క్షుద్బాధతో భిక్షాందేహి అని చేయి చాపితే ఛీదరించుకుంటున్నారు.

హైదరాబాద్,నేటి ధాత్రి:

క్షుద్బాధతో భిక్షాందేహి అని చేయి చాపితే ఛీదరించుకుంటున్నారు.
దొంగ బాబాలు చేయిచాపి చాపకముందే కోట్లు కుమ్మరిస్తారు.

తినేందుకు ఏమిలేక ఆకలై అడిగితే అది ముష్టేనట
బడా బాబులు అడిగితే అది భక్తేనట

కొబ్బరి కాయలు, పూలదండలు అమ్మేవాళ్ళ వద్ద గీచిగీచి బేరాలాడుతుంటారు.
దేవుడి హుండీలో దక్షిణ పూజ టిక్కెట్ వద్ద బేరసారాలు గుర్తుకురావంటారు.

విలాసవంతమైన సూపర్ మార్కెట్లో సరకులు కొని మారు మాట్లాడకుండా బిల్లు కట్టుతారు.
చిన్న చితక కిరాణా కొట్టులో గీచిగీచి బేరంఆడి సరకులు కొని బిల్లు కట్టుతారు.
ఎందుకనో
ఈ వ్యవస్థ మారాలని కోరుకుంటూ.

రచన ✍️మంజుల పత్తిపాటి.
మాజీ డైరెక్టర్
ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ
యాదాద్రి భువనగిరి జిల్లా,
తెలంగాణ రాష్ట్రం.
చరవాణి 9347042218

ఎన్నికలు ఏవైనా ముదిరాజ్ లే పైచేయి సాధించాలి.

ఎన్నికలు ఏవైనా ముదిరాజ్ లే పైచేయి సాధించాలి.

స్థానిక సంస్థల ఎన్నికలు కాగానే పోరాటం ఆగదు.

ముదిరాజులను బీసీ.డి నుండి ఏ మార్పించడమే లక్ష్యం

శాసన మండలి డిప్యూటీ స్పీకర్,ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు బండా ప్రకాష్

దుగ్గొండి మండలంలో ముదిరాజ్ మహాసభ వరంగల్ జిల్లా విస్తృతస్థాయి సమావేశం

నర్సంపేట నేటిధాత్రి:

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఏ ఎన్నికలైనా ముదిరాజ్ కులస్తులు ప్రజా ప్రతినిధులుగా పై చేయి సాధించాలని తెలంగాణ శాసన మండలి డిప్యూటీ స్పీకర్,ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు బండా ప్రకాష్ రాష్ట్ర ముదిరాజ్ కులస్తులు పిలుపునిచ్చారు.తెలంగాణ ముదిరాజ్ మహాసభ వరంగల్ జిల్లా విస్తృతస్థాయి సమావేశం దుగ్గొండి మండలంలోని గిర్నిబావి గ్రామాల్లో గల వందన గార్డెన్ లో ముదిరాజ్ మహాసభ వరంగల్ జిల్లా అధ్యక్షులు,నర్సంపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పొన్నం మొగిలి అధ్యక్షతన జరిగింది.ముఖ్య అతిథులుగా ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు,శాసన మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్ ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లేబోయిన అశోక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసన మండలి డిప్యూటీ స్పీకర్ బండా ప్రకాష్ మాట్లాడుతూ గత కొన్ని దశాబ్దాలుగా ముదిరాజ్ కులస్తులను బీసీ.డీ నుండి బీసీ.ఏ లోకి మార్చడం కోసం అనేక ప్రయత్నాలు జరిగాయని ఆనాటి దిగంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ప్రత్యేక జీవో ద్వారా అమల్లోకి తీసుకచ్చామని ఐనప్పటికీ హైకోర్టులో వేసిన పిటిషన్ ద్వారా సాధించుకోలేకపోయామని తెలిపారు.స్థానిక సంస్థల ఎన్నికలు కాగానే ముదిరాజ్ కులస్తుల రిజర్వేషన్ కోసం పోరాటం మరోసారి కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు.

గతంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సకల జనుల సర్వేతో పాటు ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఇంటింటికి కులగణన సర్వేలో కూడా
ముదిరాజ్ జాతి అత్యున్నత స్థాయిలో ఉన్నదని సర్వేలు చెప్పుతున్నాయని
బండ ప్రకాష్ వివరించారు.రాష్ట్రంలో ముదిరాజ్ కులస్తులు పటిష్టంగా ఉన్న ప్రజా ప్రతినిధులుగా ప్రాతినిధ్యం లేని పరిస్థితి నెలకొన్నదని రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో ఉన్న ముదిరాజ్ బిడ్డలు ఏకమైతే అన్ని పంచాయితీలు మనవే అని స్పష్టం చేశారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో ముదిరాజ్ ల సంఖ్యను పెంచుకోవడానికి ఏపార్టీ ఐనా ఐక్యతతో సీట్లు సాధించుకోవాలని తెలిపారు.రాజకీయ పార్టీలు సీట్లు ఇవ్వకున్న ముదిరాజ్ జెండాతో ప్రజా ప్రతినిధులుగా గెలువాలే అని శాసన మండలి డిప్యూటీ స్పీకర్ బండా ప్రకాష్ పిలుపునిచ్చారు.
సర్పంచులు,జెడ్పీటీసీలు,ఎంపీటీసీ కోసం గెలిపించుకోవడం కోసం ప్రధాన బిఆర్ఎస్,కాంగ్రెస్ పార్టీలతో పాటు అన్ని రాజకీయ పార్టీల నుండి సీట్లు సాధించుకోవాలన్నారు.మహిళా రిజర్వేషన్ ప్రకారం మహిళలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం ఎక్కువగా ఉన్నాయని ఈ నేపథ్యంలో ఆకాశాలను కల్పించుకోవాలని సూచించారు.పట్టణాలలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ముదిరాజ్ బిడ్డలు పొటీచేయాలన్నారు.గతంలో 150 మత్స్య శాఖ సొసైటీలు ఉంటే తెలంగాణ వచ్చాక 6 వేల సొసైటీలను తీసుకువచ్చామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ముదిరాజ్ కులస్తుల రిజర్వేషన్ అమలు కోసం ప్రధాన,ప్రతిపక్ష పార్టీలలో ఉన్న ముదిరాజ్ ప్రజా ప్రతినిధులతో హైదారాబాద్ లో సమావేశం పెట్టబోతున్నట్లు తేల్చిచెప్పారు. ఇలాంటి కార్యక్రమాలు చేయాలన్న ఒక్క పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాజ్ కులస్తులు ముందుకొస్తున్నారని ఇదే తరహాలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ముదిరాజ్ కులస్తుల ఐక్యతచాటాలని శాసనమండలి డిప్యూటీ స్పీకర్ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు బండ ప్రకాష్ తెలియజేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లెబోయిన అశోక్ మాట్లాడుతూ ఐక్యతతో ఉంటే అన్ని హక్కులకు సాధించుకోవచ్చని తెలిపారు. కులబలం ఉంటేనే రాజకీయ పార్టీల్లో సీట్లు సాదించుకోవచ్చని ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఎన్నారై సెల్ కన్వీనర్ శానబోయిన రాజ్ కుమార్ ముదిరాజ్ రాష్ట్ర ముదిరాజ్ కులస్తులు పిలుపునిచ్చారు.తెలంగాణ రాష్ట్రంలో 13 వేల గ్రామ పంచాయితీ ఉంటే ముదిరాజ్ కులస్తులు ముదిరాజ్ సొసైటీలతో పటిష్టంగా ఉన్నారన్నారు.
తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్న ముదిరాజ్ కులస్తులు కీలకమని పేర్కొన్నారు. ఏ ఎన్నికలు వచ్చినా ఆ ఎన్నికల్లో కులబలం ఉంటేనే రాజకీయ పార్టీల్లో సీట్లు లభిస్తాయి.సీట్లు సాధించి ప్రజా ప్రతినిధులుగా ఎదగచ్చని తెలిపారు.

సామాజికంగా,ఆర్థికంగా ఎదగాలన్న సమిష్టిగా ఉండాలి.గత వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ముదిరాజ్ లకు బీసీ డి నుండి బీసీ ఏ కు మార్చాలని ప్రత్యేక జీఓను ప్రస్తుత శాసన మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాష్ తెప్పించారు.నేడు ఆయన వెంటే ఉంటూ హక్కులను సాధించుకోవాలని ముదిరాజ్ కులస్తులు వివరించారు.
ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ రాష్ట్ర నాయకులు, వరంగల్ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గొనెల రవీందర్, వరంగల్ జిల్లా మహిళా అధ్యక్షురాలు గోనెల పద్మ, జిల్లా మత్స్య శాఖ ప్రమోటర్ సోమయ్య, ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు బుస మల్లేశం జిల్లా గౌరవాధ్యక్షుడు జిలుకల కొమ్మాలు, నీరటి సదానందం, గుంటిక సోమయ్య పోలు అమర్ చందు,గుండా రాకేష్, ముద్రపోయిన సుధాకర్,భీమ్ రాజ్, దుగ్గొండి మండల అధ్యక్షుడు పల్లె రమేష్, నూనె నర్సయ్య హంస విజయరామరాజు ముద్రబోయిన వెంకన్న రావుల రాజు తోట సాంబయ్య పిట్టల భాస్కర్ అన్నబోయిన లింగయ్య పంబాల కోటి కెవ్వు శివకాశి బోనాల భరత్, జిల్లా పరిధిలోని మాజీ జెడ్పిటిసిలు ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేత.

ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేత.

కల్వకుర్తి/ నేటి ధాత్రి :

 

 

 

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం లో ఇందిరమ్మ ఇళ్లు మోడల్ హౌస్ ను ఎమ్మెల్యేలు కశిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తి పట్టణంలోని CKR (చింతల కొండా రెడ్డి) ఫంక్షన్ హాల్ లో కల్వకుర్తి పట్టణం, కల్వకుర్తి మండలం, వెల్దండ మండలం, చారకొండ మండాల లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణ రెడ్డి జిల్లా ఇంచార్జిలు తెజావత్ బెల్యా నాయక్, రాజశేఖర రెడ్డి, ప్రవీణ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, తదితరులు  పాల్గొన్నారు.

బడ్జెట్‌లో మంథనికి మొండిచేయి చూపిన మంత్రి.

బడ్జెట్‌లో మంథనికి మొండిచేయి చూపిన మంత్రి…

– చేసిన వాగ్దానాల నెరవేర్చేందుకు పైసా కేటాయించలే

– అప్పు పుట్టట్లేదని పరువు తీస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి

– 15నెలలైనా కాళేశ్వరం నిర్వాసితులకు పరిహరమేది

– ఇసుక దందా కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును ఆగం చేసిండ్లు

– ఎన్ని ఆటంకాలు ఎదురైన పేదోళ్ల కోసమే మా పోరాటం

– మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌

 

మంథని:- నేటి ధాత్రి

 

అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశం మంత్రి శ్రీధర్‌బాబుకు కల్పించిన మంథని ప్రజలకు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌లో ఆయన మొండి చేయి చూపించారని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ అన్నారు.

శుక్రవారం మంథని పట్టణంలోని రాజగృహాలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంథని నియోజకవర్గంలో కుటుంబం, బంధువులు లేని మూడు ఓట్లు ఉన్న దుద్దిళ్ల కుటుంబానికి 40ఏండ్లు అవకాశం కల్పించారని,

ఈనాటి మంత్రికి ఐదుసార్లు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించిన మంథని నియోజకవర్గానికి బడ్జెట్‌లో ఒక్కరూపాయి కేటాయించకపోగా ఈప్రాంత ప్రజలకు మంత్రిగా చేసిందేమీ లేదన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన నిర్వాసితులకు నష్టపరిహరం ఇప్పిస్తామని మాట ఇచ్చారని, కానీ బడ్జెట్‌లో మాత్రం కేటాయింపులు చేయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.

నియోజకవర్గంలో ప్రసిద్దిగాంచిన పుణ్యక్షేత్రం, అనేక ఔషదమూలికలు లభించే రామగిరి ఖిల్లాను అభివృధ్ది చేస్తానని, ఈ ప్రాంతంలో విద్యాభివృధ్దికి ప్రాధాన్యత ఇస్తానని మెడికల్‌ కళాశాల తీసుకువస్తానని హమీ ఇచ్చారన్నారు.

ప్రభుత్వం రాగా సీఎం రేవంత్‌రెడ్డి తన నియోకవర్గానికి మెడికల్‌కళాశాల తీసుకువెళ్లాడే కానీ ఆయన పక్కనే కూర్చుండే మంత్రి మాత్రం తన నియోజకవర్గానికి మెడికల్‌కళాశాలను మంజూరీచేయించలేక పోయారని ఎద్దేవా చేశారు.

పోతారం లిఫ్ట్‌ అయితే ఈ ప్రాంత ప్రజలకు సాగునీరు అందుతుందనే ఆలోచనతో ఆనాడు సింగరేణి అధికారులతో మాట్లాడటం జరిగిందని, ఆనాడు ప్రతిపాదనలు కూడా చేశామని ఆయనగుర్తు చేశారు.

కానీ మంత్రిగా పోతారం లిఫ్ట్‌ గురించి ఊసే ఎత్తకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. చిన్న కాళేశ్వరంను ఏడాదిలోగా పూర్తి చేస్తామని మంత్రి హోదాలో మాట్లాడి ఇప్పటి వరకు ప్రతిపాదనలు చేయకపోగా ఒక్క ఎకరం భూమి కూడా సేకరణ చేయలేదన్నారు.

