మల్లక్కపేట గ్రామంలో భూ భారతి రేవన్యూ సదస్సు

మల్లక్కపేట గ్రామంలో భూ భారతి రేవన్యూ సదస్సు

ప్రజలనుండి దరఖాస్తులు స్వీకరిస్తున్న ఎమ్మార్వో విజయలక్ష్మి

పరకాల నేటిధాత్రి :

 

 

భూ భారతి రేవన్యూ సదస్సు సద్వినియోగం చేసుకోవాలని పరకాల ఎమ్మార్వో విజయలక్ష్మి అన్నారు.సోమవారం రోజున మండలంలోని మల్లక్కపేట గ్రామంలో తహసీల్దార్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో భూభారతి రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలలో భూభారతి రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తుందని,ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని,సదస్సుల ద్వారా భూ సమస్యలను పరిష్కరించుకునే అవకాశం లభించిందన్నారు.

రెవెన్యూ సదస్సుల్లో ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించి భూ సమస్యల పరిస్కరిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్ఐ అశోక్ రెడ్డి,పంచాయతీ కార్యదర్శి సుమలత,జూనియర్ అసిస్టెంట్ రాజు,రెవన్యూ సిబ్బంది,కారోబార్ వెనుకమూరి ఆనందరావు, స్థానికులు పాల్గొన్నారు.

ప్రభుత్వ బడిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడి కూతురు.

ప్రభుత్వ బడిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడి కూతురు

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

 

మందమర్రిలో నివాసం ఉంటున్న గంగాపూర్ పాఠశాల ఉపాధ్యాయుడు రత్నం సంజీవ్, కరుణ ల కూతురు రత్నం ఉజ్వలిత ను మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల – ఫిల్టర్ బెడ్ లో ఐదవ తరగతిలో చేర్పించారు.ఫిల్టర్ బెడ్ పాఠశాల ఉపాధ్యాయులపై నమ్మకంతో తన కూతుర్ని అడ్మిషన్ చేసినందుకు గాను ఉపాధ్యాయులు రత్నం సంజీవ్ ను అభినందించారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు సంజీవ్ బాటలోనే ప్రభుత్వ ఉపాధ్యాయులు సైతం తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోని చేర్పించేలా చొరవ తీసుకోవాలని ఫిల్టర్ పాఠశాల ఉపాధ్యాయులు కోరుతున్నారు.ఉజ్వలకు ఫిల్టర్ బెడ్ ప్రదానోద్యాయులు శ్రీనివాసాచారి, ఉపాద్యాయులు ఉమాదేవి, భీంపుత్ర శ్రీనివాస్, లలిత, రవి , ఏఏపిసి చైర్మన్ అంజలి లు సాదర స్వాగతం పలికారు..

సింగరేణి కార్మికులకు ఔషధాల సరఫరా

సింగరేణి కార్మికులకు ఔషధాల సరఫరాలో యాజమాన్యం విఫలం…

ఏఐటియుసి డిప్యూటీ ప్రధాన కార్యదర్శి సమ్మయ్య, కేంద్ర కార్యదర్శి అక్బర్ అలీ

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రిలో సింగరేణి కార్మికులకు, అధికారులకు సరఫరా చేసే ఔషధాలు సరఫరా చేయడంలో యాజమాన్యం విఫలం చెందిందని ఏఐటియుసి యూనియన్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ముస్కే సమ్మయ్య, కేంద్ర కార్యదర్శి అక్బర్ అలీ, శ్రీరాంపూర్ బ్రాంచ్ కార్యదర్శి షేక్ బాజీ సైదా, మందమర్రి బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ లు అన్నారు. కార్మికులకు ఔషధాల కొరత తీవ్రంగా ఉందని సోమవారం రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రి డివైసిఎంఓ డాక్టర్ ప్రసన్న కుమార్ కు వినతి పత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడారు. సింగరేణి సంస్థ వేలకోట్ల లాభాలు అర్జిస్తూ కార్మికులకు వారి కుటుంబ సభ్యులకు, పదవి విరమణ కార్మికులకు దీర్ఘకాలిక వ్యాధుల యొక్క ఔషధాలను గత రెండు నెలలుగా పూర్తిస్థాయిలో సరఫరా చేయలేకపోతుందని, కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని యాజమాన్యం వెంటనే స్పందించి ఔషధాలను పూర్తిస్థాయిలో సరఫరా చేయాలని సింగరేణి యాజమాన్యాన్ని కోరుతున్నామని అన్నారు. యాజమాన్యం స్పందించకుంటే గుర్తింపు కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ ఉపాధ్యక్షులు ఇప్పకాయల లింగయ్య, మందమర్రి బ్రాంచ్ ఉపాధ్యక్షులు సుదర్శన్, భట్టు, సంపత్, అప్రోజ్ ఖాన్, రమేష్, సురేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

రాజీవ్ యువ వికాసం పథకం అర్హులకు మాత్రమే.!

