ప్రభుత్వ అనుమతి పొందిన విత్తనాలనే విక్రయించాలి
కేసముద్రం/ నేటి ధాత్రి
కేసముద్రం మండలంలోని పలు విత్తన దుకాణాలను కేసముద్రం మండల టాస్క్ఫోర్స్ టీం మండల వ్యవసాయ అధికారి కేసముద్రం మరియు స్టేషన్ హౌస్ ఆఫీసర్ కేసముద్రం వారు తనిఖీ చేయడం జరిగింది, పలు దుకాణంలో ఉన్నటువంటి వివిధ రకాల కంపెనీ విత్తనాలు, స్టాక్ రిజిస్టర్లు,బిల్ బుక్కులు,ఇన్వైసులు లైసెన్సులు, స్టార్ బోర్డు, గోదామును తనిఖీ చేయడం జరిగింది, వారు మాట్లాడుతూ
డీలర్లు విత్తన చట్టం 1966 ప్రకారం వారి యొక్క క్రయవిక్రయాలు జరుపుకోవాలని, ప్రతి రైతుకు విధిగా బిల్లులు ఇవ్వాలని, ప్రభుత్వం అనుమతి పొందిన విత్తనాలను మాత్రమే రైతులకు అమ్మాలని వారు సూచించారు, రైతులకు కనిపించే విధంగా, లైసెన్సులు,స్టాక్ బోర్డు, మైంటైన్ చేయాలని వారు, సూచించారు, ఎవరైనా డీలర్లు నకిలీ విత్తనాలు అమ్మినట్లు తెలిస్తే, విత్తన చట్టం 1966 ప్రకారం చర్యలు తీసుకుంటామని వారు సూచించారు.
ఈ కార్యక్రమంలో కేసముద్రం మండల స్టేషన్ హౌస్ ఆఫీసర్ మురళీధర్ రాజ్ మండల వ్యవసాధికారి బి వెంకన్న, పోలీస్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.