అంగరంగ వైభవంగా బోనాల పండుగ…..

అంగరంగ వైభవంగా బోనాల పండుగ…..

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-58.wav?_=1

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం గ్రామ పరిధిలోని ఆదివారం బోనాల పండుగ పోచమ్మ తల్లి ఆలయ కమిటీ నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. పోతురాజుల విన్యాసాలతో మహిళలు బోనాలు ఊరేగింపుగా తీసుకొని ఝరాసంగం కాలనీలోని పోచమ్మ మందిరానికి తీసుకువచ్చారు.

Bonala festival

గ్రామ పెద్దలు గ్రామంలో ఉన్న అందరూ కలిసిమెలిసి ఆయా కాలనీ వాసులు అమ్మవారికి బోనాలు సమర్పించారు.ఈ బోనాల కార్యక్రమానికి ఝరాసంగం ప్రాంత వాసులే కాకుండా చుట్టుపక ప్రాంత ప్రజలు కూడా భారీ ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం భక్తులకు అన్నదనా కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పోచమ్మ తల్లి ఆలయ కమిటీ సభ్యులు వివిధ ప్రాంతాల చెందిన భక్తులు పాల్గొన్నారు.

యాదవ సంఘం అధ్యక్షుని ఆధ్వర్యంలో పూర్తిస్థాయి కమిటీ ఎన్నిక.

తంగళ్ళపల్లి మండల యాదవ సంఘం అధ్యక్షుని ఆధ్వర్యంలో పూర్తిస్థాయి కమిటీ ఎన్నిక…..

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

తంగళ్ళపల్లి మండలం యాదవ సంఘం అధ్యక్షులు బండి దేవేందర్ యాదవ్. ప్రధాన కార్యదర్శి ముందటి తిరుపతి యాదవ్ ఆధ్వర్యంలో. మండలంలో పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఇందులో గౌరవ అధ్యక్షులుగా ఆత్మకు చంటి యాదవ్. ఉపాధ్యక్షులుగా మెడ కొక్కుల చరణ్ యాదవ్. కోశాధికారిగా మోతే మహేష్ యాదవ్. కార్యదర్శిగా చె న్నవనేని తిరుపతి యాదవ్. సహాయ కార్యదర్శులుగాబో ల్ల వేణి ఎల్లం. ప్రచార కార్యదర్శులుగా గుట్ల ఐలయ్య. దొంతుల ఆంజనేయులు. అరకుటి మహేష్. కొత్తపల్లి శ్రీనివాస్. వినవేని మల్లేశం. కార్యవర్గ సభ్యులుగా.. ఉడతల కుంటయ్య. దొంతుల ఆంజనేయులు చంద్రము. దొరగొ రాజేశం. త్యాగ దేవయ్య. జగ్గాని రాజేశం. తిరుపతిలు. ఏకగ్రీవంగా నీ ఎన్నుకున్నారని ఈ కార్యక్రమం తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని యాదవ సంఘం కార్యాలయంలో మండల యాదవ సంఘం అధ్యక్షులు బండి దేవేందర్ యాదవ్ ఆధ్వర్యంలో నూతన ప్రకటించారు ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు బండి దేవేందర్ యాదవ్ ప్రధాన కార్యదర్శి ముందర తిరుపతి యాదవ్ మాట్లాడుతూ. యాదవ సంఘం బలోపేతానికి అభివృద్ధికి. నిరంతరం కృషి చేస్తామని పేర్కొంటూ యాదవులందరూ. ఐక్యంగా ఉండి రాబోయే ఎన్నికల్లో సత్తా చాటాలని పిలుపునిచ్చారు అనంతరం. తేదీ. 20వ . 07.2025. రోజున నూతన కమిటీ ప్రమాణస్వీకారం కార్యక్రమం ఉంటుందని. దీనికి మండలంలోని యాదవ కురుమ సోదరులందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలియజేస్తూ ఇట్టి కార్యక్రమంలో మండల యాదవ సంఘం నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

సందడిగా మహిళల గోరింటాకు వేడుకలు.

సందడిగా మహిళల గోరింటాకు వేడుకలు

భూపాలపల్లి నేటిధాత్రి

ఆషాడ మాసం పురస్కరించుకొని భూపాలపల్లి ఏరియాలోని ఇల్లందు క్లబ్ లో గోరింటాకు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా భూపాలపల్లి ఏరియా సింగరేణి సేవా లేడీస్ క్లబ్ ఆధ్యక్షురాలు ఏనుగు సునీత రాజేశ్వర్ రెడ్డి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మహిళలు అందరికీ పండుగ వాతావరణం లో గోరింటాకు పోటీలను నిర్వహిచడం జరిగింది . ఈ గోరింటాకుపోటీలలో విజేతలు అయినవారికి బహుమతులను సేవ ఆధ్యక్షురాలు చేతులమీదుగా ప్రధానం చేశారు.ఈ సందర్భంగా సేవా అధ్యక్షురాలు సునీత రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. గోరింటాకు చర్మ వ్యాధుల నుంచి రక్షిస్తుందని, ఒంట్లోని వేడిని తగ్గిస్తుందని, గోరింటాకు అనేది సాంప్రదాయకంగా, సౌందర్య సాధనంగా, అలాగే ఆరోగ్యపరంగా అనేక ఉపయోగాలు కలిగి ఉందని గోరింటాకు జుట్టుకు బలాన్ని ఇవ్వడానికి, చుండ్రును తగ్గించడానికి ఉపయోగపడుతుందాని, ఆషాడ మాసం లో గోరింటాకు అలంకరణ తెలుగు వారి సంప్రదాయం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లేడీస్ క్లబ్ మెంబర్స్, తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా కొనసాగుతున్న గోల్కొండ బోనాల జాతర.

ఘనంగా కొనసాగుతున్న గోల్కొండ బోనాల జాతర

 

 

 

 

గోల్కొండ బోనాల జాతర ఘనంగా కొనసాగుతోంది.

రెండో పూజ ఆదివారం కావడంతో గోల్కొండ కోటకు భక్తుల తాకిడి పెరిగింది.

