం సందర్భంగా చర్ల పార్టీ కార్యాలయంలో మండల కన్వీనర్ దొడ్డి తాతారావు కో కన్వీనర్ ఐనవోలు పవన్ కుమార్ అధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు సోయం రాజారావు మాజీ ఎంపీపీ గీద కోదండరామయ్య నియోజకవర్గ యూత్ నాయకులు కాకి అనిల్ బీసీ సెల్ అధ్యక్షులు గోరింట్ల వెంకటేశ్వరరావు ఎస్సీ సెల్ అధ్యక్షులు కోంభతిని రాంబాబు ఎస్టీ సెల్ కార్యదర్శి కారం కన్నారావు బీసీ సెల్ కార్యదర్శి కేప గణేష్ పార్టీ సీనియర్ నాయకులు సయ్యద్ అజీజ్ ఇరసవడ్ల రాము పంజా రాజు తడికల బుల్లేబ్బాయి పాగా రాంప్రసాద్ బట్ట కొమరయ్య సంతపురి సతీష్ సిద్ది రాజశేఖర్ కట్టం కన్నారావు ఆలం బ్రహ్మనాయుడు గుమ్మల నరేంద్ర తడికల చంద్రశేఖర్ సృజన్ కుక్క డప్పు సాయి గాదం శెట్టి కిషోర్ గంపల రమేష్ కోటి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు

ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు..

ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-91-1.wav?_=3

రామడుగు, నేటిధాత్రి:

బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) జన్మదినం సందర్బంగా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామంలోని ప్రశాంత్ భవన్ లో పిల్లలకు నిత్యవసర సరుకులు, బియ్యం, పండ్ల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, రామడుగు సింగిల్ విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వరరావు, బిఆర్ఎస్ పార్టీ మండలశాఖ అధ్యక్షులు గంట్ల జితేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీలు మార్కొండ కిష్టారెడ్డి, తౌటు మురళి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లు మామిడి తిరుపతి, గంట్ల వెంకటరెడ్డి, పూడూరు మల్లేశం, మాజీ మండల అధ్యక్షులు జూపాక కరుణాకర్, మాజీ జిల్లా రైతుబంధు సభ్యులు వీర్ల సంజీవరావు, నాయకులు నాగి శేఖర్, మాజీ సర్పంచులు చాడ చంద్రశేఖర్ రెడ్డి, పంజాల జగన్మోహన్ గౌడ్, వీర్ల రవీందర్రావు, సైండ్ల కరుణాకర్, గుండి ప్రవీణ్, జవ్వాజి శేఖర్, ఊగంటి చంద్రారెడ్డి, చిలుముల ప్రభాకర్, జూపాక మునిందర్, నాయకులు ఎల్లా జగన్ మోహన్ రెడ్డి, మాజీ మార్కెట్ డైరెక్టర్లు శనిగరపు అనిల్, బత్తిని తిరుపతి గౌడ్, గ్రామశాఖ అధ్యక్షులు పెగడ శ్రీనివాస్, గునుకొండ తిరుపతి, దొడ్డ లచ్చిరెడ్డి, యూత్ అధ్యక్షులు ఆరపెళ్లి ప్రశాంత్, ఎస్సీసెల్ అధ్యక్షులు శనిగరపు అర్జున్, మినుకుల తిరుపతి, బీరెల్లి అనిల్ రావు,పురాణం రమేష్, కాడే అజయ్, యాచమునేని,నరేష్ విద్యాసాగర్, కట్ల అనిల్, దైవల నారాయణ, పోశెట్టి, తదితర నాయకులు పాల్గొన్నారు.

ఘనంగా ఇందిరా భవన్ లో మీనాక్షి నటరాజన్ జన్మదిన వేడుకలు..

ఘనంగా
ఇందిరా భవన్ లో మీనాక్షి నటరాజన్ జన్మదిన వేడుకలు..

జగిత్యాల. రాయికల్. జులై 23, నేటి ధాత్రి:

 

కేక్ కట్ చేసి సంబురాలు..

ఏ ఐ సీ సీ కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ జన్మదిన వేడుకలను మాజీ మంత్రివర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణ కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మీనాక్షి నటరాజన్ చిత్రం తో కూడిన కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేసి,జన్మదిన వేడుకలు నిర్వహించారు.

అనంతరం మాజీ మంత్రి వర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి మాట్లాడుతూ..

అఖిల భారత కాంగ్రెస్ కార్యదర్శి తెలంగాణ ఇంచార్జి గా క్షేత్ర స్థాయిలో
పార్టీ బలోపేతమే ధ్యేయంగా పని చేస్తున్నారు.

రాహుల్ గాంధీ ను ప్రధానిగా చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నారు.

పదేళ్లు బీ ఆర్ ఎస్ అరాచకాలను ను ఎదురించి నిల్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇస్తామని కార్యకర్తల్లో భరోసా నింపారు.

దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలు చేస్తున్నారు.

మహిళలకు ఉచిత రవాణా, రూ.500 లకే గ్యాస్ సిలిండర్, ప్రతి క్వింటాల్ పై రూ.500 బోనస్, రైతు భరోసా వంటి సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శం..

గృహ అవసరాలకు 200 యూనిట్లు ఉచితంగా అందిస్తున్న రాష్ట్రం ఒక్కటే అని స్పష్టం చేశారు.

జనాభా ప్రతిపాదకన రిజర్వేషన్ కల్పించాలనే రాహుల్ గాంధీ ఆలోచన తో
కుల గణన చేపట్టి,42 శాతం రిజర్వేషన్ అమలుకు కృషి చేస్తున్నారు.

బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేయడం తో పాటు విద్య, ఉద్యోగాలలో అమలు చేస్తాం.

2017 నాటికి కాంగ్రెస్ లో ఉన్న వారికి మాత్రమే ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని చెప్పి, కార్యకర్తల్లో ఆత్మ విశ్వాసం నింపారు.

రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యం గా ప్రతి ఒక్కరు కృషి చేయాలని జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు.

ఘనంగా మాజీ సిఎం రోశయ్య జయంతి వేడుకలు..

ఘనంగా మాజీ సిఎం రోశయ్య జయంతి వేడుకలు

వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ గా వ్యవహరించిన కొణిజేటి రోశయ్య జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో అధికారికంగా జయంతి వేడుకలను జరిపారు రోశయ్య చిత్రపటానికి కలెక్టర్ డాక్టర్ సత్య శారద పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డి ఆర్ ఓ విజయలక్ష్మి, జెడ్పి సీఈఓ రామిరెడ్డి, డిఆర్డీఓ కౌసల్యాదేవి, డిబిసిడిఓ పుష్పాలత, కలెక్టరేట్ ఏ.ఓ విశ్వ ప్రసాద్, ఇతర అధికారులు, సంఘ నాయకులు, కలెక్టరేట్ లోని వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.

కొత్త తరహా చిత్రం.

కొత్త తరహా చిత్రం

 

 

 

 

అర్థనారి తెప్ప సముద్రం వెడ్డింగ్‌ డైరీస్‌ వంటి వైవిద్య భరితమైన సినిమాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకొన్న అర్జున్‌ అంబటి నటించిన తాజా చిత్రం…

‘అర్థనారి’, ‘తెప్ప సముద్రం’, ‘వెడ్డింగ్‌ డైరీస్‌’ వంటి వైవిద్య భరితమైన సినిమాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకొన్న అర్జున్‌ అంబటి నటించిన తాజా చిత్రం ‘పరమపద సోపానం’. జెన్నిఫర్‌ ఇమ్మాన్యుయేల్‌ కథానాయిక. నాగ శివ దర్శకత్వం వహించారు. గుడిమిట్ల సువర్ణలత సమర్పణలో గుడిమిట్ల శివప్రసాద్‌ నిర్మించారు. జూలై 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాత సి.కళ్యాణ్‌ ఈ చిత్రం టీజర్‌ను లాంచ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో హీరో అర్జున్‌ అంబటి మాట్లాడుతూ ‘శివ నాకు ఈ కథను చెబుతున్నప్పుడు హీరో ఎలివేషన్స్‌ డైరెక్టర్‌ పూరి స్టయిల్లో అనిపించేవి’ అని అన్నారు. హీరోయిన్‌ జెన్నిఫర్‌ మాట్లాడుతూ ‘ఈ సినిమాలో నేను నేహా అనే పోలీస్‌ ఆఫీసర్‌పాత్ర పోషించాను. కచ్చితంగా అందర్నీ ఆకట్టుకుంటుంది అనే నమ్మకం ఉంది’ అని చెప్పారు. చిత్రదర్శకుడు నాగ శివ మాట్లాడుతూ ‘హీరో అర్జున్‌ యాక్షన్‌ సీన్స్‌లో, భావోద్వేగ సన్నివేశాల్లో బాగా నటించాడు’ అని తెలిపారు. నిర్మాత శివ ప్రసాద్‌ మాట్లాడుతూ ‘కొత్త తరహా కథల్ని ప్రేక్షకులు ఆదరిస్తున్నారనే నమ్మకంతో ఈ చిత్రాన్ని నిర్మించాం. కచ్చితంగా ప్రేక్షకులకు కొత్త తరహా అనుభూతిని కలిగిస్తుందీ చిత్రం’ అని అన్నారు.

ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి వేడుకలు.

ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి వేడుకలు..

రామకృష్ణాపూర్ నేటిధాత్రి:

 

ప్రొఫెసర్ జయశంకర్ సేవలు మరువలేనివని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు కంబగోని సుదర్శన్ గౌడ్, సీనియర్ నాయకులు రామిడి కుమార్ లు అన్నారు. తెలంగాణ సిద్ధాంత కర్త, జయశంకర్ వర్ధంతి పురస్కరించుకొని రామకృష్ణాపూర్ పట్టణంలోని జయశంకర్ చౌరస్తా వద్ద బిఆర్ఎస్ శ్రేణులు ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాష్ట్రంలో జరిగిన నష్టాలను, కష్టాలను.. తెలంగాణ రాష్ట్ర అవసరాన్ని ప్రజలకు వివరిస్తూ, ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని జయశంకర్ సార్ రగిలించారని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధనే శ్వాసగా, ధ్యాసగా వారు నడిపిన పోరాటం, జీవితం మహోన్నతమైనదని, మీరు కలలుగన్న తెలంగాణ ప్రగతి సాక్షిగా మీకివే మా నివాళులు అని అన్నారు.తెలంగాణ ప్రాంతం ఆంధ్ర పాలకుల వల్ల అణగారిపోయి అభివృద్ధికి నోచుకోకుండా ఉందని వారి నుండి విముక్తి కోసం తెలంగాణ ఉద్యమ కర్త కెసిఆర్‌తో వెన్నంటి ఉండి తెలంగాణ ప్రాంతంలో మన నీళ్లు,మన నిధులు,మన ఉద్యోగాలు కావాలని, కోరుకునే వ్యక్తులలో మొదటి వ్యక్తి జయశంకర్ అని అన్నారు. ఆశయాలను బంగారు తెలంగాణ కోసం నిత్యం తపించే గొప్ప ఆదర్శవాది అని అన్నారు. వారి మరణం తెలంగాణ ప్రాంత ప్రజలకు తీరని లోటు అని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ మాజీ కౌన్సిలర్లు రెవెల్లి ఓదెలు, అనిల్ రావు, పోగుల మల్లయ్య, జాడి శ్రీనివాస్, జిలకర మహేష్, సీనియర్ నాయకులు అలుగుల సత్యం, జక్కన బోయిన కుమార్, రామిడి లక్ష్మి కాంత్, గోనె రాజేందర్, ఖలీం,చంద్రకిరణ్, కుర్మ దినేష్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా టీడబ్ల్యూజేఎఫ్ మంచిర్యాల జిల్లా తృతీయ మహాసభ.

