డబుల్ బెడ్రూమ్ ఇళ్లకోసం కృషి చేస్తాం.

డబుల్ బెడ్రూమ్ ఇళ్లకోసం కృషి చేస్తాం’

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి: జహీరాబాద్లో వర్కింగ్ జర్నలిస్ట్ మీడియా కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ స్టేట్ వర్కింగ్ జర్నలిస్ట్ మీడియా కౌన్సిల్ ఇంఛార్జి షేక్ మహేబూబ్ హాజరయ్యారు. జర్నలిస్ట్ల పిల్లలకు స్కూల్ ఫీజులో 50% రాయితీ అమలు కాకపోతే డీఈవో చర్యలు తీసుకోవాలని, డబుల్ బెడ్రూమ్ ఇళ్లకోసం కృషి చేస్తామని తెలిపారు. కొందరు జహీరాబాద్ జర్నలిస్ట్లు యూనియన్లో చేరగా వారిని మహేబూబ్ స్వాగతించారు.

డబల్ బెడ్ రూమ్ ఇళ్ల తాళాలు ఇవ్వకుంటే.

డబల్ బెడ్ రూమ్ ఇళ్ల తాళాలు ఇవ్వకుంటే లబ్ధిదారులే ఇళ్లల్లోకి వెళతారు…

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ డబల్ బెడ్ రూమ్ ఇండ్ల తాళాలు అప్పగింతలో ఇంకా స్పష్టత ఇచ్చేందుకు అధికారులకు ఇన్ని రోజులు పట్టడం సరైనది కాదని, అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం ఇస్తామన్న హామీని వారం రోజులైనా అధికారులు ఇంకా కాలయాపన చేయడం ఏంటని, తక్షణమే ఈ సమస్య పరిష్కారానికి పై అధికారులు చొరవ తీసుకుని వెంటనే తాళాలు అప్పజెప్పాలని సిపిఎం జహీరాబాద్ ఏరియా కమిటీ సభ్యులు ఎస్. మహిపాల్ కోరారు. ఈ విషయమై లబ్ధిదారులతో ఆర్డిఓ గారితో చర్చించిన సందర్భంగా మహిపాల్ మాట్లాడుతూ వెంటనే తాళాలు అప్పజెప్పాలని లేనిపక్షంలో ఆందోళన ఉదృతం చేస్తామని లేనిపక్షంలో లబ్ధిదారులే ఇళ్లలోకి వెళ్లే పరిస్థితి వస్తుందని ఆలోపు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికే అధికారులు రేపు మాపు అంటూ కాలయాపన చేయడం సరైనది కాదని పేదలు ఇబ్బందులకు గురివుతున్నారని అన్నారు. అతి త్వరలో నిర్ణయం చెబుతామని Rdo గారు చెప్పారు. ఈ కార్యక్రమంలో లబ్దిదారు శివకుమార్, మల్లేశం, బక్కన్న, సీపీఎం నాయకులు ముత్తబీర్ ఉన్నారు.

ప్రజలు మా ఇంటి ముంగట మోరీలు నిర్మించండి.