దీంతో గోల్కొండ పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి.

గోల్కొండలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది.

Hyderabad: తెలంగాణ సంస్కృతికి, అస్తిత్వానికి ప్రతీకగా నిలిచే ఆషాఢ మాస (Aashada Masam) బోనాల సందడి (Bonala Festival) మొదలైంది.

చారిత్రాత్మక గోల్కొండ కోట (Golconda Fort)లో బోనాల సమర్పణ ప్రారంభమయ్యాయి.

దీంతో ఆదివారం (Sunday) తెల్లవారుజామునుంచే భక్తులు (Devotees) గోల్కొండకు చేరుకుని ముక్కులు చెల్లించుకుంటున్నారు.

ఈ సందర్భంగా గోల్కొండ కోట పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

గోల్కొండ బోనాల జాతర ఘనంగా కొనసాగుతోంది.

రెండో పూజ ఆదివారం కావడంతో గోల్కొండ కోటకు భక్తుల తాకిడి పెరిగింది.

దీంతో గోల్కొండ పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి.

భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు..

సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

పోతురాజుల విన్యాసాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో గోల్కొండలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది.

ఈ నెల 26వ తేదీ గురువారం నుంచి ఆషాడ మాస బోనాల ఉత్సవాలు మొదలయ్యాయి.

గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారికి తొలిబోనం సమర్పించడంతో బోనాల జాతర మొదలైంది.

ప్రతి గురు, ఆదివారాల్లో భక్తులు అమ్మవారికి మొక్కులు సమర్పించనున్నారు.

అమ్మవార్లకు 9 పూజలతో గోల్కొండ బోనాలు జరుగుతాయి.

గోల్కొండ కోటలో నెలరోజుల పాటు బోనాల ఉత్సవాలు జరగనున్నాయి.

గోల్కొండ కోటాలో మొదలైన బోనాలు జులై 24న తిరిగి గోల్కొండ కోటలో వేడుకలు ముగియనున్నాయి.

లష్కర్ బోనాల జాతరకు అంకురార్పణ..

కాగా తెలంగాణ ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే లష్కర్ బోనాల జాతరకు ఆదివారం అంకురార్పణ జరగనుంది.

సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాకాళీ బోనాల జాతరలో తొలి ఘట్టమైన అమ్మవారి ఘటం ఎదుర్కోలు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి గుత్తా మనోహర్ రెడ్డి, ఆలయ ఫ్యామిలీ ట్రస్టు చైర్మన్ సురిటి రామేశ్వర్, కామేశ్వర్లు తెలిపారు.

రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారి ఆభరణాలను అప్పగించడం ద్వారా ఘటం ఎదుర్కోలు ప్రారంభమవుతుందన్నారు.

వచ్చే నెల 13వ తేదీన బోనాలు జరుగుతాయని, ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి, పూజలు చేస్తారని వారు తెలిపారు.

14న ఉదయం 8.30 గంటలకు రంగం (భవిష్యవాణి) కార్యక్రమం జరుగుతుందని వివరించారు.

జోరుగా ఎర్రరాయి అక్రమ దందా

జోరుగా ఎర్రరాయి అక్రమ దందా

◆ గుంతలమయంగా గనుల ప్రాంతం

◆ జరిమానాలు విధించినా మారని తీరు

◆ గనుల్లో ఇష్టారాజ్యంగా తవ్వకాలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

న్యాల్కల్ మండల పరిధిలోని గణేష్ పూర్ గ్రామ శివారులో అక్రమంగా ఎర్రరాయి తవ్వకాల దందా జోరుగా కొనసాగుతుంది. ఎర్రరాయి తవ్వకాల ను కట్టడి చేసేందుకు అధికారులు పలుమార్లు దాడులు చేసి అకక్రమార్కు లకు జరిమానాలు విధించినా గనుల్లో తవ్వకాలు మాత్రం ఆగడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. పట్టుబడి నప్పుడు అక్రమార్కు లు జరిమానాలు కడుతూ మళ్లీ యధావిధిగా తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. అక్రమంగా ఎర్రరాయిని తరలించే మాఫియా తమ వ్యాపారాన్ని పెద్ద ఎత్తున మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. నిమ్స్ అసైన్మెంట్ భూముల్లో సైతం ఎర్రరాయి తవ్వకాలు తమ ఇష్టారాజ్యంగ జరుగుతున్నా. రెవెన్యూ, మైనింగ్ శాఖల అధికారులు పట్టించుకోవడం లేదని మండల ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. నిత్యం గనుల్లో ఎర్రరాయిని తీసి ట్రాక్టర్లలో వందల సంఖ్యలో రాష్ట్ర సరిహద్దులను దాటిస్తున్నారే ఆరోపణలు కూడా ఉన్నాయి. గణేష్ పూర్ ఎర్రరాయిని అక్రమార్కులు అడ్డు అదుపు లేకుండా ఇక్కడి నుంచి దూరప్రాంతాలైన అందోల్, నారాయణ ఖేడ్, వట్టిపల్లి మండ లాలకు లారీల్లో అధిక లోడ్లతో తరలిస్తున్నా అధికారులు తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. భారీ ఎత్తున లారీల్లో ఎర్రరాయిని దూర ప్రాంతాలకు తరలిస్తుండడంతో రోడ్లు సైతం దెబ్బతిని వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మైనింగ్ అధికారులు చుట్టపు చూపుగా వచ్చి నామ మాత్రంగా దాడులు చేసి అసలైన నిందితులను వదిలేస్తూ తూతూ మంత్రంగా తనిఖీలు జరిపి నామ మాత్రానికి జరిమానాలు విధిస్తున్నారనే విమర్శలున్నాయి. ఇప్పటికైనా ఎర్రరాయి అక్రమ తవ్వకాలకు అడ్డుకట్టవేయ గలుగుతారా? లేదా యధావిధంగా కొనసాగుతుందా అనేది వేచి చూడాల్సిందే.

అన్నదాతల పండుగ ఏరువాక పౌర్ణమి పండుగ నేడే.