రాజీవ్ యువ వికాసం పథకం అర్హులకు మాత్రమే అందించాలి

బిజెపి జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్

జైపూర్,నేటి ధాత్రి:

 

 

 

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం వెంటనే అమలు చేయాలని మంచిర్యాల జిల్లా బిజెపి అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర గౌడ్ సోమవారం జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజీవ్ యువ వికాసం కొరకు దరఖాస్తు చేసుకున్న అర్హులకు సివిల్ స్కోర్ ఎలాంటి షరతులు విధించకుండా అర్హులైన వారికి పథకము అమలు చేయాలని కోరారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు అర్హులకు మాత్రమే కేటాయించాలని,అనర్హులను గుర్తించి ఇందిరమ్మ ఇండ్ల జాబితా నుండి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అ”పూర్వ” విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

అ”పూర్వ” విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

మరిపెడ నేటిధాత్రి : 

 

 

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం లోని ప్రజ్ఞ ఉన్నత పాఠశాలలో 1998 -99 విద్యా సంవత్సరంలో పదవ తరగతి విద్యాభ్యసించిన పూర్వ విద్యార్థుల అపూర్వ ఆత్మీయ సమ్మేళనం ప్రజ్ఞ ఉన్నత పాఠశాల ఆవరణంలో ఆదివారం ఘనంగా జరుపుకున్నారు 26 సంవత్సరాల కాలం తర్వాత కలవడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి పాఠశాల లో పూర్వ విద్యార్దినీ, విద్యార్థులు మాట్లాడుతూ గతంలో విద్యాబోధన చేసిన పూర్వ ఉపాధ్యాయులను గుర్తు చేసుకోని వాళ్ళు నేర్పినటువంటి విద్యా బుద్ధులను ఎన్నటికీ మరువలేమని వారి జ్ఞాపకాలు ఎల్లప్పుడూ మాతోనే ఉంటాయని కొనియాడారు,గత స్మృతులను గుర్తుతెచ్చుకుంటూ తమ గురువుల సేవలను త్యాగాలను ఎన్నడూ మరవలేమని తమ జీవితంలో వారు అందించిన విద్య బుద్ధులను స్ఫూర్తి గా తీసుకోవడం వలన జీవితంలో ఎంతగానో ఉపయోగపడిందని కొనియాడారు,అనంతరం పూర్వ విద్యార్థులు కలిసి చదువుకున్న స్నేహితురాలు గుండెపుడి గ్రామవాసి చంద్రకళ అనారోగ్య కారణాలతో మృతి చెందడంతో వారికి శాంతి కలగాలని రెండు నిమిషాల మౌనం పాటించడం జరిగింది ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు 30 మంది కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమన్ని విద్యాబుద్ధులు నేర్పిన గురువులతో కలిసి ఎంతో ఘనంగా జరుపుకున్నారు, ఈ కార్యక్రమం లో ప్రధానోపాధ్యాయులు మల్లు ఉపేందర్ రెడ్డి,రమా మేడం, రామచంద్రయ్య,రేపాల యాదయ్య,కుడితి ఉపేందర్ రెడ్డి,నాగార్జున, సరస్వతి మేడం,జానకి రాములు, పూర్వ విద్యార్థులు, ఆర్గనైజేషన్ టీం బూర్లే శివప్రసాద్,రాంపల్లి సురేష్ బాబు,ముదిరెడ్డి అనిత, కళ్యాణి,మంజుల,సంతోష్ అయ్యగారు,బుద్ధ శ్రీకాంత్, గుగులోత్ వీరన్న,మిగితా స్నేహితులు తదితరులు పాల్గొన్నారు.

అయినవోలు కాంగ్రెస్ మండల పార్టీలో ముసలం???

అయినవోలు కాంగ్రెస్ మండల పార్టీలో ముసలం???
మండల కమిటీలో అన్ని గ్రామాలకు లభించని ప్రాతినిధ్యం
అధ్యక్షుడి వ్యవహార తీరుపై సర్వత్రా అసంతృప్తి???
అధికారం కాంగ్రెస్ గెలుపు కాదు బిఆర్ఎస్ ఓటమి
క్యాడర్ ను సమన్వయ పరచడంలో పూర్తిగా విఫలం ప్రజలతో మమేకమవ్వకుండా పదవులపై కన్ను
అప్పు రూపంలో ఇందిరమ్మ ఇండ్ల కమిషన్
కంచె చేను మేస్తే బాధితులకు దిక్కెవరు???
నైరాశ్యంలో వలస వచ్చిన కాంగ్రెస్ నాయకులు

నేటి ధాత్రి అయినవోలు :

 

 

అయినవోలు మండల కాంగ్రెస్ పార్టీలో ముసలం ప్రారంభమైనట్లు తెలుస్తోంది. త్వరలోనే మండల కమిటీ మార్పు తద్యం అని నాయకులు భావిస్తున్నారు.

 

ఎందుకంటే అధికారంలోకి రాకముందు ఆపత్కాలంలో ఉన్న నాయకులతో మండల కమిటీని సర్దుబాటు చేయగా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ లోకి వలస వచ్చిన నాయకులకు తగిన ప్రాతినిధ్యం లేదని వారంతా అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తుంది.

 

అయితే మండల కమిటీలో ఇన్నాళ్లు ఏకపక్షంగా వ్యవహరించిన నాయకులు త్వరలో జరగబోయే స్థానిక సమరంలోను పదవులు ఆశిస్తుండటంతో ఇన్నాళ్లు అధికారం అనుభవించిన వారికి మళ్ళీ పదవులు ఇస్తే కేడర్లో తీవ్ర అసంతృప్తి చెలరేగుతుందని ఎమ్మెల్యే భావిస్తున్నారు.

 

అందుకే పోటీపై ఆసక్తి ఉన్న నాయకులకు మండల కమిటీలో చోటు లేకుండా చేసి అసంతృప్తితో ఉన్న నాయకులతో మండల కమిటీని పూర్తి చేసి పాత కొత్త నాయకులను కలుపుకొని ముందుకు పోవాలని ఎమ్మెల్యే యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

 

అంతే కాకుండా ప్రస్తుత అధ్యక్షుని వ్యవహార శైలి పై వివిధ గ్రామాల నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

 

మండల కమిటీ అంటే తాను ఒక్కడినే అన్నట్లు భావిస్తూ పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం కింది స్థాయి నాయకులకు అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

 

మండలంలో ఉన్న ఒకరిద్దరు వైట్ కాలర్ నాయకులను వెంటవేసుకొని తం చెప్పిందే మండలంలో తాను చెప్పిందే శాసనం అన్నట్లుగా ఈ గ్రూపు వ్యవహరిస్తున్నట్లుగా తెలుస్తుంది.