జహీరాబాద్ ప్రజలు మా ఇంటి ముంగట మోరీలు నిర్మించండి

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ గాంధీనగర్ కాలనీ రోడ్ నెంబర్ 6 లో కాలనీ ఏర్పడి 30 సంవత్సరాలు అవుతున్న ఇప్పటివరకు మోరీలు నిర్మించడం లేదు దాదాపు ఈ ఏరియా గ్రామపంచాయతీ నుండి మున్సిపాలిటీలో కలుపుకోవడం జరిగింది కానీ మున్సిపాలిటీ ఏరియా అని ఇంటి టాక్స్లు వసూలు చేస్తున్నారు కానీ ఇంటి ముంగట రోడ్డు గాని మోరిల్ల నిర్మాణం గానీ చేపట్టడం లేదు స్థానిక ఎమ్మెల్యేకి విజ్ఞప్తి చేయడం జరిగింది జహీరాబాద్ మున్సిపాలిటీ కమిషనర్ కు దీనిపైన చొరవ తీసుకొని టాక్స్లు వసూలు చేసుడు కాదు ముందు మోరిలా నిర్మించాల్సిందిగా స్థానిక ప్రజలు కాలనీవాసులు కోరుతున్నారు మరియు ఈ రాంనగర్ 100 ఫీట్ల రోడ్డు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే కానీ రోడ్డుకు రెండు సైడ్ల మోరీలు కట్టలేని పరిస్థితి దీనివల్ల వర్షం నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయి రోడ్డు పాడయింది ప్రభుత్వం దృష్టికి ఎన్నిసార్లు తీసుకువెళ్లినా చూసి చూడనట్టు ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా ఎవరిస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు ఫ్లైఓవర్ నుండి రాంనగర్ దర్గా వరకు రెండు వైపుల పెద్ద మోరి నిర్మించాల్సిందిగా మహమ్మద్ ఇమ్రాన్ బిఆర్ఎస్ సీనియర్ లీడర్ జహీరాబాద్ తొందర్లో రోడ్డు మరియు మోరీలు నిర్మించకపోతే కలెక్టర్ ఆఫీస్ ముందట రాంనగర్ కాలనీ గాంధీనగర్ కాలనీ గుల్షన్ నగర్ బాగా రెడ్డి కాలనీ జమాలీ కాలనీ సలాం నగర్ కాలనీ ప్రజలతో ధర్నా చేస్తామని డిమాండ్ చేశారు.

ఇందిరమ్మ ఇండ్ల రాకతో నిరుపేదల కళ్ళలో ఆనందం.

ఇందిరమ్మ ఇండ్ల రాకతో నిరుపేదల కళ్ళలో ఆనందం

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలం లక్ష్మారెడ్డి పల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ఎస్సీ కాలనీ లో భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాల మేరకు కొయ్యడ సుమలత సమ్మయ్య ఇందిరమ్మ ఇల్లు అమలు కావడం చాలా సంతోషకరంగా ఉంది గత 10 సంవత్సరాల కాలం నుండి గుడిసెలలో అంటూ ఎన్నో ఇబ్బందులు పడ్డాము ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ రాకతో ఇందిరమ్మ ఇల్లు రావడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యమంత్రి కి భూపాలపల్లి శాసన సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఇట్టి కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ మొలుగూరి రాజు కొయ్యాడ భద్రయ్య ఎడ్ల లింగయ్య జన్నే సుమంత్ గ్రామస్తులు పాల్గొన్నారు

అనుమతి లేకుండా ఇళ్ల నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు.

అనుమతి లేకుండా ఇళ్ల నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-57.wav?_=1

జహీరాబాద్ నియోజకవర్గం న్యాల్కల్ మండలంలో
అనుమతు లేకుండా ఇళ్ల నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని న్యాల్కల్ ఎంపీడీవో గూడెం శ్రీనివాస్ హెచ్చరించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణాల కోసం పంచాయతీ కార్యదర్శుల వద్ద అనుమతులు తీసుకోవాలని చెప్పారు. అన్ని గ్రామాల్లో పారిశుధ్య వ్యవస్థ మెరుగుపరిచేలా చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. ఇలాంటి సమస్యలు ఉన్న నేరుగా ఎంపీడీవో కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు.

అందుకే పేదల ఇళ్లు కూల్చడం లేదు..

అందుకే పేదల ఇళ్లు కూల్చడం లేదు.. రంగనాథ్ కీలక వ్యాఖ్యలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలతో సామాజిక కోణంలో చూసి పేదల ఇళ్లు కూల్చడం లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. కబ్జాలు చేసిన వారే హైడ్రాపై విమర్శలు చేస్తున్నారని తెలిపారు. సెప్టెంబర్ 21వ తేదీన బతుకమ్మ కుంటను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని రంగనాథ్ పేర్కొన్నారు.