అన్నదాతల పండుగ ఏరువాక పౌర్ణమి పండుగ నేడే…

– వ్యవసాయ పనులకు శుభారంభం….

– రైతన్నలకు ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన ముత్యం ప్రవీణ్ కుమార్….

కొల్చారం, (మెదక్):- నేటి ధాత్రి

 

 

 

 

నాగరికత ఎంతగా ముందుకు సాగినా.. నాగలి లేనిదే పని జరగదు. రైతు లేనిదే పూట గడవదు. అలాంటి వ్యవసాయానికి సంబంధించిన పండుగే ఏరువాక పౌర్ణమి. దీనినే హలపౌర్ణమి అని కూడా అంటారు. ఇంతకీ ఈ ఏరువాక పౌర్ణమి విశిష్టత ఏమిటి. దాన్ని ఈ రోజునే ఎందుకు చేసుకుంటారు అంటే… వైశాఖ మాసం ముగిసి జ్యేష్ఠం మొదలైన తరువాత వర్షాలు కురవడం మొదలవుతాయి. ఒక వారం అటూ ఇటూ అయినా కూడా, జ్యేష్ఠ పౌర్ణమినాటికి తొలకరి పడక మానదు. భూమి మెత్తబడకా మానదు. అంటే నాగలితో సాగే వ్యవసాయపు పనులకు ఇది శుభారంభం అన్నమాట. అందుకనే ఈ రోజున ఏరువాక అంటే ‘దుక్కిని ప్రారంభించడం’ అనే పనిని ప్రారంభిస్తారు. అయితే జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి వరకూ ఎందుకు ఆగడం. ఖాళీగా ఉంటే కాస్త ముందర నుంచే ఈ దుక్కిని దున్నేయవచ్చు కదా అన్న అనుమానం రావచ్చు. ఎవరికి తోచినట్లు వారు తీరికని బట్టి వ్యవసాయాన్ని సాగిస్తే ఫలితాలు తారుమారైపోతాయి. సమిష్టి కృషిగా సాగేందుకు, పరాగ సంపర్కం ద్వారా మొక్కలు ఫలదీకరణం చెందేందుకు, రుతువుకి అనుగుణంగా వ్యవసాయాన్ని సాగించేందుకు… ఇలా రకరకాల కారణాలతో ఒక వ్యవసాయిక క్యాలండర్‌ను ఏర్పరిచారు మన పెద్దలు. అందులో భాగమే ఈ ఏరువాక పౌర్ణమి. కొంతమంది అత్యుత్సాహంతో ముందే పనిని ప్రారంభించకుండా, మరికొందరు బద్ధకించకుండా… ఈ రోజున ఈ పనిని చేపట్టక తప్పదు.

– వ్యవసాయ పనిముట్లకు పూజలు…

 

Agricultural Work.

 

 

ఏరువాక పౌర్ణమి రోజు వ్యవసాయ పనిముట్లు అన్నింటినీ కడిగి శుభ్రంచేసుకుంటారు రైతులు. వాటికి పసుపుకుంకుమలు అద్ది పూజించుకుంటారు. ఇక ఎద్దుల సంగతైతే చెప్పనక్కర్లేదు. వాటికి శుభ్రంగా స్నానం చేయించి, వాటి కొమ్ములకు రంగులు పూస్తారు. కాళ్లకు గజ్జలు కట్టి, పసుపుకుంకుమలతో అలంకరించి హారతులిస్తారు. పొంగలిని ప్రసాదంగా చేసి ఎద్దులకు తినిపిస్తారు. ఇక ఈ రోజున జరిగే తొలి దుక్కిలో కొందరు తాము కూడా కాడికి ఒక పక్కన ఉండి ఎద్దుతో సమానంగా నడుస్తారు. వ్యవసాయ జీవనంలో తమకు అండగా నిలిచి, కష్టసుఖాలను పాలుపంచుకునే ఆ మూగ జీవాల పట్ల ఇలా తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తారు. ఇక ఏరువాక సాగుతుండగా, అలుపు తెలియకుండా పాటలు పాడుకునే సంప్రదాయమూ ఉంది. అందుకనే ఏరువాక పాటలు, నాగలి పాటలకి మన జానపద సాహిత్యంలో గొప్ప ప్రాముఖ్యత ఉంది.
జ్యేష్ఠ మాసంలో మొదలయ్యే నైరుతి రుతుపవనాల ప్రభావం ఇంచుమించు భారతదేశమంతటా ఉంటుంది. మన దేశంలోని దాదాపు 80 శాతం వర్షపాతం ఈ నైరుతి వల్లనే ఏర్పడుతుంది. కాబట్టి ఈ ఏరువాక పౌర్ణమిని దేశమంతటా జరుపుకుంటారు. పున్నమి నాడు పూజలు చేయడం వల్ల ఆ సంవత్సరం అంతా పంటలు సమృద్ధిగా పండుతాయని అన్నదాతలు విశ్వసిస్తారు.

– రైతులకు ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన సీనియర్ నాయకుడు ముత్యం ప్రవీణ్ కుమార్….

కొల్చారం మండలం రైతులకు కొల్చారం మండలం సీనియర్ బి ఆర్ఎస్ పార్టీ నాయకుడు ముత్యం ప్రవీణ్ కుమార్ ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ పనులను ప్రారంభిస్తూ ప్రకృతిని దైవంగా భావించి భూమిని పూజించే సంప్రదాయం మనదని పేర్కొన్నారు. వర్ష ఋతువు ఆరంభమయ్యే జ్యేష్ఠ పౌర్ణమి నాడు భూమిని పూజించడమే గాక వ్యవసాయానికి ఆధారమైన పశుసంపద రోగాల బారిన పడకుండా అన్నదాతలు సంప్రదాయ కార్యక్రమాలను నిర్వహిస్తారని తెలిపారు.

ఘనంగా హిందూ సామ్రాజ్య దినోత్సవేడుకలు.

కల్వకుర్తిలో ఘనంగా..హిందూ సామ్రాజ్య దినోత్సవేడుకలు.

