పోత్కపల్లి పోలీస్‌ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసినా డిసిపి.

పోత్కపల్లి పోలీస్‌ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసినా డిసిపి

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

ఓదెల మండలం పోత్కపల్లి పోలీస్ స్టేషన్ ను పెద్దపల్లి డిసిపి కరుణాకర్ ఆకస్మికంగా తనిఖీ చేసారు.పోలీస్ స్టేషన్ ఆకస్మికంగా తనిఖీ సందర్భంగా డిసిపి గారు ముందుగా పోలీస్‌ స్టేషన్‌ పరిసరాలు, వివిధ కేసులలో సిజ్ చేసిన వాహనాలను పరిశీలించి అనంతరం రిసెప్షన్ సిబ్బందిని అడిగి పిర్యాదుల వివరాలు అడిగి తెలుసుకొన్నారు.పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులతో మర్యాదగా ప్రవర్తించి వారి సమస్యను తెలుసుకొని వారికీ భరోసా నమ్మకం కల్పించాలని చట్టపరిధిలో సమస్య పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు.స్టేషన్‌ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీస్‌ అధికారులు,సిబ్బంది వివరాలను డిసిపి ఎస్ఐ దీకొండ రమేష్ ను అడిగి తెలుసుకొవడంతో పాటు, స్టేషన్‌ పరిధిలో అత్యధికంగా ఎలాంటి నేరాలు నమోదవుతాయి,సమస్యత్మక గ్రామాల, సరిహద్దు ప్రాంత వివరాలు, రౌడీ షీటర్లు, ట్రబుల్ మాంగర్స్, అనుమానితులు వారి ప్రస్తుత స్థితి గతులను సంబంధిత ఎస్‌ఐని అడిగి తెలిసుకోవడంతో పాటు స్టేషన్‌వారిగా బ్లూకోల్ట్స్‌ సిబ్బంది పనితీరుతో పాటు, వారు విధులు నిర్వహించే సమయాలను అడిగి తెలుసుకున్నారు.గంజాయితో పాటు ఇతర మత్తు పదార్థాలకు సంబంధించి అక్రమ రవాణా, సరఫరా, నిల్వ, సేవించే వారిపై స్టేషన్‌ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి మత్తు పదార్థాల నియంత్రణకై నిరంతరం పనిచేయాలని నేరాల నియంత్రణకై విజుబుల్‌ పోలీసింగ్‌ అవసరమని, నిరంతం పోలీసులు పెట్రొలింగ్‌ నిర్వహించాలని డిసిపి అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్దపెల్లి ఏసిపి జి కృష్ణ,ఎస్ఐ దీకొండ రమేష్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే.

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే

పాలకుర్తి నేటిధాత్రి

 

 

పాలకుర్తి మండలంలోని చెన్నూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ఎఫ్ ఎస్ సి ఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శాసన సభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా వారు రైతులతో మాట్లాడుతూ ప్రభుత్వ ధాన్యం కొనుగోలు విధానం, మద్దతు ధర అమలు పరిస్థితులు, కేంద్రంలో ఉన్న సౌకర్యాలపై సమీక్ష నిర్వహించారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో జరుగుతున్న కార్యక్రమాలను పరిశీలించిన ఎమ్మెల్యే, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేగవంతమైన ధాన్యం కొనుగోలు జరుగాలని అధికారులను ఆదేశించారు. తూకంలో పారదర్శకత ఉండాలని, తడిపడిన ధాన్యాన్ని తిరస్కరించకూడదని స్పష్టం చేశారు. అలాగే తక్షణమే ధనరాశిని రైతుల ఖాతాల్లో జమ చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రైతుల నుంచి ఫిర్యాదులు, సూచనలు స్వీకరించిన ఎమ్మెల్యే, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన.!

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే

పాలకుర్తి నేటిధాత్రి

 

 

పాలకుర్తి మండలంలోని వావిలాల గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పాలకుర్తి శాసన సభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా పరిశీలించి, వారి నుంచి నేరుగా సమాచారం తెలుసుకున్నారు. ఈ తనిఖీ సమయంలో అక్కడ ఉన్న రైతులు ఎమ్మెల్యేకి తమ సమస్యలను తెలియజేశారు. ముఖ్యంగా, ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఆలస్యం అవుతున్నదని, మిల్లులకు ధాన్యం తరలించడానికి అవసరమైన లారీలు అందుబాటులో లేవని వారు చెప్పారు. దీనిపై స్పందించిన శ్రీమతి యశస్విని రెడ్డి తక్షణమే జిల్లా కలెక్టర్ రిజ్వాన్ పాషాతో ఫోన్ ద్వారా మాట్లాడి పరిస్థితిని వివరించారు. వెంటనే తగిన చర్యలు తీసుకుని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీమతి యశస్విని రెడ్డి మాట్లాడుతూ రైతుల కష్టం వృథా కాకూడదు, ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. లాజిస్టిక్స్ సమస్యల వల్ల రైతులు ఇబ్బంది పడకూడదు అని కలెక్టర్ తో మాట్లాడి, సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నాను అని అన్నారు. వర్షాల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రైతులు అప్రమత్తంగా ఉండాలి అని, ధాన్యాన్ని తడి కాకుండా కాపాడుకోవడం అవసరం రైతులకు ఉందని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు మెరుగ్గా ఉండేలా అధికారులను ఆదేశించారు. అదనంగా, వారు అధికారులను ఆలస్యం కాకుండా, ఖచ్చితమైన పద్ధతిలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను నిర్వహించాలని సూచించారు. రైతులు ఎటువంటి అవినీతిని సహించవద్దని, ఏదైనా సమస్య ఎదురైతే తాను నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు. ఈ తనిఖీతో గ్రామస్థుల్లో, రైతుల్లో విశ్వాసం పెరిగిందని, ప్రజా ప్రతినిధిగా ప్రజల పక్షాన నిలబడతానని వారు హామీ ఇచ్చారు.