ప్రచురణార్ధం
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన తప్పదు
-రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య
-ఘనంగా టీడబ్ల్యూజేఎఫ్ మంచిర్యాల జిల్లా తృతీయ మహాసభ

మంచిర్యాల జూన్ 19 నేటి ధాత్రి:

 

తెలంగాణలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారంలో మరింత జాప్యం చేస్తే రాష్ట్రవ్యాపిత ఆందోళన తప్పదని ఆయన హెచ్చరించారు. శుక్రవారం మంచిర్యాలలోని నస్పూర్ సీసీసీ ప్రెస్ క్లబ్ లో టీడబ్ల్యూజేఎఫ్ మంచిర్యాల జిల్లా తృతీయ మహాసభ ఘనంగా జరిగింది. ఈ మహాసభలో రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…జర్నలిస్టులకు
అండగా నిలిచి సమస్యలపై పోరాడే ఏకైక యూనియన్
టీడబ్ల్యూజేఎఫ్ అని అన్నారు. రాష్ట్రంలోని జర్నలిస్టుల సంక్షేమం కోసం పాటుపడుతున్న యూనియన్ టీడబ్ల్యూజేఎఫ్ మాత్రమే అని అన్నారు. అన్ని జిల్లాల్లో టీడబ్ల్యూజేఎఫ్ యూనియన్ బలపడుతుందని, ఈ నేపథ్యంలో అవగాహన లోపంతో ఫెడరేషన్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. 

గత ప్రభుత్వానికి
ఒక యూనియన్ వంతపాడితే.. ప్రస్తుత ప్రభుత్వానికి మరో యూనియన్ వంత పాడుతుందని ఎద్దేవా చేశారు. జిల్లాల్లో టీడబ్ల్యూజేఎఫ్ యూనియన్ బలోపాతానికి చేస్తున్న జిల్లా నాయకులను మామిడి సోమయ్య ఈ సందర్భంగా అభినందించారు.ఐఎఫ్ డబ్ల్యూజే జాతీయ కార్యదర్శి పులిపలుపుల ఆనందం మాట్లాడుతూ… రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టులందరికీ 20 వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి విజయ్ కుమార్ మాట్లాడుతూ…
జర్నలిస్టులకు గత ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ పథకాలు చేపట్టలేదని, జర్నలిస్టులకు అనేక సౌకర్యాలు కల్పిస్తామని అధికారంలోకి వచ్చిన ప్రస్తుత ప్రభుత్వం కూడా జర్నలిస్టులకు మొండి చేయి చూపిందని అన్నారు. కనీసానికి వర్కింగ్ జర్నలిస్టులకు కొత్తగా అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వకుండా మూడు నెలలకోసారి స్టిక్కర్ల పేరుతో కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా జర్నలిస్టుల సంక్షేమంపై ఆలోచించి వారికి న్యాయం చేయాలని కోరారు. ఈ మహాసభలో సీపీఐ రాష్ట్రదర్శి వర్గ సభ్యుడు శంకర్, ఫెడరేషన్ నేషనల్ కౌన్సిల్ మెంబర్, కరీంనగర్ జిల్లా కార్యదర్శి కుడితాడు బాపురావు, నేషనల్ కౌన్సిల్ సభ్యుడు యూసుఫ్, జిల్లా సన్నాహక కమిటీ కన్వీనర్ మిట్టపల్లి మధు, కో- కన్వీనర్లు వెంకట స్వామి గడ్డం సత్యా గౌడ్.

మంచిర్యాల జిల్లా నూతన కమిటీ ఎన్నిక
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) మంచిర్యాల జిల్లా నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది.
అధ్యక్షుడుగా మిట్టపల్లి మధు(సూర్య), ఉపాధ్యక్షుడుగా వెంకటస్వామి(ప్రజాపాలన), కార్యదర్శిగా గడ్డం సత్యగౌడ్(నేటిధాత్రి), సంయుక్త కార్యదర్శులుగా నేరెళ్ళ నరేష్ గౌడ్, నరేందర్, సుమన్,రవి, కార్యనిర్వాహక కార్యదర్శులుగా ఎంఏ హఫీజ్, ఇప్ప సురేష్, సందలేని నర్సయ్య, సదానందం, శ్రీనివాస్,కోశాధికారి గా సబ్బని భాస్కర్,కార్యవర్గ సభ్యులుగా ఎండీ సుల్తాన్, ఎస్. మల్లేష్
తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరితో పాటుగా రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా శానగొండ శ్రీనాథ్ ఎన్నికైనట్లు ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య ప్రకటించారు.

ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు.

ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

#యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు…

#ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే నాయిని,రాష్ట్ర మీడియా,కమ్యూనికేషన్ చైర్మన్…

హనుమకొండ, నేటిధాత్రి:

 

 

 

 

కాంగ్రెస్ భవన్/హనుమకొండ
పార్లమెంట్ ప్రధాన ప్రతిపక్ష నేత,ఎంపీ శ్రీ రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను గురువారం రోజు హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.యువజన కాంగ్రెస్ శ్వేత ఆధ్వర్యంలో నిర్వహించిన రక్త దానం శిబిరాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి,తెలంగాణ రాష్ట్ర మీడియా,కమ్యూనికేషన్ చైర్మన్ శ్రీ సామ రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
స్థానిక ప్రజా ప్రతినిధులు,పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిస్ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వారికి రాహుల్ గాంధీ జన్మదినం ఓ మంచి కార్యక్రమం కావాలని ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.దాతలకు సర్టిఫికేట్స్ అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వతంత్ర దేశం నుంచి నేటి వరకు ఈ దేశం కోసం ప్రాణత్యాగాలు చేస్తున్న ఏకైక కుటుంబమని,రాహుల్ గాంధీ అట్టడుగు వర్గాలకు అండగా నిలిచేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు చేపట్టిన రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు.గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన రేషన్ కార్డులు,ఆరోగ్యశ్రీ,ఫీజు రీయింబర్స్ మెంట్ లాంటి ఎన్నో పథకాలతో నేడు పేద, మధ్యతరగతి ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.
ఈ వేడుకల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు,పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు.

ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

రక్తదానం చేసిన ఎన్ ఎస్ యుఐ నాయకులు

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

జిల్లా కేంద్రంలో స్థానిక ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బట్టు కర్నాకర్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా యువజన కాంగ్రెస్ జిల్లా ఇన్చార్జి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అలువాల కార్తిక్ హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ వారి యొక్క జన్మదిన సందర్భంగా రక్తదానం శిబిరం ఏర్పాటు చేయడం వల్ల చాలామంది ప్రమాదాల్లో గాయపడిన వారికి బ్లడ్ లేక చ చాలా సందర్భాల్లో చనిపోయిన సంఘటన ఎన్నో ఉండడం జరిగింది.

రాకుండా ఉండడానికి దేశం రాహుల్ గాంధీ యొక్క జన్మదిన సందర్భంగా బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది రాహుల్ గాంధీ

ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చినప్పుడు నరేంద్ర మోడీ ఒకటి ధనిక దేశం మరొకటి పేదరిక దేశాన్ని

రెండు విభజించి పాలిస్తున్నారు రెండు దేశాలు ఉండొద్దు కేవలం భారతదేశం ఒక్కటే అనే ఉద్దేశంతో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసి ప్రతి పేద వాడిని మీకు అండగా నేను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే

ఈ దేశంలో పేదరిక కుటుంబాలు లేకుండా చేస్తామని మహా పాదయాత్ర చేసిన నాయకులు రాహుల్ గాంధీ అంతేకాకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి బహిరంగ సభలో బీసీలకు అత్యధిక రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పిన

మాటకు కట్టుబడి తెలంగాణ అసెంబ్లీలో బీసీ బిల్లును ఆమోదం చేయటంలో క్రియాశీలక పాత్ర పోషించింది నాయకులు రాహుల్ గాంధీ అంతేకాకుండా

ఈ భారత దేశంలో కూడా అన్ని రాష్ట్రాల్లో బీసీ కులగణాల జరగాలని పెద్ద ఎత్తున పోరాటంలో చేస్తున్న క్రమంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం తలవంచి ఈరోజు దేశవ్యాప్తంగా కులగనలు చేయడానికి ముందుకు వచ్చిందంటే మీ యొక్క మహోన్నతమైనటువంటి నాయకుడు వలన

ఈ దేశ ప్రజలకు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలని ఎప్పటికప్పుడు తన వంతు పోరాటాలు చేస్తున్న నాయకుడు రాహుల్ గాంధీ నాయకుడి కోసం రాబోయే రోజులలో రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అయ్యేవరకు మా యువజన కాంగ్రెస్ నాయకులు కంకణం కట్టుకొని ఒక సైనికుల పనిచేసి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా యువజన కాంగ్రెస్ మిత్రులందరికీ ముందుకు వెళ్లాలని వారు మాట్లాడం జరిగింది ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు ప్రసాద్ రాజు, రాహుల్ తరుణ్ ఆర్తి సురేష్ ప్రేమ్ మధుకర్ అశోక్ ప్రమోద్ నది అక్షిత్ రాజ్ తదితరులు పాల్గొన్నారు

ఘనంగా ఎర్రబెల్లి ప్రదీప్ రావు పుట్టినరోజు వేడుకలు.

ఘనంగా ఎర్రబెల్లి ప్రదీప్ రావు పుట్టినరోజు వేడుకలు

– కరీమాబాద్ లో కేక్‌ కటింగ్‌, మహా అన్నదానం

వరంగల్ తూర్పు నేటిధాత్రి:

 

బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు పుట్టిన రోజు వేడుకలు కరీమాబాద్ సుభాష్ విగ్రహం వద్ద బీజేపీ జిల్లా నాయకులు పూదరి అజయ్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రదీప్ రావు అభిమానులు, బీజేపీ పార్టీ శ్రేణులు ఉత్సాహంగా నిర్వహించారు.

మొదటగా ఎర్రబెల్లి వినీత్ రావు తో కలిసి పూదరి అజయ్ గౌడ్ భారీ కేకు కట్ చేసి ఎర్రబెల్లి ప్రదీప్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సుమారు 500 మందికి మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తదనంతరం స్కూల్ చిన్నారులకు వందమందికి పైగా నోట్ బుక్స్, పెన్నులు అందించారు. ఈ సందర్భంగా పూదరి అజయ్ గౌడ్ మాట్లాడుతూ వరంగల్ తూర్పు ప్రజలు ఎర్రబెల్లి ప్రదీప్ రావు నాయకత్వాన్ని కోరుకుంటున్నారు అని అన్నారు.
కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ప్రదీప్ రావు అఖండ విజయాన్ని సాధించి తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ జన్మదిన వేడుకల కార్యక్రమంలో మంద శీను, రాజశేఖర్, కార్తీక్ గౌడ్, మహేష్, రాజు, చిన్న, నాగరాజు, దయాళ్, సతీష్ బాబు, కోమల్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు.

ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

రాయికల్ నేటి ధాత్రి:

 

జూన్ 19.రాహుల్‌గాంధీ జన్మదిన సందర్భంగా  రాయికల్ పట్టణంలో గాంధీ చౌక్ వద్ద కాంగ్రెస్‌ నాయకులు కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ భారతదేశానికి మార్గదర్శనం చేయగలిన యువ తేజం రాహుల్ గాంధీ అని ఆయన దెబ్బకు బిజెపి ఇతర పార్టీలతో జట్టు కట్ట వలసి దుస్థితి వచ్చిందని అన్నారు.దేశ స్వతంత్ర అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వలు రక్షణ రంగంలో భారత్ ను ఓక అజేయశక్తి గా నిలిపాయన్నారు.యువతకు ఉద్యోగాలు కల్పించల్సిన కేంద్ర ప్రభుత్వం యువతను నిరాశకు గురిచేస్తోందని ఆరోపించారు.నిరుద్యోగ సమస్యను గుర్తిచడంలో కేంద్రం ప్రభుత్వం విఫలమైందన్నారు.
దేశంలో సుస్థిరమైన ప్రజా పాలన అందించగల ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ అని మత చాందస వాదులు మతాల పేరు చెప్పి ఎంత గెలిచే ప్రయత్నం చేసిన బడుగు బలహీనవర్గాల సంక్షేమం పట్ల ఆలోచన గలిగిన రాహుల్ గాంధీ దేశంలోనే అత్యున్నతమైన నాయకుడిగా పేరుపొందిరని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ,మండల అధ్యక్షులు మ్యాకల రమేష్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపి రాజారెడ్డి,మండల ప్రధాన కార్యదర్శి మహేందర్ గౌడ్,జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి షాకీర్,హనుమాన్ ఆలయ చైర్మన్ దాసరి గంగాధర్, యూత్ కాంగ్రెస్ మండల,పట్టణ అధ్యక్షులు ఏలేటి జలంధర్ రెడ్డి,బత్తిని నాగరాజు,నాయకులు ఎద్దండి భూమారెడ్డి,కొయ్యేడి మహిపాల్ రెడ్డి,బాపురపు నర్సయ్య,బత్తిని భూమయ్య,వాసం దిలీప్,కొమ్ముల ఆదిరెడ్డి,కడకుంట్ల నరేష్,అశోక్,మోబిన్,మండ రమేష్, రాకేష్ నాయక్,తలారి రాజేష్,బాపురపు రాజీవ్,జక్కుల సాగర్,రాజేష్,నరసింహారెడ్డి,ఆనంద్,పాసం భూమయ్య,పల్లికొండ రమేష్,కాటి పెల్లి రాజశేఖర్, రాజేందర్,రవీందర్,తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు.

ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

గంగాధర నేటిధాత్రి:

 

 

 

 

ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ జన్మ దిన వేడుకలను మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గంగాధర మండలంలో గురువారం ఘనంగా నిర్వహించారు. మండలంలోని మధురానగర్ చౌరస్తాలో రాహుల్ గాంధీ పేరు రాసి ఉన్న కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాహుల్ గాంధీని భావి భారత ప్రధానమంత్రిని కొనియాడారు. రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయపతాకం ఎగురవేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు పురుమల్ల మనోహర్, నాయకులు జాగీరపు శ్రీనివాస్ రెడ్డి,దుబ్బాసి బుచ్చన్న,సత్తు కనుకయ్య, మార్కేట్ కమిటీ వైస్ చైర్మన్ తోట కరుణాకర్,పడితపల్లి కిషన్,కొలిపాక స్వామి,వేముల అంజి,వేముల భాస్కర్,గుజ్జుల బాపురెడ్డి, కర్ర బాపురెడ్డి,కోలపురం లక్ష్మణ్,రుద్ర మల్లేశం,గరిగంటి కరుణాకర్,బెజ్జంకి కళ్యాణ్,మంత్రి మహేందర్,పానుగంటి సత్యం, గంగాధర సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు.

జమ్మికుంట యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు
జమ్మికుంట నేటిధాత్రి:

 

యూత్ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి మరియు హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ వొడితల ప్రణవ్ బాబు ఆదేశాల మేరకు, యూత్ కాంగ్రెస్ జమ్మికుంట మండల అధ్యక్షులు బుడిగె శ్రీకాంత్ ఆధ్వర్యంలో, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు జమ్మికుంట పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా, జమ్మికుంట యూత్ కాంగ్రెస్ పక్షాన రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు

అనంతరం యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బుడిగె శ్రీకాంత్ మాట్లాడుతూ; దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబానికి చెందిన నాయకుడు, 150 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి నాలుగవ తరం వారసులు రాహుల్ గాంధీ అని కొనియాడారు. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన 75 యేళ్లలో దాదాపు 50 ఏళ్లకు పైగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించిందని అన్నారు. రాహుల్ గాంధీ 2004లో భారత రాజకీయాల్లోకి ప్రవేశించి ఎంపీగా గెలిచి, ఆ తదుపరి ఎఐసిసి అధ్యక్షులుగా యువ నాయకత్వాన్ని వహించారన్నారు. భారత్ జోడో యాత్ర పేరిట కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు 3500 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసి, అదే విధంగా న్యాయ యాత్ర ద్వారా పేద అట్టడుగు మరియు వెనుకబడిన ప్రజల కోసం ప్రజాస్వామ్యాన్ని తిరిగి పొందడానికి జై భీమ్, జై బాపు, జై సంవిదాన్ అనే కార్యక్రమంతో ప్రజలకు రాజ్యాంగం యొక్క గొప్పతనం తేలవాల్సిన అవసరం ఉందని, దాని కోసం ఎనలేని కృషి చేస్తున్నారని తెలిపారు. రేపటి ఉజ్వల భవిష్యత్తు కోసం భారతదేశ ఆకాంక్షలను నెరవేర్చే నాయకుడు రాహుల్ గాంధీ అని రానున్న రోజుల్లో ఈ దేశ ప్రజల ఆశీర్వాదంతో వారిని ప్రధానమంత్రిగా చూడబోతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో; యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్లపల్లి నాగరాజు, కార్యదర్శి దొడ్డె సంధ్య నవీన్, పింగిలి చైతన్య రమేష్, అసెంబ్లీ కార్యదర్శి పాతకాల రమేష్, రోమాల రాజ్ కుమార్, మండల ఉపాధ్యక్షులు దేవునూరి వినయ్, ప్రధాన కార్యదర్శి బిజిగిరి శ్రీకాంత్, కార్యదర్శి యేబుషి అజయ్, పైడిపల్లి వెంకటేష్, నాయకులు జావిద్, సూర్య రెడ్డి, ఇల్లందుల శివ, బండి పవన్, అష్రఫ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు.

ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు.

నేటిధాత్రి, ఏనుమాముల.

 

 

 

 

 

 

నగరంలోని 14వ డివిజన్ ఎనుమాముల ముసలమ్మ కుంట పేస్ వన్ లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు గురువారం రోజున సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాశెట్టి కమలాకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ విచ్చేసి కేక్ కట్ చేసి అనంతరం పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి స్వర్ణ మాట్లాడుతూ కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అని, దేశానికి విశ్వసనీయత కలిగి, ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసే నిజమైన ప్రజా నాయకులు ఆయన నాయకత్వంలో దేశంలో సామాజిక న్యాయం సమనత్వం ప్రజాస్వామ్యం బలపడుతున్నాయి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సోషల్ మీడియా రాష్ట్ర కోఆర్డినేటర్ అడుప మహేష్. జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కరాటే ప్రభాకర్. ఎస్టీ సెల్ హనుమకొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పులి చేరి రాధాకృష్ణ.డివిజన్ ఎస్సీ సెల్ అధ్యక్షులు శంకర్ ఎస్టీ సెల్ అధ్యక్షులు పులి చేరి రాధాకృష్ణ ఏనుమాముల గ్రామ పార్టీ అధ్యక్షులు సౌరం చిన్ని సుందరయ్య నగర్ గ్రామ అధ్యక్షుడు వడ్లకొండ తిరుపతి. తోట శ్రీను. ఏకామ్రాచారి దస్రు నాయక్ పార్టీ సీనియర్ నాయకులు ఖల్నాయక్ సౌరం ప్రభాకర్ సౌరం మాణిక్యం సౌరం జయకర్ సంగారబోఎన రాజు సంగార బోయిన రాజేష్ కన్నా ఇందిరమ్మ కాలనీ డెవలప్మెంట్ కమిటీ ప్రధాన కార్యదర్శి బండ్ల సురేందర్ పల్లకొండ చందు ముక్తార్ మహేష్. మహిళలు మొద్ధసాని మాధవి. గుగులోతు మంగ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు.

ఘనంగా అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు.

కరకగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటిధాత్రి:

 

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలోనీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ మాజీ అధ్యక్షులు, బావి భారత ప్రధాని అగ్రనేత పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ
భారతదేశంలో కులమతాల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయాలు చేస్తున్న ప్రభుత్వాలకు పార్టీలకు బుద్ధి చెప్పడం కోసం పేద ప్రజల కష్టసుఖాలను తెలుసుకోవడం కోసం భారత్ జోడో యాత్ర ప్రారంభించి 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి దేశ ప్రజలందరినీ ఒకే తాటిపై నడిపించిన ప్రజా నాయకుడు రాహుల్ గాంధీ అని అన్నారు..
రాహుల్ గాంధీ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండి ఇటువంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో
మాజీ సర్పంచ్ నాయకులు పోలేబోయిన తిరుపతయ్య, మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగ బండి వెంకటేశ్వర్లు, మండల యువజన అధ్యక్షులు కునుసోత్ సాగర్, మండల నాయకులు పూజారి వెంకన్న , వగలబోయిన శ్రీను, దంచనాల రాజేంద్రప్రసాద్, గాంధర్ల రామనాథం, గోగు కిరణ్ కుమార్, మేడి శ్రీను, అశ్రపునిస, పోలేబోయిన సుజాత,కార్యకర్తలు, మహిళలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు..

చలి మెడ.రాజేశ్వరరావు ఘనంగా జన్మదిన వేడుకలు.

