తంగళ్ళపల్లి మండలం ఓబులాపూర్ గ్రామానికి చెందిన ఎనగందుల గోపి కుమారుడు. స్వాతి.క్.గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతూ అతి చిన్న వయసులోనే మరణించడం జరిగిందని. తన వంతు సహాయంగా అంకిరెడ్డి పల్లె మాజీ ఎంపిటిసి బీజేవైఎం జిల్లా అధ్యక్షులు. రాగుల రాజిరెడ్డి వారి కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యం చెప్పివారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రగాడ సానుభూతి తెలుస్తూ. ఎనగందుల గోపి. భారతీయ జనతా పార్టీ సామాన్య కార్యకర్త అని అతని కుమారుడు స్వాతి అనారోగ్యం కారణంతో మరణించగా నా వంతు సహాయంగా. 50 కేజీల బియ్యాన్ని 2500 రూపాయలు అందజేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇందుకుగాను చనిపోయిన కుటుంబ సభ్యులు ఈ సహాయం చేసిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారుఇట్టి కార్యక్రమంలో ఓబులాపూర్ బూత్ అధ్యక్షులు .నందగిరి మధు. సీనియర్ నాయకుడు ఆసాని రామలింగారెడ్డి బీజేవైఎం జిల్లా సెక్రెటరీ చిందం నరేష్. సిరిసిల్ల వంశీ. సంపత్. చిలగాని నరేష్. గోకుల కొండ కృష్ణ. మెహర్ కృష్ణ. అనిల్. ప్రశాంత్. శ్రీకాంత్. నాయకుడు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు
మానకొండూరు ఎమ్మెల్యే కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మండల .
పార్టీ నాయకులు….
తంగళ్ళపల్లి నేటి ధాత్రి….
తంగళ్ళపల్లి మండలం నుంచి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బయలుదేరి మానకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కవ్వం పల్లి.
సత్యనారాయణ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు .
పుట్టినరోజు సందర్భంగా తంగళ్ళపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు బుక్స్ అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.
ఇట్టి కార్యక్రమంలో సిరిసిల్ల ఏఎంసీ డైరెక్టర్ ఆరెపల్లి బాలు.
కాంగ్రెస్ పార్టీ మానవ హక్కుల యువజన విభాగం అధ్యక్షులు గుగ్గిల భరత్ గౌడ్.
కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు అందరు కలిసి ఇల్లంతకుంటమండలంలోని కాంగ్రెస్ పార్టీ మానకొండూరు ఎమ్మెల్యే కవ్వం పల్లి సత్యనారాయణ.
పుట్టినరోజు వేడుకలను మండలంలో పెద్ద ఎత్తున నిర్వహించారు ఈ కార్యక్రమంలో. జిల్లా మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా జరపాలి
ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా నిలిచిన అన్ని కులాలకు కృతజ్ఞతలు తెలుపుతాం- ఎమ్మార్పీఎస్ జిల్లా ఇంచార్జి మంద రాజు మాదిగ
కరీంనగర్, నేటిధాత్రి:
జూలై 7న ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గ్రామ గ్రామాన పెద్ద ఎత్తున నిర్వహించాలని , దండోరా జెండాను ఆవిష్కరించి అన్ని కులాల పెద్దలను సత్కరించాలని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇంచార్జి మంద రాజు మాదిగ, జిల్లా అధ్యక్షులు బెజ్జంకి అనిల్ మాదిగ పిలుపునిచ్చారు.
కరీంనగర్ జిల్లా రామడుగు మండల స్థాయి ఎమ్మార్పీఎస్ కార్యకర్తల సదస్సు కొత్తూరి రాజన్న మాదిగ అధ్యక్షతన జరిగింది.
ఈకార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా ఎమ్మార్పీఎస్ జిల్లా ఇంచార్జి మంద రాజు మాదిగ, జిల్లా అధ్యక్షులు బెజ్జంకి అనిల్ మాదిగలు పాల్గొని మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం మంద కృష్ణ మాదిగ నేతృత్వంలో మూడు దశాబ్దాలుగా రాజీలేని పోరాటం చేసి విజయం సాధించడం జరిగింది.
ఈపోరాటానికి అన్ని కులాలు మద్దతు ఇవ్వడం జరిగిందని అన్నారు.
ఎమ్మార్పీఎస్ ఉద్యమం మాదిగల కోసమే ప్రారంభించినా అన్ని వర్గాల సంక్షేమం కోసం పోరాడిందని అన్నారు.
గుండె జబ్బుల చిన్నారుల ఉచిత ఆపరేషన్ల కోసం, ఆరోగ్యశ్రీ పథకం కోసం, వికలాంగులు వృద్దులు వితంతువుల పెన్షన్ల కోసం ఎస్సీ,ఎస్టీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్ల కోసం తెలంగాణ అమరుల కుటుంబాల సంక్షేమం కోసం, మహిళలపై అత్యాచారాలను అరికట్టడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని పాలకుల మీద పోరాడి విజయం సాధించిందని అన్నారు.
ఈఫలితాలు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు అనుభవిస్తున్నారని అన్నారు.
సుదీర్ఘ కాలం ప్రజల్లో ఉండి అన్ని వర్గాలకు ఉద్యమం ద్వారా సేవ చేసినందుకే మంద కృష్ణ మాదిగకి పద్మశ్రీ పురస్కారం దక్కిందని అన్నారు.
ఈఅవార్డు మాదిగ జాతికి దక్కిన గౌరవమని అన్నారు.
ఎస్సీ వర్గీకరణ సాధించిన నేపథ్యంలో సమాజంలోని అన్ని వర్గాల ప్రయోజనాల దృష్ఠిలో పెట్టుకొని భవిష్యత్తూలో ముందుకు సాగుతామని అన్నారు.
జూలై 7న ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామంలో దండోరా జెండాను ఆవిష్కరించాలని అన్నారు.
ప్రతి గ్రామంలో సభలు నిర్వహించి పెద్ద ఎత్తున వేడుకలు చేయాలని పిలుపునిచ్చారు.
ఈకార్యక్రమంలో కొత్తూరి రాజన్న మాదిగ, తడగొండ శంకర్ మాదిగ, శనిగరపు హన్మయ్య మాదిగ, దోమకొండ శ్రీనివాస్ మాదిగ, గంగాధర రవి మాదిగ, జెట్టిపెల్లి అనిల్ మాదిగ, గజ్జెల స్వామి మాదిగ, లంక నర్సింగం మాదిగ, తడగొండ రమేష్ మాదిగ, కనకం అంజయ్య మాదిగ, తడగొండ రాజు మాదిగ, కొత్తూరి బాబు మాదిగ, భూత్కూరి అంజయ్య మాదిగ, గుడిసె విజయ్ మాదిగ, రేణికుంట బాపు రాజు మాదిగ, తదితరులు పాల్గొన్నారు.