 

పాత కొత్త నాయకుల మధ్య ఉన్న అభిప్రాయ భేదాలను తొలగించి వారి మధ్య సయోధ్య కుదిర్చి పార్టీ అభ్యున్నతికి కృషి చేయాల్సిన నాయకులే తాము చెప్పిందే వేదం అంటూ ఏకపక్షంగా వ్యవహరిస్తుండటంతో కొత్తగా పార్టీలో చేరిన నాయకులు తమకు తగిన ప్రాధాన్యత లభిస్తలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

 

ఇదే విషయాన్ని వాళ్ళ పలుమార్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో పార్టీలో తమ స్థానం ఏమిటో కొత్తగా వచ్చిన నాయకులకు తెలియని పరిస్థితి. ఇటు మండల కమిటీ లోను మరియు నూతనంగా ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కమిటీ లోను కొత్తవారికి చోటు కల్పించలేదు.

 

 

అంతేకాకుండా ప్రభుత్వ పథకాల కేటాయింపులో కూడా తగిన ప్రాధాన్యత లభించడం లేదని పదవులు పథకాలు అన్ని సీనియర్లము అన్న పేరుతో పాత కాంగ్రెస్ నాయకులే పెత్తనం చెలాస్తుండడంతో ఏదో ఆశించి అధికార పార్టీలో చేరిన నాయకులు పునరాలోచనలో పడ్డట్టు తెలుస్తుంది.

 

అంతే కాకుండా అయినవోలు మండలంలో ఉన్న పెద్ద నాయకుడు కాంగ్రెసులో చేరికతో ఆయన వెంట కాంగ్రెస్ పార్టీలో నడిచిన నాయకులు కార్యకర్తలకు రాబోయే స్థానిక సమరంలోనూ టికెట్లు కేటాయిస్తారు అన్న ఆశ లేదు.

 

తమకు తగిన గుర్తింపు లభించకపోవడంతో పార్టీ మారి తాము తప్పు చేశామా అని నాయకులు భావిస్తున్నట్లు తెలుస్తుంది. పోలీస్ భాస్ గా ఎన్నో ఆపరేషన్లు చేసిన ప్రస్తుత ఎమ్మెల్యే రాజకీయాల్లో అరగంట తర్వాత రాజకీయ చాణక్యతను చూపి పాత కొత్త నాయకుల మధ్య ఉన్న భేదాభిప్రాయాలకు చెక్ పెట్టి తన రాజకీయ చాణక్యతను ప్రదర్శిస్తారా లేదా వేచి చూడాలి.

ఎంపీడీవో ఆఫీసులో సమస్త సమీక్ష సమావేశం

ఎంపీడీవో ఆఫీసులో సమస్త సమీక్ష సమావేశం

జైపూర్,నేటి ధాత్రి:

 

 

జైపూర్ మండలంలోని సమస్త పంచాయతి కార్యదర్శులు,ఉపాధి హామీ సిబ్బందితో జైపూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపిడిఓ,ఎంపీఓ ఆధ్వర్యంలో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశంలో గ్రామపంచాయతీ కార్యదర్శులకు,పారిశుద్ధ్య కార్మికులకు,ఈజీఎస్ సిబ్బందికి కొన్ని ముఖ్య నిర్ణయాలను,సూచనలను తెలియజేస్తూ ఆదేశాలు జారీ చేశారు.వివరాలలోకి వెళితే అన్ని గ్రామ పంచాయతీలలో ఈత చెట్ల ప్లాంటేషన్,కెనాల్ ప్లాంటేషన్,బండ్ ప్లాంటేషన్ ద్వారా మొక్కలు నాటాలని,ఇంటింటికి 6 మొక్కలు పంపిణీ చేయాలని,అన్ని రకాల రోడ్ల ప్రక్కన అవెన్యూ ప్లాంటేషన్ క్రింద మొక్కలు నాటాలని,కంక మొక్కల ప్లాంటేషన్,ఆర్ఓఆర్ బండ్ ప్లాంటేషన్,ఫారెస్ట్ ల్యాండ్ లలో మొక్కలు నాటాలని నిర్ణయించారు. అలాగే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో,ప్రభుత్వ భవనములలో మంచి పూల మొక్కలు,పండ్ల మొక్కలు నాటించాలనీ,వన మహోత్సవం రిజిష్టరులో నమోదు చేసి ఉంచుకోవాలని సూచించారు.గ్రామ పంచాయతీలలో అవసరమున్న చోట కమ్యూనిటీ సోక్ పిట్స్ నిర్మించాలని,డ్రైన్ చివరన సోక్ పిట్స్ నిర్మించి పూర్తి చేయాలని తెలిపారు.ఐహెచ్ హెచ్ఐ పూర్తి చేయాలని,కొత్త పనులు అన్ని గ్రౌండ్ చేయాలని,ఇందిరమ్మ ఇళ్లకు ఐహెచ్ హెచ్ఐ తనిఖీ పూర్తి చేసి సిద్ధంగా ఉంచాలని పంచాయతి కార్యదర్శులు బాధ్యతగా వ్యవహరించాలన్నారు.సైడ్ డ్రైన్ లలో డీసిల్టింగ్ క్లీన్ గా చేపించాలని,వాటర్ పేమెంట్ తప్పకుండా చేయాలని,ప్రతీ మంగళ వారం మరియు శుక్రవారం డ్రై డే నిర్వహించాలన్నారు.ఎంపీడబ్ల్యు వర్కర్లచే 8 గంటలు పని చేయించాలనీ,వారు ఏ ఇంటినుండి ఎక్కడికి పనిచేసినది రికార్డుల్లో నమోదు చేయాలని,2025-25 డిసిబి రిజిష్టర్లు ప్రింట్ తీసుకోవాలని,మాన్యువల్ గా రిజిష్టర్ వ్రాసి చూపించాలన్నారు.అన్ని బిల్లులు గ్రామ పంచాయతీ వారిగా ఇవ్వాలని,ఆడిట్ రిపోర్ట్ లు తయారు చేసి ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంచాలని కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు.ఈ సమావేశంలో ఎంపిడిఓ జి.సత్యనారాయణ గౌడు,ఎంపీఓ శ్రీపతి బాపు రావు,ఏపీవో బాలయ్య,పంచాయతీ కార్యదర్శులు,ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.