కల్వకుర్తి/ నేటి ధాత్రి :

 

 

 

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో సోమవారం 1674వ సంవత్సరం జ్యేష్ట శుద్ధ త్రయోదశి నాడు ‘హిందూ రాజ్యం ఏర్పడదు అనే భావన పటాపంచలైంది. ‘డిల్లీశ్వరోవా జగదీశ్వరోవా’ అనే ఆలోచన ముగిసింది. పరిమిత సాధనాలతోనే హిందువు శ్రేష్ఠ, స్వతంత్ర పాలకుడయ్యాడు. హిందువుల పౌరుష పరాక్రమాలు లోకానికి తేటతెల్లమైన చత్రపతి శివాజీ పట్టాభిషేకమైన రోజు. అదే హిందూ సామ్రాజ్య దినోత్సవం.
శివాజీ 1630 ఫిబ్రవరి 19 వైశాఖ శుక్ల పక్ష తదియనాడు పూణే జిల్లాలోని జున్నార్‌ పట్టణం దగ్గర శివనేరి కోటలో శంబాజీ, జిజాభాయి పుర్వాదంపతులకు జన్మించాడు. తల్లి బాల్యంలో శివాజీకి మాతృభూమిపై, ప్రజలపైన ప్రేమకలుగునట్లు విద్యాబుద్ధులు నేర్పింది. భారత, రామాయణ గాధలు చెప్పి వీరత్వం మొలకింపచేసింది. తన తండ్రి పొందిన పరాజయాలను అద్యయనం చేసి అనతి కాలంలోనే శివాజీ యుద్ధ తంత్రాలలో నిష్ఠాతుడయ్యాడు. హిందూ సామ్రాజ్య స్థాపన యుద్ధం చేసి బీజాపూర్‌కు చెందిన ‘తోరణ’ దుర్గాన్ని స్వాధీనం చేసుకొని పూణే ప్రాంతాన్నంతా తన అధీనంలో ఉంచుకున్నాడు.

జోరుందుకున్న ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజలు.

జోరుందుకున్న ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజలు

మండలం లో ప్రతీ గ్రామం లో
ఇండ్ల కు ముగ్గులు పోస్తున్న అధికారులు

కొత్తగూడ, నేటిధాత్రి:

 

 

 

 

తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎన్నో ఏళ్లకు ఎదురుచూస్తున్న తరుణం ఆసన్నమైంది పేదింటి వాడి సొంతింటి కల నెరవేరే అవకాశం మరి కొద్ది రోజుల్లో పూర్తవునుంది..ఎప్పుడో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లులు తప్ప తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత రాష్ట్ర ప్రజలు సొంతింటి కల నెరవేరుతుందని కోటి ఆశలతో ఎదురు చూశారు కానీ గత పాలకుల నిర్లక్ష్యం వారి స్వార్థాలతో పదేళ్లపాటు సొంత గూడు లేక అల్లాడిపోయిన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ఊరటనిచ్చింది.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కొత్తగూడ మండలంలోని పోగుల్లపల్లి గ్రామంలో
శనివారం రోజు ప్రభుత్వ అధికారులు పంచాయతీ కార్యదర్శి బి కళ్యాణి
ఆధ్వర్యంలో ముగ్గు పొసే కార్యక్రమం నిర్వహించారు..ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల వివరాలు పేర్లు1 బుగ్గ పద్మ.2. భూక్య అనిత 3. మోకాళ్ళ మౌనిక 4 బైరబోయిన రజిని 5 జూల వనక్క 6 బోళ్ల పద్మ 7 శిరపోయిన లచ్చమ్మ 8 నక్క సారమ్మ 9 బోళ్ల సమ్మక్క 10 శిర బోయిన స్వరూప 11 ముత్యం మమత 12 రాగి దేవేంద్ర 13 మొత్తం సప్న 14 దొంతర బోయిన రాధిక 15 కాగితం వెంకటమ్మ 16 నన్నే బోయిన కోమల 17 పడిగే నర్సమ్మ 18 గుగ్గిళ్ళ దీవెన.. అను లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్ల గృహ నిర్మాణం భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు…
ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు డేగల భద్రయ్య కాంగ్రెస్ పార్టీ మండల యూత్ ఉపాధ్యక్షులు చొప్పరి కుమార్,గ్రామ పెద్దలు యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు….

ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు.

ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
బి ఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు
బలుగూరి తిరుపతిరావు
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి:

మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బి ఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బలుగురు తిరుపతిరావు ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం
బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బారాస మండల పార్టీ తరఫున గులాబీ జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నిర్విరామ పోరాటం ద్వారా బారాస అధినేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి మరణం అంచుల వరకు చేరి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధిస్తే ఆ కష్టాన్ని గుర్తించిన తెలంగాణ ప్రజలు నిర్విరామంగా పదేళ్లపాటు పోరాటం ద్వారా అధికారంలో కూర్చోబెట్టారు. ఈ 10 ఏళ్ల పాలనలో టిఆర్ఎస్ పార్టీ తెలంగాణను దేశంలోని అగ్రస్థానంలోని నిలిపింది. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు గుడిమళ్ళ రమేష్ మల్సాని బాపురావు దేవునూరికుమారస్వామి బొల్లేని రవికుమార్ ఎల కంటి మూర్తిలింగాచారిపడిదల జగ్గారావు బండారి రామస్వామి చెక్క సురేష్ వనం కార్తీకు ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు

ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు.

ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

రైతులకు అవగాహన కార్యక్రమం

శాయంపేట నేటిధాత్రి:

 

 

 

శాయంపేట మండలం సూరం పేట గ్రామంలో రాష్ట్ర అవత రణదినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.