ఫిట్నెస్ లేని ప్రైవేట్ స్కూల్ బస్సులను సీజ్ చేయాలి
ఆర్ టి ఓ కు ఫిర్యాదు
వనపర్తి నేటిధాత్రి :
విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఫిట్నెస్ లేని ప్రైవేటు స్కూలు బస్ లను సిజ్ చేయాలని విద్యార్థుల యువజన సంఘాల అధ్యర్య ములో ఆర్ టి ఓ కు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా విద్యార్థుల సంఘాల నాయకులు రాఘవేంద్ర వెంకటే ష్ కుతుబ్ లు మాట్లాడుతూ వనపర్తి పట్టణ ము జిల్లాలోని వివిధ మండల కేంద్రంలో ప్రైవేటు స్కూలలో పిట్నెస్ లేని బస్సులను లైసెన్స్ లేని డైవర్స్ ను తొలగించాలని విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశామని చెప్పారు పిల్లలు భవిష్యత్ లో బాగా చదవాలని తమ విద్యార్థులను ప్రైవేటు స్కూల్ లో వేలకు వేలు డబ్బులు డొనేషన్ చేసి చదివిస్తూ ఉంటే అక్కడ ఉన్న స్కూల్ యాజమాన్యం వాళ్ళు లైసెన్స్ డ్రైవర్స్ కొనసాగిస్తూ వచ్చేరాని డ్రైవింగ్ చేస్తూ విద్యార్థుల మరణ ము కు కారణం అవుతున్నారని తెలిపారు
సిరిసిల్ల జిల్లాలో ఇసుక అక్రమ దారుల పంజా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుకకొరత
మూడు వేల రూపాయల. నుండి నాలుగు వేల రూపాయలు
టాక్టర్ ఇసుక అమ్ముతున్న ఇసుక అక్రమ దారులు ఆగిపోతున్న నిర్మాణాలు
వారానికి మూడు రోజులు ప్రభుత్వం ఇసిక సప్లై చేయాలి
ఇసుక అక్రమ దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి
సి.పి.ఎం జిల్లా కార్యదర్శి ముశం రమేష్ డిమాండ్
సిరిసిల్ల టౌన్: ( నేటిధాత్రి )
ఈరోజు సిరిసిల్ల పట్టణ కేంద్రం అమృత్ లాల్ శుక్ల కార్మిక భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో సి.పి.ఎం జిల్లా కార్యదర్శి ముశం రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ పథకంలో భాగంగా ఇంటి స్థలం ఉన్న వాళ్లకు ఐదు లక్షల రూపాయలు ఇల్లు నిర్మాణానికి అందిస్తుంది. సిరిసిల్ల పట్టణంలో 700 పై చిలుకు ఇల్లు మంజూరు చేయడం జరిగినది. ఒకేసారి అందరూ నిర్మాణం ప్రారంభించడం వలన ఇసుక కొరత తీవ్రంగా తీవ్రంగా నెలకొన్నది ఫలితంగా నిర్మాణాలు ఆగిపోయాయి ఇసుక డిమాండ్ ను ఆసరా చేసుకొని కొంతమంది అక్రమంగా ఇసుక రవాణా చేసి వాళ్ళు ఇసుక ధర పెంచి 1500 ట్రాక్టర్ ఉన్న రేటును మూడు3 వేల నుండి 4 వేలకు టాక్టర్ .ఇసుక అమ్ముతున్నారు. గత 15 రోజులు నుండి ప్రభుత్వం ఇసుక సప్లై కి చేయకపోవడం మూలంగా ఈ పరిస్థితి ఏర్పడింది.ప్రభుత్వం వెంటనే స్పందించి ఇసుక కొరత లేకుండా వారానికి మూడు రోజులు ఇసుక పంపిణీ చేస్తేనే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తి అవుతుంది వర్షాలు బాగా పడి మానేరు వాగు ప్రయాహిస్తే మానేరు నుండి ఇసుక తీయడం నిలిచిపోతుంది.ఫలితంగా ప్రభుత్వం దసరా వరకు పూర్తి చేయాలనుకున్న నిర్మాణాలు పూర్తి కాకుండా ఆగిపోతాయి.ఇల్లు కూలగొట్టుకొని నిర్మాణం చేసుకుంటున్నాం వారికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది.సిరిసిల్ల ప్రజలకు తరుపున. మానేరులో ఇసుక ఉన్నా కూడా వేల రూపాయలు ఖర్చుపెట్టి కొనుక్కోవలసిన దౌర్భాగ్య పరిస్థితి నెలకొన్నది ఇసుక అక్రమ దారులు మానేరు నుంచి కోట్లాది రూపాయల ఇసుకను దొంగతనం చేసి ఇతర ప్రాంతాలకు అమ్ముతుంటే. అధికారులు చూసి చూడనట్టు వివరిస్తారు స్థానికులు నిర్మాణాలు చేసుకోవడానికి కావాలంటే అనేక ఆంక్షలు ప్రభుత్వం విధిస్తుంది,ఇప్పటికైనా ప్రభుత్వం రాజన్న సిరిసిల్ల జిల్లా లో నిర్మించుకుంటున్న వారి నిర్మాణాలకు ఉచితంగా ఇసుక సప్లై చేయాలి. మానేరు నది నుండి ఇతర ప్రాంతాలకు ఇసుకను. అక్రమంగా తరలించకుండా అక్రమ దారులపై పీడీ యాక్ట్ కేసు లు నమోదు చేయాలి టాక్టర్ ఇసుక ధర 1500 మించకుండా ప్రభుత్వం ధరలను నియంత్రించాలనీ. అన్నారు లేనిపక్షంలో సి.పి.ఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు.సమావేశంలో సి.పి.ఎం కార్యదర్శి వర్గ సభ్యులు కోడం రమణ, సి.పి.ఎం జిల్లా కమిటీ సభ్యులు సూరం పద్మ, మల్లారం ప్రశాంత్, మిట్టపల్లి రాజమల్లు పాల్గొన్నారు.