ఐదు దశాబ్దాల రైతన్నల కల నెరవేర్చాలి…

ఐదు దశాబ్దాల రైతన్నల కల నెరవేర్చాలి…

ముల్కనూర్ వద్ద ప్రతిపాదిత స్థలంలోనే మున్నేరు ప్రాజెక్టు నిర్మించాలి…

మున్నేరు ప్రాజెక్టు నిర్మించి ఏజెన్సీ గిరిజన ప్రాంతాలకు తాగు,సాగునీరు అందించాలి…

మున్నేరు ప్రాజెక్టు నిర్మాణం మండల ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది…

మున్నేరు నీటిని పాలేరుకు తరలించడం అన్యాయం…

నేటిధాత్రి గార్ల :-

 

 

పూర్వపు ఖమ్మం జిల్లా, ప్రస్తుత మహబూబాబాద్ జిల్లా, గార్ల మండలం, ముల్కనూర్ గ్రామం వద్ద మున్నేటిపై మున్నేరు ప్రాజెక్టు నిర్మించాలని ప్రజలు,రైతులు,అఖిలపక్ష పార్టీల నాయకులు కోరుతున్నారు. మున్నేరు ప్రాజెక్టు నిర్మాణం ద్వారా వ్యవసాయానికి నీరు అందుబాటులో ఉంటుంది. ఇది స్థానిక రైతుల ఆదాయాన్ని పెంచుతుంది. మున్నేరు ప్రాజెక్టు నిర్మాణం గార్ల మండల ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది. 1969లో అప్పటి ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య రూ. ఒక లక్ష రూపాయల నిర్మాణ వ్యయంతో చంద్రగిరి ప్రాజెక్టుగా నామకరణం చేసి సర్వే ప్రారంభించారు.1985 లో తెలుగుదేశం ప్రభుత్వం పాకాల యేరు, బయ్యారం పెద్ద చెరువు అలిగేరును కలిపి రెండేర్లగడ్డ ప్రాజెక్టుగా నామకరణం చేసి రు.10 లక్షల రూపాయలకు పెంచి సర్వే చేపట్టారు. పది సంవత్సరాల అనంతరం తిరిగి మున్నేరు ప్రాజెక్టుగా పేరు మార్చుతూ నిర్మాణ ఖర్చులను కోటి రూపాయలకు పెంచుతూ సర్వే చేపట్టారు. మండల ఏజెన్సీ ప్రజల ఉద్యమ ఫలితంగా 2009లో స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం రూ.136 కోట్ల నిధులతో మధ్య తరహా ప్రాజెక్టుగా ప్రతిపాదించారు. జీవో నెంబర్ 1076 ప్రకారం రు. 36 కోట్లు ప్రాజెక్టు పనుల నిమిత్తం మంజూరు చేసిన ఆచరణ సాధ్యం కాలేదు.అప్పటి ఖమ్మం జిల్లాలోని గార్ల, బయ్యారం, కారేపల్లి,కామేపల్లి,ఖమ్మం రూరల్, వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్, కురవి, ములకలపల్లి, డోర్నకల్ తదితర ప్రాంతాలకు తాగు, సాగునీరు అందించాలని ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు సర్వేను చేశారు. ఖమ్మం,వరంగల్ రెండు జిల్లాల్లోని సరిహద్దు గిరిజన ప్రాంతాల్లోని 56 రెవెన్యూ గ్రామాల 35 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని ఉద్దేశంతో సర్వే జరిపారు. అయినప్పటికీ ప్రాజెక్టు కోసం వేసిన శిలాఫలకాలు శిథిలమైపోయిన ప్రాజెక్టు నిర్మాణం చేయకపోవడం శోచనీయం.50 సంవత్సరాలుగా ప్రభుత్వాలు మున్నేరు ప్రాజెక్టును పెండింగ్లో ఉంచి ఈ ప్రాంత ప్రజలకు తీరని అన్యాయం చేస్తూనే ఉన్నారు.మున్నేరు ప్రాజెక్టును జీవోలకు,సర్వేలకు పరిమితం చేసి ఏజెన్సీ, గిరిజన ప్రాంతాలకు సాగు,తాగునీరు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టును ఏజెన్సీ,గిరిజన ప్రాంతాలకు రాకుండా చేయడమే కాక మున్నేరు నీళ్లను సైతం ఏజెన్సీ,గిరిజన ప్రాంతాలకు రాకుండా చేసే కుట్రలో భాగంగానే మున్నేరు నీటిని సీతారామ కెనాల్ ద్వారా పాలేరుకు తరలించడానికి జీవో నెంబర్ 98 ని విడుదల చేస్తూ 162 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టడానికి సిద్ధపడిందని ప్రజలు, అఖిలపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు.రు.100 కోట్ల రూపాయలతో మున్నేరు ప్రాజెక్టు నిర్మిస్తే గార్ల,డోర్నకల్, కారేపల్లి, కామేపల్లి, ఖమ్మం రూరల్ మండలాలకు సాగు తాగునీరు అందుతుంది. పాలక ప్రభుత్వాలు ఏజెన్సీ, గిరిజన ప్రాంతాల పట్ల వివక్షపూరితమైన వైఖరి అవలంబిస్తున్నట్లు కనపడుతుంది. ఇప్పటికైనా జీవో నెంబర్ 98ను రద్దు చేసి, మున్నేరు ప్రాజెక్టు నిర్మించి ఏజెన్సీ గిరిజన ప్రాంతాలకు తాగు, సాగు అందించాలని ప్రజలు కోరుతున్నారు. 1969 నుండి 2009 వరకు గత పాలకులు చేపట్టిన సర్వేలను అనుసరించి అంచనా వేసి తప్పనిసరిగా ముల్కనూర్ వద్దనే మున్నేరు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని ప్రజలు, రైతులు, అఖిలపక్షం డిమాండ్ చేస్తుంది.

