దేశానికి అత్యధిక కాలం పనిచేసిన రెండో ప్రధానిగా నరేంద్ర మోదీ..

దేశానికి అత్యధిక కాలం పనిచేసిన రెండో ప్రధానిగా నరేంద్ర మోదీ..ఇందిరా గాంధీ రికార్డ్ బ్రేక్

భారత రాజకీయ చరిత్రలో ఈ శుక్రవారం (జూలై 25, 2025న) ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త రికార్డ్ సృష్టించారు. ఈ క్రమంలో మోదీ ఇప్పుడు దేశంలో అత్యధిక కాలం పాలన కొనసాగించిన రెండో ప్రధానమంత్రిగా నిలిచారు.

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఈ శుక్రవారం (జూలై 25, 2025) ఒక అరుదైన ఘనతను సాధించారు. ఆయన వరుసగా 4,078 రోజుల పాటు ప్రధానమంత్రిగా కొనసాగుతూ, ఇందిరా గాంధీ (1966-1977) రికార్డును అధిగమించి, దేశంలో ఎక్కువ కాలం పదవిలో ఉన్న రెండో ప్రధానమంత్రిగా నిలిచారు. ప్రస్తుతం దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ (1947-1964) మాత్రమే ఎక్కువకాలం పనిచేసిన ప్రధానుల్లో మొదటి స్థానంలో ఉన్నారు. నెహ్రూ 16 ఏళ్ల 286 రోజుల పాటు (1947-1964) పదవిలో కొనసాగిన రికార్డును కల్గి ఉన్నారు.

నరేంద్ర మోదీ 2014 మే 26న మొదటిసారి భారత ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి, ఆయన మూడోసారి ఈ పదవిలో కొనసాగుతున్నారు. 2024 జూన్‌లో మూడోసారి ప్రధానిగా ప్రమాణం చేసిన ఆయన, కాంగ్రెస్‌కు చెందని ప్రధానమంత్రిగా అత్యంత ఎక్కువ కాలం పదవిలో ఉన్న రికార్డును సొంతం చేసుకున్నారు. ఇందిరా గాంధీ 4,077 రోజుల పాటు (1966-1977) వరుసగా ప్రధానమంత్రిగా ఉండగా, మోదీ ఈ రికార్డును జూలై 25న అధిగమించారు.

గతంలో గుజరాత్

మోదీ రాజకీయ జీవితం గుజరాత్‌లో మొదలైంది. 2001 నుంచి 2014 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆ సమయంలో ఆయన గుజరాత్‌ను అభివృద్ధి పథంలో నడిపించారు. ఇది ఆయన జాతీయ రాజకీయ రంగంలోకి అడుగుపెట్టడానికి ఒక మంచి అవకాశంగా మారింది.

చారిత్రక విజయాలు

మోదీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 2014లో 272 లోక్‌సభ సీట్లతో ఘన విజయం సాధించింది. 2019లో ఈ సంఖ్య 303కు పెరిగింది, ఇది బీజేపీ బలాన్ని స్పష్టం చేసింది. 2024 ఎన్నికల్లో బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించలేకపోయినప్పటికీ, ఎన్డీఏ భాగస్వాముల సహకారంతో మూడో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో కాంగ్రెస్‌కు చెందని నాయకుడిగా, సొంతంగా లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ సాధించిన ఏకైక నాయకుడిగా మోదీ చరిత్ర సృష్టించారు.

నెహ్రూ తర్వాత

ఇందిరా గాంధీ (1971) తర్వాత మెజారిటీతో తిరిగి ఎన్నికైన తొలి ప్రధానమంత్రి మోదీ. అంతేకాక, జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత మూడు వరుస ఎన్నికల్లో పార్టీ నాయకుడిగా విజయం సాధించిన ఏకైక ప్రధానమంత్రి కూడా మోదీనే. ఈ విజయాలు ఆయన రాజకీయ నైపుణ్యాన్ని, ప్రజలతో ఉన్న బలమైన సంబంధాన్ని స్పష్టం చేస్తున్నాయి.

ఆర్థిక సంస్కరణల నుంచి సామాజిక సంక్షేమ పథకాల వరకు, ఆయన పరిపాలన దేశ పురోగతికి ఒక స్పష్టమైన దిశను ఇచ్చింది. రాబోయే సంవత్సరాల్లో, ఆయన నాయకత్వం భారతదేశాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంది.

మధ్యాహ్న భోజన పథకం వండేటప్పుడువడ్డించేటప్పుడు.

– మధ్యాహ్న భోజన పథకం – వండేటప్పుడు,వడ్డించేటప్పుడు…..
– పాటించాల్సిన పద్ధతులు నియమాల పై శిక్షణ కార్యక్రమం…..

కొల్చారం, (మెదక్)నేటిధాత్రి :-

 

 

 

 

 

రాష్ట్ర మరియు జిల్లా విద్యాశాఖ ఆదేశాల మేరకు మంగళవారం కొల్చారం మండలంలోని మూడు కాంప్లెక్స్ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన కార్మికులకు మరియు ప్రధానోపాధ్యాయులకు మధ్యాహ్న భోజనం వండేటప్పుడు మరియు వడ్డించేటప్పుడు పాటించే పద్ధతులు నియమాలపై శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
ఈ శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా స్థాయిలో శిక్షణ పొందినటువంటి ఉపాధ్యాయులు కాంప్లెక్స్ స్థాయిలో ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికులకు మరియు ప్రధానోపాధ్యాయులకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల విద్యాధికారి శ్రీ సత్యనారాయణ రావు మాట్లాడుతూ తూచా తప్పకుండా ట్రైనింగ్లో తెలియజేసిన వంటి సూచనలు పాటించాలని అదేవిధంగా క్రింది సూచనలు తప్పకుండా అనుసరించాలని తెలియజేశారు.

