గ్రామ పంచాయతీలను సందర్శించిన.

గ్రామ పంచాయతీలను సందర్శించిన ఎంపీఓ శ్రీపతి బాబురావు

జైపూర్,నేటి ధాత్రి:

 

 

 

జైపూర్ మండలం గంగిపెల్లి గ్రామ పంచాయతీని మంగళవారం ఎంపీవో శ్రీపతి బాబురావు ఆకస్మికంగా సందర్శించారు.గ్రామంలో నిర్వహిస్తున్న పారిశుధ్య కార్యక్రమాలను పరిశీలించి తడి చెత్త,పొడి చెత్త వేరువేరుగా సేకరించాలని,

గ్రామంలో ప్లాస్టిక్ ఇతర వ్యర్థాలు లేకుండా చూసుకోవాలని,13 వ తేదీన గ్రామ పంచాయతీని పరిశుభ్రంగా చేసి సర్టిఫికేట్ సమర్పించాలని పంచాయితీ కార్యదర్శికి తెలియజేశారు.

రహదారులు మరియు మురుగు కాల్వలు పరిశుభ్రంగా ఉంచాలని, వాటర్ పైపులైన్ మరమ్మత్తులు ఉంటే వెంటనే చేయించాలని సూచించారు.

గ్రామ పంచాయతీ రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని తెలిపారు.

సెగ్రిగేషన్ షెడ్ నందు కంపోస్టు ఎరువు తయారు చేయాలని,నర్సరీని పరిశీలించి మొక్కలు 100% పెరిగేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శికి సూచించడం జరిగింది.

వాటర్ అండ్ శానిటేషన్ కు సంబంధించిన 7 రిజిష్టర్లను పరిశీలించారు.

అనంతరం పెగడపల్లి గ్రామ పంచాయతీని,నర్సరీని సందర్శించి ప్రతీ రోజూ ఉదయం సాయంత్రం మొక్కలకు నీళ్ళు అందించాలని,వాటర్ ట్యాంకు చుట్టూ శుభ్రం చేయాలని తగు సూచనలు చేశారు.

గ్రామ పంచాయతీల రికార్డులను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో ఎంపీఓ శ్రీపతి బాబురావు,ఇరు గ్రామపంచాయతీల కార్యదర్శులు మరియు పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇండ్లను శంకుస్థాపన చేసిన న్యాల్కల్ ఎంపిఓ D. సౌజన్య గారు.

ఇందిరమ్మ ఇండ్లను శంకుస్థాపన చేసిన న్యాల్కల్ ఎంపిఓ D. సౌజన్య గారు

జహీరాబాద్ నేటి ధాత్రి:

న్యాల్కల్ మండలం అత్నూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి మొగ్గు వేసి ప్రారంభం చేసిన ఎంపిఓ సౌజన్య రావు గారు, హౌసింగ్ DE అంజయ్య గారు,న్యాల్కల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు B. శ్రీనివాస్ రెడ్డి , సంగారెడ్డి డీసీసీ ప్రధాన కార్యదర్శి K. భాస్కర్ రెడ్డి, జహీరాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి, న్యాల్కల్ పాక్స్ చైర్మన్ సిద్ది లింగా స్వామి, మండల మాజీ ఉప అధ్యక్షుడు మొహమ్మద్ గౌసోద్దీన్, జిల్లా మైనారిటీ నాయకులు మొహమ్మద్ రఫియోద్దీన్, మాజీ ఎంపీటీసీ శాంత్ కుమార్ పటేల్, AE శివానంద, పంచాయతీ కార్యదర్శి N. సరేన్ రాజ్, అత్నూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఫీక్ పటేల్, మాజీ ఉప సర్పంచ్ నిలయా గౌడ్, నయీమొద్దీన్, ముస్తఫా, లాలూ పటేల్, ఖాయమొద్దీన్, పాషా భాయ్, యాదుల్ భాయ్, మిస్లోడ్డిన్, మౌల పటేల్, అఫ్జల్ భాయ్, మచ్కురి శంకర్, మచ్కురి మాణిక్, సురేష్ , బసవరాజు, సమీర్, నాసర్ , అక్బర్, సయ్యోజి గౌడ్, అజర్, జలీల్ మియా, మహిళలు కమలమ్మ , శేషమ్మ, జ్యోతి , గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version