భావితరాలకు భవిష్యత్‌ని ఇవ్వడం కోసం హైడ్రా (HYDRA) పని చేస్తోందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Ranganath) ఉద్ఘాటించారు. చెరువులను కాపాడాలనే ఉద్దేశ్యంతో మొదట్లో తాము చాలా దూకుడుగా వెళ్లామని చెప్పుకొచ్చారు. దూకుడుతో వెళ్లడంతో చెరువుల ఆక్రమణలు తగ్గాయని గుర్తుచేశారు. హైడ్రా ఏర్పాటు చేసి శుక్రవారం(జులై18)తో ఏడాది పూర్తి అయింది. ఈ సందర్భంగా అంబర్‌పేట్ బతుకమ్మ కుంట వద్ద హైడ్రా ప్రథమ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్, హైదరాబాద్ కలెక్టర్ హరి చందన, మాజీ ఎంపీ వి. హనుమంతురావు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంగనాథ్ మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలతో సామాజిక కోణంలో చూసి పేదల ఇళ్లు కూల్చడం లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. కబ్జాలు చేసిన వారే హైడ్రాపై విమర్శలు చేస్తున్నారని తెలిపారు. సెప్టెంబర్ 21వ తేదీన బతుకమ్మ కుంటను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని అన్నారు. హైడ్రా అంటే డిమాలీషన్, డెవలప్‌మెంట్ అని అభివర్ణించారు. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన బతుకమ్మకుంట శాంపిల్ మాత్రమేనని.. త్వరగా ఎన్నో బతుకమ్మ కుంటలు వెలుగులోకి వస్తాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు.

డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం లబ్దిదారులు ఆందోళన..

డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం లబ్దిదారులు ఆందోళన..

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ లో డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం లబ్దిదారులు ఆందోళన చేపట్టారు. పట్టణ శివారు హోతి(కె)లో కేటాయించిన ఇళ్లను అప్పగించాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో గృహ సముదాయాల వద్ద శనివారం బైఠాయించారు. ఇవాళ ఎంపీ, ఎమ్మెల్యే చేతుల మీదుగా తాళాల అప్పగింత ఉంటుందని ప్రకటించి మళ్లీ వాయిదా వేయడం ఏంటని ప్రశ్నించారు. వారం రోజుల్లో ఇళ్లు అప్పగించకపోతే తాళాలు పగలగొట్టి ఇళ్లను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు.

లాటరీ ద్వారా డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపు.

లాటరీ ద్వారా డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపు.

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులకు రామకృష్ణాపూర్ లోని ఆర్కేసీఓఏ క్లబ్ లో లాటరీ ద్వారా ఇండ్ల కేటాయింపు జరుగుతుందని మందమర్రి తహసిల్దార్ సతీష్ కుమార్ తెలిపారు. లాటరీ నిర్వహించే క్లబ్ ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 286 ఇండ్లకు గాను 230 ఇండ్లకు ఆర్డీవో సమక్షంలో లాటరీ తీయబడునని, లబ్ధిదారులు మున్సిపల్ కార్యాలయం నుండి పంపిణీ చేసిన అర్హత గల స్లిప్ తో పాటు ప్రభుత్వం నుండి గుర్తింపు పొందిన ధృవీకరణ పత్రం తమ వెంట తీసుకురావాలని కోరారు. ఇండ్ల కేటాయింపులో ఎలాంటి అవకతవకలు లేకుండా పారదర్శకంగా నిర్వహిస్తామని, హాల్ లోకి లబ్ధిదారులకు మాత్రమే ప్రవేశం ఉంటుందని పేర్కొన్నారు. ఒకవేళ లబ్ధిదారులు అందుబాటులో లేని పక్షంలో రేషన్ కార్డులో ఉన్న సభ్యుల్లో ఒకరికి ప్రవేశానికి అవకాశం కల్పించినట్లు తెలిపారు. లాటరీ నిర్వహించే సమయంలో పట్టణ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. ఆయన వెంట మున్సిపల్ కమీషనర్ రాజు, పట్టణ ఎస్సై రాజశేఖర్ ఉన్నారు.

రాజకీయాలకతీతంగా ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలి.