– మధ్యాహ్న భోజనం వండేటప్పుడు పాటించవలసిన నియమాలు…

పాత్రలు: వంట వండే పాత్రలు పరిశుభ్రమైన నీటితో కడిగి ఉండాలి. వంట వండే పాత్రలు శుభ్రంగా ఉండాలి.
నీరు: వంటకు వాడే నీరు పరిశుభ్రమైనదై ఉండాలి.
బియ్యం: అన్నం వండే ముందు బియ్యాన్ని శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసిన బియ్యాన్ని పరిశుభ్రమైన నీటితో కడగాలి.
కూరగాయలు: వంట చేయడానికి తెచ్చిన కూరగాయలను ముందుగా శుభ్రంగా కడగాలి. కడిగిన తరువాతనే కూరగాయలను తరుగుకోవాలి. తరిగే చాకు/కత్తిపీటను కూడా శుభ్రంగా కడుగుకోవాలి.
మూతలు: వంట చేసేటప్పుడు వంట వండే పాత్రల మీద మూతలు వేసుకోవాలి. మూతలు వేయడం వలన చుట్టూ పరిసరాలలో ఉన్న దుమ్ము పడదు, వంట చెరకు (కట్టెలు) లేదా గ్యాస్ ఆదా చేయవచ్చు.
ఇంధన ఆదా: వంట పూర్తి అవ్వడానికి 10 నిమిషాల ముందు మంట ఆర్పేసి, పాత్రలోని వేడితో మిగిలిన వంట పూర్తిచేయవచ్చు. దీని వల్ల వంట చెరకు/ఇంధన శక్తి ఆదా అవుతుంది.
పరిశుభ్రత: వంట పూర్తి అయిన తరువాత వాడే క్లీనింగ్ క్లాత్‌తో సహా అన్నీ శుభ్రంగా ఉంచుకోవాలి.
వంట చేసే వారి పరిశుభ్రత:
వంట చేసేవారు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
వంట చేసేవాళ్ళు గోళ్లు పెంచుకోకూడదు.
తలకి క్యాప్, ఆప్రాన్ వేసుకొని వంట చేయాలి.
వంట చేసేవారు తలలో చేతులు పెట్టుకోవడం కానీ, ముఖంలో వేళ్లు పెట్టుకోవడం కానీ, దురద పుట్టినప్పుడు గోకడం కానీ చేయకూడదు.
ముఖ్య గమనిక: పైన చెప్పిన వాటిలో ఏ ఒక్కటి పాటించకపోయినా వండిన ఆహారం కలుషితం అయిపోతుంది. పిల్లలకు అనారోగ్యం కలగవచ్చు

గరిటలు: అన్నం, కూర, చారు వడ్డించడానికి వాడే గరిటలు శుభ్రమైనవి, సరైన సైజువి అయి ఉండాలి. అన్నం వడ్డించడానికి హౌసింగ్ గరిట, కూరకి ఒక గరిట, చారుకు గుంట గరిట వాడాలి.
మూతల స్థానం: వడ్డించడానికి తీసిన మూతలను శుభ్రమైన ప్రదేశంలో పెట్టాలి.
గరిటల స్థానం: వడ్డించిన తరువాత గరిటలను ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. వడ్డించేటప్పుడు వాడే గరిటను ఏదైనా ఒక ప్లేటులో పెట్టుకోవాలి.
వడ్డించే స్థలం: వడ్డించే స్థలం కూడా పరిశుభ్రంగా ఉండాలి.
కీటకాలు: మూతలు తీసిన వంట మీద ఈగలు, దోమలు వాలకుండా జాగ్రత్త తీసుకోవాలి.
ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ పరిధిలోని ప్రధానోపాధ్యాయులు మరియు వంట కార్మికులు మరియు సహాయకులు పాల్గొనడం జరిగింది

32 ఏళ్లుగా సేవలు.

32 ఏళ్లుగా సేవలు..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ఓవైపు ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం నిర్వహిస్తూ.. మరోవైపు కద లలేని స్థితిలో ఉన్న కుమారుడిని కం టికి రెప్పలా కాపాడుతోంది ఓ మాతృ మూర్తి. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం కుప్పానగర్కు చెందిన ఈశ్వ రమ్మ, రాములుకు 32 ఏళ్ల క్రితం మనోజ్ కుమార్ జన్మించాడు. పుట్టుకతోనే కదలలేని స్థితిలో ఉన్న కుమారుడికి బాగవుతుం దని నమ్మకంతో పలు ఆస్పత్రులలో సంప్రదించారు. అయినా ప్రయోజనం లేకపోయింది. పుట్టినప్పటి నుంచి నేటి వరకు కుమారుడికి అన్ని విధాలుగా సేవలు చేస్తూ కనుపాపలా చూసుకుంటోంది ఆ తల్లి. స్నానం చేయించడం, తినిపించడం, వంటి అన్నీ తానై సేవలు అం దిస్తున్నారు. ఉపాధ్యాయురాలిగా ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తిస్తూనే కొడుకుకి ఏ లోటు లేకుండా చూసుకుంటున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version