రైతులతో ఒక సమావేశాన్ని నిర్వహించి ప్రస్తుత వానా కాలంలో విత్తనాలు ఎరువులు పురుగు మందులు మరియు నీటి యాజమాన్యం తదితర అంశాలపై అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఇందులో భాగంగా రైతులు నాణ్యమైన విత్తనాలు కొనుగోలు చేయవలసిందిగా సూచించడమైనది, అధిక రసాయనాలు వాడడం వల్ల నేల నీరు గాలి కాలుష్యంతో పాటు మానవుని యొక్క ఆరోగ్యం కూడా పాడవుతుంది కనుక అధిక రసాయనాల జోలికి వెళ్లకుండా సేంద్రీయ పద్ధతిలో సహజసిద్ధమైన వ్యవసాయం చేసినట్లయితే ఆరోగ్యకరమైన పంటను మనము తీసుకోవడానికి వీలవుతుంది, అధిక రసాయ నాలు వాడడం ద్వారా నేలలో చౌడు వచ్చే అవకాశం కూడా ఉన్నందున రసాయనలకు బదులుగా సేంద్రియ వ్యవసా య పద్ధతిలోగనుక మనం వ్యవసాయాన్ని కొనసాగించి నట్లయితే కొంతకాలానికి చౌడు దానంతట అదే తగ్గిపోయే అవకాశం కూడా ఉంది బల మైన నేలలున్న దగ్గర పంట కూడా బలంగానే ఉంటుంది, అందువల్ల బలమైన మొక్కలు ఉండే అవకాశం ఉంది కనుక నాణ్యమైన దిగుబడిని సాధిం చే అవకాశం ఉందని సూచిం చడం జరిగింది.

పురుగు మందుల పిచికారి సమయం లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించడం జరిగింది.పురుగు మందులు కూడా సిఫారసు మేరకే వాడాలని సూచించడం జరిగింది.

బయోమందులను ఎట్టి పరిస్థితులలో వాడరాదని తెలియజేయడం జరిగింది.

బయోమందులు వాడడం ద్వారా తాత్కాలికంగా మొక్క ఎదుగుదల కనపడినప్పటికిని తదుపరి పరిణామాలలో పురుగు ఉధృతి మరి ము ఖ్యంగా రసం పీల్చే పురుగుల ఉధృతి పెరిగే అవకాశం ఉంది కాబట్టి పంటను కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి బయో మందులను రైతులు ఎట్టి పరిస్థితులలో వాడకూడదని సూచించడం జరిగింది.

మరి ముఖ్యంగా రైతులు మొక్క జొన్న మరియు వరి మేల్ ఫిమేల్ పద్ధతిలో పంట పండిం చడం జరుగుతున్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించడం జరిగింది.

సదరు కంపెనీ దగ్గర తప్పనిసరిగా ప్రాపర్ అగ్రిమెంట్ అనేది తీసు కోవాలి.

అలాంటి పరిస్థితుల లో పొరపాటున ఏదైనా పంట నష్టం జరిగినప్పుడు, దిగు బడులు తగ్గడం జరిగినప్పుడు కంపెనీ వారి నుండి నష్టపరి హారం పొందడానికి అవకాశం ఉంటుంది.

అగ్రిమెంటు తప్ప నిసరిగా తీసుకోవాలి, డీలర్ల దగ్గర కూడా కచ్చితంగా లైసెన్స్ ఉన్న డీలర్ల దగ్గరనే విత్తనాలు కొనుగోలు చేయాలి, రసీదులను పట్టకాలమంతా కూడా భద్రపరచాలి.

 

తప్ప నిసరిగా రైతు తీసుకునే రసీ దు మీద షాపు యజమాని సంతకంతో పాటు రైతు సంత కం కూడా ఉండేలాగా చూసు కోవాలి.

తీసుకున్న రసీదులో విత్తనాలు,ఎరువుల పురుగు మందుల పూర్తిస్థాయి సమా చారం ఉండేలాగా చూసు కోవాలి తగు జాగ్రత్తలు తీసు కోవాలి.

మట్టి పరీక్షలు తప్పనిసరిగా చేసుకోవాలి, తద్వారా భూసార పరీక్షల ఫలితాలకు అనుగుణంగా మనము ఎరువులు వేసుకో వడానికి అవకాశం ఉంది రైతులు ఈ దిశగా దృష్టి సారించాలని సూచించడం జరిగింది.

అనం తరం ప్రజ్వల్ సంస్థ రైతుల కోసం తయారు చేసిన నవధాన్యాల మినీ కిట్స్ రైతులకు పంపిణీ చేయడం జరిగింది, నవధాన్యాల ద్వారా కలిగే ఉపయోగాల గురించి వివరించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పంచాయితీ సెక్రటరీ రాజ్ కుమార్, ప్రజ్వల్ సంస్థ ఫీల్డ్ ఫెసిలిటేటర్ కల్పన, రైతులు పాల్గొన్నారు.

ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఇబ్రహీంపట్నం నేటి దాత్రి:

జడ్.పి.హెచ్.ఎస్ హై స్కూల్
వర్షకొండ గ్రామంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎస్సి 2025 సంవత్సరం పాఠశాల నుండి 100% ఫలితాలు సాధించడం జరిగింది అలాగే 527 మార్కులతో ఎన్ లహరి.ప్రథమ స్థానంలో స్కూల్ టాపర్ గా నిలిచింది దానితో పాటు స్కూల్ సెకండ్ టాపర్ ఎస్ వర్షిని.ని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మరియు ఉపాధ్యాయులు గ్రామ మాజీ సర్పంచ్ దొంతుల శ్యామల తుక్కారం మరియు మాజీ ఎంపీటీసీల పోరం అధ్యక్షుడు ఫోనుకంటి చిన్న వెంకట్. మాజీ ఉప సర్పంచ్ లక్ష్మణ్ మరియు ప్రధానోపాధ్యాయులు రాజేందర్. ఘనంగా మొమెంటోలు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పదవ తరగతి పూర్వ విద్యార్థులు జిల్లా పరిషత్ హై స్కూల్ కి సీసీ కెమెరాలు విరాళంగా అందించారు. ఈ సందర్భంగా వారిని గ్రామస్తులు అభినందించారు.

ఘనంగా బోనాల వేడుకలు.

