భవాని మాతను దర్శించుకున్న నాయకులు…

భవాని మాతను దర్శించుకున్న నాయకులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం మండల శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీదేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ దుర్గాభవాని మాత అమ్మవారిని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు హనుమంతరావు పటేల్ దర్శించుకున్నారు. ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆయనతోపాటు శ్రీ కేతకి సంగమేశ్వర దేవస్థాన చైర్మన్ శేఖర్ పటేల్ ఎంపీడీవో మంజుల ఏపీవో రాజ్ కుమార్ గ్రామ కార్యదర్శి వీరన్న పటేల్ ఫీల్డ్ అసిస్టెంట్ నర్సింలు మోహన్ సంగమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

వనపర్తిలో ఇండోరా స్టేడియంలో పనులను తనిఖీ చేసిన కలెక్టర్…

వనపర్తిలో ఇండోరా స్టేడియంలో పనులను తనిఖీ చేసిన కలెక్టర్
వనపర్తి నేటిదాత్రి .

 

 

వనపర్తి జిల్లా కేంద్రంలో ప్రజల ఆరోగ్యం కోసం అందుబాటులోకి రానున్న ఇండోర్ స్టేడియాన్ని ప్రజలు సద్వినియోగించుకునేలా అన్ని రకాల సదుపాయాలను కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు సమర్థవంతంగా స్టేడియాన్ని ఉపయోగించుకునేలా అన్ని సదుపాయాలను కల్పించాలని కోరారు క్రీడాకారుల సౌకర్యార్థం సరైన మెయింటెనెన్స్, సీటింగ్, లైటింగ్‌తో పాటు అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించేందుకు ఇంజినీరింగ్, క్రీడా శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. వీలైనంత త్వరగా అన్ని అవసరమైన సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చి ప్రారంభానికి సిద్ధం చేస్తామని అధికారులు బదులిచ్చారు.
పంచాయతీరాజ్ కార్యనిర్వాహక ఇంజనీర్ మల్లయ్య, అధికారులు కలెక్టర్ వెంట ఉన్నారు.

రోడ్డుకు మరమ్మత్తులు చేయించాలని వినతి….

రోడ్డుకు మరమ్మత్తులు చేయించాలని వినతి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ మండలం హుగ్గేల్లి గ్రామానికి వెళ్లే రోడ్లు అద్వాన్నంగా ఉన్నాయని, వాటిని వెంటనే మరమ్మత్తులు చేయించాలని కోరుతూ పిడిఎస్ యు జిల్లా అధ్యక్షుడు సురేష్, సోమవారం అదనపు కలెక్టర్ మాధురికి వినతి పత్రం సమర్పించారు. అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆయన తెలిపారు. ఈ రోడ్ల మరమ్మత్తులు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.

పాఠశాలల పరిశుభ్రత మరియు పారిశుద్ధ్య నిర్వహణపై.

– పాఠశాలల పరిశుభ్రత మరియు పారిశుద్ధ్య నిర్వహణపై…

– మండల స్థాయిలో శిక్షణ…

కొల్చారం, (మెదక్) నేటి ధాత్రి:-

 

 

 

మండలంలోని వివిధ పాఠశాలలో పనిచేసే పారిశుద్ధ కార్మికులకు ఒకరోజు శిక్షణ మండల వనరుల కేంద్రం కొల్చారంలో నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి సత్యనారాయణ రావు మాట్లాడుతూ పారిశుధ్యం పై వారికి పలు సూచనలు చేయడం జరిగింది ఇందులో రిసోర్స్ పర్సన్ వెంకటేశం, మండల వనరుల కేంద్రం సిబ్బంది మరియు సిఆర్పిలు పాల్గొనడం జరిగింది.

వేసవి సెలవుల అనంతరం ఎల్లుండి నుండి బడులు పున:ప్రారంభం అవుతున్న నేపథ్యంలో పాఠశాలల పరిశుభ్రత మరియు పారిశుధ్యం పై శిక్షణకు హాజరైన పాఠశాల పారిశుద్ధ కార్మికులకు అవగాహన శిక్షణ కార్యక్రమం జరిపించారు.

ఆస్పత్రి సూపరింటెండెంట్ దంపతుల పూజలు.

కోటగుళ్లలో జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ దంపతుల పూజలు

గోశాల నిర్వహణకు రూ. 56వేల వితరణ

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండల కేంద్రంలో కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ లో ఆదివారం సుబ్రహ్మణ్య షష్టి పర్వదినాన్ని పురస్కరించుకొని భూపాలపల్లి జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కోడూరు నవీన్ కుమార్ సుమతి దంపతులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు వారిని సాదరంగా ఆహ్వానించి గణపతి, నందీశ్వరుడు, గణపేశ్వరునికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం గోశాల నిర్వహణలో భాగంగా పనిచేస్తున్న పానిగంటి గణేష్ కు వేతనం కింద రూ 56 వేలను అందజేశారు. ఈ సందర్భంగా గోశాల గోమాతలకు నవీన్ కుమార్ సుమతి దంపతులు పండ్లను
అందజేశారు. అనంతరం డాక్టర్ దంపతులను శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించారు. గోశాల నిర్వహణకు వేతనాన్ని అందజేసిన నవీన్ కుమార్ సుమతి దంపతులకు కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version