రాజకీయాలకతీతంగా ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలి

గ్రామా ల్లో తక్షణమే హెల్త్ క్యాంపులు నిర్వహించాలి

నర్సంపేట నేటిధాత్రి:

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో రాజకీయాలకతీతంగా అర్హులైన పేదలకు ఇండ్లను కేటాయించాలని ఎం సిపిఐ( యు)పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు వంగల రాగ సుధా , నర్సంపేట డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి డిమాండ్ చేశారు.
ఈ మేరకు నర్సంపేట తహసిల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒకటి రెండు తప్ప మిగతా హామీలు ఏవి కూడా అమలు కావడం లేదన్నారు.సీజనల్ వ్యాధులు విజ్రింబిస్తున్న క్రమంలో గ్రామాల్లో తక్షణమే హెల్త్ క్యాంపులు నిర్వహించాలని డిమాండ్ చేశారు .ప్రజాస్వామిక హక్కులపై గత పాలకుల వలె నిర్బంధాలు తీవ్రమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు.ప్రజా ప్రభుత్వమని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు.ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ నాయకుడు కర్నె సాంబయ్య ,జన్ను విజయ,దొమ్మాటి విమల,గొడిశాల లక్ష్మి,సోలంకి భాగ్య,సమ్మక్క తదితరులు పాల్గొన్నారు.

అర్హులందరికీ ఇండ్లు మంజూరు చేస్తాం.

అర్హులందరికీ ఇండ్లు మంజూరు చేస్తాం.

#ములుగు ప్రజల రుణం తీర్చుకుంటాం.

#అభివృద్ధి చేయడమే మా లక్ష్యం.

రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి,
గ్రామీణ నీటి సరఫరా, మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క.

ములుగు జిల్లా నేటిధాత్రి:


ములుగు నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటామని, అర్హులందరికీ కచ్చితంగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు.
శుక్రవారం ములుగు మండల కేంద్రం నుండి జీవింతరావు పళ్లి గ్రామం మీదుగా గణేష్ పళ్లి వరకు మూడు కోట్ల యాభై లక్షల రూపాయలతో ఏర్పాటు చేయనున్న రోడ్డు విస్తరణ పనులు, డివైడర్, సెంట్రల్ లైటింగ్ పనులను మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ బానోతు రవిచంద్రలతో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం అర్హులైన పేదలందరికీ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని ఉద్దేశంతో మొదటి దఫాగా ప్రతి నియోజకవర్గానికి ఐదువేల ఇండ్లను కేటాయించి పనులు ప్రారంభించడం జరిగిందని, ములుగు నియోజకవర్గానికి సంబంధిత మంత్రి మరో వెయ్యి ఇండ్లను అదనంగా కేటాయించనున్నారని వివరించారు. ఎక్కడ అభివృద్ధి చెందని ప్రాంతాలను గుర్తించి దశలవారీగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని, ప్రతి గ్రామానికి రోడ్లు వేయడం, రోడ్లు విస్తరణ పనులు చేపట్టడం ముఖ్యమంత్రి ఆదేశాలతో జరుగుతున్నాయని తెలిపారు. తాము ఇచ్చిన హామీ మేరకు ములుగును మున్సిపాలిటీగా, మల్లంపల్లి గ్రామాన్ని జేడి మల్లంపల్లిగా మండలం గా ఏర్పాటు చేశామని అన్నారు. తాము అధికారికంగా ఆమోదం పొంది ఇచ్చిన హామీలను చూపిస్తున్నామని అన్నారు.
తాను ఎంపీ బలరాం నాయక్ కలిసి ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకుంటామని, జిల్లాను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి ప్రత్యేక నిధులను కేటాయించడం జరిగిందని అన్నారు.
ఎంపీ బలరాం నాయక్ మాట్లాడుతూ తాను గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన సమయంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని, నేడు మంత్రి సీతక్కతో కలిసి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సంపత్ పంచాయతీరాజ్ ఈఈ అజయ్ కుమార్, ప్రజా ప్రతినిధులు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అసంపూర్తిగా ఇందిరమ్మ నమూనా ఇళ్ళు.

అసంపూర్తిగా ఇందిరమ్మ నమూనా ఇళ్ళు

◆ చెట్ల పొదలతో నిండిపోయిన పరిసర ప్రాంతం

◆ నిధుల లేమినా? అధికారుల నిర్లక్ష్యమా?