ఘనంగా బోనాల వేడుకలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

కోహిర్ మండలం దిగ్వల్ గ్రామంలో మైసమ్మ దేవాలయ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. మహిళలు తలపై బోనాలను ధరించి గ్రామపురవీధుల మీదుగా ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి సమర్పించారు. మహిళలు అమ్మవారికి ఓడిబియ్యాన్ని ప్రత్యేకంగా ఇచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు.

ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు.

ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
ఐనవోలులో బి.ఆర్.ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వేడుకలు

అయినవోలు నేటిదాత్రి:

ఐనవోలు మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మండల టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ తక్కలపల్లి చందర్రావు ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం
బిఆర్ఎస్ పార్టీ మండల కన్వినర్ తంపుల మోహన్, బారాస మండల పార్టీ తరఫున గులాబీ జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నిర్విరామ పోరాటం ద్వారా భరోసా అధినేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి మరణం అంచుల వరకు చేరి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధిస్తే ఆ కష్టాన్ని గుర్తించిన తెలంగాణ ప్రజలు నిర్విరామంగా పదేళ్లపాటు అధికారంలో కూర్చోబెట్టారు. ఈ 10 ఏళ్ల పాలనలో టిఆర్ఎస్ పార్టీ తెలంగాణను దేశంలోని అగ్రస్థానంలోని నిలిపింది. టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న రోజుల్లో ధనిక రాష్ట్రము మిగులు బడ్జెట్ అని చెప్పిన ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలు చేతగాని అడ్డగోలు హామీలు ఇచ్చి తాము అధికారం చేపట్టే సరికి రాష్ట్ర పరిపాలన చేతకాక రాష్ట్రం దివాలా తీసింది అని సాక్షాత్తు ముఖ్యమంత్రి బహిరంగంగా ప్రకటించడం హాస్యాస్పదం అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీకి పరిపాలన చేతకాకపోతే, ప్రభుత్వం గద్దె దిగిపోవాలని కేసీఆర్ నాయకత్వంలో మరోమారు బంగారు తెలంగాణను సాధించేందుకు భారస పార్టీ సిద్ధంగా ఉందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భారస గ్రామ పార్టీ అధ్యక్షులు తాటికాయల కుమార్, మండల నాయకులు కావటి స్వామి, కాటబోయిన అశోక్, గడ్డం రఘువంశీ గౌడ్, దుపెల్లి రాజు, పట్టపురం ఎల్లగౌడ్,బొక్కల స్వామి, గద్దల ప్రభాకర్,సంతోష్,రవి తదితరులు పాల్గొన్నారు..

ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు.

ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు.

రాష్ట్ర సాధనలో మాజీ సీఎం కెసిఆర్ ఆమరణ దీక్ష తెలంగాణ రాష్ట్రానికి దిక్సూచి.

రాష్ట్రం సిద్ధించడంలో అమరవీరుల త్యాగాలు మరువలేనివి.

మాజీ జెడ్పి ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న.

మండల పార్టీ అధ్యక్షుడు డాక్టర్ భానోత్ సారంగపాణి.

నల్లబెల్లి నేటి ధాత్రి:

14 ఏళ్ల అలుపెరుగని పోరాటంతో తెలంగాణ ఉద్యమ రథసారథి కెసిఆర్ సారధ్యంలో సాధించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను మండల కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్వగృహం వద్ద బిఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న హాజరై జాతీయ జెండాను ఎగరవేశారు అలాగే మండల పార్టీ అధ్యక్షుడు బానోత్ సారంగపాణి పార్టీ జెండా ఎగరవేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమరుల త్యాగాలు, ప్రభుత్వ ఉద్యోగులు విద్యార్థుల పోరాటాలు సబ్బండ వర్గాల సమిష్టి కృషితోనే ఆరో దశబ్దాల కల సహకారం అయిందని అన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ తొలి 10 ఏళ్ల ప్రస్థానం యావత్ భారత్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రతి ఆలోచన వెనుక రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా దిక్సూచిగా నిలిచిందని పేర్కొన్నారు.

తెలంగాణ గడ్డపై పురుడుపోసుకున్న రైతుబంధు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాలు దేశానికి దారి చూపే దీప స్తంభంలా నిలవడం ప్రతి తెలంగాణ బిడ్డకు గర్వకారణమని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్ష చైర్మన్ చెట్టు పల్లి మురళీధర్ రావు, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ఉడుగుల ప్రవీణ్ గౌడ్, మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్, క్లస్టర్ ఇన్చార్జిలు గందె శ్రీనివాస్ గుప్తా, వైనాల వీరస్వామి, ఇంగ్లీశివాజీ, మాజీ సర్పంచులు నాన బోయిన రాజారాం యాదవ్, ఊరటి అమరేందర్ రెడ్డి, మామిండ్ల మోహన్ రెడ్డి, చీకటి ప్రకాష్, వెంకన్న, మాజీ ఎంపిటిసి జన్ను జయరావు, నాయకులు ఖ్యాతం శ్రీనివాస్, పాండవుల రాంబాబు, ఆకుల సాంబారావ్, బోట్ల పవన్, బూస సదయ్య, గుండాల శ్రీశైలం, గుమ్మడి వేణు, పరికి కోర్నిల్, రాజు, వేల్పుల రవి తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

కరీంనగర్ నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట మార్కెట్ కమిటీ ఆద్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగురవేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మరవేణి తిరుమల తిరుపతి ముదిరాజ్. ఈకార్యక్రమంలో వైస్ చైర్మన్ పిండి సత్యం రెడ్డి, డైరెక్టర్ లు బడుగు ఎల్లయ్య, మ్యాకల స్వామి, జక్కుల బాబు, కుంబాల రాజేశం, వేణుగోపాల్ రెడ్డి, కోట్ల మల్లేశం, మార్కెట్ సిబ్బంది, రాజేశం, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

నల్లబెల్లి నేటి ధాత్రి:

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మండల కేంద్రంలో ఘనంగా జరుపుకున్నారు. మండల తాసిల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో ముప్పు కృష్ణ, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో నరసింహమూర్తి, స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సై వి గోవర్ధన్, సహకార సంఘం కార్యాలయంలో చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్ రావు, మదర్ తెరిసా సమైక్య మండల కార్యాలయంలో అధ్యక్షురాలు ఊట్కూరి భాగ్యలక్ష్మి, రైతు వేదిక వద్ద ఏవో బన్న రజిత, జాతీయ పతాకాన్ని ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం తెలంగాణ గీతాన్ని ఆలాపించి అమరవీరులకు జోహార్లు అర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మార్వో ముప్పు కృష్ణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరుద్యోగ యువకులు, ఉద్యోగులు సబ్బండ వర్గాల త్యాగ ఫలితం తోటే తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం జరిగిందని. రాష్ట్రం కోసం ప్రాణాలు సైతం త్యాగం చేసిన త్యాగమూర్తులను స్మరించుకుంటూ వారి ఆశయ సాధన కోసం రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి దిశగా అడుగులు వేసే విధంగా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖలకు సంబంధించిన సిబ్బంది, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు…

నేటి ధాత్రి గార్ల:

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పిఎసిఎస్ కార్యాలయంలో జాతీయ జెండాను సొసైటీ చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్ ఆవిష్కరించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ,నీళ్లు, నిధులు,నియామకాల కోసం ప్రత్యేక తెలంగాణ ఏర్పడిందని అన్నారు.అమరుల ఆకాంక్షలు, ఆశయాల కోసం సకల జనులందరూ కృషి చేయాలని ఆయన కోరారు.స్వరాష్ట్రము కోసం అసువులు బాసిన తెలంగాణ అమరవీరులందరికీ నివాళులు అర్పించారు. పోలీస్ స్టేషన్ లో ఎస్సై రియాజ్ పాషా, తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద విశ్వ జంపాల,తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ శారదా, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ మంగమ్మ జెండా ఆవిష్కరణ చేశారు.ఈ యొక్క కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ గంగావత్ లక్ష్మణ్ నాయక్,సొసైటీ డైరెక్టర్ శీలంశెట్టి ప్రవీణ్ నాయుడు, సిపిఎం పార్టీ జిల్లా నాయకులు కందునూరి శ్రీనివాస్,కడియం వెంకన్న, సొసైటీ సీఈవో వెంకటేశ్వర్లు, గిన్నారపు మురళి తారక రామారావు, భూక్యా నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా మే డే ఉత్సవం.!

భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా మే డే ఉత్సవం.

బెల్లంపల్లి నేటిధాత్రి :

 

మే డే ఉత్సవం సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పట్టణ పార్టీ కార్యాలయంలో పట్టణ కార్యదర్శి ఆడెపు రాజమౌళి, భగత్ సింగ్ స్టాచ్ దగ్గర పట్టణ అమాలి సంఘం జెండాను రాష్ట్ర సమితి సభ్యులు మిట్టపల్లి వెంకటస్వామి, ఏరియా హాస్పిటల్ జెండాను జిల్లా కార్యవర్గ సభ్యులు దాగం మల్లేష్, భవన నిర్మాణ సంఘం జెండాను భవన నిర్మాణ కార్మిక సంగం జిల్లా కార్యదర్శి జాడి పోచం, రైల్వే స్టేషన్ జెండాను మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షులు బొల్లం సోనీ, ఇంక్లైన్ జెండాను పట్టణ కార్యవర్గ సభ్యులు బొంకూర్ రామచందర్, రైల్వే రధగంబాల జెండాను శాఖ కార్యదర్శి ఎన్ రాజన్న పాత బెల్లంపల్లి జెండాను జిల్లా సమితి సభ్యులు మేకల రాజేశం అరుణ పతాక ఆవిష్కరణలు చేసినారు. ఈ సందర్భంగా పట్టణ కార్యదర్శి ఆడపు రాజమౌళి, రాష్ట్ర సమితి సభ్యులు మిట్టపల్లి వెంకటస్వామి, జిల్లా కార్యవర్గ సభ్యులు దాగం మల్లేష్ ప్రసంగిస్తూ చికాగో అమరుల రక్తంతో తడిసి ఎర్రజెండాగా అవతరించింది. కార్మికులను 16 గంటలు పని చేస్తూ కట్టు బానిసలుగా తయారు చేస్తూ నీరం కుశంగా అణచివేస్తున్నందుకు నిరసనగా 1886లో అమెరికాలోని చికాగో నగరంలో పెద్ద ఎత్తున కార్మికులు ర్యాలీ నిర్వహించినారు. అట్టి రాలిపై పోలీసులు జరిపిన కాల్పులలో ఎంతోమంది కార్మికులు వీర మరణం పొందారు. వారి పోరాట ఫలితంగా ప్రపంచమంతా ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేసి నారు. వారి పోరాట స్ఫూర్తితో భారతదేశంలో కార్మిక వర్గ పోరాటాలు చేస్తూ 44 కార్మిక చట్టాలను సాధించాము. మోడీ ప్రభుత్వం కార్మికులు సాధించుకున్న కార్మిక చట్టాలను కాలరాస్తూ 44 చట్టాలను నాలుగు కోడు లుగా మారుస్తూ కార్మిక హక్కులను హరించు చున్నది. కావున దీనికి వ్యతిరేకంగా కార్మిక వర్గమంతా సంగటితమై కేంద్ర ప్రభుత్వ విధానం కు వ్యతిరేకంగా కార్మిక చట్టాలను రక్షించుకొనటానికి సమరశీల పోరాటాలు చేయవలసి ఉన్నదని కేంద్ర ప్రభుత్వం దేశంలో నక్సలైట్లను లేకుండా చేస్తామని ఆపరేషన్ కగారు పేరిట కేంద్ర బలగాలతో కర్రెగుట్టలను ఆక్రమించుకొని జల్లేడపడుతూ జీవించే హక్కును హరించవద్దని మరియు నక్సలైట్లు కూడా జనజీవన స్రవంతిలో కి రావాలని వారితో చర్చలు జరపాలని వామపక్ష పార్టీలు ఈ సందర్భంగా కోరుతున్నాయి. కార్యక్రమంలో మండల కార్యదర్శి బొంతల లక్ష్మీనారాయణ, జిల్లా సమితి సభ్యులు అక్క పెళ్లి బాబు, డిఆర్ శ్రీధర్, గుండా చంద్ర మాణిక్యం, బియ్యాల ఉపేందర్, మేకల రాజేశం, పట్టణ సహాయ కార్యదర్శి కొంకుల రాజేష్, ఏ ఐ టి యు బ్రాంచి సహాయ కార్యదర్శి దాసరి తిరుపతి గౌడ్, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షులు బొల్లం సోని, పట్టణ కార్యవర్గ సభ్యులు మంతెన రమేష్, రత్నం రాజం, రామచందర్, బొల్లం తిలక్ అంబేద్కర్, దాసరి అనిల్ కుమార్, పట్టణ లోడింగ్ అన్లోడింగ్ అమాలి సంఘం కార్యదర్శి కుందేళ్ళ శంకర్, కా సిపేట మైన్ 1 పిట్ కార్యదర్శి మీనుగులక్ష్మీనారాయణ, కా సిపేట మైన్ 2 ఫిట్ కార్యదర్శి గొల్ల శ్రీనివాస్ మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

