విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి.

విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి

#ఏ బి ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో వరంగల్ విద్యాశాఖ అధికారి జ్ఞానేశ్వర్ కి వినతి పత్రం.

హన్మకొండ నేటిధాత్రి:

అనంతరం ఏ బి ఎస్ ఎఫ్ బోట్ల నరేష్ మాట్లాడుతూ వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో నూతనంగా అడ్మిషన్ పొందిన విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించాలని విద్యాశాఖ అధికారి కోరారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న మంచినీటి సమస్య, మరుగుదొడ్ల మరమ్మతు మరియు, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న మధ్యాహ్న భోజనం మెనూ అమలు చేసే విధంగా అధికారులు నిరంతరం పర్యవేక్షించి విద్యార్థులకు నాణ్యతమైన భోజనం అందించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలలో నెలకొన్న సమస్యలతో పాటు కస్తూర్బా గురుకుల పాఠశాలలో అదనపు సెక్షన్లు ఏర్పాటు చేయాల్సిందిగా వరంగల్ జిల్లా విద్యాశాఖ అధికారి కోరునట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రమోద్ బన్నీ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసిన యూత్ కాంగ్రెస్ నాయకులు.

విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసిన యూత్ కాంగ్రెస్ నాయకులు

 

పరకాల నేటిధాత్రి:

 

కాంగ్రెస్ పార్టీ జాతీయ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు ఎంపీ రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.మండలంలోని వివిధ గ్రామలలోని ప్రభుత్వ పాఠశాలలో బుక్స్ పంపిణీ చేసిన యూత్ కాంగ్రెస్ పరకాల మండల అధ్యక్షులు దొమ్మటి కృష్ణకాంత్.ఈ కార్యక్రమంలో పరకాల పట్టణ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్,ఏఎంసీ చైర్మెన్ చందుపట్ల రాజిరెడ్డి,బొమ్మకంటి చంద్రమౌళి,బొచ్చు జెమిని,అలీ,దార్నా వేణు,ఒంటెరు శ్రవణ్,మచ్చ సుమన్,యూత్ కాంగ్రెస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ బొచ్చు కోమల,యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద శ్యామ్,అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి అల్లం శ్రీరామ్,పరకాల మండల యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సిలివేరు రాఘవ,వెంకటేశ్,యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

ఉచిత పాఠ్య పుస్తకాలు పంపిణి చేసిన ఎంపీడీఓ ఎమ్ ఈ ఓ.

ఉచిత పాఠ్య పుస్తకాలు పంపిణి చేసిన ఎంపీడీఓ ఎమ్ ఈ ఓ

ముత్తారం నేటి ధాత్రి:

ముత్తారం కేంద్రం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకములు మరియు యూనిఫామ్స్ ఎంపీడీఓ సురేష్ మండల విద్యాధికారి హరిప్రసాద్ లు విద్యార్థిని విద్యార్థులకు అందచేశారు ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పద్మాదేవి, డిపిఎం నాగేశ్వరరావు, ఏపిఎం పద్మ , ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసిన విద్యాధికారి.

పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసిన విద్యాధికారి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

ఝరాసంగం మండల కేంద్రంలోని ఎంఈఓ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, కిట్లు పంపిణీ చేశారు. ఎంఈఓ శ్రీనివాస్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్‌ బుక్స్‌ మండలంలోని 57 పాఠశాలల విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ ప్రైవేట్‌ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడం జరుగుతోందని, విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల ను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలన్నారు. విద్యా కోసం ఎంత ఖర్చు అయినా ప్రభుత్వం భరిస్తుందన్నారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచి, ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు.
మండలంలోని 2663 విద్యార్థుల నిమిత్తం మొదటి విడత పాఠ్య పుస్తకాల పంపిణీ ఝరాసంగం మండలంలోని అన్ని పాఠశాలలకు మొదటి విడత 12,517 పుస్తకాలు మండల వనరుల కేంద్రానికి రావడం జరిగింది ఈకార్యక్రమంలో ఎం ఆర్ సి సిబ్బంది శివ సి.ర్.పి.రాజు షైక్ షఫీవుద్దీన్ లక్ష్మీ ఉపాధ్యాయులు మెదపల్లి ఎల్గోయి నగేష్ శివ చందర్ పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version