చలి మెడ.రాజేశ్వరరావు ఘనంగా జన్మదిన వేడుకలు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి:

తంగళ్ళపల్లి మండలం. నేరెళ్ల గ్రామంలో. బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లో.కరీంనగర్ డైరీ యూనిట్.సూపర్వైజర్ గుర్రం సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో. కరీంనగర్ డైరీ చైర్మన్ చలి మెడ రాజేశ్వరరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరీంనగర్ డైలీ చైర్మన్ రాజేశ్వరరావు జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు జరుపుకోవడం జరిగిందని కరీంనగర్ డైరీ స్థాపించి డైరీ ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ అట్లాగే రోజుకు 2000 లీటర్ల నుండి రెండు లక్షల లీటర్ల వరకు పాల ఉత్పత్తిని పెంచిన ఘనత చైర్మన్ రాజేశ్వరరావు ది అని. మాకు పండుగ రోజు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో పిల్లాపాపలతో సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఇట్టి జన్మదిన వేడుకలను ఘనంగా జరిపించుకున్నామని తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో. బి సి యు ఇన్చార్జి రాగుల మధుసూదన్. సూపర్వైజర్ ఉమ్మారెడ్డి భానుచందర్. ల్యాబ్ అసిస్టెంట్ తిరుపతి. శేఖర్. నరేష్. శ్రీనివాస్. రాజు. సాయికుమార్ రైతులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

సమంత తొలి నిర్మాణం ఒక హాస్యాస్పదమైన శైలి.

సమంత తొలి నిర్మాణం ఒక హాస్యాస్పదమైన శైలి.

సుభం’ సినిమా సమీక్ష:నేటిధాత్రి

 

 

 

దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల మరియు రచయిత వసంత్ మారింగంటిల తెలుగు చిత్రం వినోదాత్మకమైన ఇండీ-స్టైల్ హర్రర్ కామెడీ మరియు సామాజిక వ్యంగ్యం.

‘సుభం’ చిత్ర తారాగణం | ఫోటో క్రెడిట్: స్పెషల్ అరేంజ్‌మెంట్

ఒక నిరాడంబరమైన సినిమా పెద్దగా ఊగిపోయి హాయిగా ల్యాండ్ అయినప్పుడు అది ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుంది, మరియు శుభం అనే తెలుగు హర్రర్ కామెడీ కూడా అదే చేస్తుంది. నటి సమంతా రూత్ ప్రభు నిర్మాతగా అరంగేట్రం చేస్తున్న ఈ చిత్రానికి సినిమా బండికి చెందిన ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వం వహించారు మరియు వసంత్ మారింగంటి రచన చేశారు. ఉపరితలంపై, ఇది భయానక కామెడీ, కానీ హృదయంలో, ఇది లింగ సున్నితత్వంపై పదునైన వ్యాఖ్యానం – తెలివైన రచన మరియు మనోహరమైన ప్రదర్శనల ద్వారా మరింత ప్రభావవంతంగా మారింది.

2000ల ప్రారంభంలో, అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లోని తీరప్రాంత భీమిలిలో ఇంటర్నెట్‌కు ముందు రోజుల్లో, కథ కేబుల్ టీవీ ఆపరేటర్ అయిన శ్రీను (హర్షిత్ రెడ్డి) మరియు బ్యాంక్ ఉద్యోగి అయిన శ్రీ వల్లి (శ్రియా కొంఠం) మధ్య జరిగే మధురమైన వికారమైన పెళ్లి చూపులు (ఒక కుదిర్చిన వివాహం)తో ప్రారంభమవుతుంది. ఉపగ్రహ టీవీ అంగుళంలో ప్రవేశించడం ప్రారంభించినప్పుడు కేబుల్ ఇప్పటికీ రాజ్యమేలుతున్న నేపథ్యం – కథనాన్ని ముంచెత్తకుండా నోస్టాల్జియాను జోడిస్తుంది.

పాత తెలుగు సినిమాల ‘సుఖాంతం’ టైటిల్ కార్డులకు గుర్తుగా ‘ సుభం ‘ అనే టైటిల్ ప్రేక్షకులను నిజంగా సంతోషకరమైన కుటుంబం ఎలా ఉంటుందో ఆలోచించమని ఆహ్వానిస్తుంది. ఇక్కడ, సమాధానం చాలా ఆధునికమైనది: లింగ సమానత్వం. స్క్రిప్ట్ సమకాలీన సృజనాత్మక స్వేచ్ఛలను తీసుకున్నప్పటికీ, అది స్థానం నుండి తప్పినట్లు అనిపించదు – దాని స్పర్శ తేలిక, పుష్కలంగా నవ్వులు మరియు 125 నిమిషాల కఠినమైన రన్‌టైమ్‌లో తెలివైన భయానక సన్నివేశాలకు ధన్యవాదాలు.
దర్శకుడు : ప్రవీణ్ కాండ్రేగుల
నటీనటులు : హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియ కొంతం, శ్రావణి లక్ష్మి, షాలిని కొండేపూడి, వంశీధర్ గౌడ్
నిడివి : 125 నిమిషాలు
కథాంశం : ఒక చిన్న పట్టణంలో, స్త్రీలు టెలివిజన్ షో చూస్తున్నప్పుడు వ్యామోహంలో మునిగిపోతారు. పురుషులు పరిష్కారాలను కనుగొనాలి మరియు దానికి వారు తమలో తాము చూసుకోవాలి.

శుభం లో సూక్ష్మమైన లింగ వ్యాఖ్యానం ప్రారంభంలోనే బయటపడటం ప్రారంభమవుతుంది – శ్రీ వల్లి పని చేస్తుంది మరియు మర్యాదపూర్వక శైలికి సరిగ్గా సరిపోదు కాబట్టి పెద్దలు ఆమె వధువుగా సరిపోతుందని ప్రశ్నిస్తారు. ఇంతలో, శ్రీను స్నేహితులు అతనిని ‘ఆల్ఫా మేల్’ ప్రవర్తనలో శిక్షణ ఇస్తారు, అదే వారి భార్యలను ఆకట్టుకునేలా చేయడంలో రహస్యం అని నమ్ముతారు. ఈ క్షణాలు హాస్యంతో సాగుతాయి, ఏదైనా విషపూరిత ఉద్దేశ్యం కంటే పురుషుల అజ్ఞానాన్ని హైలైట్ చేస్తాయి.