కౌసర్ మజీద్ లో ఘనంగా రంజాన్ వేడుకలు.

కౌసర్ మజీద్ లో ఘనంగా రంజాన్ వేడుకలు.

చిట్యాల, నేటిధాత్రి :

ముస్లింల పవిత్ర పండుగ అయినా రంజాన్ పండుగను పురస్కరించుకొని చిట్యాల మండల కేంద్రంలోని కౌసర్ మజీద్ ఆవరణలోని ఈద్గాలో మండలంలోని ముస్లిం సోదరులందరూ ఎంతో భక్తిశ్రద్ధలతో నమాజ్ చేసుకుని ఒకరికొకరు అలై బాలాఈ చేసుకొని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు ఈ సమావేశంలో మండల కో ఆప్షన్ మాజీ సభ్యులు మహమ్మద్ రాజ్ మహమ్మద్ మాట్లాడుతూ ముస్లింలకు పవిత్ర మాసం రంజాన్ నెల ఈ నెలలో ప్రతి ఒక్క ముస్లిం 30 రోజులు కఠోర ఉపవాస దీక్ష లో ఉండి సోమవారం.రోజున ఉపవాస దీక్షను విరమించి రంజాన్ పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు అలాగే సమాజంలో గంగ జమున తహసీబ్ కే జైస హిందూ ముస్లింలు అనే భేదం లేకుండా అందరు కలిసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు ఈ సమావేశంలో మసీదు కమిటీ అధ్యక్షలు అజ్మత్ మియా కార్యదర్శిహైదర్ పాషా వైస్ ప్రెసిడెంట్ షఫీ జాయింట్ సెక్రెటరీ అక్బర్ ట్రెజరర్ షేక్ హుస్సేన్ వివిధ గ్రామాల ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

ఆశలు బారెడు ఆచరణ మూరెడులా రాష్ట్ర బడ్జెట్.

ఆశలు బారెడు.. ఆచరణ మూరెడులా రాష్ట్ర బడ్జెట్

గత బడ్జెట్ పై శ్వేత పత్రం ప్రకటించాలి

ఎన్నికల హామీలు అమలయ్యే విధంగా బడ్జెట్ సవరించాలి

వ్యవసాయరంగానికి 10 శాతం కేటాయించకపోవడం శోచనీయం

ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్

నర్సంపేట నేటిధాత్రి:

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మూడు లక్షల నాలుగువేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్ల రూపాయలు బడ్జెట్ ఆశలు బారెడు.. ఆచరణ మూరెడులా ఉందని ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ ఎద్దేవా చేశారు.బడ్జెట్ అంకెల్లో గొప్పగా కనిపిస్తున్నప్పటికీ ఆచరణలో కేటాయింపులను చూస్తే ఎన్నికల హామీలు అమలయ్యే విధంగా లేవని, గత బడ్జెట్ కేటాయింపులపై ఖర్చులపై ప్రభుత్వానికి ఎంత మాత్రం చిత్తశుద్ధి ఉన్న తక్షణమే శ్వేత పత్రం విడుదల చేయాలని రమేష్ డిమాండ్ చేశారు.
బుదవారం రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ పై పెద్దారపు రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఎన్నో ఆశాజనకమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయకుండా ప్రజల ఆశలను అడియాశలు చేసిందని ఈ క్రమంలో ఈ బడ్జెట్ లోనైనా హామీలన్నీ అమలయ్యే విధంగా కేటాయింపులు ఉంటాయని ఆశిస్తే ప్రజలకు శఠగోపం పెట్టారని ఆరోపించారు.ఆరు గ్యారెంటీలను అరకొర అమలుచేసి ప్రచారా ఆర్భాటం చేస్తున్నారని అలాగే 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నామని అసెంబ్లీలో తీర్మానం చేసి బడ్జెట్లో మాత్రం అందుకు అనుగుణంగా కేటాయింపులు లేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రధాన భూమిక పోషించే వ్యవసాయ రంగానికి కేవలం 24,439 కోట్లు కేటాయించి చేతులు దులుపుకున్నారని వాస్తవ సాగుదారులకు నేటికీ 2 లక్షల రుణమాఫీ పూర్తిగా అమలు కాదని, రైతు భరోసా రైతుల ఎకౌంట్లో పడలేదని అన్నారు.ధాన్యానికి క్వింటాకు 500 బోనస్ రైతులందరికీ వర్తింపజేయకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులకు ఎలాంటి పరిహారాన్ని నిధులు కేటాయించకపోవడం అన్యాయం అని పేర్కొన్నారు.ఇప్పటికైనా గత బడ్జెట్ ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేసి ఎన్నికలు వచ్చిన హామీలన్నీ అమలయ్యే విధంగా బడ్జెట్ సవరణలు చేయాలని డిమాండ్ చేశారు లేకపోతే ప్రజల నుంచి ప్రతిఘటన తప్పదని ఈ సందర్భంగా రమేష్ హెచ్చరించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version