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం,రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల
నిర్మాణానికి ముందుగా ప్రతి మండల కేంద్రంలో మోడల్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మిం చాలని ప్రతిపాదించింది. దీని ఉద్దేశ్యం గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ళను నిర్మించు కునే లబ్దిదారులకు ఆదర్శంగా ఉండాలన్నాదే లక్ష్యం. కానీ అధికారుల నిర్లక్ష్య మో? నిధుల లేమితో తెలియదు కానీ మండల కేంద్రమైన ఝరా సంఘంలో తహసిల్దార్ కార్యాలయం ముందు భాగంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పనులు అసంపూర్తిగా మారాయి. దీంతో ఈ ఇల్లు పరిసర ప్రాంతం పిచ్చి మొక్క లు, ముళ్ల పొదలతో దర్శనమిస్తుంది. స్లాబు. గోడల నిర్మాణం పనులు పూర్త య్యాయి. దీనికి తలుపులు బిగించకపోవడంతో పశువులకు, శునకాలకు అడ్డాగా మారింది. తాసిల్దార్ కార్యాలయం కు వివిధ పనుల నిమిత్తం వచ్చేవారు ఈ ఇల్లును మూత్రశాలంగా మార్చుకోవడంతో అక్కడ దుర్వాసన వెదజల్లుతుంది. గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లపై అవగాహన కల్పించి నిర్మాణం చేసుకోవాలని చెప్పే అధికారులే మోడల్ ఇందిరమ్మ ఇల్లును ఈ విధంగా వదిలిపెట్టడంతో పలువురు విస్మయానికి గురవుతున్నారు. ఇప్పటికైనా ఈ మోడల్ ఇందిరమ్మ ఇల్లును పూర్తి చేయాల్సిన బాధ్యత అధికారులపై ఎంతైనా ఉంది.

ఇల్లు కాలిపోయిన వారి కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు.!

ఇల్లు కాలిపోయిన వారి కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు

చర్ల నేటిదాత్రి:

 

చర్ల మండలం కలివేరు గ్రామంలో కల్లూరి సమ్మయ్య ఇళ్లు కరెంట్ షార్ట్ సర్క్యూట్ అయ్యి పూర్తిగా కాలిపోవడం జరిగింది విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు స్వయంగా ఇంటికి వెళ్లి వారి కుటుంబానికి అండగా ఉంటానని ఆర్థిక సహాయం చేసి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేపిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు మాజీ ప్రజా ప్రతినిధులు యూత్ కాంగ్రెస్ నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు

ఇందిరమ్మ ఇండ్లలో అవినీతికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోండి.

ఇందిరమ్మ ఇండ్లలో అవినీతికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోండి

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పగిడిపెల్లి రవి

మంగపేట నేటిధాత్రి:

బుచ్చంపేట గ్రామంలో కాంగ్రెస్ గ్రామ శాఖ పార్టీ అధ్యక్షుడు కాటూరు నాగయ్య జంగం భానుచందర్ ఎడ్ల నరేష్ పల్లె శోభన్. అను నలుగురు కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకుంటూ సీతక్క పేరు వాడుకుంటూ అక్క కుమారుడు. రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి సూర్య పేరు వాడుకుంటూ.. వారితో దిగిన ఫోటోలు అమాయకులకు చూపిస్తూ.. మాకు అక్కకు దగ్గర మేము చెప్పింది చేస్తదని ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తామని. యువ వికాసంలో లోన్ ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేస్తున్నారు ఈ నెల లో కొందరికాడా వసూలు చేశారు కానీ మనం అధికారంలో ఉన్నాము కాబట్టి బయపడ్డారు మంగళవారం వచ్చిన వీడియో చూసాక వచ్చే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు వచ్చిస్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరిస్తారని వాస్తవం అధిష్టానికి మండల అధ్యక్షునికి మండల ప్రజలకు చెపుతున్న వాస్తవం నాపేరు పగిడిపల్లి రవిని నేను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకున్ని పైగా వారే. మీటింగ్లు పెట్టి ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదని పార్టీ ముఖ్య నాయకులను గ్రామ పేరును కాంగ్రెస్ పార్టీని చెడగొడుతున్నారు. వాస్తవంగా డబ్బులు తీసుకుంటే బయట పెట్టమని చాలెంజులు విసురుతున్నారు. నేను మీతో చెప్పినది ఏమనగా.. స్వయంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయిన నా దగ్గరే కూడా యువ వికాసం ఇస్తామని పదివేల రూపాయలను కాటూరు నాగయ్యతో కలసి నలుగురు వ్యక్తులు అడిగారు అడిగింది. వాస్తవము. నేను మొదటగా ఐదు వేల రూపాయలు ఫోన్ పే ద్వారా అందజేసింది. వాస్తవం. కాటురు నాగయ్య ఎడ్ల నరేష్ భానుచందర్ శోభన్ బాబు అధ్యక్షుని వివిధ హోదాలో ఉండి కార్యకర్త నైన నా వద్దనే ఈ విధంగా అడిగి పేపర్లలో దొంగే దొంగలు అన్నట్టుగా పేపర్లో వాస్తవములు ఉంటే బయట పెట్టమని ప్రకటనలు ఇస్తున్నారు. అందువలన నేను బయట పెట్టకు తప్పడం లేదు. నాకాడ నలుగురు మాట్లాడిన వీడియో మరియు వాయిస్ రికార్డింగ్ సాక్షులు బాధితులు ఉన్నారు బుచ్చంపేటలో ఎవ్వరిని అడిగిన చెబుతారు అందరికడా ఉన్నాయి ఇట్టి విషయంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ అన్న. రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శి ధనసరి సూర్య అన్న. వీరిపై చర్య తీసుకోకపోతే రానున్న స్థానిక ఎన్నికలలో బుచ్చంపేటలో కాంగ్రెస్ పార్టీ పూర్తి పరాభవము తప్పదు కావున వెంటనే వీరిపై చర్య తీసుకుని కాంగ్రెస్ పార్టీని నాయకుల మనోభావాలను కాపాడి రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పార్టీ విజయం సాధించుటకు సహకరిస్తారని కోరుతున్నాను.

ఇందిరమ్మ ఇండ్లకి భూమి పూజ.

ఇందిరమ్మ ఇండ్లకి భూమి పూజ

నాగర్ కర్నూల్  నేటి ధాత్రి:

 

నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం ఎర్రకుంట తండా, లట్టుపల్లి, చిన్న పీరు తండా, బిజినేపల్లి తండా బోయపూర్ డాకు తండా, రావుల చెరువు తండాలకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే కూచకుళ్ళ రాజేష్ రెడ్డి బుధవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిరుపేదలందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి.. వారి కళా సహకారం చేస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వినోద్, పలువురు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు  పాల్గొన్నారు.

ఝరాసంగం ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన.

ఝరాసంగం ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన

జహీరాబాద్ నేటి ధాత్రి:

shine junior college

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం మండల కేంద్రంలో సోమవారము పేదలకు గ్రామ మండల అధ్యక్షులు హనుమంతరావు పటేల్ ఎంపీడీవో సుధాకర్ ఆధ్వర్యంలో ఇళ్లకు ముగ్గులు వేసి ప్రొసిడింగ్ అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ శేఖర్ పటేల్
గ్రామపంచాయతీ సెక్రెటరీ వీరన్న మాజీ సర్పంచ్ రుద్రప్ప పటేల్ మాజీ సర్పంచ్ పెంటయ్య ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సయ్యద్ గోసుద్దీన్ అష్రఫ్ అలీ ల్యాఖత్ అలీ నిస్సార్ అహ్మద్ రాజేందర్ సింగ్ మొహమ్మద్ అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ.

ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ

పేదల సంక్షేమం కాంగ్రెస్ తోనే సాధ్యం

ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు

కేసముద్రం నేటి ధాత్రి:

నూతనంగా ఏర్పడిన కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్లు నూతన గృహ నిర్మాణ ముగ్గు పోయి కార్యక్రమాన్ని కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో కేసముద్రం విలేజ్ మరియు ఎన్టీఆర్ నగర్ లోని నిరుపేద లబ్ధిదారులకు ముగ్గులు పోయూ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా ఇంద్రమ్మ కమిటీ సభ్యులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటే నా ఇందిరమ్మ ఇండ్లు గుర్తుకు వస్తాయని, పేదల గురించి ఆలోచించేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని ఈ సందర్భంగా వారు అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందిరమ్మ కమిటీ సభ్యులు గుండు గోపాల్,సుభాష్ రెడ్డి, చిట్ట సులోచన, కీర్తి శ్రీలత, హౌసింగ్ ఎయ్యి అభినయ్ గౌడ్, మున్సిపల్ ఆఫీసర్లు ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసముద్రం విలేజ్ గ్రామ పార్టీ ఉపాధ్యక్షులు కత్తెరసాల శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మాసాడి శ్రీనివాస్,మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కీర్తి సురేందర్, మండల ఓ బి సి అధ్యక్షులు చిట్ల సంపత్, మండల ఎస్టీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అజ్మీర రమేష్, విలేజ్ గ్రామ పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షులు లావుడియా వెంకన్న, కాంగ్రెస్ పార్టీ నాయకులు పెండ్యాల లక్ష్మణ్,గుబరాజు,గుండు లక్ష్మీనారాయణ,జీలకర్ర బాబు, బట్టి గులాబీ, ఎండి సోనీ,ఎస్ కే యాకుబ్బి, తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల పంపిణీలో దళారీల చేతివాటం.

ఇందిరమ్మ ఇండ్ల పంపిణీలో దళారీల చేతివాటం:-

పొన్నం బిక్షపతి గౌడ్ జయశంకర్ భూపాలపల్లి బిఎస్పి అధ్యక్షులు:-

టేకుమట్ల, నేటిధాత్రి:-

 

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు శనివారం నాడు టేకుమట్ల మండల కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇన్చార్జి వేల్పుగొండ మహేందర్ మరియు జిల్లా అధ్యక్షులు పొన్నం బిక్షపతి గౌడ్ గార్లు ముఖ్య అతిథులుగా హాజరైనారు. ఇట్టి సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల కమిటీల పేరుతో అధికార పార్టీ నాయకులను అందలం ఎక్కిస్తూ వారు చెప్పిన వారికే ఇండ్లను మంజూరు చేస్తూ, గ్రామంలో లేని వారికి స్థిరమైన గృహాలు ఉన్నవారికి కూడా ఇండ్లను మంజూరు చేస్తున్నారని అదేవిధంగా అధికార యంత్రాంగాన్ని తప్పుదోవ పట్టిస్తూ నిజమైన నిరుపేదలను ఇందిరమ్మ ఇండ్లకు అర్హులుగా గుర్తించకుండా చేస్తున్న అధికార పార్టీ నాయకులు కొందరు అధికారులతో కుమ్మక్కై ఇట్టి దందా నడిపిస్తున్నారని అన్నారు. తక్షణమే ఇట్టి అవినీతికి పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని లేని ఎడల పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఎంపీడీవోలు కలెక్టరేట్ ముందు ఇందిరమ్మ ఇండ్లకు అర్హులయ్యే పేదలతో ధర్నా రాస్తారోకోలు చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మేకల ఓంకార్ భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ మురారి సదానందం నియోజకవర్గ అధ్యక్షులు కొయ్యడ దామోదర్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కోడెపాక విజయ మండల తదితర నాయకులు పాల్గొన్నారు

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన

కురవి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంబటి వీరభద్రం గౌడ్.