పంచాయతీ కార్యదర్శుల సమస్యలు .!

పంచాయతీ కార్యదర్శుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

ఎంపీడీవో కి వినతిపత్రం అందజేసిన పంచాయతీ కార్యదర్శులు

జైపూర్,నేటి ధాత్రి:

 

 

తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల జేఏసీ పిలుపు మేరకు పంచాయతీ కార్యదర్శుల యొక్క దీర్ఘకాలిక పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ జైపూర్ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల పంచాయతి కార్యదర్శులు సోమవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి జి.సత్యనారాయణ గౌడ్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా ఎంపిడిఓ ఇట్టి లేఖను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.ఈకార్యక్రమంలో ఎంపిఓ శ్రీపతి బాపు రావు,పంచాయతి కార్యదర్శులు సుమన్,సురేష్, సత్యనారాయణ,ఉదయ్ కుమార్,శ్రీనివాస్,ప్రశాంత్,సాయి కిరణ్,రమాదేవి,తిరుమల,సుప్రియ మరియు జూనియర్ అసిస్టెంట్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

మందమర్రి మండల బిజెపి కార్యవర్గ సమావేశం.

మందమర్రి మండల బిజెపి కార్యవర్గ సమావేశం

మందమర్రి నేటి ధాత్రి

 

 

 

 

చిర్రగుంట గ్రామంలో మండల అధ్యక్షులు గిర్నాటి జనార్దన్ అధ్యక్షతన జరిగినది సమావేశానికి ముఖ్య అతిథులుగా బిజెపి జిల్లా అధ్యక్షులు నంగునూరు వెంకటేశ్వర గౌడ్ ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్ సీనియర్ నాయకులు దేవరనేనిసంజీవరావు దీక్షితులు పాల్గొన్నారు

ఈ కార్యక్రమంలో మండలప్రధాన కార్యదర్శులువంజరి వెంకటేష్ రాజేష్ నాయక్ కర్రె రాజయ్య ఎనగందుల రాజయ్య దుర్గ మల్లేష్ చిరంజీవి దేవేందర్ రాము మెండే పోచయ్య ప్రదీప్ కుమార్అశోక్ఉప్పుల రాజుసలేంద్ర శ్రీనివాస్ దిలీప్ దశరథం రాకేష్ ప్రశాంత్ మారుతి వివిధ గ్రామాల బిజెపి అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు .

 

 

BJP Executive Committee

 

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు 11 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి సుపరిపాలన గురించి స్థానిక సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి పై రాబోవు స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి రాబోవు నెల రోజులలో చేయవలసిన పార్టీ కార్యక్రమాల గురించికార్యకర్తలతో మాట్లాడారు

జనావాసాల మధ్య ఉన్న చెత్తకుండిని తొలగించాలి.

జనావాసాల మధ్య ఉన్న చెత్తకుండిని తొలగించాలి.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరసంగం మండల కేంద్రంలో లో గల అంగడి బజార్ సమీపంలో గత కొన్ని సంవత్సరాలుగా చెత్తకుండిని ఏర్పాటు చేశారు , ప్రస్తుతం అట్టి చెత్తకుండిలో కొన్ని నెలల నుండి చెత్త మరియు సమీప ఫస్ట్ ఫుడ్ సెంటర్, బేకరి లకు సంబంధించిన వ్యర్థాలను అందులో వేయడం ద్వారా భారీగా దుర్గంధ రావడం కాకుండా ,అట్టి వ్యర్థపదల నుండి నీరు కారి ప్రధాన రహదారి వెంట మురికి నీరు వచి కాలనీ వాసులకు ఇబ్బంది కలుగుతుంది,కానీ గ్రామ పంచాయతీ కార్యదర్శి కానీ అధికారులు ఇట్టి వ్యర్థాలను తీయకుండా కాలయాపన చేస్తున్నారు.అట్టి వ్యర్థ జలాల వల్ల స్థానిక ప్రజలు అనారోగ్యాలకు గురి అవుతున్నారు. తక్షణమే అట్టి చెత్తకుండిని వేరే ప్రదేశాలలో ఏర్పాటు చేయాలని కోరుతున్నాము.

నూతన తాసిల్దార్ని సన్మానించిన మాజీ సర్పంచ్.

నూతన తాసిల్దార్ని సన్మానించిన మాజీ సర్పంచ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

న్యాల్కల్ మండల్ నూతన తహశీల్దారిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి మల్గి గ్రామానికి భూభారతి గ్రామ రెవెన్యూ సదస్సుకు విచ్చేసిన ఎమ్మార్వో ప్రభులు సార్ గారికి సన్మానించిన మాజీ సర్పంచ్ జట్గొండ మారుతి వారితో పాటు బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు సిద్ధారెడ్డి మైనార్టీ నాయకులు అఖిల్ మియా తదితరులు పాల్గొన్నారు

ధర్మకర్తలుగా ప్రమాణస్వీకారం చేసిన మల్లయ్య స్వామి.