అడ్మిషన్ల కోసం ఇంటింటి ప్రచారం మెట్ పల్లి.

అడ్మిషన్ల కోసం ఇంటింటి ప్రచారం మెట్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల “సిబ్బంది” ఆచారం

మెట్ పల్లి ఏప్రిల్ 26 నేటి దాత్రి

 

 

 

“దోస్ట్” ద్వారా మెట్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ లు చేసుకోవాలని కోరుతూ ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే. వేంకయ్య ఆధ్వర్యంలో శనివారం రోజున ఆ కళాశాల సిబ్బంది సంయుక్తంగా వెంకట్రావుపేట గ్రామంలో ఇంటింటి ప్రచారం చేశారు.

వెంకట్రావుపేట ప్రధాన రహదారి, గ్రామ పంచాయితీ కార్యాలయం, హనుమాన్ దేవాలయం తదితర ప్రాంతాల్లో గల ఇండ్లలోనికి నేరుగా వెళ్ళి,మెట్ పల్లి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2025 -2026 విద్యా సంవత్సరంలో బీ ఏ; బీ కాం (కంప్యూటర్) ప్రథమ సంవత్సరం కోర్సులలో చేరాలని సిబ్బంది ప్రజలకు సూచించారు.

ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులైన విద్యార్థులు, వొకేషనల్ కోర్సులో ఉత్తీర్ణులైన వారు,ఇంటర్మీడియెట్ డ్రాప్ అవుట్స్ వంటి విద్యార్థులు మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఉంటే మాత్రం మెట్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరాలని సూచించారు.

ఈ కళాశాలలో చేరిన విద్యార్థులకు ఎలాంటి ఫీజులు ఉండవని, కంప్యూటర్ ల్యాబ్, గ్రంథాలయం, క్రీడలు, ఉపకార వేతనాల మంజూరు,సాధారణ విజ్ఞాన పరీక్షల నిర్వహణ వంటి సౌకర్యాలతో పాటు అనుభవం మరియు నెట్ , సెట్, స్లెట్, పీ హెచ్ డి వంటి అధిక విద్యార్హతలు గల బోధకులు ఉన్నారని,

ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని మెట్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల బోధన మరియు బోధనేతర సిబ్బంది విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. గత కొన్ని సంవత్సరాల నుంచి మెట్ పల్లి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో కళాశాల సిబ్బంది “దోస్త్” ద్వారా అడ్మిషన్ ల కోసం ఇంటింటి ప్రచారం చేయటం ఆనవాయితీగా వస్తోంది.

ఈ ఇంటింటి ప్రచార కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే. వేంకయ్య, వైస్ ప్రిన్సిపాల్ తొంటి దేవన్న, కళాశాల కామర్స్ హెచ్ ఓ డి ఏ.మనోజ్ కుమార్, లెక్చరర్లు గట్టయ్య, అంజయ్య, సత్తయ్య, రికార్డు అసిస్టంట్ వై.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

వెంకట్రావు పేట గ్రామంలో “దోస్త్” ద్వారా అడ్మిషన్ల ల కోసం చేసిన ఇంటింటి ప్రచార కార్యక్రమానికి మంచి స్పందన లభించిందని ప్రిన్సిపల్ కే వెంకయ్య తెలిపారు.

రేషన్ షాప్ ని ఆకస్మిక తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్.

రేషన్ షాప్ ని ఆకస్మిక తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

 

తంగళ్ళపల్లిమండల కేంద్రంలో రేషన్ షాప్ లో జిల్లా కలెక్టర్ భీమ్యనాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్న బియ్యం కార్యక్రమాన్ని సరిగ్గా అమలు అవుతుందా లేదా అని రేషన్ షాప్ కి వెళ్లి దగ్గరుండి బియ్యం నాణ్యతను పరిశీలించారు గ్రామంలో ప్రజలందరికి సన్న బియ్యం సక్రమంగా అమలు అవుతుందా లేదా అని ఆరా తీశారు అలాగే క్రితం రేషన్ షాప్ ద్వారా దొడ్డు బియ్యం పంపిణీ చేయడం జరిగిందని అలాగే ప్రజలు వాటిని తినకుండా అమ్ముకోవడం జరిగిందని ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఉన్నవారు సన్న బియ్యం తింటున్న క్రమంలో పేదవారికి కూడా సన్న బియ్యం పంపిణీ చేయాలని సంకల్పంతో ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టిందని వీటిలో ఎలాంటి అవకతవకలు జరగకుండా రేషన్ డీలర్లు తగిన జాగ్రత్తలు వహించాలని షాప్ కు సంబంధించిన బోర్డులు ఫ్లెక్సీలు ప్రజలకు కనిపించే విధంగా అందుబాటులో ఉంచాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఇకపై సన్న బియ్యం పై ఎటువంటి అవక తవకలు జరిగిన రేషన్ డీలర్ల పై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ హెచ్చరించారు

ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన DMHO.

ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన డి ఎం హెచ్ ఓ

 

పాలకుర్తి నేటిధాత్రి

 

జనగామ జిల్లా వైద్యాధికారి డాక్టర్ కె. మల్లికార్జున రావు బుధవారం పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక ఉన్నత ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు.

అనంతరం వారు మాట్లాడుతూ వైద్యులు ఎల్లప్పుడూ రోగులకు అందుబాటులో ఉండాలని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ప్రసవాల సంఖ్య పెంచాలన్నారు. ప్రతి గర్భిణీ స్త్రీ ఇంటి వద్దకు వెళ్లి ప్రత్యేకంగా కలిసి ఆరోగ్య సూచనలు అందించాలని కోరారు. ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీల సంఖ్య పెంచాలని తల్లి శిశువు మరణాలను తగ్గించాలని అన్నారు. కుక్కకాటు,పాము కాటు, తేలు కాటు కు మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. వేసవిలో ఎండ దెబ్బకు గురి కాకుండా ప్రతి సెంటర్ లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అలాగే మందులు అందుబాటు లో ఉండాలని ఆసుపత్రి సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో పీహెచ్ సి ఇన్చార్జి డాక్టర్ సిద్ధార్థ రెడ్డి, హాస్పిటల్ సిబ్బంది, తదితరులు ఉన్నారు.

కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు…

తంగళ్ళపల్లి మండలంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు….

తంగళ్ళపల్లి:నేటి ధాత్రి

తంగళ్ళపల్లిమండలంలో పలు గ్రామాల్లో ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ముందుగా తంగళ్ళపల్లి గ్రామపంచాయతీని ఆకస్మికంగా తనిఖీ చేసి గ్రామ పంచాయతీలో ఉన్న వివరాలు అడిగి తెలుసుకుని సిబ్బంది సరైన టైంలో వస్తున్నారా గ్రామపంచాయతీ పరిధిలోని ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూస్తున్నారనిఅధికారులను ఆదేశించారు అలాగే మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి ముందుగా ప్రజాపాలన కౌంటర్ ను పరిశీలించి ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం టి సైబర్ సర్వర్ రూమ్ను పరిశీలించి మండలంలో ఇంటి ఇతర పనులపై ఆరా తీశారు మండలంలో భూముల క్రమబద్ధీకరణకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి వాటిలో ఎన్ని అప్రూవ్ అయ్యాయని ఎంపిడిఓ లక్ష్మీనారాయణ ఆరా తీయగా . 2893. దరఖాస్తులు అప్రూవ్ అయ్యాయని
కలెక్టర్అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు అలాగే నేరెళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేస్తూ ముందుగా ఓపి రిజిస్ట్రేషన్ పరిశీలించారు ఇతర రూములు తిరుగుతూ ఆసుపత్రికి వచ్చే రోగులపై ఎటువంటి రకాల పరీక్షలు చేస్తూ వారికి మందులు ఇచ్చే గది ల్యాబ్ తనిఖీ చేసి మందులు వ్యాక్సిలపై ఆరా తీశారు ప్రభుత్వ వైద్య సేవ చేసుకునేలా ప్రజలందరికీ ప్రభుత్వాసుపత్రిలో వైద్యం చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని వైద్యులకు సిబ్బందికి సూచించారు ప్రభుత్వ దావఖానాలోనే ప్రసవం అయ్యేలా చూడాలని ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని ఇక్కడ ఏమైనా ఇబ్బందులు కొరతలు ఉన్నాయని నేరెళ్ల వైద్యశాల అధికారి డాక్టర్ చంద్రిక రెడ్డిని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు తర్వాత నేరెళ్ల టీజి ఆర్ ఎస్ గర్ల్స్ విద్యార్థి హాస్టల్లో సందర్శించి విద్యార్థుల కు అందిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు జిల్లా కలెక్టర్ మెనూ ప్రకారం రాగిజావయిస్తుండగా పరిశీలించారు తర్వాత ఏ ఆహారాలు విద్యార్థులకు అందిస్తున్నారు అని అడగగా ప్రిన్సిపల్ సమాధానం చెబుతూ మెనూ ప్రకారం బగారా రైస్ ఆలుగడ్డ కూర టమాట ఉడికించిన గుడ్లు, సిద్ధం చేస్తున్నామని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు తర్వాత కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలు పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులు ఉత్తమఫలితాలు సాధించేలా చర్యలు తీసుకొని ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రణాళికల ప్రకారం విద్యార్థులను సిద్ధం చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version