నాగరికత ఎంతగా ముందుకు సాగినా.. నాగలి లేనిదే పని జరగదు. రైతు లేనిదే పూట గడవదు. అలాంటి వ్యవసాయానికి సంబంధించిన పండుగే ఏరువాక పౌర్ణమి. దీనినే హలపౌర్ణమి అని కూడా అంటారు. ఇంతకీ ఈ ఏరువాక పౌర్ణమి విశిష్టత ఏమిటి. దాన్ని ఈ రోజునే ఎందుకు చేసుకుంటారు అంటే… వైశాఖ మాసం ముగిసి జ్యేష్ఠం మొదలైన తరువాత వర్షాలు కురవడం మొదలవుతాయి. ఒక వారం అటూ ఇటూ అయినా కూడా, జ్యేష్ఠ పౌర్ణమినాటికి తొలకరి పడక మానదు. భూమి మెత్తబడకా మానదు. అంటే నాగలితో సాగే వ్యవసాయపు పనులకు ఇది శుభారంభం అన్నమాట. అందుకనే ఈ రోజున ఏరువాక అంటే ‘దుక్కిని ప్రారంభించడం’ అనే పనిని ప్రారంభిస్తారు. అయితే జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి వరకూ ఎందుకు ఆగడం. ఖాళీగా ఉంటే కాస్త ముందర నుంచే ఈ దుక్కిని దున్నేయవచ్చు కదా అన్న అనుమానం రావచ్చు. ఎవరికి తోచినట్లు వారు తీరికని బట్టి వ్యవసాయాన్ని సాగిస్తే ఫలితాలు తారుమారైపోతాయి. సమిష్టి కృషిగా సాగేందుకు, పరాగ సంపర్కం ద్వారా మొక్కలు ఫలదీకరణం చెందేందుకు, రుతువుకి అనుగుణంగా వ్యవసాయాన్ని సాగించేందుకు… ఇలా రకరకాల కారణాలతో ఒక వ్యవసాయిక క్యాలండర్‌ను ఏర్పరిచారు మన పెద్దలు. అందులో భాగమే ఈ ఏరువాక పౌర్ణమి. కొంతమంది అత్యుత్సాహంతో ముందే పనిని ప్రారంభించకుండా, మరికొందరు బద్ధకించకుండా… ఈ రోజున ఈ పనిని చేపట్టక తప్పదు.
– వ్యవసాయ పనిముట్లకు పూజలు…
Agricultural Work.
ఏరువాక పౌర్ణమి రోజు వ్యవసాయ పనిముట్లు అన్నింటినీ కడిగి శుభ్రంచేసుకుంటారు రైతులు. వాటికి పసుపుకుంకుమలు అద్ది పూజించుకుంటారు. ఇక ఎద్దుల సంగతైతే చెప్పనక్కర్లేదు. వాటికి శుభ్రంగా స్నానం చేయించి, వాటి కొమ్ములకు రంగులు పూస్తారు. కాళ్లకు గజ్జలు కట్టి, పసుపుకుంకుమలతో అలంకరించి హారతులిస్తారు. పొంగలిని ప్రసాదంగా చేసి ఎద్దులకు తినిపిస్తారు. ఇక ఈ రోజున జరిగే తొలి దుక్కిలో కొందరు తాము కూడా కాడికి ఒక పక్కన ఉండి ఎద్దుతో సమానంగా నడుస్తారు. వ్యవసాయ జీవనంలో తమకు అండగా నిలిచి, కష్టసుఖాలను పాలుపంచుకునే ఆ మూగ జీవాల పట్ల ఇలా తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తారు. ఇక ఏరువాక సాగుతుండగా, అలుపు తెలియకుండా పాటలు పాడుకునే సంప్రదాయమూ ఉంది. అందుకనే ఏరువాక పాటలు, నాగలి పాటలకి మన జానపద సాహిత్యంలో గొప్ప ప్రాముఖ్యత ఉంది. జ్యేష్ఠ మాసంలో మొదలయ్యే నైరుతి రుతుపవనాల ప్రభావం ఇంచుమించు భారతదేశమంతటా ఉంటుంది. మన దేశంలోని దాదాపు 80 శాతం వర్షపాతం ఈ నైరుతి వల్లనే ఏర్పడుతుంది. కాబట్టి ఈ ఏరువాక పౌర్ణమిని దేశమంతటా జరుపుకుంటారు. పున్నమి నాడు పూజలు చేయడం వల్ల ఆ సంవత్సరం అంతా పంటలు సమృద్ధిగా పండుతాయని అన్నదాతలు విశ్వసిస్తారు.
– రైతులకు ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన సీనియర్ నాయకుడు ముత్యం ప్రవీణ్ కుమార్….
కొల్చారం మండలం రైతులకు కొల్చారం మండలం సీనియర్ బి ఆర్ఎస్ పార్టీ నాయకుడు ముత్యం ప్రవీణ్ కుమార్ ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ పనులను ప్రారంభిస్తూ ప్రకృతిని దైవంగా భావించి భూమిని పూజించే సంప్రదాయం మనదని పేర్కొన్నారు. వర్ష ఋతువు ఆరంభమయ్యే జ్యేష్ఠ పౌర్ణమి నాడు భూమిని పూజించడమే గాక వ్యవసాయానికి ఆధారమైన పశుసంపద రోగాల బారిన పడకుండా అన్నదాతలు సంప్రదాయ కార్యక్రమాలను నిర్వహిస్తారని తెలిపారు.
హంతక భార్యలు – వివాహ వ్యవస్థకు ముప్పు తెస్తున్నారా ?
జైపూర్,నేటి ధాత్రి:
ఇటీవలి కాలంలో కొన్ని నేర ఘటనలు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి.అలాంటి వాటిలో ఎక్కువగా విలన్లు.. మహిళలు,భార్యలే.తాజాగా దేశవ్యాప్తంగా నేషనల్ మీడియాలోనూ మార్మోగిపోతున్న పేరు సోనమ్ రఘువంశీ.తన భర్త రాజా రఘువంశీని హనీమూన్‌కు అని మేఘాలయ తీసుకెళ్లి అక్కడ అడవుల్లో సుపారీ గ్యాంగ్ తో చంపించేసి..తాను మాత్రం ప్రియుడితో గడిపేందుకు యూపీ వెళ్లిపోయింది.మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన ఆర్థికంగా బలంగా ఉన్న రెండు రఘువంశీ కుటుంబాలు ఇప్పుడు తమ కుటుంబాల దుస్థితిని తల్చుకుని దిగులుపడుతున్నారు.