తర్వాత, ట్విస్ట్: పట్టణంలోని మహిళలు ఒక మెలోడ్రామాటిక్ టీవీ షో చూస్తున్నప్పుడు వారిపై ఆకర్షితులవుతారు. గందరగోళం గురించి. వ్యంగ్యంగా ప్రారంభమయ్యేది హాస్యాస్పదంగా, భయానకంగా మారే అల్లకల్లోలంగా మారుతుంది, పురుషులు ఏమి జరుగుతుందో అర్థం చేసుకోవడానికి తహతహలాడుతుండగా, హాస్యాస్పదమైన మాటలు మరియు హాస్యం.

దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల మరియు రచయిత వసంత్ మారింగంటి ఈ చిత్రాన్ని చిన్న పట్టణ విచిత్రాలు – సుపరిచితమైన కబుర్లు, కేబుల్ టీవీ నోస్టాల్జియా మరియు విచిత్రమైన పాత్రలలో – ఎంకరేజ్ చేస్తారు. వివేక్ సాగర్ సంగీతం శృంగారం నుండి భయానక స్థాయికి సులభంగా కదులుతుంది మరియు మృదుల్ సేన్ సినిమాటోగ్రఫీ స్వర మార్పును నైపుణ్యంతో సంగ్రహిస్తుంది.
‘సుభం’ లో సమంత రూత్ ప్రభు | ఫోటో క్రెడిట్: స్పెషల్ అరేంజ్మెంట్

ఈ సినిమాలోని సోప్ ఒపెరా, జన్మ జన్మల బంధం , ఒక తెలివైన కథన పరికరంగా మారుతుంది. కల్పిత సోప్‌లను హాస్యాస్పదంగా ఉపయోగించే ఇటీవలి చిత్రాల మాదిరిగా కాకుండా (మత్తు వడలారా మరియు దాని సీక్వెల్ గుర్తుకు వస్తుంది), శుభం మూడు జంటల మధ్య లింగ గతిశీలతను ప్రతిబింబించేలా చేస్తుంది, ఈ పిచ్చికి బరువును జోడిస్తుంది.

మొదటి అర్ధభాగంలో కొన్ని ప్రశాంతతలు ఉన్నాయి, కానీ కథ త్వరలోనే వేగం పుంజుకుంటుంది. సమంత తన సాధారణ ఇమేజ్‌కు విరుద్ధంగా నటించిన డెడ్‌పాన్ కామియో క్లుప్తంగా ఉన్నప్పటికీ ప్రభావవంతంగా ఉంటుంది. ఆమె మౌనం ఏకపాత్రాభినయం కంటే ఎక్కువ చెబుతుంది.

ఊహించదగిన పరిష్కారం వైపు వెళ్ళవచ్చని మీరు అనుకుంటున్న సమయంలో, ప్రవీణ్ మరియు వసంత్ ఒక ఆశ్చర్యకరమైన మలుపును ఇస్తారు. మీరు సినిమా బండిని చూసినట్లయితే , మీరు క్రాస్ఓవర్‌ను మరింత ఆనందిస్తారు, కానీ మీరు చూడకపోయినా ఇది ఇప్పటికీ పనిచేస్తుంది. ఇది సినిమాటిక్ విశ్వాలకు దర్శకుడు యొక్క ఉల్లాసభరితమైన సమాధానం, ఇది స్వతంత్ర చిత్రాలకు కూడా ఉమ్మడి ప్రపంచాలను కలిగి ఉండవచ్చని మనకు గుర్తు చేస్తుంది.

మెయిల్ మరియు కల్కి 2898 AD లలో ప్రత్యేకంగా నిలిచాడు ) శ్రీనుకి ఆప్యాయతను తెస్తాడు, మరియు శ్రియ కొణతం నిశ్శబ్దంగా దృఢంగా ఉండే శ్రీ వల్లిగా తనదైన శైలిలో నటించాడు. మిగిలిన తారాగణం – గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పెరి, శ్రావణి లక్ష్మి, షాలిని కొండేపూడి, మరియు వంశీధర్ గౌడ్ – తమ పాత్రలను అతిగా ప్రదర్శించకుండా వినోదాన్ని పెంచారు.

“రింగ్స్ ఆఫ్ ది లార్డ్” చూస్తున్నానని గర్వంగా చెప్పుకునే పాత్ర వంటి ఒక ఆహ్లాదకరమైన వివరాలు కూడా ఇందులో ఉన్నాయి. అయితే, ఒక వదులుగా ఉన్న థ్రెడ్ ఏమిటంటే, స్త్రీలు మొదట ఎందుకు దయ్యాలను పట్టుకుంటారు. ఈ చిత్రం ఒక కారణం చెప్పకుండానే తప్పించుకుంటుంది, బహుశా అది మంచి కోసమే కావచ్చు – కొన్ని విషయాలు వివరించకుండా వదిలేస్తే సరదాగా ఉంటాయి.

శుభమ్ అనేది ‘ఆల్ఫా మేల్స్’ అందరికీ ఒక పదునైన సందేశాన్ని అందించే హారర్-కామెడీ. మరియు ఇది పుష్కలంగా నవ్వులతో ప్రేక్షకులను అలరిస్తుంది.

శుభమ్ ప్రస్తుతం థియేటర్లలో ప్రదర్శితమవుతోంది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version