కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి..

కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి
గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం..

మైనంపల్లి హనుమంతరావు

నిజాంపేట: నేటి ధాత్రి

 

గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. నిజాంపేట మండలం నస్కల్, నార్ల పూర్, కాసింపూర్ గ్రామాల్లో పర్యటించి మాట్లాడారు.. గ్రామాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకొని గ్రామాలను అభివృద్ధి చేసుకుందామన్నారు. ప్రభుత్వం నుండి వచ్చే నిధులే కాకుండా, సొంతంగా గ్రామాల అభివృద్ధికి ఎంఎస్ఎస్ఓ ద్వారా నిధులు అందిస్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ అభ్యర్థులు, నాయకులు ఉన్నారు.

నస్కల్ లో సద్దుల బతుకమ్మ…

నస్కల్ లో సద్దుల బతుకమ్మ

నిజాంపేట: నేటి ధాత్రి

నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో సద్దుల బతుకమ్మ పండుగ ఘనంగా నిర్వహించారు. మహిళలు ఉదయం నుండి బతుకమ్మలను పేర్చి గ్రామంలో గల ప్రధాన కూడలి వద్ద బతుకమ్మలను ఉంచి పండుగ నిర్వహించారు. నూతన పట్టు చీరలు ధరించి ప్రేమానురాగాలతో బతుకమ్మ పండుగ నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పలువురూ మహిళలు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో
పూలను దైవంగా భావిస్తూ ప్రకృతిని కాపాడుతూ మహిళలు అత్యంత వైభవంగా జరుపుకునే గొప్ప పండుగ బతుకమ్మ అన్నారు. ఎంగిలిపూలతో మొదలై సద్దుల బతుకమ్మ వరకు తొమ్మిది రోజులు తీరొక్క పువ్వులను పూజిస్తూ జరుపుకుంటామనిఅన్నారు.తెలంగాణ సంస్కృతి,సాంప్రదాయాలకు పుట్టినిల్లని ఇక్కడ జరుపుకునే బతుకమ్మ పండుగ చిన్న,పెద్ద తేడా లేకుండా ప్రతి ఇంట్లో ఆనందంగా జరుపుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామ సభ్యులు పాల్గొన్నారు

నస్కల్ లో రెవేన్యూ సదస్సు.

— నస్కల్ లో రెవేన్యూ సదస్సు
• భూ సమస్యలకు అర్జీలు చేసుకోండి
• ఎమ్మార్వో
శ్రీనివాస్

నిజాంపేట: నేటి ధాత్రి

 

 

 

భూ సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని నిజాంపేట తాహసిల్దార్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు మండలంలోని నస్కల్ గ్రామంలో మంగళవారం రెవెన్యూ సదస్సును ఎమ్మార్వో శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భూ సమస్యలు ఉన్న ప్రతి రైతు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని ఈ సదస్సులు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈనెల 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సువర్ణ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. నాయబ్ తహసిల్దార్ రమ్య శ్రీ, ఆర్ఐ లు ప్రీతీ, ఇమద్, ధరణి ఆపరేటర్ రాజు, గ్రామస్తులు దేశెట్టి సిద్దారములు, గుమ్ముల అజయ్, మద్దికుంట శ్రీను తదితరులు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version