భార్యల దురాగతాల క్రైమ్ న్యూస్ వైరల్
ఒక్క సోనమ్ కాదు..ఇటీవల వారానికో క్రైమ్ కథ .. అదీ కూడా భార్యల ఘోరాలు వైరల్ అవుతున్నాయి.ఓ భార్య నేవీలో పని చేసే భర్తను ముక్కలు చేసి డ్రమ్ములో వేసి సిమెంట్ పోస్తుంది.మరో భార్య ప్రియుడితో కలిసి భర్తను పాము కాటు వేయించి చంపేస్తుంది.ఇలాంటివి చెప్పుకుంటే లెక్కలేనన్ని వీటికి తోడు భార్యల వేధింపులకు భరించలేక ఆత్మహత్యలు చేసుకునే భర్తల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోయింది. బెంగళూరు టెకీ అతుల్ సుభాష్ ఆత్మహత్య ఘటన పెను సంచలనం సృష్టించింది. అలాంటి ఆత్మహత్యలు తర్వాత పదుల సంఖ్యలో బయటకు వచ్చాయి. ఎప్పటికప్పుడు ఈ భార్యల దురాగతాలే వైరల్ అవుతున్నాయి.
పెళ్లి చేసుకోకపోవడం బెటర్ అంటున్న నెటిజన్లు
ఇలాంటి నేరాలతో చాలా మంది నెటిజన్లు భయపడుతున్నారు.తాము పెళ్లి చేసుకోకూడదని అనుకుంటున్నామని… ఈ కాలం అమ్మాయిలు మారిపోయారని అంటున్నారు.పెళ్లి కాక ముందు శారీరక సంబంధం లేని అమ్మాయిలే ఉండటం లేదని కొంత మంది చాలెంజ్ చేస్తున్నారు.వివాహ వ్యవస్థకు అమ్మాయిల తీరుతో పెద్ద ముప్పు ఏర్పడిందని కామెంట్లు చేస్తున్నారు.మగాళ్ల బాధలను పట్టించుకునేవారు కావాలని అంటున్నారు.మహిళల నేరాల గురించి బయటకు వచ్చినప్పుడల్లా వివాహ వ్యవస్థతో పాటు మహిళల హక్కులపై చర్చ ప్రారంభమవుతోంది.
సమాజం మారలేదు.. తేడా సోషల్ మీడియానే
అయితే కాస్త లోతుగా ఆలోచిస్తే చాలా మంది సమాజం ఏమీ మారలేదని కొంత మంది గుర్తు చేస్తున్నారు.కోట్ల కుటుంబాలు ఉన్న దేశంలో వివాహ వ్యవస్థ చాలా బలంగా ఉంది.ఎక్కడో ఓ చోట జరిగే నేరాలతో మొత్తం వ్యవస్థకు ముప్పు వస్తుందని.. అందరూ అలాగే ఉంటారనుకోవడం మంచిది కాదని అంటున్నారు.అప్పటికి ఇప్పటికీ తేడా సోషల్ మీడియా మాత్రమే. విపరీతంగా జరిగే ప్రచారాల వల్లనే ఇలాంటి సమస్యలు వస్తున్నాయంటున్నారు.
– మధ్యాహ్న భోజన పథకం – వండేటప్పుడు,వడ్డించేటప్పుడు….. – పాటించాల్సిన పద్ధతులు నియమాల పై శిక్షణ కార్యక్రమం…..
కొల్చారం, (మెదక్)నేటిధాత్రి :-
రాష్ట్ర మరియు జిల్లా విద్యాశాఖ ఆదేశాల మేరకు మంగళవారం కొల్చారం మండలంలోని మూడు కాంప్లెక్స్ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన కార్మికులకు మరియు ప్రధానోపాధ్యాయులకు మధ్యాహ్న భోజనం వండేటప్పుడు మరియు వడ్డించేటప్పుడు పాటించే పద్ధతులు నియమాలపై శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా స్థాయిలో శిక్షణ పొందినటువంటి ఉపాధ్యాయులు కాంప్లెక్స్ స్థాయిలో ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికులకు మరియు ప్రధానోపాధ్యాయులకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల విద్యాధికారి శ్రీ సత్యనారాయణ రావు మాట్లాడుతూ తూచా తప్పకుండా ట్రైనింగ్లో తెలియజేసిన వంటి సూచనలు పాటించాలని అదేవిధంగా క్రింది సూచనలు తప్పకుండా అనుసరించాలని తెలియజేశారు.
– మధ్యాహ్న భోజనం వండేటప్పుడు పాటించవలసిన నియమాలు…
పాత్రలు: వంట వండే పాత్రలు పరిశుభ్రమైన నీటితో కడిగి ఉండాలి. వంట వండే పాత్రలు శుభ్రంగా ఉండాలి. నీరు: వంటకు వాడే నీరు పరిశుభ్రమైనదై ఉండాలి. బియ్యం: అన్నం వండే ముందు బియ్యాన్ని శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసిన బియ్యాన్ని పరిశుభ్రమైన నీటితో కడగాలి. కూరగాయలు: వంట చేయడానికి తెచ్చిన కూరగాయలను ముందుగా శుభ్రంగా కడగాలి. కడిగిన తరువాతనే కూరగాయలను తరుగుకోవాలి. తరిగే చాకు/కత్తిపీటను కూడా శుభ్రంగా కడుగుకోవాలి. మూతలు: వంట చేసేటప్పుడు వంట వండే పాత్రల మీద మూతలు వేసుకోవాలి. మూతలు వేయడం వలన చుట్టూ పరిసరాలలో ఉన్న దుమ్ము పడదు, వంట చెరకు (కట్టెలు) లేదా గ్యాస్ ఆదా చేయవచ్చు. ఇంధన ఆదా: వంట పూర్తి అవ్వడానికి 10 నిమిషాల ముందు మంట ఆర్పేసి, పాత్రలోని వేడితో మిగిలిన వంట పూర్తిచేయవచ్చు. దీని వల్ల వంట చెరకు/ఇంధన శక్తి ఆదా అవుతుంది. పరిశుభ్రత: వంట పూర్తి అయిన తరువాత వాడే క్లీనింగ్ క్లాత్‌తో సహా అన్నీ శుభ్రంగా ఉంచుకోవాలి. వంట చేసే వారి పరిశుభ్రత: వంట చేసేవారు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. వంట చేసేవాళ్ళు గోళ్లు పెంచుకోకూడదు. తలకి క్యాప్, ఆప్రాన్ వేసుకొని వంట చేయాలి. వంట చేసేవారు తలలో చేతులు పెట్టుకోవడం కానీ, ముఖంలో వేళ్లు పెట్టుకోవడం కానీ, దురద పుట్టినప్పుడు గోకడం కానీ చేయకూడదు. ముఖ్య గమనిక: పైన చెప్పిన వాటిలో ఏ ఒక్కటి పాటించకపోయినా వండిన ఆహారం కలుషితం అయిపోతుంది. పిల్లలకు అనారోగ్యం కలగవచ్చు