ధర్మకర్తలుగా ప్రమాణస్వీకారం చేసిన మల్లయ్య స్వామి ఈశ్వరప్ప

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ కేతా కి సంగమేశ్వర స్వామి దేవాలయములో ఈరోజు ధర్మకర్తలుగా ప్రమాణస్వీకారం కే మల్లయ్య స్వామి ఈశ్వరప్ప లు ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు హనుమంతరావు పాటిల్, ఆలయ ఈవో శివ రుద్రప్ప స్వామి గ్రామ పెద్దలు భక్తులు అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ కేబినెట్ విస్తరణ లో ఒక ముస్లిం కూడా లేరు…

తెలంగాణ కేబినెట్ విస్తరణ లో ఒక ముస్లిం కూడా లేరు..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో రెండోసారి ముస్లింలను చేర్చుకోకపోవడం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాషాయ ముఖం బయటపడిందని సూచిస్తుంది.ఈ సందర్భంగా, బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు షేక్ సోహెల్ ఝరాసంగం మండల తుమ్మలపల్లి గ్రామ యువ నాయకుడు విలేకరుల ప్రతినిధులతో మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ముస్లింలు లేకుండా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడపడం ఇదే మొదటిసారి అని అన్నారు. గతంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరియు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఇలా జరగలేదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇది జరుగుతోంది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మరియు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి సామాజిక న్యాయం జరగడం లేదని ఖాళీ వాగ్దానాలు చేస్తున్నారని వారు అన్నారు.ముస్లింలను పూర్తిగా విస్మరిస్తున్నారు. ఇదేనా సామాజిక న్యాయం? వారు కొన్ని రోజుల క్రితం బిజెపిలో చేరుతారు. ఈరోజు వారు కాంగ్రెస్ పార్టీలో చేరారు మరియు వారు విజయం సాధించేవారు. ఈరోజు వారిని రాష్ట్ర మంత్రివర్గంలో చేర్చారు మరియు మంత్రిని చేశారు – దేశమంతా ఇదేనా: దేశమంతా పెద్ద కాంగ్రెస్ పార్టీయేనా! లౌకికవాదం వారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీపై ప్రజల నమ్మకాన్ని కోల్పోయారు. తెలంగాణలో ప్రజల విశ్వాసం కోల్పోతున్నారు. బిఆర్ఎస్ పార్టీ తెలంగాణలో 10 సంవత్సరాలు అధికారంలో ఉంది మరియు అందరికీ న్యాయం చేసింది.

ముస్లింను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

ముస్లింను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గుర్తించండి..

◆ తెలంగాణ ముస్లింలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న కాంగ్రెస్ పార్టీ…..

◆ ఆరోపించిన ఝరాసంగం మండల ఎంఐఎం పార్టీ అధ్యక్షులు షేక్ రబ్బాని……

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

ఝరాసంగం మండల ఎంఐఎం పార్టీ అధ్యక్షులు షేక్ రబ్బాని మాట్లాడుతూ అయ్యో, కాంగ్రెస్ పార్టీలో ముస్లింలకు ప్రాముఖ్యత లేదు … ఒక్క ముస్లింను కూడా మంత్రివర్గంలోకి తీసుకోలేదు. ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీని మంత్రివర్గంలోకి తీసుకున్నారు, అందులో ముగ్గురు కొత్త మంత్రులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అత్యున్నత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఒక ముస్లింను చేర్చుకుంటారని తెలంగాణ ముస్లింలు ఆశించారు. మంత్రివర్గంలో ఒక్క ముస్లింను కూడా చేర్చకపోవడం విచారకరం. తెలంగాణలో ముస్లింల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. ముస్లింల ఓట్లు అందుకు అనుకూలంగా మారాయి. కాంగ్రెస్ పార్టీలో ముస్లింలకు ప్రాముఖ్యత లేదు. ముస్లింలు అసూయపడే మంత్రి లేరు. కాంగ్రెస్ పార్టీ లౌకిక పార్టీ. అవును,కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముస్లింలను మంత్రివర్గంలోకి తీసుకున్నారు,కానీ బిజెపి మరియు మోడీ ప్రభుత్వాల మాదిరిగానే సిఎం రేవంత్ రెడ్డి తెలంగాణను పాలిస్తున్నారు. తదుపరి ఎన్నికల్లో ముస్లింలు కాంగ్రెస్ పార్టీ సిఎం రేవంత్ రెడ్డికి అందరూ మంచి గుణపాఠం నేర్పించాలని కోరారు. ముస్లింలను ఓటు బ్యాంకు రాజకీయంగా వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు వచ్చే గ్రామ పంచాయతీ జడ్పిటిసి ఎంపిటిసి ఎలక్షన్లలో ముస్లింలందరూ కలిసి కాంగ్రెస్ పార్టీని గుణపాఠం నేర్పించాలని కోరారు.

డాక్టర్ హారిక ఆధ్వర్యంలో హాస్టల్స్ లో దోమల.!

