గ్రామ పంచాయతీలను సందర్శించిన.

గ్రామ పంచాయతీలను సందర్శించిన ఎంపీఓ శ్రీపతి బాబురావు

జైపూర్,నేటి ధాత్రి:

 

 

 

జైపూర్ మండలం గంగిపెల్లి గ్రామ పంచాయతీని మంగళవారం ఎంపీవో శ్రీపతి బాబురావు ఆకస్మికంగా సందర్శించారు.గ్రామంలో నిర్వహిస్తున్న పారిశుధ్య కార్యక్రమాలను పరిశీలించి తడి చెత్త,పొడి చెత్త వేరువేరుగా సేకరించాలని,

గ్రామంలో ప్లాస్టిక్ ఇతర వ్యర్థాలు లేకుండా చూసుకోవాలని,13 వ తేదీన గ్రామ పంచాయతీని పరిశుభ్రంగా చేసి సర్టిఫికేట్ సమర్పించాలని పంచాయితీ కార్యదర్శికి తెలియజేశారు.

రహదారులు మరియు మురుగు కాల్వలు పరిశుభ్రంగా ఉంచాలని, వాటర్ పైపులైన్ మరమ్మత్తులు ఉంటే వెంటనే చేయించాలని సూచించారు.

గ్రామ పంచాయతీ రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని తెలిపారు.

సెగ్రిగేషన్ షెడ్ నందు కంపోస్టు ఎరువు తయారు చేయాలని,నర్సరీని పరిశీలించి మొక్కలు 100% పెరిగేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శికి సూచించడం జరిగింది.

వాటర్ అండ్ శానిటేషన్ కు సంబంధించిన 7 రిజిష్టర్లను పరిశీలించారు.

అనంతరం పెగడపల్లి గ్రామ పంచాయతీని,నర్సరీని సందర్శించి ప్రతీ రోజూ ఉదయం సాయంత్రం మొక్కలకు నీళ్ళు అందించాలని,వాటర్ ట్యాంకు చుట్టూ శుభ్రం చేయాలని తగు సూచనలు చేశారు.

గ్రామ పంచాయతీల రికార్డులను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో ఎంపీఓ శ్రీపతి బాబురావు,ఇరు గ్రామపంచాయతీల కార్యదర్శులు మరియు పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version