గరిటలు: అన్నం, కూర, చారు వడ్డించడానికి వాడే గరిటలు శుభ్రమైనవి, సరైన సైజువి అయి ఉండాలి. అన్నం వడ్డించడానికి హౌసింగ్ గరిట, కూరకి ఒక గరిట, చారుకు గుంట గరిట వాడాలి. మూతల స్థానం: వడ్డించడానికి తీసిన మూతలను శుభ్రమైన ప్రదేశంలో పెట్టాలి. గరిటల స్థానం: వడ్డించిన తరువాత గరిటలను ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. వడ్డించేటప్పుడు వాడే గరిటను ఏదైనా ఒక ప్లేటులో పెట్టుకోవాలి. వడ్డించే స్థలం: వడ్డించే స్థలం కూడా పరిశుభ్రంగా ఉండాలి. కీటకాలు: మూతలు తీసిన వంట మీద ఈగలు, దోమలు వాలకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ పరిధిలోని ప్రధానోపాధ్యాయులు మరియు వంట కార్మికులు మరియు సహాయకులు పాల్గొనడం జరిగింది
బీసీ హాస్టల్ భవనం కోసం సంక్షేమ అధికారి వినతి పత్రం
నల్లబెల్లి,నేటిధాత్రి:
నల్లబెల్లి మండల కేంద్రంలోని బీసీ హాస్టల్ భవనాన్ని మరమ్మతు చేసి నూతన భవనం ఏర్పాటు చేసేవరకు బీసీ హాస్టల్ విద్యార్థులను ఎస్సీ హాస్టల్లోకి మార్చాలని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ జిల్లా అధికారి పుష్పాలతకు వినతి పత్రం అందజేశారు.అనంతరం ఏబిఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరేష్, స్వేరోస్ మాజీ జిల్లా అధ్యక్షుడు శనిగరపు రాజేంద్రప్రసాద్, వి హెచ్ పి ఎస్ మండల అధ్యక్షుడు పులి రమేష్ మాట్లాడుతూ నల్లబెల్లి మండల కేంద్రంలోని గత 30 సంవత్సరాల క్రితం నిర్మించిన బీసీ హాస్టల్ భవనం శిథిలావస్థకు చేరుకోవడం వలన విద్యార్థులు భయం గుప్పెట్లో ఉంటున్నారని అవేదన వ్యక్తం చేశారు. ఎప్పుడు భవన పైనుండి పెచ్చులు ఊడి పడతాయని భయంతో కాలం వెలదీసే పరిస్థితి విద్యార్థులకు నెలకొందని అన్నారు.ఈ విద్యా సంవత్సరం ప్రారంభం అవుతున్న క్రమంలో చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న విద్యార్థులు విద్యార్థి యొక్క తల్లిదండ్రులు, హాస్టల్ భవనం శిథిల వ్యవస్థ ఉండడంతో హాస్టల్లో ప్రవేశం పొందేందుకు సానుకూలంగా లేకపోవడంతో విద్యార్థులు వేరొక చోటకు వెళ్లే పరిస్థితి నెలకొందని అధికారులకు తెలిపారు. అధికారులు నూతన భవనం ఏర్పాటు చేసేంతవరకు, నల్లబెల్లి ఎంపీడీవో కార్యాలయం ప్రక్కన ఉన్న ఎస్సీ హాస్టల్ భవనంలోకి మార్చి హాస్టల్ విద్యార్థులకు న్యాయం చేయాల్సిందిగా బిసి సంక్షేమ జిల్లా అధికారి పుష్పలత ద్వారా జిల్లా కలెక్టర్ ను కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్, భరత్,ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.
కార్మికులంతా రక్షణ సూత్రాలను అనుసరించి పని చేయాలి..
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
సింగరేణి సంస్థలో పనిచేసే కార్మికులు, అధికారులు ప్రతి ఒక్కరూ రక్షణ సూత్రాలను అనుసరించి పని చేయాలని, ఇంటి నుండే రక్షణతో హెల్మెట్ ధరించి డ్యూటీకి రావాలని, డ్యూటీలో ఎల్లప్పుడూ రక్షణ పరికరాలు ధరించి పని చేయాలని మందమర్రి ఏరియా జిఎం దేవేందర్ అన్నారు.
మంగళవారం రామకృష్ణాపూర్ సిహెచ్పీ లో డీజీఎం బీ బీ ఝా ఆధ్వర్యంలో స్పెషల్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించగా ముఖ్య అతిథులుగా మందమర్రి ఏరియా జిఎం దేవేందర్, బెల్లంపల్లి ఏరియా రీజినల్ సేఫ్టీ జీఎం రాజ్ కుమార్, ఏరియా సేఫ్టీ అధికారి రవీందర్, ఏజీఎం వెంకటరమణ ,ఏఐటియుసి సెంట్రల్ సెక్రటరీ అక్బర్ అలీ, ఏరియా వైస్ ప్రెసిడెంట్ లింగయ్య, ఫిట్ సెక్రటరీ రామకృష్ణ, ఇంజనీర్ జాకీర్ హుస్సేన్ తదితరులు హాజరయ్యారు.ఈ సందర్భంగా జిఎం దేవేందర్ మాట్లాడారు. సింగరేణిలో పనిచేసే కార్మికులు రక్షణ సూత్రాలను పాటించాలని, ప్రతి పనిలో నిబద్ధత కలిగి ఉండాలని, ఆరోగ్యం పై దృష్టి సారించాలని, ప్రతి కార్మికుడు ఆరోగ్య సింగరేణియుడి గా ఉండాలని అన్నారు. సింగరేణి సంస్థ కార్మికుల సేఫ్టీ కోసం ప్రతిదీ సమకూరుస్తుందని, కార్మికులు సైతం సంస్థ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని కోరారు.
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం లో ఇందిరమ్మ ఇళ్లు మోడల్ హౌస్ ను ఎమ్మెల్యేలు కశిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తి పట్టణంలోని CKR (చింతల కొండా రెడ్డి) ఫంక్షన్ హాల్ లో కల్వకుర్తి పట్టణం, కల్వకుర్తి మండలం, వెల్దండ మండలం, చారకొండ మండాల లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణ రెడ్డి జిల్లా ఇంచార్జిలు తెజావత్ బెల్యా నాయక్, రాజశేఖర రెడ్డి, ప్రవీణ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
మండలంలోని వివిధ పాఠశాలలో పనిచేసే పారిశుద్ధ కార్మికులకు ఒకరోజు శిక్షణ మండల వనరుల కేంద్రం కొల్చారంలో నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి సత్యనారాయణ రావు మాట్లాడుతూ పారిశుధ్యం పై వారికి పలు సూచనలు చేయడం జరిగింది ఇందులో రిసోర్స్ పర్సన్ వెంకటేశం, మండల వనరుల కేంద్రం సిబ్బంది మరియు సిఆర్పిలు పాల్గొనడం జరిగింది.