డాక్టర్ హారిక ఆధ్వర్యంలో హాస్టల్స్ లో దోమల మందు స్ప్రే నిర్వహణ

నేటి ధాత్రి చర్ల:

 

 

 

 

 

 

కొయ్యూరు ప్రాథమిక వైద్యశాల స్త్రీ వైద్య నిపుణురాలు డాక్టర్ హారిక ఆధ్వర్యంలో చర్ల మండల కేంద్రంలోని హాస్టల్స్ లో పర్యటించి హాస్టల్ పరిసరాలు ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని పిల్లలకు నాణ్యమైన మంచి పోషకాహారాన్ని అందించాలని వార్డెన్ కు సూచించారు వర్షాకాలం దోమలు అధికముగా వచ్చే ప్రమాదం ఉన్నది దోమలు మనలను కుట్ట కుండ జాగర్తలు తీసుకోవాలని
విద్యార్థులకు జ్వరం వచ్చినట్లయితే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకురావాలని అక్కడ మంచి వైద్యం అందుతుందని తెలియజేశారు

హాస్టల్ చుట్టూ ప్రక్కలా నీరు నిలవకుండా చూసుకోవాలని పరిసర ప్రాంతాల్లో పంచాయతీ కార్మికులతో బ్లీచింగ్ చల్లిస్తూ ఉండాలని పిచ్చి మొక్కలు చెత్తా చెదారం లేకుండా చూసుకోవాలని తెలియజేశారు

 

Mosquito

 

ఈ కార్యక్రమంలో సబ్ యూనిట్ ఆఫీసర్ ధర్మారావు హెల్త్ సూపర్వైజర్ రాంప్రసాద్ మలేరియా టెక్నికల్ సూపర్వైజర్ రామకృష్ణ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ తులసి హెల్త్ అసిస్టెంట్ ధర్మారావు నరసింహారావు స్వరూప
ఆశా కార్యకర్తలు రంగమ్మ కృష్ణవేణి ఉషారాణి పాల్గొన్నారు

ఉద్యోగులను మభ్యపెట్టడం సరికాదుమ్యానిఫెస్టో .

ఉద్యోగులను మభ్యపెట్టడం సరికాదుమ్యానిఫెస్టో లోని హామీలను అమలు చేయాలి
టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి

నేటిధాత్రి చర్ల

 

చర్ల మండల కేంద్రంలో రాంబాబు అధ్యక్షతన టీఎస్ యుటిఎఫ్ మండల కమిటీ సమావేశంలో చావా రవి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ
ఐదు వాయిదాలకు గాను ఒక్క డిఎ ప్రకటించి రెండువాయిదాలు విడుదల చేసినట్లు ప్రకటించటం ఉద్యోగులను మభ్యపెట్టడమేనని ఆరు నెలల తర్వాత ఇస్తామని ఇప్పుడే వెల్లడించటం విడ్డూరంగా ఉందని.

 

ఆరు నెలలు గడిచేటప్పటికి మరో రెండు వాయిదాలు బకాయి పడుతుందని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి అన్నారు.

 

2023 అసెంబ్లీ ఎన్నికల నాటికి బకాయి పడిన మూడు వాయిదాల డిఎ ను పదిహేను రోజుల్లో విడుదల చేస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించినప్పటికీ అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా హామీని నిలుపుకోలేక పోయిందని విమర్శించారు ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని అన్ని యాజమాన్యాల ఉద్యోగులకు వర్తింపజేయాలని పీఆర్సీ ఇప్పటికే 23 నెలలు ఆలస్యమైనందున వెంటనే నివేదిక తెప్పించుకుని అమలు చేయాలని డిమాండ్ చేశారు.

 

విద్యా శాఖలో పర్యవేక్షణ అధికారులు డిఈఒ డిప్యూటీ ఇఒ ఎంఈఒ పోస్టులను శాశ్వత ప్రాతిపదికన నియమించాలని కోరారు వేసవి సెలవులు ముగిసేలోగా ఖాళీగా ఉన్న 700 హైస్కూలు ప్రధానోపాధ్యాయుల పోస్టులకు ఇంకా స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు పదోన్నతులు ఇవ్వాలని రవి డిమాండ్ చేశారు.

 

రాష్ట్ర కార్యదర్శి బి రాజు మాట్లాడుతూ బడిబాట ముగిసేవరకు ఉపాధ్యాయుల సర్దుబాటును వాయిదా వేయాలని మెమో 1267 ను సవరించాలని డిమాండ్ చేశారు .

 

 

టిఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు బి మురళీ మోహన్ మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులను ప్రారంభించాలని తరగతికొక ఉపాధ్యాయుడిని నియమించాలని డిమాండ్ చేశారు.

 

 

టిఎస్ టిఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యులు నంది కృష్ణ జిల్లా కార్యదర్శి సోడె విజయ్ కుమార్ గిరిజన సంక్షేమ విభాగం కన్వీనర్ తేజావత్ బాలు మండల ప్రధాన కార్యదర్శి ఉయిక బాలకృష్ణ శ్యామల సావిత్రి ఎమ్ యాడమరాజు హిమగిరిబాబు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.

ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

దుగ్గొండి మండలంలోని మహ్మదాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2004 – 2005 లో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సోమవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వారివారి యోగ క్షేమాలు తెలుసుకున్నారు.ఆనాటి గురువులైన గుండా శ్రీనివాస్, ఉమాశంకర్, సాయిలు ఆహ్వానించి ఘనంగా సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పెంచాల సతీష్,నన్న నరేష్, పొన్నం అశోక్, ఇనుముల కిషోర్, రేగుల శివ, ఎలకంటి మహేష్, మోటం మహేందర్, పలకల మధుసూదన్ రెడ్డి,వంగ ప్రకాష్, గాజు నాగరాజ్, ఎద్దు రంజిత్, మురారి మహేందర్, రావులకోల రాణి, రంపిస సంగీత, మర్రి స్రవంతి, ఎలకంటి స్వప్న,బరిగల కోమల, చల్ల శ్రీలత, చొప్పరి శ్రీలత, అంబీర్ లతా, పుష్పనీల, యమునా, రాధా, మంజుల తోపాటు స్కూల్ చైర్మన్ చింత సాంబయ్య పాల్గొన్నారు.