ఎమ్మెల్యేగా మంత్రిగా పదవులను వాడుకుంటున్నాడే తప్ప ఈ నియోజకవర్గంలో 80శాతం ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ, అగ్రవర్ణాల్లోని పేదల గురించి ఆలోచన చేయడం లేదని, వారి సంక్షేమానికి బడ్జెట్‌లో రూపాయి కేటాయించలేదని విమర్శించారు.

బీడు భూములను సస్యశ్యామలం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టును కావాలనే బదనాం చేసి నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేశారన్నారు.

సీఎం రేవంత్‌రెడ్డి పక్కనే ఉండే మంత్రి వంత పాడకుండా ఈ ప్రాంత రైతుల గురించి ఆలోచన చేస్తే కాళేశ్వరం ప్రాజెక్టు ఎడారిగా మారేది కాదన్నారు.

కేవలం ఇసుక దందాను కొనసాగించుకోవడానికే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని అన్నారు.

అయితే ఇటీవల నీటి పారుదల శాఖ మంత్రి కాళేశ్వరం ప్రాజెక్టు సేఫ్‌ అని ప్రకటించారని, అయితే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఎవరి మాటలు నమ్మాలో అర్థం కావడం లేదన్నారు.

ఒకవైపు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృధ్ది చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి స్వయంగా తమకు అప్పు పుట్టడం లేదని, తమను ఎవరూ నమ్మడం లేదంటూ మాట్లాడిన తీరు రాష్ట్ర పరువు పోయిందని ఆయన అన్నారు.

అంతేకాకుండా అసెంబ్లీ సాక్షిగా మీడియాపై అక్కసు వెల్లబోసుకున్న ముఖ్యమంత్రి బట్టలూడదీసి కొడుతానని మాట్లాడుతుంటే మంథనిలోమాత్రం మంత్రి ప్రెస్‌క్లబ్‌లను ఏర్పాటు చేయిస్తున్నాడని, దేశంలో ప్రెస్‌క్లబ్‌లకు పార్టీలను అంటగట్టిన చరిత్ర మంత్రికే దక్కిందన్నారు.

మంథని ఎమ్మెల్యే ఎప్పుడు అదికారంలో ఉంటే అప్పుడు కొత్త పద్దతులను చూపించే అలవాటు నాటి నుంచే ఉందన్నారు.

ఆనాడు మంత్రి తండ్రి సైతం ప్రజలను హింస ఏవిధంగా పెట్టాలే, నక్సల్స్‌ పేరుమీద ఎలా మట్టుబెట్టాలనే కొత్త పద్దతులు అవలంబిస్తే ఈనాడు మంత్రి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిపై దేశ ద్రోహం కేసులు ఎలా పెట్టాలని చూశాడన్నారు.

మనలోమనకు వైషమ్యాలు పెంచి దాన్ని వాడుకుని గొప్పగా వర్థల్లాలనే చూస్తున్నారన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఐటీ మంత్రిగా పది మందికైనా ఉద్యోగాలు ఇప్పించాలని అడుగుతూనే ఉన్నామన్నారు.

దేశంలో ఎక్కడాలేని విధంగా ఒక్క కుటుంబానికి ఇన్నేండ్ల అవకాశం కల్పిస్తే కనీసం ప్రజల కోసం ఏదైనా చేయాలనే ఆలోచన చేయకపోవడం బాధాకరమన్నారు.

రెండుసార్లు మంత్రిగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో మంథని ప్రాంత అబివృద్దికి ఒక్కరూపాయి కేటాయించకపోవడం ఈ ప్రాంత ప్రజలపై ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుందన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ ఆనాలోచిత విధానాలతో గోదావరి, మానేరు తీర ప్రాంతాల్లోని పంటలకు నీళ్లు లేక ఎండిపోతున్నాయని ఆయన పేర్కొన్నారు.బీద ప్రజల అభ్యున్నతి కోసం ఎన్ని ఆటంకాలు సృష్టించినా ప్రజల పక్షానే ఉంటూ పోరాటం చేస్తామన్నారు.

అనంతరం మంథని పట్టణంలోని రాజాగృహ లో మంథని నియోజకవర్గంలోని అన్ని మండల నాయకులతో 23న కరీంనగర్ లో జరిగే భీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సమావేశం గురించి నాయకులకు మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ దిశా నిర్దేశం చేశారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version