వేసవి సెలవుల అనంతరం ఎల్లుండి నుండి బడులు పున:ప్రారంభం అవుతున్న నేపథ్యంలో పాఠశాలల పరిశుభ్రత మరియు పారిశుధ్యం పై శిక్షణకు హాజరైన పాఠశాల పారిశుద్ధ కార్మికులకు అవగాహన శిక్షణ కార్యక్రమం జరిపించారు.
నర్సంపేటలో జరుగుతున్న అభివృద్ధి మాజీ ఎమ్మెల్యే పెద్ది నిధులే..
మున్సిపాలిటీని అభివృద్ధి చేసింది బిఆర్ఎస్ పార్టే..
ఆర్ఎస్ఎస్ రాష్ట్ర మాజీ డైరెక్టర్ రాయిడి రవీందర్ రెడ్డి
నర్సంపేట,నేటిధాత్రి:
కాంగ్రెస్ ప్రభుత్వం పేరుతో నర్సంపేట పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల నిధులు గత ఎన్నికలకు ముందు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెచ్చిన నిధులే ఆని బిఆర్ఎస్ రాష్ట్ర రైతు సమన్వయ మాజీ డైరెక్టర్ రాయిడి రవీందర్ రెడ్డి తెలిపారు.
బిఆర్ఎస్ పట్టణ పార్టీ అధ్యక్షుడు నాగల్లి వెంకట్ నారాయణ గౌడ్ అధ్యక్షతన పట్టణంలోని సిటిజెన్ క్లబ్ లో నర్సంపేట పట్టణ వార్డు ముఖ్యులు, క్లస్టర్ బాధ్యులతో పార్టీ సమావేశం మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశాలతో నిర్వహించారు.
ఈ సందర్భంగా రాయిడి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ గత పేదేండ్ల కాలంలో నర్సంపేట మున్సిపాలిటీని అభివృద్ధి చేసింది బిఆర్ఎస్ పార్టీ మాత్రమే అని పేర్కొన్నారు.ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలను నెరవేర్చలేదని ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి సర్కార్ పట్ల ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచిన నర్సంపేట మున్సిపాలిటీ అభివృద్ధికి ఒక రూపాయి నిధులు కూడా తీసుకురాలేదని ఎద్దేవా చేశారు.
అశాస్త్రీయంగా గ్రామాలను మున్సిపాలిటీలో కలిపారని, ప్రజలతో ఎలాంటి అభిప్రాయం తీసుకోలేదని చెప్పారు.
రాజకీయంగా ఎదుర్కోలేక కుట్ర పూరితంగా మున్సిపాలిటీ వార్డుల విభజన చేసారని రవీందర్ రెడ్డి ఆరోపించారు.
ప్రజల అభిప్రాయాలకు భిన్నంగా వార్డుల విభజన జరిగిందని,వార్డుల వారీగా కేటాయించిన ఓటర్ల సంఖ్యలో తీవ్ర వ్యత్యాసం కనిపిస్తుందని అన్నారు.
స్థానిక అధికారులు అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు లోను కాకుండా విభజనను పునఃసమీక్షించి శాస్త్రీయ పద్ధతిలో వార్డుల విభజన జరగాలని కోరుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
నిజమైన పేదలకు అర్హులకు సంక్షేమ పథకాలు అందడం లేదని తెలుపుతూ పేదలను మభ్యపెట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు లబ్ధి పొందాలనుకుంటున్నారని ఆరోపించారు.
స్థానిక కాంగ్రెస్ నాయకులు చేస్తున్న అరాచకాలను ప్రజలలోకి తీసుకెళ్లాలని బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
భవిష్యత్తులో పార్టీ కార్యకర్తలు నాయకులు సమిష్టిగా పనిచేసి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని ఆర్ఎస్ఎస్ రాష్ట్ర మాజీ డైరెక్టర్ రాయిడి రవీందర్ రెడ్డి కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు లెక్కల విద్యాసాగర్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షులు నామాల సత్యనారాయణ, క్లస్టర్ బాధ్యులు మోతే జయపాల్ రెడ్డి,మచ్చిక నరసయ్య గౌడ్,బండి రమేష్ ,రాంప్రసాద్,కడారి కుమారస్వామి,బండి ప్రవీణ్,పట్టణ
ప్రధాన కార్యదర్శి వెన్నుముద్దల శ్రీధర్ రెడ్డి,మహిళా విభాగం అధ్యక్షురాలు వాసం కరుణ,మాజీ కౌన్సిలర్స్,పట్టణ కమిటీ బాధ్యులు,వార్డు అధ్యక్షులు,యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
గ్రామ పంచాయతీలను సందర్శించిన ఎంపీఓ శ్రీపతి బాబురావు
జైపూర్,నేటి ధాత్రి:
జైపూర్ మండలం గంగిపెల్లి గ్రామ పంచాయతీని మంగళవారం ఎంపీవో శ్రీపతి బాబురావు ఆకస్మికంగా సందర్శించారు.గ్రామంలో నిర్వహిస్తున్న పారిశుధ్య కార్యక్రమాలను పరిశీలించి తడి చెత్త,పొడి చెత్త వేరువేరుగా సేకరించాలని,
గ్రామంలో ప్లాస్టిక్ ఇతర వ్యర్థాలు లేకుండా చూసుకోవాలని,13 వ తేదీన గ్రామ పంచాయతీని పరిశుభ్రంగా చేసి సర్టిఫికేట్ సమర్పించాలని పంచాయితీ కార్యదర్శికి తెలియజేశారు.
రహదారులు మరియు మురుగు కాల్వలు పరిశుభ్రంగా ఉంచాలని, వాటర్ పైపులైన్ మరమ్మత్తులు ఉంటే వెంటనే చేయించాలని సూచించారు.
గ్రామ పంచాయతీ రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని తెలిపారు.
సెగ్రిగేషన్ షెడ్ నందు కంపోస్టు ఎరువు తయారు చేయాలని,నర్సరీని పరిశీలించి మొక్కలు 100% పెరిగేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శికి సూచించడం జరిగింది.