భూభారతిని సద్వినియోగం చేసుకోండి

గ్రామాల్లోకి అధికారులు
• భూభారతిని సద్వినియోగం చేసుకోండి

• తహశీల్దార్ శ్రీనివాస్

నిజాంపేట: నేటి ధాత్రి : 

రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి పథకంలో భాగంగా గ్రామాల్లోకి అధికారులు వచ్చి భూ సమస్యలపై దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని నిజాంపేట తాహసిల్దార్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు మండలంలోని కల్వకుంట గ్రామం లో సోమవారం రెవెన్యూ సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూన్ 3 నుండి 12 వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు కొనసాగుతాయని గ్రామాల్లోకి అధికారులు వచ్చి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని ప్రజలు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ రమ్యశ్రీ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రీతి, ఇమద్, సీనియర్ అసిస్టెంట్ రమేష్, సిబ్బంది, గ్రామస్తులు ఉన్నారు.

సంక్షేమ పథకాలు అందించడంలో పేదలకు అన్యాయం చేస్తే.!

సంక్షేమ పథకాలు అందించడంలో పేదలకు అన్యాయం చేస్తే సహించేది లేదు
ఇందిరమ్మ ఇండ్లు,రాజీవ్ యువ వికాసం పథకంలో కాంగ్రెస్ పార్టీ జోక్యం తగదు
చిగురుమామిడి ఎంపీడీవో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా వ్యవహరించడం సిగ్గుచేటు

సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్.

ఎంపీడీవో కార్యాలయం ముట్టడికి సీపీఐ నాయకుల యత్నం అరెస్టు చేసిన పోలీసులు.

కరీంనగర్, నేటిధాత్రి:

 

 

 

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక, రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారుల ఎంపికలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీడీవో వైఖరిపై జిల్లా స్థాయి అధికారులు సమగ్రమైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సోమవారం సిపిఐ ఆధ్వర్యంలో చిగురుమామిడి మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయం ముట్టడి కి యత్నించడంతో పోలీసులు అరెస్ట్ చేశారని సిపిఐ మండల కార్యదర్శి నాగెల్లి లక్ష్మారెడ్డి తెలిపారు. ఈముట్టడికి సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను పేదలకు అందించే క్రమంలో అర్హులైన నిరుపేదలకు అన్యాయం చేస్తే సహించేది లేదని,ఇందిరమ్మ ఇండ్ల పథకంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగాప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం లబ్దిదారుల ఎంపికలో జిల్లా వ్యాప్తంగా అనేక అవతకవలు చోటు చేసుకున్నాయని శ్రీనివాస్ ఆరోపించారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో పూర్తిగా అధికార పార్టీ కాంగ్రెస్ కనుసన్నల్లోనే లబ్దిదారుల ఎంపిక జరగడంతో అర్హులైన వారికి తీవ్ర అన్యాయం జరుగుతోందని, అర్హులైన వారిని ఎంపిక చేయాల్సిన చిగురుమామిడి ఎంపిడీవో తన చాంబర్ లో అర్దరాత్రి వరకు కాంగ్రెస్ నాయకులను కూర్చోబెట్టుకుని లబ్దిదారులను ఎంపిక చేయడం వివాదాస్పదమైందని, ఎంపిడీవో స్థాయి అధికారి ఓకాంగ్రెస్ కార్యకర్తలాగా వ్యవహరించడం సిగ్గుచేటని, లబ్దిదారుల ఎంపికలో గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలు వేసినా అధికారులు కూడా వారి విధులు సక్రమంగా నిర్వహించలేదని, ప్రత్యేక అధికారి ఉన్నప్పటికీ లబ్దిదారుల ఎంపిక విషయంలో కాంగ్రెస్ నాయకుల మితిమీరిన జోక్యంతో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు అంతటా నెలకొన్నాయని శ్రీనివాస్ ఆరోపించారు. లబ్ధిదారుల ఎంపికలో చిగురుమామిడి ఎంపిడివోపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటూనే అర్హులైన లబ్దిదారులను గుర్తించి న్యాయం చేయాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గత బిఆర్ఎస్ పదేళ్ల పాలనలో డబుల్ బెడ్ రూం పథకం పేరిట ఊరించినప్పటికీ ఒక్క ఇల్లు ఇవ్వలేదన్నారు. జిల్లాలో కొన్ని చోట్ల డబుల్ బెడ్ రూంలు ఇండ్లు నిర్మించినా పేదలకు ఇవ్వని పరిస్థితి ఉందన్నారు. పదేళ్ల పాటు పేదల సొంతింటి కల నెరవేలేక పోయిందన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సొంతింటి కళ నెరవేరుతుందనుకుంటే అర్హులకు అందకపోవడం బాధాకరమని, ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీతో స్నేహపూర్వకంగా కొనసాగుతున్నప్పటికీ పేద ప్రజలకు అన్యాయం జరిగితే సిపిఐ చూస్తూ ఊరుకోదని,పేదల పక్షాన అండగా నిలిచి సర్కారు మెడలు వంచేలా మిలిటెంట్ పోరాటాలకు సీపీఐ సిద్దమవుతుందని శ్రీనివాస్ తెలిపారు. ఈకార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె స్వామి, బోయిని అశోక్,గూడెం లక్ష్మి,మండల కార్యదర్శి నాగెల్లి లక్ష్మారెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు కాంతాల శ్రీనివాస్ రెడ్డి,అందె చిన్న స్వామి, మావురపు రాజు, తేరాల సత్యనారాయణ,బామండ్ల పెల్లి యుగేందర్,సీపీఐ మండల సహాయ కార్యదర్శి బూడిద సదాశివ,పైడిపల్లి వెంకటేష్, మాజీ సర్పంచులు గోలి బాపురెడ్డి కోమటిరెడ్డి జయపాల్ రెడ్డి, గ్రామ శాఖ కార్యదర్శిలు ఎలగందుల రాజు,కయ్యం తిరుపతి,మంద ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version