అభివృద్ధి చేస్తా.. ఆదరించండి..

అభివృద్ధి చేస్తా..
ఆదరించండి

నిజాంపేట: నేటి ధాత్రి

 

అభివృద్ధి చేస్తా ఆదరించి వార్డు సభ్యులుగా ఎన్నుకోవాలని దొంతర బోయిన శ్రీకాంత్ అన్నారు. నిజాంపేట మండలం చల్మెడ లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గల్లీలో ఉన్న ప్రతి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని, ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి పథకాన్ని ప్రజలకు అందేలా చూసుకుంటానని హామీ ఇచ్చారు. ప్రత్యేకమైన ఎంపి నిధులనుండి గ్రామానికి నిధులు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. 9 వార్డు సభ్యులు మీ అమూల్యమైన గుర్తును గ్యాస్ పొయ్యి పై వేసి గెలిపించాలని వేడుకున్నారు.

 అఖండ 2 స్పెషల్‌ షోలు రద్దు..

 అఖండ 2 స్పెషల్‌ షోలు రద్దు..

 

అఖండ -2: తాండవం’ చిత్రానికి చిక్కులు తప్పడం లేదు. ఈ నెల 5న విడుదల కావలసిన ఈ చిత్రం పలు కారణాలతో వాయిదా పడి ఈ శుక్రవారం విడుదల చేసేలా లైన్‌ క్లియర్‌ చేశారు. అయితే ఇప్పుడు మరో కొత్త సమస్య వచ్చి పడింది.

అఖండ -2: తాండవం’ (Akhanda 2 Thandavam) చిత్రానికి చిక్కులు తప్పడం లేదు. ఈ నెల 5న విడుదల కావలసిన ఈ చిత్రం పలు కారణాలతో వాయిదా పడి ఈ శుక్రవారం విడుదల చేసేలా లైన్‌ క్లియర్‌ చేశారు. అయితే ఇప్పుడు మరో కొత్త సమస్య వచ్చి పడింది. తెలంగాణ హైకోర్టులో పెద్ద షాక్‌ (big shock to Akhanda 2) తగిలింది. సినిమా ప్రీయయర్‌ షోలు, టికెట్‌ ధర పెంచుతూ ఇచ్చిన జీవోను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో భారీ అంచనాల మధ్య విడుదల కానున్న ఈ సినిమా ప్రీమియర్‌ షోలు గురువారం రాత్రి వేయడానికి సన్నాహాలు చేశారు. ఈ క్రమంలో ‘అఖండ 2 తాండవం’ సినిమా టికెట్‌ ధర పెంపు వ్యవహారం తెలంగాణ హైకోర్టుకు చేరింది. టికెట్‌ ధరలను పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని సవాల్‌ చేస్తూ శ్రీనివాస్‌ రెడ్డి అనే న్యాయవాది ఉన్నత న్యాయస్థానంలో  లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు టికెట్‌ ధరల పెంపుతోపాటు ప్రత్యేక షోల నిర్వహాణపై కూడా విచారణ జరపనున్నట్లు తెలుస్తోంది. ‘అఖండ 2’ మూవీ టికెట్‌ హైక్స్‌ ఇస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోని రద్దు చేయాలని కోరుతూ శ్రీనివాస్‌ రెడ్డి అనే న్యాయవాది తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ వేశారు.అఖండ 2 సినిమా టికెట్‌ ధరలను ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు పెంచుకునేందుకు తెలంగాణ సర్కార్‌ ఇటీవల అనుమితి ఇచ్చింది. ఈ ఉత్తర్వుల ప్రకారం సింగిల్‌ స్క్రీన్  థియేటర్లలో టికెట్‌ పై రూ.50, మల్టీప్లెక్స్‌ లో రూ.100 అదనంగా వసూలు చేసుకోవచ్చు. డిసెంబర్‌ 11న ప్రదర్శించే ప్రీమియర్‌ షో టికెట్‌ ధరను రూ.600గా నిర్ణయించేందుకు కూడా ప్రభుత్వం అంగీకరించింది. ఈ అనుమతితోపాటు సినిమా టీమ్‌కు ఓ షరతు విధించింది. టికెట్‌ ధరల పెంపు ద్వారా వచ్చే అదనపు లాభాల్లో 20 శాతం సినీ కార్మికుల సంక్షేమానికి తప్పనిసరిగా కేటాయించాలని ఆదేశించింది.

పెంచిన ఆర్టీసీ బస్ టికెట్లను ధరను వెంటనే తగ్గించాలి.

పెంచిన ఆర్టీసీ బస్ టికెట్లను ధరను వెంటనే తగ్గించాలి

బిజెపి పట్టణ అధ్యక్షులు గాజుల నిరంజన్

పరకాల నేటిధాత్రి

 

బస్సు పాస్ ధరలను పెంచిన ఆర్టీసీ సామాన్య ప్రజలతోపాటు,విద్యార్థుల బస్సు పాస్ 20 శాతం,పెంచిన తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్రం
ఆర్డినరీ పాస్ ధరను రూపాయలు 1150 నుండి రూ.1400కు,మెట్రో ఎక్స్ప్రెస్ పాస్ ధరను 1300 నుండి 1600 కు,డీలక్స్ పాస్ ధరను 1450 నుండి 1800 పెంచిన టీఎస్ఆర్టీసీ ఉచిత బస్సు పథకం వల్ల జరిగే నష్టాన్ని భర్తీ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆడవారికి ఉచితమని మగవారి దగ్గర టికెట్ రేట్లు పెంచి ప్రజల మీద భారం వేస్తుంన్నారని,పెంచిన ఆర్టీసీ టికెట్ ధరను వెంటనే తగ్గించాలని లేనియెడల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో
ప్రజల తరఫున ధరలు తగ్గించేవరకు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని
బిజెపి పరకాల పట్టణ అధ్యక్షులు
గాజుల నిరంజన్ డిమాండ్ చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version