వాటర్ అండ్ శానిటేషన్ కు సంబంధించిన 7 రిజిష్టర్లను పరిశీలించారు.
అనంతరం పెగడపల్లి గ్రామ పంచాయతీని,నర్సరీని సందర్శించి ప్రతీ రోజూ ఉదయం సాయంత్రం మొక్కలకు నీళ్ళు అందించాలని,వాటర్ ట్యాంకు చుట్టూ శుభ్రం చేయాలని తగు సూచనలు చేశారు.
గ్రామ పంచాయతీల రికార్డులను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో ఎంపీఓ శ్రీపతి బాబురావు,ఇరు గ్రామపంచాయతీల కార్యదర్శులు మరియు పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.
జాతీయ బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులుగా పూరెల్ల నితీష్…
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
జాతీయ బీసీ విద్యార్థి సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షులుగా రామకృష్ణాపూర్ పట్టణానికి చెందిన పూరెల్ల నితీష్ నియమితులయ్యారు. ఈ మేరకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చంద్రమోహన్ గౌడ్ నియామక పత్రం అందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా నితీష్ మాట్లాడారు. విద్యారంగ సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తానని, విద్యార్థుల అభివృద్ధికి కృషి చేస్తానని, బీసీ విద్యార్థుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తానని అన్నారు. జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్, విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు విక్రమ్ గౌడ్, బీసీ సంక్షేమ రాష్ట్ర ఉపాధ్యక్షులు నీలకంఠేశ్వర్, గౌరవ అధ్యక్షులు రాపోలు విష్ణువర్ధన్, జిల్లా అధ్యక్షులు చంద్రమోహన్ లకు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు.
సమస్య చెప్పుకుందాం అంటే అధికార పార్టీ నాయకుడే లేడు
ఇంచార్జ్ మంత్రి ఉన్నా లేనట్టే-సిపిఐ
కరీంనగర్, నేటిధాత్రి:
కరీంనగర్ నగర ప్రజలకు తమ సమస్యలు వెల్లవించుకుందామంటే దిక్కులేని దుస్థితి ఉందని అధికార పార్టీ ప్రజాప్రతినిధి కరీంనగర్లో లేకపోవడం వల్ల ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని దుస్థితి ప్రజలు ఎదుర్కొంటున్నారని కసిరెడ్డి సురేందర్ రెడ్డి, పైడిపల్లి రాజు ఒక సంయుక్త ప్రకటనలో అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఇందిరమ్మ కమిటీలు, ఇందిరమ్మ ఇండ్లు, రాజివ్ యువ వికాస్ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంటే కరీంనగర్ నగరంలో మాత్రం మొద్దు నిద్రలో అధికార పార్టీ ఉందని వారు విమర్శించారు.
ప్రజలు సమస్యలు చెప్పుకోవాలంటే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని దుస్థితి కరీంనగర్ నగరంలో నెలకొందని వారు ఆరోపించారు.
సంక్షేమ పథకాలు ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక, రాజీవ్ యువ వికాస్ ఎంపిక ఏమాత్రం జరగడంలేదని ఇది చాలా దుర్మార్గమని అన్నారు.
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ నగరంలో మాత్రం దశ దిశ లేకుండా పోయిందని ప్రజా సమస్యలు పట్టించుకునే నాధుడే కరువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా ఉన్న ఉత్తమ కుమార్ రెడ్డి ఏదో తూతూ మంత్రంగా వచ్చి అధికారుల సమావేశాలు ఏర్పాటు చేసి వెళ్లిపోతున్నాడు తప్ప ప్రజా సమస్యలు ఫిర్యాదులను ఏమాత్రం పట్టించుకోవడంలేదని కరీంనగర్ నగరాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారని ఆక్రోషం వ్యక్తం చేశారు.
గతంలో స్మార్ట్ సిటీ పనుల్లో జరిగిన అవినీతిపై అధికార పార్టీ నేతలు విచారణ జరిపించడంలో విఫలం చెందారని వెంటనే గత మేయర్ సునీల్ రావు, పాలకవర్గం చేసిన స్మార్ట్ సిటీ అవినీతిపై విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు.
గత బిఆర్ఎస్ ప్రభుత్వ హాయములో రోడ్లను తవ్వి రోడ్డు వేస్తామని చెప్పి మధ్యలోనే వదిలేసారని మురుగు కాలువలు కూడా అలాగే వదిలేసారని వాటి పనులను చేపించడంలో అధికార పార్టీ పూర్తిగా విఫలం చెందినని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మున్సిపల్ యంత్రాంగం పూర్తిగా తమ ఇష్టారాజ్యం వచ్చినట్లు పనులు చేస్తున్నారని వీధి దీపాలు సరిగా వెలగడం లేదని, పారిశుద్ధం పడకేసిందని ప్రశ్నించే వారు లేకపోవడం వల్ల నగర కమీషనర్ ఇష్ట రాజ్యాంగ వ్యవహరిస్తున్నా పట్టించుకునే నాధుడు లేడని అన్నారు.
కోట్ల రూపాయలతో నిర్మించిన తీగల వంతెన పూర్తిగా దెబ్బతింటున్న అటువైపు కన్నెత్తి చూసే వారు లేరని రోడ్డు పూర్తిగా ధ్వంసం అయిందని పేర్కొన్నారు.
ప్రతి ఆదివారం తీగల వంతెనపై ప్రజలు ఆహ్లాదకరంగా వినోదం పంచుకోవడం కోసం సాంస్కృతిక కార్యక్రమాలు చేపడతామని, చెప్పిమాట తప్పారన్నారు.
వర్షాకాలం సమీపిస్తున్న ప్రత్యామ్నాయ చర్యలు కరీంనగర్ నగరంలో నేటికీ కమిషనర్ చేపట్టకపోవడం చూస్తుంటే ప్రజల పట్ల అధికారులకు, ప్రభుత్వానికి ఎంత చిత్త శుద్ధి ఉందో అర్థమవుతుందన్నారు.
ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర అవుతున్న ఒక్క ఇల్లు కూడా ఇప్పటికీ కరీంనగర్ నగరంలో ఇవ్వకపోవడం సిగ్గుచేటు అన్నారు.
నగరంలోచాలామందికి రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంటు బిల్లు అమలు కావడం లేదని,గ్యాస్ డబ్బులు బ్యాంకులో పడడం లేదని ఇది చాలా దుర్మార్గమని వెంటనే కరీంనగర్ నగరంలో ఇందిరమ్మ కమిటీలు వేసి ఇండ్లు లేని నిరుపేదలందరికీ ఇండ్లు ఇవ్వాలని లేకుంటే ప్రజాగ్రహానికి కాంగ్రెస్ పార్టీ గురకక తప్పదని కసిరెడ్డి సురేందర్ రెడ్డి,పైడిపల్లి రాజు విమర్శించారు.