మరిపెడ కురవి నేటిధాత్రి:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఈరోజు మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో ని
జుజ్జూర్ తండాలో ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రం ఇచ్చి ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది, ఈ కార్యక్రమ నికి ముఖ్య అతిథిగా హాజరైన కురవి మండల అధ్యక్షులు అంబటి వీరభద్రం గౌడ్, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేద వాడికి సొంత ఇంటి నిర్మాణం అని ఈ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మించాలని ద్రుడ సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని అన్నారు,జిల్లాలో జూన్ పదవ తారీకు వరకు ప్రోసిడింగ్ కాపీలు మంజూరు చేసి బేస్మెంట్ లెవెల్ పూర్తిచేసిన అన్నిటికీ డబ్బులు వెంటనే ఇస్తామన్నారు , గత ప్రభుత్వం పది సంవత్సరాల నుండి పేదవారికి సొంత ఇల్లు నిర్మాణ పథకం ప్రవేశ పెట్టలేదని, ప్రస్తుత ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తుందన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి కావలసిన ఇసుక రిచ్ ద్వారా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇసుక అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కోఆర్డినేటర్ బండి శ్రీనివాస్ గౌడ్, జుజుర్ తండా గ్రామ అధ్యక్షుడు బానోత్ రవి, ఉపాధ్యక్షుడు ధరావత్ మోతిలాల్,ఇందిరమ్మ కమిటీ సభ్యులు డాక్టర్ ధరావత్ వీరన్న నాయక్, పూల్ సింగ్ నాయక్ , నవీన్ గ్రామ పంచాయతీ కార్యదర్శి భవాని, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు, మహిళలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేత.

ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేత.

కల్వకుర్తి/ నేటి ధాత్రి :

 

 

 

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం లో ఇందిరమ్మ ఇళ్లు మోడల్ హౌస్ ను ఎమ్మెల్యేలు కశిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తి పట్టణంలోని CKR (చింతల కొండా రెడ్డి) ఫంక్షన్ హాల్ లో కల్వకుర్తి పట్టణం, కల్వకుర్తి మండలం, వెల్దండ మండలం, చారకొండ మండాల లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణ రెడ్డి జిల్లా ఇంచార్జిలు తెజావత్ బెల్యా నాయక్, రాజశేఖర రెడ్డి, ప్రవీణ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, తదితరులు  పాల్గొన్నారు.

ఇండ్ల స్థలాల భూమి అక్రమ పట్టాకు గురైంది

ఇండ్ల స్థలాల భూమి అక్రమ పట్టాకు గురైంది
జమ్మికుంట: నేటిధాత్రి

– భూ భారతి సదస్సులో దళిత కాలనీ వాసులు ఫిర్యాదు
– ధరణి మా దళితుల బ్రతుకులు దరిద్రంగా మార్చిందని ఆవేదన
– తిరిగి తమ భూమి తమ కాలనీ పేరు మీద పట్టా చేయాలని విజ్ఞప్తి

జమ్మికుంట మండలం,తనుగుల గ్రామం:-

మా మూడు వందల కుటుంబాల ఇండ్ల స్థలాల పట్టా భూమి,అక్రమ పట్టాకు గురైందని,వెంటనే తమ సమస్యను పరిష్కరించాలని,గురువారము దళిత కాలనీ వాసులు గ్రామంలో ఏర్పాటు చేసిన భూ భారతి సదస్సులో రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా దళిత కాలనీవాసులు మాట్లాడుతూ…తమకు గ్రామ శివారులో సర్వే నెంబర్ 169/a లో 2.31 గుంటల ఇండ్ల స్థలాల పట్టా భూమి కలదని దానిని తమ గ్రామానికి చెందిన నిమ్మకాయల నర్సయ్య తండ్రి మల్లయ్య అక్రమ పత్రాల సృష్టించి గ్రామ పంచాయతీ ధృవీకరణ పత్రం ఆధారంతో ధరణిలో అక్రమ పట్టా చేసుకున్నాడని తెలిపారు.ధరణితో మా దళిత కుటుంబాల బ్రతుకులు దరిద్రంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు.దీనిపై తాము గత మూడు సంవత్సరాల నుండి అలుపెరుగని పోరాటం చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి అక్రమ పట్టా చేసుకున్న నిమ్మకాయల నర్సయ్య తండ్రి మల్లయ్య పేరును,భూ రికార్డుల నుంచి తొలగించి,తిరిగి తమ దళిత కాలనీ పేరు మీద పట్టా మార్పిడి చేయాలని వేడుకున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version