భూపాలపల్లి రూరల్ మండలంలోని నాగారం ఆజంనగర్ గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు ముఖ్య అతిథిగా భూపాలపల్లి తహసీల్దార్ వి శ్రీనివాసులు హాజరైనారు అనంతరం దరఖాస్తులు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ సమస్యలను పరిశ్క రించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. భూ రికార్డుల్లో పేర్లు తప్పులు విస్తీర్ణం హెచ్చు తగ్గులు, వారసత్వ భూ ములు, భూ స్వభావం తప్పులు, నిషేదిత జాబితాలోఉన్న భూ సమస్యలు, సర్వే నంబర్ మిస్సింగ్, పట్టా పాసు బు క్కులు లేకపోవడం, ప్రభుత్వ భూములను నవీకరిం చడం, సాదా బైనామా కేసులు, హద్దుల నిర్ధారణ, పార్ట్ బి లో చేర్చిన భూముల సమస్యలు, భూ సేకరణ కేసులు తదితర భూ సమస్యలకు సంబందించిన దరఖాస్తులు సదస్సులో స్వీకరించి భూ భారతి కొత్త చట్టం ప్రకారం అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ ప్రక్రియ పూర్తి చేస్తా మని అన్నారు. దరఖాస్తుల స్వీకరణ పూర్తైన క్షేత్రస్థాయి పరిశీలన ఉంటుందని అన్నారు. డిప్యూటీ తహసీల్దార్ అంజలీ రెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు రామస్వామి,అజహరో ద్దీన్, సర్వేర్ శ్రీనివాస్ రావు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
— నస్కల్ లో రెవేన్యూ సదస్సు • భూ సమస్యలకు అర్జీలు చేసుకోండి • ఎమ్మార్వో శ్రీనివాస్
నిజాంపేట: నేటి ధాత్రి
భూ సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని నిజాంపేట తాహసిల్దార్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు మండలంలోని నస్కల్ గ్రామంలో మంగళవారం రెవెన్యూ సదస్సును ఎమ్మార్వో శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భూ సమస్యలు ఉన్న ప్రతి రైతు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని ఈ సదస్సులు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈనెల 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సువర్ణ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. నాయబ్ తహసిల్దార్ రమ్య శ్రీ, ఆర్ఐ లు ప్రీతీ, ఇమద్, ధరణి ఆపరేటర్ రాజు, గ్రామస్తులు దేశెట్టి సిద్దారములు, గుమ్ముల అజయ్, మద్దికుంట శ్రీను తదితరులు ఉన్నారు.
పెంచిన ఆర్టీసీ బస్ టికెట్లను ధరను వెంటనే తగ్గించాలి
బిజెపి పట్టణ అధ్యక్షులు గాజుల నిరంజన్
పరకాల నేటిధాత్రి
బస్సు పాస్ ధరలను పెంచిన ఆర్టీసీ సామాన్య ప్రజలతోపాటు,విద్యార్థుల బస్సు పాస్ 20 శాతం,పెంచిన తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్రం ఆర్డినరీ పాస్ ధరను రూపాయలు 1150 నుండి రూ.1400కు,మెట్రో ఎక్స్ప్రెస్ పాస్ ధరను 1300 నుండి 1600 కు,డీలక్స్ పాస్ ధరను 1450 నుండి 1800 పెంచిన టీఎస్ఆర్టీసీ ఉచిత బస్సు పథకం వల్ల జరిగే నష్టాన్ని భర్తీ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆడవారికి ఉచితమని మగవారి దగ్గర టికెట్ రేట్లు పెంచి ప్రజల మీద భారం వేస్తుంన్నారని,పెంచిన ఆర్టీసీ టికెట్ ధరను వెంటనే తగ్గించాలని లేనియెడల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రజల తరఫున ధరలు తగ్గించేవరకు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని బిజెపి పరకాల పట్టణ అధ్యక్షులు గాజుల నిరంజన్ డిమాండ్ చేశారు.
మండలంలోని చౌటుపర్తి గ్రామపంచాయతీ ఆవరణలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా బడిబాట గ్రామసభను మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మోడెం రాజేందర్ బాబు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నడికూడ మండల విద్యాశాఖ అధికారి కె.హనుమంతరావు మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశిస్తారు. అయితే దానికోసం మన ఊరిలో మనకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఉచిత విద్యను అందిస్తూ కార్పోరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో ఐ ఎఫ్ పి టివి ప్యానెల్ ద్వారా డిజిటల్ విద్యాబోధన చౌటుపర్తి ప్రాథమికోన్నత పాఠశాలలో జరుగుతుంది. నిరంతర సమగ్ర మూల్యాంకనం,కృత్యాధార, అనుభవజ్ఞులైన అంకితభావంతో పనిచేసే ఉపాధ్యాయులచే విద్య బోధన జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు రెండు జతల యూనిఫామ్,పాఠ్య పుస్తకాలు,వర్క్ బుక్కులు ఉచితంగా అందిస్తున్నారు, ప్రతిరోజు రుచికరమైన పౌష్టికాహారం మధ్యాహ్న భోజనం,వారానికి మూడు గుడ్లు,మూడు రోజులు రాగి జావా,ప్రతినెల తల్లిదండ్రుల ఉపాధ్యాయ సమావేశం నిర్వహించి విద్యార్థుల ప్రగతిని తల్లిదండ్రులకు వివరించడం జరుగుతుంది. కావున విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య లభిస్తున్నందున గ్రామంలోని విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించి,ప్రభుత్వ బడి అభివృద్ధి చెందేటట్లుగా గ్రామంలోని ప్రజాప్రతినిధులు మహిళా సంఘాలు, యువజన సంఘాలు,పూర్వ విద్యార్థులు గ్రామంలోని పెద్దలు అందరూ కలిసి పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచి ప్రభుత్వ బడులను కాపాడుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ శ్రీమతి గూడెం రమ్య విద్యార్థుల తల్లిదండ్రులు ప్రజాప్రతినిధులు,మహిళా స్వయం సహాయక సంఘాలు,అంగన్వాడీ టీచర్లు,పాఠశాల ఉపాధ్యాయులు,యువజన సంఘాల నాయకులు,పూర్వ విద్యార్థులు సమావేశంలో పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.